
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతుంటే, ప్రజాప్రతినిధులు కేంద్రానికి లేఖలు రాస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.
ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని, పబ్లిక్ సర్వీస్ బ్యాంక్‌గా కొనసాగించాలని కోరారు. విలీనం తప్పనిసరైతే బ్యాంకు పేరును అలాగే కొనసాగించాలనికేవీపీ విజ‍్క్షప్తి చేశారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగు ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీసేలా ఉందని, పట్టాభి సీతారామయ్య జ్ఞాపకంగా తెలుగు వారికి గుర్తుగా ఆంధ్ర బ్యాంకు పేరును కొనసాగించాలి లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment