Hero MotoCorp Price Hike: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ' హీరోమోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు తమ వాహనాల ధరలను మరో సారి పెంచింది. పెరిగిన ధరలు జులై 03 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, హీరో మోటోకార్ప్ ఈ సారి సగటున 1.5 శాతం ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల వేరియంట్, మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ మోడల్ మీద ఎంత పెరిగింది అనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
గతంలో..
హీరో మోటోకార్ప్ మూడు నెలలకు ముందు కూడా తమ వాహనాల ధరలను పెంచింది. కాగా మళ్ళీ ఇప్పుడు మరో సారి పెంచినట్లు ప్రకటించింది. ముడి సరకుల ఖర్చులతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ధరల పెరుగుల జరిగినట్లు తెలిసింది. అయితే కొనుగోలుదారులకు ధరల పెరుగుదల నుంచి కొంత ఉపశమనం కలిగించడానికి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ప్రొగ్రామ్లను అందించనుంది.
(ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం!)
రానున్న పండుగ సీజన్‌లో వాహనాల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆఫర్స్ అందించడం జరుగుతుంది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఎక్స్ట్రీమ్, స్ప్లెండర్ మొదలైన వెహికల్ ధరలు మరో రెండు రోజుల్లో పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment