new south wales
-
బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న మహిళ..!
పాపం.. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుని ఓ మహిళ నరకం అనుభవించింది. ఆమెను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీస్...న్యూ సౌత్ వేల్స్: పర్వత ప్రాంతంలోని బండరాళ్ల మధ్య నడుస్తున్న మహిళ చేతిలోని సెల్‌ఫోన్ జారిపడింది. ఫోన్‌ను అందుకునే క్రమంలో ఆమె రెండు బండరాళ్ల మధ్య సందులో తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు ఏడు గంటల యాతన అనంతరం ఆమెను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉన్న హంటర్ వ్యాలీలో నెలారంభంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత మహిళ పేరు మటిల్డా కాంప్‌బెల్. రాళ్ల మధ్య మూడుమీటర్ల సందులో ఇరుక్కుపోయిన మటిల్డాను కాపాడేందుకు ఆమె స్నేహితులు ఎంతగానో ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి అర టన్ను బరువున్న ఒక రాయిని పక్కకు జరపగలిగారు. అయినప్పటికీ, మటిల్డాను రక్షించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమనే అంచనాకు వచ్చారు.‘పదేళ్లుగా ఎన్నో ఘటనలను దగ్గర్నుంచి చూస్తున్నా. కానీ, ఇటువంటిది ఇదే మొదటిసారి’అని ఎమర్జెన్సీ సరీ్వస్ పారామెడిక్ పీటర్ వాట్స్ పేర్కొన్నారు. ‘మటిల్డా ఇరుక్కుపోయిన ప్రాంతం ఎస్ ఆకారంలో ఉంది. అందుకే, ఆమె కాళ్లు ఇరుక్కున్న బండరాళ్లను కదలకుండా ఉంచుతూనే ఆమె పట్టేంత జాగాను ఏర్పాటు చేయడం ఎంతో క్లిష్టమైన వ్యవహారం. దాదాపు ఏడుగంటల శ్రమ అనంతరం ఆమెను సురక్షితంగా బయటకు తేగలిగాం’అని తెలిపారు.చదవండి: ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్‌లో కూర్చుంటారు.. కమలా హారిస్ వార్నింగ్అయినా కూడా ఆమెకు గీసుకుపోయిన గాయాలే తప్ప, ఎటువంటి హాని కలగకపోవడం ఆశ్చర్యపరిచే విషయమని చెప్పారు. ఇంతా చేసినా మటిల్డా ఫోన్ మాత్రం దొరకలేదని వాట్స్ చెప్పారు. ఇంత జరిగినా, ఫోన్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చినందుకు మటిల్డా విచారం వ్యక్తం చేయడం కొసమెరుపు..! -
భార్యను సంతోష పెట్టడానికి లాటరీ కొన్న వ్యక్తి.. కలిసొచ్చిన అదృష్టం
రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే మన ఆనందానికి అవధులుంటాయా?. లాటరీ వ్యక్తి జీవితాన్నే మార్చేస్తే?. సాధారణ వ్యక్తిని ఒక్కసారిగా కోటీశ్వరులను చేస్తే.. ఈ ప్రపంచలంలో మనకంటే అదృష్ట వంతులు ఎవరూ ఉండరని తెగ సంబరపడిపోతుంటాం. తాజాగా ఇలాంటి ఊహించనే ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన జంట గత మూపై ఏళ్లుగా ఒకే నెంబర్‌పై లాటరీ టికెట్ కొంటూ వస్తోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రతిసారీ వారికి నిరాశే ఎదురైతుంది. అయితే ఇటీవల భార్యను సంతోషపెట్టేందుకు అతడు ఆమె పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. లక్ష్మీ దేవి కరుణించడంతో ఒకేసారి రెండు టికెట్లు గెలిచి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయారు. ఈ ఘటన మార్చి 13న చోటుచేసుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ జంట దాదాపు 16 కోట్ల 48 క్షలు గెలుచుకున్నారు. తనకు రెండు లాటరీ టికెట్లు ఎలా వచ్చాయో చెబుతూ సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.. ‘గత మూప్పై ఏళ్లుగా లాటరీ టెకెట్ కొనుగోలు చేస్తున్నాం. గత వారం నా భర్య నెంబర్‌పై లాటరీ తీసుకోవడం మర్చిపోయారు. నేను చేసిన పనికి తను బాధగా ఫీల్ అయ్యింది. కోపంలో ఉన్న ఆమె ముఖం మీద చిరునవ్వు చూసేందుకు ఈ వారం తన పేరు మీదే రెండు లాటరీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సోమవారం ఉదయం నెంబర్ పరీక్షించగా మొదటి టికెట్‌పై మిలియన్ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. అప్పడే నేను తనకు రెండో టికెట్ కూడా తసుకున్నానని చెప్పాలనుకున్నా. వెంటనే రెండో టికెట్ కూడా విన్ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నాభార్యకు చెబితో ఉనందంతో ఎగిరి గంతేసింది. కాగా తన చాలా కాలంగా ఒకే నెంబర్ కాంబినేషన్ టికెట్ కొనుగోలు చేస్తోందని.. ఏదో ఒక రోజు గెలుస్తుందని ఊహించినట్లు చెప్పాడు. అయితే తన నమ్మకం నిజం కావడానికి చాలా కాలమే పట్టిందని.. ఇది ఖచ్చితంగా విలువైనదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విజయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకోనున్నట్లు తెలిపారు. కూతురికి కొత్త ఇల్లు కొనిచ్చి.. తన పిల్లలు, మనవళ్ల భవిష్యత్తు కోసం ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక దేశమంతా చుట్టి రావాలన్న ఆలోచన కూడా ఉందని అన్నారు. -
థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ.. అనూహ్య మలుపులు
ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్ (మార్ష్ కప్) 2022-23 సీజన్లో రసవత్తర సమరం జరిగింది. థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఓ మ్యాచ్ అనూహ్య మలుపులకు వేదికైంది. గబ్బా వేదికగా క్వీన్స్‌ల్యాండ్-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో క్వీన్స్‌ల్యాండ్ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్.. 49.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూసౌత్ వేల్స్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయి (49.