Onion price
-
ఘాటెక్కిన ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు
నిత్యావసర ధరలు సామాన్య ప్రజల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో.. ఉల్లి రేట్లు పెరిగి ఒక్కసారిగా షాకిచ్చాయి. ఢిల్లీ, ముంబైలలో రూ. 40 నుంచి రూ. 60 మధ్య ఉన్న కేజీ ఉల్లి ధర.. రూ. 70 నుంచి రూ. 80కి పెరిగింది. వెల్లుల్లి ధరలు.. ఉల్లి ధరలకు రెట్టింపు ఉన్నాయి.ధరల పెరుగుదల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనిపైన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రకారం ఉల్లి ధరలు తగ్గాల్సి ఉంది, కానీ ధరలు పెరిగాయని కొందరు వాపోతున్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..దేశంలోనే అధికంగా ఉల్లి పండించే రాష్ట్రమైన మహారాష్ట్రలో అక్టోబర్ నెలలో భారీ వర్షాలు కురవడంతో.. ఉల్లి సాగు ఆలస్యమైంది. దీంతో పంజాబ్, హర్యానా, చండీగఢ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలలో కూడా సరఫరా కొరత ఏర్పడింది. ఉల్లి సరఫరా తగ్గుదల ఇలాగే కొనసాగితే.. కేజీ ధర వంద రూపాయలకు చేరే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ ఏడాది మే నెలలో ఆ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అదే సమయంలో టన్ను ఉల్లి ఎగుమతికి 550 డాలర్లు(రూ.46 వేలు) కనీస ధరను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు ఉల్లిని విదేశాలకు అమ్మకూడదు. దాంతో ఎగుమతులు తగ్గి దేశీయంగా ధరలు పెరగకుండా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జూన్‌లో ఉల్లి ఎగుమతులు 50 శాతానికి పైగా పడిపోయాయి. 2024-25 ఏడాదికిగాను జులై 31, 2024 వరకు 2.60 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 17.17 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు.ఇదీ చదవండి: వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదంమహారాష్ట్రలోని నాసిక్‌లో దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఉంది. ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి స్థానికంగా ఓట్లు తగ్గిపోవడం కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్న ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఉల్లి రైతుకు ‘సిండికేట్’ దెబ్బ
కర్నూలు (అగ్రికల్చర్) : ఉల్లి ధరలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లికి డిమాండ్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉల్లి గడ్డలకు డిమాండ్ పెరిగి ధర కూడా జోరు మీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రం ధరలు తగ్గుతున్నాయి.మొన్నటి వరకు వర్షాల వల్ల ఉల్లి నాణ్యత దెబ్బతిని ధర లభించడం లేదు. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో గడ్డల నాణ్యత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో కర్నూలు మార్కెట్‌కు పోతే గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో వస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. సిండికేట్‌గా మారుతున్న వ్యాపారులువ్యాపారులు పథకం ప్రకారం ఉల్లి ధర పెరుగకుండా జట్టు కడుతున్నారు. సిండికేట్‌గా మారి ధరలపై ప్రభావం చూపుతున్నారు. గతంలో వేలంపాట ద్వారా కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు సైగలతో సిండికేట్ అయ్యేవారు. ప్రస్తుతం ఈ–నామ్లో టెండర్ ప్రాతిపదికన ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 40 మంది వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 30 మంది వ్యాపారులు భారీగానే ఉల్లి క్రయ, విక్రయాలు చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో కొనుగోలు చేసిన ఉల్లి అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు తరలుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో కోల్‌కతా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయమే వ్యాపారులు దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్డర్లు, ధరల ఆధారంగా సిండికేట్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ధర వరకు టెండరు వేయవచ్చనే విషయమై వ్యాపారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ–నామ్లో కూడా సిండికేట్‌గా మారి కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలో ఉల్లికి ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తే కర్నూలు మార్కెట్లో కనీసం రూ.5వేల వరకు ధర పలకాలి. కానీ రూ.3,600 మించడంలేదు. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకే లభిస్తోంది. 40 శాతం లాట్లకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి 2,500 వరకు మాత్రమే ఉంటోంది. మిగిలిన అన్ని లాట్లకు రూ.1000 నుంచి రూ.2వేల మధ్యనే ధర లభిస్తోంది. ధర తీవ్ర నిరాశకు గురి చేసింది ఒక ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి అంతంత మాత్రంగానే వచి్చంది. మార్కెట్లో దిగుబడిని విక్రయానికి తీసుకెళ్తే క్వింటాకు రూ.2,000 లోపు ధర లభించింది. ఈ ధర చాలా నిరాశకు గురిచేసింది. వ్యాపారులు పథకం ప్రకారం సిండికేట్‌గా మారి ధర పెరగకుండా చేస్తున్నారు. – మద్దిలేటి, పర్ల, కల్లూరు మండలం -
ఉల్లి సేకరణ నిలిపేయాలంటూ డిమాండ్
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) ఉల్లి సేకరణను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో ఉల్లి కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి ఉల్లిని సేకరిస్తోంది. అయితే రైతులు దీన్ని నిలిపేయాలని కోరుతున్నారు. వీరి డిమాండ్ మరింత పెరిగితే ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆటంకం కలిగే ప్రమాదముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశవ్యాప్తంగా ఉల్లిధరలు పెరుగుతున్న నేపథ్యంలో నాఫెడ్ బృందం ఇటీవల కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ఆయా కేంద్రాల నిర్వహణ లోపాలపై చర్యలు చేపడుతోంది. దాంతోపాటు పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటోంది. ప్రభుత్వం ఉల్లి సేకరణ పెంచితే ధరలు కట్టడి అవుతాయి. కానీ, అలా చేస్తే రైతుల పంటకు సరైన ధర లభించదనే ఉద్దేశంతో ఉల్లి సేకరణను నిలిపివేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఇటీవల ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: ‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. -
నెలరోజుల్లో అనూహ్యంగా పెరిగిన కూరగాయల ధరలు
-
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..!
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..! -
తగ్గని ఉల్లి ధర
హైదరాబాద్: ఉల్లి గడ్డ ధర సామాన్యులను కంగుతినిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా కిలో రూ.60 నుంచి 70 పైనే ఉంది. దీంతో రేటు తగ్గుతుందని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందుతున్నారు. వాస్తవంగా కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్థితి మారలేదు. దీనికి కారణం కమీషన్ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరంతా ఒక్కటై ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉల్లి ధరలు పెంచేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ నుంచి కూడా మలక్‌పేట్ మార్కెట్‌కు ఉల్లిగడ్డ దిగుమతి పెరిగింది. రోజుకుదాదాపు 70–80 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది లారీ సంఖ్య ఎక్కువగా ఉందని మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ ఏడాది నగరానికి ఉల్లి రాక పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని రిటైల్ వ్యాపారులు అంటున్నారు. గతేడాది నవంబర్‌లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.30 ఉండగా ఈ ఏడాది రూ.60 పైనే పలుకుతోంది. వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి సరఫరా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు తగ్గించడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జంట నగరాల మార్కెట్లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోందని వారంటున్నారు. -
పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
ప్రతి ఏటా ఉల్లి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధరలు రూ. 10 నుంచి రూ. 20 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి ఢిల్లీలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది రూ. 100కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉల్లి ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డిమాండ్. డిమాండ్ పెరిగినప్పుడు అవసరమైనన్ని అందుబాటులో లేనప్పుడు తప్పకుండా ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా కొందరు రైతులు తమ పంటను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం వల్ల, దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఉల్లి ధరలు పెరగటానికి మరో ప్రధానమైన కారణం పంట ఆలస్యం. ఖరీఫ్ పంట ఆలస్యం వల్ల సాగులో జాప్యం ఏర్పడుతుంది. అప్పుడు చేతికి అందాల్సిన సమయానికి పంట రాకపోతే కొరత ఏర్పడుతుంది. తద్వారా ధరలు పెరుగుదల జరుగుతుంది. ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే? ఉల్లి ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఆగస్టు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి 'రోహిత్ కుమార్ సింగ్' వెల్లడించారు. ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం రిటైల్ పంపిణీని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా కేజీ ఉల్లి ధరలను రూ. 25కే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 లక్షల టన్నుల ఉల్లి స్టాక్‌ను నిర్వహిస్తోంది, రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. -
ఉల్లి.. ఘాటెక్కింది మళ్లీ..!
సదాశివపేట (సంగారెడ్డి): కోస్తుంటేనే కన్నీళ్లు తెప్పించే ఉల్లి.. ఇప్పుడు కొంటుంటే ఘాటెక్కుతోంది. బహిరంగ మార్కెట్లలో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరిగ్గా దసరా పండుగకు ఇరవై రోజుల క్రితం సదాశివపేట పట్టణ వీధుల్లో వాహనాల్లో ఉల్లిగడ్డ తీసుకొచ్చి వందకు ఆరు, పదు కిలోల చొప్పున విక్రయించారు. రిటైల్‌గా రూ 20 కిలో చొప్పున అమ్మారు. దసరా పండుగకు ముందు అమాంతంగా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు, హోటళ్లు, తినుబండారాలు, ఆహారాల దుకాణాల వారు ఉల్లిధర పెరగడంతో వాటి వినియోగాన్ని తగ్గించారు, సదాశివపేటకు వచ్చిన గ్రామీణులు ఉల్లిధర విని అమ్మో అంటున్నారు, మరో నెల రోజుల తర్వాత గాని ఉల్లిధరలు తగ్గుముఖం పట్టదని డీలర్లు పేర్కొంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ మధ్య ఉల్లి ధరలను పోల్చి చూస్తే ధరలో దాదాపు 50 శాతం పెరిగింది. జూలైలో రూ.20 ఉండగా అక్టోబర్, నవంబర్‌లో 50 నుంచి 80కి పెరిగింది. ఈ విధంగా చూస్తే ఉల్లి సగటు ధరలు 50 శాతం పెరిగాయి, మహారాష్ట్రంలోని హోల్‌సెల్ ఽమార్కెట్‌లో కూడా ఉల్లిధరలు భారీగా పెరగడంతో దాదాపు 30 శాతం మేర ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే.. మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఉల్లి దిగుమతి అవుతుంటాయి. గత వానా కాలం సీజన్లో ఆయా రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉల్లికి కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారాలు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2,596 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, కంది, మునిపల్లి, జహిరాబాద్ తదితర మండలాల్లో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో అత్యదికంగా వెయ్యి ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, సదాశివపేట మండలం అరూర్, నందికంది, పెద్దాపూర్‌తో పాటు కొండాపూర్ మండలం గొల్లపల్లి, మునిదేవునిపల్లి, మన్సాన్పల్లి, మల్లేపల్లి, అనంతసాగర్, మారేపల్లి, గంగారం, గ్రామాల్లో ఉల్లి సాగుచేస్తారు. సాధారణంగా ఉల్లిని అధిక భాగం దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాల్లో సాగవుతుంది, అయితే ఈ ఏడాది కర్నూలు జిల్లాలో రుతుపవనాలు అలస్యంగా రావడం, వచ్చిన అసమానంగా ఉండటం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటలు రాక ఆలస్యమవడంతో ఉల్లి లభ్యత తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఉల్లిధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కొరుతున్నారు. -
కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధర వారం రోజుల నుంచి ఆకాశాన్నంటుతోంది. రాష్ట్రంలో ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతూ.. సామాన్యులకు కంటనీరు రప్పిస్తోంది. క్రమేపీ పెరుగుతున్న ఉల్లి ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు నెల రోజుల క్రితం క్వింటాల్ రూ.3000–3500 ఉండగా, ఒక్కసారిగా రూ. 6000 నుంచి 7500 వరకు పెరిగింది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు 30 వేల బస్తాలు దిగుమతి అవుతుండగా, ఇప్పుడు రోజుకు 8వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతోంది. మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పంట వేయలేదని, అందుకే దిగుమతి తక్కువగా ఉంటోందని అధికారులు చెప్పారు. వర్షాల కారణంగా ఏపీలో రైతులు ఉల్లికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో ఆంధ్రా నుంచి ఉల్లి దిగుమతి తక్కువైందన్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వడం కూడా ఉల్లి ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. అక్రమార్కులపై నిఘా: కొత్తపంట వచ్చే వరకు ఉల్లి క్వింటాల్‌కు రూ. 6,000 నుంచి 8,000 వరకు ధర ఉంటుంది. నెల రోజులపాటు ఉల్లి ధర కిలో రూ.60 నుంచి 90 మధ్య ఉంటుంది. అక్రమ వ్యాపారులపై నిఘా పెట్టాం. -రవీందర్‌రెడ్డి, గ్రేడ్–3 కార్యదర్శి -
ఉల్లిపాయలు అడిగారట!
ఉల్లిపాయలు అడిగారట! -
మనం కూడా కొనే పరిస్థితి లేదండీ.. నేను వేయలేదు!
మనం కూడా కొనే పరిస్థితి లేదండీ.. నేను వేయలేదు! -
పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఉల్లిపై కేంద్రం ఎగుమతి సుంకం విధించడం ఇదే తొలిసారి. వంటల్లో ప్రధానంగా ఉపయోగించే ఉల్లి ధర ప్రస్తుతం (ఆగస్ట్ 19) ఢిల్లీలో కిలోకు రూ. 37కి చేరింది. 2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు భారత్ నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న మొదటి మూడు దేశాలు బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం.. ఆగస్ట్ 19న దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు కనిష్టంగా రూ. 30గా ఉంది. ఇది గరిష్టంగా రూ. 63, కనిష్టంగా రూ. 10లుగా ఉంది. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
Hyderabad: సగానికి పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ. 10
సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధరలు దిగొస్తున్నాయి. రోజురోజుకు రేట్లు తగ్గుతున్నాయి. గత పదిహేను రోజులతో పోలిస్తే ధరలు సగానికి పడిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి భారీ మొత్తంలో మలక్‌పేట్ మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. అక్కడ అధిక పంట దిగుబడి, నిల్వ చేసిన సరుకును మన రాష్ట్రానికి తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉల్లి క్వింటాల్‌కు రూ.600 నుంచి 700 వరకు మాత్రమే పలుకుతోంది. మార్కెట్లో కిలో ధర రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది. పెరిగిన దిగుమతి.. హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్ మార్కెట్ ఉల్లిగడ్డకు పేరు గాంచింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఉల్లి సరఫరా అవుతుంది. ప్రధానంగా మహబూబ్ నగర్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని కర్నూల్ ప్రాంతాల నుంచి గంజ్ కు ఎక్కువగా సరుకు వస్తుంది. వారం రోజులుగా మార్కెట్‌కు నిత్యం 70 నుంచి 120 ట్రక్కుల్లో 30 వేల బస్తాల వరకు సరుకు దిగుమతి అవుతోంది -
Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’!
దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో వంటిల్లుని ఘాటెక్కించనుంది. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ హెచ్చరించింది. నెలకు 13 లక్షల టన్నులు ఇండియాలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మహారాష్ట్ర తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారను. అయితే తౌటౌ తుఫాను ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఖరీఫ్‌పై ప్రభావం దేశ ఉల్లి అవసరాల్లో 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. అయితే ఈ సీజన్‌కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ చెబుతోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్‌కి రావడానికి పట్టే సమయం పెరగవచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు కావడం ఖాయమని చెబుతోంది. రబీ పైనా ప్రభావం ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్ స్టాక్ సైతం తగ్గిపోయే ప్రమాదంముందని క్రిసిల్ అంటోంది. నాసిక్‌లో కరువు మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్‌లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చదవండి : ఎమర్జెన్సీ ఫండ్స్.. ఈ అలవాటు మీకుందా? ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకోండి -
తెలంగాణలో ఉల్లి దిగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తెలంగాణలో ఈ సీజన్లో ఉల్లి సాగు అసలు లేకపోయినా... పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో మార్కెట్లలో తగ్గిన డిమాండ్‌తో అక్కడి వ్యాపారులంతా రాష్ట్రానికి ఉల్లిని తెస్తుండటంతో ధర తగ్గుతోంది. నిజానికి రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21 వేల ఎకరాల మేర ఉండగా, ఈ ఏడాది ఒక్క ఎకరాలోనూ సాగు జరగలేదు. ఉల్లి విత్తనాలకు రాయితీ కల్పించకపోవడం, మద్దతు ధర లేకపోవడం, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతాయని అంతా అంచనా వేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాధారణంగానే ఉల్లి ధర హోల్‌సేల్ మార్కెట్లోనే రూ.40–45 మధ్య ఉంటుంది. రాష్ట్రంలో అసలే సాగు లేకపోవడంతో ప్రస్తుతం సైతం ధరలు పెరగుతాయని భావించినా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా వస్తుండటంతో ధరలు తక్కువగా ఉన్నాయి. వారం కిందటి వరకు మలక్‌పేట్ మార్కెట్లో మేలురకం ఉల్లి ధర కిలో రూ.35–45 మధ్య ఉండగా, అది ఇప్పుడు రూ. 25–30కు పడిపోయింది. కిలోకు ఏకంగా రూ.15–20 మేర తగ్గింది. ఇక రిటైల్లోనూ మొన్నటి వరకు కిలో రూ.50 అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం కిలో రూ.35 వరకు అమ్ముతున్నారు. ఇక సాధారణ రోజుల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 6 వేల నుంచి 7 వేల క్వింటాళ్ల మేర ఉల్లి దిగుమతి అవుతుండగా, ఆదివారం రోజులుగా 8 వేల క్వింటాళ్ల నుంచి 9 వేల క్వింటాళ్లకు పెరిగింది. శుక్రవారం వ్యాపారుల భారత్ బంద్ ఉన్నప్పటికీ శనివారం ఏకంగా 9,600 క్వింటాళ్ల ఉల్లి రాష్ట్రానికి వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచే 5–6 వేల క్వింటాళ్ల మేర ఉల్లి వస్తోంది. మహారాష్ట్రలో కరోనా ఉధృతితో హోటళ్లు, రెస్టారెంట్లు పెద్దగా నడవకపోవడంతో సరుకును రాష్ట్రానికి తరలిస్తున్నారు. లాసల్గావ్ మార్కెట్లో క్వింటాల్ మొన్నటివరకు రూ.4,500 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.3,000కు తగ్గింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉల్లి ధరలు అదుపులో ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
ఉల్లి కోసం బారులు
-
550 కిలోల ఉల్లిని కొట్టేశారు..
ముంబై : దేశంలో ఒక్కసారిగా ఉల్లిధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల కిందట చౌకగా లభించిన ఉల్లి.. ఇప్పుడు సామాన్యుడి కొనలేని రేటుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దాదాపు 550 కిలోల ఉల్లిని దొంగతనం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. నిందితులను సంజయ్ పరాది, పొపట్ కాలేలుగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన నారాయణ్ గావ్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈసారి వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది.ఉల్లిగడ్డ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక, ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో కూడా ధరలు పెరిగిన సందర్భాల్లో పలుచోట్ల ఉల్లి దొంగతనాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉల్లి కోసం గొడవలు కూడా జరిగాయి. ధరల విషయంలో వినియోగదారులు, అమ్మకపుదారులు ఘర్షణకు దిగారు. -
ఉల్లి విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, విజయవాడ : సామాన్యుడి రేటుకు అందకుండా పోయి కంటనీరు తెప్పిస్తున్న ఉల్లిగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు బజార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు రేపట్నుంచే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం విజయవాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు.5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని.. తక్షణమే వెయ్యి టన్నులు మార్కెట్లోకి తీసుకువచ్చి రైతుబజార్లలో విక్రయిస్తామన్నారు. తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ వంతున రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. భారీ వర్షాల వల్ల మన రాష్ట్రంలో కర్నూలు సహా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు,కర్నాటక, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో ఉల్లిరేటుకు రెక్కలొచ్చాయన్నారు. కాగా రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతోందని.. మరో నెలలో కొత్త పంట కొంత అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతి ఏటా ఈ సీజన్లో 12 వేల క్వింటాళ్లు కర్నూలు ఉల్లి మార్కెట్లకు వచ్చేదని.. ఇప్పుడు 15 వందల నుంచి 2వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోందన్నారు. గతంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా ఉల్లి దిగుమతులు జరిగేవని.. కానీ అక్కడ భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందన్నారు. రేపటి నుంచి ఉల్లి విక్రయాలు మొదలుపెట్టి క్రమంగా అన్ని ప్రాంతాల రైతుబజార్లకు విక్రయాలు విస్తరిస్తామన్నారు. గతంలో కూడా ఉల్లి ధరలు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై అందించినట్లు కన్నబాబు పేర్కొన్నారు. -
ఘాటెక్కిన ఉల్లి.. కిలో @110
సాక్షి, చెన్నై: మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది. మంగళవారం కిలో ఉల్లి రూ.110 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. అతిపెద్ద సైజు కల్గిన ఉల్లిపై రెండు రాష్ట్రాల నుంచి, చిన్న సైజు రకం ఆంధ్రా నుంచి ఇక్కడికి సరఫరా అవుతుంటాయి. కొద్ది రోజులుగా వర్షాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండడంతో ఉల్లి సరఫరా ఆగింది. దిగుమతి ఆగడంతో మంగళవారం ఉల్లి ఘాటెక్కింది. మున్ముందు ధర అమాంతంగా పెరుగుతూ కన్నీళ్లు పెట్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చెన్నైలో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న కోయంబేడుకు రోజుకు 150 లారీలు రావాల్సి ఉండగా తాజాగా 50 లారీలు మాత్రమే వచ్చాయి. దీంతో ధర అమాంతంగా పెరిగింది. కిలో రూ.100కు పై మాటే.. రాష్ట్రంలో ఉల్లి కొన్ని చోట్ల రూ.100, రూ.110 అంటూ ధర పలికింది. ఉల్లి ఘాటు మరింతగా పెరగనున్న నేపథ్యంలో పాలకులు స్పందించారు. ప్రభుత్వ తోట పచ్చదనం దుకాణాల ద్వారా ఉల్లిని తక్కువ ధరకు అందించేందుకు సిద్ధమయ్యారు. అలాగే డిమాండ్‌కు తగ్గ ఉల్లిని దిగుమతి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రజల్ని ఉల్లి ఘాటు నుంచి గట్టెక్కించేందుకు ‘తోట, పచ్చదనం, వినియోగదారుల దుకాణం’ల ద్వారా కిలో రూ.45కు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని సహకార మంత్రి సెల్లూరు కే రాజు తెలిపారు. అలాగే పెరుగుతున్న ఉల్లి ధరను పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేసి, ప్రజలకు తమ పరిధిలోని దుకాణాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. ఎవరైనా టోకు వర్తకులు ఉల్లి నిల్వ ఉంచుకుని ఉంటే, చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఈజిప్టు ఉల్లి 27 టన్నులు కోయంబేడుకు వచ్చి చేరడం కాస్త ఊరట. -
కొండెక్కిన కోడిగుడ్డు ధరలు..
నల్లగొండ : కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఉల్లి ఘాటెక్కిస్తుండగా.. గుడ్డు కొండెక్కి కూర్చుంది. ఈ రెండింటి ధరలు లాక్డౌన్ కాలంతో పోలిస్తే.. ప్రస్తుతం రెట్టింపయ్యాయి. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడ్డు, ఉల్లి తప్పని సరిగా తినాల్సిన పరిస్థితి. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రెట్టింపు అయిన ధరలతో పేదలు కొనలేకపోతున్నారు. (‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం) లాక్డౌన్ కాలంలో అందుబాటులో ధరలు లాక్డౌన్ సందర్భంలో ఉల్లి, గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. ఆ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో.. అప్పట్లో ఉల్లి కేజీ ధర రూ.పది నుంచి రూ.12 ఉంది. ఆ సమయంలో గుడ్డు పేపర్ ధర రూ.2.50 మాత్రమే ఉండగా.. బయట రూ.3.50 పలికింది. పౌల్ట్రీ రైతులు నష్టాలు భరించి తక్కువ ధరకు అమ్మారు. కొత్తగా కోడిపిల్లల పెంపకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఉన్న కోళ్లతోనే గుడ్లు తీస్తుండడంతో ఉత్పత్తి తగ్గింది. వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిపంట.. మన ప్రాంతానికి ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉల్లి దిగుమతి అవుతుంది. పైన పడిన వర్షాలతో ఉల్లి పంట చాలా వరకు దెబ్బతిన్నది. దీంతో దిగుబడి తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం తెల్ల ఉల్లి రూ.45 పలుకుతుండగా ఎర్ర ఉల్లి రూ.40 పలుకుతోంది. గుడ్డుకు పెరిగిన డిమాండ్... కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలన్నా.. కరోనా సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా.. రోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. అందుకు తగిన ఉత్పత్తి లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ఒక్కో గుడ్డు ధర రూ.6 వరకు పెరిగింది. -
టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు
న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్ (వెబ్సైట్)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’’ అని మంత్రి బాదల్ తెలిపారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ప్రభుత్వం రూపొం దించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్) అనే పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుందని నాఫెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే సింగ్ తెలిపారు. -
' ఉల్లి 'ఉపశమనం
సాక్షి, సిటీబ్యూరో: మొన్నటిదాకా కన్నీరు పెట్టించింది. ధరతో దడ పుట్టించింది. వంటింట్లో వణికించింది. వినియోగదారులను బెంబేలెత్తించింది. మరి ఇప్పుడో.. ఉపశమనం కలిగిస్తోంది. నేలకు దిగిన ధరతో సామాన్యులకు చేరువగా మారింది. అదేమిటని ఆలోచిస్తున్నారా? అదేనండి.. ఉల్లి. మార్కెట్‌కు ఆశించినస్థాయి కంటే ఎక్కువ మొత్తంలో ఉల్లి దిగుమతులు పెరగడంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. గురువారం మలక్‌పేట్ ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్ ధర రూ.2,900 నుంచి రూ.2,500 పలికింది. కొన్నాళ్ల క్రితం క్వింటాలుకు 16వేల నుంచి 18వేల రూపాయల వరకు పలికిన ఉల్లి.. అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపింది. సామాన్య ప్రజలు ఉల్లిని కొనాలంటేనే వణికిపోయారు. ప్రత్యేకించి హోటళ్లు, మెస్‌లలో వినియోగ దారులకు ఉల్లి లేని వంటకాలే వడ్డించాయి. సామాన్య ప్రజలు చాలా మంది ఉల్లికి ప్రత్యామ్నాయంగా క్యాబేజీని వాడారు. ఇలా ఉల్లిపేరు వింటేనే ఉలిక్కిపడిన వారంతా ప్రస్తుతం ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రూ.100కు 4 కిలోలు.. మలక్‌పేట్ ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి దిగుమతులు భారీగా వస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో మొదటి రకం ఉల్లి కిలో రూ.29 ఉండగా, రెండో రకం రూ.25 నుంచి 24 వరకు పలుకుతున్నట్లు ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు ఏకంగా వంద రూపాయలకు మూడు కిలోలు అమ్ముతున్నారు. మరికొందరు వ్యాపారులు వందకు నాలుగు కిలోలు కూడా అమ్ముతున్నారు. కొత్త పంట రావడంతో మార్కెట్‌కు ఉల్లి ముంచెత్తుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాఫెడ్ వద్ద మిగిలిన ఈజిప్టు ఉల్లి మార్కెట్‌కు ఉల్లి దిగుమతులు తగ్గడంతో నెల రోజుల క్రితం కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయి. దీంతో మార్కెటింగ్ శాఖ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా వంద మెట్రిక్ టన్నుల ఉల్లిని రూ.65కు కొని సబ్సిడీపై నగరంలోని రైతు బజార్లలో కిలో రూ.40కి విక్రయించారు. దీంతో మార్కెటింగ్ శాఖ తీసుకున్న ఉల్లి మొత్తం విక్రయించారు. నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఈజిప్లు ఉల్లి ముంబై నుంచి నగరానికి వచ్చింది. ఉల్లి ధరలు తగ్గడంతో ఈజిప్టు నుంచి కొన్న ఉల్లి.. ప్రస్తుతం ధరలు తగ్గడంతో సనత్‌నగర్‌లోని గోదాంలో మిగిలిపోయింది. దీంతో నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ అధికారులు ఉల్లి విక్రయించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన ఉల్లి నెలరోజుల కిత్రమే మొత్తం అమ్ముడుపోయిందన్నారు. కొత్త పంటవస్తుండటంతోనే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లోకల్ కొత్త ఉల్లి పంట మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతయ్యే అవకాశం ఉంది. గత ఏడాది మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడి ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభ నుంచే మెదక్, మహబూబ్‌నగర్, కర్నూల్ నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.29 వరకు ధర పలుకుతోంది. చిన్న గడ్డకు రూ.14 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా పెరగవు. కొత్త పంట రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి.– వెంకటేశం, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, మలక్‌పేట్ మార్కెట్ -
దిగొస్తున్న ఉల్లి ధర
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరలు క్రమంగా దిగొ స్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న, మొన్నటివరకు కిలో రూ.130 వరకు ఉన్న ఉల్లి ధర రూ.20 వరకు తగ్గింది. గత కొద్ది రోజులుగా కర్ణాటక నుంచి ఉల్లి సరఫరా పూర్తిగా నిలిచిపోగా, మహారాష్ట్ర నుంచి 6 వేల నుంచి 7 వేల బస్తాల మేర మాత్రమే ఉల్లి సరఫరా జరిగింది. దీంతో హోల్‌సేల్ ధర రూ.110 నుంచి రూ.120 వరకు పలికింది. ఇది రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.130–140 మధ్య పలికింది. అయితే సోమవారం మలక్‌పేట మార్కెట్‌కు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఏకంగా 16,650 బస్తాల ఉల్లి వచ్చింది. దీంతో కిలో ఉల్లి ధర రూ.80–90 మధ్య పలికింది. ఇది రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.100–110 మధ్య పలికింది. ఉల్లి సరఫరా పెరిగితే జనవరి మొదటి వారానికి రిటైల్ మార్కెట్లో ధర రూ.70–80 వరకు తగ్గుతాయని అంటున్నాయి. రాష్ట్రానికి ఈజిప్టు నుంచి రావాల్సిన ఉల్లి ఇంకా రాలేదు. అయితే మలక్‌పేట మార్కెట్లో మాత్రం ప్రతిరోజూ మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈజిప్టు నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఉల్లిని విక్రయిస్తున్నారు. సోమవారం సైతం మార్కెట్లో లారీ ఈజిప్టు ఉల్లిని మహారాష్ట్ర వ్యాపారి ఒకరు కిలో రూ.70కి విక్రయించడం గమనార్హం. -
రైతును కోటీశ్వరుణ్ని చేసిన ఉల్లి
సాక్షి, బెంగళూరు: దేశమంతటా సామాన్యులు ఉల్లిని కొనలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుండగా కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఉల్లికి ఏర్పడిన భారీ డిమాండ్ కర్ణాటకకు చెందిన రైతు మల్లికార్జున (42)ను కోటీ శ్వరుణ్ని చేసింది. పంట వేయడం కోసం తీసుకున్న అప్పు చెల్లించడమేగాక భూమి కొనుగోలుకు, ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని దొడ్డసిద్ధవ్వనహళ్లికి చెందిన ఆయన తనకున్న 10 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలను లీజుకు తీసుకొని ఉల్లి సాగు చేశారు. దీనికి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ. 5 నుంచి 10 లక్షల లాభం వస్తుందని అంచనా వేశారు. అయితే నవంబర్ నుంచి అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలు ఆయనకు భారీ లాభం వచ్చేలా చేశాయి. దాదాపు 240 టన్నుల ఉల్లిని ఆయన అమ్మారు. ఉల్లి ధర కిలో రూ. 200 దాకా వెళ్లడంతో రాత్రికిరాత్రే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. అయితే దీని కోసం బాగా శ్రమించాల్సి వచ్చిందని, 50 మంది పనివారిని పెట్టి పంట పండించామని చెప్పారు. ఉల్లి డిమాండ్ పెరిగినపుడు దొంగల బారిన పడకుండా కుటుంబమంతా కాపలాగా ఉన్నామని చెప్పారు. అక్టోబర్‌లో ధరలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భయపడ్డామని చెప్పారు. అయితే తర్వాత క్వింటాల్ ఉల్లి ధర రూ. 7 వేల నుంచి 12 వేలకు పెరగడంతో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. -
ఉల్లి... ఎందుకీ లొల్లి!
గత మార్చి నుంచి ఇప్పటివరకు ఉల్లి ధరలు 400 శాతం పెరిగాయి. దేశంలో చాలా చోట్ల కేజీ ఉల్లి ధర రూ.150 నుంచి రూ.200 వరకు చేరుకుంది. ధరాఘాతం కేవలం ఉల్లికే పరిమితం కాలేదు. గత నాలుగు నెలల కాలంలో దాదాపు 20 నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, కూరగాయలు, నూనె, బెల్లం వంటి సరుకుల రేట్లు ఆకాశాన్నంటాయి. అయినా ఉల్లి గురించే దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. మిగిలిన వాటి ధరలు పెరిగినా పట్టించుకోని జనం.. ఉల్లి ధరపై ఎందుకింత తల్లడిల్లిపోతున్నారు? ఇదే సండే స్పెషల్.. ఇది మొఘల్స్ ఘాటు ఇప్పుడంటే ఉల్లి కోసం అందరూ ఎగబడుతున్నారు కానీ ఒకప్పుడు ఉల్లికి మన సమాజంలో చోటే లేదు. మొఘలాయిలు మన దేశంలోకి అడుగుపెట్టక ముందు ఉల్లి, వెల్లుల్లికి బదులుగా భారతీయులు వంటల్లో అల్లం ఎక్కువగా వాడేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 2 వేల ఏళ్ల కింద ఆయుర్వేద వైద్యుడు చరకుడి చరక సంహితలో ఉల్లి గురించి చాలా గొప్పగా రాశారు. కూరల్లో ఉల్లిని వాడితే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయని, జీర్ణక్రియకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఉల్లి వాడకం బాగా ఉండేది. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఆయుర్వేదంలో ఉల్లిని నిషేధించారు. ఉల్లిని తమోగుణాన్ని పెంచే వస్తువుగా చూసేవారు. ఉల్లి తింటే శారీరక వాంఛలు పెరుగుతాయని తేల్చారు. దీంతో ఉల్లి అనేది కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. వితంతువులు ఉల్లి తినకూడదని ఆంక్షలు విధించారు. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ పుస్తకాల్లో.. భారత్‌లో ఉల్లిపై నిషేధం ఉందని, దాన్ని వాడేవారిని ఊరి నుంచి వెలివేశారని రాశారు. క్రీ.శ.1526లో మొఘలాయిలు భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత ఉల్లి వాడకం ఇంటింటికీ పాకింది. వాళ్లు చేసే బిర్యానీ, ఇతర వంటకాల్లో మసాలాలు, ఉల్లి లేనిదే రంగు, రుచి వచ్చేది కాదు. అలా కాలక్రమంలో ఉల్లి లేనిదే వంటలు చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే జైనులు ఉల్లిపాయ, వెల్లుల్లికి ఎప్పుడూ దూరమే. ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా ఉల్లి వాడేవారు కాదు. కానీ రానురానూ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సత్యాన్ని గ్రహించి ఉల్లి వాడకాన్ని మొదలు పెట్టారు. ఉల్లి ఉల్లికో కథ సామాన్యుల నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు ఉల్లి లేనిదే అసలు ముద్దే దిగదు. ఏ వంట చేయాలన్నా ఉల్లి తప్పనిసరి. సలాడ్స్ నుంచి మాంచి మసాలాలు దట్టించిన కుర్మాలు, చికెన్, మటన్ వరకు ఉల్లి లేకుండా వంటలకి రుచే రాదు. శాకాహారులు ఎక్కువగా తినే సాంబార్లో చిన్న ఉల్లిపాయలు వాడకుండా టేస్ట్ తేలేరు. నిరుపేదలకు గంజన్నం, ఉల్లిపాయ ఉంటే చాలు అదే పంచభక్ష పరమాన్నం. -
హెరిటేజ్ పేరెత్తగానే.. టీడీపీ వాకౌట్!
సాక్షి, అమరావతి: శాసనమండలిలో గురువారం ఉల్లి ధరలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో.. హెరిటేజ్ పేరెత్తగానే సభ నుంచి టీడీపీ సభ్యులు నిష్క్రమించారు. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సభలో మాట్లాడుతూ.. రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలను సబ్సిడీ కింద కేవలం రూ. 25కే పంపిణీ చేస్తున్నామని.. రేపటి నుంచి మార్కెట్ యార్డులో కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఉల్లి ధర హెరిటేజ్ మార్కెట్లో రూ.150 ఉందని చెబుతుండగా.. ఒక్కసారిగా తెలుగుదేశం సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఇక హెరిటేజ్ సంస్థకు, తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని నారా లోకేష్ అనడంతో సభలో రభస నెలకొంది. హెరిటేజ్ పేరెత్తగానే ఎందుకు పారిపోతారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. టీడీపీ సభ్యులను ఎద్దేవా చేశారు. ఉల్లిపాయలు మెడలో వేసుకుని పొర్లుదండాలు పెట్టినా తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. పబ్లిసిటీ కోసం టీడీపీ సభ్యులు మెడలో వేసుకొచ్చిన ఉల్లిపాయలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చినవే అని హేళన చేశారు. పేదలకు చెందాల్సిన ఉల్లిపాయలను ఇటీవల తెలుగుదేశం నాయకులు దుర్వినియోగం చేశారంటూ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గడంతో.. ధరలు పెరిగాయని ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 101 రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలను ఇరవై ఐదు రూపాయలకే పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో ఉల్లి సాగు ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు తగ్గిపోయిందని అన్నారు. ఉల్లిపాయలు తక్కువ ధరకే అందిస్తున్నందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిందని మంత్రి సభలో పేర్కొన్నారు. ఉల్లిపాయల కొరతపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెడ్డి నాలుగు సార్లు సమీక్ష నిర్వహించారని, ఎంత ఖర్చయినా సరే.. ప్రజలకు మాత్రం రూ.25కే ఉల్లి అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు 42,096 క్వింటాళ్ల ఉల్లిని దిగుమతి చేసుకుని ప్రజలకు సబ్సిడీ కింద పంపిణీ చేశామని.. దీని కారణంగా ప్రభుత్వంపై రూ. 22 కోట్ల భారం పడిందని అన్నారు. -
సంక్రాంతికే ఉల్లి దిగొచ్చేది!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లి ధరలు మరో నెల రోజుల పాటు ఆకాశంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో ఉల్లి డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా లేకపోవడంతో ఇప్పట్లో ధరలు సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఉల్లి ధర, డిమాండ్ నేపథ్యంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు పెరగడం, మరో పదిపదిహేను రోజుల్లో కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రానుండటంతో సంక్రాంతి నాటికి ఉల్లి కిలో ధర వంద రూపాయల దిగువకి వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరికే సాధారణ ధర దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ ఉల్లి సరఫరా గత ఏడాది 3 లక్షల నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల మేర ఉండగా.. ఈ ఏడాది 1.17 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ధర రూ.180–220కి చేరగా, రాష్ట్రంలోనూ రూ.160–180 పలుకుతోంది. అయితే ఉల్లి ధరలు పెరగడం, యాసంగికి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రలో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో 2.50 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ సీజన్లో 4 లక్షల హెక్టార్లకు మించి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాగైన ఉల్లి దిగుబడులన్నీ జనవరి మాసాంతం వరకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే కేంద్రం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ విదేశాల నుంచి జనవరి రెండో వారంలోగా దేశానికి పూర్తిగా చేరుకుంటుంది. అప్పటివరకు విదేశాల నుంచి విడతలవారీగా ఉల్లి దేశానికి చేరినా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో ఉల్లి ధర రూ.80–110 వరకు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి ఉల్లి ధర రూ.50–80 మధ్య, ద్వితీయార్ధంలో రూ.35–60 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా పెరిగే అవకాశాలు ఉండటం.. నారాయణఖేడ్, వనపర్తి వంటి ప్రాంతాల నుంచి ఉల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశాలు.. కర్నూలు, కర్ణాటక నుంచి దిగుమతులు పెరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉల్లి ధర రూ.20–30కి సాధారణ స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ బిర్యానీకి కూడా ఉల్లి సెగ తగిలింది. చాలా హోటళ్లు బిర్యానీలో ఉల్లి వాడకాన్ని బాగా తగ్గించాయి. ప్రముఖ హోటళ్ల బిర్యానీలు సైతం రుచిని కోల్పోయాయని పలువురు ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. ఉల్లి లేకుండా బిర్యానీ వండాల్సిన పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
తెలంగాణలో ఉల్లి @170
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ‘ఉల్లి బాంబ్’ పేలింది! గత కొంతకాలంగా సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఎగబాకుతున్న ధర తాజాగా ‘ఆల్‌టైం హై’ను తాకింది. ఇప్పటివరకు సెంచరీ మార్కుకు అటు ఇటుగా పలికిన ధర గురువారం ఒక్కసారిగా ఆకాశాన్నం టింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనం తగా మొదటి రకం ఉల్లి హోల్‌సేల్‌లో క్వింటాలుకు ఏకంగా రూ.14,500 పలికింది. అంటే హోల్‌సేల్‌లోనే కిలో రూ. 145కు చేరింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు మరింతగా రేట్లను పెంచడంతో రిటైల్ మార్కెట్లో ధర రూ. 160 నుంచి రూ.170 మధ్య పలుకుతూ మధ్యతరగతి ప్రజలు ఉల్లి పేరెత్తాలంటేనే జంకేలా చేస్తోంది. రెండో రకం ఉల్లి కిలో రూ. 120, మూడో రకం ఉల్లి రూ. 80 పలుకుతుండగా నాసిరకం ఉల్లి సైతం రూ.70 పలుకుతోంది. దీంతో కిలో నుంచి 2కిలోల వరకు ఉల్లి కొందామని మార్కె ట్‌కు వెళ్తున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతేడాది ఇదే సీజన్లో ఉల్లి ధరలు రూ.30 దాటలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. ఈసారి దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రాకకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ధర ఇప్పట్లో దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనికితోడు మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కు కావడం, నిల్వలపై నిఘా కొరవడడం మార్కెట్లో మరింతగా రేట్ల అగ్గిని రాజేస్తోంది. పొరుగున తగ్గిన సాగు వల్లే ఉల్లి ఘాటు... తెలంగాణలో ఉల్లిసాగు ఎక్కువగా లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపైనే రాష్ట్రం ఆధార పడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి వచ్చే దిగుమతులే రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. దేశంలో 60–70 శాతం ఉల్లి దిగుబడికి మహారాష్ట్రే కేంద్రంకాగా అక్కడ ఈసారి సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది 4 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా ఈ ఏడాది కేవలం రెండున్నర లక్షల హెక్టార్లకు సాగు పడిపోయింది. దీనికితోడు ఆగస్టు నుంచి మూడు నెలలపాటు కురిసిన భారీ వర్షాలతో వేసిన పంటంతా దెబ్బతిన్నది. దీంతో ప్రస్తుత ముంబై, పుణేలోనే ఉల్లి కిలో గత 2–3 నెలలుగా రూ. 90 నుంచి రూ. 100 మధ్య పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి కొరత ఉంటే అక్కడి వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం పాక్ నుంచి ఉల్లి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదల కారణంగా అక్కడి నుంచి సరఫరా లేదు. దీంతో ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు. ఉల్లి దిగుమతి కోసం కిలోకు రూ. 6–8 ఖర్చు వస్తుండటంతో మహారాష్ట్రలోనే కిలో రూ. 110 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి సైతం ఉల్లి రాకపోవడంతో ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఈ నెల 2న 6,471 క్వింటాళ్ల మేర ఉల్లి రాష్ట్రానికి రాగా గురువారానికి అది 3 వేల క్వింటాళ్లకు తగ్గింది. దీంతో మూడు నాలుగు రోజుల కిందటి వరకు కిలో ఉల్లి రూ. 90–100 మధ్య ఉండగా గురువారం మలక్‌పేట మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉల్లి క్వింటాల్ ధర రూ.14,500 పలికింది. ఇది బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.160 నుంచి రూ.170కి విక్రయిస్తున్నారు. కర్నూలు ఉల్లికి పెరిగిన డిమాండ్... రాష్ట్రానికి కర్నూలు జిల్లా నుంచి కూడా ఉల్లి దిగుమతి జరుగుతోంది. కర్నూలులో ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తుండగా ఈ ఏడాది అది 50 వేల ఎకరాలకు పడిపోయింది. దీనికితోడు ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు సాగు చేసిన పంటలోనూ ఎకరానికి 60 క్వింటాళ్ల మేర రావాల్సిన దిగుబడి 35–40 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అక్కడే ధరలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర్‌లో క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 4,500కు, అక్టోబర్‌లో రూ. 4,600కు నవంబర్‌లో రూ. 5,250 పలికింది. సాగు, దిగుబడులు తగ్గడం, స్థానిక డిమాండ్ అధికంగా ఉండటంతో కర్నూలు మార్కెట్‌కు గతంలో రోజూ 5–6 వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. కానీ ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది. దీంతో అక్కడి నుంచి రాష్ట్ర అవసరాల మేరకు ఉల్లి రావట్లేదు. మరోవైపు ప్రజలకు రాయితీపై కిలో ఉల్లి రూ. 25కే సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు సూచించడంతో మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి. కర్నూలు మార్కెట్లో గత బుధవారం మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్టంగా రూ. 12,510 పలికింది. ఈ ప్రభావం తెలంగాణపై పడి ఇక్కడి ధరల పెరుగుదలకు కారణమైంది. ‘మహా’ సిండికేట్... రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా లేని ఉల్లి సరఫరాను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో ఉల్లి నిల్వలకు కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో పూర్తిగా మహారాష్ట్రపై ఆధారపడుతున్న రాష్ట్ర వ్యాపారులు అక్కడి వ్యాపారులతో సిండికేట్ అయ్యారు. కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్రానికి తీసుకురాకుండా అక్కడే నిల్వ చేసి కృతిమ కొరత సృష్టిస్తున్నారు. అదీగాక తక్కువ బరువు తూగే పాత స్టాక్‌కు ధర ఉండదన్న ఉద్దేశంతో దాన్ని తీసుకురాకుండా ఎక్కువ బరువుండే తాజా స్టాక్‌నే తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర నుంచి 10 లారీలు వస్తుంటే అందులో 3 పాత స్టాక్ లారీలయితే 7 కొత్త స్టాక్వి ఉంటున్నాయి. కొత్త స్టాక్‌కు ధర పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. ఉల్లి అక్రమ నిల్వలను అరికట్టేందుకు రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి నిల్వ చేసుకోరాదని కేంద్రం స్పష్టం చేసినా ఎక్కడా దీనిపై నిఘా ఉన్నట్లు కనిపించట్లేదు. ఈజిప్టు ఉల్లే దిక్కు.. దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం గత నెల చివరి వారంలో టర్కీ నుంచి 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్ట్ నుంచి 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈజిప్ట్ ఉల్లి ఈ నెల రెండో వారానికల్లా ముంబై చేరుతుందని కేంద్రం ప్రకటించింది. ఈజిప్ట్ ఉల్లిలోంచి తమకు వారానికి 100 టన్నులకు తగ్గకుండా సరఫరా చేయాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది. ఈజిప్ట్ నుంచి వచ్చే స్టాక్ ఈ నెల 10కల్లా ముంబై పోర్టుకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి చేరొచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 500 టన్నుల ఈజిప్టు ఉల్లి తెలంగాణకు దిగుమతి అవుతుందని, అప్పడే ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో నారాయణఖేడ్ సహా ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన ఉల్లి పంట ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో మార్కెట్లోకి వస్తుందని, అప్పటివరకు ధరాఘాతం తప్పదని చెబుతున్నారు. ఆనియన్ దోశ.. పకోడిలు బంద్! ఉల్లి ధరల దెబ్బకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉల్లి సంబంధిత వంటకాలను హోటళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారులు చాలా వరకు తగ్గించేశారు. ముఖ్యంగా ఉల్లి దోశ, పకోడి, మిర్చి, పానీపూరీల్లో ఉల్లి వాడకంపై స్వీయ ఆంక్షలు పెట్టుకున్నారు. తోపుడు బండ్ల వద్ద ‘ఉల్లి మళ్లీ అడగరాదు’ అని బోర్డులు పెడుతున్నారు. ఇక బిర్యానీల్లో ఉల్లి వాడకం జరుగుతున్నా వాటితోపాటు ఇచ్చే సలాడ్‌లో ఉల్లి స్థానంలో కీరా, క్యారెట్లను ఇస్తున్నారు. వినియోగదారులు ఉల్లి అడిగితే సలాడ్‌కు రూ. 20–30 వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపైనా పడుతోంది. హైదరాబాద్‌లోని 10 రైతు బజార్లకు మలక్‌పేట మార్కెట్ నుంచి 30 క్వింటాళ్లను కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధర తగ్గే వరకు రైతు బజార్లకు ఉల్లి సరఫరా చేస్తామని చెప్పారు. -
ఉల్లి దొంగలు వస్తున్నారు జాగ్రత్త!
సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి కోస్తేనే కాదు కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లిగడ్డల ధర రూ.100 ను దాటాయి. ఉల్లిగడ్డల్ని బంగారం లాగా దాచుకుంటున్నారు. అదే సమయంలో ఉల్లి గడ్డల దొంగలు కూడా దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో పొలంలో పంటల మీద ఉన్న ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే అదే తరహా దొంగతనం తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ రైతు పంట వేయడానికి తెచ్చుకున్న 350 కిలోల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారు. పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ (40)అనే రైతు జీవిస్తున్నాడు. అతను ఉల్లి పంటలు వేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే తన మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుచేసేందుకు 350 కిలోల చిన్న ఉల్లిపాయలను 15 బుట్టలలో ఉంచి పొలం దగ్గర ఉంచాడు. అయితే ఆ ప్రాంతాంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున నాలుగైదు రోజులుగా ఆయన పొలం వైపు వెళ్లలేదు. బుధవారం ఉదయం పొలం వెళ్లి చూసిన ముత్తు క్రిష్ణన్ షాక్ అయ్యాడు. పొలంలో ఉంచిన ఉల్లిని ఎవరో గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీంతో ముత్తుక్రిష్ణన్‌లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఉల్లి ధరలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి రేట్లు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తుంది. నవంబర్ 2న ఒక్కరోజే కిలో ఉల్లి రూ.90కి చేరింది. అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనకాడకుండా దాదాపు 548 క్వింటాళ్ళు ఒక్కరోజే కొనుగోలు చేసి రూ.25కే కిలో చొప్పున సామాన్యులకు అందుబాటులో ఉండేలా రైతు బజార్లకు చేర్చింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం చేపట్టారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సబ్సిడీ ఉల్లిపాయలు రైతుబజార్ల ద్వారా విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా ఉల్లిపాయల నిల్వలు చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంతవరకూ ఇదే విధంగా అమ్మాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా.. సామాన్యులకు మాత్రం రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం పేర్కొన్నారు. ఉల్లి ధరలపై వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్‌శాఖ, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర సుమారు 100 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్లో అంత ధర ఉన్నా.. రైతు బజార్లలో మాత్రం తక్కవకే దొరుకుతోంది. రోజుకు 500 నుంచి 1200 క్వింటాళ్ళ ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు ప్రతీరోజు తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద సుమారు 50 రూపాయల పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న కారణంగా కిలో ఉల్లి సామాన్యులకు 25 రూపాయలకే దొరుకుతోంది. -
ఉల్లి ధర రికార్డు..
సాక్షి, కర్నూలు: దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు ప్రజల్లో ఉల్లిపై డిమాండ్ భారీగా పెరుగుతోంది. తాజాగా సోమవారం కర్నూలు జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధర గరిష్ట స్థాయిలో పలికింది. క్వింటాల్ ఉల్లి ధర రూ. పది వేలకుపైగా అమ్మకం జరిగింది. రికార్డు స్థాయిలో పెరిగిన ఉల్లి ధరలతో.. ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజారుల్లో కిలో ఉల్లిపాయలను రూ. 25కే అందిస్తున్న విషయం తెలిసిందే. -
కిలో ఉల్లి రూ.35.. హెల్మెట్లు పెట్టుకొని మరీ..
పట్నా: ఉల్లి కోస్తేనే కాదు.. కొనాలన్నా కన్నీళ్లు వస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.110 వరకూ పలుకుతోంది. ఇక ఉత్తర భారత్‌లో అయితే మరీ దారుణం. కిలో ఉల్లి దాదాపు రూ.100 నుంచి 500 వరకూ ఉంది. దీంతో జనాలు వంట చేసుకోవడానికి బిత్తపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించేందుకు బీహార్ ప్రభుత్వం రూ.35కే కిలో ఉల్లి గడ్డను అందిస్తోంది. ఇందుకు గాను బీహార్ స్టేట్ కార్పొరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ద్వారా ఉల్లిగడ్డల కౌంటర్ పెట్టారు. దీంతో జనాలు శనివారం ఉదయమే బారులు తీరారు. చాలా పొడవైన క్యూ ఏర్పడింది. ఉల్లి అయిపోతుందనే భయంతో జనాలు ఎగబడుతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక అధికారులు హెల్మెట్లు పెట్టుకొని మరీ ఉల్లిగడ్డను విక్రయిస్తున్నారు. రాళ్లతో దాడి చేయడం, వాహనం మీదకు దూసుకువస్తారనే భయంతో హెల్మెట్లు పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. తమకు ప్రభుత్వం ఎలాంటి భద్రతను ఏర్పాటు చేయలేదని వాపోయారు. -
అక్రమ వ్యాపారం.. కృత్రిమ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాపారులు తమ లాభం కోసం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో ఉల్లి ధరలు దిగిరావడం లేదు. ఉల్లి ధరల మంటకు గల కారణాలను గుర్తించడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టింది. ఉల్లి వ్యాపారం అధికంగా జరిగే కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్రయవిక్రయాలు, గత మూడేళ్లుగా ఉల్లి దిగుబడులు.. తదితర అంశాలను పరిశీలించగా, విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఉల్లి దిగుబడి అధికంగా వచ్చినా.. వ్యాపారులు తమ కమిషన్ కోసం ఉల్లిని ఇతర రాష్ట్రాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీనికితోడు కొంత సరుకును నల్లబజారుకు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈసారి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ఉల్లి దొరక్కపోవడానికి వ్యాపారుల అక్రమాలే కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై మెరుపు దాడులు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలోని అంశాలు.. - రాష్ట్రంలో రోజుకు 8–9 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం. నవంబరులో కర్నూలు రకం ఉల్లి ప్రధాన మార్కెట్లకు 3.83 లక్షల క్వింటాళ్లు వచ్చింది. ఇందులో దాదాపు 40 శాతం.. అంటే 1.60 లక్షల క్వింటాళ్ల ఉల్లి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయింది. మిగిలిన 2.23 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు 13 జిల్లాల్లోని వినియోగదారులకు సరిపోతాయి. - అయినప్పటికీ ట్రేడర్లు/ఏజెంట్లు కృత్రిమ కొరత సృష్టించారు. తమకు వచ్చే 4 శాతం కమిషన్ కోసం ఇక్కడి ఉల్లిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు చేరుతుండడంతో స్థానికంగా ఉల్లి కొరత కొనసాగుతోంది. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగులు సరుకును మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే ఉల్లి కొరత ఉండదు. - ఉల్లి కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను రోజులుగా ఉల్లిని కొనుగోలు చేసి, రైతుబజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. కర్నూలు మార్కెట్లో కిలో రూ.65 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్లలో రాయితీపై వినియోగదారులకు అమ్ముతోంది. ధరల స్ధిరీకరణ నిధి ద్వారా ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. సబ్సిడీ ఉల్లి అమ్మకాల వల్ల ఇప్పటివరకు రూ.4.50 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడింది. దీనికితోడు ఈజిప్టు నుంచి ఉల్లిపాయల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
మరో నెల.. కిలో ఉల్లి రూ.25కే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతు బజార్లలో ఇప్పటికే కిలో రూ.25కే ఉల్లిని అమ్ముతున్నామని, దీనిని మరో నెల రోజులు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కగా.. రాష్ట్రంలోనూ ఆ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకోవాలని వారికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఉల్లి ధరలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. పెరుగుతున్న ఉల్లి ధరలు, అందుబాటులో ఉన్న నిల్వలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మరో నెలపాటు ఉల్లిని కిలో రూ.25కే రైతుబజార్లలో అమ్మేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రతిరోజూ 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతుబజార్లకు సరఫరా చేయాలన్నారు. బిడ్డింగులో నేరుగా పాల్గొంటూ రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని, కర్నూలు మార్కెట్‌కు వచ్చే సరుకులో సగాన్ని మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తోందని అధికారులు చెప్పగా.. ధరల స్థిరీకరణ నిధిని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ.62 నుంచి రూ.75 మధ్య ఉందని, బిడ్డింగులో కనీస ధర రూ.53 నుంచి రూ.62 మధ్య కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. రవాణా ఖర్చులు కలుపుకుంటే రూ.70 నుంచి రూ.72 వరకూ ఖర్చవుతోందని, ఇంత ఎక్కువ రేటున్నా కిలోకు కనీసం రూ.40–45కి పైబడి రాయితీ ఇచ్చి రైతుబజార్లకు సరఫరా చేస్తున్నామని, పేదలకు, సామాన్యులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని వారు చెప్పారు. ధరలు తగ్గేంతవరకూ ఇది కొనసాగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉల్లిని అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వేరుశనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి.. వేరుశనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని, ఇందుకోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందని, కానీ దానికోసం ఎదురుచూడకుండా ఈ నెల 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. అప్పటివరకూ రైతులెవ్వరూ ఎంఎస్పీ ధరకన్నా తక్కువకు అమ్ముకోకుండా చూడాలన్నారు. పంట వచ్చిన జిల్లాల్లో వెంటనే కేంద్రాల్ని ప్రారంభించి రైతులను దళారుల దోపిడీ నుంచి కాపాడాలన్నారు. మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకూ 18 కేంద్రాలు తెరిచామని, 200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. ధర స్థిరపడేంతవరకూ రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల మొక్కజొన్న ధర పెరిగిందని అధికారులు చెప్పారు. కాగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లను కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను ఆయనీ సందర్భంగా అధికారులను అడిగారు. వచ్చే జనవరి నుంచి ఈ–పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి లొల్లి!
సాక్షి సిటీబ్యూరో: వంటింట్లో అతిముఖ్యమైన ఉల్లిగడ్డల రేట్లుసామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. ఏకంగా కిలో రూ.50 నుంచి 60 రూపాయలకు చేరడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ధరలపెరుగుదల కారణంగా చివరకు ఉల్లి వినియోగం కూడా తగ్గింది. మిర్చిబజ్జి బండ్లు, దోసె సెంటర్లు, చిన్నచిన్న హోటల్స్, పానీపూరి బండ్ల వద్ద ఉల్లివాడకమే మానేశారు. ముఖ్యంగా గత రెండు వారాల నుంచి ఉల్లిగడ్డల ధరలుభగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్లో మంచి రకం ఉల్లిపాయలు కిలో రూ.60 వరకు అమ్ముతున్నారు. ఇక రెండో రకం ఉల్లిపాయల ధర కిలో రూ.40–50 వరకు ఉంది. అధిక ధరల కారణంగా వినియోగదారులు అరకేజీ కొనాలన్నా భయపడుతున్నారు. అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి ఉందని, గతంలో రెండు మూడు కేజీలు కొనుగోలు చేసేవారు కూడా ఇప్పుడు అరకేజీతో సరిపెట్టుకుంటున్నారని చిన్నవ్యాపారులు చెబుతున్నారు. కాగా మలక్‌పేట మార్కెట్‌కు ఉల్లిపాయల సరఫరా బాగా తగ్గిపోయింది. గత నెల వర్షాలు విపరీతంగా కురవడంతో మార్కెట్‌కు సరిగా సరుకు రావడం లేదని మార్కెట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ 90 నుంచి 110 లారీలు రావాల్సి ఉండగా..ప్రస్తుతం 40 నుంచి 50 వరకే ఉల్లి లారీలు వస్తున్నాయని చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో ఉల్లి ధరలు కిలో రూ.30 దాటలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సరిపడా సరఫరా లేకే ధరలు పైపైకి.. మలక్‌పేట మార్కెట్‌కు కర్నూలు, మహారాష్ట్ర, మహబూబ్‌నగర్ నుంచి ఉల్లిపాయలు సరఫరా అవుతుంటాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, మహబూబ్‌నగర్ నుంచి సరఫరా బాగా తగ్గిపో యింది. కర్నూలు నుంచి కేవలం 15 నుంచి 20 లారీల వరకే వస్తోందని వివరిస్తున్నారు. దీంతో మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిపాయలు రూ. మూడు వేల నుంచి ఐదువేల వరకు ధర పలుతోకుందని ఓ వ్యాపారి పేర్కొన్నాడు. మార్కెట్‌కు వచ్చిన ఉల్లిని గ్రేడ్లుగా విభజించి అమ్మకాలు చేస్తున్నారు. మొదటి గ్రేడ్ ఎక్కువ ధర పలుకుతోందని, ఇక్కడ నుంచి కొనుగోలు చేసుకుని పోయిన వ్యాపారులు బహిరంగ మార్కెట్లో మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పాడు. మహారాష్ట్ర ఉల్లిపైనే ఆధారం.. మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే సరుకుపైనే నగరం ఎక్కువగా అధారపడుతోంది. రోజూ మార్కెట్‌కు వచ్చే ఉల్లిలో కేవలం 20–30 శాతం తెలంగాణ జిల్లాల వాటా ఉండగా, మహారాష్ట్ర ఉల్లి వాటా దాదాపు 70–80 శాతం ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో గత నెల భారీగా వర్షాలు కురవడంతో నగరానికి ఉల్లిగడ్డల సరఫరా భారీగా తగ్గింది. దీంతో వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. తెలంగాణకు అతిపెద్ద మార్కెట్‌గా నగరంలోని మలక్‌పేట మార్కెట్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఉల్లిగడ్డల లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. -
ఉల్లి అక్రమార్కులపై.. ‘విజిలెన్స్’ కొరడా!
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలను అదుపుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దించింది. పలు రాష్ట్రాల్లో వీటి దిగుబడి తగ్గడం.. వరదల కారణంగా మార్కెట్లో ఉల్లిపాయలకు కొద్దిరోజులుగా కొరత ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతికి అనుమతించింది. అయితే, వాటి ధరల్లో పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల కారణంగా రాష్ట్రంలోని వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో దాడులు ప్రారంభించారు. గడిచిన రెండ్రోజులుగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పెద్దఎత్తున వీటిని నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ ఉంచడం.. కృత్రిమంగా కొరత సృష్టించి ధర పెంచి విక్రయించడం.. ఎటువంటి అనుమతులు లేకుండా హోల్‌సేల్, రిటైల్ షాపులు నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 మంది వ్యాపారులపై ‘విజిలెన్స్’ దాడులు నిర్వహించగా 47మంది అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి నుంచి రూ.27,06,200 విలువచేసే 603.50 క్వింటాళ్ల ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు ఉంచిన 37 మందికి జరిమానాలు విధించారు. మిగిలిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు మించి నిల్వలు వద్దు ఇదిలా ఉంటే.. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద నిబంధనలకు మించి ఉల్లిపాయల నిల్వలు ఉంచుకోకూడదని కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు హోల్‌సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలన్నారు. మరోవైపు.. కొందరు వ్యాపారులు అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ ఎగవేశారని ఆయన తెలిపారు. ఆదుకున్న కర్నూలు ఉల్లి కాగా, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు రాకపోవడంతో ఆ కొరతను కర్నూలు ఉల్లిపాయలు కొంతమేర తీర్చాయి. ప్రస్తుతం రైతుబజార్లలో కర్నూలు ఉల్లిపాయలు కిలో రూ.36కు విక్రయిస్తున్నారు. దీన్ని మరింతగా తగ్గించి వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు ఇలా.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం.. వరదల ప్రభావంతో ఉల్లిపాయల రవాణపై ప్రభావం పడింది. దీన్ని గమనించిన వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. అందుబాటులో ఉన్న ఉల్లిపాయలను మహారాష్ట్ర, కార్ణాటక నుంచి తక్కువ ధరకు ముందుగానే సేకరించుకుని తమ గిడ్డంగుల్లో పెద్దఎత్తున నిల్వచేశారు. వాటిని ఉద్దేశపూర్వకంగానే రోజువారీగా కొంతమేర విక్రయాలు జరుపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. వ్యాపారులు ఒక పథకం ప్రకారమే మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ అక్రమార్జన చేస్తున్నారని విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. నిబంధనలు.. ►ఉల్లి వ్యాపారులు మార్కెట్ కమిటీ లైసెన్సులు తీసుకుని విధిగా పన్ను చెల్లించాలి. ►ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలి. ►స్టాక్ నిల్వచేయడం.. విక్రయించే ధర అన్నీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఉండాలి. ►ఎంత స్టాకు దిగుమతి చేసుకుంటున్నారు.. ఎంత విక్రయించారో లెక్కలు చూపాలి ►హోల్‌సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులకు మంచి ఉంచుకోకూడదు అక్రమంగా నిల్వచేస్తే క్రిమినల్ చర్యలు ఉల్లిపాయలను అక్రమంగా నిల్వచేసుకుని అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రియమినల్ చర్యలు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లి కొరతను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హోల్‌సేల్ వ్యాపారులు తమ వద్ద 50 మెట్రిక్ టన్నులు మించి ఉల్లిపాయలను ఉంచుకోకూడదు. అదే రిటైల్ వ్యాపారుల వద్ద 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు అక్రమ నిల్వలను సీజ్ చేస్తాం. – పి. జాషువా, గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ -
ఉల్లిపై కేంద్రం కీలక నిర్ణయం!
-
కిలో ఉల్లి రూ.25
తూర్పుగోదావరి ,కాకినాడ సిటీ: మార్కెట్లో ఉల్లి ధర అమాంతం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ద్వారా రైతు బజార్లలో ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం నుంచి జిల్లాలోని 14 రైతు బజార్లలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉల్లిపాయలను కుటుంబానికి ఒక కిలో చెప్పున రూ.25 లకే కిలోను అందజేయనున్నట్లు జాయిం ట్ కలెక్టర్ జి. లక్షీశ వివరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టుహాలు లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్‌కార్డు తెచ్చిన కుటుంబానికి కిలో రూ.25 ప్రకారం పంపిణీ చేస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉల్లిపాయల దిగుబడి తగ్గిపోయిన నేపథ్యంలో కర్నూలు నుంచి తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అవసరమైన మేరకు సరఫరా చేశామన్నారు. రోజుకు జిల్లాలో 25 టన్నుల ఉల్లిపాయలు అవసరం ఉందన్నారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి కిలో ఉల్లిపాయలు ఒక్కో కుటుంబానికి అందజేస్తామన్నారు. రైతు బజారుల్లో అమ్మే ఉల్లిపాయలు కేవలం ప్రజలకు మాత్రమే అందజేస్తారని, వ్యాపారస్తులు టోకుగా కొనుగోలు చేస్తే కేసులు పెడతామన్నారు. ప్రతి రైతు బజారులోను విజిలెన్స్ శాఖాధికారులు ఉంటారన్నారు. ప్రజలు ఉల్లిపాయల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడనవసరం లేదని, నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ఏడీ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
మొన్నటికి రూ.20.. నేడు 60
సాక్షి, హైదరాబాద్: ఉల్లి మళ్లీ మంటెక్కిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సాగు, దిగుబడులు డీలా పడటంతో ధరలు చుక్కల్ని తాకాయి. ఈ ప్రభావం రాష్ట్రంపై నా పడుతుండటంతో ధర ఘాటెక్కుతోంది.కొద్దిరోజుల వరకు కిలో ఉల్లి ధర రూ.20 ఉండగా అది రూ.60కి చేరింది. రాష్ట్ర మార్కెట్లకు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది. ధరలపై ‘మహా’ప్రభావం.. రాష్ట్రంలో ఉల్లి సాగు తగ్గింది. ఇక్కడ సాధారణ విస్తీర్ణం 13,247 హెక్టార్లు మేర ఉండగా, ఈ ఏడాది 5,465 హెక్లార్లలోనే సాగైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లి పూర్తిస్థాయి అవసరాలు తీరక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.ఈ ఏడాది ఉల్లి ధరలపై మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉంది.దేశంలో 60 నుంచి 70% ఉల్లి ఉత్పత్తికి అదే కేంద్రంగా ఉంది.ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం లో వర్షాలు ఆలస్యం కారణంగా ఉల్లి సాగు ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగింది. అక్కడి గణాంకాల ప్రకారం గత ఖరీఫ్‌లో 3.54లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది కేవలం 2.66లక్షల హెక్టార్లలోనే అయింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో విస్తారంగా కురిసిన వర్షాలతో వేసిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం ముంబాయి, పుణేలోనే ఉల్లి కిలో ధర రూ.57 నుంచి రూ.60 వరకు ఉంది. దీంతో వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, ఆఫ్గానిస్తాన్‌ల నుంచి ఉల్లిని దిగుమతి చేసి డిమాండు తీరుస్తుంటారు.ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి దిగుమతులపై ఆంక్షలుండటంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. దీనికి తోడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ప్రభుత్వం స్థానికంగా ఉల్లి ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రాష్ట్ర అవసరాలకే ప్రాధాన్యమిచ్చి పొరుగుకు సరఫరా తగ్గించింది. ఇక కర్ణాటకలో సెప్టెంబర్‌లోనే 35వేల క్వింటాళ్ల మేర మార్కెట్లోకి రావాల్సి ఉన్నా, 25వేల క్వింటాళ్లే వచ్చింది. దీంతో ఆ రాష్ట్రం పొరుగువారిని ఆదుకోలేకపోతోంది. ఈ ప్రభావం తెలంగాణలోని ధరలపై పడుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.45 నుంచి రూ.50 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.60కి చేరింది.ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.40 అధికం.ఇక రాష్ట్రంలో ఉల్లి సాగు చేసిన ప్రాంతాల నుంచి దీపావళి తర్వాతే సరకు రానుంది, అప్పటివరకు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెట్ వర్గాల కథనం. ఆ బఫర్‌స్టాక్..మనకు స్ట్రోక్ ఇక ఉల్లి ధరల నియంత్రణ చేపట్టిన కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ 57వేల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్‌గా ఉంచింది. ధరలు పెరిగిన నేపథ్యంలో వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తామంది. ప్రస్తు తం ఢిల్లీకి పొరుగున ఉన్న హరియాణా, మహారాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో బఫర్‌స్టాక్ నిల్వలు ఆయా రాష్ట్రాల అవసరాలకే విడుదల చేయొచ్చని తెలుస్తోంది. అక్కడా కిలో ఉల్లి రూ.60కి దగ్గరగా ఉంది. -
సంక్షోభంలో ఉల్లి రైతు : కిలో ఉల్లి 50పైసలే
సాక్షి, పుణే: ఉల్లి పంట రైతు కంట మరోసారి కన్నీరు పెట్టిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధర కిలో 50పైసలకు పడిపోయింది. పుణే మార్కెట్లో 2018 రబీ సీజన్లో ఉంచిన ఉల్లి ధర దారుణంగా పడిపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తమ వద్ద నిలువ ఉన్న పాత ఉల్లిని కిలో 50పైసల చొప్పున తెగనమ్ముకుంటున్నారు. సాధారంగా డిసెంబర్ నాటికి పాత ఉల్లిని విక్రయిస్తారనీ. అయితే.. ఈ ఏడాది ఉల్లి ఇంకా మార్కెట్ కి వస్తోందని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ వెల్లడించింది. దాదాపు 220 లక్షల టన్నుల ఉల్లి మార్కెట్‌ను ముంచెత్తిందనీ, గతంతో పోలిస్తే ఇది 40 లక్షల టన్నులు అధికమని కమిటీ తెలిపింది. ఇపుడు రోజుకు కనీసం 30 నుంచి 40 టన్నుల ఉల్లి మార్కెట్ వస్తోందని పేర్కొంది. మరోవైపు పండించిన 40 టన్నుల ఉల్లిలో ఇంకా 20 టన్నులు ఇంకా తన వద్దే ఉందని అహ్మద్‌నగర్ కు చెందిన శివాజీ గూలే అనే రైతు వాపోయారు. ఎకరాకు 10 టన్నుల ఉల్లి పండించామని తెలిపారు. ఇక పంట పండించేందుకు ఎకరానికి రూ.30 వేల ఖర్చుతోపాటు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.50వేలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొనేవారు కరువవ్వడంతోపాటు, రవాణా ఖర్చులు భరించలేక దాదాపు 55 బస్తాల ఉల్లిని మార్కెట్ యార్డ్‌లోనే వదిలివేశానని మరో రైతు వాపోయారు. కాగా ఉల్లి పంటకు పెట్టింది పేరైన నాసిక్‌లో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాదిలో గత 20 రోజుల్లో 18 మంది రైతులు ఆత్మహత్మకు పాల్పడ్డం ఇందుకు నిదర్శనం. -
ఉల్లి వెల్లువ..
ఈ ఏడాది ఉల్లి నగరవాసిని ఇబ్బంది పెట్టలేదు. దిగుమతులు భారీగా ఉండడంతో ఉల్లి ధరలు అదుపులోనే ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో రిటైల్ ధర కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.50 వరకు పలికింది. కానీ ఈసారి రూ.15 నుంచి రూ.20 లోపే ఉంది. దీనికి కారణం ప్రతి రోజూ 1500 టన్నుల ఉల్లిగడ్డనగరానికి చేరుతుండడమేనని మార్కెట్ వర్గాలు తెలిపారు. హోల్‌సేల్ ధర చాలా రోజులుగా రూ.10గానే ఉందని, ఇది సామాన్యులకు ఊరటనిచ్చే అంశమనిఅధికారులు పేర్కొంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఏటా వర్షాకాలంలో ఉల్లి ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది కొత్త ఉల్లి పంట మార్కెట్లకు రావడంతో హోల్‌సేల్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో రిటైల్‌గా కిలో ఉల్లి రూ.15 పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 దాటడంలేదని అధికారులు చెబుతున్నారు. కొత్త పంట తెలంగాణ వివిధ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ప్రతిరోజూ దాదాపు 1,500 టన్నుల ఉల్లి మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. గత ఏడాది ఈ సీజన్లో హోల్‌సేల్‌గా కిలో ఉల్లి రూ.30 వరకు చేరగా ఈ ఏడాది రూ.10లోపే ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సీజన్లో మలక్‌పేట్ మార్కెట్‌కు 50 నుంచి 60 లారీల ఉల్లి ఉత్పత్తులు వచ్చాయి. ఈ ఏడాది ప్రతిరోజూ 110 లారీల ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువ మొత్తంలో దిగుమతులు జరగడంతో రిటైల్ మార్కెట్లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. ఇదే గత ఏడాది రిటైల్‌గా ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు చేరాయి. పెరిగిన స్థానిక ఉల్లి దిగుమతులు.. నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతులతోనే పూర్తి అవుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువగా మార్కెట్‌కు దిగుమతి అయితే దాన్ని నిల్వ చేసుకోవడానికి స్టోరేజీ సౌకర్యం మార్కెట్లలో లేకపోవడంతో హోల్‌సేల్ వ్యాపారులు నిల్వ చేసుకుంటున్నారు. ధరలు అదుపులోనే ఉంటాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్త లోకల్ ఉల్లి పంట మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతి అవుతోంది. పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.15 వరకు ధర పలుకుతోంది. చిన్న గడ్డకు రూ.8 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా పెరగవు. ఎందుకంటే కొత్త పంట రావడంతో ధరలు అదుపులొకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది దిగుమతులు రెట్టింపు అయ్యాయి. – అనంతయ్య, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, మలక్‌పేట్ మార్కెట్ -
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి!
కర్నూలు ,(వైఎస్ఆర్ సర్కిల్): ఉల్లికి గిట్టుబాటు ధర లభించక రైతులు రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేస్తుండగా.. మార్కెట్లో అదే ఉల్లిని కొనుగోలు చేయలేక వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వ్యాపారుల చేతివాటం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉల్లిని అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చదంగా మారింది. జిల్లాలో ఈ ఏడాది ఉల్లి దిగుబడి పెరగడంతో ఒక్క సారిగా మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇదే సమయంలో గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టించిన రైతుకు ఆదాయం మిగలకపోగా.. పెట్టుబడి చేతికందలేదు. దళారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. కొద్ది రోజులుగా కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటం ఉల్లి రూ.400 నుంచి రూ.500 మాత్రమే ఉంది. దీంతో ఒకే రోజులో పడిపోతున్న ధరల వ్యత్యాసాలను జీర్ణించుకోలేక రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు కొకొల్లలు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఉల్లి వినయోగదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వ్యాపారులు, దళారులు అధిక ధరలకు ఉల్లిని విక్రయిస్తుండటంతో కొనుగోలు చేయలేకపోతున్నారు. మార్కెట్ మాయజాలం.. మార్కెట్ యార్డులో రైతుల వద్ద కిలో ఉల్లిని రూ.4 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు అదే ఉల్లిని బహిరంగ మార్కెట్లలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. దుకాణదారులకు హోల్‌సేల్‌గా కిలో రూ.15 నుంచి రూ.20 ఇస్తుండగా, వారు రిటైల్‌గా రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని అన్ని హోల్‌సేల్ మార్కెట్లకు, ప్రధాన పట్టణాలకు ఏడాదిలో కొన్ని నెలల పాటు కర్నూలు యార్డు నుంచే దిగుమతి అవుతాయి. అలాగే మరి కొద్ది రోజులు మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్, అహ్మద్‌నగర్, గోడేగావ్ తదితర ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. స్థానిక యార్డులో క్వింటం ఉల్లి రూ.400 నుంచి రూ.500 వరకు ధర ఉన్న నేపథ్యంలో స్థానిక మార్కెట్లలో మాత్రం వ్యాపారులు ఆ మేర ధరలు తగ్గించిన దాఖలాలు లేవు. ట్రాన్స్‌పోర్టు నిమిత్తం కేజీకి ఒక్క రూపాయి మాత్రమే భారమవుతుండ గా మార్కెట్లో కేజీ ఉల్లి రూ.7 నుంచి రూ.10 వరకు విక్రయించాల్సి ఉంది. అయితే వ్యాపారులు రెట్టింపు ధరకు విక్రయిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు. కొత్త సరుకు.. పాత ధర గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు నష్టపోతుండగా వ్యాపారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు. కొత్త సరుకును పాత ధరలకే విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎక్కడైన వినియోగదారులు ప్రశ్నిస్తే పాత స్టాక్ అంటూ చెబుతూ దోచుకుంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ట్రాన్స్‌పోర్టు మినహాయించుకొని ఆ ధరల ఆధారంగానే వినియోగదారులుకు విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. మార్కెట్ లో ఉల్లి ధర లొల్లి కొనసాగుతున్నా.. అధికార యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. ధరలను నియంత్రించాలి ఉల్లికి ధరలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. కొందరు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కెట్లో చూస్తే కిలో ఉల్లి రూ.20కి పైగా ధర పలుకుతోంది. రైతుకు గిట్టుబాటు కాని ధర వ్యాపారి మాత్రం లాభాలను ఆర్జిస్తుంది. అధికారులు చర్యలు తీసుకుని ధరలను నియంత్రించాలి. రమేష్, ఉపాధ్యాయుడు, కర్నూలు -
దిగుబడి తగ్గి.. దుఃఖం మిగిలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఉల్లి పండించే రైతులకు మాత్రం ఎలాంటి మేలూ జరగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గినా..గిట్టుబాటు ధర లభించడం లేదు. తీవ్ర నష్టాలు వచ్చి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రంలో ఉల్లి పంట అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే సాగు అవుతోంది. ఖరీఫ్ సాధారణ సాగు 20,357 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 18,500 హెక్టార్లలో సాగైంది. దిగుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఎకరాకు కనీసం 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చి.. ధర రూ.1500 లభిస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఈ ఏడాది వర్షాభావంతో ఉల్లి పంట దెబ్బతిని..ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు కూడా రావడం లేదు. కర్నూలు మార్కెట్లో ధర రూ.800 కూడా పలకడం లేదు. పట్టించుకోని ప్రభుత్వం.. ధరలు లేనపుడు ఉల్లి రైతులు నష్టపోకుండా టీడీపీ మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న పరటాల సునీత.. కర్నూలు మార్కెట్‌ను సందర్శించి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నదాతలకు భరోసానిచ్చారు. ధరలేనప్పుడు ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. హామీ ప్రస్తుతం అమలు కావడం లేదు. ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు బలవన్మరణాలకు పాల్పడారు. ధర వచ్చింటే బాబూరావు బతికుండేవాడేమో.. సి.బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన బండారి బాబురావు రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. అప్పు తెచ్చి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల్లో కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. దీనిని కర్నూలు మార్కెట్‌కు తీసుకరాగా.. క్వింటాకు రూ.600 మాత్రమే ధర లభించింది. చేతికి రూ.21 వేలు మాత్రమే రావడంతో అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న కర్నూలు మార్కెట్ యార్డులోనే పురుగుల మందుతాగాడు. చికిత్స పొందుతూ... శనివారం మృతిచెందాడు. గిట్టుబాటు ధర వచ్చి ఉంటే బాబురావు బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. 90 శాతం రైతులకు అతి తక్కువ ధరే.. కర్నూలు మార్కెట్‌కు వచ్చే ఉల్లి రైతుల్లో పది శాతం మందికి క్వింటాకు రూ.300లోపే ధర లభిస్తోంది. 30 శాతం మంది రైతులకు రూ.301 నుంచి రూ.600 వరకు ధర వస్తోంది. ఎక్కువగా 50 శాతం మంది తెచ్చిన సరుకుకు రూ.601 నుంచి రూ.800 వరకు ధర లభిస్తోంది. మొత్తం 90 శాతం మంది రైతులకు గిట్టుబాటు ధర లేదనే చెప్పొచ్చు. కేవలం 10 శాతం మంది రైతులకు మాత్రమే రూ.1000 ఆపైన ధర లభిస్తోంది. నష్టాలను ఎలా భరించాలి? మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేశాను. పెట్టుబడులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోతే అప్పు తెచ్చుకున్నాను. ఎకరాకు రూ.50 వేల ప్రకారం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడక పంట అభివృద్ధి చెందలేదు. బోరు ఉన్నా నీరు అడుగంటి పోయింది. దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ప్రస్తుత ధరల్లో అమ్ముకుంటే రూ.60వేలు కూడా దక్కే పరిస్థితి లేదు. నష్టం రూ.90వేల వరకు ఉంటోంది. ఇంత భారీ స్థాయిలో నష్టాలను ఎలా భరించాలో తెలియడం లేదు. వెంకటేష్, పొన్నకల్ గ్రామం, గూడూరు మండలం -
కొండెక్కిన ఉల్లి ధర
న్యూఢిల్లీ: ఉల్లి ధర చుక్కలనంటుతోంది. దేశ రాజధానిలో కిలో ఉల్లి చిల్లరధర రూ.80 పలుకుతోంది. సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర మెట్రో నగరాల్లోనూ రూ. 50 నుంచి 70 దాకా ఉంది. ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరఫరా చాలా తగ్గిందని.. దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి కూడా పడిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్ర లసల్గావ్ మండికి వచ్చే ఉల్లి సరఫరా 47 శాతం తగ్గింది. గతేడాది ఇదే సమయంలో 22,933 క్వింటాళ్ల ఉల్లి అందుబాటలో ఉండగా.. ఇప్పుడు అది 12 వేల క్వింటాళ్లకు తగ్గింది. గతేడాది లసల్గావ్లో కేజీ ఉల్లి రూ.7.50కి విక్రయించగా.. ఇప్పుడు రూ. 33కు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. -
ఉల్లి ధరలకు కేంద్రం చెక్
సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలకు చెక్ పెడుతూ దేశంలో సరఫరాలను పెంచేందుకు ఉల్లికి టన్నుకు 850 డాలర్ల కనిష్ట ఎగుమతి ధర(ఎంఈపీ)ను గురువారం ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ధర కన్నా తక్కువగా ఉల్లి ఎగుమతులను అనుమతించరు. ఉల్లి ధరలు రోజురోజుకూ భారమవుతున్న క్రమంలో 2015 డిసెంబర్లో తొలగించిన ఎంఈపీ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ టన్నుకు 850 డాలర్ల ఎంఈపీపై ఉల్లి ఎగుమతులను అనుమతిస్తామని డైరెక్టరేట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్లో వెల్లడించింది. లెటర్ ఆఫ్ క్రెడిట్పైనే అన్ని రకాల ఉల్లి ఎగుమతులను అనుమతిస్తారని పేర్కొంది. ఉల్లి ధరల పెరుగుదలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు ఎంఈపీ నిర్ధేశించాలని ఆర్థిక శాఖను కోరిన విషయం తెలిసిందే. దేశీయ మార్కెట్లో ఉల్లి సరఫరాలు తగ్గడంతో రిటైల్ మార్కెట్లలో ఉల్లి ధరలు కిలోకు రూ 50 నుంచి రూ 65 వరకూ పలుకుతున్నాయి. ఉల్లి ధరలు దిగివచ్చేలా ప్రభుత్వం 2000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం ఎంఎంటీసీని ఆదేశించింది.మరోవైపు నాఫెడ్, ఎస్‌ఎఫ్‌ఏసీ ద్వారా పదివేల టన్నుల ఉల్లిని సేకరించాలని కోరింది. -
వామ్మో ఉల్లి.. పెరిగింది మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ఘాటెక్కింది. తాత్కాలిక కొరతతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.20–25 ఉన్న ఉల్లి.. ఇప్పుడు దాదాపు రెట్టింపయింది. రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 వరకు పలుకుతోంది. మలక్‌పేట్ మార్కెట్లో హోల్‌సేల్‌గా నాణ్యమైన ఉల్లి కిలో రూ.28.. మెత్తబడి, అంతగా బాగా లేని ఉల్లి రూ. 20 వరకు పలుకుతోందని మార్కెటింగ్ వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ కొరత వల్ల రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. 10 రోజుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు ఉంటాయి. వీటిలో మహారాష్ట్ర నుంచే రాష్ట్రానికి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అయితే దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గావ్లో 10 రోజుల్లోనే 80 శాతం మేర ఉల్లి ధరలు పెరిగినట్లు తెలిసిందని, ఆ కారణంగానే తెలంగాణలో ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గతేడాది ఉల్లికి గిట్టుబాటు కాక ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందని, దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని మార్కెట్లు వారం రోజులు మూసేస్తారని, ఆ ప్రభావమూ ధరల పెరుగుదలపై ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లోనే.. మార్కెట్లో ఉన్న ఉల్లి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉత్పత్తి అయిందే. నిల్వ చేసిన ఉల్లిలోనూ 30 శాతం వరకు వానలకు దెబ్బతిన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడం.. భారీ వర్షాలు, వరదలతో పంట దెబ్బతిని ఉల్లి మార్కెట్‌కు రావడం లేదు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో 10 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. దీంతో రాష్ట్ర అవసరాలు తీరడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారని ఆరోపణలున్నాయి. పెరిగింది వాస్తవమే.. మహారాష్ట్ర సహా ఉల్లి సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నది. వర్షం, తేమ వల్ల నిల్వ ఉంచిన ఉల్లి చెడిపోతోంది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కిలో రూ.40 పలుకుతోంది. ఇది తాత్కాలికమే. త్వరలో ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం. – పార్థసారథి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి -
ఉల్లి రైతు కన్నీరు
-
ఉల్లి కొంటే కన్నీరే!
♦ నిన్న కిలో రూ. 15... నేడు రూ. 30లు ♦ కలవరపడుతున్న వినియోగదారులు ♦ దిగుబడి తగ్గడంవల్లే ఈ పరిస్థితి ఉల్లి కోస్తే కాదు... ఇప్పుడు కొంటే కన్నీరు పెట్టాల్సి వస్తోంది. నిన్నమొన్నటి వరకూ కనీసం రూ. 15 లు దాటని దీని ధర ఒక్కసారిగా రెట్టింపవ్వడమే ఇందుకు కారణం. అసలే నిత్యావసర సరకులు... కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుంటే ఇప్పుడు ఉల్లి సైతం ఆ జాబితాలో చేరడంతో జనం లబోదిబో మంటున్నారు. సాలూరు: ఉల్లిపాయల ధర అమాంతంగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు గుండెలు బాదుకుంటున్నారు. నిన్న కిలో 15రూపాయలకే దొరికిన ఉల్లి, తెల్లారేసరికి రెట్టింపు కావడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు కిలోలు కొనేందుకు బజారుకు వెళ్లిన మహిళలు, వ్యాపారులు చెబుతున్న ధరతో నోరెళ్లబెడుతున్నారు. జిల్లాకు అవసరమైన ఉల్లి ఎక్కువగా కర్నూలునుంచే వస్తుంది. కాస్తోకూస్తో ఒడిశా నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఉల్లిపంటకు తీవ్ర నష్టం వాటిల్లడంతో, కర్నూలు నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. దీనివల్లే ఇక్కడ ధరలు భారీగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లిపంట తీవ్రంగా నష్టపోవడంతో, దిగుబడులు తగ్గడంతోపాటు ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది. నిల్వ చేసుకున్నవారికి కాసులు అధికమొత్తంలో ఉల్లిని దిగుమతి చేసుకున్న వ్యాపారులకు ఒక్కసారిగా లాభాలు వచ్చిపడ్డట్టయింది. కర్నూలుæ మార్కెట్లో ధర పెంచేయడంతో స్థానిక మార్కెట్లో సైతం ధరను పెంచేసి అమ్మకాలు చేస్తున్నారు. కిలో రూ. 10ల నుంచి రూ. 12ల చొప్పున హోల్‌సేల్ ధరకు కొన్న వ్యాపారులు ఇప్పుడు స్థానిక మార్కెట్లో కిలో రూ. 30 లకు అమ్మడంతో రెట్టింపు లాభాలు వస్తున్నాయి. కిలో రూ. 50కు చేరుతుందంట మరికొద్ది రోజుల్లో కిలో ఉల్లి 50 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఉల్లివ్యాపారులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్లో వున్న నిల్వలు అయిపోతే ఆ పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. విషయం మహిళల చెవికి చేరడంతో గగ్గోలు పెడుతున్నారు. గుట్టుగా ఏదో సంసారం సాగిస్తున్నామనుకుంటున్న వారు పెరిగిన ఉల్లిధరతో రోడ్డునపడినట్టయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటివరకూ టమాటాతోనే సతమతమైతే ఇప్పుడు ఉల్లికీ అదే పరిస్థితి ఏర్పడటంపై కలవరపడుతున్నారు. -
ఉల్లి.. తల్లడిల్లి...
- కిలో ఉల్లి 50 పైసలే.. దారుణంగా పడిపోయిన ధర - ఉసూరుమంటున్న ఉల్లి రైతులు హైదరాబాద్: గత ఏడాది ఆకాశాన్నంటిన ధరతో కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. దీంతో కిలో ఉల్లి ధర రూ.5 నుంచి 50 పైసలకు తగ్గిపోయింది. ఉల్లి దిగుమతి పెరగడం వల్ల ఒక్కసారిగా ధరలు పడిపోవడం ఉల్లి రైతులకు శాపంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్ నుంచి వారం రోజులుగా నిత్యం 25 వేల నుంచి 32 వేల బస్తాల వరకు ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ఉల్లి ధరలు కిలో రూ.5 నుంచి 50 పైసల వరకు తగ్గింది. దీంతో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మూడో రకం ఉల్లిని క్వింటాకు రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లో ఉల్లిని నిల్వ చేసేందుకు తగిన స్థలం దొరక్కపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహా రాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుబడి అరుున ఉల్లి రూ.5 నుంచి రూ.10 వరకు(మొదటి రకం) ధర పలికింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన మొదటి రకం ఉల్లిని ప్రభుత్వం క్వింటాకు రూ.800 నుంచి రైతుల వద్ద కొనుగోలు చేస్తోంది. రెండో రకం ఉల్లిని రూ.500, రూ.300, రూ.200 వరకు కొనుగోలు చేస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో 31 వేల బస్తాల ఉల్లి దిగుమతి అరుునా క్వింటాకు రూ.3 వేలు, కిలో రూ.30 లెక్కన అమ్మకాలు జరిగారుు. దీంతో రైతులు ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో ఉల్లి పంట విపరీతంగా వేశారు. అయితే ఈ ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడంతో కొనుగోలు ధర తగ్గిపోరుు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గిట్టుబాటు ధర లేక మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఉల్లి నిల్వలను పారబోశారు. కాగా, వర్షాలు ఎక్కువగా పడటం, ఉల్లి నిల్వ లేకుండా కుళ్లిపోవటం తదితర కారణాల వల్లే ఈ ఏడాది ఎక్కువ ధర రాలేదని అధికారులు చెపుతున్నారు. అధిక దిగుబడే ధర తగ్గడానికి కారణం ఉల్లి దిగుబడి పెరగడం.. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎక్కువగా రావటం, పచ్చి ఉల్లి తీసుకురావటం మొదలైనవి ఉల్లి ధర తగ్గుదలకు కారణమని, దీనికి తోడు వర్షాలు భారీగా కురవటం కూడా ప్రభావం చూపిందని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ అసిస్టెంట్ ఎస్జీఎస్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అరుుతే ప్రభుత్వ ఆదేశానుసారం రైతులకు ఇబ్బందులు లేకుండా ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. -
11వ నెలా మైనస్‌లోనే..!
టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.54% క్షీణత అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ప్రభావం సామాన్యునికి తప్పని ఉల్లిఘాటు.. 114% పెరిగిన ధరలు పప్పు దినుసుల ధరలు 39 శాతం అప్ న్యూఢిల్లీ: టోకు ధరలకు సంబంధించి ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -4.54 శాతంగా ఉంది. అంటే 2014 సెప్టెంబర్‌తో పోల్చి చూస్తే (2.38 శాతం)... టోకున పలు ఉత్పత్తుల బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా -4.54 శాతం క్షీణించాయన్నమాట. ఇలాంటి పరిస్థితి 11 నెలలుగా కొనసాగుతోంది. క్రూడ్‌సహా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతుండడం దేశంలో టోకు ధరల క్షీణతకు కారణం. భారత్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఈ ధోరణి కలిసి వస్తున్నదేనని నిపుణుల అభిప్రాయం. కాగా టోకు ద్రవ్యోల్బణంలో ఒక విభాగంగా ఉన్న ఆహార ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇది సామాన్యునికి ప్రతికూల అంశమే.. మూడు విభాగాలనూ చూస్తే.! ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్ కేటగిరీలతో ఉన్న ఈ విభాగం (వెయిటేజ్ 20 శాతం)లో టోకు ద్రవ్యోల్బణం రేటు వార్షికంగా 2.09 శాతం ఎగసింది. ఇందులో 14% వెయిటేజ్ ఉన్న ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 0.69%గా ఉంది. 6% వెయిటేజ్ ఉన్న నాన్-ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు 2.61 శాతంగా ఉంది. ఫ్యూయెల్ అండ్ పవర్: 15% వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు అసలు పెరక్కపోగా (క్షీణత) మైనస్ 18 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తులు: 65 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో రేటు సైతం క్షీణతలో -1.73 శాతంగా ఉంది. పెరిగిన ఉల్లి, పప్పు దినుసులు... ఉల్లి ధరలు వార్షికంగా 114 శాతం ఎగశాయి. పప్పు దినుసుల ధరలు 39 శాతం పెరిగాయి. గడచిన నాలుగు నెలల్లో పప్పు దినుసుల ధరల పెరుగుదల 36 శాతంపైనే వుంటోంది. అయితే కూరగాయల ధరలు మాత్రం 9 శాతం తగ్గాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 2.02 శాతం పెరిగాయి. పాల ధరలు 2.16 శాతం ఎగశాయి. గోధుమల ధరలు 3.34 శాతం పెరిగాయి. అయితే ఆలూ ధరలు మాత్రం 57 శాతం తగ్గాయి. బ్యాంకులు రేట్లు తగ్గించే వీలు: పరిశ్రమ ద్రవ్యోల్బణం నిర్దేశిత స్థాయిలో ఉంటున్నందువల్ల బ్యాంకులకు రుణ రేటు మరింతగా తగ్గించే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది 1.25% రెపో రేటు (బ్యాంకులు తమ అవసరాలకు ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణంపై చెల్లించే వడ్డీరేటు-ప్రస్తుతం 6.75%) కోత నిర్ణయం తీసుకుంటే... ఈ ప్రయోజనంలో కేవలం సగం మాత్రమే బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించిన విషయాన్ని పరిశ్రమలు గుర్తుచేస్తున్నాయి. వ్యవస్థలో రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరక్కుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశాయి. పప్పుదినుసుల ధరలపై సమీక్ష.. పప్పు దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని అంతర్-మంత్రిత్వ శాఖల బృందం పరిస్థితిని సమీక్షించింది. దిగుమతైన పప్పు దినుసుల రేట్లను కట్టడి చేసే దిశగా రవాణా, ప్రాసెసింగ్ తదితర వ్యయాల కోసం ధరల స్థిరీకరణ ఫండ్ నిధులను ఉపయోగించాలని నిర్ణయించినట్లు జైట్లీ పేర్కొన్నారు. దీనివల్ల సరఫరా మెరుగుపడి, రిటైల్ మార్కెట్లలో పప్పు దినుసులు తక్కువ రేట్లకు లభ్యం కాగలవన్నారు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా దిగుమతి చేసుకున్న సరుకుతోపాటు కొంత బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు జైట్లీ పేర్కొన్నారు. రేట్ల కట్టడికి మరో 2,000 టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోర్టుల్లో ఉన్న 5,000 టన్నులు, రవాణాలో ఉన్న మరో 2,000 టన్నుల పప్పు దినుసులకు ఇది అదనం. -
దిగివస్తున్న ఉల్లి...
♦ సగానికి తగ్గిన ధరలు ♦ సబ్సిడీ విక్రయ కేంద్రాలకు త్వరలో స్వస్తి ♦ ఉల్లి దిగుబడులపై మార్కెటింగ్ శాఖ ఆశాభావం సాక్షి, హైదరాబాద్: రెండు నెలలుగా వంటింట్లో కన్నీరు పెట్టించిన ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరో వారం రోజుల్లో ఉల్లి ధర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ధర కంటే తక్కువగా ఉండనుందని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో సబ్సిడీ విక్రయ కేంద్రాలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ధరల స్థిరీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో విక్రయ కేంద్రాల ఎత్తివేతపై నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 88 కేంద్రాల ద్వారా కిలోకు రూ.20 చొప్పున సబ్సిడీ ధరపై మార్కెటింగ్ శాఖ ఉల్లిని విక్రయిస్తోంది. రాష్ట్రంలో ఉల్లి లావాదేవీల్లో ప్రధానమైన మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్లో ఆగస్టు 25న కిలో ఉల్లి ధర గరిష్టంగా రూ.68 పలి కింది. ప్రస్తుతం అత్యంత నాణ్యమైన నాసిక్ రకం ఉల్లి ధర కిలోకు గరిష్టంగా రూ.32 పలుకుతోంది. కర్నూలు రకం ధర కనిష్టంగా కిలోకు రూ.25కు పడిపోయింది. మహరాష్ట్రలోని లాసల్‌గావ్‌తో పాటు స్థానిక దిగుబడులు మార్కెట్‌కు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలుతో పాటు ఆలంపూర్, సదాశివపేట, దేవరకద్ర తదితర మార్కెట్లకు ఉల్లి దిగుబడులు పెరిగాయి. మరో వారం రోజుల్లో తాజా దిగుబడులు మార్కెట్లకు వెల్లువెత్తే అవకాశమున్నందున ధరలు మరింత పడిపోతాయని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. ‘సబ్సిడీ’ విక్రయాలకు త్వరలో స్వస్తి ఉల్లి ధరలు పెరగడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం సబ్సిడీ విక్రయకేంద్రాలను ప్రారంభించింది. మలక్‌పేటతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇప్పటి వరకు రూ.24.85 కోట్లు వెచ్చించి 5,309.02 మెట్రిక్ టన్నుల ఉల్లిని మార్కెటింగ్ విభాగం సేకరించింది. ఇందులో 5,157.44 మెట్రిక్ టన్నుల ఉల్లి విక్రయం ద్వారా 10.61 కోట్లను తిరిగి రాబ ట్టింది. కేంద్రం నుంచి మొదటిసారిగా ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.9.81 కోట్లు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని భరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గుతుంటుండటంతో త్వరలో సబ్సిడీ ఉల్లి విక్రయాల్ని నిలిపివేయాలని భావిస్తోంది. -
పేదలకందని రాయితీ ఉల్లి
- ఇబ్బంది పడుతున్న జనం - గ్రామాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి రామాయంపేట: అమాంతం పెరిగిపోతున్న ఉల్లి ధరతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న వారికి రాయితీపై ఉల్లి సరఫరా చేస్తోంది. అయితే పేదలు ఎక్కువగా ఉండే పల్లెలపై దృష్టి పెట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉల్లి ధరను నియంత్రించడంలో ప్రభుత్వాలు, అధికారులు విఫలమవుతున్నారని జనం మండిపడుతున్నారు. పట్టణ ప్రజలకు మాత్రమే రాయితీపై ఉల్లి విక్రయించడం సరికాదని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. చిన్న రకం అయితే ఈ ధర. వ్యాపారం తగ్గింది ఉల్లి ధర ఆకాశాన్ని అం టుతుండడంతో వ్యాపా రం పూర్తిగా పడిపోయిం ది. చాలా మంది ఉల్లి కొనడమే మానేశారు. ఐ దారు కిలోలు కొనుగోలు చేసే వారు ప్రసు్తతం కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే చ ర్యలు తీసుకొని ఉల్లి ధరలు త గ్గించాలి. - సంతోష్, వ్యాపారి, రామాయంపేట రాయితీ ప్రకటనలకే పరిమితం రాయితీపై ఉల్లి సరాఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితమైంది. పట్టణ ప్రజలకు మాత్రమే రాయితీ సదుపాయం కల్పిం చారు. గ్రామీణ ప్రాంత ప్రజలను మరి చారు. ఈ విధానం సరికాదు. గ్రామాల్లో కూడా ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. - బాలమణి, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఉల్లి కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి కొనాలంటే భయమేస్తోంది. కిలో రూ. 60 ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రాయితీ సదుపా యం పట్టణాలకే పరిమితమైంది. గ్రామీణ ప్రజలను పట్టించుకోకపోవడం దారుణం. వెంటనే గ్రామాల్లో కూడా ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. - గుర్రాల నాగులు, తిప్పనగుల్ల -
ఉల్లికి బీహార్ ఎన్నికలకు లింకేమిటి?
పాట్నా: ఇటీవల మార్కెట్లను రెండు పరిణామాలు కుదిపేశాయి. ఉల్లి ధర ఊహించని విధంగా రాకెట్లాగా ఆకాశంలోకి దూసుకెళ్లగా, ఆకాశం నుంచి నేలకు దూసుకొచ్చిన రాకెట్లా స్టాక్ మార్కెట్ ఢమాల్న కూలింది. ఉల్లిపైనైనా పెట్టుబడులు పెట్టకపోతిమంటూ స్టాక్ ఇన్వెస్టర్లు లబోదిబోమంటూ విలపించారు కూడా. ఈ రెండు పరిణామాలకు కారణాలు వేర్వేరు. ఒకదానికొకటి సంబంధం లేదు. అలాగే కారణాలు వేరైనా, కాకతాళీయమేనైనా బీహార్ ఎన్నికలు సమీపించినప్పుడల్లా మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరిగాయి. ఈ సారి కూడా అక్టోబర్ చివరి వారంలోగానీ, నవంబర్ మొదటి వారంలోగానీ జరిగే అవకాశం ఉంది. 2005లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉల్లి ధరలు భగ్గుమన్నాయి. జాతీయంగా ఉల్లి ధరలు సరాసరి 240 శాతం పెరగ్గా, పాట్నా మార్కెట్లో 230 శాతం పెరిగాయి. అలాగే 2010లో బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయంగా ఉల్లి ధరలు సరాసరి 155 శాతం పెరగ్గా, పాట్నా మార్కెట్లో 177 శాతం పెరిగాయి. 2005కు ముందు జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఉల్లి ధరలు పెరిగే ఉంటాయి. లెక్కలు తేల్చేందుకు గణాంకాలు అందుబాటులో లేవు. మార్కెట్లో ఉల్లి జాతీయ సగటు ధర జనవరిలో క్వింటాల్‌కు 1,325 రూపాయలుండగా, నేడు అది 3,300 రూపాయలకు చేరుకుంది. అంటే... దాదాపు 150 శాతం పెరిగింది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు లెక్కల ప్రకారం ఏటా భారతీయులు కోటిన్నర టన్నుల ఉల్లిని వినియోగిస్తారు. ఈ సారీ ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంగానీ, పంట నాశనంగానీ అంతగా జరుగలేదు. రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్నా జాతీయంగా మార్కెట్ వినియోగం కన్నా తగ్గిందీ కేవలం నాలుగు లక్షల టన్నులు మాత్రమే. అంతమాత్రానికి ఉల్లి ధర ఏకంగా 150 శాతం పెరగాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు పెరిగిందనే ప్రశ్న రావచ్చు. పెద్ద మార్కెట్ శక్తులు కుమ్మక్కవడం, మధ్యస్థాయి మార్కెట్ శక్తులను ఉల్లి కొనుగోలుకు అనుమతించకుండా బడా వ్యాపారస్థులు అడ్డుపడడమే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ బడా మార్కెట్ శక్తులను నియంత్రించేందుకు ప్రభుత్వపరంగా మార్కెట్ శాఖలు ఎక్కడికక్కడ ఉన్నా అవి మార్కెట్ మాయాజాలంలో డబ్బుకు దాసోహం అవుతున్నాయి. -
ఉల్లి దోసెకు విరామం
* గుంటూరు, కృష్ణా జిల్లాల హోటళ్ల యజమానుల నిర్ణయం * ధర దిగొచ్చే వరకూ ఇదే పరిస్థితి * బెంబేలెత్తిస్తోన్న ఉల్లి సాక్షి, విజయవాడ బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల నుంచి ఉల్లి దోసె దొరకడం గగనమైంది. ఉల్లి దోసె, సమోసాల విక్రయాలకు పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల యజమానులు తాత్కాలిక విరామం పలికారు. ‘సారీ సార్... ఉల్లి దోసె వేయడం లేదు’ అని సమాధానమిస్తున్నారు. మార్కెట్లో ఉల్లి ధర చుక్కలనంట డమే దీనికి కారణం. ధర దిగొచ్చే వరకూ ఉల్లి దోసె కష్టమేనని బదులిస్తున్నారు. దీంతో ఉల్లిదోసె ప్రియులకు కష్టమొచ్చి పడినట్లయ్యింది. వీరు నోరు కట్టేసుకుని ఇడ్లీ, సాదా దోసెలతో సరిపుచ్చుకుంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోని హోటళ్లలో రోజుకు సగటున 20 క్వింటాళ్ల ఉల్లిపాయల వాడకం ఉంటుందని అంచనా. గుంటూరు నగరంలో ఉల్లితో తయారు చేసే తినుబండారాల ద్వారా రోజుకు రూ. 30 లక్షల నుంచి 35 లక్షల వ్యాపారం ఉంటుందని సీనియర్ హోటల్ వ్యాపారి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయల ధర కిలో రూ.65 నుంచి రూ.70 వరకూ పలుకుతోంది. ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా రూ.20 లకే సరఫరా చేస్తున్నా, అవన్నీ గృహ అవసరాలకే సరిపోవడం లేదు. ఇక హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు ఎక్కడ దొరుకుతాయని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధిక ధర పెట్టి ఉల్లిపాయలు కొని ఉల్లి దోసెను అందుబాటులో ఉంచాలంటే ప్రస్తుతం ఉన్న దోసె రేటును రెట్టింపు చేయాల్సి ఉంటుందనీ, ఆ విధంగా రేటు పెంచితే కస్టమర్లు రారని, దీంతో వాటికివిరామం ఇచ్చామని చెబుతున్నారు. -
ఉల్లిక్కిపాటు
ఉల్లిపాయ..ఈ పేరు చెబితే జనం ఉలిక్కిపడుతున్నారు. ఉల్లి ధరలు పెరిగి నెల కావస్తున్నా.. ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. కేవలం రైతు బజార్లలో కిలో 20 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న పాలకులు డిమాండ్‌కు తగ్గట్టుగా ఇక్కడ కూడా సరఫరా చేయడంలేదు. దీంతో రెండు కేజీలో ఉల్లిపాయల కోసం కాళ్లు వాచిపోయేలా..గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అయినా..బహిరంగ మార్కెట్లో కిలో సుమారు రూ. 50 నుంచి 60 రూపాయలు పలుకుతుండడంతో జనం రైతు బజార్ల బాటపడుతున్నారు. పీఎన్‌కాలనీ:ఉల్లిపాయల ధరలు అమాంతం పెరగడానికి కారణాలు ఏమైనప్పటికీ..జనానికి మాత్రం పాట్లు తప్పడం లేదు. వ్యాపారులే కావాలని కృత్రిమ కొరత సృష్టించడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు నిత్యం కర్నూలు, నాసిక్, లాసెన్గౌవ్, బళ్లారి నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది. ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య కారణాలతో సరఫరాను నిలిపివేశారు. దీంతో జిల్లా వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు రోజుకు దాదాపుగా 40 టన్నులు అవసరం ఉన్నప్పటికీ రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లకు కలిపి కేవలం 27 టన్నులే సరఫరా చేస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది దళారులు కృత్రిమ కొరతను సృష్టించి ఏకంగా లక్షల సొమ్మును పోగుచేసుకుంటున్నారే విమర్శలు వస్తున్నాయి.పనులు మానేసి రైతుబజార్ల బాట బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.50 నుంచి 60 రూపాయలు పలుకుతుండడంతో రైతు బజార్లవైపు జనం పరుగుతీస్తున్నారు. పేద, మధ్యతరగతి, ఉద్యోగులనే తేడాలేకుండా రెండు కిలలో సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజార్లలో పడిగాపులు పడుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారులు, కార్మికులు పనులు మానేసి ఉల్లికోసం రైతు బజార్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా కుటుంబ సభ్యులతో వచ్చి ఒక్కో కౌంటర్లో రెండేసి కేజీలు తీసుకుని వాటిని బయట రూ. 50 నుంచి 60 రూపాయలకు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రైతుబజారు అధికారులు గమనించి ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఒరిజినల్ రేషన్‌కార్డు తీసుకురావాలని నిబంధనను తీసుకొచ్చారు. దీంతో కొంతవరకు అక్రమాలు అరికట్టగలిగారు. అయితే రోజుకో కార్డు తీసుకురమ్మని అధికారులు చెబుతుండడంతో ఉల్లిపాయల కోసం వచ్చేవారు తికమకపడుతున్నారు. దీనికితోడు జనం తాకిడి ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ శ్రీకాకుళం రైతు బజార్లో కేవలం నాలుగు కౌంటర్లలోనే ఉల్లిని విక్రయిస్తున్నారు. దీంతో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ల సంఖ్యను పెంచాలని అధికారులను వేడుకుంటున్నారు. బుధవారం నాడు హోరు వర్షంలో కూడా జనం ఉల్లిగడ్డల కోసం రైతు బజార్లో నిరీక్షించారంటే డిమాండ్ ఎంతలా ఉందో అధికారులు గమనించాలని ప్రజలంటున్నారు. గ్రామీణుల పరిస్థితి మరీ ఘోరం! జిల్లాలోని ఆమదాలవలస, శ్రీకాకుళంలో మాత్రమే రైతు బజార్లు ఉన్నాయి. ఈ రెండుచోట్టే సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తున్నారు. అలాగే ఐటీడీఏ పరిధిలో జీసీసీ ద్వారా సంతల్లో విక్రయిస్తున్నారు. దీంతో ఈప్రాంతాల్లో ఉన్నవారి పరిస్థితి కొంతమెరుగ్గా ఉండగా.. గ్రామీణుల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. వీరు కిలో ఉల్లిని సుమారు 60 రూపాయల చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వీరు సబ్బిడీ ఉల్లికి నోచుకోనప్పటికీ అధికారులు పట్టించుకోడం లేదు. తగినన్ని సరఫరా లేకపోవడమే కారణం జిల్లా ప్రజల వినియోగానికి తగ్గట్టుగా ఉల్లి సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు రైతు బజార్ల వద్ద క్యూల్లో ఉంటున్నారు. జనాభాకు తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేద్దామంటే వినియోగదారులు అన్ని కౌంటర్లలో తీసుకుంటున్నారు. అవసరానికి తగ్గట్టుగా పంపిణీ చేస్తే సమస్య ఉండదు. -
‘ఉల్లి’పోటు!
చిత్తూరు (అర్బన్), తిరుపతి రూరల్: ఉల్లి ధర బయట భగ్గు మంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకెళ్లి ఎక్కిరిస్తోంది. ఈ నేపథ్యంలో రైతు బజారుకొస్తున్న సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఎగబడుతున్నారు. కొత్త సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టు పలువురు బారులు తీరుతున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు రైతు బజార్లకు బుధవారం సబ్సిడీ ఉల్లిపాయలొచ్చాయి. కిలో రూ.20 వంతున అధికారులు విక్రయానికి సిద్ధమయ్యారు. ఉల్లిపాయల కోసం జనం ఎగబడ్డారు. ఉదయం 5 గంటల నుం చే క్యూలైన్లలో వేచి ఉన్నారు. చిత్తూరులోని రైతు బజార్లో 5 కౌంటర్లు ఏర్పా టు చేశారు. అయినా ఇబ్బందులు తప్పలేదు. అరుపులు, తోపులాటలు మిన్నంటాయి. చివరకు పోలీసుల జోక్యంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వినియోగదారుల తాకిడి ఎక్కువవ్వడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉల్లిపాయలు ఇచ్చిన అధికారులు, తర్వాత కౌంటర్లు మూసేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు రైతు బజారును తనిఖీ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి రోజు చిత్తూరులో 20 టన్నులు తెప్పించగా 12 టన్నులు అమ్ముడయ్యాయని తెలిపారు. ఇక తిరుపతి రైతుబజార్కూ వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరారు. బుధవారం రైతు బజారుకు సెలవు అయినప్పటికీ ప్రజల సౌకర్యార్థం విక్రయిం చినట్లు రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ అయ్యప్పన్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే 4,500 కిలోల ఉల్లిపాయలు విక్రయించినట్టు తెలిపారు. -
ఉల్లి కన్నీరు తప్పదా?
వంటింట్లోకి వచ్చాక కన్నీళ్లు తెప్పించే ఉల్లి ఇప్పుడు అంగట్లో ఉండగానే కన్నీరు పెట్టిస్తోంది. ధనిక, పేద తేడాల్లేకుండా ప్రజలందరి ఆహారంలో అనివార్యంగా ఉండాల్సిన ఉల్లి ధర దాదాపు గత రెండు నెలల్లో ఇంచుమించు 160 శాతం పెరిగింది. కిలో ఉల్లి చిల్లర ధర ప్రస్తుతం రూ.70 నుంచి రూ. 80 వరకు ఉంది. ఈ వారంలోనే వందకు చేరేట్టుంది. ఏటా తప్పని ఈ ఉల్లి కష్టాలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హరిసిమ్రన్ సింగ్ కౌర్ చిట్కాలాంటి పరిష్కారం సూచించారు. వర్షాకాలం పంట రావడానికి ముందూ, వేసవిలోనూ ఉల్లి సరఫరా తగ్గి ధరలు పెరుగుతుంటాయని, ధర తక్కువ ఉన్నప్పుడే ఉల్లిలోని నీటిని తొలగించి పొడిగానో లేదా పేస్టుగానో చేసి దాచుకుంటే ధరలూ పెరగవు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమా అభివృద్ధి చెందుతుందని సెలవిచ్చారు. ఒక్క ఉల్లే కాదు, బంగాళదుంపలు, టమాటాల నుంచి తోటకూర కాడ వరకు అన్ని కూరగాయలు, ఆకుకూరలనూ, అరటి నుంచి మామిడి వరకు అన్ని పళ్లనూ పొడులు కొట్టేసే ప్రాసెసింగ్ యూనిట్లు రాత్రికి రాత్రే వచ్చి పడ్డాయనుకున్నా... ఆ పొడుల తిండి ఎవరు తినాలి? భిన్న దేశాల, ప్రాంతాల ప్రజల ఆహారపుటలవాట్లు ఆయా దే శాల, ప్రాంతాల జీవావరణ వ్యవస్థలోనూ, సంస్కృతిలోనూ భాగంగా రూపొందుతాయి. అవి అంత తేలికగా మారేవి కావు. ఉల్లి పొడి తయారుచేసినా దాన్ని జపాన్‌లాంటి దేశాలకు ఎగుమతి చేసుకోవాల్సిందే తప్ప, ఇక్కడి ఇల్లాళ్లు గుమ్మం తొక్కనివ్వరు. కౌర్ సూచన హాస్యాస్పదమైనదే అయినా, బీజేపీ, కాంగ్రెస్ తేడాల్లేకుండా అన్ని ప్రభుత్వాలూ మన వ్యవసాయ మార్కెట్లలో, ప్రత్యేకించి ఆహార మార్కెట్లలో ధరలు నిర్ణయమయ్యే తీరు పట్ల ప్రదర్శిస్తున్న ఉద్దేశపూర్వకమైన ఉదాసీనతకు అద్దం పడుతుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహా అంతా ఏటా జూలై-సెప్టెంబర్ మధ్య ఉల్లి నిల్వలు తరిగి ధరలు పెరుగుతుంటాయనే చెబుతున్నారు. ఏటా తప్పని ఈ సమస్యకు ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఎన్నడైనా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను చేపట్టిన దాఖలాలున్నాయా? ఏటా ఈ సమయంలో చిలుకపలుకుల్లా వినిపించే కూరగాయలు, పళ్లు నిల్వ చేయగల శీతలీకర ణ గిడ్డంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని లెసైన్స్‌లు జారీ చేశాయి, ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి? ఏప్రిల్, మే మాసాలలో అకాల వర్షాలకు ఉల్లి దెబ్బతిన్న తర్వాతనైనా ఈ సమస్య వారికి పట్టిందా? సరిగ్గా మన్మోహన్ ప్రభుత్వంలాగే మోదీ ప్రభుత్వం కూడా ఉల్లి ధర మిన్నంటడం మొదలయ్యాక, అదీ ఉల్లికి మంచి ధర పలుకుతుంద నుకుంటున్న రైతు ఆశలపై నీళ్లు చల్లేలా దిగుమతులకు దిగడం తప్ప ఏమైనా చేసిందా? ఇప్పుడు 10,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవడం సెప్టెంబర్-అక్టోబర్లలో పంట చేతికి వచ్చే ఉల్లి రైతుల ప్రయోజనాలకు భంగకర మైనదేనని కేంద్ర ప్రభుత్వమే అంటోంది. ఇక ఉల్లి కనీస ఎగుమతి ధరలను భారీగా పెంచడం ఉల్లి ధరను ప్రభావితం చేయదు సరికదా, మన ఎగుమతిదార్లు విదేశీ మార్కెట్లను కోల్పోవాల్సి వస్తుంది. ఉల్లి ధరలు ఇలా విపరీతంగా పెరగడానికి సరఫరా కొరత ప్రధాన కారణం కానే కాదు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘అగ్మార్క్నెట్’ దేశంలోని కూరగాయల మండీలకు వచ్చే ఉల్లి ధర ఈ జూలై-ఆగస్టు మాసాల మధ్య టన్నుకు రూ. 2,275 నుంచి రూ. 2,985కు, అంటే సగటున కేజీకి రూపాయి కంటే తక్కువ మేరకు పెరిగినట్టు తెలిపింది. కానీ ఆగస్టు మొదటి వారంలో టోకు మార్కెట్లలో ఉల్లి ధర కిలో రూ.25 ఉంటే చిల్లర మార్కెట్లలో రూ. 45-50 ఉంది! మూడు, నాలుగు రకాలకు తప్ప కూరగాయలకు కొరత లేకున్నా వర్షాలు ఆలస్య మని తెలిసిన తర్వాతనే కూరగాయల ధరలన్నీ పెరగడం మొదలైందని ఢిల్లీ ఆజాద్ పూర్ మండీ వర్గాలే చెబుతున్నాయి. ఉల్లి ధరల గారడీ మొత్తంగా మన వ్యవసాయ ఉత్పత్తుల టోకు మార్కెట్ల దగాకోరు స్వభావాన్ని కళ్లకు కడుతుంది. 2013-14లో ఉల్లి దిగుబడి రికార్డు స్థాయికి, 1.93 కోట్ల టన్నులకు చేరింది. ఉల్లి జాతీయ వార్షిక వినియోగం 1.5 కోట్ల టన్నులు మాత్రమే. అయినా 2013లో ఉల్లి ధరలు ఇలాగే మండిపోయాయి. ఆ ఏడాది ఒక్క నాసిక్‌లోనే 20 లక్షల టన్నుల ఉల్లిని అక్రమంగా నిల్వ చేశారని, నిల్వదార్లలో అత్యధికులు రాజకీయవేత్తలేనని నాసిక్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ తెలిపింది. ఆ ఆగస్టు మాసంలో కేవలం నాలుగు రోజుల్లోనే అక్రమ నిల్వదార్లు రూ. 150 కోట్ల లాభం ఆర్జించినట్టు ఒక జాతీయ పత్రిక అప్పట్లోనే వెల్లడించింది. దేశ చరిత్రలోనే అత్యంత బలమైన, దృఢసంకల్పం కలిగిన ప్రధానిగా కీర్తినందుకుంటున్న నరేంద్రమోదీ ప్రభుత్వం సైతం అలాంటి అక్రమ నిల్వదారుల ఆట కట్టించడానికి ఎందుకు పూనుకోలేదు? గత ప్రభుత్వం లాగే నేటి ప్రభుత్వం కూడా టోకు మార్కెట్ల ధరలకు, రిటైల్ మార్కెట్ల ధరలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చలేని అదే నిస్సహాయతను లేదా అయిష్టతను ప్రదర్శిస్తోందనేది చెప్పక తప్పని వాస్తవం. కనీసం జాతీయస్థాయిలో కూరగాయల మార్కెట్లపై నిర్ణయాత్మక ప్రభావం చూపే ముంబైలోని వాషీ మండీ, ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలపైనైనా కొరడా ఝళిపించగలిగితే అది దేశవ్యాప్తంగా ఫలితాలనిచ్చేది. ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ధరల అదుపునకు ప్రయత్నాలను కొనసాగిస్తామని చేసిన వాగ్దానం మాటలకే పరిమితమా? లేకపోతే వినియోగదారుల ధరల సూచీలో 12 శాతంగా ఉండే పప్పులు, కూరగాయలు, కోడిమాంసం ధరలు గిరాకీ, సరఫరాలతో సంబంధం లేకుండా రెక్కలు కట్టుకు ఎగురుతున్నా అక్రమ వ్యాపారులపైకి దృష్టి సారించరేం? ఉద్దేశం లేకగానీ, 1955నాటి అత్యవసర వస్తువుల చట్టం దుమ్ముదులిపేవారు కారా? ఉల్లిని చిన్న చూపుచూసినందుకే 1998లో పరాభవం పాలైనామన్న విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడే మరిచిందా? లేకపోతే ఎన్నికలకు మూడేళ్లకు పైగా గడువుందనే ధీమానా? -
ఉల్లి ధర ఆల్‌టైం రికార్డ్!
రిటైల్ ధర రూ.60, హోల్‌సేల్‌లో రూ.48 సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో రూ. 60 కు ఎగబాకింది. గతంతో పోలిస్తే దీనిని ఆల్ టైం రికార్డుగా పేర్కోవచ్చు. ఉల్లి ధర నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలించడం లేదు. డిమాండ్‌కు తగినట్లుగా ఉల్లి సరఫరా లేకపోవటమే ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. శుక్రవారం నగరానికి 9,794 క్వింటాళ్ల ఉల్లిగడ్డ దిగుమతయ్యింది. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు ప్రాంతాల నుంచి నగరానికి ప్రతిరోజూ 15 వేల నుంచి 16 వేల క్వింటాళ్ల వరకు ఉల్లి సరఫరా జరిగేది. అయితే ఆయా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో సరఫరా తగ్గిపోయింది. శుక్రవారం ఒక్క రోజే 7 వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతి నిలిచి పోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా దిగుమతైన 9,794 క్వింటాళ్ల సరుకులో గ్రేడ్ వన్ రకం 1,959 క్వింటాళ్లు కాగా, గ్రేడ్ టు రకం 7,835 క్వింటాళ్లు ఉంది. గ్రేడ్ వన్ ఉల్లి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.5,800లు, కనిష్ఠ ధర రూ.4,500 పలుకగా, మోడల్ ధర రూ. 5,200 పలికింది. గ్రేడ్ టు ఉల్లి క్వింటాల్ ధర గరిష్ఠంగా 4,800, కనిష్ఠ ధర రూ. 3,000, మోడల్ ధర రూ. 4,500 పలికింది. రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ. 60 లకు విక్రయిస్తుండగా, హోల్‌సేల్‌గా రూ.48 చొప్పున విక్రయిస్తున్నారు. -
భారీగా తగ్గిపోయిన ఉల్లి సరఫరా
షోలాపూర్ : అసలే ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు సరఫరా కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో మధ్య తరగతి వినియోగదారుడికి ఉల్లి కన్నీళ్లు తప్పేట్టు కనిపించడం లేదు. షోలాపూర్ వ్యవసాయ కమిటీకి ఉల్లి సరఫరా భారీగా పడిపోయింది. రాష్ర్టంలో ఉల్లిని దిగుమతి చేసుకునే మార్కెట్లలో ఒక్కటైన షోలాపూర్ వ్యవసాయ కమిటీలోకి ప్రతి రోజు 30 నుంచి 35 లారీల్లో ఉల్లి వస్తుంది. అయితే అకాల వర్షాలు పడటంతో నాసిక్, అహ్మద్‌నగర్, పుణే, సాంగ్లి ప్రాంతాల్లోని ఉల్లి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దీంతో ప్రస్తుతం అన్ని మార్కెట్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. మామూలుగా మార్కెట్ వచ్చే దానిలో సగం కూడా రావటం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై ఉన్న ఎగుమతుల సుంకాన్ని పెంచింది. అయినప్పటికీ ధరలు నియంత్రణలోకి రాకపోవడంతో పాకిస్తాన్, చైనాల నుంచి 10 వేల టన్నుల ఉల్లి దిగుమతులకు ఆర్డర్ ఇచ్చింది. ధరలు పైపైకి.. కూరగాయల మార్కెట్లలో ఉల్లి ధర రూ.50 నుంచి 60 వరకు పలుకుతోంది. డిమాండ్ పెరిగిపోవడంతో ధర కూడా ఆమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం క్వింటాల్ రూ.4000 నుంచి 4,800 వరకు ధర పలుకుతుంది. రీటైల్ మార్కెట్లో రూ.50 నుంచి రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. గత నెల రోజులుగా ధరలు కొద్ది కొద్దిగా పెరిగిపోతున్నాయి. -
‘ఉల్లి’కిపడుతున్న టమాటా!
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మహా నగర మార్కెట్లో మాయాజాలం రాజ్యమేలుతోంది. దళారుల దగాతో ఉల్లి ధర మరింత ఘాటెక్కు తూ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు భారీగా తగ్గుతూ పండించిన రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో శనివారం ఉల్లి, టమాటాలకు పలికిన ధర ల్లో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. మలక్‌పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్-1 రకం ఉల్లికి క్వింటాల్ రూ.3,800, గ్రేడ్-2 ఉల్లికి రూ.2,400 కనీస మద్దతు ధర నిర్ణయం కాగా, టమాటా మాత్రం బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.500 మత్రమే మద్దతు ధర పలికింది. ఇదే సరుకు రిటైల్ మార్కెట్లోకి వచ్చే సరికి ఉల్లి కేజీ రూ.45-50లు ధర పలుకుతుండగా, టమాటా కేజీ రూ.7-10ల మధ్య లభిస్తోంది. స్థానికంగా పండించిన పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. అదే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటున్న ఉల్లికి మాత్రం భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఇందులో లబ్ధి పొందుతున్నది మా త్రం దళారులే. నిత్యావసరాలైన రెండు ప్రధాన వస్తువుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉల్లిని స్థానికంగా పండించేం దుకు రైతులను ప్రోత్సహించకపోవడం ఒక కారణమైతే... సమృద్ధిగా దిగుబడి వ చ్చే టమాటాను నిల్వ చేసుకొనే సాంకేతికత అం దుబాటులో లేకపోవడం మరో వైఫల్యంగా కన్పిస్తోంది. నగరంలో డిమాండు-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం ఉండటంతో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. ధరలను అదుపులోకి తెచ్చేందుకు సబ్సిడీ పథకం పేరుతో మార్కెటింగ్ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నాయి. కూరగాయల కొరత కారణంగా రైతు బజార్‌తో సహా బహిరంగ మార్కెట్లో దళారుల దోపిడీ దర్జాగా కొనసాగుతోంది. టమాటా కొత్త పంట దిగుబడి ప్రారంభం కావడంతో ధర దిగివచ్చింది. ప్రస్తుతం రైతుబజార్లో కిలో టమాటా రూ.9 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ.13 ఉంది. దీంతో పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, మాదన్నపేట హోల్‌సేల్ మార్కెట్లకు శనివారం 230కి పైగా డీసీఎం లు, ఆటోల్లో టమోటా వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం సబ్సిడీ ధరపై ఉల్లి విక్రయాలు ప్రారంభించినా నగరంలోని అన్ని ప్రాంతాల్లో రైతుబజార్లు లేకపోవడంతో వినియోగదారులు రిటైల్ మార్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. నిల్వలపై నిర్లక్ష్యం.. మార్కెట్లో మరింత కొరతను సృష్టించి... ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ఎత్తుగడ వే సి పెద్దమొత్తంలో ఉల్లిని నిల్వ చేసినట్లు సమాచారం. హోల్‌సేల్ మార్కెట్ వరకు తాము పర్యవేక్షిస్తామే తప్ప, బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించడం తమ చేతుల్లో లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. -
వామ్మో.. ఉల్లి సాగా!
నష్టాలకు భయపడి సాగు మానేసిన రైతులు ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’.. ఇది కొనుగోలు చేసి వాడుకునే వినియోగదారుడికి. కానీ దీన్ని సాగు చేస్తున్న రైతుకు మాత్రం కోయక ముందే కన్నీళ్లు వస్తున్నాయి. పెట్టుబడులు భారమై, సీజన్లో ధరలు స్థిరంగా ఉండక, పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వస్తాయన్న నమ్మకం లేక సాగుకు పూర్తిగా స్వస్తి చెబుతున్నారు రైతులు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారుడు ధర పెట్టలేక లబోదిబోమంటున్నాడు. కొన్నేళ్ల క్రితం చేవెళ్ల వ్యవసాయ డివిజన్లో ఏ గ్రామంలో చూసినా ఉల్లిగడ్డ మండెలు (నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేసే ప్రత్యేక సదుపాయం) కోకొల్లలుగా కనిపించేవి. సుమారు 60 శాతం రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో ఉల్లి సాగుచేసేవారు. మరి నేడు..? ఉల్లి సాగు చేసేవారిని వేళ్లమీద లెక్కించవచ్చు. - పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువని స్వస్తి - మార్కెట్లో స్థిరమైన ధర లేక ఇబ్బందులు - సీజన్లో దెబ్బతీస్తున్న మహారాష్ట్ర ఉల్లి - చేవెళ్ల డివిజన్లో ఒకప్పుడు భారీగా దిగుబడులు - ప్రస్తుతం విపరీతంగా తగ్గిన పంట విస్తీర్ణం - అందుకే డిమాండ్ పెరిగి ఆకాశంలో ధరలు చేవెళ్ల : ఉల్లిగడ్డ ధర విపరీతంగా ఈ పంటసాగుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉల్లి సాగు తగ్గడానికి రైతులు అనేక కారణాలు చెబుతున్నారు. నాట్లు వేసే దగ్గర నుంచి పంటను తీసేవరకు ఎకరానికి సుమారుగా రూ.15 వేల రూ.20 వేలు ఖర్చువస్తోంది. ఇటీవల పంటపై వైరస్ రావడం, చీడపీడలు, అనుకూలించని వాతావరణం తదితర కారణాలతో దిగుబడి తగ్గింది. కూలీల కొరత, పెరిగిన రేట్లు, ఫర్టిలైజర్ ధరలు భారీగా పెరగడం, లోకల్ విత్తనాలు లభించకపోవడం, మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎక్కువగా దిగుబడి కావడం తదితర కారణాలతో సాగుపై ఆసక్తి చూపడంలేదని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితులు సైతం ఉల్లిసాగుకు అవరోధంగా మారిందంటున్నారు. దీంతో గిట్టుబాటు కావడంలేదంటూ నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. ధర కూడా ఎప్పుడెలా ఉంటుందో తెలియకపోవడంతో ఆసక్తి తగ్గిందంటున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి హైదరాబాద్, సదాశివపేట, మెదక్, సంగారెడ్డి, శంకర్పల్లి మార్కెట్లకు దిగబడులు అధికంగా రావడంతో లోకల్ ఉల్లిగడ్డ మార్కెట్లో తట్టుకోలేకపోయింది. రైతులకు ఏ రకంగానూ గిట్టుబాటు కాకపోవడంతో జిల్లాలో ఉల్లిగడ్డ సాగు గణనీయంగా తగ్గింది. మరో బలమైన కారణమేంటంటే.. పత్తి, మొక్కజొన్న, కూరగాయపంటలు, పూల సాగుపై రైతులు ఎక్కువగా ఆసక్తి కనబరచడం కూడా ఉల్లిసాగు విస్తీర్ణం తగ్గడానికి కారణమైందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అందుకే ఉల్లిగడ్డ దిగుబడులు విపరీతంగా త గ్గిపోయి.. ధరలు పెరిగి వినియోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయనే వాదనలూ ఉన్నాయి. పెట్టుబడి పెరిగింది ఉల్లిగడ్డ సాగుకు పెట్టుబడి చాలా పెరిగింది. ఎప్పుడు ఏ రేటు ఉంటదో తెలియదు. ఒకసారి పెరుగుద్ది. మరోమారు తగ్గుద్ది. సీజన్ వచ్చే సరికి ధరలు తక్కువైతున్నయి. అందుకే సాగుకు మనసొప్పట్లే. కూలీల సమస్య కూడా ఉంది. దీంతో కూలీ రేట్లు బాగా పెరిగాయి. అధిక కూలీ ఇద్దామన్నా సమయానికి కూలీలు దొరకడంలేదు. -
ఘాటెక్కిన ఉల్లి ధరలు
-
ఘాటెక్కిన ఉల్లిధరలు
-
ఉల్లి మంట తగ్గింపుపై మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: అనూహ్యంగా పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్ విభాగం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో గ్రేడ్ వన్ కిలో ఉల్లి ధర రూ.40 వరకు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పట్లో మార్కెట్లోకి కొత్తగా ఉల్లి నిల్వలు వచ్చే అవకాశం లేకపోవడాన్ని వ్యాపారులు అవకాశంగా తీసుకుని నిల్వ చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర రెట్టింపు కావడంతో రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లి ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. ‘మన కూరగాయలు’ పథకంలో భాగంగా మార్కెటింగ్ విభాగం రైతుల నుంచి 9,500 క్వింటాళ్ల ఉల్లిని సేకరించింది. రాజధాని హైదరాబాద్‌లో 36 ఉల్లి విక్రయ కేంద్రాలతో పాటు తొమ్మిది రైతు బజార్ల పరిధిలోనూ తక్కువ ధరలకు ఉల్లిని విక్రయించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా, ఎర్రగడ్డ రైతు బజార్లలో యుద్ధ ప్రాతిపదికన ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటు చేశారు. నాణ్యతను బట్టి ఈ విక్రయ కేంద్రాల్లో కిలో ఉల్లి ధర రూ.22 నుంచి రూ.30 వరకు ఉంటుంది. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే కిలో ఉల్లికి కనీసం రూ.10 తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా సబ్సిడీ ధరలపై రెండు కిలోలు మాత్రమే ఇవ్వనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉల్లి సేకరించాలని భావించినా, రవాణా చార్జీలు తడిసి మోపడయ్యే అవకాశాలు ఉండడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు సమాచారం. జిల్లాల్లో సేకరణ బాధ్యత జేసీలకు... జిల్లా స్థాయిలో స్థానికంగానే ఉల్లిని సేకరించి లాభ నష్టాల ప్రమేయం లేకుండా విక్రయించే బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అయితే ఇటు తెలంగాణతోపాటు, అటు ఏపీలోనూ ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడంతో స్థానికంగా సేకరించడం కష్టమేనని క్షేత్ర స్థాయి అధికారులు చెప్తున్నారు. ధరలను నియంత్రించేందుకు ఉల్లి మార్కెటింగ్‌లో కీలకమైన మలక్‌పేట మార్కెట్ వ్యాపారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంత్రి హరీశ్‌రావు కూడా ధరలను వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోటీ విక్రయకేంద్రాలు పూర్తి అవసరాలు తీర్చలేకపోయినా ఉల్లి ధరలను అదుపు చేయడంలో ఉపకరిస్తాయని మార్కెటింగ్ అధికారులు భావిస్తున్నారు. -
ఉల్లి..పేలింది
పెరుగుతున్న ధర వ్యాపారుల దోపిడీ వినియోగదారులు విలవిల సమీక్షలతో సరిపెడుతున్న సర్కార్ నిర్లక్ష్యం నీడలో మార్కెటింగ్ శాఖ సిటీబ్యూరో: ఉల్లి ధర మళ్లీ పేలుతోంది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. నగర మార్కెట్లో రోజుకో రకంగా ధర పలుకుతూ గృహిణులకు వణుకు పుట్టిస్తోంది. ధరలను కిందకు దించాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఆంధ్రాలో ఉల్లి కొరత కారణంగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు సరుకు సరఫరా నిలిపేశారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా ఉల్లికి మంచి డిమాండ్ ఉంటోంది. అక్కడి వ్యాపారులు స్వల్పంగానే సరఫరా చేస్తుండటంతో నగరంలో కొరత ఎదురైంది. ధరలు నియంత్రించాల్సిన మార్కెటింగ్ శాఖ పైపై చర్యలతో కాలం వెళ్లబుచ్చుతోంది. అధికారులను అప్రమత్తం చేసి పరుగెత్తించాల్సిన సర్కార్ సమీక్షలతో సరిపెడుతోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతుండటంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. కొందరు బడా వ్యాపారులుఉల్లిని గోదాముల్లో దాచేసి... కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలు పెంచేస్తున్నారన్న ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ ధరలకు... రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన లేదు. రిటైల్ వ్యాపారులు రెట్టింపు ధరలు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. డిమాండ్...సరఫరాల మధ్య మలక్‌పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు సోమవారం 50 కిలోల వంతున ఉండే 31వేల బ్యాగ్‌ల ఉల్లి దిగుమతైంది. మంగళవారం 21 వేలు, బుధవారం 18 వేల బ్యాగ్‌లు మాత్రమే వచ్చాయి. రెండు రోజుల వ్యవధిలోనే 12 వేల బ్యాగ్‌లు అంటే... 6 వేల క్వింటాళ్ల కొరత కనిపిస్తోంది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ప్రభావం దరలపై పడుతోంది. హోల్‌సేల్ మార్కెట్లో బుధవారం గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.2800, గ్రేడ్-2 రకం రూ. 1600 పలికింది. ఈ ప్రకారం చూస్తే గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.28, గ్రేడ్-2 ఉల్లి కిలో ధర రూ.16గా హోల్‌సేల్ మార్కెట్లో అధికారికంగా నిర్ణయమైంది. ఇదే సరుకు రవాణా, హమాలీ, డ్యా మేజీ, లాభం వంటివి కలిపి రిటైల్ వ్యాపారులు కిలో రూ.40-45 చొప్పున వసూలు చేస్తున్నారు. దోపిడీ ఇలా... కిరాణా వ్యాపారులు, మాల్స్‌లో బెస్ట్ క్వాలిటీ పేరుతో గ్రేడ్-1 ఉల్లిని కేజీ రూ.40-45కు విక్రయిస్తున్నారు. కొందరు గ్రేడ్-2 ఉల్లినే చాటుగా గ్రేడింగ్ చేసి కేజీ రూ.40-45 వంతున అమ్ముతూ సొమ్ము చేసుకొంటున్నారు. వాస్తవానికి గ్రేడ్-1 రకం ఉల్లి స్వల్పంగానే మార్కెట్‌కు వస్తోంది. దీన్ని పెద్దపెద్ద హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వారు నేరుగా కొని తీసుకెళుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించేదంతా గ్రేడ్-2 రక మే. తామేమీ తక్కువ కాదన్నట్టు రైతుబజార్లలోనూ కేజీ రూ.32 వంతున విక్రయిస్తున్నారు. నిజానికి హోల్‌సేల్ మార్కెట్ ధరకు రూ.3 అదనంగా వేసి రైతుబజార్లలో విక్రయిస్తారు. గ్రేడ్-2 ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో కనీస మద్దతు ధర క్వింటాలు రూ.1600 పలుకగా, రైతుబజార్లలో మాత్రం కేజీ రూ.30కు అమ్ముతుండటం గమనార్హం. ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైనప్పుడు హడావుడి చేసి... తాత్కాలిక చర్యలతో సరిపెట్టేస్తుండటం మార్కెటింగ్ శాఖకు పరిపాటిగా మారిం ది. నగరంలో ఉల్లిని పెద్దమొత్తంలో నిల్వ చేసి ధరలు పెరిగిన సందర్భాల్లో మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇంతవరకు ఈ దిశగా చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరచి అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించి... చర్యలు తీసుకుంటే ఉల్లి ధరలకు కళ్లెం పడే అవకాశం ఉంది. -
ఉల్లి@రూ.40
రోజురోజుకూ ఘాటెక్కుతున్న ధర పది రోజుల్లోనే రూ. 15 మేర పెరిగిన రేటు ఇదే అదనుగా వ్యాపారుల అక్రమ నిల్వలు హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ ఉల్లి ఘాటు పెరుగుతోంది. వంటింటికి చేరకముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులతో సాగు చతికిలపడడం, వరదల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో ధర కొండెక్కి కూర్చుంది. మార్కెట్లో గ్రేడ్ వన్ రకం ఉల్లి కిలో ధర రూ.40కి పైనే పలుకుతోంది. రేట్లు ఇప్పట్లో దిగొస్తాయన్న ఆశ కూడా కనిపించడం లేదు. వ్యాపారుల అక్రమ నిల్వలు సైతం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. తగ్గిన సాగు విస్తీర్ణం.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మొత్తంగా 10 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతుందని భావించగా.. ఇప్పటి వరకు కేవలం 25 శాతం అంటే 2.5 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగు జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిని అధికంగా సాగు చేసే కర్నూలు జిల్లాలో సైతం పరిస్థితి ఆశాజనకంగా లేదు. రాష్ట్రానికి 90 శాతం మేర ఉల్లిని సరఫరా చేసే మహారాష్ట్రలో ఈ సంవత్సరం 30 వేల ఎకరాల్లో సాగు జరిగినా.. ఇటీవలి వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ఫలితంగా అక్కడ్నుంచి 20 నుంచి 30 శాతం మేర సరఫరా తగ్గిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న కొద్దిపాటి ఉల్లి సైతం కోల్డ్ స్టోరేజీల్లో ఇదివరకే నిల్వ చేసినదిగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నాయి. పది రోజుల్లోనే పెరిగిన ధర పది రోజుల కిందట రూ.25 నుంచి రూ.28 మధ్య పలికిన కిలో ఉల్లి.. ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్-1 ఉల్లి రూ.40కి పైనే పలుకుతోంది. రైతు బజార్లలోనూ ధరల పెరుగుదల అనూహ్యంగా ఉంది. ఈనెల 20న రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.30 నుంచి రూ.32 పలుకుతోంది. గతేడాది ఈ సమయానికి కిలో రూ.24 నుంచి రూ.26 మధ్య ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేడ్-2 రకం ఉల్లి సైతం గతేడాదితో పోలిస్తే రూ.5 మేర పెరిగి మార్కెట్లో రూ.20కి లభ్యమవుతోంది. సమీప భవిష్యత్తులో కొత్త సరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం లేనందున వ్యాపారులు నిల్వలను పెంచుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ధరలు పెరిగినప్పుడు పౌరసరఫరాల శాఖ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ధరను నియంత్రించింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
ఘాటెక్కిన ఉల్లి ధరలు
గుమ్మఘట్ట (అనంతపురం) : వంటింటి నిత్యవసర సరుకైన ఉల్లి ధర అమాంతం పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కిలోకి రూ.10 పెరగడంతో ప్రస్తుతం మారెట్లో కిలో ఉల్లి ధర రూ. 35 నుంచి రూ.40 పలుకుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉల్లి ధరల ఘాటు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో కొనాలనుకున్నవారు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. జూన్ చివరిదాక రూ.16 పలికిన ఉల్లి ధర, జూలై మొదట్లో రూ. 20కి పెరిగింది. నెల ఆఖరిలోపు ఏకంగా మూడు సార్లు పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో ఎర్ర ఉల్లి కిలో రూ. 35 నుండి రూ. 40 , తెల్లగా ఉన్న ఉల్లి గడ్డలు రూ. 25 నుండి రూ. 30 వరకు ధరలు పలుకుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి పంటలో ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతికందక పోవడంతోనే ధరలు భగ్గుమంటున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుండి ఉల్లి దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో మార్కెట్‌కు రవాణా కావడం లేదని ఉల్లి వ్యాపారులు చెపుతున్నారు. హోటళ్ల యజమానులు ఉల్లి కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక దాబాల్లో కూడా ఉల్లికి బదులు ఎక్కువగా కీర దోసతోనే సరిపెడుతున్నారు. ఉల్లి లేని కూరలు తినడానికి పెద్దగా రుచి ఉండకపోవడంతో సామాన్యులు కొనలేక తిప్పలు పడుతున్నారు. -
జోరందుకున్న ఉల్లి కొనుగోళ్లు
దేవరకద్ర : దేవరకద్ర మార్కెట్లో బుధవారం ఉల్లిపాయల కొనుగోళ్లు జోరందుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా కొనగోళ్లు చేయడంతో ధరలు కొంత మేరకు పెరిగాయి. గతవారం దళారుల జోక్యం వల్ల రైతులు నష్టపోగా.. ఈ వారం రైతులే నేరుగా విక్రయాలు చేసుకున్నారు. దీనివల్ల ఉల్లి ధర క్వింటాకు రూ. 1650 వరకు వచ్చింది. అయితే వ్యాపారులు వేలం ద్వారా చేసిన కొనుగోళ్లకు తక్కువ ధరలు నమోదు అయ్యావి. రూ. వేయి నుంచి రూ. 1100 వరకు ధరలు వచ్చాయి. నేరుగానే ఎక్కువ అమ్మకాలు... మార్కెట్లో బుధవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిపాయలను అమ్మకానికి తీసుకువచ్చారు. ప్రజలు నేరుగా బస్తాల ప్రకారం కొనుగోళ్లు చేశారు. ప్రస్తుతం బాగా ఆరిన ఉల్లిని ఏడాది పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉండడంతో ప్రజలు ఎగబడి ఉల్లిని కొనుగోళ్లు చేశారు. ప్రజలే స్వయంగా సంచుల్లో నింపుకుని తూకాలు చేయించుకున్నారు. 45 కేజీల బస్తా రూ. 750 వరకు ధర పలికింది. దీనివల్ల క్వింటాల్ ధర రూ. 1650 వరకు పలికింది. మార్కెట్‌కు వచ్చిన 2వేల బస్తాల ఉల్లిపాయల్లో సగానికి పైగా వేలం లేకుండానే క్రయ విక్రయాలు జరిగాయి. వేలంలో తక్కువ ధరలు.. ప్రజలు కొనుగోలు చేసిన తరువాత మిగిలిన ఉల్లి కుప్పలకు వేలం వేశారు. స్థానిక వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలం వేసినా ధరలు మాత్రం పెరగలేదు. రూ. 1000 నుంచి రూ. 1100 వరకు ధరలు వచ్చాయి. నేరుగా అమ్ముకున్న రైతులు లాభాలు చవిచూడగా వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు నష్టాలు కష్టాలు మిగిలాయి. -
ఉల్లిగడ్డుకాలం
సాక్షి, ముంబై: నగరవాసులపై ఉరుముల పిడుగులకు బదులుగా ఉల్లి పిడుగులు పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త ఫరవాలేదనిపించిన ఉల్లి గత వారం రోజుల్లోనే రెట్టింపు ధర పలుకుతోంది. నిన్నమొన్నటి దాకా రూ.15 కిలో విక్రయించిన ఉల్లి మంగళవారం ఒక్కసారిగి రూ. 30-35కు చేరింది. వ్యాపారులు కుమ్మక్కవడం, వర్షాలు కురవకపోవడం, సరుకు సరఫరా తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. నవీముంబైలోని వాషిలోగల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ)కి ఉల్లితో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య గత రెండు వారాల్లో గణనీయంగా తగ్గిందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే రూ.25కు పైగా పలుకుతున్న ఉల్లి రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి మరో పది రూపాయలు అదనంగా వచ్చి చేరుతోంది. దీంతో వంటింటి బెడ్జెట్ అమాంతంగా పెరుగుతోంది. విదేశాలకు ఉల్లిని ఎగుమతి చేయడంతోనే ఉల్లి ధరలు పెరుగుతున్నాయంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టడం, కిలో ఉల్లి ధర రూ. 60-80కి పెరగడంతో కేంద్రం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. దీంతో ఉల్లి ధర దిగొచ్చిందని సంబరపడిన ఇల్లాలికి ఆ ఆనందం ఎన్నోరోజులు ఉండలేదు. మళ్లీ ఉల్లి పైపైకే చూస్తోంది. కరెంటు కోతలు, నీటి కోతలు, నిత్యావసరాల వాతలకు తోడు పెరుగుతున్న ఉల్లి కూడా సామాన్యుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. రోజుకు ఏపీఎంసీ మార్కెట్లోకి దాదాపు 300-350 వరకు రావల్సిన ఉల్లీ ట్రక్కులు సోమవారం సాయంత్రం వరకు కేవలం 125 మాత్రమే వచ్చాయి. ఉల్లి పంటలకు పేరుగాంచిన నాసిక్ జిల్లా లాసల్గావ్లో గత వారంపది రోజుల నుంచి ఉల్లి ధర ఎగబాకుతోంది. గత వారం రోజుల కిందట ఉల్లి క్వింటాలుకు రూ.800 ధర పలికింది. ఇప్పుడు ఏకంగా రూ.2,400 ధర పలకడంతో పంట పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా వాటిని కొనుగోలుచేస్తున్న గృహిణులు మాత్రం క ంటతడి పెడుతున్నారు. వర్షాల పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత మండిపోయే సూచనలున్నాయని లాసల్గావ్ మార్కెట్లోని ఉల్లి వ్యాపారులు అంటున్నారు. -
దిగిన ధర
సాక్షి, ముంబై: ఉల్లి ధర పెరుగుదల కారణంగా ఇప్పటిదాకా ఇబ్బందిపడిన కొనుగోలుదారుడికి కొంతమేర ఉపశమనం లభించింది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఇటీవల పెరిగింది. దీంతో దాని ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నామొన్నటిదాకా టోకు మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర రూ. 50-58గా ఉంది. సామాన్యుడి వద్దకు చేరుకునే సరికి వాటి ధర రూ.70-75 దాకా పలికింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న సరుకు పరిమాణం పెరిగిపోవడంతో క్రమేణా ధర తగ్గుతోంది. టోకు మార్కెట్లో కిలో ఉల్లిపాయలు రూ. 25 పలుకుతోంది. ఇక చిల్లర విక్రేతలు రూ.30-35 మధ్య విక్రయిస్తున్నారు. వాషి మార్కెట్‌కు మూడు రోజులుగా భారీ సంఖ్యలో ఉల్లి ట్రక్కులు వచ్చాయి. కాగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. దీంతో హోటల్ యజమానులు సైతం ధరలు పెంచారు. రోడ్లపై స్టాళ్లలో విక్రయించే పకోడీ, వడ, దోశ తదితర తినుబండారాలు పేదలకు అందకుండా పోయాయి. దళారుల బెడద నుంచి కొనుగోలుదారుడిని కాపాడేందుకు పాకిస్థాన్నుంచి ప్రభుత్వం ఉల్లిపాయలను దిగుమతి చేసింది. అయితే నాణ్యతా లోపం కారణంగా వీటిని ఎవరూ కొనుగోలు చేయలేదు. చేసేదేమీలేక చైనా నుంచి కూడా ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ మళ్లీ మొదటికొచ్చింది. అయితే రెండురోజులుగా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో నిల్వ ఉంచిన ఉల్లిపాయలను విక్రయించడం ప్రారంభించారు. దీంతో ఏపీఎంసీలోకి రెండు రోజులుగా ఉల్లి లోడుతో ట్రక్కులు రావడం మొదలైంది. సరుకు రాక ఇంకా పెరుగుతుంది. కాగా లసల్గావ్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు తగ్గిపోయాయి. కొద్దిరోజుల క్రితం క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,000 పలకగా, ఇప్పుడది రూ. 3,100లకు పడిపోయింది. ఉల్లి రాక ఇంకా పెరుగుతుంది ఈ విషయమై లసల్గావ్ మార్కెట్‌కు చెందిన చిల్లర వ్యాపారి ఒకరు మాట్లాడుతూ ఉల్లి లారీల రాక ఇంకా పెరుగుతుందన్నారు. టోకు ధరల పెరుగుదల ప్రభావం చిల్లర విక్రేతలపై పడిందన్నారు. నాణ్యమైన ఉల్లిపాయల ధర శుక్రవారం కిలో రూ. 40 నుంచి రూ. 45 దాకా పలికిందన్నారు. ఇదే విషయమై మార్కెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ తాజా ఉల్లిపాయల లారీలు పెద్దసంఖ్యలో వస్తున్నాయని తెలిపారు. ఈ నెల తొలివారంలో రోజుకు మూడు వేల లారీలు రాగా ఆ సంఖ్య ప్రస్తుతం నాలుగు వేలకు చేరుకుందన్నారు. -
కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు
కుభీర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ హయూంలో ధరలకు రెక్కలు వచ్చాయని, పెట్రోల్, డీ జిల్‌తోపాటు ఉల్లి, కూరగాయలు, ఎరువులు, విత్తనాలు ధరలు ఆకాశాన్నంటాయని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. మండలంలోని సౌంవ్లీ, లింగి, వాయి, అంతర్ని, మాలేగాం, సోనారి, డోడర్న గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన పర్యటించారు. టీడీపీ హయూంలో యూరియా బస్తా ధర రూ.160 ఉంటే ఇప్పుడు రూ.400లకు పెరిగిందని, డీఏపీ రూ.400 నుంచి రూ.1300లకు చేరిందని ఎంపీ ఆం దోళన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు ఎక్కువయ్యూయని ఆరోపించారు. గ్రామాల్లో నీరు, డ్రెరుునేజీలు, రోడ్ల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యూరని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లతో దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా అందరూ ఉద్యమించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఏం సాధించారని కృతజ్ఞత సభ పెట్టారని, ఆ పార్టీకి చెందినవారే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు మాలేగాం, అంతర్నిలో సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. డోడర్న తండాలో బస చేశారు. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు బోయిడి విఠల్, శేషనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.మోహన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాశెట్టి రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు కె.శంకర్, మాలేగాం సర్పంచ్ రేఖ, నాయకులు పాల్గొన్నారు. -
ధరల ప్రతాపం...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్‌లో భారీగా 7 శాతానికి ఎగసింది. అంటే ఈ సూచీ 2012 అక్టోబర్‌తో పోల్చితే 2013 అక్టోబర్‌లో 7 శాతం పెరిగిందన్నమాట. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సెప్టెంబర్‌లో ఈ రేటు 6.46 శాతం. ఉల్లిఘాటు, కూరగాయల పోటు టోకు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల తీరు... వార్షిక ప్రాతిపదికన టోకున అక్టోబర్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు ఏకంగా 18.19 శాతం పెరిగాయి. ఉల్లి ధరల తీవ్రత కొనసాగుతోంది. ఈ నిత్యావసర ఉత్పత్తి పెరుగుదల రేటు 278 శాతంగా ఉంది. ఇక కూరగాయలను తీసుకుంటే వీటి రేటు ఏకంగా 78.38 శాతం ఎగసింది. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 17.47 శాతం ఎగశాయి. సెప్టెంబర్‌లో ఈ రేటు 13.37 శాతమే. గోధుమల ధరలు 7.88 శాతం ఎగశాయి. సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు 5.9 శాతం. మరిన్ని అంశాలు మొత్తం సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ (వెయిటేజ్ 21 శాతం) విభాగంలో రేటు 14.68 శాతం ఎగసింది. ఇక ఆహారేతర ఉత్పత్తుల (4 శాతం వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 6.79 శాతంగా నమోదయ్యింది. ఇంధనం, విద్యుత్ విభాగం (15% వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 10.33%. మొత్తం సూచీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం 2.5 శాతంగా ఉంది. ధరల అదుపు అంత ఈజీ కాదు: చిదంబరం ధరలను అదుపు చేయడం అంతసులభంకాదని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలను తీసుకుంటున్నాయని వివరించారు. తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం 10%ను మించిపోగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 7%ను తాకిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి సరఫరాల పరమైన అడ్డంకులు తొలగిపోవాల్సి ఉందని పారిశ్రామిక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు...: ద్రవ్యోల్బణం తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ డిసెంబర్ 18న చేపట్టనున్న పాలసీ సమీక్ష లో వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలక కోర్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలోనే ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల ధరల తీవ్రత వల్ల గడచిన రెండు పాలసీ సమీక్షల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటు పెంపునకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. -
తనకు మాలిన ధర్మం
ముంబై : నగరంలో ఘాటెక్కిస్తున్న ఉల్లిధరను నియంత్రించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించని ముఖ్యమంత్రి చవాన్, ఢిల్లీలో ఉల్లిధరలను తగ్గించేందుకు తన వంతు కృషిచేస్తానని చెప్పడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 లు పలుకుతోంది. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం నామమాత్ర ప్రయత్నం కూడా చేయడంలేదు కానీ ఢిల్లీలో వాటి ధర తగ్గుముఖం పట్టించేందుకు నాసిక్ నుంచి నేరుగా ఉల్లిని కొనుగోలు చేయాలని స్వయానా అక్కడి సీఎం షీలాకి ఫోన్ చేసి మరీ కోరడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. తనకు మాలిన ధర్మం చేస్తున్న సీఎం చవాన్ రాష్ర్ట ప్రజలకు ఏం సమాధానం చెబుతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఢిల్లీ సర్కార్‌కి కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని నాసిక్ నుంచి కొనుగోలు చేసి అక్కడికి రవాణా చేసేందుకు కొన్ని రోజుల క్రితం ఒక బృందాన్ని పంపించమని అక్కడి సీఎం షీలా దీక్షిత్‌ను కోరానని శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. దీనివల్ల అక్కడి మార్కెట్లలో ఉల్లి కొంత మేర తగ్గి రూ.50లకు కేజీ లభించే అవకాశముంటుందని తెలిపారు. ఇప్పటికే షీలా సర్కార్ ముగ్గురు అధికారులను నాసిక్ పంపిందన్నారు. నాసిక్ మార్కెట్లలో ఉల్లిగడ్డ ధరలు నాణ్యతను బట్టి కేజీకి రూ.38 నుంచి 55 మధ్య పలుకుతోందన్నారు. అత్యవసర చర్యల కింద మార్కెట్ నుంచి ఉల్లిని నేరుగా కొనుగోలు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించిందన్నారు. 12 నుంచి 13 టన్నుల ఉల్లిని ఢిల్లీకి రవాణా చేసేందుకు ట్రక్కుకు అయ్యే ఖర్చు రూ.12వేలు ఉంటుందన్నారు. ఇలా చేయడం వల్ల ఢిల్లీలో ఉల్లి కేజీని రే.50లకు విక్రయించొచ్చని తెలిపారు. ఉల్లిగడ్డ నిల్వదారులపై రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోవాలన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. రాష్ట్రంలో ఉల్లి నిల్వలు ఎక్కడా లేవని తెలిపారు. ఇప్పటికే కూరగాయాలను అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారులపై రాష్ట్ర సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు. నవంబర్ ఒకటిన భారీ స్థాయిలో ఉల్లి పంట మార్కెట్లకు వచ్చే అవకాశముందని తెలిపారు. వీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తామన్నారు. -
లసల్గావ్ మార్కెట్‌కు ఢిల్లీ బృందం
పుణే: ఉల్లిపాయల కొనుగోలు కోసం ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లా మార్కెట్‌కు వచ్చింది. జాతీయ రాజధాని నగరంలో కిలో ఉల్లిపాయలు రూ. 90 నుంచి రూ. 100 దాకా పలుకుతుండగా, ఈ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లాలోని లసల్గావ్ మార్కెట్‌కు వెళ్లింది. దీంతో ఆ మార్కెట్లో సరుకు లభ్యత విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో మాట్లాడా. వారి అవసరాలకు అనుగుణంగా ఉల్లిపాయలను కొనుగోలు చేస్తారు’ అని అన్నారు. ‘ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో దేశంలోనే అత్యంత పెద్ద ఉల్లిపాయల మార్కెట్ ఉంది. అక్కడ ఉల్లిపాయలను అక్రమంగా దాచరు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉల్లి పంట దిగుబడి తగ్గిపోయింది. నవంబర్ ఒకటో తేదీకల్లా కొత ్త పంట మార్కెట్‌కు రావడం మొదలవుతుంది. అప్పటినుంచి పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది’ అని అన్నారు. లసల్గావ్ మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం అనేక సౌకర్యాలు కల్పించామని, అందువల్ల ఉల్లిపాయలను అనేకరోజులపాటు నిల్వ ఉంచేందుకు వీలవుతుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందానికి కొనుగోలు చేసేందుకు వీలుగా అవసరమైనంతమేర ఉల్లిపాయలను అందుబాటులో ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
ధరాఘాతం వెనుక ఉల్లి మాఫియా?
పుణే: ప్రతి గృహిణిని కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరల భాగోతం వెనుక లసల్గావ్లోని హోల్‌సేల్ మార్కెట్లో శక్తివంతమైన వ్యాపారుల మాఫియా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఉల్లి సరఫరా తగ్గినప్పుడు ధరలు పెరిగాయని, అలాగే ఆగస్టు, అక్టోబర్ నెలలో మార్కెట్‌కు ఉల్లి అధికంగా వచ్చినా సమయంలోనూ రేట్లు రెట్టింపయ్యాయని ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. సరఫరా పెరిగినప్పుడు ధర తగ్గాలన్న మార్కెట్ సూత్రాలకు విరుద్ధంగా ఇక్కడ ధర పెరుగుతోందని నిగ్గు తేల్చింది. మహారాష్ట్ర వ్యవసాయ విభాగం నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఆగస్టు నాటికి ఒక లక్ష క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు రావల్సి ఉండగా, అది సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు పెరగడం సహజం. ధరలు పెరుగుతున్నప్పటికీ ఉల్లి గడ్డ నిల్వలను పెంచేందుకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ఆగస్టు ఒకటిన లసల్గావ్ మార్కెట్లో కిలో ఉల్లిధర రూ.24లు పలికింది. ఆ తర్వాత నిరంతరాయంగా ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో వివిధ మార్కెట్లలో ధరలు పైకి ఎగబాకాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిమాండ్ పెరగడంతో రేట్లు దానంతటవే పెరగాల్సిన పరిస్థితిని ఉల్లి మాఫియా సృష్టించిందని చెప్పాయి. వాస్తవానికి ఆగస్టు 12 తర్వాత లసల్గావ్ మార్కెట్‌కు 25వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చిందని, అప్పుడు ఉల్లి కేజీకి 25లు పలికిందని తెలిపాయి. ముందుగానే రైతుల నుంచి ఉల్లి నిల్వలను తీసుకున్న వ్యాపారులు ధర పెరిగినప్పుడు మార్కెట్లోకి వదిలేవారని పేర్కొన్నాయి. మార్కెట్ సూత్రాలకు విరుద్ధంగా అధిక ఉల్లి సరఫరా ఉన్నప్పుడు ధరలు తగ్గుముఖం పట్టాలి. కానీ వారంలోనే రెండింతలు రూ.47లకు చేరుకునేలా చేశారని తెలియి. అక్టోబర్‌లో ఉల్లి సరఫరా అధికంగానే ఉన్నా ధరలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు సరికదా మరింత పెరిగాయని వెల్లడించాయి. అధిక ధరకు చేరేందుకు మార్కెట్లోకి ఎంత స్థాయిలో ఉల్లిని సరఫరా చేయాలని నిర్ణయించడంలో శక్తివంతమైన వ్యాపారుల ముఠా ప్రధాన పోషించిందని తెలిపాయి. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీలో వివిధ పోస్టుల్లో ఉన్న సొంత పార్టీకే చెందిన నేతలపై కాంగ్రెస్, ఎన్సీపీ అధికార కూటమి చర్యలు తీసుకోలేదని వ్యవసాయ నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ ఉల్లి మాఫియాకు అధికార కూటమితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాగా, రెండు వారాల్లోగా ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. కేజీ రూ.40లకి ప్రజలకు అందుబాటులో ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
ఉల్లి ధరతో గృహణికి కన్నీళ్లు: చంద్రబాబు
ఉల్లిపాయ కేజీ ధర రూ.90 చేరుకోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యూపీఏ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశన్నంటాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉల్లిపాయి ధరలే ఉదహారణ అని ఆయన పేర్కొన్నారు. ఆకాశానంటిన ధరలను నేలకు దించేందుకు కేంద్రం చేపట్టిన చర్యలు శూన్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలవి మాటలే తప్ప చేతలు శూన్యమని తెలిపారు. ఉల్లికొనాలంటే గృహణి కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయని బుధవారం చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే సైబరాబాద్ పరిధిలో ఐటీ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Onion price at Rs.90/KG, essential commodities skyrocketing, tears in the eyes of house wifes. UPA talks but no action. — N Chandrababu Naidu (@ncbn) October 22, 2013 Nirbhaya act cudn't save an IT employee Abhaya in Cyberabad. I express my deep concern & demand strict implementation of Nirbhaya act. — N Chandrababu Naidu (@ncbn) October 23, 2013 -
ఉల్లి ఎగుమతులపై నిషేధం!
న్యూఢిల్లీ: చుక్కలను తాకుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు.. భారీగా ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దాంతోపాటు విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించే అంశాన్నీ పరిశీలిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో ఉల్లి ధరలు కిలో రూ.90 వరకు పెరిగిన నేపథ్యంలో మంగళవారం కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడారు. ఉల్లి ధరల పెరుగుదలకు అక్రమ నిల్వదారులే కారణమన్నారు. దేశంలో సరిపోయినంత స్థాయిలో ఉల్లి అందుబాటులో ఉందని, కానీ అక్రమ నిల్వల వల్లే కృత్రిమంగా ధరలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆనంద్‌శర్మ కోరారు. ధరలను నియంత్రించేందుకు ఉల్లి దిగుమతుల కోసం వచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. డిసెంబర్ చివరినాటికి కొత్త ఉల్లి దిగుబడి వస్తుందని, దాంతో ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు. కాగా.. ధరలను నియంత్రించేందుకు ఉల్లి ఎగుమతి ధరను కేంద్రం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. కానీ, దానివల్ల ప్రయోజనం కనిపించడం లేదని, అందువల్ల ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధించే యోచన ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే, అకాల వర్షాల కారణంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఖరీఫ్ ఉల్లిపంట దెబ్బతిన్నదని, అదే ధరల పెరుగుదలకు కారణమని ఎన్హెచ్ఆర్డీఎఫ్ డెరైక్టర్ ఆర్పీ గుప్తా పేర్కొన్నారు. -
ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు
నాసిక్: లసల్గావ్లోని వ్యవసాయ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు శుక్రవారం ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. క్వింటాల్ ఉల్లిపాయలు అత్యధికంగా రూ. 5,600కు చేరుకున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిపాయల ధర రూ. 5.501గా ఉంది.హోల్‌సేల్ మార్కెట్లో ధరలు పెరిపోవడం కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. చిల్లర మార్కెట్లో కిలో ఉల్లిపాయలను రూ. 60కి విక్రయిస్తున్నారు. జిల్లా మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిపాయల సగటు ధర గురువారం రూ. 5,451 నుంచి రూ. 5,751కి పలుకింది. అంతకుముందురోజు రూ. 5,350కి విక్రయించారు. శుక్రవారం లసల్గావ్ మార్కెట్లో ఎనిమిది వేల క్వింటాళ్ల ఉల్లిపాయలను వేలం వేశారు. సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చె బుతున్నాయి. ఖరీఫ్ దిగుబడి మార్కెట్‌కు రావడం మొదలైందని, అయితే పెద్దమొత్తంలో రావడం లేదని, ఇందుకు మరికొంత సమయం పడుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు ఖరీఫ్‌లో పండించిన 200 క్వింటాళ్ల ఉల్లిపాయలొచ్చాయని, అయితే ఉల్లిపాయలు క్రమం తప్పకుండా వస్తే ధరలు తగ్గిపోయే అవకాశముంటుందన్నారు. వేసవికాలంలో పండించిన ఉల్లిపాయలు మార్కెట్‌కు వచ్చినప్పటికీ అవన్నీ అమ్ముడుపోయాయన్నారు. కొత్త పంట రాకపోవడం, వేసవిలో పండించిన ఉల్లిపాయల నిల్వలు మొత్తం అమ్ముడుపోయిన నేపథ్యంలో ధరల పెరుగుదల మరో పదిరోజులపాటు కొనసాగే అవకాశముందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లనుంచి తాజా సరుకు రావడం ప్రారంభమైందన్నారు. కాగా ఇక పింపల్గావ్ మార్కెట్లోనూ ఉల్లిపాయల ధరలు పెరిగాయి. శుక్రవారం ఈ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,451 పలికాయి. అంతకుముందు ఇది రూ. 5.251గా ఉంది. ఈ మార్కెట్లో శుక్రవారం 500 క్వింటాళ్ల ఉల్లిపాయలను వేలం వేశారు. కాగా జిల్లాలోని యోలా మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,700 పలికాయి. -
తగ్గినట్టే తగ్గి మళ్లీ పైకి..
=పెరిగిన ఉల్లి ధర =రిటైల్‌గా కేజీ రూ.50-60 =రైతుబజార్లో రూ.44 సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వాలనే కూల్చిపారేయగల శక్తివున్న ఉల్లి ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. గతకొంతకాలంగా వీపు విమానం మోతమోగిస్తున్న దీని ధర అమాంతం ఎగబాకి కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.60, గ్రేడ్ -2 రకం రూ.50 పలుకుతోంది. అంతోఇంతో తక్కువ ధరకు లభించే రైతుబజార్లలో సైతం గ్రేడ్-2 రకం ఉల్లి కేజీ రూ.44కి చే రడం సామాన్య, పేదవర్గాలను కలవర పెడుతోంది. ఇటీవల వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో నగరానికి ఉల్లి దిగుమతులు బాగా పడిపోయినట్లు సమాచారం. నగరానికి ప్రధానంగా కర్నూలు జిల్లా, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి సరుకు దిగుమతి అవుతుంటుంది. ఆయా ప్రాంతాల్లో ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో ఉల్లి పంట దారుణంగా దెబ్బతింది. దీంతో దిగుమతి కూడా గణనీయంగా పడిపోయింది. ఫలితంగా నగరంలో డిమాండ్ -సరఫరాల మధ్య అంతరం ఏర్పడి ఆ ప్రభావం ధరల పెరుగుదలకు దారితీసిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాపారులు కూడా దీన్ని అవకాశంగా తీసుకొని ఒక్కసారిగా ధరలు పెంచేశారు. వారంక్రితం కిలో రూ.35 నుంచి రూ.40 పలికిన ఉల్లి ఇప్పుడు ఏకంగా రూ.60లకు ఎగబాకింది. మలక్‌పేట మహబూబ్‌మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో గురువారం గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.52, గ్రేడ్-2 ఉల్లి రూ.45 పలికిందని వ్యాపారులు చెప్పారు. నిల్వ చేయకే ఈ దుస్థితి : మార్కెటింగ్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం వినియోగదారులను కంటతడి పెట్టిస్తోంది. వర్షాలు కురిసినప్పుడు, ఇతరత్రా పరిస్థితులు ఎదురైన్పపుడు శాఖ ఆధ్వర్యంలో ఉల్లిని నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోవడంతో దిగుబడి తగ్గి ధరల పెరుగుదలకు దారితీసింది. మొక్కుబడి రాయితీ : ఉల్లి ధరాభారంతో ప్రజలు అల్లాడుతుంటే నియంత్రించాల్సిన మార్కెటింగ్‌శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నగరంలో 9 రైతుబజార్లు ఉండగా..కేవలం 6 రైతుబజార్లలో మాత్రమే ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటు చేసి కేజీ రూ.38 ప్రకారం విక్రయిస్తున్నారు. అవికూడా నామమాత్రంగా ఒక్కోరికి కిలో చొప్పున రోజులో 3-4 గంటలపాటు ఇస్తుండటంతో అవి ఏమూలకు చాలడం లేదు. ధరల తగ్గుదలకు కృషి : డిప్యూటీ డెరైక్టర్ చాదర్‌ఘాట్: మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు రావడం వల్లే ఉల్లి దిగుబడి తగ్గి ధరలు పెరిగాయని మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం తెలిపారు. ఉల్లి ధర పెరుగుదలపై మలక్‌పేట గంజ్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒడిషా, తాడేపల్లిగూడెం మార్కెట్లలో ఉల్లికి అధిక ధర పలకడంతో రైతులు సరుకును అటు తరలిస్తున్నారని పేర్కొన్నారు.