సిద్దిపేట రైలులో ప్రయాణిస్తున్న మంత్రి హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్‌లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు.
బీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు..
రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్‌కు బీఆర్‌ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు.
ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్‌ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్‌కు తలకు కూడా గాయమైంది.
సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్
సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment