East godavari
-
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వేధింపులతో మహిళా వాలంటీర్ సూసైడ్
-
టీడీపీ నేతల బరితెగింపు
-
పోతవరంలో టీడీపీ నేతల బరితెగింపు
తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతీ రోజూ టీడీపీ నేతల బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పోతవరంలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతిపరుల భూమిని దోచుకునేందుకు కుట్ర చేశారు. గందదిపాము రాజ్‌కుమార్‌కు చెందిన భూమిని చిడిపి గోపీ అతని అనుచరులతో కలిసి దోచకునేందుకు ప్రణాళిక రచించారు. దీనిలో ాగంగా తనపై విచక్షణారహితంగా దాడికి దిగాడని గందిపాము రాజ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు.తనపై దాడికి దిగిన వారిలో చిడిపి గోపీతో పాటుగా అతని అనుచరులైన మాజీ ఎంపీటీసీ కళావతి, ఏసునాదం, నేకూరి అబ్బులు, కళావతి అల్లుడు ఉన్నారన్నాడు. ఇదే విషయంపై గోపీ అతని అనుచరులు తరచు వేధిస్తున్నారని బాధితుడువాపోతున్నాడు. తన పొలం ఇవ్వకపోతే దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు విలపిస్తున్నాడు.చిడిపి గోపీ అతని అనుచరులు దాడిలో తీవ్ర గాయాలైన తాము తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధిత కుటుంబ స్పష్టం చేసింది. ఈ దాడిపై ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలతో పాటు ఎమ్మెల్సీ రిపోర్ట్ పంపించినా పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. తనకు తన కుటుంబానికి చిడిపి గోపీ నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు.వైఎస్సార్సీపీ నేత పొలాన్ని తవ్వేసిన పచ్చమూకలు నిన్న(ఆదివారం)పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు. -
తూర్పుగోదావరి జిల్లాలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
-
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
-
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. -
AP: కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ.. ఐదుగురు మహిళలు అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ ఘటన కలకలం రేపింది. న్యూ ఇయర్ సందర్భంగా కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం బూరుడుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతోంది. దీనిపై సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారిగా సమాచారం. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రేవ్ పార్టీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
AP: పోలీసులు బకరా.. సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా డాన్ పరారీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ముఠా సభ్యులు పోలీసుల అదుపులోకి ఉన్న నిందితుడి తప్పించారు. దీంతో, నడిరోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..దొంగ నోట్ల కేసులో భీమవరంలో ఉన్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. అదే సమయంలో పోలీసు వాహనాన్ని రెండు కార్లు, నాలుగు బైకులు వెంబడించాయి. కొంత దూరం వరకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజమండ్రిలోని వీఎల్‌పురం వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న శ్రీకాకుళం పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఈకేసులో ఉన్న నిందితుడిని వారు తప్పించి.. తమ కారులో తీసుకెళ్లారు.అనంతరం, సదరు పోలీసులు.. 100కు కాల్ చేసి ఈ విషయాన్ని రాజమండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో, కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను వెంబండించిన కార్ల నెంబర్లను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దొంగ నోట్ల ముఠా డాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
శివయ్య ప్రీతికి ‘శంఖు’ నాదం : దంపతులకు అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: శివయ్యను ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు అనేకమార్గాలను అనుసరిస్తారు. శంఖాన్ని ఏకబిగిన పూరిస్తూ మహాదేవుడిని ఆనందింపచేస్తారు మరికొందరు. శ్వాసను బిగించి ఏకధాటిగా దాదాపు ఇరవై నిముషాల పాటు శంఖాన్ని పూస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ నర్సింహరావు, అలివేలు మంగాదేవి దంపతులకు ఆధ్మాత్మిక సంపూర్ణత్వంతో పాటు, భౌతికంగా కూడా అవార్డులు వరిస్తున్నాయి. వీరు చేసే ఆధ్యాత్మిక సేవ అవార్డుల కోసం కాకపోయినప్పటికీ శంఖనాదంలో వీరి నిపుణతకు హైదరాబాదుకు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను –2024 అవార్డ్స్‌లో భాగంగా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం (డిసెంబరు 14) హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో నరసింహారావు దంపతులు ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ సందర్భంగా తమ ఆధ్యాత్మిక మార్గం, శంఖునాదం సాధన గురించి నర్సింహరావు మాటల్లో.. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరం తమ స్వగ్రామం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఏపి ప్రత్యేక రక్షణ దళం(ఏపీఎస్పీఎఫ్) కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. తన భార్య అలివేలు మంగాదేవి గృహిణి. తమకు శివుడు అంటే ఎనలేని భక్తి. తాను 1989లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలో సరిహద్దు భద్రత దళంలో పనిచేసే సమయంలో బెంగాలీ పూజారి చక్రవర్తి వద్ద శంఖం పూరించడంలో మెలుకువలు నేర్చుకున్నాను. అదే స్పూర్తితో తన భార్య మంగాదేవికి కూడా ఈ విద్యలో పట్టుసాధించారు. దీంతో తమకు ‘అఖండ శంఖారావ యుగళం’గా పేరొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ,తమిళనాడు ,కర్ణాటక, డిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఇంతవరకు నాలుగువేలకు పైగా కార్యక్రమాలు తమ శంఖారావంతో ఆరంభమయ్యాయంటారు ఈ దంపతులు ఇంకా గోదావరి,కృష్ణాపుష్కరాలు, ఇబ్రహీంపట్నం పవిత్ర నదీసంగమ అనుసంధానం వంటి పెద్దపెద్ద కార్యక్రమాల్లో శుభసూచికంగా అఖండ శంఖారావం పూరించాం. ఈసందర్బంగా పలు సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు, సువర్ణ ఘంటాకంకణాలు లభించాయన్నారు. ఇదంతా కేవలం సాధనతోనే సాధ్యమైందని, పదేళ్లపాటు దీన్ని సాధన చేశామని నరసింహారావు దంపతులు పేర్కొన్నారు. -
పులి సాగర్‌పై దాడి ఘటన.. పీఎస్‌లో మార్గాని భరత్ ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన దళిత యువకుడు పులి సాగర్‌పై జరిగిన దాడి ఘటనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో బంధించి సీఐ దాష్టీకంపై ఆయన మండిపడ్డారు. దళితులపై కూటమి సర్కార్ వేధింపుల పట్ల భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి సాగర్‌కు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు.కాగా, రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాధితుడు పులి సాగర్‌కు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను ఆదేశించారాయన.రెండురోజుల క్రితం పులిసాగర్‌ను కొందరు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో జగన్‌కు సాగర్ వివరించాడు. అయితే సాగర్‌కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. -
‘కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది.. మనం ఏపీలోనే ఉన్నామా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చిత్ర హింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా?. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. బాజీలాల్ అనే సీఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడతీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోపెట్టారు. పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.అక్రమ కేసులపై బాధితుడు పులి సాగర్ మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో నీళ్లు నిలిచిపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. అనంతరం, పోలీసులు స్టేషన్‌కు పిలిచి పచ్చి బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించి పోలీసు స్టేషన్లో బట్టలూడదీశారు. పీక కోసి రైలుపట్టాలపై పడేస్తానని ప్రకాష్‌నగర్ సీఐ బెదిరించారు. గోదావరిలో పడేస్తామని సీఐ దూషించారు. కానిస్టేబుల్‌తో దుస్తులు ఊడతీయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దుస్తుల్లేకుండా లాకప్‌లో కూర్చోపెట్టారు. మహిళా పోలీసుల ఎదుట నా పరువు తీశారు. విద్యావంతుడినైనా నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు?. నాకు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. దళితులు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావమే. చంద్రబాబు దళిత వ్యతిరేకి. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి?. సాగర్‌ను బండబూతులు తిట్టి, బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?. కూటమి పాలనలో కులం పేరుతో దూషణలు, దళిత వ్యతిరేక భావనలు ఉన్నాయి. కూటమి సర్కార్ పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. బాధితుడు సాగర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతామని చెప్పారు. రైలు కింద అతని తలకాయ పెడతానని బెదిరించారు. తాడు కట్టి గోదావరిలో వేస్తామనటం ఏంటి?. సీఐ బాజీలాల్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంపై స్పందించాలి. పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాం. దళిత అధికారులపై కూడా కక్ష కట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా?. దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. దళిత అధికారులు, దళిత మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. పులి సాగర్ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు. -
మాకు అడ్డుచెప్పేదెవరు.. జనసేన నేతల కొత్త దందా!
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి పాలనలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారం తమదే అన్న భావనలో తాము ఏది చేసినా చెల్లుతుందని కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నేతలు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా దోపీడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అడ్డు చెప్పిన వారిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. పోలవరం కాలువ గట్లపై జనసేన, టీడీపీ నేతలు మట్టిని తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో పచ్చ నేతల దోపిడీని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. అడ్డు వచ్చిన స్థానికులనే చంపేస్తామని బెదిరింపులకు దిగారు.అయితే, స్థానికంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి పోలవరం గట్లను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పచ్చ పీతతో మత్స్యకారులకు కాసుల వర్షం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులకు ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన పసుపు పచ్చ పీతకు మళ్లీ పూర్వ వైభవం రానున్నది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికున్న డిమాండ్.. సాగు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పీతల సాగు ప్రోత్సాహానికి ప్రణాళిక సిద్ధంచేసింది. దీనిలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పచ్చపీతల హేచరీ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించి నిధులు మంజూరు చేసింది. త్వరలో ఇది సాకారం కాబోతోంది. – సాక్షి, అమలాపురం విదేశాల్లో డిమాండ్పచ్చ పీత (పసుపు పీత)కు అమెరికా, చైనా, థాయ్‌లాండ్, సింగపూర్‌లో మంచి డిమాండ్ ఉంది. ఔషధ గుణాలు కలిగిన వృక్షజాతులు పెరిగే చిట్టడవి (మడ అడవులు)లో అధికంగా ఇది దొరుకుతుంది. దీనిలో రాగి, ఫాస్ఫరస్, ఒమేగా–3 అధికంగా ఉంటాయి. వీటిని వినియోగిస్తే గుండె సమస్యలు, అల్జీమర్స్ (మతిమరుపు) లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, కొత్తపాలెం, పండి, పొర, ఐ.పోలవరం మండలం భైరవపాలెం, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల, పెదవలసల, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ, రామన్నపాలెం గ్రామాల మత్స్యకారులు ఎక్కువగా పీతల వేట చేస్తారు.ఏటిమొగతోపాటు నదీపాయలు సముద్ర సంగమ ప్రాంతాలు, తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడే పర్ర భూముల్లో వీటి లభ్యత అధికం. వీటిని తొలుత చెన్నై, కోల్‌కతా నగరాలకు, అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతవుతాయి.తగ్గిన లభ్యత.. పెరిగిన ధరచమురు సంస్థల కార్యకలాపాలు, ఆక్వా చెరువుల వ్యర్థాలవల్ల పీత లభ్యత తగ్గిపోతోంది. గడిచిన ఐదేళ్లుగా దీని లభ్యత చాలా అరుదుగా మారిపోయింది. గతంలో రోజుకు ఐదు టన్నుల నుంచి ఆరు టన్నుల వరకు పీత చెన్నై వెళ్లి అక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతయ్యేది. ఇప్పుడు రోజుకు అర టన్ను కూడా పీత లభ్యత లేదు. మూడేళ్ల క్రితం పచ్చ పీత కేజీ ధర రూ.500ల వరకు ఉండేది. ఇప్పుడు కేజీ రూ.1100 నుంచి రూ.2 వేల వరకు పలుకుతోంది.సాగుకు ఊతమిచ్చేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలుఅంతర్జాతీయంగా డిమాండ్ ఉండడం.. స్థానికంగా పసుపు పచ్చపీత లభ్యత చాలా తక్కువగా ఉండడంతో కోనసీమ జిల్లాలో కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేపట్టారు. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున సాగుచేశారు. వైరస్ సోకడంతో పీత ఎదుగుదల ఆశించిన స్థాయిలో రావడంలేదు. పీత పిల్లలు (సీడ్)ను తమిళనాడులోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఆఫ్ ఆక్వా కల్చర్ వద్ద ఉన్న హేచరీ నుంచి తీసుకొస్తున్నారు.పిల్లకు రూ.12, రవాణాకు రూ.మూడు చొప్పున ఒక పీత పిల్లకు రూ.15 వరకు అవుతోంది. అది కూడా ఆర్డరు ఇచ్చిన నాలుగు నుంచి ఆర్నెల్లపాటు పీత సీడ్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక పీత పిల్లలు ఒకదానిని మరొకటి తినే గుణం ఉండడం, సుదూర ప్రాంతం నుంచి రవాణావల్ల నలిగిపోయి పెద్దఎత్తున చనిపోతున్నాయి. ఈ కారణంగా రైతులు సాగుకు ముందుకు రావడంలేదు. వెనామీ తరహాలో విదేశీ మారకద్రవ్యం అధికంగా వచ్చే అవకాశమున్నందున తీరంలో పీతల సాగు ప్రోత్సహించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కాట్రేనికోన మండలం చిరయానాం వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ అధునాతన పద్ధతిలో హేచరీ ఏర్పాటుచేసేందుకు రూ.3.75 కోట్ల మంజూరుకు అనుమతిచ్చింది. ఎన్నికలవల్ల ఆలస్యమైన హేచరీ నిర్మాణ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి.ఇక్కడ ఏడాదికి పది లక్షల పీత పిల్లలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో నాలుగు నుంచి ఆర్నెలల్లో ఇక్కడ ఉత్పత్తి మొదలయ్యే అవకాశముంది. తమిళనాడులోనిది మొదటిది కాగా.. దేశంలో ఇది రెండో హేచరీగా గుర్తింపు సంతరించుకోనుంది. హేచరీ నుంచి పచ్చపీత పిల్ల ఉత్పత్తి మొదలైతే తీరంలో పీతల సాగుకు ఊతం లభించినట్లవుతుందని మత్స్యకారులు, ఆక్వా రైతులు ఆశలు పెట్టుకున్నారు. -
తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు యువకులు మృతి
సాక్షి,తూర్పుగోదావరి: ఉండ్రాజవరం మండలం తాటిపర్రులో విషాదం చోటుచేసుకుంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాకుతో నలుగురు యువకులు మృతి మృతిచెందారు. మరో యువకుడు కోమటి అనుమంతురావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. కాగా, తాటి పర్రు విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ
తూర్పుగోదావరి, సాక్షి: నిడదవోలు టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్‌కు నిరసన సెగ తగిలింది. తమను పట్టించుకోవటం లేదని మంత్రిని టీడీపీ నేతులు నిలదీశారు. మంత్రి దుర్గేష్ ఎదుటే టీడీపీ, జనసేన నేతలు ఘర్షణకు దిగారు. -
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
AP: దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మంగళవారం(సెప్టెంబర్10) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు. డీసీఎం కేబిన్‌లో ఉన్నవారికి మాత్రం ఏమీ కాలేదు.ఇదీ చదవండి.. మాకు అడ్డొస్తే చంపేస్తాం -
మట్టిలో మాణిక్యం..! ఈ బుడ్డాడు మామూలోడు కాదు
-
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
కొవ్వూరు: దేచెర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బడుగు రాజారత్న (47) మృతి చెందారు. ఏడాదిన్నర కుమార్తెకు అనారోగ్యంగా ఉండడంతో సెలవులో ఉన్న ఆమె శనివారమే విధులకు హాజరయ్యారు. అయితే కుమార్తె ఏడుస్తోందని సమాచారం రావడంతో స్వస్థలమైన రాజమహేంద్రవరం బయలుదేరారు. గౌరీపట్నంలో ఎక్స్‌ప్రెస్‌లు ఆపకపోడంతో ఐ.పంగిడి వెళ్లి రాజమహేంద్రవరానికి బస్సు ఎక్కాలని భావించారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు కేదాటి ఫణిశేఖర్‌ను సాయం కోరడంతో ఆయన రాజారత్నను తీసుకుని మోటారుసైకిల్‌పై ఐ.పంగిడి బయలుదేరారు. దేచెర్ల చెరువు సమీపంలో బురద మట్టి కారణంగా వాహనం అదుపు తప్పింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ.. రాజారత్న తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రాజారత్న భర్త రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కర్రి శ్రీహరిరావు తెలిపారు. -
‘చంద్రబాబు కన్నా డ్రామా చేసేవారే నయం’
సాక్షి, రాజమండ్రి: వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. .. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసేత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తెస్తాడేమో అనిపిస్తుంది. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం. ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఏమి సృష్టించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎక్కడుంది. సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. .. ఇసుక కొండలు ఏమైపోయాయి. ఇసుక గుట్టలను స్థానిక ఎమ్మెల్యేలు మింగేశారు. నాలుగు రోజుల్లోనే బకాసురుల్ల మింగేశారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ. 10 కోట్లఇసుక మింగేశారు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు? రాజమండ్రి వ్యాప్తంగా సెటిల్మెంట్ బ్యాచ్‌లే నడిపిస్తున్నాయి. పేకాట క్లబ్ నడుపుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలి? జిల్లా పోలీసు అధికారులను పేకాట డబ్బులు నడుపుకుంటామని ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం. గతంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి కమిషన్ కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారు’అని భరత్ అన్నారు. -
గోదారి సీనుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టరే..
