టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో శాంసన్ చోటు కోల్పోయాడు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందును సంజూని జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. సంజూ గైర్హాజరీలో సల్మాన్ నిజర్ కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మొహమ్మద్ అజారుద్దీన్, ఎం అజ్నస్ కేరళకు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్‌గా ఉన్నారు.
కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సంజూ శాంసన్ కేరళకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో కేరళ తృటిలో నాకౌట్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఈ టోర్నీలో సంజూ ఆరు మ్యాచ్‌లు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 135 పరుగులు మాత్రమే చేశాడు. సంజూ ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరఫున రెండు సెంచరీలు సాధించాడు.
విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ జట్టు: సల్మాన్ నిజర్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, షోన్ రోజర్, మొహమ్మద్ అజారుద్దీన్ (వికెట్‌కీపర్), ఆనంద్ కృష్ణన్, కృష్ణ ప్రసాద్, జలజ్ సక్సేనా, ఆదిత్య సర్వతే, సిజోమన్ జోసెఫ్, బాసిల్ థంపి, బాసిల్ NP, నిధీష్ MD, ఈడెన్ యాపిల్ టామ్, షరాఫుద్దీన్ , అఖిల్ స్కారియా, విశ్వేశ్వర్ సురేష్, వైశాక్ చంద్రన్, అజ్నాస్ M (వికెట్‌కీపర్)
మనీశ్ పాండే ఔట్
విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టును కూడా నిన్ననే ప్రకటించారు. ఫామ్‌ల లేమి కారణంగా స్టార్ ఆటగాడు మనీశ్ పాండే జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మనీశ్ పేలవ ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో మనీశ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు.
SMAT-2024లో కర్ణాటక నాకౌట్స్‌కు క్వాలిఫై కావడంలో విఫలమైంది. మనీశ్ గైర్హాజరీలో కర్ణాటక వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ గోపాల్ వ్యవహరిస్తాడు. కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ కొనసాగనున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శ్రేయస్ గోపాల్ (వైస్ కెప్టెన్), ఎస్ నికిన్ జోస్, కెవి అనీష్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్, అభినవ్ మనోహర్, హార్దిక్ రాజ్, వైషాక్ విజయ్‌కుమార్, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్, కిషన్ బెదరే, అభిలాష్ శెట్టి, మనోజ్ భండాగే , ప్రవీణ్ దూబే, లువ్నిత్ సిసోడియా
Comments
Please login to add a commentAdd a comment