తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ | Former Mp Kvp Letter To Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ

Published Fri, Oct 4 2024 2:59 PM | Last Updated on Fri, Oct 4 2024 2:59 PM

Former Mp Kvp Letter To Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: ఫాంహౌస్‌ చట్టప్రకారమే నిర్మించానని.. నిర్మాణం అక్రమమని తేలితే సొంత ఖర్చులతో కూల్చేస్తానంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు చెప్పారు.  ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉంటే మార్క్‌ చేయండి. ఫాంహౌస్‌కు అధికారులను పంపించాలంటూ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు.

మూసీ బఫర్ జోన్ లో నా ఫాం హౌజ్ వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే అధికారులను పంపి సర్వే చేయించండి. నా ఫాం హౌజ్ బఫర్ జోన్‌లో ఉంటే 48 గంటల్లో నా సొంత ఖర్చులతో కులగొడతాను. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని నా కోరిక. మార్కింగ్ తేదీ, సమయం ముందే ప్రకటించాలి. సర్వే చేసేటప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియాను తీసుకొచ్చి సర్వే చేయించండి’’ అని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement