
తూర్పుగోదావరి ,కాకినాడ సిటీ: మార్కెట్‌లో ఉల్లి ధర అమాంతం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ద్వారా రైతు బజార్లలో ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం నుంచి జిల్లాలోని 14 రైతు బజార్లలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉల్లిపాయలను కుటుంబానికి ఒక కిలో చెప్పున రూ.25 లకే కిలోను అందజేయనున్నట్లు జాయిం ట్ కలెక్టర్ జి. లక్షీశ వివరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టుహాలు లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్‌కార్డు తెచ్చిన కుటుంబానికి కిలో రూ.25 ప్రకారం పంపిణీ చేస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉల్లిపాయల దిగుబడి తగ్గిపోయిన నేపథ్యంలో కర్నూలు నుంచి తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అవసరమైన మేరకు సరఫరా చేశామన్నారు. రోజుకు జిల్లాలో 25 టన్నుల ఉల్లిపాయలు అవసరం ఉందన్నారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి కిలో ఉల్లిపాయలు ఒక్కో కుటుంబానికి అందజేస్తామన్నారు. రైతు బజారుల్లో అమ్మే ఉల్లిపాయలు కేవలం ప్రజలకు మాత్రమే అందజేస్తారని, వ్యాపారస్తులు టోకుగా కొనుగోలు చేస్తే కేసులు పెడతామన్నారు. ప్రతి రైతు బజారులోను విజిలెన్స్ శాఖాధికారులు ఉంటారన్నారు. ప్రజలు ఉల్లిపాయల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడనవసరం లేదని, నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ఏడీ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment