మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేటరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కాని... చేతలు దాటడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం రాఘవాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .
గొప్పలకు పోయిన రేవంత్‌రెడ్డి నేటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటివి అందించలేదని, బోనస్ కాస్త బోగస్ చేసి రైతులను మోసం చేశాడన్నారు. మంత్రి ఉత్తమ్ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని చెప్పారన్నారు. కానీ ఇప్పటికే 30 శాతం ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
చదువుకునేందుకు వెళితే ప్రాణాలు పోతున్నాయి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో ‘విష పూరిత ఆహారం’ఘటనలు చోటు చేసుకోవడంపై బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే.. మరో ఘటన జరగటం దారుణమని పేర్కొన్నారు.
మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలుకావడం బాధాకరమని చెప్పారు. విషపూరిత ఆహారం ఘటనలు పదేపదే జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, గురుకుల విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment