hike
-
మరింత పెరిగిన ఎప్రిలియా ఆర్ఎస్ 457 ధర
ఎప్రిలియా భారతదేశంలోని తన ఆర్ఎస్ 457 బైక్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 4.10 లక్షల ధర వద్ద లభించే ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) చేరింది. దీన్నిబట్టి చూస్తే దీని ధర మునుపటికంటే రూ.10,000 ఎక్కువని తెలుస్తోంది.డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఆర్ఎస్ 457 బైక్ భారతదేశంలో ఉత్పత్తి అయినా మొదటి ఎప్రిలియా మోటార్‌సైకిల్. ఇది మహారాష్ట్రలోని బారామతిలో పియాజియో గ్రూప్ ఫెసిలిటీలో తయారైంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 47 బిహెచ్పి పవర్ అవుట్‌పుట్, 48 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఏప్రిలియా ట్యూనో 457ఏప్రిలియా ఇప్పుడు ఆర్ఎస్ 457 నేక్డ్ కౌంటర్పార్ట్.. ట్యూనో 457ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్ట్రీట్‌ఫైటర్ EICMA 2024లో వెల్లడైంది. అయితే కంపెనీ బైక్‌కి సంబంధించిన ధరలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్ కూడా ఆర్ఎస్ 457 వలె అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. -
తెలంగాణలో సంక్రాంతి తర్వాత మద్యం ధరలు పెంచనున్న ప్రభుత్వం
-
విద్యుత్ ఛార్జీల పెంపుపై APERC ప్రజాభిప్రాయ సేకరణ
-
ప్రజా సెగ బాగా తగిలిన బాబు
-
బాబు బాదుడుపై పోరుబాట.. కాకినాడలో YSRCP భారీ ర్యాలీ
-
ప్రజల నెత్తిన చంద్రబాబు రూ.15 వేల కోట్లు భారం.. YSRCP యుద్ధభేరి
-
బాబు మాయమాటలు నమ్మి మోసపోయాం
-
ఏపీ ప్రజలకు హై ఓల్టాజ్ షాక్.. బాదుడుపై సమరం
-
కొత్త ఏడాది బంగారం కొనడం కష్టమే!.. ఎందుకో తెలుసా?
దేశంలో బంగారం ధరలు మరోమారు పెరిగాయి. నేడు (డిసెంబర్ 27) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.270 పెరిగింది. దీంతో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఈ రోజు బంగారం ధరలను గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 78,150 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,650.పసిడి ధరలు చెన్నైలో కూడా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,500 వద్ద ఉంది. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు కొంత పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,00,000 వద్ద నిలిచింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల.. కొత్త ఏడాది ప్రారంభంలో గోల్డ్, సిల్వర్ కొనాలనుకునే.. కొనుగోలుదారులు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఏపీ ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడు
-
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్‌ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్‌తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
వైయస్ఆర్ సీపీ ప్రభంజనం ఇక్కడి నుండే మొదలు
-
దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారువాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
మళ్ళీ పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు.. ఈ సారి ఎంతంటే?
దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) మరోమారు పెంచుతూ ప్రకటించింది. వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచిన తరువాత.. ఎంసీఎల్ఆర్ రేట్లు 9.20 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ ప్రకటించిన కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 2024 డిసెంబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ను 5 పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేరింది. ఒక నెల టెన్యూర్ రేటు (9.20 శాతం), మూడు నెలల టెన్యూర్ రేటు (9.30 శాతం) యధాతదంగా ఉంచింది.ఆరు నెలలు, 12 నెలలు (ఒక సంవత్సరం) టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం వద్ద ఉంది. రెండు సంవత్సరాల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం అయితే.. మూడేళ్ళ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.50 శాతంగా ఉంది. పెరిగిన వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ మాత్రమే 5 పాయింట్లు పెరిగినట్లు తెలుస్తోంది.కొత్త ఎంసీఎల్ఆర్లుఓవర్ నైట్: 9.20 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' జనవరి 2025లో తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు.. నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోడల్ వారీగా ధర పెరుగుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.మారుతి తన కొత్త కార్లను నెక్సా & అరేనా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా అవుట్లెట్లలో ఇగ్నీస్, బాలెనొ, సియాజ్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఇన్విక్టో కార్లను విక్రయిస్తోంది. అరేనా అవుట్లెట్ల ద్వారా ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, ఈకో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా కార్లను విక్రయిస్తోంది.మారుతి సుజుకి కొత్త ధరలను 2025 జనవరి నుంచే ప్రారంభించనుంది. ధరల పెరుగుదల.. కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సేల్స్ వచ్చే ఏడాదిలో ఎలా ఉండనున్నాయనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.వాహనాల ధరలను పెంచిన సంస్థల జాబితాలో ఇప్పటికే హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, నిస్సాన్ మోటార్ వంటి కంపెనీలు చేరాయి. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి కూడా ఈ జాబితాలోకి చేరింది. -
ఈ వస్తువులపై భారీగా పెరగనున్న జీఎస్టీ!
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత.. మొదటిసారి పన్ను రేట్లలలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన తుది నిర్ణయం ఈనెల 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది.పన్ను రేటు హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా శీతలపానీయాల మీద జీఎస్టీని 28 శాతం నుంచి 35 శాతానికి పెంచే అవకాశం ఉంది. రెడీమేడ్ వస్త్రాలపై కూడా జీఎస్టీ రేటు పెరుగుతుందని.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం అనే నాలుగు అంచెల పన్ను శ్లాబులు మాత్రమే ఉండేవి. త్వరలో 35 శాతం కొత్త రేటు కూడా శ్లాబులో చేరనున్నట్లు సమాచారం.రూ.1,500 విలువైన రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ.1,500 నుంచి రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18 శాతం, రూ. 10వేలు కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాల మీద 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొత్తగా 148 ఉత్పత్తులపై ట్యాక్స్ విధించనున్నట్లు జీవోఎం సూచించింది. సౌందర్య సాధనాలు, గడియారాలు, బూట్లు వంటి వాటిపై కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని జీవోఎం ప్రతిపాదించింది.ఇదీ చదవండి: రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..జిఎస్టి కౌన్సిల్ డిసెంబర్ 21న జైసల్మేర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కూడా కీలక ప్రతిపాదనలు వెల్లడించే అవకాశం ఉంది. కార్లు, వాషింగ్ మెషిన్స్ వంటివి 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 35 శాతం శ్లాబులోకి చేరుస్తారా? లేదా.. 28 శాతం వద్దనే ఉంచుతారా అనే విషయాలు 21వ తేదీ తెలుస్తుంది. -
ఎల్లో మీడియాకు ఇవి కనిపించడం లేదా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: విద్యుత్ ఛార్జీలు పెంచి.. తమపై నిందలు మోపడం దారుణమంటూ కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి.. రెండోసారి కూడా పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. 9,400 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్ రంగం సంక్షోభంలో కురుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. 2014-19 మధ్య సోలార్, విండ్ పవర్‌ను సగటున 5.10 పైసలు పైనే చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల రాష్టానికి లక్షా పది వేల కోట్లు ఆదాయం వస్తే.. చంద్రబాబు హయాంలో 90 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడింది. చంద్రబాబు దిగిపోయే సరికి రూ.86,215 కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి డిస్కమ్‌లు వెళ్లిపోయాయి’’ అని కాకాణి వివరించారు.సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టినా.. కరెంట్ ఛార్జీలు పెంచినా.. ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. నిత్యావసర వస్తువులు నుంచి.. మద్యం దాకా అన్నీ రేట్లు పెరిగాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రజల సంపదను ఆవిరి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు రాకపోవడంతో.. కుటుంబ ఆదాయం పడిపోయింది.. అప్పులు పెరగడంతో కాల్ మనీ గ్యాంగ్‌లు హాల్ చల్ చేస్తున్నాయి. ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూస్తున్నారు.. అందుకే రెండోసారి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు.’’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.దీన్ని వైస్సార్సీపీ ఖండిస్తుంది..మంత్రి నారాయణ వర్సెస్ కోటంరెడ్డి వ్యవహారంపై కాకాణి స్పందిస్తూ.. ప్రతి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అవినీతిలో విభేదాలు వస్తున్నాయి. రాయలసీమలో అది నారాయణ రెడ్డి, జేసీ మధ్య రాజకీయ వివాదం రచ్చకెక్కింది. నేతల మధ్య సమన్వయం ఉండటం లేదు.. పాలన సరిగా లేదనడానికి నిదర్శనం.. కూటమి నేతల మధ్య బయటపడుతున్న విభేదాలే స్పష్టం చేస్తున్నాయి’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. -
మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటాపరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు. -
ఘాటెక్కిన ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు
నిత్యావసర ధరలు సామాన్య ప్రజల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో.. ఉల్లి రేట్లు పెరిగి ఒక్కసారిగా షాకిచ్చాయి. ఢిల్లీ, ముంబైలలో రూ. 40 నుంచి రూ. 60 మధ్య ఉన్న కేజీ ఉల్లి ధర.. రూ. 70 నుంచి రూ. 80కి పెరిగింది. వెల్లుల్లి ధరలు.. ఉల్లి ధరలకు రెట్టింపు ఉన్నాయి.ధరల పెరుగుదల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనిపైన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రకారం ఉల్లి ధరలు తగ్గాల్సి ఉంది, కానీ ధరలు పెరిగాయని కొందరు వాపోతున్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..దేశంలోనే అధికంగా ఉల్లి పండించే రాష్ట్రమైన మహారాష్ట్రలో అక్టోబర్ నెలలో భారీ వర్షాలు కురవడంతో.. ఉల్లి సాగు ఆలస్యమైంది. దీంతో పంజాబ్, హర్యానా, చండీగఢ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలలో కూడా సరఫరా కొరత ఏర్పడింది. ఉల్లి సరఫరా తగ్గుదల ఇలాగే కొనసాగితే.. కేజీ ధర వంద రూపాయలకు చేరే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
ఏపీ ప్రజలకు షాక్‌ల మీద షాక్!
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
తెలంగాణ: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించలేదు. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ‘‘అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదు. స్థిర చార్జీలు రూ.10 యధాతధంగా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం.132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి రూపాయిన్నర రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచాం. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచాం.గృహ వినియోగదారులకు మినిమమ్ చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. ఆర్ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయి. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింది’ అని వివరాలు వెల్లడించారు.చదవండి: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు -
ఏపీ ప్రజలకు చంద్రబాబు కరెంటు షాక్
-
ఏపీ ప్రజలకు దీపావళి గిఫ్ట్.. నారా వారి పాలనలో ఇంతే
-
జొమాటో కస్టమర్లకు భారీ షాక్!
బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీపై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు తమసర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది. కాగా, జొమాటో కంపెనీ 2023 ఆగస్టులో తొలిసారి ప్లాట్‌ఫామ్ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది.