సాక్షి, సికింద్రాబాద్: కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది.
మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాడె మోశారు. కాగా, లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
కాగా, లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు
Comments
Please login to add a commentAdd a comment