క్రికెట్‌లో ఫన్నీ మూమెంట్స్‌కు కొదువ లేదు. తాజాగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక బంతి కోసం ఆటగాళ్లు నానాపాట్లు పడాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ సందర్భంగా ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రియాన్ హడ్లే వేసిన షార్ట్‌బాల్‌ను లియామ్ స్కాట్ స్క్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. బౌండరీ వైపు దూసుకెళ్లిన బంతి ఫెన్సింగ్ అవతల పడింది. అయితే ఈ బంతిని తీయడానికి సౌత్ ఆస్ట్రేలియా ఫీల్డర్ స్టోబో నానా రకాలుగా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు.
అనంతరం ఫెన్సింగ్ కిందకు దూరి బంతి తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో స్టోబో కొద్ది దూరంలో కనిపించిన ఒక చిన్న కట్టెను తీసుకొచ్చి ఫెన్సింగ్ అవతల నుంచి మొత్తానికి బంతిని బయటకు తీశాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ‘పాపం మ్యాచ్‌కు మొత్తం ఒకటే బంతి ఉందనుకుంటా.. అందుకే బంతిని తీయడం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు’ అని కామెంట్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌత్ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సౌతా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం న్యూసౌత్‌వేల్స్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కావడంతో సౌతా్ ఆస్ట్రేలియా టార్గెట్ 95 పరుగులుగా నిర్ధేశించబడింది. ఈ టార్గెట్‌ను సౌత్ ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.
చదవండి: భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం!
Genuinely bizarre scenes as Charlie Stobo has to get a stick to retrieve the ball from underneath the fence. #SheffieldShield pic.twitter.com/YVwlyjxo06
— cricket.com.au (@cricketcomau) March 6, 2026


