cries
-
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్‌కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్‌కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్‌పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
నాకే ఎందుకిలా జరుగుతోంది.. ఏడ్చేసిన పప్పూ యాదవ్
పాట్నా: మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ బీహార్‌లోని పూర్నియా స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు పదేపదే టికెట్ ఎందుకు దక్కడం లేదంటూ బోరున ఏడ్చేశారు. వేదికపై ఏడుస్తూనే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లపై పప్పూ యాదవ్ విరుచుకుపడ్డారు. పూర్నియాకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ ఆర్జేడీ తమ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. తనలో ఏం లోపముందని పూర్ణియాను విడిచిపెట్టి మరో స్థానానికి వెళ్లమంటున్నారని ప్రశ్నించారు. 'నాలో ఏమి లోటు ఉంది? మధేపురా లేదా సుపాల్‌కి వెళ్లమని నాకు మళ్లీ మళ్లీ ఎందుకు చెబుతున్నారు? కాంగ్రెస్‌లో నా పార్టీ విలీనానికి ముందు కూడా లాలూ యాదవ్‌ను కలిశాను. పూర్ణియాను వదిలి ఎక్కడికీ వెళ్లలేనని చెప్పాను' అని యాదవ్ కన్నీళ్లతో చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తనపై నామినేషన్ వేస్తున్న తన ప్రత్యర్థి భీమా భారతిపై కూడా పప్పు యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. चाहे जितना कर लो जुल्मों सितम पूर्णिया का जन जन है तैयार स्वाभिमान जीतेगा इस बार #पूर्णिया_मांगे_पप्पू_यादव #PappuYadav #प्रणाम_पूर्णिया pic.twitter.com/GBi0lLFGqI — Jan Adhikar Party (Loktantrik) Fan Club (@jap4bihar) April 4, 2024 -
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్‌పై దాడి.! భారత్‌కు పన్నూ బెదిరింపులు -
ఈ ఉల్లిపాయాలు కోస్తే కన్నీళ్లు రావు!..కానీ ధర వింటే కన్నీళ్లు ఖాయం!
ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని కోయకపోయినా కన్నీళ్లు వస్తాయి, అది వేరే విషయం! కోసినా కన్నీళ్లు తెప్పించని ఉల్లిపాయలు ఇటీవల ఆస్ట్రేలియా మార్కెట్లోకి వచ్చాయి. మిగిలిన కూరగాయల్లాగానే వీటిని కూడా సంతోషంగా తరుక్కోవచ్చని, వీటిని కోసినప్పుడు కళ్లుమండటం, కన్నీళ్లు రావడం జరగదని చెబుతున్నారు. ఈ రకం ఉల్లిపాయలను ‘హ్యాపీ చాప్స్’ బ్రాండ్ పేరుతో విడుదల చేశారు. తొలిసారిగా ఈ ఉల్లిపాయలను ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్ సపర్మార్కెట్లలోకి జూలై 12 నుంచి అందుబాటులోకి తెచ్చారు. జన్యుమార్పిడి ద్వారా ఉల్లిపాయల్లోని కన్నీళ్లు తెప్పించే రసాయనాలు లేకుండా చేసి, వీటిని ప్రత్యేకంగా పండించారు. వీటిని కోసిన తర్వాత వీటిలో కన్నీళ్లు తెప్పించే రసాయనాలు తగ్గిపోతాయి. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా లేకుండాపోతాయి. సాధారణ రకాలకు చెందిన ఉల్లిపాయల్లో రోజులు గడిచేకొద్దీ ఈ రసాయనాలు ఎక్కువై, మరింతగా కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే, ఈ ఉల్లిపాయలను కోసినప్పుడు కన్నీళ్లు రాకున్నా, వీటి ధర వింటే కన్నీళ్లు రావడం ఖాయం. ‘హ్యాపీచాప్స్’ ఉల్లి కిలో ధర 5 డాలర్లు (ర.411) వత్రమే!. (చదవండి: పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్) -
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్‌స్టాప్‌గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్‌కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్‌స్టాప్‌గా ఏడవం అనే ఫీట్‌ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్‌ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
కన్నకొడుకు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణ
Super Star Krishna Cried After Seeing Ramesh Babu For Last Time, Video Viral: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో రమేశ్ బాబు భౌతికకాయాన్ని కాసేపు ఉంచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అయితే కొడుకును కడసారి చూసేందుకు అక్కడికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడి భౌతికకాయన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 56 ఏళ్ల వయసులోనే కొడుకు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. -
పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్
News Reader Cries While Reading Puneeth Rajkumar Death News: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్.. 46ఏళ్ల వయసులోనే చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మరణం తీవ్రంగా కలివేస్తుంది. చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? ఈ క్రమంలో పునీత్ మరణవార్తకు సంబంధించి న్యూస్ చదువుతూ ఓ యాంకర్ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదువుతూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. కొద్ది సేపటి వరకు అలానే ఏడుస్తూ కనిపించింది. కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ న్యూస్‌ను కంటిన్యూ చేసింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ కావడంతోపునీత్ అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై.. అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు -
భర్తతో గొడవ, పోలీసుల ముందు ఏడ్చేసిన శిల్పా
పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుంద్రాను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు కేసుకు సంబంధించి అతడి భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రాను వెంటబెట్టుకొని జుహులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కుంద్రా, శిల్పాశెట్టిలను విచారిస్తుండగా శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెబుతూ పోలీసుల ముందు శిల్పా ఎమోషనల్ అయిందట. అంతేకాకుండా ఈ కేసు వల్ల కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయ్యాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ నిమిత్తం ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రాతో శిల్పా వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పోలీసుల విచారణలో మాత్రం భర్తను వెనకేసుకొచ్చిందని, రాజ్‌కుంద్రా శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని శిల్పా తన వాంగ్మూలంలో వివరించింది. ఇక హాట్‌షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్‌పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రపంచ ఫ్యాషన్ షోలో కన్నీరు పెట్టిన సుందరి
బ్యాంకాక్: ప్రపంచ దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఫ్యాషన్ షో అది. హొయలు ఒలుకుతూ.. తమ అందచందాలను చూపుతూ ఆహూతులను ఆకట్టుకునేలా వయ్యారంగా నడుస్తున్నారు. వందలాది మంది పాల్గొన్న ఆ షోలో 20 మంది తుది పోటీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారితో నిర్వాహకులు మాట్లాడించారు. ఈ క్రమంలో ఓ సుందరి మాట్లాడుతూ.. తన దేశాన్ని తలుచుకునూ కన్నీటి పర్యంతమైంది. నా దేశాన్ని కాపాడండి’ అంటూ అంతర్జాతీయ వేదికపై రోదిస్తూ విజ్ఞప్తి చేసింది. ఈ రోజు నా సోదరులు 64 మంది మృతి చెందారని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ పరిణామం మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించింది. బ్యాంకాక్ మిస్ గ్రాండ్ పోటీలు-2020 ఉత్సాహంగా జరుగుతున్నాయి. మయన్మార్‌కు చెందిన 22 ఏళ్ల హాన్ లే కూడా పాల్గొంది. తన అందం.. వస్త్రధారణ, నడక, చూపులతో అందరినీ దృష్టిని ఆకర్షించి టాప్ 20 మందిలో చోటు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన దేశంలో జరుగుతున్న పరిణామాలను వివరించింది. ‘ఈ స్టేజీపై నిలబడి మాట్లాడడం సాధారణ రోజుల్లో గర్వపడేదాన్ని. కానీ నా దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో మీ ముందు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. వందలాది మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. 