ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్ (మార్ష్ కప్) 2022-23 సీజన్‌లో రసవత్తర సమరం జరిగింది. థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఓ మ్యాచ్ అనూహ్య మలుపులకు వేదికైంది. గబ్బా వేదికగా క్వీన్స్‌ల్యాండ్-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో క్వీన్స్‌ల్యాండ్ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్.. 49.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూసౌత్ వేల్స్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయి (49.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్) ఓటమిపాలైంది.
Watch this crazy final over that included a six, an injured bowler on debut, another debutant bowling his first over halfway through the last over to replace him, and a run out that sealed a thrilling win for Queensland https://t.co/CREqRlj00C
— cricket.com.au (@cricketcomau) February 26, 2023
చివరి ఓవర్‌లో న్యూసౌత్ వేల్స్ గెలవాలంటే 14 పరుగులు చేయాల్సి ఉండగా (చేతిలో 2 వికెట్లు ఉన్నాయి).. స్టీవెన్ మెక్‌గిఫిన్ వేసిన తొలి బంతినే డ్వార్షుయిష్ సిక్సర్‌గా మలిచి గెలుపుపై ధీమాను పెంచాడు. అయితే ఆతర్వాత బంతికే డ్వార్షుయిష్ (20 బంతుల్లో 44; 5 సిక్సర్లు).. బ్లేక్ ఎడ్వర్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కడే మ్యాచ్‌లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Huge wicket for the Bulls and we have a thrilling finish coming up! #MarshCup pic.twitter.com/K0WJ4trzBp
— cricket.com.au (@cricketcomau) February 26, 2023
గజ్జల్లో గాయం కారణంగా స్టీవెన్ మెక్‌గిఫిన్ తప్పుకోవడంతో జోష్ బ్రౌన్ బంతిని అందుకున్నాడు. బ్రౌన్ వేసిన మూడో బంతి డాట్ బాల్ కాగా.. నాలుగో బంతిని లియామ్ హ్యచర్ బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయల్సిన తరుణంలో లియామ్ హ్యాచర్ రనౌట్ కావడంతో మ్యాచ్ ముగిసింది. గెలుపుపై ధీమాగా ఉన్న న్యూసౌత్ వేల్స్ చివరి ఓవర్‌లో చతికిలపడి ఓటమిపాలైంది. ఈ విజయంలో క్వీన్స్‌ల్యాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సీజన్‌ను ముగించగా.. న్యూసౌత్‌వేల్స్ చిట్టచివరి ప్లేస్‌తో సీజన్‌ను ముగించింది. ఫైనల్ మ్యాచ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా-సౌత్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 8న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment