ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో 516 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం తెలిపింది.
రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రశ్నకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో 516 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం తెలిపింది. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు కోరుతూ రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు శుక్రవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి ఎస్‌ఎస్ అహ్లువాలియా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2014 సంవత్సరంలో 160 మంది, 2015లో 516 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 2014లో 898 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2015లో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మంత్రి తెలియజేశారు.