64 మంది మరణించారనే విషయం నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. మా దేశానికి అత్యవసర సాయం, అంతర్జాతీయ జోక్యం అవసరం’ అని హాన్ లే గుర్తు చేసింది. ‘దయచేసి మయన్మార్‌కు సాయం చేయండి’ అంటూ విలపిస్తూ ఆ అందాల సుందరి విజ్ఞప్తి చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఫ్యాషన్ షో వాతావరణం ఉద్విగ్నంగా మారింది. హాన్ లే మిస్ గ్రాండ్ మయన్మార్ అవార్డు సొంతం చేసుకుని ఈ పోటీలకు ఎంపికైంది. Han Lay, a Miss Grand Myanmar made an emotional appeal for international help for her country during the Miss Grand International pageant in Thailand https://t.co/tsb3jj86qy pic.twitter.com/JL3ei9RzwZ — Reuters (@Reuters) March 30, 2021 -
లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్
తన జీవితంలో కొన్ని సంఘటనలు తనను బాధ పెట్టాయని, తనపై జరిగిన దుష్ప్రచారంపై మాట్లాడుతూ లైవ్‌లోనే హీరోయిన్ ఏడ్చేసింది. జరిగిన దాని గురించి బాధపడకుండా కోలుకుని చివరకు మిమ్మల్ని అలరిస్తానని ప్రకటించింది. ఆమెనే కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది. ఆమె డ్రగ్స్ కేసులో అరెస్టయి 145 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్‌పై విడుదలై ఇంటికొచ్చింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా తన అభిమానులతో మాట్లాడింది. ఈ క్రమంలో ఆవేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుంది. క్లిష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఈ సందర్భంగా రాగిణి కృతజ్ఞతలు తెలిపింది. తనపై జరిగిన దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసింది. 19.43 నిమిషాల పాటు ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా తనపై, తన కుటుంబంపై వచ్చిన ప్రచారం.. వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ కామెంట్స్ ఒకసారి మీరే చదువుకోండి అని సూచించింది. ‘మీ కుటుంబసభ్యులపై ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని రాగిణి హితవు పలికింది. దాని గురించి పెద్దగా ఆలోచించకపోయినా ఆ బాధ తనను వెంటాడుతూనే ఉందని కన్నీటి పర్యంతమైంది. కాలం ప్రతి గాయాన్ని నయం చేస్తుందని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. అయితే కొన్నాళ్లకు అన్ని విషయాల గురించి మాట్లాడుతానని చెప్పింది. ప్రస్తుతం తాను క్లిష్ట దశలో ఉన్నానని చెప్పింది. ‘ఇక మిమ్మల్ని నవ్విస్తాను.. ఫీల్ గుడ్ చేస్తానని.. వంట, ఫన్నీ వీడియోలతో మీ ముందుంటా’ అని రాగిణి తెలిపింది. మోడల్‌గా ఉన్న రాగిణి ద్వివేది సినిమాల్లోకి వచ్చారు. కన్నడలో వీర మడకరి, కెంపెగౌడ, శివ, బంగారి, రాగిణి ఐపీఎస్ సినిమాలతో గుర్తింపు పొందింది. View this post on Instagram A post shared by Ragini dwivedi (@rraginidwivedi) -
భోరున ఏడ్చిన విద్యార్థులు!
-
నేను చెప్పనివి మీరు చెప్పకండి
‘‘ఆర్టిస్ట్‌ల గురించి ఏదైనా రాసేముందు ఒకటికి రెండుసార్లు ఎందుకు సరి చూసుకోరు?’’ అని మండిపడ్డారు తమన్నా. సెన్సేషన్ కోసం ఏది పడితే అది రాసే ఆర్టికల్స్‌ను చూసి ఆమె ఈ విధంగా స్పందించారు. ‘‘అజ్ఞానమే మహానందం అంటుంటారు. కానీ వీళ్ల (ఎల్లో జర్నలిజమ్) విషయంలో చాలా డిస్ట్రబింగ్‌గా ఉంది. నాకో సందేహం కలుగుతుంటుంది. రాసింది పబ్లిష్ చేసే ముందు వాళ్లు హోమ్‌వర్క్ చేయకుండా ఎలా ఉంటారా? అని. ఆ సమాచారం సరైనదా? కాదా? అని ఆలోచించకుండా ప్రచురించడం సరికాదు. పబ్లిష్ చేసేముందు సంబంధిత వ్యక్తులను ఒక మాట అడిగితే ఏం పోతుంది? కల్పిత వార్తలు రాసి, సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకోవడం సబబు కాదు. ఈసారి నా గురించి ఏదైనా రాసేముందు కొంచెం రెస్పాన్సిబుల్‌గా నన్ను సంప్రదించి, నా అభిప్రాయం ఏంటో కనుక్కోండి. నేను ఇవ్వని ఇంటర్వ్యూల్ని, అలాగే పాత ఇంటర్వ్యూలోని సమాచారాన్ని సంబంధం లేని చోట వాడకండి. దయచేసి నేను చెప్పని విషయాలను మీరు చెప్పకండి’’ అని ఘాటుగా పేర్కొన్నారు తమన్నా. ఇంతకీ తమన్నా గురించి రాసింది ఎవరు? ఏం రాశారు? అనే ప్రశ్నలకు సమాధానం ఎదురు చూడొద్దు. ఎందుకంటే తమన్నా ఆ విషయాలేవీ ప్రస్తావించలేదు. -
కన్నీరు పెట్టుకున్న శివాజీ
-
శింబునే కాదు నన్నూ ఉరి తీయండి!
నా కొడుకుతో పాటు నన్నూ ఉరి తీయండి అంటూ నటుడు శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ సమస్య ఇటీవల తుపాన్ బాధితుల ఇక్కట్లను మరిపించేంతగా విశ్వరూపం దాల్చిందని చెప్పవచ్చు. శింబు, అనిరుద్‌లపై కోవై, చెన్నైలలో కేసులు నమోదయ్యాయి. శింబు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు మెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో శింబు సరెండర్ కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో శింబు తల్లి కంటతడి పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అదేమిటో చూద్దాం. ఆకతాయి తనంగా రూపొందించిన పాట శింబు చిన్నతనంలోనే నటుడయ్యాడు. శింబు చిన్న కుర్రాడు. తనకింకా పెళ్లి కాలేదు. ఆకతాయితనంగా రూపొందించిన పాట అది. ఆ తరువాత దానిని వద్దని పారేశాడు. శింబు అంటే గిట్టని వాళ్లెవరో ఆ పాటను దొంగిలించి ఇంటర్నెట్లో ప్రసారం చేశారు. వారిపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయితే శింబుపై మాత్రం కేసులు నమోదయ్యాయి. తుపాను బాధితుల కంటే ఇది పెద్ద విషయమా? తినడానికి అన్నం లేక, నిలువ నీడలేక ఎందరో అలమటిస్తున్నారు. అలాంటి వారికి సాయం చేయకుండా శింబు విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు.అసలు శింబు చేసిన తప్పు ఏమిటీ? తన బహిరంగ కార్యక్రమంలో గానీ, సినిమాలో గానీ లేక ఏదైనా భేటీలో ఆ పాట పాడాడా? లేదే. శింబు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు శింబు ఎదుగుదలను అడ్డుకోవడానికి సినిమాలోని సహ నటులే అడ్డుకుంటున్నారు. శింబు చిత్రాల విడుదలకు వరుసగా కుట్ర చేస్తున్నారు. పోటీ అన్నది అవసరమే. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. అలా కాకుండా శింబు ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన పేరుకు చెడును ఆపాదించే చర్యలకు పాల్పడుతున్నారు. శింబు ఎక్కడికి పారిపోలేదు కనీసం ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోలేకపోతున్నాను. అంతగా మనసు అశాంతికి గురవుతోంది. శింబు పరారీలో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తన ఎక్కడికీ వెళ్లలేదు. పోలీసులు గాలించడానికి శింబు చేసిన తప్పేమిటి? తనను వెతకడానికి తను ఎక్కడికీ పారిపోలేదు. మీకు నా కొడుకు కావాలి అంతేగా అతన్ని ఏ పోలీసుకు అప్పచెప్పడానికైనా సిద్ధమే. నన్ను ఉరి తీయండి శింబును ఉరి తీయాలంటున్నారు.అంత తప్పు తనేం చేశాడు.శింబును పెంచిన నన్ను ఉరి తీయండి.ఇప్పుడు చూసినా కెమెరాలతో మనషులు ఇంటి ముందు తిరుగుతున్నారు. మనశ్శాంతి కరువైంది. అసహనానికి గురౌవుతున్నాం. ఏమి రాష్ట్రం ఇది? మేమిక తమిళనాడులో జీవించలేం. ఏ కర్ణాటకకో, కేరళకో లేక మరెక్కడికైనా వెళ్లి మా బతుకు మేము బ్రతుకుతాం. మాకు జీవితాన్నిచ్చిన తమిళనాడుకు కృతజ్ఞతలు అంటూ శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. నా కొడుకు ప్రాణం కావాలా? ఏం ఊరి ఇది? సొంత ఇంటిలో స్వేచ్ఛగా జీవించడానికి కూడా స్వతంత్రం లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండాలి? మా పక్కన ఉన్న మంచి గురించి ఎవరూ చెప్పడం లేదు. ఆ పాట దొంగలించబడింది. అది ఒక బీప్ సాంగ్. వద్దని పారేసిన పాట. ఆ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. అసలు మీకు ఏమి కావాలి? నా కొడుకు ప్రాణం కావాలా? తీసుకోండి. లేదా తనను కనిపెంచిన నా ప్రాణం కావాలా? తీసుకోండి. అసలు మీ సమస్య ఏమిటి?