సాక్షి, సూర్యాపేట: వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా.. దసరాలోపు రైతు బంధు పడకపోతే నిన్ను రైతులు వదలరంటూ హరీష్ హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డికి ప్రజలపై పట్టింపు లేదు.. రైతంటే లెక్క లేదు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాటతప్పాడు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు. 31 కుంటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. హర్యానాలలో ఏడు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఒక చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో రౌడీయిజం. హెడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి హక్కు మీకు ఎవరిచ్చారు’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.
జూటా మాటలు మానుకోక పోతే నిన్ను వదలం. నిన్ను అడుగుతాం.. కడుగుతాం.. అసెంబ్లీలో నిలదీస్తాం. ఒక్క బస్సు తప్ప.. మీ హామీలు అన్నీ తుస్సే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ సీఎంకి కనికరం లేదు. కేసిఆర్‌ది రైతు గుండె.. రేవంత్‌ది రాతి గుండె.. ప్రజల నుండి తిరుగుబాటు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు’’ అని హరీష్‌రావు మండిపడ్డారు.
ఇదీ చదవండి: తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ
Comments
Please login to add a commentAdd a comment