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్) ఓటమిపాలైంది. Watch this crazy final over that included a six, an injured bowler on debut, another debutant bowling his first over halfway through the last over to replace him, and a run out that sealed a thrilling win for Queensland https://t.co/CREqRlj00C — cricket.com.au (@cricketcomau) February 26, 2023 చివరి ఓవర్లో న్యూసౌత్ వేల్స్ గెలవాలంటే 14 పరుగులు చేయాల్సి ఉండగా (చేతిలో 2 వికెట్లు ఉన్నాయి).. స్టీవెన్ మెక్గిఫిన్ వేసిన తొలి బంతినే డ్వార్షుయిష్ సిక్సర్‌గా మలిచి గెలుపుపై ధీమాను పెంచాడు. అయితే ఆతర్వాత బంతికే డ్వార్షుయిష్ (20 బంతుల్లో 44; 5 సిక్సర్లు).. బ్లేక్ ఎడ్వర్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కడే మ్యాచ్‌లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. Huge wicket for the Bulls and we have a thrilling finish coming up! #MarshCup pic.twitter.com/K0WJ4trzBp — cricket.com.au (@cricketcomau) February 26, 2023 గజ్జల్లో గాయం కారణంగా స్టీవెన్ మెక్గిఫిన్ తప్పుకోవడంతో జోష్ బ్రౌన్ బంతిని అందుకున్నాడు. బ్రౌన్ వేసిన మూడో బంతి డాట్ బాల్ కాగా.. నాలుగో బంతిని లియామ్ హ్యచర్ బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయల్సిన తరుణంలో లియామ్ హ్యాచర్ రనౌట్ కావడంతో మ్యాచ్ ముగిసింది. గెలుపుపై ధీమాగా ఉన్న న్యూసౌత్ వేల్స్ చివరి ఓవర్లో చతికిలపడి ఓటమిపాలైంది. ఈ విజయంలో క్వీన్స్‌ల్యాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సీజన్‌ను ముగించగా.. న్యూసౌత్‌వేల్స్ చిట్టచివరి ప్లేస్‌తో సీజన్‌ను ముగించింది. ఫైనల్ మ్యాచ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా-సౌత్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 8న జరుగుతుంది. -
మగ్గం నేసి.. భళా అనేసి!
భూదాన్‌పోచంపల్లి: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్ గవర్నర్ మార్గరేట్ బీజ్లీ ఏసీబీక్యూ చేనేత మగ్గంపై పోచంపల్లి ఇక్కత్ వస్త్రం నేసి అబ్బురపర్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న పవర్హౌస్మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట నిర్వహించిన చేనేత ఇక్కత్ కళా ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్ ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం భారతదేశ రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె బీజ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కత్ కళ ఎంతో నైపుణ్యంతో కూడుకొన్నదని కొనియాడారు. సిడ్నీలో మొదటిసారిగా ఇక్కత్ వస్త్ర తయారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం తడక రమేశ్, మాస్టర్‌వీవర్ పాలాది యాదగిరిని భారత రాయబారి శాలువా కప్పి సన్మానించారు. (క్లిక్: సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన) -
"ఓ మై గాడ్".. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్..
మార్ష్కప్ ఫైనల్లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో న్యూ సౌత్ వేల్స్‌ను ఓడించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫీల్డర్ హిల్టన్ కార్ట్‌రైట్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. న్యూ సౌత్ వేల్స్ ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన డిఆర్సీ షార్ట్ బౌలింగ్‌లో.. హెన్రిక్స్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ ఖాయమని అంతా భావించారు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కార్ట్‌రైట్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కార్ట్‌రైట్ తన స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో మంచి ఊపు మీద ఉన్న హెన్రిక్స్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక హెన్రిక్స్ ఔటయ్యక న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెన్‌క్రాప్ట్(39), జో రిచర్డ్సన్(44) పరుగులతో రాణించారు. ఇక 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ సౌత్ వేల్స్ 46.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లలో హెన్రిక్స్(43), డానియల్ సామ్స్(42) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ.. Catch of the summer?! Hilton goes horizontal! #MarshCup pic.twitter.com/uLQcYsXPnn — cricket.com.au (@cricketcomau) March 11, 2022 -
సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్
ఆ జట్టుకు చేతిలో ఆఖరి వికెట్.. సిక్స్ కొడితే నేరుగా ఫైనల్లోకి.. అవతలేమో హ్యాట్రిక్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న బౌలర్.. ఇక్కడ చూస్తే ఒక టెయిలెండర్ బ్యాట్స్‌మన్.. అంత ఫామ్‌లో ఉన్న బౌలర్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇంకేం గెలుస్తారులే అని మనం అనుకునేలోపూ అసాధ్యం సుసాధ్యమైంది. జట్టులోని 11వ బ్యాట్స్‌మన్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేర్చాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కింగ్స్గ్రూవ్ స్పోర్ట్స్ టి20 కప్‌లో చోటుచేసుకుంది. చదవండి: WI vs SA: సూపర్ ఓవర్లో వెస్టిండీస్ వీర బాదుడు.. 3సిక్స్‌లు, 2ఫోర్లతో విషయంలోకి వెళితే.. న్యూసౌత్ వేల్స్ వేదికగా మోస్మన్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో యునివర్సిటీ ఆఫ్ న్యూసౌత్‌వేల్స్ క్రికెట్ క్లబ్ 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. న్యూ సౌత్‌వేల్స్ కచ్చితంగా గెలుస్తుందని అంతా భావించారు.. కానీ హైడ్రామా నెలకొంది. ఆ ఓవర్ వేసిన జేక్ టర్నర్ తొలి బంతికి పరుగులివ్వలేదు. ఇక వరుసగా రెండు, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక రెండు బంతుల్లో విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి డెక్లన్ సింగిల్ తీసి మెక్లీన్కు స్ట్రైక్ ఇచ్చాడు. మెక్లీన్ అప్పుడే వచ్చిన 11వ బ్యాట్స్‌మన్.. ఆఖరి బంతికి సిక్స్ కొడితేనే జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఉత్కంఠగా మారిన వేళ టర్నర్ ఫుల్ లెంగ్త్ డెలివరీని వేశాడు. అంతే బంతి మంచి టైమింగ్‌తో రావడంతో మెక్లీన్ లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కట్‌చేస్తే.. సిక్స్ పడింది.. ఇంకేముంది బ్యాటింగ్ సైడ్ టీమ్‌లో సంబరాలు షురూ అయ్యాయి. ఎవరు ఊహించని రీతిలో న్యూసౌత్‌వేల్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. ఒకే ఒక్క సిక్స్‌తో మెక్లీన్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ Your number 11 walks to the crease. He needs 6️⃣ runs to win from 1️⃣ ball in the Semi Final. AND the bowler has just taken a hat-trick. pic.twitter.com/0acu5a3xJt — MyCricket (@MyCricketAus) January 26, 2022 -
వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా..
First Omicron Death In Australia: ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో సోమవారం మొదటి ఒమిక్రాన్ మరణం సంభవించింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 6 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్టు ధృవీకరించింది. కాగా పశ్చిమ సిడ్నీలోని ఓ వృద్ధాప్య సంరక్షణ కేంద్రంలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి (80)గా గుర్తించారు. సదరు వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెల్పింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్లో సోమవారం ఒక్కరోజులోనే 6,324 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంటెన్సివ్ కేర్‌లో 55 మంది ఉండగా, మొత్తం 524 మంది అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం నుంచి న్యూ సౌత్ వేల్స్లో కొత్త ఆంక్షలు అమల్లోకొచ్చాయి. బార్లు, రెస్టారెంట్లలో వ్యక్తుల మధ్య 2 చదరపు మీటర్ల దూరం పాటించవల్సిందిగా పేర్కొంది. సిబ్బంది కొరత కారణంగా కోవిడ్ -19కి గురైన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజార్డ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దేశాల్లో ఒమిక్రాన్ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే! తాజాగా ఆస్ట్రేలియాలో కూడా మరో మరణం నమోదుకావడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు దేశాల్లో ఒమిక్రాన్ మృతి కేసులు సంభవించినట్లు తెలస్తోంది. కాగా 108 దేశాల్లో కొత్త వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. చదవండి: మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే! -
బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. కోపంతో బంతిని లాగిపెట్టి
James Pattinson Throw Injures Opponent Batter.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేమ్స్ పాటిన్సన్ చర్యపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళితే.. షాఫీల్డ్ షీల్డ్ టోర్నీలో జేమ్స్ పాటిన్సన్ విక్టోరియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా టోర్నీలో భాగంగా విక్టోరియా, న్యూసౌత్ వేల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ డేనియల్ హ్యూజెస్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 283 బంతులెదుర్కొన్న అతను 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చదవండి: IND vs NZ 2021: టి20 కెప్టెన్‌గా రోహిత్ .. తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్!? అయితే టీ విరామానికి ముందు డేనియల్ ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ ఆడుతూ చికాకు పెట్టాడు. ఈ నేపథ్యంలో బౌలింగ్‌కు వచ్చిన జేమ్స్ పాటిన్సన్కు హ్యూజెస్ ఆట చిరాకు తెప్పించింది. పాటిన్సన్ వేసిన బంతిని హ్యూజెస్ డిఫెన్స్ ఆడగా..పాటిన్సన్ చిర్రెత్తిపోయాడు. బంతిని అందుకొని హ్యూజెస్ క్రీజులోనే ఉన్నప్పటికీ కావాలనే అతన్ని టార్గెట్ చేస్తూ కోపంతో విసిరాడు. బంతి కాస్త వెళ్లి హ్యూజెస్ పాదానికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన అతను కాసేపు క్రీజులో నుంచి పక్కకు వెళ్లాడు. ఆ తర్వాత పాటిన్సన్ క్షమాపణ చెప్పేందుకు వెళ్లగా.. హ్యూజెస్ కోపంగా చూశాడు. టీ విరామ సమయంలో పెవిలియన్ వెళ్తున్న సమయంలో పాటిన్సన్, హ్యూజెస్ మధ్య మాటలయుద్ధమే నడిచింది. కొద్దిసేపు అలాగే ఉండి ఉంటే కొట్టుకోవడానికి సిద్దమయ్యేవారే. మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే పాటిన్సన్ చర్యపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చదవండి: Daryl Mitchell: ఇది ఫీల్డింగ్ అంటే.. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు ''ఇలాంటి వ్యక్తిని ఇంకా క్రికెట్ ఆడనిస్తున్నారా.. వెంటనే బ్యాన్ చేయండి.. ప్రత్యర్థి ఆటగాడు బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. అందుకే కోపంతో బంతిని విసిరాడు.. పాటిన్సన్ చర్య దారుణం.. ఒక బ్యాటర్‌పై కోపం వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదు.. అందుకే ఆసీస్ టీమ్ అతన్ని పక్కకు పెట్టింది'' అంటూ కామెంట్స్ చేశారు. Ouch! Daniel Hughes 71* (283) continues to defy Victoria despite copping this throw from James Pattinson in the second session #SheffieldShield pic.twitter.com/ChTkupId1n — cricket.com.au (@cricketcomau) November 8, 2021 Absolutely ridiculous and unnecessary attempt by Pattinson to peg the ball back at Hughes’ stumps. I hope the match referee sanctions him for that pathetic act. — Rowan de Groen (@StuffedShoulder) November 8, 2021 Why is he still playing? Should be banned forever. Ridiculous of Pattinson. — Warisha (@Khan__Warisha) November 8, 2021 -
ఆస్ట్రేలియాకు వింత సమస్య.. సాయం చేయనున్న భారత్
సిడ్నీ: ప్రపంచం మొత్తం కరోనాతో సతమతమవుతుంటే ఆస్ట్రేలియాకు మాత్రం అనుకోని సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం అక్కడ ఎలుకలు పెద్ద సమస్యగా మారాయి. పెద్ద గుంపుగా ఏర్పడి పంట పొలాలపై దాడి చేస్తు సర్వనాశనం చేస్తున్నాయి. వివరాలు.. గత కొన్ని రోజులుగా న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమేగాక ఇళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఎక్కడ చూసిన ఎలుకలే దర్శనమిస్తుండడంతో ఏం చేయాలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్లేగు వ్యాది ప్రబలే అవకాశం కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఎలుకల సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ను సాయం కోరింది. భారత్‌లో ఎలుకల నివారణకు బ్రోమాడియోలోన్ అనే విషపదార్థాన్ని వాడేవారు. ప్రస్తుతం ఈ మందు భారత్‌లో నిషేధంలో ఉంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి దాదాపు 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కాగా న్యూ సౌత్‌వేల్స్ ప్రభుత్వం ఎలుకలను నివారించేందుకు రూ. 3,600 కోట్లు నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. భారత్ నుంచి బ్రోమాడియోలోన్ మందు రాగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతితో ఎలుకలను చంపేందుకు కార్యచరణ మొదలుపెట్టనున్నారు. చదవండి: మూసేసిన స్కూల్లో 215 మంది పిల్లల అస్థిపంజరాలు లభ్యం -
వైరల్ : ప్రాణాలకు తెగించి కోలాను కాపాడింది
న్యూసౌత్ వేల్స్ : ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు ఇప్పటికి తగలబడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న అడవిలో మంటల్లో చిక్కుకున్న ఎలుగుబంటి జాతికి చెందిన కోలాను ఒక మహిళ ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కాగా, బుధవారం న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో బారీగా కార్చిచ్చు అంటుకొని 110 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెట్ల పొదళ్లకు కార్చిచ్చు అంటుకోవడంతో కోలా తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న టోనీ డోహర్తి అనే మహిళ చెట్ల పొదల్లో చిక్కుకున్న కోలాను చూసి దానిని కాపాడడానికి పరిగెత్తింది. దానిని మంటల నుంచి బయటికి తీసి తను వేసుకున్న షర్ట్‌ను విప్పి మంటలను అదుపు చేసేందుకు దాని చుట్టూ కప్పి కారు దగ్గరికి తీసుకువచ్చారు. కోలాకు ఆహారం పెట్టి నొప్పి తెలియకుండా ఉండేందుకు నీరు చల్లారు. తర్వాత దానిని పూర్తిగా బ్లాంకెట్‌తో కప్పి ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న కోలా శరీరం బాగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగానే ఉంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. టోనీ డోహర్తి చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ఆమె ఒక యోధురాలు అంటూ ప్రశంసిస్తున్నారు. తనకు ఏమైనా పర్వాలేదు ఎలాగైనా కోలాను కాపాడాలని ఆమె చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. -
ఐస్ ప్యాక్‌లో ప్రమాదకర డ్రగ్స్ నింపి...
సిడ్నీ : అత్యంత ప్రమాదకరమైన మెథాంఫేటమైన్ డ్రగ్ సరఫరాకు సంబంధించిన కేసును ఆస్ట్రేలియా పోలీసులు ఛేదించారు. 300 ఆస్ట్రేలియన్ డాలర్లు విలువ చేసే 400 కిలోల ఐస్‌ప్యాక్‌లు కలిగిన చిల్లీ బాటిల్స్‌ను న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు సీజ్ చేశారు. అక్టోబర్ 15 న అమెరికా నుంచి దిగుమతి అయిన 768 చిల్లీ బాటిల్స్‌లో అత్యంత శక్తివంతమైన మెథాంఫేటమైన్ డ్రగ్‌ను ఐస్ క్రిస్టల్స్ రూపంలో నింపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో డిఫోలో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగురి హస్తం ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో బస చేస్తున్న నిందితులను వేర్వేరు సమయాల్లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారు ప్రయాణిస్తున్న కారులో నుంచి ఎనిమిది, హోటల్ రూమ్ నుంచి మరో 26 బాక్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. 'ఇది చాలా సంక్లిష్టమైన కేసు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న మెథాంఫేటమైన్ను వెలికి తీయడానికి సిడ్నీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒక రహస్య ప్రయోగశాలలో దీనికి సంబంధించిన ప్రక్రియను జరుపుతున్నట్లు తెలిసిందని' స్టేట్ క్రైమ్ కమాండర్ స్టువర్ట్ స్మిత్ ప్రకటనలో తెలిపారు. ఐస్ రూపంలో ఉండే 'మెథాంఫేటమైన్' అనేది అత్యంత శక్తివంతమైన డ్రగ్సలో ఒకటి. తాజా గణాంకాల ప్రకారం 2018 సంవత్సరంలో జూన్ వరకు రికార్డు స్థాయిలో 30.6 టన్నుల 'మిథైలాంఫేటమిస్'ను సీజ్ చేసినట్లు ఆస్ట్రేలియన్ క్రైమ్ ఇంటెలిజెన్స్ కమిషన్ తమ నివేదికలో వెల్లడించింది. -
ఆ బంతి తలకు తగిలుంటే..
సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌ల్లో భాగంగా న్యూ సౌత్‌వెల్స్ క్రికెటర్ మికీ ఎడ్వర్డ్స్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎడ్వర్డ్స్ వేసిన బంతిని క్వీన్‌లాండ్స్ బ్యాట్స్‌మన్ సామ్యూల్ హీజ్లెట్ స్టైట్ డ్రైవ్ కొట్టాడు. దీన్ని ఎడ్వర్డ్స్ ఆపడానికి యత్నించే క్రమంలో తల పక్క నుంచి దూసుకుపోయింది. తన చేతిని అడ్డం పెట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. అదే బంతి తలకు తగులుంటే పెద్ద ఘోరమే జరిగేదని విశ్లేషకులతో పాటు అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎడ్వర్డ్స్ తృటిలో ఒక భయానక క్షణం నుంచి బయటపడ్డందుకు ఆ దేవునికి ధన్యవాదాలు చెప్పాలని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మికీ ఎడ్వర్డ్స్ ఆ బంతిని తప్పించుకునే క్రమంలో నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న లబూషేన్ భయాందోళనకు గురయ్యాడు. గతంలో ఆసీస్ క్రికెటర్ హ్యూజ్ తలకు బంతి తగిలి మృతి చెందగా, ఇటీవల యాషెస్ సిరీస్ ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి మెడ వెనుక భాగంలో బలంగా తగలడంతో ఫీల్డ్‌లో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను తేరుకోవడంతో ఆసీస్ మేనేజ్మెంట్ ఊపిరిపీల్చుకుంది. -
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
-
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
హోబర్ట్ : క్రికెట్లో ఇప్పటివరకు బౌండరీ లైన్ వద్దనే ఫీల్డర్లు కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడం చూసుంటాం. కానీ స్లిప్‌లో మిరాకిల్ క్యాచ్‌లు చూడటం చాలా అరుదు. ఎందుకంటే అనూహ్యంగా వచ్చే బంతులను అందుకోవాలంటే.. ఫీల్డర్లు ఎంతో చురుకుగా, చాకచక్యంగా ఉండాలి. దీంతో బౌండరీల వద్ద కంటే స్లిప్‌లో ఫీల్డిండ్ చేయడమే యమా డేంజరు. అయితే స్లిప్‌లో అనూహ్య క్యాచ్‌లు అందుకొని జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ స్లిప్‌లో పట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ వేడ్‌ను, ఆ జట్టు ఆటగాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. టీమ్ వర్క్ అంటే ఇది అని కామెంట్ చేస్తున్నారు. ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా న్యూసౌత్ వేల్స్, టాస్మానియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ పట్టిన క్యాచ్ క్రికెట్లోని అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. దాదాపు నేలపాలైందనుకున్న క్యాచ్‌ను వేడ్ ఎంతో చాకచక్యంగా అందుకున్నాడు. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ బ్యాట్స్‌మన్ డేనియల్ హ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న అలెక్స్ డూలాన్ వదిలేశాడు. ఆ బాల్ నేలను తాకుతుందనగా.. క్షణాల్లో తన ఎడమవైపు డైవ్ చేసి దానిని అందుకున్నాడు మాథ్యూ వేడ్. సహజంగా వికెట్ కీపర్ అయిన వేడ్.. ఆ స్కిల్స్‌ను ఉపోయోగించి క్యాచ్ అందుకున్నాడు. -
10 మంది సున్నా... 10 ఆలౌట్!
సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ (మహిళల డివిజన్) మ్యాచ్‌లో అనూహ్య రికార్డు నమోదైంది. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన ‘నేషనల్ ఇండిజినస్ క్రికెట్ చాంపియన్‌షిప్’ పోరులో సౌత్ ఆస్ట్రేలియా జట్టు 10 పరుగులకే కుప్పకూలింది! ఇందులో ఓపెనర్ మాన్సెల్ (33 బంతుల్లో 4) మాత్రమే పరుగులు చేయగలిగింది. మిగతా పది మంది ‘సున్నా’కే పరిమితమయ్యారు. ఎక్స్ట్రాలుగా వచ్చిన 6 పరుగులే జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ కావడం విశేషం. ప్రత్యర్థి బౌలర్లు ‘వైడ్’ల ద్వారా ఈ అదనపు పరుగులు ఇచ్చారు. టీమ్ ఇన్నింగ్స్ 10.2 ఓవర్ల వరకు సాగగలిగింది. న్యూ సౌత్‌వేల్స్ బౌలర్ రాక్సెన్ వాన్ వీన్ 2 ఓవర్లలో 1 పరుగిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం న్యూసౌత్‌వేల్స్ 2.5 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు చేసి విజయాన్నందుకుంది. -
‘సిక్సర’ పిడుగు... ఆసీస్ కుర్రాడు
అడిలైడ్: ఆస్ట్రేలియా టీనేజ్ క్రికెటర్ ఓలీ డేవిస్ తన బ్యాట్‌తో అండర్–19 వన్డే క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించాడు. వరుస 6 బంతుల్లో 6 సిక్సర్లతో పాటు డబుల్ సెంచరీ రికార్డుని సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అండర్–19 వన్డే నేషనల్ చాంపియన్‌షిప్‌కు సిక్సర్ల సునామీతో ఘన ఆరంభాన్నిచ్చాడు. సోమవారమే మొదలైన ఈ టోర్నీలో న్యూసౌత్‌వేల్స్ మెట్రో కెప్టెన్, 18 ఏళ్ల డేవిస్... నార్తర్న్ టెరిటరీ (ఎన్టీ) జట్టుపై చెలరేగాడు. 115 బంతుల్లో 14 ఫోర్లు, 17 సిక్సర్లతో 207 పరుగులు చేసి ఈ వన్డే చాంపియన్‌షిప్‌లో ‘డబుల్’ చరిత్రను తనపేర రాసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన రోహిత్ శర్మ (భారత్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్ (వెస్టిండీస్)లను మించిపోయాడు. 100 పరుగులను 74 బంతుల్లో పూర్తిచేసిన ఈ సిడ్నీ సంచలనం తర్వాతి 100 పరుగులను కేవలం 39 బంతుల్లోనే సాధించడం విశేషం. ఎన్టీ స్పిన్నర్ జాక్ జేమ్స్ వేసిన 40వ ఓవర్లో అతను వరుస ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్ (భారత్), జోర్డాన్ క్లార్క్ (ఇంగ్లండ్) వరుస ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు. గిబ్స్, యువరాజ్ సింగ్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో... సోబర్స్, జోర్డాన్ క్లార్క్ కౌంటీ క్రికెట్లో... రవిశాస్త్రి రంజీ క్రికెట్లో ఈ ఘనత సాధించారు. ఓలీ డేవిస్ ధాటికి ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ మెట్రో 50 ఓవర్లలో 4 వికెట్లకు 406 పరుగుల భారీస్కోరు చేయగా, నార్తర్న్ టెరిటరీ 238 పరుగుల వద్ద ఆలౌటైంది. మెట్రో జట్టు 168 పరుగులతో జయభేరి మోగించింది. -
చిన్నారికి ఎంత కష్టం..
న్యూ సౌత్ వేల్స్ : ఐదేళ్ల ప్రాయంలోనే జీవిత కాలంలో అనుభవించే కష్టాలన్ని అనుభవిస్తోంది ఓ చిన్నారి. 4 ఏళ్ల చిరు ప్రాయంలోనే చిన్నారికి పీరియడ్స్ రావడం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఎమిలీ డోవర్స్ అనే ఐదేళ్ల బాలిక ఆడిసన్స్ వ్యాధి బారిన పడింది. దీంతో హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తే 5 ఏళ్లకే మోనో పాజ్ దశకి చేరుకోనుంది. అడ్రినల్ గ్రంథికి వచ్చే చాలా అరుదైన వ్యాధి ఇది. రెండు హార్మోన్లు కార్టిసోల్, ఆల్డోస్టిరాన్ల లోపంతో చిన్నారి ఇబ్బంది పడుతోంది. సాధారణంగా ముప్పై ఏళ్లుపైబడిన వారిలోనే చాలా అరుదుగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. పుట్టినప్పుడు అందరి పిల్లల్లానే ఎమిలీ డోవర్స్ మామూలుగా, సంతోషంగానే ఉండేది. అయితే రెండు వారాలు గడవగానే చిన్నారి పెరుగుదల అసాధారణంగా మారింది. నాలుగు నెలలకే ఏడాది చిన్నారిలా కనిపించేది. ఎమిలీ రెండేళ్ల వయస్సులోనే రొమ్ముల పెరుగుదల, శరీరం నుంచి వాసన రావడం, చర్మంపైన దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత అవాంచిత రోమాలు, మొటిమలు రావడం కూడా ప్రారంభమయ్యాయి. అడిసన్స్ వ్యాధితో పాటూ పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్ ప్లాసియా, సెంట్రల్ ప్రికాసియస్ పబర్టీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెన్సరి ప్రోసెసింగ్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నట్టు వైద్యుల పరీక్షల్లో తేలింది. మిగతా పిల్లలకన్నా తాను భిన్నంగా ఉన్న విషయం ఎమిలీకి తెలుసని తల్లి టామ్ డోవర్ పేర్కొన్నారు. నిరంతర నొప్పి, చురుకుదనం లోపించడంతో ఫిజియోథెరపీ సెషన్లలో వారాంతాల్లో పాల్గొనాల్సి ఉంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తే మోనోపాజ్ దశకు చేరుకోనుంది. అంటే దాదాపు 50 ఏళ్ల మహిళలకు ఎదురయ్యే దుష్ప్రభావాలు మోనోపాజ్తో చిన్నారికి వచ్చే అవకాశం ఉంది. చిన్నతనంలో అనుభవించాల్సిన బాల్యాన్ని ఎమిలీ కోల్పోయిందని తల్లి టామ్ డోవర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఎమినీ వైద్య సాయానికి భారీగా డబ్బు కావల్సి రావడంతో 'గోఫండ్‌మీ'లో విరాళాల కోసం ఓ పేజీని క్రియేట్ చేశారు. -
‘60 ఏళ్లలో ఇలాంటి అనుభవమే లేదు’
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ సెల్వూడ్(73) అనే ఓ పెద్ద మనిషికి ఓ భయానక అనుభవం ఎదురైంది. బోటులో సరదాగా చేపల వేటకు వెళ్లి తిరిగొస్తుండగా ఒక పెద్ద షార్క్ అతడు ప్రయాణిస్తున్న పడవను ఢీకొట్టి అమాంతం బోటులో పడింది. అదిపడిన వేగానికి ఆ బోటులోని టెర్రీ కాస్త గాల్లోకి ఎగిరి నీళ్లల్లో పడ్డాడు. సరిగ్గా అతడు ఒడ్డుకు చేరుకునే సమయంలో ఈ ఘటన జరగడంతో తొందరగా స్పందించిన సమీప గస్తీ దళం అతడిని రక్షించింది. చేతికి స్వల్పగాయంతో బతికి బయటపడ్డాడు. టెర్రీ సెల్వూడ్ మరో నలుగురితో కలిసి న్యూసౌత్వెల్స్లోని ఎవాన్స్ జలాల్లో తన మరపడవపై చేపల వేటతో విహరిస్తున్నాడు. ఆ సమయంలో అతడికి ఎదురైన అనుభవం ఆయన మాటల్లోనే చూస్తే.. ‘బోటువైపు ఏదో దూసుకొస్తున్నట్లుగా నాకు కొంచెం మసకగా అనిపించింది. వేగంగా ఓ షార్క్ వచ్చి నా చేతిని అందుకొని మెలేసింది.. నా కాళ్లను చేతుల్ని పట్టి కిందపడేసేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో అది కాస్త వచ్చి బోటులో పడటంతో నేను గాల్లోకి ఎగిరిపడ్డాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నీళ్లలో పడ్డాను. ఒక పెద్ద అల వచ్చి నన్ను ముంచెత్తేలోగా కొంతమంది రక్షించారు. షార్క్ దాదాపు తొమ్మిది అడుగులు ఉంది. నా బోటు దానికి ఇరుకైపోయింది. నేను 60 ఏళ్లుగా చేపలుపడుతున్నా నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు’ అని ఆయన చెప్పారు. -
భారీ ఉడుమును భలే ఈడ్చిపారేసింది
న్యూసౌత్‌వేల్స్: చిన్న బొద్దింకను చూస్తేనే అమ్మాయిలు బాబోయ్ అంటూ అమ్మాయిలు ఎగిరిగంతేస్తారు.. అలాంటిది అచ్చం ఓ చిన్నసైజు గాడ్జిల్లాలాంటి ఉడుమును చూస్తే పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే ఉలిక్కిపడేట్టు ఉంది కదా! కానీ, ఓ అమ్మాయి ఆ ఉడుమును చూడటమే కాదు దాని తోకపట్టుకొని ఈడ్చి పారేసింది. తన రెస్టారెంటులో అడుగుపెట్టడానికి నీకెన్ని గుండెలు అన్నట్లుగా ఆ ఉడుమును అవలీలగా అదేదో కొబ్బరిమట్టను ఈడ్చుకెళ్లి బయటపడేసినట్లు విసిరేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని రెస్టారెంట్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఫేసబుక్‌లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. సామియా లిలా(25) అనే యువతి న్యూసైత్ వేల్స్‌లోని మిమోసా వైన్స్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తోంది. ఆ రెస్టారెంటులోకి అత్యంత అరుదైన రకానికి చెందిన భారీ ఉడుము వచ్చి అక్కడ ఉన్నవారిని హడలెత్తించింది. చాలామంది కేకలు పెట్టి భయంతో పరుగులు పెట్టేట్లు చేసినా ఆ యువతి మాత్రం దానిని చాలా సింపుల్‌గా తీసుకొని తోకపట్టి ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లింది. అది తిరగబడే ప్రయత్నం చేసినా ఎంతో నైపుణ్యంతో చాకచక్యంగా పట్టుకొని బయటకు పడేసి కస్టమర్లు అవాక్కయ్యేలా చేసింది. ఇలా ఎలా చేయగలిగావని ప్రశ్నించిన వాళ్లకు అలాంటి జంతువులంటే తనకు చాలా ఇష్టం అని, అందుకే దానిని పట్టుకోగలిగానని చెప్పుకొచ్చింది. -
నక్క జిత్తులు ఫలించలేదు...!
-
నక్క జిత్తులు ఫలించలేదు...!
అనాదిగా వస్తున్న ‘ఆహార గొలుసు’ నియమం ప్రకారం కొండచిలువను చంపి తినాలన్న గుంట నక్క.. అనూహ్యంగా దాని చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయింది. మనుగడకోసం జరిగిన ఈ భీకర పోరాటం తాలూకు ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. న్యూసౌత్ వేల్స్ (బ్రిటన్)కు చెందిన తండ్రీ కొడుకులు పనిమీద పట్నం పోయి ఊరికి తిరిగి వస్తూ మధ్యలో కాసేపు కారు ఆపారు. పక్కనుంచే గట్టిగా కసా–బుసా శబ్ధాలు వినిపించడంలో అటుగా కదిలారు. తీరాచూస్తే.. కొండచిలువ–నక్కల పోరాటం. అప్పటికే నక్క తన కోరపళ్లతో కిండచిలువ తలను నమిలే ప్రయత్నం చేసింది. తనను తాను కాపాడుకునే క్రమంలో ఆ రెండు మీటర్ల భారీ కొండచిలువ... నక్కను అమాంతం చుట్టేసి నలిపేసింది. దీంతో ఊపిరాడక నక్క చచ్చిపోయింది. ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సాహస తండ్రీ కొడుకులు.. ఇంకాస్త దగ్గరికి వెళ్లి నక్క నోట్లో నుంచి కొండచిలువ తలను బయటికి తీశారు. నక్కను చుట్టుముట్టిన కొండచిలువను కూడా వేరు చేసేందుకు ప్రయత్నించేశారట. కానీ విజయగర్వంతో ఊగిపోతున్న ఆ కొండచిలువ వీళ్లకేసి బుసలు కొట్టడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారట! -
భీకర పోరాటంలో ఊహించని మలుపు
అనాదిగా వస్తోన్న 'ఆహార గొలుసు' నియమం ప్రకారం కొండచిలువను చంపి తినాలనుకున్న గుంట నక్క.. అనూహ్యంగా ఉడుంపట్టుకు చిక్కి కుక్కచావు చచ్చింది. మనుగడకోసం జరిగిన ఈ భీకర పోరాటం తాలూకు ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. న్యూసౌత్ వేల్స్(బ్రిటన్)కు చెందిన తండ్రీకొడుకులు పనిమీద పట్నం పోయి ఊరికి తిరిగి వస్తూ మధ్యలో కాసేపు కారు ఆపారు. పక్కనుంచే గట్టిగా కసా-బుసా శబ్ధాలు వినిపించడంతో అటుగా కదిలారు. తీరా చూస్తే.. కొండచిలువ-నక్కల పోరాటం. అప్పటికే నక్క తన కోరపళ్లతో కొండచిలువ తలను నమిలే ప్రయత్నం చేసింది. తనను తాను కాపాడుకునే క్రమంలో ఆ రెండు మీటర్ల భారీ కొండచిలువ.. నక్కను అమాంతం చుట్టేసి నలిపేసింది. దీంతో ఊపిరాడక నక్క చచ్చిపోయింది. ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సాహస తండ్రీకొడుకులు.. ఇంకాస్త దగ్గరికి వెళ్లి నక్క నోట్లో నుంచి కొండచిలువ తలను బయటికి తీశారు. నక్కను చుట్టుముట్టిన కొండచిలువ కూడా వేరుచేసేందుకు ప్రయత్నించేశారట. కానీ విజయగర్వంతో ఊగిపోతోన్న ఆ కొండచిలువ వీళ్లకేసి బుసలు కొట్టడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారట! -
సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద కలకలం
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక సిడ్నీ హార్బర్ వంతెనపైకి ఎక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 9 గంటలకు (స్థానిక కాలమానం) కారులో అతడు బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. ట్యాక్సీలోంచి దిగి వంతెనపైకి ఎక్కాడు. తర్వాత తాపీగా చేతులు కట్టుకుని బ్రిడ్జి ఆర్చిపైన మౌనంగా కూర్చుకున్నాడు. కిందకు రమ్మని కోరినా మొదట అతడు నిరాకరించాడని లోకల్ మీడియాతో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు. హార్బర్ వంతెనపై కొన్ని లైన్లు మూసివేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు రెండు గంటల పాటు వంతెన పైనే కూర్చున్న అతడు 10.50 గంటల ప్రాంతంలో కిందకు దిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని భావించి రాయల్ నార్త్ షోర్ ఆస్పత్రికి తరలించారు. అతడి వ్యక్తిగత వివరాలు, ఎందుకు వంతెన ఎక్కాడనే విషయాలు వెల్లడి కాలేదు. వంతెనపై 75 మీటర్ల ఎత్తు వరకు అతడు ఎక్కాడని స్థానిక మీడియా పేర్కొంది. -
గబ్బిలాల దండయాత్రతో సిటీలో ఎమర్జెన్సీ!
లక్ష గబ్బిలాలు ఒక్కసారిగా నగరంపై దండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది. హర్రర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది కదా! ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ రాష్ట్రంలోని బాటెమన్స్ బే నగరంపై ఒక్కసారిగా గబ్బిలాలు విరుచుకుపడ్డాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని విధించారు. నగరంలోని ప్రతి చెట్టుకూ, ప్రతి ఇంటికి పైకప్పునకు గబ్బిలాలు కుప్పలుతెప్పలుగా వేలాడుతుండటంతో అధికారులు బాటెమన్స్ బే వాసులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని, తలుపులు, కిటికీలు మూసుకొని భద్రంగా ఉండాలని సూచించారు. గబ్బిలాల రాకతో పట్టణమంతా గందరగోళంగా మారిపోయింది. 'నేను కిటికీ తలుపులు తీయలేని పరిస్థితి నెలకొని ఉంది. తడి దుస్తులు ఆరుబయట ఆరేద్దామన్న వీలుకావడం లేదు. గబ్బిలాలు చేసే రోదతో ఇంట్లో ప్రశాంతంగా ఉందామన్నా, చదువుకుందామన్నా కుదరడం లేదు' అని డానియెల్ స్మిత్ వాపోయాడు. నగరంలోని ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఫ్లయింగ్ ఫాక్స్ టాస్క్ ఫోర్స్.. 'గతంలో ఎన్నడూ ఊహించని విపత్కర పరిస్థితి ఇది. ఇంత పెద్దమొత్తంలో గబ్బిలాలు రావడం గతంలో ఎన్నడూ చూడలేదు' అని ఒక ప్రకటనలో పేర్కొంది. గబ్బిలాలు అంతరించిపోయే ప్రాణులు జాబితాలో ఉండటంతో అధికారులు వాటిని చంపలేని పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పొగపెట్టి, శబ్దాలు చేస్తూ వాటిని తరిమేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
మంచు కురిసే వేళలో..
-
తుట్టె కదల్చకుండానే... పుట్టెడు తేనె!
తేనెతుట్టెను కదల్చకుండా... తేనెటీగలను తరిమేయకుండా పుట్టతేనెను సేకరించ గలమా? అబ్బే... అస్సలు సాధ్యం కాదంటున్నారా? మామూలుగానైతే వీలుకాక పోవచ్చుగానీ.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు స్టూవర్ట్ ఆండర్సన్, సెడార్ల ఆవిష్కరణ పుణ్యమా అని అదిప్పుడు సాధ్యమే. ఇందు కోసం వారు కృత్రిమ తేనెపట్టునొకదాన్ని తయారు చేశారు. ప్రత్యేక పదార్థాలతో తయారైన ఈ తేనెపట్టులో తేనెటీగలు నివాసముండే షడ్భుజి ఆకారపు రంధ్రాలు ఉంటాయి. తేనెటీగలు పూల నుంచి సేకరించే మకరందాన్ని ఈ రంధ్రాల్లోనే నిల్వ చేస్తాయి. అయితే ఒక మీట ద్వారా ఈ రంధ్రాల న్నింటి నుంచి తేనె నేరుగా కిందకు దిగేలా చేయవచ్చు. పట్టు దిగువభాగంలో గొట్టాన్ని ఏర్పాటు చేసి నేరుగా తేనె సేకరించవచ్చు. ఇది కూడా భలే ఐడియానే! -
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు