
భారతదేశంలో 2023 ఏప్రిల్ 1నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి, అదే సమయంలో మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దేశీయ పరిశ్రమలకు మద్దతుగా దిగుమతి సుంకాలను పెంచాలను కేంద్రం యోచిస్తోంది. ఈ కారణంగా ధరలలో కొత్త పరిణామాలు ఏర్పడనున్నాయి.
ఏప్రిల్ ప్రారంభం నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, జ్యువలరీకి సంబంధించిన వస్తువులు, హై-గ్లోస్ పేపర్ వంటి వాటితో పాటు ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు ధరలు తారా స్థాయికి చేరుకోనున్నాయి. కెమెరా లెన్స్, స్మార్ట్‌ఫోన్, సైకిళ్ళు, బొమ్మలు ధరలు తగ్గనున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: ఈ కార్ల ఉత్పత్తికి హోండా మంగళం: ఏప్రిల్ నుంచే షురూ!)
బడ్జెట్ ప్రజెంటేషన్‌లో బట్టలు, ఫ్రోజెన్ మస్సెల్స్, ఫ్రోజెన్ స్క్విడ్, ఇంగువ, కోకో గింజలపై కస్టమ్స్ పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఎసిటిక్ యాసిడ్, కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కెమెరా లెన్స్‌లపై దిగుమతి పన్నులు తగ్గాయి.
ఖరీదైనవిగా మారే వస్తువులు:
- ఎలక్ట్రానిక్ చిమ్నీలు
- జ్యువెలరీ వస్తువులు
- బంగారం
- ప్లాటినం
- వెండి పాత్రలు
- దిగుమతి చేసుకున్న వస్తువులు
ధరలు తగ్గే వస్తువులు:
- బొమ్మలు
- సైకిళ్ళు
- టీవీ
- మొబైల్స్
- ఎలక్ట్రిక్ వెహికల్స్
- ఎల్ఈడీ టీవీలు
- కెమెరా లెన్సులు
Comments
Please login to add a commentAdd a comment