తాళ్లపూడి: వయ్యారి గోదారి పరవళ్లు.. ఒంపులు తిరిగిన గోదారి గట్లు.. ఆపైనుండే గుడి గోపురాలు.. నీటి మధ్య ఇసుక తిన్నెలు.. లంకలు.. సూర్యోదయాస్తమయ వేళల్లో గోదారమ్మ నుదుటిన అలదుకునే సిందూరం.. పావన నదిపై నీలి మేఘాలంకరణలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పేది గోదారోళ్ల సౌభాగ్యం. భౌతిక నేత్రంతో చూసే భాగ్యం ఇక్కడివారిదైతే.. ఇవే దృశ్యాలను వెండితెరపై చూసి అచ్చెరువొంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని భావించేవారెందరెందరో.. కొంత కళాత్మక దృష్టి.. ఒకింత భావుకత.. మరికొంత రసరమ్యమైన మనసు.. వీటికి తోడు భావగర్భితమైన కెమెరా కన్ను.. చాలు.. ఓ సుందర దృశ్య కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి. ఇలాంటి మనసున్న దర్శక, నిర్మాతలెందరో మన గోదావరిని అమ్మగా.. కొంటె కోణంగిగా.. వయ్యారిభామగా.. పడుచు పిల్లగా.. మరెన్నో విధాలుగా వెండి తెరపై ప్రపంచానికి చూపించి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలకు నేపథ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎన్నుకుని ఎనలేని కీర్తిని గడించారు. తెలుగు సంస్కృతికి ప్రతీకలు గోదావరి జిల్లాలు. ఇక్కడి ప్రజల వాడుక భాషే ‘చిత్ర’ భాషగా వ్యవహరిస్తారు. ఇక్కడి ఆచార వ్యవహారాలే ప్రామాణికంగా భావిస్తారు. దర్శక దిగ్గజాల్లో ఒకరైన నాటి ఆదుర్తి సుబ్బారావు నుంచి నేటి శేఖర్ కమ్ముల వరకూ ఎందరో గోదావరి అందాలతో వారి చిత్రాలను సుసంపస్నం చేసుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకులే కాక.. ఈ ప్రాంతానికే చెందిన వంశీ తీసిన చాలా సినిమాలు గోదావరి నది నేపథ్యంగా సాగినవే. వారిలో చాలా మందికి పాపికొండల నుంచి అంతర్వేది వరకూ ఎన్నో ప్రాంతాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. ఆ చిత్రం హిట్టు కొట్టేస్తుందనేది గట్టి నమ్మకం కొవ్వూరు పరిసరాల్లో.. ముఖ్యంగా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం, కుమారదేవం, ఆరికిరేవుల, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి తీరాన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. వేగేశ్వరపురంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆంజనేయుని ఆలయం రేవు, బల్లిపాడు ఇసుక ర్యాంపు లంకలు, మలకపల్లిలోని కుంటముక్కల వారి గృహంలో అనేక సినిమాల్లో చాలా సన్నివేశాలే చిత్రీకరించారు. 👉వేగేశ్వరపురంలో చిరంజీవి నటించిన రక్తసింధూరంలోని ఓ పాటను, రామ్‌చరణ్, సమంత నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలను తాడిపూడి, వేగేశ్వరపురం గోదావరి లంకల్లో చిత్రీకరించారు. 👉 నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాళ్లపూడిలోనే తీశారు. 👉 సాయికుమార్, ఆయన కుమారుడు ఆది కథా నాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయ్ చిత్రంతో పాటు, మంచు మనోజ్, రెజీనా నటించిన శౌర్య చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించారు. 👉 నాగార్జున, అనుష్క నటించిన ఢమరుకం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను గోదావరి నది ఒడ్డున ఆంజనేయస్వామి గుడి వద్ద తీశారు. ప్రత్యేకంగా రుషుల కోసం ఒక సెట్ వేసి వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేశారు. 👉 సుమంత్ నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి, వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సరదాగా కాసేపు చిత్రంలో కారులో వెళ్లే పాటను ఇక్కడే చిత్రీకరించారు. 👉 జగపతిబాబు, ప్రియమణి నటించిన పెళ్లైన కొత్తలో చిత్రంలో వారి స్నానపు సన్నివేశాన్ని ఇక్కడే తెరకెక్కించారు. 👉 ప్రక్కిలంకలో కృష్ణ నటించిన పాడిపంటలుతో పాటు, చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ ఈ ప్రాంతంలో చిత్రీకరించినవే. 