ఇంజనీర్ రషీద్‌కు ఈసీ నోటీసు
శ్రీనగర్: ఎన్నికల వ్యయ నివేదికలో చూపిన ఖర్చులో తేడాలున్నాయని బారాముల్లా ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్)కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీచేసింది. తీవ్రవాదులకు నిధులు అందజేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్‌ను 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి విజయం సాధించారు.
కోర్టు రెండు గంటలు పెరోల్ ఇవ్వడంతో ఈనెల 5న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రషీద్ తనకు రూ.2.10 లక్షలు ఖర్చయిందని ఎన్నికల రిజిస్టర్‌లో చూపారని, అయితే ఎన్నికల పరిశీలకులు నిర్వహించిన సమాంతర రిజిస్టర్‌లో ఖర్చును రూ.13.78 లక్షలుగా చూపారని ఈసీ తెలిపింది. ఈ వ్యత్యాసంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జిల్లా వ్యయ పర్యవేక్షక కమిటీ ముందు రషీద్ లేదా ఆయన ప్రతినిధి హాజరై వివరణ ఇవ్వాలని, ఈసీకి సకాలంలో ఎన్నికల వ్యయ నివేదికను సమరి్పంచాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment