సిద్దిపేట జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా.. ఇది చేస్తాం అని రైతులను ముంచాడన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ తెలంగాణ సీఎం రేవంత్.. రైతులను ముంచుండు, మోసం చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు.
రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు.. చర్చకు సిద్ధం.ఎకరాకు రూ. 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చే వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి. రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పి.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు.
గొంతు మూగబోయింది. ఇదేనా రైతు రాజ్యం.. కౌలు రైతు రైతుబంధు ఎగబెట్టినందకుకు పాలాభిషేకం చేయాలా?, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలు అప్పుడు మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. ఒక ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ. 12వేలు ఇవ్వాలి. ఐదు గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు.
ఇదేమీ పథకం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఇలా చేస్తాడా, మట్టి పనికి పోయే ఒక కోటి మందికి వ్యవసాయ కూలీ పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్‌రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనపడ్డ దేవుళ్ల మీద ఒట్టు పెడితివి. లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు కూడా కాలేదు. నారాయణ ఖేడ్ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డిని అడిగితే గూండాలను నా ఇంటికి మీదకి పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. రూ. 15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని పాలాభిషేకం చేయమంటారు’ అని ప్రశ్నించారు హరీష్.
అందుకే ఈ దాడులు..
అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తోంది. రేవంత్‌రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్‌రెడ్డి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్ సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment