
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కేసీఆర్ కలలు కన్న సిద్దిపేట సాకారమవుతుందని.. మంత్రి హరీష్‌రావు అన్నారు. నెలలోపు సిద్దిపేటకి రైలు రాబోతుందన్నారు. ఆదివారం ఆయన డ్రోన్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోమటి చెరువులో స్కై రెస్టారెంట్, టన్నెల్ అక్వేరియం, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని హరీష్‌రావు కోరారు.
ఆయన మాకు ఆదర్శం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హరీష్ రావు మా అందరికి ఆదర్శప్రాయుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లిన, ఎక్కడున్నా, ఏం చూసినా ఇది సిద్దిపేటకు కావాలంటాడు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని తాము కూడా మహబూబ్ నగర్‌లో కొన్ని పనులు చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
చదవండి: ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని..
Comments
Please login to add a commentAdd a comment