KVP Ramachandra Rao
-
తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ చట్టప్రకారమే నిర్మించానని.. నిర్మాణం అక్రమమని తేలితే సొంత ఖర్చులతో కూల్చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే మార్క్ చేయండి. ఫాంహౌస్‌కు అధికారులను పంపించాలంటూ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు.మూసీ బఫర్ జోన్ లో నా ఫాం హౌజ్ వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే అధికారులను పంపి సర్వే చేయించండి. నా ఫాం హౌజ్ బఫర్ జోన్లో ఉంటే 48 గంటల్లో నా సొంత ఖర్చులతో కులగొడతాను. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని నా కోరిక. మార్కింగ్ తేదీ, సమయం ముందే ప్రకటించాలి. సర్వే చేసేటప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియాను తీసుకొచ్చి సర్వే చేయించండి’’ అని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు -
‘కాంగ్రెస్ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయి’
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయంతో కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయని.. రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఈయన బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సాధించిన మెజారిటీ భారతదేశ చరిత్రలో ప్రథమం అన్నారు. 130 సీట్లలో 122 గెలిచామని.. ఓ నాయకుడి మీద అఖండ విశ్వాసం ప్రకటించిన ఎన్నికలు ఇవే అన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యే సీటు కోల్పోయినా బుద్ధి మార్చుకోలేదని.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పాలక మండలి ఎన్నికపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాజ్యసభ బులెటిన్ ప్రకారంకేవీపీ రామచంద్ర రావును ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ ఎన్నికల కమిషన్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి కేవీపీ రామచంద్ర రావు ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా చేర్పించారని అన్నారు. మున్సిపల్ చట్టం రెండో చాప్టర్ ఐదో సెక్షన్‌ను ఉత్తమ్ చదువుకోవాలి హితవు పలికారు. ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు కూడా ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా చేరవచ్చు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల చట్టాలను చదవరని.. వారికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల ఆకారాలు పెరిగాయి కానీ బుద్ది పెరగలేదని.. ఇంకా వలసవాద భావజాలంతోనే ఉన్నారని విమర్శించారు. కావాలంటే కేవీపీని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా చేయండని.. ఎవరు వద్దన్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. చట్ట ప్రకారం నేరేడు చర్లలో టీఆర్ఎస్ గెలిచిందని.. తమ విజయాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్, బీజేపీ నేతలకు తగదన్నారు. బీజేపీ లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని.. బీజేపీని ప్రజలు తిరస్కరించినా ఆయన తీరు మారటంలేదని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్రెడ్డివీధి భాగోతాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వ్యవస్థలను తప్పుబడుతున్న ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని సుమన్ డిమాండ్ చేశారు. పీసీసీ పదవిని కాపాడుకునేందుకు ఉత్తమ్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఎన్నిక జరిగినా టీఆర్ఎస్కే ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందీ పోయి గావు కేకలు పెడుతున్నారని అన్నారు. ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా బ్యాలట్తో ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్దే అన్నారు. గాలివాటంతో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలిచిందని ఆయన విమర్శించారు. లక్ష్మణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిపాజిట్ కోల్పాయారని సుమన్ ఎద్దేవా చేశారు. పదవి పోతుందనే లక్ష్మణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమను ఎంత తిట్టినా లక్ష్మణ్ పదవి పోవడం ఖాయమన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి, లక్ష్మణ్‌లు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై వాడిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో వచ్చే తీర్పే అంతిమమని ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ నేతలు మారాలని హితవు పలికారు. ఇక పరిపాలన, పురపాలనపైనే దృష్టి సారించి.. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల మాదిరిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సుమన్ తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
నిర్మలా సీతారామన్‌కు కేవీపీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతుంటే, ప్రజాప్రతినిధులు కేంద్రానికి లేఖలు రాస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని, పబ్లిక్ సర్వీస్ బ్యాంక్‌గా కొనసాగించాలని కోరారు. విలీనం తప్పనిసరైతే బ్యాంకు పేరును అలాగే కొనసాగించాలనికేవీపీ విజ్క్షప్తి చేశారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఉందని, పట్టాభి సీతారామయ్య జ్ఞాపకంగా తెలుగు వారికి గుర్తుగా ఆంధ్ర బ్యాంకు పేరును కొనసాగించాలి లేఖలో పేర్కొన్నారు. -
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట
-
ధర్నాలు, దీక్షలతో బాబు డ్రామాలు చేస్తున్నారు
-
చార్మినార్ కూడా తానే కట్టానని చెబుతాడు
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు గురించి ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాజ్యసభ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు హితవు పలికారు. అందుకోసమే కోడెలకు 28 ప్రశ్నలతో లేఖ రాశానని తెలిపారు. కానీ కోడెల అసత్యాలతో ఆ ప్రశ్నలకు బదులిచ్చారని వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ గణాంకాలే కోడెల చెబుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరంపై కోడెల సమాధానం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. పోలవరం అంటే హెడ్‌వర్క్స్ మాత్రమే కాదని, ఆ విషయం కోడెల తెలుసుకోవాలని చెప్పారు. పోలవరంపై తప్పిదాలను స్పీకర్ సమర్ధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది..పరిశీలన చేసుకోండని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడు.. అవసరమైతే చార్మినార్ కూడా తానే కట్టానని చెబుతాడని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లిందీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎప్పటికి పోలవరం పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు చెబుతున్న అవాస్తవాలు ఆయన తాత్కాలిక ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. -
‘కేంద్రం తీరు చట్టం స్ఫూర్తికే విఘాతం’
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ విభజన చట్టంలోని అంశాలను చాలా వరకు అమలు చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం రాజ్యసభలో తెలిపారు. ఏపీ విభజన బిల్లుపై కాంగ్రెస్ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. షెడ్యూల్ 13లోని ఆంశాలు అమలు వివిధ దశల్లో ఉన్నట్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి కొంత సమయం పడుతోందని మంత్రి తెలిపారు. సెక్షన్ ప్రకారం 13వ షెడ్యూల్లోని అంశాలను పదేళ్లలో పూర్తి చేయాలని చట్టంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి విభజన చట్టంలో పొందుపరిచినట్లు విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం స్ఫూర్తికే విఘాతం కలిగించేలా కేంద్ర కాలయాపన చేస్తోందని వ్యాఖ్యానించారు. తక్షణమే గిరిజన వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన చట్టసవరణ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ ఆశయాలతో ముందుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్ : నేడు దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క మల్లు, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ యాదవ్, ఇందిరా శోభన్, తదితరులు పూలమాల వేసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేత సేవల్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసిన నేతలు అనంతరం రక్త దానం కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలతో ముందుకు సాగుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పలు సాగు, తాగు నీటి ప్రాజెక్టులు మొదలు పెట్టిన ఘనత వైఎస్సార్ దేనని చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టిన ఘనత ఆయనదేనని భట్టి అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్లో దివంగత నేత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి భట్టి నివాళులు అర్పించారు. ఇందిరా భవన్లో ఈ కార్యక్రమంలో పేదలకు కేవీపీ రామచంద్రరావు దుప్పట్ల పంపిణీ చేశారు. తులసి రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల పాల్గొన్నారు. వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన్నారని, ఆయన ఆశయాలను నెరవేరుస్తామని షబ్బీర్ అన్నారు. వైఎస్సార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతో పాటు హైదరాబాద్‌లో మెట్రోరైలు ఘనత వైఎస్సార్‌దేనని అంజన్‌కుమార్ కొనియాడారు. ఆరోగ్య శ్రీ, 108 కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా వైద్యం అందించారని వైఎస్సార్ సేవల్ని స్మరించుకున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పింది: కేవీపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో నగదు కొరత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన చంద్రబాబు..సమస్యల పరిష్కార కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్న సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పంచాయతీ స్థాయి నుంచి సీఎం పేషీ వరకు అవినీతి తాండవిస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల్ని విస్మరించి రాజకీయ, అధికారిక సమావేశాలు, సమీక్షలకే చంద్రబాబు పరిమితం కావడం సరికాదన్నారు. -
‘చంద్రబాబుకు నంది.. మోదీకి ఆస్కార్’
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాలరాసేలా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నంది అవార్డు స్ధాయి నటనతో ప్రజలను ఆకట్టుకుంటూ కన్నీరు పెట్టుకోగా.. మోదీ ఆస్కార్ స్ధాయి నటనతో రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతోందని నాలుగేళ్లుగా తెలియలేదా అని కేవీపీ ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతుంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాదని తెలిసి నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు. -
‘ఏపీ అంటే చిన్న చూపా.. రక్తం మరిగిపోతోంది’
సాక్షి, ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడూ చిన్నచూపేనని, ఆంధ్ర ప్రజల సమస్యలను నెరవేర్చడంలో కేంద్రానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు వారాలుగా పోలవరంపై తాను అడిగిన నాలుగు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం ఖర్చు భరిస్తానని చెప్పి పీపీఏ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వంచించడానికి నడుముకట్టుకుందని వ్యాఖ్యానించారు. పీపీఏ కాదని అర్థరాత్రి ప్రాజెక్టు నిర్వహణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నారని ఆరోపించారు. పోలవరం ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం, సొంత లాభం కోసం కేంద్రం సహకరించదని చంద్రబాబు గ్రహించిన తర్వాతే క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారని ఆయన విమర్శించారు. దుగ్గిరాజ పట్నం పోర్టుకు సంబంధించి ఊసే లేదని, కేంద్ర హోంశాఖ నిస్సంకోచంగా, నిర్లక్ష్యంగా, ఏపీకి రైల్వే జోన్ లేదని చెప్పటం హాస్యాస్పదమన్నారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
బాబు తీరు రాష్ట్రానికి శాపమైంది: కేవీపీ
సాక్షి, ఢిల్లీ: వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు.. ఆయన తీరు రాష్ట్రానికి శాపంగా మారిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈమేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారన్నారు. దోపిడీ వాటాలు కుదరక ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారని, అమరావతి లో శాశ్వత భవనాలకు ఇటుక పేర్చలేదని విమర్శించారు. విభజన చట్టం హామీలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చివరి నిమిషంలో బిజెపిపై నిందలేస్తే ప్రజలు క్షమించరని హితవు పలికారు. ఆస్పత్రి పేర దుబాయ్ కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఎయిమ్స్ నిర్మాణంపై లేదని, కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడడం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెరిటేజ్, బిగ్‌బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదంటూ టీడీపీ కూడా రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందని వెల్లడించారు. -
విభజన అశాస్త్రీయంగా జరిగింది: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన చాలా అశాస్త్రీయంగా జరిగిందని, రాష్ట్రానికి గుండె కాయలాంటి రాజధాని లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ స్ట్రీట్‌లో ఏపీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ..విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాజకీయ ఉద్దేశ్యాలతోనే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉంటే విద్యార్థుల జీవితాలు ఎంతో బాగుపడేవని, ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. పార్లమెంటులో ఎన్ని మొత్తుకున్నా పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించారు. 2019లో జరుగబోయే ఎన్నికల సమయంలో కేంద్రంలో జరిగే రాజకీయ సమీకరణాల్లో మన రాష్ట్ర ఎంపీల అవసరం ఎంతో ఉంటుందని, అప్పుడైనా ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హామీలు అమలుచేయకపోతే జనం క్షమించరని, 2019 ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ కెవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చాలని కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై రూల్ 184 కింద పార్లమెంటులో నోటీసు ఇస్తున్నామని తెలిపారు. -
ప్రధాని మోదీకి లేఖ రాసిన కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మంగళవారం లేఖ రాశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)లో 73.47 శాతం ఉన్న ప్రభుత్వ వాటాను పూర్తిగా అమ్మాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన లేఖలో ఏమి రాశారంటే...దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం సరైనది కాదన్నారు. 41 ఏళ్ల ‘మిని రత్న’ ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా లాభదాయకమైన నిర్ణయం కాదని వివరించారు. 7500 కి.మీ ల పొడవైన దేశ కోస్తా తీర ప్రాంతంలో అనేక విధాలుగా తవ్వకాలను నిర్వహిస్తున్న డీసీఐ అమ్మకం సరైంది కాదని తెలిపారు. డీసీఐ పాత్ర దేశ రక్షణలో అత్యంత కీలకమైందని, ప్రకృతి వైపరీత్యాలను, విధ్వంసాలను అరికట్టడంలో సమగ్ర తవ్వకాలను నిర్వహించడంలో డిసిఐ పాత్ర చాలా ఉందన్నారు. నిపుణులతో కూడిన కమిటీని వేసి దేశంలో డ్రెడ్జింగ్ రంగం భవిష్యత్తు, ఆర్ధిక ప్రయోజనాలపై ఉండే ప్రభావం అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ లో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరారు. అప్పటివరకు డీసీఐలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని విన్నవించారు. -
చంద్రబాబునాయుడిపై మండిపడ్డ కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకెళ్లి చంద్రబాబు స్టేలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయ జన్మనిచ్చిన ఇందిరను, రాజకీయ పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని కేవీపీ మండిపడ్డారు. తన స్వార్థం కోసమే ప్రత్యేక హోదాను చంద్రబాబు గాలికొదిలేశారని అన్నారు. 2019నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామంటున్న చంద్రబాబు.. రూ. 1800 కోట్లతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కేవీపీ ప్రశ్నించారు. 2014నాటి అంచనాలతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. కేంద్రమే ప్రాజెక్టును చేపట్టి ఉంటే సమస్యలు వచ్చేవి కావని అన్నారు. కేవీపీ లేఖ పూర్తి సారాంశం... -
2015లో ఏపీలో 516 మంది రైతుల ఆత్మహత్య
రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రశ్నకు కేంద్రం సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో 516 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం తెలిపింది. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు కోరుతూ రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు శుక్రవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014 సంవత్సరంలో 160 మంది, 2015లో 516 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 2014లో 898 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2015లో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మంత్రి తెలియజేశారు.