తూర్పుగోదావరి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు | East Godavari: Differences In TDP Gopalapuram Constituency, Details Inside - Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు

Published Fri, Jan 12 2024 3:41 PM | Last Updated on Sun, Feb 4 2024 1:29 PM

East Godavari: Differences In Tdp Gopalapuram Constituency - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముద్దిపాటి వర్సెస్‌ మళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య ముసలం పుట్టింది. నియోజకవర్గం ఇంఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్‌ ర్యాలీ చేపట్టారు. 500 కార్లతో గోపాలపురం నుంచి అమరావతికి టీడీపీ నాయకులు బయలుదేరారు.

చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని మూడు ముక్కలు చేశారంటున్న నేతలు.. ఒంటెద్దు పోకడలతో మద్దిపాటి వ్యవహరిస్తున్నారంటూ మండి పడుతున్నారు. మద్దిపాటిని అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్‌ అభ్యర్థిని బరిలోకి దింపుతామని నేతలు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement