
నిత్యావసర ధరలు సామాన్య ప్రజల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో.. ఉల్లి రేట్లు పెరిగి ఒక్కసారిగా షాకిచ్చాయి. ఢిల్లీ, ముంబైలలో రూ. 40 నుంచి రూ. 60 మధ్య ఉన్న కేజీ ఉల్లి ధర.. రూ. 70 నుంచి రూ. 80కి పెరిగింది. వెల్లుల్లి ధరలు.. ఉల్లి ధరలకు రెట్టింపు ఉన్నాయి.
ధరల పెరుగుదల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనిపైన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రకారం ఉల్లి ధరలు తగ్గాల్సి ఉంది, కానీ ధరలు పెరిగాయని కొందరు వాపోతున్నారు.
ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..
దేశంలోనే అధికంగా ఉల్లి పండించే రాష్ట్రమైన మహారాష్ట్రలో అక్టోబర్ నెలలో భారీ వర్షాలు కురవడంతో.. ఉల్లి సాగు ఆలస్యమైంది. దీంతో పంజాబ్, హర్యానా, చండీగఢ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలలో కూడా సరఫరా కొరత ఏర్పడింది. ఉల్లి సరఫరా తగ్గుదల ఇలాగే కొనసాగితే.. కేజీ ధర వంద రూపాయలకు చేరే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.