differences
-
టీడీపీ Vs జనసేన.. తారాస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్‌కల్యాణ్‌ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు. -
టీడీపీ–జనసేనలో దీపావళి ‘చిచ్చు’
కాకినాడ: కాకినాడలో కూటమి పార్టీలైన టీడీపీ–జనసేన మధ్య ‘దీపావళి’ చిచ్చు రేపింది. బాణసంచా దుకాణాల కేటాయింపులో అధికారుల తీరును తప్పుపడుతూ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) వర్గీయులు రోడ్డుపై పడుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సును అడ్డగించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.ఓ వైపు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌పై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతూ పనిలో పనిగా ఇక్కడి అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఇప్పటికే పర్లోపేట వద్ద వైన్‌షాపు కేటాయింపు విషయంలో ఇరుపార్టీల మధ్య వివాదం నెలకొంది. ఇప్పుడు బాణసంచా దుకాణాల కేటాయింపులో కూడా రోడ్డెక్కడంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. వివరాలివీ.. టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు మద్దతుతో కాకినాడ మెయిన్‌రోడ్డు అపోలో ఆస్పత్రి పక్క ఓ బాణసంచా దుకాణం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, వస్త్ర దుకాణాలు, ఆస్పత్రులున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. బాణసంచా దుకాణం కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక అధికారులు అభ్యంతరం చెప్పడాన్ని టీడీపీ నగరాధ్యక్షుడు వీరు జీర్ణించుకోలేకపోయారు.వాస్తవానికి.. జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటుపై వివాదం రేగడంతో కలెక్టర్ షణ్మోహన్ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్ అధికారులతో వేసిన కమిటీ కూడా అక్కడ దుకాణం ఏర్పాటుచేయడంపై అభ్యంతరం తెలిపింది. భానుగుడి జంక్షన్ సమీపంలో జనసేన మద్దతుతో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణానికి లేని అభ్యంతరం తమ విషయంలోనే ఎందుకంటూ అధికారులపై మండిపడ్డారు. ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ ఒత్తిడితోనే టీడీపీ వారి దుకాణానికి చెక్ పెట్టారని వీరు బలంగా అనుమానిస్తున్నారు. దీంతో ఎంపీపై అక్కసు వెళ్లగక్కేందుకు వీరుతోపాటు టీడీపీ శ్రేణులంతా ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుకాణాల కేటాయింపు తీరుపై విమర్శలు..మరోవైపు.. గతంలో ఎన్నడూలేని విధంగా కాకినాడలో బాణసంచా దుకాణాల కేటాయింపు ప్రక్రియను టీడీపీ ఓ ప్రైవేటు లాడ్జిలో నిర్వహించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే కేటాయింపు ప్రక్రియను హైజాక్ చేసి కొత్త సంస్కృతికి తెరలేపడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే..ఇక ప్రభుత్వం మారినా అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట విని, పనిచేస్తున్నారంటూ కొండబాబు వర్గీయులు ఆరోపణలకు దిగారు. దీంతో.. బాణాసంచా దుకాణాల కేటాయింపులో వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ద్వారంపూడిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జేసీఎస్ (జగనన్న కన్వీనర్లు, సారథుల) కన్వీనర్ సుంకర విద్యాసాగర్ మండిపడ్డారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసన చేసిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా తరచూ ద్వారంపూడిని వివాదంలోకి లాగడం సర్వసాధారణమైందని విమర్శించారు. దుకాణాల కేటాయింపు అంశంపై ద్వారంపూడి కానీ, వైఎస్సార్సీపీ కానీ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టంచేశారు. -
యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!
యాపిల్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి తెలిసిన సాధారణ యాపిల్స్ గాక అందులో చాలా వెరైటీలు ఉంటాయననే విషయం తెలుసా. వీటిని ఎప్పుడైన తిని చూశారా..!. తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా త్వరగా తెలుసుకుని ట్రై చేసి చూడండి. యాపిల్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ఒక యాపిల్ ఎన్నో రోగాలు బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి యాపిల్స్‌లో మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి. అవేంటంటే..అంబ్రి యాపిల్జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబ్రి రకం యాపిల్. ఒకప్పుడూ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాపిల్ రకంలో ఇది ఒకటి. దీనిని కాశ్మీర్ రాజు అనిపిలుస్తారు. ఇది చక్కటి ఆకృతి, తీపి వాసనతో మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇవి సుదీర్ఘకాలం పాడవ్వకుండా ఉండటంలో ప్రసిద్ధి చెందినవి. వీటటిని డెజర్ట్లోల ఉపయోగిస్తారు. చౌబత్తియా అనుపమ్ ఇది ఎరుపురంగులో పండిన యాపిల్‌లా ఉంటుంది. మద్యస్థ పరిమాణంఓ ఉంటుంది. ఇది హైబ్రిడ్ యాపిల్ రం. వీటిని ఎర్లీషాన్బరీ, రెడ్ డెలిషియన్ మధ్య క్రాస్ చేసి పడించిన యాపిల్స్. దీన్ని ఉత్తరాఖండ్‌లో విస్తారంగా సాగు చేస్తారు. గోల్డెన్ ఆపిల్దీన్ని గోల్డెన్ డెలిషియస్ అని కూడా పిలుస్తారు. పసుపు పచ్చని రంగుతో మృదువైన ఆకృతిలో ఉంటాయి. ఇవి అమెరికాకు చెందినవి. ఇప్పుడు వీటిని హిమచల్ ప్రదేశ్‌లో కూడా పండిస్తున్నారు. తేలికపాటి రుచితో మంచి సువాసనతో ఉంటాయి. వీటిని ఎక్కువగా యాపిల్ సాస్, యాపిల్ బటర్, జామ్‌ల తయారీకి అనువైనది. గ్రానీ స్మిత్యాపిల్కి పర్యాయపదంలా ఉంటాయి ఈ గ్రానీ స్మిత్ యాపిల్స్. వీటిని హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే భారతదేశంలో పెరిగే ఈ రకం యాపిల్స్ మమ్రాతం ఇక్కడ ప్రత్యేక వాతావరణానికి కాస్త తీపిని కలిగి ఉండటం విశేషం. వీటిని ఎక్కువగా సలాడ్లు, జ్యూస్‌లు, బేకింగ్ పదార్థాల్లో ఉపయోగిస్తారు. సునేహరి యాపిల్ఇది కూడా హైబ్రిడ్ యాపిల్‌కి సంబంధించిన మరో రకం. అంబ్రి యాపిల్స్ క్రాసింగ్ నుంచి వస్తుంది. యాపిల్ క్రిమ్సన్ స్ట్రీక్స్లా పసుపు తొక్కను కలిగి ఉంటుంది. ఆకృతి క్రంచీగా ఉంటుంది. తీపితో కూడిన టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. పార్లిన్ బ్యూటీ ఈ యాపిల్స్ భారతదేశంలోని తమిళనాడుకి చెందింది. ఈ రకానికి చెందిన యాపిల్స్ కొడైకెనాల్ కొండల్లో ఉండే వెచ్చని శీతాకాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ రకం యాపిల్స్ వస్తుంటాయి. ఇవి మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణం వరకు వివిధ ఆకృతుల్లో లభిస్తాయి.ఐరిష్ పీచ్అత్యంత చిన్న యాపిల్స్. ఇవి లేత పసుపు గోధుమ ఎరుపు రంగులతో ఉంటుంది. పరిమాణంలో చిన్నది. విలక్షణమైన తీపి టార్ట్ రుచిని కలిగి ఉంటుంది. వీటిని పచ్చిగానే తీసుకుంటారు. అధిక పీచుతో కూడిన యాపిల్స్ ఇవి. స్టార్కింగ్ ఈ యాపిల్స్ తేనె లాంటి సువాసనతో అత్యంత తియ్యగా ఉటాయి. వీటని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. వీటిని తాజాగా తింటారు. అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. ఎక్కువగా జ్యూస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఎనిమిది రకకాల యాపిల్స్ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి రకం యాపిల్ రుచి, ఆకృతి పరంగా మంచి పోషకవిలువలు కలిగినవి. ఏ యాపిల్స్‌లో ఏదో ఒకటి తీసుకునేందుకు ప్రయత్నించినా.. మంచి ప్రయోజనాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు. -
సీట్ల పంపకాల్లో ‘మహా’ ప్రతిష్టంభన!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావికాస్ అఘాడీలో టికెట్ల పంపిణీపై విభేదాలు మొదలయ్యాయి. 288 స్థానాల్లో 260 స్థానాలపై మధ్య ఏకాభిప్రాయం కుదరగా, 28 సీట్లపై పీటముడి పడినట్లు సమాచారం. అఘాడీ భాగస్వాములు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎప్పి) శుక్రవారం 9 గంటల పాటు జరిగిన మారథాన్ సమావేశం జరిపాయి. . విదర్భలో ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్‌ను ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.ఆ సీట్లనే కోరుతున్న శివసేనవిదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఉమ్మడి శివసేన, బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 15, శివసేన 12 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒంటరిగా 29, ఎన్సీపీ ఐదు సీట్లు గెలిచాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత కూడా విదర్భ ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంటే ఉన్నారు. శివసేనలో తిరుగుబాటు తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ఏకనాథ్ షిండే వైపు, 8 మంది ఉద్ధవ్ వైపు నిలిచారు. ఇప్పుడు పాత ఫలితాలపైనే సమస్య నెలకొంది. సీట్ల పంపిణీ ఫార్ములా ప్రకారం 2019లో గెలిచిన 12 సీట్లు తమకే దక్కాలని ఉద్ధవ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని సమాచారం. ముంబైలోని 20–25 స్థానాల్లో స్థానాల పంపకాలు కూడా సమస్యగా మారింది. ముంబై శివసేన కంచుకోట గనుక అక్కడ ఎక్కువ సీట్లు రావాలని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలను బీజేపీ–సేన కూటమి కైవసం చేసుకుంది. శివసేన 22, బీజేపీ 9 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. -
టీడీపీలో విభేదాలు.. దర్జాగా దోపిడీ
రాజంపేట: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జినైన తనకు మంత్రి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాలసుబ్రమణ్యం సోమవారం విరుచుకుపడ్డారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.ఇసుక, మట్టి దోపిడీలో.. ఎర్రచందనం అక్రమ రవాణాలో, బదిలీలకు సిఫారసు లేఖలను అమ్ముకుంటూ మంత్రి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం గుండ్లపల్లెలో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం ఏమన్నారంటే..ఇసుక అక్రమ రవాణాలో మంత్రికి వాటాలు..కేవీ పల్లెలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుంటే సుండుపల్లెలో పోలీసులకు అడ్డుకునే హక్కులేనప్పుడు, రాయచోటి మండలంలో అనుంపల్లె మట్టి ఎత్తితే, దానిని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా? రాజంపేట మండలంలోని ఆర్.బుడుగుంటపల్లె ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి రాజంపేట ఇన్చార్జిగా ఉన్న నన్ను పిలవలేదు. మంత్రికి ఇసుకలో వాటా ఉందని కలెక్టరేట్లో చర్చించుకుంటున్నారు. అలాగే, అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రి తన సిఫార్సు లేఖలను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. మంచి పోస్టుకు రూ.5 లక్షలు, గ్రామస్థాయి పోస్టుకైతే రూ.30వేలు వసూలుచేస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై కలెక్టర్ ప్రేక్షకపాత్ర..అలాగే, సుండుపల్లె మండలం తిమ్మసముద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తుంటే నేను, మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఆయన తెలియనట్లు వ్యవహరించారు. తహసీల్దారును కలెక్టరు మొక్కుబడిగా మందలించారుగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనుంపల్లె నుంచి మట్టి తోలుతుంటే తనకు సంబంధంలేదని తహసీల్దారు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న వారిని అడ్డుకుంటాం.నా సభలకు అధికారులను అడ్డుకుంటున్నారు..మరోవైపు.. నేను పాల్గొంటున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ సభలకు అధికారులను రానివ్వకుండా సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లె గ్రామ పెద్దలకు ఫోన్‌చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరగకూడదని చెప్పాడు. కానీ, గ్రామస్తులు జిల్లా అధ్యక్షుడి మాట లెక్కచేయకుండా ఈ సభ నిర్వహించారు. వాస్తవానికి.. రాంగోపాల్‌రెడ్డి సీఎం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నియమించిన వ్యక్తి కాదు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా.సభ్యత సంస్కారం లేనివారిని పదవుల్లో పెట్టుకోవడంవల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇక మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వైఎస్సార్సీపీలోని తన బంధువులకు వత్తాసు పలుకుతూ వారికి పనులు చేసిపెడుతున్నాడు. రాయచోటిలో టీడీపీ సీనియర్లందరూ కలిసి పనిచేస్తేనే రాంప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఆశయాలకు మంత్రి తూట్లు పొడుస్తున్నారు. రవాణాశాఖలో ఆయన లీలలు, బాగోతాలు పత్రికల్లో వస్తున్నాయి. -
కావలి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, నెల్లూరు: కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు.జనసేనలో లుకలుకలు మరోవైపు, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో లుకలుకలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్‌పై వెంకటగిరి జనసేన నేత వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ పాయింట్ ఆప్ కాంటాక్ట్‌గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ పెత్తనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఇంచార్జ్‌లకు గౌరవం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో జెండా మోసిన తనను పార్టీకి దూరం చేయాలని అజయ్ కుమార్ చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: కాదంబరి కోరాలే గానీ.. -
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ కూటమి పార్టీల్లో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన ఆ జెండా దిమ్మను ప్రారంభించడానికి వీల్లేదని, దానిని తొలగించాలని టీడీపీ నేత దారం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం అర్ధరాత్రి నరసింహారావుకు జన సైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరసింహారావు పలుగుతో జెండా దిమ్మను ధ్వంసం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ జనసేన కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నరసింహారావు వెళ్లిపోయారు. వెంటనే జనసేన కార్యకర్తలు ఎంఎన్‌కె రహదారిపై బైఠాయించారు. నరసింహారావును అప్పగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనసైనికులు ఆందోళన విరమించి బైక్ ర్యాలీగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నరసింహారావుపై ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన దారం నరసింహారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆధిపత్యం కోసం దారం నరసింహారావు పట్టణంలో వర్గ విభేదాలు సృష్టించి సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
538 నియోజకవర్గాల ఓట్లలో తేడా: ఏడీఆర్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని ఆసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 5,54,596 తక్కువగా ఉన్నాయని వివరించింది. అలాగే 176 నియోజకవర్గాల్లో పొలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 35,093 అదనంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. -
Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
శ్రీనగర్: ఎన్నికల వ్యయ నివేదికలో చూపిన ఖర్చులో తేడాలున్నాయని బారాముల్లా ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్)కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీచేసింది. తీవ్రవాదులకు నిధులు అందజేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్‌ను 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి విజయం సాధించారు. కోర్టు రెండు గంటలు పెరోల్ ఇవ్వడంతో ఈనెల 5న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రషీద్ తనకు రూ.2.10 లక్షలు ఖర్చయిందని ఎన్నికల రిజిస్టర్లో చూపారని, అయితే ఎన్నికల పరిశీలకులు నిర్వహించిన సమాంతర రిజిస్టర్లో ఖర్చును రూ.13.78 లక్షలుగా చూపారని ఈసీ తెలిపింది. ఈ వ్యత్యాసంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జిల్లా వ్యయ పర్యవేక్షక కమిటీ ముందు రషీద్ లేదా ఆయన ప్రతినిధి హాజరై వివరణ ఇవ్వాలని, ఈసీకి సకాలంలో ఎన్నికల వ్యయ నివేదికను సమరి్పంచాలని కోరింది. -
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పెనుగంచిప్రోలులో ఆ నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా క్యాడర్ విడిపోయింది. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం సమావేశమైంది. పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదంటూ బొల్లా రామకృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు. శ్రీరామ్ రాజగోపాల్‌కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంత వరకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా. నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. టీడీపీ పార్టీ అందరిదీ...తాతయ్య సొత్తు కాదు. శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నా పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా’’ అని బొల్లా రామకృష్ణ హెచ్చరించారు. ఇదీ చదవండి: మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్ -
ఇచ్చాపురం: మరోసారి బయటపడ్డ టీడీపీ, జనసేన విభేదాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురంలో జనసేన, టీడీపీ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. లోకేష్ శంఖారావం సభకు రావొద్దంటూ జనసేన నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. సభకు వస్తున్న జనసేన నేతలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల తీరుపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో అవమానంతో జనసేన నేతలు తిరిగి వెళ్లిపోయారు. లోకేష్ సభలో జనసేన జెండాలు కనబడకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో సభలో జనసేన నేతలు, జెండాలు కనిపించలేదు. కాగా, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. -
2 నిమిషాల్లోనే ప్రసంగం ముగిసింది
తిరువనంతపురం: కేరళలోని వామపక్ష ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గురువారం కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ విధివిధానాలను వివరించాల్సిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగ పాఠంలోని చివరి పేరాను మాత్రమే చదివి కేవలం రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ 9.02 గంటలకల్లా ప్రసంగం ముగించారు. 9.04 గంటలకు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని బిల్లుల పెండింగ్, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
‘కడప’టికి సైకిల్‌కు శూన్యమే!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. సీనియారిటీకి విలువ ఇవ్వకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటివి టీడీపీకి మైనస్ అవుతున్నాయని పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్, మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇన్చార్జుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వైఖరి ఇలాగే ఉంటే జిల్లాలో గత ఎన్నికల్లోలాగానే తెలుగుదేశానికి మిగిలేది శూన్యమేననే వాదన ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. రీతి లేని రితీష్ బద్వేల్లో ఎప్పటి నుంచో టీడీపీకి విధేయతగా ఉన్న దివంగత కర్నాటి శివారెడ్డి (కర్నాటి వెంకటరెడ్డి), బద్వేల్ మాజీ జెడ్పీటీసీ శిరీష కుటుంబాలతోపాటు, కలశపాడు బాలిరెడ్డి వంటి వారు ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి కొనిరెడ్డి రితీష్‌కుమార్‌రెడ్డి తీరు తమకు అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత మంత్రి వీరారెడ్డి హయాం నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను చవిచూస్తున్నారు. పుట్టెడుజిత్తుల.. ‘పుట్టా’ మైదుకూరు నియోజకవర్గం ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఏకపక్ష వైఖరి వల్ల టీడీపీలో తొలి నుంచి ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దువ్వూరు మండల నేత వెంకట కొండారెడ్డిదీ అదే దుస్థితి. డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కూడా రెడ్యం సోదరులు టీడీపీ జెండా కోసం పనిచేశారు. అలాంటి వారినీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారని శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెల్ఫ్ ఫోకస్లో ప్రవీణ్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ఒంటెత్తు పోకడలు పోతున్నారు. సీనియర్ నేతలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డిలను విస్మరిస్తూ తను మాత్రమే ఫోకస్ కావాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిల వైఖరికి విస్తుపోతున్న సీనియర్ నేతలు పార్టీలో కొనసాగాలా లేదా? ప్రత్యామ్నాయమార్గం ఏమిటీ? అనే సందిగ్ధంలో ఉన్నారు. మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో విస్తు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్చార్జి మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో తెలుగుతమ్ముళ్లు విస్తుపోతున్నారు. ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉన్న జిల్లా కేంద్రంలో రెచ్చగొట్టే చర్యలకు ఆమె పాల్పడుతున్నారనే ఆవేదన ఆ పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. నాయకురాలిగా ఫోకస్ కావాలనే తపన ఉండొచ్చు కానీ, బహిరంగంగా అధికార పార్టీ క్యాడర్‌తో వాదనకు దిగడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషాలాంటి స్థాయి ఉన్న వారినీ ఆమె ఏకవచనంతో సంబోధిస్తున్నారని పలువురు ఎత్తిచూపుతున్నారు. సొంత క్యాడర్‌తో కూడా ఆమె దురుసుగా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. పార్టీ ఇన్చార్జిగా ఇప్పుడే ఇలా ఉంటే, అధికారిక హోదా దక్కితే ఆమెను నియంత్రించడం సాధ్యం కాదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
తూర్పుగోదావరి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముద్దిపాటి వర్సెస్ మళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య ముసలం పుట్టింది. నియోజకవర్గం ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్ ర్యాలీ చేపట్టారు. 500 కార్లతో గోపాలపురం నుంచి అమరావతికి టీడీపీ నాయకులు బయలుదేరారు. చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని మూడు ముక్కలు చేశారంటున్న నేతలు.. ఒంటెద్దు పోకడలతో మద్దిపాటి వ్యవహరిస్తున్నారంటూ మండి పడుతున్నారు. మద్దిపాటిని అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపుతామని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
‘ఇండియా’లో లోక్‌సభ ఎన్నికల నాటికి ఐక్యత అవసరం
ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపడలంలో సభ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)చీఫ్ శరద్ పవార్ చెప్పారు. అయితే, 2024లో లోక్‌సభ ఎన్నికల వేళకు ఇవన్నీ సర్దుకుని, ఉమ్మడిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ప్రతిపక్షపార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధమైన మార్పు వస్తుందని చెప్పేందుకు తన వద్ద కచ్చితమైన సమాచారం లేదన్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్ ఉండగా, మరికొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో తలెత్తే విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. -
కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌ప్రీత్‌సింగ్ నిజ్జర్ హత్య విషయమై భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా 41 మంది దౌత్యవేత్తలను దేశం వీడాల్సిందిగా కేంద్రం ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయాలని కెనడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం ప్రకటించారు. 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలవాల్సి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడ్డ కారణంగా ఈ చర్యకు దిగాల్సి వచి్చందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు మాత్రమే భారత్‌లో ఉన్నట్టు వివరించారు. భారత్‌లో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా కొనసాగుతున్న 10 వీసా దరఖాస్తు కేంద్రాలపై తమ నిర్ణయం ప్రభావం పడబోదని తెలిపారు. ఇంతేకాకుండా, చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయడమే గాక, ఆ నగరాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కెనడా తాజాగా తమ పౌరులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. -
జనాదరణ పథకాలకు ఆర్బీఐ డబ్బు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ వి. ఆచార్య తన పుస్తకం కొత్త ఎడిషన్ ‘ముందు మాట’గా రాసిన కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. ‘‘ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి జనాదరణ పథకాల వ్యయాలకు రూ. 2 నుంచి 3 లక్షల కోట్లను పొందాలని కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు చేసిన ప్లాన్ (రైడ్)ను సెంట్రల్ బ్యాంక్ ప్రతిఘటించింది. ఇది స్పష్టంగా ప్రభుత్వం– ఆర్బీఐ మధ్య విభేదాలకు దారితీసింది. సెంట్రల్ బ్యాంక్‌కు సంబంధిత ఆదేశాలు జారీ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ఎన్నడూ ఉపయోగించని సెక్షన్ 7ను అమలు చేయాలని ఆలోచించే స్థాయికి పరిస్థితి వెళ్లింది’’ అని రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.‘క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా’ శీర్షికతో ప్రజల ముందు ఉంచిన తన పుస్తకం తాజా ఎడిషన్ ముందు మాటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ఆర్థిక లోటు భర్తీకి బ్యాక్‌డోర్ మానిటైజేషన్’’ అని ఆయన ఈ వ్యవహారాన్ని అభివరి్ణంచడం గమనార్హం. 2017 జనవరి 20వ తేదీ నుంచి 2019 జూన్ వరకూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విరాల్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన డిప్యూటీ గవర్నర్‌గా మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఫైనాన్షియల్ స్థిరత్వం–రిసెర్చ్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆరు నెలల ముందుగానే ఆయన అప్పట్లో రాజీనామా చేశారు. విరాల్ రాసిన అంశాల్లో కొన్ని... ► ఆర్బీఐ ప్రతి సంవత్సరం తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. 2016 డిమోనిటైజేషన్‌కు ముందు మూడేళ్లలో ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసింది. ► నోట్ల రద్దు సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చును కేంద్రానికి చేసిన బదిలీల నుంచి మినహాయించింది. ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ నిధుల అవసరాలు మరింత పెరిగాయి. ఈ మొత్తాలను ఆర్బీఐ నుంచి పొందాలని బ్యూరోక్రాట్లు కొందరు ప్రయతి్నంచారు. ► స్వల్పకాలిక ప్రజాకర్షక వ్యయాల కోసం సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై దాడి చేసే ప్రణాళికలను పదేపదే ప్రతిపాదించినప్పుడు.. సహేతుకమైన సంస్థలతో కూడిన ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను కలిగి ఉన్న దేశంలోని ఏ ప్రభుత్వమైనా బలీయమైన ప్రతిఘటనను ఎదుర్కొనకుండా ముందుకు సాగలేదు. ఇలాంటి సందర్భాలే ఒక సహేతుక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ల నుండి ప్రభుత్వానికి భవిష్యత్తులో బదిలీల కోసం సహేతుకమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కావడం ఇలాంటిదే. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి భారీ నిధులు పొందాలని భావించిన వ్యక్తుల్లో పలువురిని ప్రభుత్వం పక్కన బెట్టడం కూడా జరిగింది. 2018లోనే ‘విరాల్’ వెల్లడి.. నిజానికి 2018 అక్టోబర్ 26న ఏడీ ష్రాఫ్ స్మారక ఉపన్యాసం సందర్భంగానే విరాల్ ‘కేంద్రం– ఆర్బీఐ మధ్య విభేదాల విభేదాల అంశాన్ని మొదటిసారి సూచనప్రాయంగా ప్రస్తావించారు. తాజాగా అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ‘‘కేంద్ర బ్యాంకు స్వాతం్రత్యాన్ని గౌరవించని ప్రభుత్వాలు తక్షణం లేదా అటు తరువాత ఆర్థిక మార్కెట్ల ఆగ్రహానికి గురవడం ఖాయం. ఆయా పరిణామాలు ఆర్థిక అనిశి్చతికి, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ దెబ్బతినే ప్రమాదానికి దారితీస్తాయి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకేనా..? తాజా అంశాలను విశ్లేíÙస్తే...సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా 2018 డిసెంబర్లో ఉర్జిత్ పటేల్ రాజీనామాకు.. తాజాగా విరాల్ లేవనెత్తిన అంశానికీ ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఉర్జిత్ పటేల్ ‘‘వ్యక్తిగత కారణాలతో’’ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నప్పటికీ దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మూడేళ్ల పదవీ కాలం ముగిసేలోగా తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసిన గవర్నర్‌గా పనిచేసిన అరుదైన సందర్భం ఆయనది. -
ఎన్నికల్లో కలసికట్టుగా పోరాటం : సచిన్ పైలెట్
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, అసంతృప్త నేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు రూపుమాప డానికి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసికట్టుగా పోరాటం చేస్తామని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్‌లో ఎన్నికల సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, ఖర్గే, సచిన్ పైలెట్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాలికి ఫ్రాక్చర్ కావడంతో సీఎం అశోక్ గెహ్లోత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
కమలం పార్టీ శ్రేణుల్లో గుబులు.. నిధుల వాడకం వ్యాఖ్యలతో మైనస్ కానుందా?
ఒక సీటు కోసం ఒకే పార్టీలోని ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటే కొట్లాట తప్పదు. ఇప్పుడు ఆదివాసీల జిల్లాలోని కమలం పార్టీలో ఇదే జరుగుతోంది. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం బీజేపీలో కుస్తీపట్లు మొదలయ్యాయి. ఆదివాసీ ఎంపీ, గిరిజన నేతల మధ్య ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కమలం పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగ వివాదం అటు జిల్లాలో, ఇటు పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఎంపీకి కేటాయించిన నిధుల వినియోగంపై బీజేపీ ప్రజా ప్రతినిధులతో సోయం బాపురావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిదులు ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం వాడుకున్నట్లు చెప్పారు. ఆ వీడియో బయటకి వచ్చి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిధుల వాడకంపై ఎంపీ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసాయి. నిధుల దుర్వినియోగం పై ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తాను ల్యాడ్స్ నిధులు వాడుకోలేదన్నారు.. ఇల్లు నిర్మాణం, కొడుకు పెళ్లి కోసం అణా పైసా వాడుకోలేదని స్పష్టం చేశారు. తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. పార్టీలోనే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ చెప్పారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తనమీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే వారిద్దరికీ గిట్టడంలేదని విమర్శించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తాను ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నానని, అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తనను బీజేపీ నుంచి సాగనంపడానికి ఇదంతా చేస్తున్నారని ఎంపీ సోయం అన్నారు. అదే విధంగా తన ఎంపీ సీటుకు కూడా ఎసరు పెట్టేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మధ్య విభేదాలకు చాలా కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి రమేష్ రాథోడ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేసుకున్నారు. కాని అక్కడి నుంచి రమేష్ రాథోడ్ కాకుండా జడ్పీటీసీ జానుబాయి, హరి నాయక్‌లకు ఎంపీ సోయం మద్దతిస్తున్నారని సమాచారం. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు చివరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయట. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ సీటు కోసం జిల్లా పరిషత్ చైర్మన్ సుహసిని రెడ్డి కూడా పోటీపడుతున్నారు. ఇక్కడ కూడా ఎంపీ బాపురావు జిల్లా అధ్యక్షుడికి మద్దతివ్వడంలేదట. వీరిద్దరి మధ్యా గతంలో ఒక భూ వివాదం కూడా చోటు చేసుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయంటున్నారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్పందించారు. తనపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఎంపీకి తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎంపీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దమన్నారు రమేష్ రాథోడ్. జిల్లాలో పార్టీ ఎంపీ, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగితే ఫైనల్‌గా నష్టపోయేది పార్టీయేనని అక్కడి కాషాయ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల మధ్య విభేదాలు తొలగించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. -
పర్చూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. కారంచేడు మండల టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గురువారం నిర్వహించిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం దీనికి వేదికైంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఓ వర్గానికి కొమ్ముకాయడంతో రెండో వర్గం నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో గురువారం రోడ్డెక్కారు. ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకున్నారు. స్థానిక నేత అక్క య్య చౌదరికి మద్దతుగా నిలిచిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేశా రు. గంటకు పైగా కారంచేడులో టీడీపీ నేతల వీరంగం కొనసాగింది. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అనూరాధతోపాటు పలువురు టీడీపీ ముఖ్యనేతల సమక్షంలోనే విభేదాలు రచ్చకెక్కడం గమనార్హం. నేపథ్యమిదీ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమం గురువారం కారంచేడు చేరింది. తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ అక్కయ్యచౌదరి టీడీపీ కార్యాలయంలోకి వచ్చి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కోరారు. ఎమ్మెల్యే అందుకు అంగీకరించకపోవడంతో రావాల్సిందేనని అక్కయ్యచౌదరి పట్టుబట్టాడు. బస్సులోంచి దిగిన ఎమ్మెల్యే కార్యాలయం బయటే నిలబడి కార్యకర్త ఇచ్చిన జెండా నిలబెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అక్కయ్యచౌదరి వర్గం ఎమ్మెల్యే ఎగురవేసిన టీడీపీ జెండాను అక్కడికక్కడే పీకేశారు. పార్టీ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘పార్టీ వద్దు.. బొక్కా వద్దు’ అంటూ చిందులు తొక్కారు. పార్టీ పదవికి రాజీనామా ఈ ఉదంతంతో పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కయ్యచౌదరి ప్రకటించారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీని అనునిత్యం కాపాడుకుంటూ ఆర్థికంగా ఎంతో నష్టపోయానన్నారు. ఇంత కష్టపడినా ఎమ్మెల్యే వద్ద తనకు కనీస గౌరవం దక్కడం లేదన్నారు. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తూ పార్టీని పాడు చేస్తున్నాడని వాపోయారు. ఈ విషయంపై అధిష్టానంతోనే తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. కారంచేడుకు చెందిన సీనియర్ నేత అక్కయ్యచౌదరి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలంలో బలమైన నాయకుడైన ఆయన గతంలో కారంచేడు ఎంపీపీ, పర్చూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పదవులు చేపట్టారు. ప్రస్తుతం కారంచేడు–2 ఎంపీటీసీగా ఉన్నారు. కాగా, అక్కయ్యచౌదరికి వ్యతిరేకంగా ఇదే మండలానికి చెందిన పార్టీ మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి ప్రహ్లాదరావు ప్రత్యేకంగా గ్రూపు కట్టా రు. అక్కయ్య చౌదరి వ్యతిరేక వర్గీయులను చేరదీశారు. దీంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదా లు తారస్థాయికి చేరగా.. తాజాగా రోడ్డునపడ్డాయి. -
గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్ జంక్షన్లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడ నుంచి జారుకున్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి.. అసలు ఎందుకీ వివాదం?
బనశంకరి/ శివాజీనగర(కర్ణాటక): కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్ మధ్య సోషల్ మీడియా యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా మౌద్గిల్ ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో ఆదివారం పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు. నాకు ఏజీ ఎందుకు వాదించలేదు? గతేడాది మైసూరు కలెక్టర్‌గా పనిచేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్‌లో కేసు వేయగా, ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్ చేశారు. తాను 3 సంవత్సరాల కిందట యాదగిరిలో పనిచేసి, బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్‌లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు అన్నారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్‌లకు పంపించారని, ఇది సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడమేనని, ఇంకా అనేక ఆరోపణలను రూపా సంధించారు. మానసిక వైద్యం చేయించుకో: రోహిణి ఆగ్రహం ఐపీఎస్ రూప నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై న్యాయపోరాటం చేస్తానని ఐఏఎస్ రోహిణి సింధూరి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు. రూపా మౌద్గిల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నేను వ్యక్తిగత ఫొటోలను ఎవరికి పంపించాను అనేది ఆమె బహిరంగపరచాలని, బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇష్టానుసారం నా ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారం రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి -
కొంప ముంచిన ‘చంద్రబాబు’ టూర్.. ‘సీట్లు’ సితారయ్యేలా సిగపట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీని బలోపేతం చేస్తామంటూ వచ్చిన చంద్రబాబు తమను గోదాట్లో ముంచి పోతున్నట్టుగా ఉందని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సీట్లకు సెగ పెట్టేందుకే ఆయన వచ్చినట్టుగా ఉందని నియోజకవర్గ ఇన్చార్జిలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన వల్ల ప్రయోజనం మాట దేవుడెరుగు.. కొత్త సమస్యలతో తల బొప్పి కట్టిందంటున్నారు. చంద్రబాబు పర్యటనలో టీడీపీ విభేదాలు రచ్చకెక్కి సిట్టింగ్‌ల సీట్లకు సెగ తగిలింది. తొలి రోజు బుధవారం రాజానగరంలో మొదలైన విభేదాలు చివరి రోజైన శుక్రవారం పెద్దాపురంలో కూడా కొనసాగాయి. అధినేత పర్యటనతో సీన్ రివర్స్ అయ్యిందని ఇన్చార్జిలు తల పట్టుకుంటున్నారు. వర్గ విభేదాలపై నియోజకవర్గ కార్యకర్తల సమీక్షల్లో చంద్రబాబు దాటవేశారని క్యాడర్ పెదవి విరుస్తున్నారు. రాజానగరంలో కేరాఫ్ లేదు చంద్రబాబు తీరుతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ రాజానగరం ఇన్చార్జి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తప్పుకున్న తరువాత ఆ పార్టీకి అక్కడ దిక్కు లేకుండా పోయింది. మరొకరిని ప్రకటిస్తారని ఎదురు చూశారు. పుట్టి మునిగిపోతున్న పార్టీ బరువు మోయడానికి నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ తరుణంలో తమ సామాజికవర్గానికే సీటు ఇవ్వాలంటూ బీసీకి చెందిన బార్ల బాబూరావు అసమ్మతి గళం వినిపించారు. పెందుర్తి అనుయాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు తనకాల నాగేశ్వరరావు, వ్యతిరేక వర్గం నుంచి బర్ల బాబూరావు మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఎవరూ దిక్కులేక ఇన్చార్జిగా తమ నేతనే కొనసాగిస్తున్నారని పెందుర్తి వర్గం బాహాటంగా చెప్పడమే వివాదానికి కారణమైంది. అందుకే కోరుకొండలో చైతన్య రథం పైకి చంద్రబాబు పిలిచినా పెందుర్తి వెళ్లలేదని తెలిసింది. వర్మా.. ఇదేం ఖర్మ! పిఠాపురం టీడీపీలో తిరుగులేని నాయకుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు తొలిసారి పెద్ద షాక్ తగిలింది. ఆయన వ్యవహార శైలితో విసుగెత్తిపోయిన వారందరూ ఒక్కటై జగ్గంపేటలో చంద్రబాబును కలిసి అసంతృప్తి గళం వినిపించారు. ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు వర్మతో విభేదిస్తున్నారు. ఈ వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. వర్మ అసంతృప్తి వాదులు బాబును కలవడానికి నవీన్ ఆశీస్సులు లేకపోలేదని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరొచ్చినా నవీన్ కలుపుతారని ఆ వర్గం సమర్థించుకుంటోంది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురం నుంచి ఆ సామాజికవర్గ నేతలు నవీన్‌ను ప్రతిపాదిస్తున్నారు. అందుకే 40 కార్లలో వెళ్లి, వర్మకు సీటిస్తే పని చేసేది లేదని ఆయన వ్యతిరేకులు తమ అధినేతకు తెగేసి చెప్పారు. వర్మ సీటుకు ఎసరు పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయని వినికిడి. మాజీ ఎమ్మెల్యే వర్మకు వ్యతిరేకంగా గళం విప్పిన తమ్ముళ్లు ప్రత్తిపాడులో రోడ్డెక్కిన నిరసన టీడీపీ ప్రత్తిపాడు ఇన్చార్జి వరుపుల రాజాకూ నిరసన సెగ తాకింది. రాజాను తప్పించాలంటూ ఆ పార్టీ నేతలు ఏలేశ్వరం మెయిన్ రోడ్డులో ఎనీ్టఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించే వరకూ వెళ్లారు. బీసీ నేత పైల సుభాష్ చంద్రబోస్‌కు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఏపూరి శ్రీను, రొంగల సూర్యారావు తదితరులు రచ్చ చేశారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అంతా సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూయేనని రాజా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతుల మద్దతు లేకుండా బోస్ అంతటి సాహసం చేయలేరని అంటున్నారు. గత ఎన్నికల్లో నెహ్రూ తనయుడు, పార్టీ ప్రస్తుత కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కు ఎంపీ సీటు రాకుండా రాజా అడ్డు పడ్డారనే చర్చ పార్టీలో ఉంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ద్వారా మంత్రాంగం నడిపినందువల్లనే ఇప్పుడు బోస్ ద్వారా రాజాపై తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారని తెలుస్తోంది. బోస్‌కు ప్రమాదం జరిగితే జ్యోతుల పరామర్శకు రావడం, జగ్గంపేటలో నవీన్ పాదయాత్రకు బోస్ తరచూ వెళ్లి మద్దతు తెలపడం వీరి అవగాహనను చాటుతున్నాయి. రాజప్పా.. మాకొద్దప్పా.. కాకినాడ జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు పక్కన ఉండగానే ఈయనకు పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తాకింది. రోడ్‌షో వేట్లపాలెం వెళ్లేసరికి మాజీ ఎమ్మె ల్యే దివంగత బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు ‘టీడీపీ ముద్దు – చినరాజప్ప వద్దు’ అంటూ నిరసనకు దిగారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన భాస్కర రామారావు స్థానే చినరాజప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి చినరాజప్పను ఎమ్మెల్యేను చేయాలని గురువారం రాత్రి పెద్దాపురంలో బాబు ప్రకటించారు. చదవండి: టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే.. దీంతో ఆశవహుల్లో అసంతృప్తి రాజుకుంది. పెద్దాపురం టిక్కెట్టు రేసులో చినరాజప్ప కాకుండా బొడ్డు సామాజికవర్గం నుంచి వెంకట రమణ, గుణ్ణం చంద్రమౌళి ఉన్నారు.æ చంద్రబాబు ప్రకటన ఆ వర్గీయుల్లో అసంతృప్తి రాజేసింది. వేట్లపాలెంలో తన కళ్లెదుటే చోటు చేసుకున్న ఈ పరిణామంతో అవాక్కైన చంద్రబాబు.. ఇది పద్ధతి కాదు అంటూనే దివంగత భాస్కర రామారావు సేవలను కొనియాడుతూ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా ‘రాజప్పా గోబ్యాక్’ అంటూ వ్యతిరేకులు నినాదాలు చేశారు. మొత్తంమీద చంద్రబాబు మూడు రోజుల పర్యటనతో నియోజకవర్గ ఇన్చార్జిలు కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారయ్యారు.