👉 శ్రీకాంత్, చార్మి నటించిన చిత్రంలోని ఓ పాటను, శివాజీ హీరోగా నటించిన మిస్టర్ ఎర్రబాబులో మిత్రులతో కలిసి కథానాయికను ఆయన పరిచయం చేసుకునే సన్నివేశాన్ని, సునీల్‌పై హాస్య సన్నివేశాలను, ఆలీ నటించిన ఆషాఢం పెళ్లికొడుకులో ఒక పాటను ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. 👉 కేవలం సినిమాలే కాకుండా కొన్ని ధారావాహికలు సైతం ఇక్కడి గోదారి ప్రాంతాల్లో చిత్రీకరించారు. హిట్ చిత్రాల భవనం సుమారు 110 ఏళ్ల క్రితం మలకపల్లిలో ఆ గ్రామానికి చెందిన కుంటముక్కల వీరభద్రరావు, వెంకటాద్రి, జానకిరామయ్య లోగిలిని అత్యాధునికంగా నిర్మించారు. ఈ గృహంలో సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అని చిత్రరంగ ప్రముఖుల్లో గట్టి నమ్మకం. 👉 జంధ్యాల దర్శకత్వంలో 1985లో వచ్చిన సీతారామకల్యాణం చిత్రం ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే తీశారు. 👉 ఆ చిత్రం విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో డి.సురే‹Ùబాబు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలిరాజా చిత్రంలోని కీలక సన్నివేశాలను కూడా ఈ ఇంట్లోనే తెరకెక్కించారు. 👉 అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, బాలకృష్ణ నటించిన సీతారామ కల్యాణం, నరేష్ నటించిన ప్రేమచిత్రం.. పెళ్లి విచిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్‌బాబు నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా.. సీతారత్నం గారి అబ్బాయి, తాళి తదితర చిత్రాలన్నీ విజయం సాధించాయి. 👉 ఇదే గ్రామంలో దివంగత కుంటముక్కల భాస్కరరావు గృహానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రేమవిజేత అనే చిత్రం, రజనీకాంత్ నటించిన తమిళ సినిమా, జగదాంబ టూరింగ్ టాకీస్ తదితర సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. అప్పట్లో డి.రామానాయుడు ఇక్కడి గ్రంథాలయానికి రూ.30 వేల విరాళం అందజేశారు. దీంతో గ్రామస్తులు ఆ భవనానికి మరమ్మతులు చేసి, రామానాయుడు గ్రంథాలయంగా పేరు పెట్టారు. రామచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.150 ఏళ్ల నాటి సినిమా చెట్టుకుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 200 పైగా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. దీంతో, దీనికి ‘సినిమా చెట్టు’గా పేరొచ్చింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ చిత్రసీమలో స్థిరపడిపోయింది. ఈ నమ్మకంతోనే ఒక్క సీన్ అయినా ఈ చెట్టు కింద తీస్తారు. మొదటిగా కృష్ణ హీరోగా 1975లో పాడిపంటలు ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్‌బాబు, బాలకృష్ణ, మోహన్‌బాబు, సుమన్, మహే‹Ùబాబు, రామ్‌చరణ్, రాజశేఖర్, నాని తదితర హీరోలతో పాటు, దర్శకులు వంశీ, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, సుకుమార్ ఈ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం సెంటిమెంట్‌గా భావిస్తారు.షూటింగ్‌ల అడ్డా.. గోష్పాద క్షేత్రం కొవ్వూరు గోష్పాద క్షేత్రం పలు హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. జూనియర్ ఎనీ్టఆర్, భూమిక నటించిన హిట్ చిత్రం సింహాద్రిలో ఇంటర్వెల్ సీన్ ఇక్కడే తీశారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో 100 పర్సంట్ లవ్‌తో పాటు గుండెల్లో గోదారి, బెండు అప్పారావు ఆర్ఎంపీ తదితర అనేక చిత్రాలు ఇక్కడ తీశారు. ఇలా గోదావరి తీరంలో ఏటా చాలా చిత్రాల షూటింగులు జరుగుతూనే ఉంటాయి. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావది: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణ బాబు మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. -
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్