Super Star Krishna Cried After Seeing Ramesh Babu For Last Time, Video Viral: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో రమేశ్ బాబు భౌతికకాయాన్ని కాసేపు ఉంచారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అయితే కొడుకును కడసారి చూసేందుకు అక్కడికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడి భౌతికకాయన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 56 ఏళ్ల వయసులోనే కొడుకు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment