ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని కోయకపోయినా కన్నీళ్లు వస్తాయి, అది వేరే విషయం! కోసినా కన్నీళ్లు తెప్పించని ఉల్లిపాయలు ఇటీవల ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి వచ్చాయి. మిగిలిన కూరగాయల్లాగానే వీటిని కూడా సంతోషంగా తరుక్కోవచ్చని, వీటిని కోసినప్పుడు కళ్లుమండటం, కన్నీళ్లు రావడం జరగదని చెబుతున్నారు. ఈ రకం ఉల్లిపాయలను ‘హ్యాపీ చాప్స్’ బ్రాండ్ పేరుతో విడుదల చేశారు.
తొలిసారిగా ఈ ఉల్లిపాయలను ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ సపర్‌మార్కెట్లలోకి జూలై 12 నుంచి అందుబాటులోకి తెచ్చారు. జన్యుమార్పిడి ద్వారా ఉల్లిపాయల్లోని కన్నీళ్లు తెప్పించే రసాయనాలు లేకుండా చేసి, వీటిని ప్రత్యేకంగా పండించారు. వీటిని కోసిన తర్వాత వీటిలో కన్నీళ్లు తెప్పించే రసాయనాలు తగ్గిపోతాయి. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా లేకుండాపోతాయి. సాధారణ రకాలకు చెందిన ఉల్లిపాయల్లో రోజులు గడిచేకొద్దీ ఈ రసాయనాలు ఎక్కువై, మరింతగా కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయలను కోసినప్పుడు కన్నీళ్లు రాకున్నా, వీటి ధర వింటే కన్నీళ్లు రావడం ఖాయం. ‘హ్యాపీచాప్స్’ ఉల్లి కిలో ధర 5 డాలర్లు (ర.411) వత్రమే!.
(చదవండి: పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్)
Comments
Please login to add a commentAdd a comment