last rites
-
ఇదేం పిచ్చో.. కారును సమాధి చేశారు!
వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం. కానీ గుజరాత్లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసేశాడు. అదేదో అషామాషీగా చేయలేదు. ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫైనలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.15 అడుగుల లోతు గుంతలో..గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్‌సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్‌లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్‌లోని తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వ్రస్తాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ కారును మట్టితో సమాధి చేసేసింది. વ્હાલસોઈ નસીબદાર કારની સમાધિ !!!અમરેલીમાં પરિવાર માટે લકી કારને વેચવાને બદલે ઘામધૂમથી જમણવાર યોજી સમાધિ અપાઈ, કારના સમાધિ સ્થળે વૃક્ષારોપણ કરાશે #Gujarat #Amreli pic.twitter.com/1c4hiogs7n— Kamit Solanki (@KamitSolanki) November 8, 2024కారొచ్చాక కలిసొచ్చింది..ఈ కారు వచ్చిన తనకు బాగా కలిసొచ్చిందని సూరత్‌లో నిర్మాణ సంస్థను నడుపుతున్న సంజయ్ పొలారా మీడియాతో చెప్పారు. భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండాలనే తన లక్కీ కారును సమాధి చేసినట్టు వెల్లడించారు. "దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారు కొన్నాను. ఇది మా కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారంలో విజయాలు దక్కాయి. నా కుటుంబ గౌరవం పెరిగింది. అందుకే దీన్ని అమ్మకుండా మా పొలంలో సమాధి చేశామ"ని సంజయ్ వివరించారు. నెటిజనులు మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. ఇదేం పిచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు -
తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం
ఆరిలోవ (విశాఖ జిల్లా): అతను మరణిస్తున్నా.. మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి జిల్లాకు చెందిన నరేష్ పట్నాయక్ (32) రెండు రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే బంధువులు పర్లాకిమిడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.పరీక్షలు చేసిన వైద్యులు... నరేష్ పట్నాయక్ బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమైందని, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఇక్కడ వైద్యులు రెండు రోజులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు.జీవన్‌దాన్ ప్రతినిధులు నరేష్ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు.బాధను దిగమింగుకుని నరేష్ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆస్పత్రిలో వైద్యులు శుక్రవారం నరేష్ దేహం నుంచి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివర్ తొలగించారు. వాటిని జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. గ్రీన్ చానెల్ ద్వారా వాటిని అవసరమైనవారికి వెంటనే తరలించినట్లు జీవన్‌దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
కడసారి వీడ్కోలు.. రతన్ టాటా అంతిమ యాత్ర (ఫోటోలు)
-
టాటాకు పెంపుడు శునకం కన్నీటి బై బై
ముంబయి: వ్యాపార దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం(అక్టోబర్10) సాయంత్రం ముగిశాయి. ముంబైలోని వర్లి స్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరై హాజరై నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం టాటాకు చివరిసారి వీడ్కోలు పలికారు. టాటాకు కడసారి బై బై చెప్పేందుకు వచ్చిన ఓ పెంపుడు శునకం ఈ అంత్యక్రియల్లో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ శునకం ఎవరిదో కాదు..రతన్ టాటా దత్తత తీసుకుని ముద్దుగా పెంచుకున్నదే. దీని పేరు గోవా. టాటా గోవా వెళ్లినపుడు ఓ వీధి శునకం ఆయన వెనకాల నడుస్తూ వచ్చింది. అంతే దాన్ని ముంబై తీసుకువచ్చి పెంచుకున్నారు. 11 ఏళ్లుగా గోవా టాటా వద్దే ఉంది. అంత్యక్రియలు జరుగుతున్నంత సేపు టాటా పార్థివ దేహం పక్కనే కూర్చున్న గోవా తన మాస్టర్‌కు అశ్రనయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఈ దృశ్యాలు అక్కడున్నవారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది -
పార్సీ అయిన టాటాకు హిందూ పద్ధతిలో అంత్యక్రియలు?
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి ముందు ముంబైలోని నారిమన్ మైదానంలో గల ఎన్సీపీఏలాన్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.రతన్ టాటా పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీలోగల విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల పద్ధతి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.There’s a Hindu pujari, Christian priest, Muslim Imam and a Sikh sant standing behind. Sanghis may not like this, but this is truly secular …..!!Rest in peace Sir Ratan Tata ….. 🙏 pic.twitter.com/DjiYNOPR7C— Mayank Saxena (@mayank_sxn) October 10, 2024 పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిలో అంత్యక్రియల సంప్రదాయం మూడు వేల సంవత్సరాల నాటిది. పార్సీలు అనుసరించే జొరాస్ట్రియనిజంలో మనిషి మృతి చెందాక ఆ మృతదేహాన్ని రాబందులు తినేందుకు అనువుగా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. గతంలో అంటే 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్సీ సమాజంవారు అనుసరించే అంత్యక్రియల ఆచారాలను వివిధ ప్రభుత్వాలు నిషేధించాయి. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ -
కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. -
‘అమ్మ చనిపోయింది.. ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయా’
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్‌నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్‌భద్రకు ఆయన కన్వీనర్‌గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్‌నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు. -
ఎమ్మెల్యే లాస్య నందిత పాడె మోసిన హరీష్‌రావు
సాక్షి, సికింద్రాబాద్: కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాడె మోశారు. కాగా, లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. కాగా, లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు -
కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
డీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది. కాగా.. మొదట విజయ్‌కాంత్ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్ హాసన్, రజనీకాంత్ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా.. కెప్టెన్ విజయకాంత్(71) డిసెంబర్ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. #WATCH | Chennai, Tamil Nadu: A large number of people gathered to pay tribute to DMDK President and Actor Vijayakanth. His mortal remains are being taken from Island ground, Anna Salai to Koyambedu DMDK office for the last rites. pic.twitter.com/cbSweIhY7z — ANI (@ANI) December 29, 2023 -
తండ్రి దహన సంస్కారాలు..అడ్డుకున్న కొడుకు అప్పులోళ్లు
సాక్షి,జగిత్యాల జిల్లా: కొడుకు అప్పుకట్టలేదని తండ్రి దహన సంస్కారాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటన మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో జరిగింది. కొంతకాలం నుంచి పలువురి వద్ద 1 కోటి 70 లక్షల రూపాయల దాకా పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తి అప్పు చేశాడు. అప్పు చెల్లించలేక శ్రీకాంత్ హైదరాబాద్ పారిపోయాడు. శ్రీకాంత్ తండ్రి పుల్లూరి నారాయణ శనివారం మృతి చెందాడు. అయితే తండ్రి దహన సంస్కారాల కోసం శ్రీకాంత్ తన స్వస్థలం మెట్‌పల్లికి ఆదివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అప్పులోళ్లు దహన సంస్కారాలు జరిగే చోటికి వచ్చారు. అప్పు తీర్చేవరకు తండ్రి శవానికి దహన సంస్కారాలు జరగనివ్వబోమని అడ్డుకున్నారు. దీంతో దహన కార్యక్రమం గంట పాటు నిలిచిపోయింది. చివరకు ఆస్తి అమ్మి అప్పులు చెల్లిస్తానని శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో అప్పుల వాళ్లు వెనుదిరిగారు. తర్వాత తండ్రి నారాయణ దహన సంస్కారాలు జరిగాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా -
సుబ్రతారాయ్ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్, లక్నోలోని బైకుంత్ ధామ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన ఇరువురు కుమారులో అందుబాటులో లేకపోవడంతో సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గంగా నది ఒడ్డున యనవడు హిమాంక్ ఆయన చితికి నిప్పింటించారు. రాయ్ కుమారులు, సుశాంతో, శ్రీమంతోలు విదేశాల్లో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారని సన్నిహిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లండన్‌లో చదువుకుంటున్న హిమాంక్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. సుబ్రతా రాయ్ చిన్న కుమారు శ్రీమంతో పెద్ద కుమారుడు హిమాంక్ రాయ్ లండన్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. సుబ్రతా రాయ్ భార్య స్వప్న, అతని మేనకోడలు ప్రియాంక సర్కార్,ఇతరకుటుంబ సభ్యుల బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుకున్నారు. అటు రాయ్ మృతదేహాన్ని కూడా కూడా చార్టర్ విమానంలో లక్నోకు తరలించారు. సహారా సుబ్రతాకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు రాయ్‌కు కడసారి నివాళులర్పించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు ఆరాధన మిశ్రా మోనా, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, అమ్మర్ రిజ్వీ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు, మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్, యూపీ మంత్రి నితిన్ అగర్వాల్, స్మితా ఠాక్రే, బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, సున్నీ మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తదిరులు ఆయనను కడసారి దర్శించుకున్నారు. అలాగే కంపెనీకి చెందిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆయన అధికారిక నివాసానికి తరలి వచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్ సహారాజీ అంటూ నినదించారు. #WATCH | Lucknow, Uttar Pradesh: On Sahara Group Chairman Subrata Roy's demise, singer Sonu Nigam says, "Since 1997, I and Subrata Roy have had an association. I have spent a very good time with him. He is like my brother, father, and friend..." pic.twitter.com/vYYnNeICC2 — ANI (@ANI) November 16, 2023 VIDEO | Sahara group founder and chairman Subrata Roy‘s mortal remains being taken for the last rites ceremony at Sahara City in Lucknow. pic.twitter.com/QEngVKsEfS — Press Trust of India (@PTI_News) November 16, 2023 -
ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!
విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఓమందూర్ ఆసుపత్రి నుంచి మీరా మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని చర్చికి తరలించారు. అక్కడ ప్రార్థనల అనంతరం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సత్తిరాజ్, శింబు, భరత్, సిబి రాజ్, దర్శకులు భారతీ రాజా, శశి, మిష్కిన్, సుశీంద్రన్, ఎడిటర్ మోహన్, మోసన్రాజా, ఎస్ఆర్ ప్రభు, సతీష్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, ప్రభుదేవా, నటి సుధ పలువురు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల నిర్వాహకులు, సహ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె భౌతికాయాన్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మీరా భౌతికకాయాన్ని చూసిన పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో మీరా భౌతికాయానికి స్థానిక కీల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిక్రియల సమయంలో మీరా తల్లి ఫాతిమా విజయ్ ఆంటోని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. మీరా సూసైడ్ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత!
ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ భర్త మృతిని తట్టుకోలేకపోయింది. అదే ఆవేదనలో 2 గంటల తరువాత ఆమె కూడా మృతి చెందింది. గంటల వ్యవధిలో ఒకే ఇంటిలో ఇద్దరు మృతి చెందడం స్థానికులను విషాదంలో ముంచెత్తింది. బఘౌరా గ్రామానికి చెందిన 50 ఏళ్ల ప్రీతమ్ రోజూ మాదిరిగానే పశువులను మేపేందుకు వాటిని పొలానికి తీసుకు వెళ్లాడు. వర్షాల కారణంగా అక్కడి చెక్ డ్యామ్ లోనికి నీరు ప్రవేశించింది. ఈ విషయం ప్రీతమ్‌కు తెలియలేదు. సాయంత్రం అతను తిరిగివస్తున్నప్పుడు చెక్ డ్యామ్‌లో మునిగిపోయాడు. సాయంత్రం ప్రీతమ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం అన్నిచోట్లా వెదికారు. వారికి చెక్‌డ్యామ్ బయట ప్రీతమ్ చెప్పులు కనిపించాయి. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ఈతగాళ్ల సాయంతో చెక్‌డ్యామ్‌లో గాలించగా, ప్రీతమ్ మృతదేహం లభ్యమయ్యింది. ప్రీతమ్ మృతి చెందాడనే విషయం తెలియగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్రమైన ఆవేదనలో కూరుకుపోయిన అతని భార్య.. భర్త మృతి చెందిన రెండు గంటలకు కన్నుమూసింది. ఈ ఉదంతం గురించి మృతుడు ప్రీతమ్ బంధువు ఉధమ్‌సింగ్ మాట్లాడుతూ రోజూ మాదిరిగానే పశువులను మేపేందుకు వెళ్లిన ప్రీతమ్ అనుకోకుండా చెక్‌డ్యామ్‌లో మునిగి మృతి చెందాడని, ఈ విషయం తెలిసిన అతని భార్య గీత కూడా మృతిచెందిదని తెలిపారు. ఇది కూడా చదవండి: 20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’ -
Rajasthan: ఇక మృతదేహాలతో నిరసన కుదరదు
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్‌లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. చట్టంలో ఉన్నదిదీ...! మరణానంతరం హక్కులుంటాయ్! ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు. మృతదేహాలతో నిరసన కుదరదు ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు. ఎందుకీ చట్టం? రాజస్తాన్‌లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ సర్కార్‌కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆ మృతదేహాలు పదిలం ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్‌లో భద్రపరచాలి. పెనాల్టీ మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది డేటా బ్యాంకు ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..
బతికుండగానే ఓ వ్యక్తి తన అంత్యక్రియలు తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయినప్పుడూ ఇక్కడే చివరి కార్యక్రమాలు చేయాలని అభ్యర్థించాడు. తద్దినం దగ్గర నుంచి దశదిన కర్మల వరకు అన్ని తానే నిర్వహించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఎందుకిలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే.. అసలేం జరిగందంటే..యూపీలోని కేవాన్ గ్రామానికి చెందిన జటా శంకర్‌కి తన కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చనిపోతే అంత్యక్రియలు చేస్తారో లేదో అన్న భయంతో అన్ని కార్యక్రమాలను తాను బతికుండగానే తానే చేసుకున్నాడు. అందుకోసం తన భార్యతో దెబ్బలాడి మరీ ఒప్పించాడు. జూన్15 తాను చనిపోయిన 13వ రోజుగా తీర్మానించి తనకు తానుగా పిండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు కూడా ఏర్పాటు చేశాడు. అంతేగాదు శంకర్ తన సమాధి కోసం ఓ కాంక్రీట్ ఫ్లాట్‌ఫాంని కూడా నిర్మించాడు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని శంకర్ తమతో చెబుతుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుచుగా తన కుటుంబంతో తగాదాలు జరగడంతో విరక్తి చెంది ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. (చదవండి: కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు) -
భర్త చనిపోయాడనుకుని విలవిలలాడింది..కట్ చేస్తే అతను..
భర్త చనిపోయాడనుకుని ఓ భార్య చాలా ఆవేదన చెందింది. ఒక పక్కా ఆమె అతడి కోసం కోర్టులో విడాకుల విషయమై పోరాడుతుంది. ఇంతలో సడెన్‌గా భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. అతడి చివరి చూపుకోసం తపించిన భర్త తల్లిదండ్రులు ఆమెను రానివ్వలేదు. ఆ ఆవేదన నుంచి బయటపడలేక పోయింది. తీరా కొన్ని నెలల తర్వాత అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఈఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన అనెస్సా రోస్సీ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తన భర్తతో పోరాడుతోంది. ఆమె విడాకులిచ్చేందకు సముఖంగా లేదు కూడా. అయితే అనూహ్యంగా తన భర్త చనిపోయాడన్న షాకింగ్ వార్త వచ్చింది. దీంతో ఆమె తన భర్త చనిపోయాడనుకుని చివరి చూపుకోసం అతడి ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ అతడి తల్లిదండ్రులు అందుకు అంగీకరించ లేదు. దీంతో ఆమె చాలా పశ్చాత్తాపంతో ఆవేదన చెందింది. విడాకులు ఇచ్చేసినా.. బతికేవాడేమో అనుకుని విలపించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో కొన్ని నెలల క్రితం తన భర్త బతికే ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కి గురయ్యింది. అతను మెక్సికోలో మరో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. ఆఖరికి వేరో అమ్మాయితో ఉండేందుకు చనిపోయినట్లు నాటకం ఆడినట్లు తెలుసుకుని కుంగిపోయింది. ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. దీన్ని తెలుసుకున్న ఆమె భర్త తానేమి నాటకాలు ఆడలేదని ఆమె విడాకులు ఇవ్వకపోవడంతో మెక్సికోలో గడిపేందుకు వెళ్లినట్లు సమర్ధించుకునే యత్నం చేశాడు. (చదవండి: రిషి సునాక్ విదేశీ పర్యటన ఖర్చు..కేవలం ఫ్లైట్ జెట్లకే రూ. 4 కోట్లు) -
స్నేహితుడి మరణం.. బోరున ఏడ్చేసిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్లో దర్శకనటుడు సతీష్ కౌశిక్(67) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మిత్రుడు, మరో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. సతీశ్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సతీశ్ పార్థివదేహం వద్ద అనుపమ్ ఖేర్ బోరున విలపించారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. సతీశ్ మృతిపట్ల అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ..' మేమిద్దరం మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లం. సొంతంగా పేరు తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాం. ముంబై నగరం మాకు అవకాశం ఇచ్చింది. దాన్ని సాధించాం. కానీ ఇది జీర్ణించుకోవటం చాలా కష్టం. అతను చాలా చమత్కారి. ప్రతి విషయాన్ని తేలికగా అర్థం చేసుకునేవాడు. ఎలా జీవించాలనేది ప్రజలు అతని నుంచి నేర్చుకుంటారు. మమ్మల్ని అకాలంగా విడిచి వెళ్లాడనే పశ్చాత్తాపం నాకు ఎప్పటికీ ఉంటుంది.' అంటూ ఎమోషనలయ్యారు. అదేవిధంగా సతీశ్ కౌశిక్‌తో తనకు 45 నుంచి అనుబంధమని అనుపమ్ ఖేర్ తెలిపారు. కాగా.. 13 ఏప్రిల్ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు.. కమెడియన్‌గా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్లో రాణించారు. Anupam Kher Looses A True Friend 💔#AnupamKher #RipLegend #ShatishKaushik #ripshatishkaushik pic.twitter.com/wzbnQ0dR3Z — Yogeshnegi45 (@Yogeshnegi451) March 9, 2023 -
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు పూర్తి
అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె కూతురు స్రవంతి జమునకు దహన సంస్కారాలు నిర్వహించింది. జమున మరణంతో ఇండస్ట్రీలో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌ఛాంబర్‌లోని ఆమె భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. లక్ష్మీ పార్వతి, తమ్మా రెడ్డి భరద్వాజ, మురళి మోహన్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు తదితరులు నివాళులు అర్పించారు. -
చితి మంటల్లోనూ ఒక్కటిగా..
సాక్షి, ప్రత్తిపాడు: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో పరాయి దేశం వెళ్లారు. పగలూ రాత్రీ కష్టపడ్డారు. ఇద్దరు పిల్లాపాపలతో జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతున్న వేళ విధికి కన్నుకుట్టినట్లుంది. వారిపై విషం చిమ్మింది. మంచు గడ్డల రూపంలో మృత్యువు కాపు కాసి భార్యాభర్తలిద్దరినీ కానరాని లోకాలకు తీసుకువెళ్లి, వారి ఇద్దరి కుమార్తెలను ఒంటరులను చేసింది. అమెరికాలో దుర్మరణం పాలైన తెలుగు దంపతుల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26న సెలవు కావడంతో పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో దంపతులు సరస్సులో గల్లంతై, చివరకు మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలు అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నాయి. టీసీఎస్ కంపెనీ సహకారంతో సోమవారం ఉదయం అమెరికాలోని డల్లాస్ నుంచి మృతదేహాలను హైదరాబాద్‌కు విమానంలో తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో పాలపర్రులోని స్వగ్రామానికి తీసుకువచ్చారు. వారి పిల్లలను రెండు రోజుల కిందటనే తీసుకువచ్చారు. నారాయణ, హరిత దంపతుల మృతదేహాలను చూడగానే రోదనలు మిన్నంటాయి. బిడ్డా.. ఇక నుంచి మాకు ఫోన్లు ఎవ్వరు చేస్తారు.. అంటూ నారాయణ తల్లి వెంటరత్నం విలపించింది. హరిత తల్లిదండ్రులూ కన్నీరుమున్నీరయ్యారు. నారాయణ, హరిత పిల్లలు పూజిత, హర్షిత నిర్జీవంగా ఉన్న తల్లిదండ్రులను చూసి దిగాలుగా ఉండిపోయారు. నారాయణ, హరిత దంపతుల చితిలను ఒక్కచోటే పేర్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. వారిని ఆఖరి చూపు చూసేందుకు ఊరంతా కదిలివచ్చింది. భౌతికకాయాల వద్ద ఎమ్మెల్సీ లక్ష్మణరావు నివాళులరి్పంచారు. (చదవండి: రాజమండ్రి: తక్షణ సాయం.. సీఎం జగన్ సాయం జీవితాంతం మరువలేనిది) -
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
-
తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ
-
తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ
గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం గాంధీనగర్‌లోని ముక్తిధామ్ శ్మశానవాటికిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ చితికి నిప్పంటించి అక్కడి నుంచి వెనుదిరిగారు మోదీ. హిరాబెన్ అంతిమయాత్రకు కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గాంధీనగర్‌లోని నివాసంలో తన తల్లి పార్ధీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు మోదీ. కడసారి నివాళులు అర్పించారు. #WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ — ANI (@ANI) December 30, 2022 #WATCH | Gujarat: Heeraben Modi, mother of PM Modi, laid to rest in Gandhinagar. She passed away at the age of 100, today. (Source: DD) pic.twitter.com/wqjixwB9o7 — ANI (@ANI) December 30, 2022 ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు పూర్తి