కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి.
వివరాల్లోకెళ్తే..క్వీన్స్‌లాండ్‌లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్‌పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్‌లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి.
అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్‌కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి.
తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్‌గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది.
ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్‌లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం.
(చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..)
Comments
Please login to add a commentAdd a comment