Issue of Notices
-
Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
శ్రీనగర్: ఎన్నికల వ్యయ నివేదికలో చూపిన ఖర్చులో తేడాలున్నాయని బారాముల్లా ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్)కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీచేసింది. తీవ్రవాదులకు నిధులు అందజేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్‌ను 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి విజయం సాధించారు. కోర్టు రెండు గంటలు పెరోల్ ఇవ్వడంతో ఈనెల 5న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రషీద్ తనకు రూ.2.10 లక్షలు ఖర్చయిందని ఎన్నికల రిజిస్టర్లో చూపారని, అయితే ఎన్నికల పరిశీలకులు నిర్వహించిన సమాంతర రిజిస్టర్లో ఖర్చును రూ.13.78 లక్షలుగా చూపారని ఈసీ తెలిపింది. ఈ వ్యత్యాసంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జిల్లా వ్యయ పర్యవేక్షక కమిటీ ముందు రషీద్ లేదా ఆయన ప్రతినిధి హాజరై వివరణ ఇవ్వాలని, ఈసీకి సకాలంలో ఎన్నికల వ్యయ నివేదికను సమరి్పంచాలని కోరింది. -
అమ్మకానికి ‘ఎనిమీ ప్రాపర్టీ’ షేర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 84 కంపెనీల్లోని 2.91 లక్షల ’ఎనిమీ ప్రాపరీ్ట’ షేర్లను విక్రయించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 20 కంపెనీల్లో 1.88 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇందుకోసం 10 కేటగిరీల కొనుగోలుదార్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో వ్యక్తులు, ప్రవాస భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లు, ట్రస్టులు, కంపెనీలు ఉన్నాయి. ఫిబ్రవరి 8 కల్లా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. 1947–1962 మధ్య కాలంలో శతృదేశాలైన పాకిస్తాన్, చైనాకు వెళ్లిపోయి, అక్కడి పౌరసత్వం తీసుకున్న వారికి భారత్‌లో ఉన్న ఆస్తులను ’ఎనిమీ ప్రాపరీ్ట’గా వ్యవహరిస్తారు. ఇవి కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఫర్ ఇండియా (సీఈపీఐ) అ«దీనంలో ఉన్నాయి. బిడ్డర్లు తమకు ఏ కంపెనీల్లో ఎన్ని షేర్లు, ఏ ధరకు కావాలనేది బిడ్‌లో తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒకో కంపెనీ షేర్లకు నిర్దిష్ట ధరను రిజర్వ్ రేటుగా నిర్ణయిస్తుంది. దీన్ని వెల్లడించదు. అంతకన్నా తక్కువ రేటు కోట్ చేసే బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. -
‘ఉచితాల’పై సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఓటర్లపై ఉచితాల వల విసురుతున్నాయి. మళ్లీ అధికారం అప్పగిస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని, ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇస్తున్నాయి. ప్రజాధనాన్ని దురి్వనియోగం అవుతోందని, ఈ ఉచిత పథకాలను అడ్డుకోవాలని కోరుతూ భట్టూలాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. -
కస్టోడియల్ మరణం విచారకరం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ మరణం విచారకరమని, ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. గచ్చిబౌలి పోలీస్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పత్రికల్లో వచ్చిన కస్టోడియల్ మరణం వార్తపై స్పందించి న్యాయవాది రాపోలు భాస్కర్.. న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు కస్టోడియల్ మరణంపై మహబూబాబాద్‌కు చెందిన న్యాయ విద్యార్థి కరుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ కస్టోడియల్ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను 8 వారాల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. -
వర్సిటీల్లో కులవివక్ష నిర్మూలించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న రోహిత్ వేముల, పాయల్ తాడ్విల మాతృమూర్తులు రాధిక, అబేదా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు శుక్రవారం జస్టిస్ ఎన్.వి.రమణ, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కుల వివక్ష నివారణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను వర్సిటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, జీవించే హక్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2004 నుంచి దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఈ కోవలోనివే అని న్యాయవాది వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల (2016), ముంబైకి చెందిన వైద్య విద్యార్థిని పాయల్ తాడ్వి(2019, మే) ఆత్మహత్యలకు కులవివక్షే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయోధ్యపై వాదనలకు మరో గంట బాబ్రీ మసీదు భూవివాద కేసుకు సంబంధించి ఈనెల 23న వాదనలు వినడానికి అదనంగా గంట సమయం కేటాయిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, కేసుల భారాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇకపై అప్పీళ్లు, బెయిళ్లు, యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన 7ఏళ్ల వరకు జైలు శిక్ష విధించగలిగే కేసులను ఒకే న్యాయమూర్తి విచారించేలా నిబంధనలను సవరించింది. -
మందుల దుకాణాలపై దాడులు
సాక్షి, హైదరాబాద్: ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మందుల దుకాణాలపై ఔషధ నియంత్రణ మండలి కొరడా ఝుళిపించింది. గ్రేటర్ పరిధిలో గురువారం తనిఖీలు నిర్వహించి.. 40 దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించింది. రూ.కోటిన్నరకుపైగా విలువచేసే నిషేధిత మత్తు మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల సాక్షిలో ‘గోళీమార్’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనంపై మండలి సీరియస్‌గా స్పందించింది. డెరైక్టర్ జనరల్ డీఎల్ మీనా ఆదేశాల మేరకు అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రిస్కిప్షిన్ లేకుండా మందులు అమ్మడం, గడువు ముగిసిన వాటిని విక్రయించడం, రికార్డులను సరిగా నిర్వహించకపోవడం వంటి కారణాలతో పలువురు వ్యాపారులు పట్టుబడ్డారు. ఈ దుఖానాలకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.