Farmers Welfare
-
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్‌ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్‌కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్‌తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌ఎఫ్‌ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్‌తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్‌ఎఫ్‌ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్‌సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్‌ఎఫ్‌ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్‌ఎఫ్‌ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్‌తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్‌సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
రైతాంగం కోసం రూ.879 కోట్ల భారీ ప్రాజెక్టు
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. రూ.879.75 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆవిష్కరించింది. నిర్థేశిత ఉత్పత్తులకు క్లస్టర్లను అభివద్ధి చేసి అన్నదాతల ఆదాయాభివృద్ధి, పంట చేతికి వచ్చిన తర్వాత ఎదుర్కొనే నష్టాల నివారణే లక్ష్యంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ చేపట్టినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే ఐదేళ్లలో గుర్తించిన ఐదు ఉత్పత్తుల ధర, నాణ్యత, బ్రాండింగ్, స్థిరత్వాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా, వాల్యూ అడిషన్లలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 17 జిల్లాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధి ప్రాజెక్టు ప్రోగ్రామ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఆయా జిల్లాల్లో మార్కెటింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్టేక్ హోల్డర్ల అభివృద్ధి, అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాం కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బడ్టెట్ లో రూ.879.75 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల 7,030 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రతియేటా రూ.1,436.04 కోట్ల ఆదాయం లభించే 34 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డీజీ మంగల్ రాయ్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.పంట అనంతర నష్టాలు, సవాళ్లను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుందని అంటున్నారు అడిషనల్ చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లోహ్. -
రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు: వై.ఎస్. షర్మిల
సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. రాష్ట్రంలో కల్లాలపైనే రైతుల గుండెలు ఆగిపోతున్నా, పురుగుమందు తాగి నురగలు కక్కి చచ్చిపోతున్నా..పట్టించుకోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దొరకు పంజాబ్, హరియాణా రైతులే కనబడతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు,రిజర్వాయర్లు కాదని, కే అంటే ‘కన్నీళ్లు’, సీ అంటే ‘చావులు’, ఆర్ అంటే ‘రోదన’లు అని, బీఆర్ఎస్ అంటే రైతులకు భరోసా ఇవ్వని బందిపోట్ల రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. భూస్వాములకు రూ.లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిదని, బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. -
ఏపీలో రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు అద్భుతం
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాలను వింటుంటే నిజంగా ఆశ్చర్యమేస్తోందని.. ఇక్కడి పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ దేశం ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆధునిక సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసేందుకు ఊతమిచ్చేలా ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్ర న్ ఆస్ట్రేలియా వర్సిటీలతో ఎన్జీ రంగా వర్సిటీ సోమవా రం ఎంవోయూ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్, పార్లమెంటరీ కార్యదర్శి సమంతారో సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ల్యాబ్ టూ ల్యాండ్ కాన్సెప్ట్ కింద ఆర్బీకేల ద్వారా పరిశోధనా ఫలితాలను నేరుగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా మంత్రి తప్పకుండా ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, మర్డోక్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఆండ్రూ డీక్స్, డిప్యూటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పీటర్ డెవిస్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందంతో ప్రయోజనాలివే.. ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలతో అవగాహన ఒప్పందం వల్ల ఎన్జీ రంగా వర్సిటీ విద్యార్థులు అక్కడకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు అక్కడ పరిశోధనలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యూనివర్సిటీలకు చెందిన వి ద్యార్థులు ఇక్కడ మన వర్సిటీలో పరిశోధనలు చేసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ అధ్యాపక బృందం అక్కడకు వెళ్లి శిక్షణ పొందడంతోపాటు పరిశోధనా ఫలాలను పరస్పరం అందిపుచ్చుకోవచ్చు. -
Rythu Bharosa Kendralu: ఆర్బీకే ఓ అద్భుతం!
సాక్షి, అమరావతి, గన్నవరం/కంకిపాడు/ పెనమలూరు: వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా వ్యవహరిస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం అభినందించింది. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయతగ్గవని, వాటిపై అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తామని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఖ్యాతి సాధించిన ఆర్బీకేల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులందరికీ ఆ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. నిపుణుల బృందం బుధవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం, కంకిపాడు మార్కెట్ యార్డులోని వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, వణుకూరులోని ఆర్బీకేని పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసింది. రైతులను స్వయంగా పలుకరించి అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై వ్యవసాయం, రైతు సంక్షేమంపై చర్చించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో భాగస్వామి అయ్యేందుకు అభ్యంతరం లేదన్నారు. నష్టపోతున్న రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్ పొందుపర్చాలని సూచించారు. మోడల్ ఖరారు కాగానే కేంద్రంతో కలసి పాలు పంచుకుంటామన్నారు. కృష్ణాజిల్లా వణుకూరు ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను తెలుసుకుంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ ఇలాంటివి ఎక్కడా చూడలేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అద్భుతమని, ఇలాంటి వ్యవస్థను ఇంతవరకు ఎక్కడా చూడలేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా ప్రశంసించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన అగ్రిల్యాబ్స్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. అగ్రిల్యాబ్స్‌లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా విత్తనాలు, ఎరువుల్లో ఎక్కడైనా కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా తెలియజేయాలని కోరారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులను హెచ్చరించి కల్తీల బారినుంచి కాపాడుకోవచ్చన్నారు. పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు చాలా బాగున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ వినియోగించుకుంటున్న తీరు అమోఘమన్నారు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుందని అహూజా ప్రశంసించారు. ఈ–క్రాపింగ్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని, టెక్నాలజీని మిళితం చేసి రైతులకు చక్కటి ప్రయోజనాలు అందిస్తున్నారని చెప్పారు. రైతు క్షేత్రం (ఫామ్‌గేట్) వద్దే కొనుగోళ్లు, ఆర్బీకేల స్థాయిలోనే పంటల విక్రయం లాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేయడాన్ని స్వాగతించారు. ఆర్బీకేల స్థాయిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ఏర్పాటు ఎంతో మంచి ఆలోచనన్నారు. సామాజిక తనిఖీల కోసం అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్న విధానం పారదర్శకంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు విద్యా రంగంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులను సైతం తమతో పంచుకున్నారని పేర్కొంటూ విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృషిని అభినందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ మనోజ్ అహుజాకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాల్ సెంటర్, ఆర్బీకే, అగ్రిల్యాబ్‌ను సందర్శించిన బృందం నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటైన ఆర్బీకేలు నిజంగా గొప్ప ఆలోచన అని మనోజ్ అహూజా పేర్కొన్నారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం రైతు భరోసా కేంద్రం లైవ్ స్టూడియోను ఆయన పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా శాస్త్రవేత్తలు వెంటనే సలహాలు, సూచనలు అందిస్తుండటాన్ని ప్రశంసించారు. రైతులు ఫోన్ చేసినపుడు ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటిæ సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలను నిశితంగా గమనించారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరులో ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించారు. పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ధాన్యం కొనుగోలు తదితర సేవలు అందుతున్నాయన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సీఎం జగన్ ఆర్బీకేలను ఏర్పాటు చేసిన తరువాత రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. కియోస్క్ ద్వారా రైతులే స్వయంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించడాన్ని బృందం పరిశీలించింది. ఆర్బీకేలకు ఐఎస్ఓ నాణ్యత ప్రమాణ పత్రం లభించడం ఉత్తమ పనితీరుకు నిదర్శనమని బృందం సభ్యులు పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతు భరోసా రథం. వెటర్నరీ మొబైల్ వాహనాన్ని సైతం పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. అక్కడ నుంచి కంకిపాడు చేరుకుని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను పరిశీలించారు. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకుని కల్తీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. మట్టి నమూనాల పరీక్షలు, విత్తన సేకరణ, నాణ్యత పరిశీలనపై ల్యాబ్ సిబ్బందిని బృందం అడిగి తెలుసుకుంది. కేంద్ర బృందం సభ్యులైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్‌కరన్‌లతో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఆర్బీకేల జేడీ శ్రీధర్ కార్యక్రమంలో పొల్గొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్‌కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం రైతులకు గరిష్ట ప్రయోజనం అందాలి: సీఎం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో పాటు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. కనీస మద్దతు ధర దక్కని సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ఎంతో బాగుందని, ఈ పథకం పీఎంఎఫ్‌బీవైతో భాగస్వామిగా మారితే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అహూజా సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే రైతులకు గరిష్ట ప్రయోజనాలతో మంచి మోడల్ రూపొందించాలని సూచించారు. -
వ్యవసాయ వర్సిటీకి మొదటి స్థానం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలవగా, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 2021–22 విద్యాసంవత్సరంలో వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎన్జీ రంగా, హార్టి కల్చర్ అండ్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ కేటగిరీలో ఉద్యాన వర్సిటీ ఈ అవార్డులను దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పర్షోత్తమ్‌ఖడోభాయ్ రూ పాలా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రి లోచన్ మహాపాత్ర చేతుల మీదుగా ఎన్జీ రంగా, ఉద్యాన వర్సిటీ వీసీలు డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్ టి.జానకీరామ్ అందుకున్నారు. ఆయా కేటగిరీల్లో అత్యధిక పీజీ స్కా లర్షిప్లు మన రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు పొందారు. జాతీయ స్థాయిలో 63 వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పోటీపడిన ఎన్జీ రంగా వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా, ఏడు ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బెంగళూరు ఉద్యాన వర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రెండో స్థానం దక్కించుకుంది. -
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల
-
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
-
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు చెల్లించాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. ఒకేసారి మూడు పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నామన్నారు. (చదవండి: మాది రైతు పక్షపాత ప్రభుత్వం: సీఎం జగన్) ముఖ్యమంత్రి ఏమన్నారంటే... ‘‘ వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, యంత్రసేవా పథకం... ఈ మూడు పథకాలకోసం రూ. 2190 కోట్ల లబ్ధి. వరుసగా మూడో సంవత్సరం.. రెండో విడత కింద రూ.2052 కోట్ల రూపాయలను జమచేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా రెండో విడతగా ఆగస్టు మాసంలో రూ. 977 కోట్లు ఇచ్చాం. కేవలం ఈ ఒక్క రైతు భరోసా కింద మాత్రమే రూ.18,777కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా కూడాలేని విధంగా, జరగని విధంగా సొంత భూములను సాగుచేసుకుంటున్న రైతులతోపాటు, కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 6,67లక్షల రైతులకు రూ.112 కోట్లకుపైగ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం. ఏడాదిలోపే పంటరుణాలు చెల్లించిన వారికి.. వారు కట్టీని వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమచేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటిన నుంచి సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1674 కోట్ల రూపాయలు ఇచ్చాం. 10778 రైతు భరోసా కేంద్రాల్లో 9160 మంది బ్యాంకింగ్ కరస్పాండెట్లను కూడా పెట్టాం. మిగిలిన చోట్లా కూడా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కౌలు రైతులతో సహా.. రైతులందరికీ కూడా బ్యాంకు లావాదేవీలు జరుపుకునేందుకు, రైతుల పంటరుణాలు అందుకునేందుకు బ్యాకింగ్ కరస్పాండెంట్ల సేవలు మీకు బాగా ఉపయోగపడతాయి. వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీతోపాటు వైయస్సార్ యంత్రసేవా పథకం కింద 1720 గ్రూపులకు రూ. 25.55 కోట్ల రూపాయలు నేడు జమ చేస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు. ♦రాష్ట్రవ్యాప్తంగా రూ.2134 కోట్లతో రైతు భరోసా కేంద్రాల్లో యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1035 కంబైన్డ్ హార్వెస్టర్లను పెడుతున్నాం ♦29 నెలల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం ♦దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమ సైతం.. నీటితో పుష్కలంగా ఉంది ♦రైతుకు ఇంతకుముందు కరువులు, కాటకాలు మాత్రమే తెలుసు ♦కరోనా సవాల్ విసిరినా.. రైతు అడుగు ముందుకేస్తున్నాడు ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం ♦వ్యవస్థలను సరిదిద్దుతున్నాం ♦మార్కెటింగ్ మీద విపరీతమైన శ్రద్ధ కూడా పెట్టాం ♦ధరల స్థిరీకరణ నిధిని కూడా తీసుకు వచ్చాం ♦పొగాకుకు కూడా ధరల స్థిరీకరణను వర్తింప చేస్తాం ♦జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాం ♦విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా అన్నింట్లోనూ కూడా రైతులను చేయిపట్టుకుని ఆర్బీకేలు నడిపిస్తున్నాయి ♦ఇలాంటి గొప్ప మార్పులు తీసుకు వస్తున్నాం ♦వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేస్తాం ♦ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి.. నాలుగు అంచెలుగా సమావేశాలు ఏర్పాటు చేశాం ♦సలహాలు, సూచనలతో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాం ♦ఇ- క్రాపింగ్ అన్నది.. ప్రతి రైతుకు, ప్రతి పంటకూ నమోదు చేసుకోవడం ద్వారా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట కొనుగోలు, పంటరుణాలు, సున్నావడ్డీలు ఇవన్నీ కూడా పారదర్శకంగా అందిస్తున్నాం ♦ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రతి పథకానికి ఇ- క్రాపింగ్ ద్వారా అనుసంధానం చేస్తున్నాం ♦యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦గ్రామ స్థాయిలో వ్యవసాయాన్ని యాంత్రీకరిస్తున్నాం ♦ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకులను ఉంచాం ♦ప్రతి సేవను వారిద్వారా అందిస్తున్నాం ♦సహకార వ్యవస్థలో హెచ్ఆర్విధానాన్ని తీసుకు వస్తున్నాం ♦ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలను కంప్యూటరీకరిస్తున్నాం ♦సీఎం యాప్‌ద్వారా.. రైతులు ధరల విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే.. వెంటనే వారిని ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకునేందుకు అడుగులు ముందుకేస్తున్నాం ♦ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే కనీస గిట్టుబాటు ధరలను వర్తింపు చేయడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఎంఎస్పీ వర్తింపు చేస్తున్నాం: ♦ఇవన్నీ చేయడానికి గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది ♦కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు మంజూరుచేస్తూ... వ్యవసాయ మార్కెట్లను కూడా ఆధునీకరిస్తున్నాం ♦కల్తీ నివారణమీద మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్టుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు ♦కల్తీలేని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నాం ♦ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా కల్తీలేని వాటిని అమ్మేలా చర్యలు తీసుకుంటున్నాం ♦పగటిపూటే రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.18వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశాం ♦ఇది కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన మరో రూ.10వేల కోట్ల బకాయిలను కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది ♦నాణ్యమైన కరెంటు ఇచేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీడర్ల అభివృద్ది కోసం రూ.1700 కోట్ల రూపాయలు కూడామనం ఖర్చు చేశాం ♦29 నెలల కాలంలో వైయస్సార్ ఉచిత పంటల భీమా ద్వారా 31.7లక్షలమంది రైతులకు రూ. 3716 కోట్ల రూపాయలు అందించగలిగాం ♦ఇది కాక ధాన్యం సేకరణకోసం రూ.35వేల కోట్ల పైచిలుకు ఖర్చుచేశాం ♦మరో రూ.1800 కోట్ల రూపాయలతో పత్తిపంటను కూడా కొనుగోలు చేశాం ♦ఇతర పంటలకోసం రూ.6400 కోట్లకుపైగా ఖర్చు చేశాం ♦ధరలు పడిపోకూడదు.. రైతు నష్టపోకూడదని.. ఈ కార్యక్రమాలు చేశాం ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలను కూడా రైతుల కోసం మన ప్రభుత్వం కట్టింది ♦గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల రూపాయల విత్తన బకాయిలను కూడా మనమే చెల్లించాం ♦ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్లో అందించేలా చేస్తున్నాం ♦ఇన్పుట్ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్లో నే ఇచ్చే కొత్త ఒరవడిని తీసుకు వచ్చాం ♦ఏపీ అమూల్ పాలవెల్లువను తీసుకు రాగలిగాం ♦ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ కింద రూ.1.5కే యూనిట్ అందిస్తున్నాం ♦రెండు సంవత్సరాల్లో రూ.1560 కోట్లు సబ్సిడీ రూపంలో ఆక్వారైతులకు ఇచ్చాం ♦రైతన్నల ఆత్మహత్యలు చూడ్డానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే.. మన రైతు భరోసా కేంద్రాలను చూడ్డానికి ఇతర రాష్ట్రాలనుంచి బృందాలు వస్తున్నాయి ♦సకాలంలో మంచి వర్షాలు పడాలని, వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను -
రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగు కోసం వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమై తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 40 శాతం సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ నగదు జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు.మాది రైతు పక్షపాత ప్రభుత్వం. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) 50.37 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా ఖరీఫ్ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీన్లో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్‌లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది. (చదవండి: ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..) ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు 2019–20లో 45.23 లక్షల మంది కుటుంబాలకు రూ.6,162.45 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో 49.40 లక్షల మంది రైతులకు రూ. 6,750.67 కోట్లు అందజేసింది. అటవీభూమి సాగుచేస్తున్న వారితోపాటు కౌలుదారులు కలిపి తొలి ఏడాది 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది లబ్ధిపొందారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా మే 13న రూ.3,811.96 కోట్ల సాయమందించిన ప్రభుత్వం రెండోవిడతగా నేడు 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్లు అందిస్తోంది. భూమిలేని 1.50 లక్షల మందికి భరోసా ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86,361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది లబ్ధిపొందుతున్నారు. మూడేళ్లుగా లబ్ధి పొందుతున్న వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రెండోవిడత సాయంతో కలిపి 2019 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు రూ.18,777 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. (చదవండి: దీపావళికి ప్రత్యేక వారాంతపు రైళ్లు) పారదర్శకంగా అర్హుల ఎంపిక ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న సంకల్పంతో అర్హుల గుర్తింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోంది. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అర్హులై ఉండి లబ్ధిపొందని వారి వివరాలను గ్రీవెన్స్ పోర్టల్‌లో పొందుపరిచి వారిలో అర్హులను గుర్తిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నివసిస్తూ మన రాష్ట్రంలో వ్యవసాయ భూములు ఉన్న 865 మంది రైతులకు కూడా ఈ ఏడాది రూ.13,500 వంతున రైతుభరోసా సాయం అందించారు. 6.67 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీమేరకు వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు కూడా చెల్లిస్తూ రైతులకు బాసటగా ఉండటమేగాక ఏడాది తిరక్కుండానే ఈ వడ్డీ రాయితీ సొమ్మును జమచేస్తోంది. ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీ సొమ్మును నేడు ముఖ్యమంత్రి వారిఖాతాల్లో జమచేస్తున్నారు. 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 50 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేసింది. ఖరీఫ్–2019 సీజన్లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ–2019–20 సీజన్లో 5.55 లక్షల మందికి రూ.92.38 కోట్లు చెల్లించింది. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా.. ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్‌లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించాలని సంకల్పించారు. ఈ సీజన్లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వీరిలో 6.67 లక్షల మంది సున్నావడ్డీకి అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలను సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఇలా అర్హత పొందినవారి ఖాతాలకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కింద రూ.112.70 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. యాంత్రీకరణకు చేయూత చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను నేడు రైతు గ్రూపులకు జమ చేసింది. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఇప్పటికే 789 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించగా, తాజాగా మరో 1,720 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీలను) ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలతో 10,750, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలతో కూడిన 1,035 యంత్ర సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం కింద రూ.2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతుగ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తంలో 854 కోట్లు (40 శాతం) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుండగా, 10 శాతం (రూ.213 కోట్లు) రైతు కమిటీలు భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతం (1,067 కోట్లు) బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. తొలివిడతగా గ్రామస్థాయిలో 3,250 సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కాగా ఇప్పటికే 789 సీహెచ్‌సీలను రైతు దినోత్సవం రోజైన జూలై 8వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి రూ.9.07 కోట్ల సబ్సిడీని జమచేశారు. తాజాగా రూ.69.87 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో 1,720 యంత్ర సేవాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి 40 శాతం సబ్సిడీ మొత్తం రూ.25.55 కోట్లను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. -
ఏపీ పథకాలు దేశంలోనే ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి తెలిపారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును రైతులు ఎన్నటికీ నమ్మరని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీ లేదన్నారు. పైగా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువే అన్నారు. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పండగ చేశారని చెప్పారు. ఆ మహానేత కుమారుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును రాజును చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఏం చెప్పారంటే.. ► రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట వేరుశనగ. 2014–15 నుండి ఇప్పటి దాకా ఈ పంట వివరాలు తెప్పించుకుని చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి. ► రాయలసీమలో కేవలం 3 శాసన సభ స్థానాలకే టీడీపీని ప్రజలు పరిమితం చేశాక కూడా, అక్కడి ప్రజలను ఇంకా మోసం చేసేందుకు టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తుండటం దారుణం. ► కరువు, చంద్రబాబు కవల పిల్లలుగా సాగిన పాలన అందరికీ తెలుసు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని.. పగటి పూటే తొమ్మిది గంటలు నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఈ విషయాలు రైతులెవరూ మరచిపోరు. ► ఇలాంటి చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ రోజు వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. కోవిడ్ సంక్షోభంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రకటించిన సమయానికి పథకాలు అమలవుతున్నాయి. ► క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కనిపిస్తే, ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. నిర్మాణాత్మక ప్రతి పక్షంగా వ్యవహరించకపోగా.. కుల, మతాల పేరుతో, అబద్ధపు ప్రచారాలతో లబ్ధిపొందేందుకు యత్నిస్తున్న ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడటం దేశంలో ఇదే ప్రథమం. -
Andhra Pradesh: ఆర్బీకేలు గొప్ప ప్రయోగం... దేశం మొత్తం మీవైపు చూస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) ద్వారా అమలవుతున్న వివిధ పథకాల అమలుతీరును పరిశీలించేందుకు మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రెండ్రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించింది. ఎన్ఎఫ్ఎస్ఎం కింద 100% సబ్సిడీపై పంపిణీ చేసిన కంది, మినుము, పెసర, నూనె గింజల మినీ కిట్ల ద్వారా సాగవుతున్న పంట క్షేత్రాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇక్కడ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రశంసలు కురిపించింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట పంట ప్రదర్శన క్షేత్రాల పరిశీలన.. గుంటూరు జిల్లా విట్టంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, ములకనూరులలో కంది క్లస్టర్ ప్రదర్శన క్షేత్రాలను, వెంగళాయపాలెంలో హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో క్లస్టర్ డెమోతో పాటు ఎల్లమంద గ్రామంలోని పొలంబడి క్షేత్రాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం.. కృష్ణాజిల్లా చంద్రగూడెంలో పత్తి, కోడూరులో కంది ప్రదర్శన క్షేత్రాలతోపాటు తుమ్మలపల్లిలో వరి పొలంబడి క్షేత్రాన్ని సందర్శించారు. అంతర పంటల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఆరా తీయగా, ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు వివరించారు. క్షేత్రాల వద్ద రిజిస్టర్ల నిర్వహణ, బోర్డుల ఏర్పాటును పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఆర్బీకే, అగ్రిల్యాబ్స్ సందర్శన గుంటూరు జిల్లా నూజెండ్ల రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే), కృష్ణాజిల్లా ఎ.కొండూరు అగ్రి ల్యాబ్‌లను కూడా బృందం సభ్యులు సందర్శించి వీటి ద్వారా రైతులకందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నామని సిబ్బంది చెప్పగా.. నిజంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బుక్ చేసిన 24 గంటల్లోనే అందిస్తున్నారని రైతులు బదులిచ్చారు. కియోస్క్‌లను రైతులు ఎలా వినియోగించుకుంటున్నారో ఆరా తీశారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సేవలు, పంటల వారీగా లైబ్రరీలో ఉంచిన పుస్తకాలు, వీడియోలను పరిశీలించి చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఎ.కొండూరు అగ్రిల్యాబ్‌తో పాటు ల్యాబ్‌లోని అత్యాధునిక టెస్టింగ్ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. చదవండి: రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది! త్వరలో కేంద్రానికి నివేదిస్తాం ‘ఇలాంటి అత్యాధునిక ల్యాబ్‌లను దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం. ముందుగా నాణ్యత పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాత పంపిణీ చేయడంవల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది’.. అని పొన్నుస్వామి అన్నారు. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్స్ దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నాయన్నారు. ఈ వివ్లవాత్మక మార్పులతో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. ఇక్కడ అమలుచేస్తున్న కొన్ని కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బృందం వెంట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు ఎన్‌సి బాలునాయక్.. కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశం మొత్తం మీవైపు చూస్తోంది ► ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక అగ్రిల్యాబ్స్ (33) తమిళనాడులోనే ఉన్నాయనుకునే వాణ్ణి. కానీ, మీ రాష్ట్రంలో ఏకంగా 160 ల్యాబ్స్‌ను తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో ఏర్పాటుచేశారంటే నమ్మలేకపోతున్నా. చాలా బాగున్నాయి. సాగు ఉత్పాదకాలను నేరుగా రైతులకందించాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలు నిజంగా గొప్ప ప్రయోగం. గ్రామస్థాయిలో రైతులకు ఇంతలా సేవలందిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని కచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో దేశం మొత్తం మీవైపు చూస్తోంది. ఇక్కడి యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. – డాక్టర్ కె. పొన్నుస్వామి, కేంద్ర ప్రభుత్వ నూనెగింజల అభివృద్ధి సంస్థ జేడీ, జాతీయ ఆహార భద్రతా మిషన్ దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధి -
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 60 రైతుబజార్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైతుబజార్లు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా వీటి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆరు రైతుబజార్లను వినియోగంలోకి తీసుకురాగా మిగిలిన వాటిని డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో 107 రైతుబజార్లున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 11వేల మంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీరోజు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల కూరగాయలను రైతులు గిట్టుబాటు ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో రైతుబజార్లో ప్రతిరోజు రూ.20 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతుబజార్లకు ప్రజలు బాగా అలవాటుపడ్డారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెండింగ్ పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. స్థలాలు అందుబాటులో లేకపోవడం.. ఆర్థిక పరిస్థితుల సాకుతో గత ప్రభుత్వం కొత్త రైతుబజార్ల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో.. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు.. ఎక్కువ మందికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో కొత్త రైతుబజార్లకు సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.52.02 కోట్లతో 60 రైతుబజార్లను ఏర్పాటుచేస్తోంది. వీటిలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం, ఆలమూరు, వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆత్మకూరు, ఆళ్లగడ్డలలో రైతుబజార్లను దివంగత మహానేత వైఎస్సార్ జయంతి రోజైన రైతు దినోత్సవం నాడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మిగిలిన 54 రైతుబజార్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వీటి కోసం అవసరమైన స్థలాలను గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 16, కృష్ణాలో 10, చిత్తూరులో 8, వైఎస్సార్ జిల్లాలో 5, ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో మూడేసి, అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఈ రైతుబజార్ల ద్వారా కనీసం 6వేల మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
రైతు పక్షపాతి సీఎం జగన్
రాయదుర్గం: ఉచిత విద్యుత్‌తో పాటు జలయజ్ఞం ద్వారా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారని, తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఏపీ విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్ , వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం వల్ల ఉపయోగం లేదని, ఉచిత విద్యుత్ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారన్నారు. కానీ వైఎస్సార్ అధికారం చేపట్టిన వెంటనే రైతులను బతికించుకోవడం కోసం ఉచిత విద్యుత్‌తో పాటు ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారని గుర్తు చేశారు. అన్నదాతల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన వైఎస్సార్ జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తండ్రి ఒక అడుగు ముందుకేస్తే , తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సంక్షేమం కోసం వంద అడుగులు ముందుకేస్తున్నారని కొనియాడారు. కరోనా వచ్చినా , కష్టం వచ్చినా రైతు సంక్షేమ పథకాలు ఆపలేదని, రైతు సంక్షేమ ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. రైతుల అభివృద్ధికి పాటుపడుతున్న తమ ప్రభుత్వం రాయదుర్గంలో నేడు రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తోందన్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మిస్తున్న గోడౌన్లు, రైతు భరోసా కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, రైతు బజార్లు తదితర వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడారు. -
Andhra Pradesh: వేగంగా అగ్రి ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల అభివృద్ధిని కాంక్షించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, వారికి మరింత ప్రయోజనం కలిగించే దిశగా అగ్రి ప్రాజెక్టులన్నింటినీ నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.15,743 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వారు ఏ అవసరానికైనా ఊరు దాటి వెళ్లకుండా అన్ని వసతులు కల్పించాలన్నదే మనందరి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి అండగా నిలిచామని.. ఆధునిక వ్యవసాయ పరికరాలు, యాంత్రీకరణను వారికి అందుబాటులోకి తేవడం ద్వారా మరింత చేయూత ఇచ్చే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఎక్కడికక్కడ పంటలను ప్రాసెస్ చేయడం ద్వారా రైతులకు మంచి ధర వస్తుందని, ఇందు కోసం గ్రామ స్థాయిలో విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని విధాలా వీలైతే అన్ని విధాలా రైతులకు అండగా నిలవాలన్నదే మనందరి ప్రభుత్వ తాపత్రయమని, అందువల్ల అధికారులు వీటన్నింటిపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలని సూచించారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలతో ఎంతో మేలు ► మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు (ఎంపీఎఫ్సీ) రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్దే ఏర్పాటవుతున్నాయి. ఇందులో భాగంగా డ్రై స్టోరేజీ–డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు (పంటను ఎండబెట్టే వసతి), ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) గోదాములు, ఎస్సేయింగ్ (నాణ్యత పరీక్ష) ఎక్విప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రా, పశు సంవర్థక మౌలిక సదుపాయాల వరకు దాదాపు 16 రకాల ప్రాజెక్టులు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ► 4,277 డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు, పీడీఎస్ కోసం 60 గోదాములు, 1,483 సేకరణ కేంద్రాలు, కోల్డ్ రూమ్స్, టర్మరిక్ (పసుపు) బాయిలర్లు, పాలిషర్లు.. 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, 10,678 ఎస్సేయింగ్ ఎక్విప్మెంట్, 10,678 సేకరణ కేంద్రాల ఎక్విప్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. బీఎంసీయూల నిర్మాణం మొదలు ► రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,885.76 కోట్ల అంచనా వ్యయంతో 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), రూ.942.77 కోట్లతో 8,051 ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాల (ఏఎంసీయూ) నిర్మాణానికి అంచనాలు రూపొందించాం. ► రాష్ట్రంలో ఇప్పటికే 9,051 చోట్ల బీఎంసీయూల కోసం భూమి గుర్తించగా, 6,252 యూనిట్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం బీఎంసీయూల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటి వల్ల రాష్ట్రంలో పాడిపై ఆధారపడిన అక్కచెల్లెమ్మల ఆదాయం పెరుగుతుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్లు ► ఒక్కో యూనిట్ వ్యయం రూ.15 లక్షల చొప్పున ఆర్బీకేల స్థాయిలో మొత్తం 10,750 కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ– అద్దెకు వ్యవసాయ పరికరాలు) ఏర్పాటు చేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 175 చోట్ల హైటెక్ హైవాల్యూ ఫామ్ మెకనైజేషన్ (అత్యాధునిక వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు) హబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో హబ్ వ్యయం దాదాపు రూ.1.5 కోట్లు అవుతుంది. ► ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉండే నాలుగు జిల్లాలలో ప్రత్యేక క్లస్టర్లను గుర్తిస్తున్నాం. ఆ మేరకు ఆయా జిల్లాలలో మండలానికి 5 చొప్పున క్లస్టర్ స్థాయిలో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కోటి రూ.25 లక్షల వ్యయం అంచనాతో మొత్తం 1,035 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాదికి 4 ఫిషింగ్ హార్బర్లు ► తొలి దశలో ఉప్పాడ (తూ.గో), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు)లో వచ్చే ఏడాది (2022) డిసెంబర్ నాటికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ► రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం. ► ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ► మత్స్యకారులు, ఆక్వా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రి ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, 100 ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 25 హబ్‌ల పనులు ఈ నెలలో మొదలు కానున్నాయి. ► రూ.646.90 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 133 ప్రాసెసింగ్, ప్రిప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం ► గత ఏడాది నవంబర్ 20న ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో అమూల్ పాల సేకరణ మొదలు పెట్టగా, ఈ ఏడాది మార్చి 29న గుంటూరు జిల్లాలో, ఏప్రిల్ 3న చిత్తూరు జిల్లాలోనే మరి కొన్ని గ్రామాలకు పాల సేకరణ విస్తరించారు. ► ఈ నెల 4 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ మొదలు పెడుతోంది. ► 4 జిల్లాలలో 12,342 మంది మహిళా రైతుల నుంచి 50.01 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న అమూల్.. రూ.23.42 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. తద్వారా మహిళా రైతులకు రూ.3.91 కోట్ల అదనపు ఆదాయం లభించింది. గ్రామ స్థాయిలో విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల స్థాయిలో 10,111 విత్తన, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నాం. ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ► పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవకాశం ఉన్న పంటల గుర్తింపునకు చర్యలు తీసుకున్నాం. ఆ మేరకు యూనిట్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ చివరికి వీటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. -
రైతు ప్రయోజనాలకు ఆమడదూరంలో...
భారతీయ ప్రాచీన సాహిత్యంలో రైతుకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యతా లేదన్నది వాస్తవం. కౌటిల్యుడు, మనువు ఈ దేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తున్నాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే సేద్యానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన తొలి శూద్ర చింతనాపరుడు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలసి ఉంది. తమ ఆత్మగౌరవాన్ని, తరతరాలుగా చేస్తూవస్తున్న వృత్తి భవిష్యత్తును కాపాడుకోవడానికి భారీ స్థాయిలో రైతులు ఆందోళన జరుపుతున్న నేపథ్యంలో పాలక ఆరెస్సెస్ భావజాలం.. దాని వాణిజ్య అనుకూల సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి లేశమాత్రంగా అయినా అవకాశం ఉందా? 1925 నుంచి ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక హిందుత్వ జాతీయవాద విధాన పత్రాల కేసి చూసినట్లయితే, వ్యవసాయ అభివృద్ధి విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించిన దాఖలాను అవి ఏమాత్రం చూపించవు. ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్.. సారాంశంలో వ్యవసాయ వ్యతిరేకతను పుణికిపుచ్చుకున్న మనుధర్మం, కౌటిల్యుడి అర్థశాస్త్ర భావజాలానికి సంబంధించిన బలమైన సైద్ధాంతిక మూలాలను కలిగివుంది. ఆధునిక కాలంలో సావర్కర్, గోల్వాల్కర్ తమ రచనల ద్వారా కౌటిల్యుడు, మనువు పరంపరను కొనసాగించారు. ఇస్లాం వ్యతిరేతను నిలువెల్ల పుణికిపుచ్చుకున్న భావజాలంతో హిందుత్వ ప్రాపంచిక విధానం వ్యవసాయ వ్యతిరేకతను నిగూఢంగా పొందుపర్చుకుంది. జాతీయవాదం పేరిట తమ భావజాలాన్ని నిర్మించుకున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తిని ముందుకు తీసుకుపోవడం వారి చర్చల క్రమంలో ఎన్నడూ భాగం కాలేదు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని అఖిల భారత జమాత్–ఇ–ముస్లిమిన్ లేక జమాత్ ఇస్లామ్ హింద్ నేతృత్వంలోని వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ మత సంస్థకైనా లేక మత రాజకీయ పార్టీకైనా.. వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ప్రయోజనంపై దృష్టి సారించిన చరిత్ర లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్/బీజేపీలే భారతదేశాన్ని ఏలుతూ, రైతు వ్యతిరేక చట్టాలను రూపొందిస్తున్న తరుణంలో వీరి చరిత్రను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాంచజన్య, ఆర్గనైజర్ వంటి ఆరెసెస్ సిద్ధాంత పత్రికలను కానీ, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వంటి వాటి పరిశోధనా సంస్థల కార్యకలాపాలను కానీ గమనించిన ఎవరికైనా సరే భారతీయ వ్యవసాయంపై వీరు ఎన్నడూ దృష్టి సారించినట్లు కనబడదు. వీరు ఎల్ల ప్పుడూ ద్వేషిస్తూ ఉండే చైనాతో (అది కమ్యూనిస్టు దేశమైనా కాకున్నా సరే..) పోటీ పడేలా వ్యవసాయంలో సానుకూల సంస్కరణ, అభివృద్ధి తీసుకురావటం పట్ల వీరు ఎన్నడూ దృష్టి పెట్టలేదు. కౌటిల్యుడు, మరింత అధికంగా మనువు ఈదేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ఆర్ఎస్ఎస్ కానీ, దాని రాజకీయ విభాగమైన బీజేపీ కానీ ఆ భావజాలంతో ఎన్నడూ తెగతెంపులు చేసుకోలేదు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా వారి వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తూండటం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ కానీ, అమిత్ షా కానీ తమ నిఘంటువులోనే లేని ప్రగతిశీల వ్యవసాయ తాత్వితతను ఎలా ముందుకు తీసుకొస్తారు? చిన్నదైనా, పెద్దదైనా వాణిజ్య అనుకూల విధానమే వారి పరంపరగా ఉంటోంది. ఢిల్లీలో అధికారం స్వీకరించిన కొన్నేళ్లలోనే ఆ పరంపర మార్పుచెందుతుందా? ఆర్ఎస్ఎస్/బీజేపీల నియంత్రణలో ఉన్న ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ఆహార ఉత్పత్తిదారుల వ్యతిరేక తాత్వికతను కలిగి ఉన్న మనుధర్మ నుంచి కాస్తయినా పక్కకు తొలగడానికి సంసిద్ధత చూపడం లేదు. ఆనాడు ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్రుల గురించి మనువు ఏం చెప్పాడో చూడండి. వ్యవసాయంలో వారి కృషిని ఎన్నడూ మనువు ఒక శ్రమగా గుర్తించలేదు. 1. 123. బ్రాహ్మణులకు సేవ చేయటం ఒక్కటే శూద్రుడి అద్భుతమైన వృత్తిగా ప్రకటించడమైనది. దీనికి వెలుపల శూద్రులు ఎలాంటి పని చేసినా అది ఫలితాలను ఇవ్వకపోవచ్చు. 2. 129. శూద్రుడికి శక్తి ఉన్నప్పటికీ అతడు సంపదను సృష్టించకూడదు. శూద్రుడు సంపదను కలిగి ఉండటం బ్రాహ్మణుడిని నొప్పిస్తుంది. హిందుత్వ శక్తులు ఎన్నడూ అద్యయనం చేసి ఉండని చైనాలో, క్రీస్తు పూర్వం 770, 221 మధ్య కాలంలో వ్యవసాయప్రాధాన్యతా వాదం (అగ్రికల్చరిజం) అనే ప్రాపంచిక తత్వం ఉనికిలో ఉండేది. ఈ తాత్వికతకు ప్రాతినిధ్యం వహించిన ప్రధాన తత్వవేత్త జు జింగ్ (372–289 బీసీఈ). ప్రజల ప్రవృత్తి, ఇచ్ఛ అనేవి ఏ ఇతర వృత్తికంటే వ్యవసాయంమీదే ఆధారపడి ఉంటాయన్నది ఇతని ప్రధాన సిద్ధాంతం. క్రీస్తు పూర్వం మూడు, నాలుగు శతాబ్దాల నాటికి చైనా సమాజం పశుపాలన నుంచి బయటపడి ఈ అగ్రికల్చరిజం దన్నుతో వ్యవసాయ ఉత్పత్తివైపు అడుగేసింది. జూ జింగ్ తాత్విక రంగంలో వ్యవసాయదారుడిని ’పవిత్రమైన రైతు’గా భావించేవారు. మత గురువుల కంటే పవిత్ర రైతుకే అత్యధిక విలువ ఇచ్చేవారు. వ్యవసాయ వ్యతిరేక తత్వశాస్త్రమైన బ్రాహ్మనిజం కారణంగానే భారతదేశంలో రైతులకు ఏనాడు అలాంటి ప్రాధాన్యత లభించలేదు. వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలీని బ్రాహ్మణ రుషికి వ్యవసాయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరికి ఎన్నడూ తాత్విక, గౌరవనీయ పవిత్ర స్థానాన్ని దక్కనీకుండా చేశారు. శూద్రులు తమవైన వ్యవసాయ ఆధ్యాత్మిక విధులను నిర్వర్తించేవారు కానీ వీరి దేవతలకు బ్రాహ్మణ సాహిత్యంలో ఎలాంటి విలువా చూపేవారు కాదు. బ్రాహ్మణిజం శూద్రులను బానిసలుగా వ్యవస్థీకరించి వారిని ఉద్దేశపూర్వకంగా విద్యకు దూరం చేయడంతో వీరి తాత్విక అభివృద్ధి కూడా నిలిచిపోయింది. బ్రాహ్మణులు రూపొం దించిన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మను ధర్మశాస్త్రం వంటివాటిలో వ్యవసాయానికి కించిత్ చోటు లేదు. కానీ భారతదేశంలోని ప్రతి రచయితా వీటినే భారతీయ నాగరికత, సంస్కృతికి ఆకరాలుగా భావిస్తూ వచ్చేవారు. కానీ ఈ పుస్తకాల్లో ఏ ఒక్కటీ వ్యవసాయ ప్రాధాన్యత గురించి చాటిన పాపాన పోలేదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ భావజాలమైన భారతీయ సాంస్కృతిక వారసత్వం వ్యవసాయం నుంచి తీసుకున్నది కాదు. అసలు వ్యవసాయాన్ని సంస్కృతిలో భాగంగానే వీరు గుర్తించలేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్ది వరకు మన దేశంలోనూ వ్యవసాయం కాస్త అభివృద్ధి చెంది వ్యవసాయ ఉత్పత్తి ఒకమేరకు ప్రారంభమైన కాలంలోనే వ్యవసాయ ఉత్పత్తిని కించపరుస్తూ కౌటిల్యుడు అర్ధశాస్త్రం, మనువు ధర్మశాస్త్రం రాశారు. కులాన్ని ఆచరించే రుషులను, సన్యాసులను భారతీయ సంస్కృతి వారసత్వానికి సంబంధించి తిరుగులేని నమూనాగా బ్రాహ్మణవాదం ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ వీరికి ఉత్పత్తిలో, వ్యవసాయంలో ఏ పాత్రా లేదని గమనించాలి. శూద్ర రైతులను తమదైన ప్రత్యామ్నాయ చింతనను ఏర్పర్చుకోవడానికి కూడా అనుమతించలేదు. 19వ శతాబ్ది మధ్య కాలంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన మొట్టమొదటి శూద్ర చింతనాపరుడు. శూద్రులకు తాత్విక స్థాయి లేకుండా చేశారని, వారిని బానిసల స్థాయికి కుదించి వేశారని పూలే గుర్తించారు. బానిసగానే ఉన్నంత కాలం ఏ శూద్రుడు కూడా తన సొంత తాత్విక దృక్పథాన్ని నిర్మించుకోలేడు. కాబట్టే పూలే శూద్ర రైతుకు కేంద్ర స్థానమిచ్చి ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం రచించారు. అయితే ఫూలేకి నిరంతరం రచనలు చేస్తూ, తాత్విక దృక్పథాన్ని నిర్మించగల చారిత్రక వారసత్వం లేనందున గతకాలపు చైనా ప్రాపంచిక దృక్పథం వంటి పూర్తి స్థాయి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని ఆయన పెంపొందించలేకపోయారు. వ్యవస్థీకృతంగా రాయకుండా, ఎలాంటి ప్రాపంచిక దృక్పథం కూడా అభివృద్ధి చెందదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులు పూలే వ్యవసాయ తాత్వికతను పురోగమన స్థాయికి అనుమతించకుండా వేదవాడనే కొనసాగిస్తూ వచ్చాయి. కాబట్టి వేదకాలానికి ముందటి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని తిరిగి కనిపెట్టడం ద్వారా మన నిజమైన ప్రాచీన మూలాలపై చర్చను తప్పక కొనసాగించాలి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. ప్రభుత్వ పాఠశాలల్లో రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలిసి ఉంది. అలాగే మన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భారతీయ వ్యవసాయ ప్రాధాన్యతను ఆధిక్యతలో ఉంచుతూ పునర్నిర్మాణం చెందటం అవసరం. వ్యవసాయ రంగంలో ఉన్నతమైన అభివృద్ధి, మెరుగైన మార్కెట్ దిశగా అలాంటి మార్పును ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులు వ్యతిరేకించినట్లయితే, యూనివర్శిటీల్లోని రైతాంగ యువత నాయకత్వంలో నిజమైన అజాదీ కోసం సమరం ప్రారంభమవడం ఖాయం. వ్యాసకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కార్పొరేట్ సాగు మన సంస్కృతికి విరుద్ధం
‘ప్రపంచంలోని 70 శాతం పంటపొలాలలో గడ్డి బీడులను, పండ్లతోటలను ఒక్క శాతం బడా రైతాంగం (కార్పొరేట్లు) మాత్రమే వ్యవసాయం నిర్వహిస్తూ, ప్రకృతి సంక్షోబాలకు కారణమవుతూ సేద్యంలో అసమానత ప్రభావానికి కారకులవుతున్నారని’, ఆక్స్‌ఫామ్, ప్రపంచ అసమానతలపై అధ్యయనం చేస్తున్న సంస్థలతో కలిసి పనిచేసిన అంతర్జాతీయ భూముల అధ్యయన కేంద్రం పరిశోధనలలో తేలింది. 1980 నుండి వ్యవసాయ పొలాల నిర్వహణ పరోక్షంగా కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా కేంద్రీకృతమైందని అధ్యయన కేంద్ర ప్రతినిధి వార్డ్ అన్యూన్ తెలిపారు. కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా చిన్న, మధ్య తరగతి రైతులను నిర్లక్షం చేస్తూ ఏకపంట సాగుచేస్తుండటంతో భూసారం తగ్గుతూ, జీవవైవిధ్యం నశిస్తున్నది. కార్పొరేట్లు ప్రవేశపెడుతున్న ఈ ఏకపంటల విధానంతో పంజాబ్, హరియాణా రైతులను పెప్సీ, ఐటీసీ కంపెనీలకు బంగాళదుంప, టమాటా తప్ప వేరే పంటలు పండనీయడంలేదు. కనీసం 10 లక్షల ఎకరాలు కాంట్రాక్టు వ్యవసాయానికి సేకరించారు. పెరుగుతున్న భూమి విలువతోపాటు, భూమిని కోల్పోతున్న రైతులను మొదటిసారిగా పరిగణిస్తే ఇప్పటివరకు నమ్మిన దానికంటే 41 శాతం ఎక్కువని నివేదిక తెలియజేస్తున్నది. స్వల్పకాల లాభాలే ధ్యేయంగా కార్పొరేట్ వ్యవసాయం చేయడంతో ప్రపంచ వాతావరణం పైనా, ప్రజారోగ్యంపైనా ప్రతికూల ప్రభావం కల్గిస్తున్నది. పర్యావరణం, మహమ్మారులతో వ్యవసాయం ముడిపడి ఉండటంచేత ఇప్పుడు ప్రజల జీవితంలోని ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశంలో 6 శాతం ధనిక రైతుల దగ్గర 51 శాతం భూమి అధీనంలో ఉంది. 5 నుండి 10 ఎకరాలు ఉన్న రైతుల దగ్గర దేశంలోని మొత్తం సాగుభూమిలో సుమారు 10 శాతం ఉంది. 5 ఎకరాల లోపు రైతులు మొత్తం రైతాంగంలో 85 శాతం వరకూ ఉండగా, మొత్తం భూమిలో తమ వాటాగా వీరు 37 శాతం మాత్రమే కలిగిఉన్నారు, వీరిలో 23 శాతం దారిద్య్రపు రేఖ దిగువన ఉన్నారు. భూస్వాములు, పెద్ద రైతుల భూమిని 70 శాతం కౌలురైతులే సాగుచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా రైతాంగం చిన్నకమతాలను కలిగిఉన్నారు. ఇక్కడి వ్యవసాయం తక్కువ సమయంలో లాభార్జనే ధ్యేయంగా కాకుండా భూసారాన్ని భావితరాలకోసం పరిరక్షిస్తుంటారు. ప్రపంచం మొత్తంలో 80 నుండి 90 శాతం చిన్నకమతాల పొలాలు రైతుకుటుంబాలు మొత్తంగా గానీ లేక రైతుచే సాగుచేయబడుతూ వుండగా, నానాటికీ ఈ కమతాల సంఖ్య కార్పొరేట్ వ్యవసాయానికి బలైపోతూ కుచిం చుకుపోతోంది. గత 40 ఏళ్లనుండి అమెరికా, యూరపులో కార్పొరేట్ వ్యవసాయానికి రైతాంగం బలైపోతూ... వ్యవసాయ పెట్టుబడి నిధులకోసం, కఠినమైన ఒప్పందాలతో సాగుచేయవల్సి వస్తోంది. నేల నాణ్యత క్షీణిస్తూ. ఎరువులు, క్రిమిసంహారకాలు అపరిమితంగా వాడటంతోపాటు, అడవులను నరుకుతూ పర్యావరణ సమస్యలు సృష్టిస్తున్నారు. మెరుగైన పర్యావరణ నిర్వహణ కోసం, రైతాంగ గిట్టుబాటు వ్యవసాయం కోసం చిన్న, మధ్య తరగతి రైతాంగం కోసం, నిబంధనలలో మార్పులు తీసుకొచ్చి, కమ్యూనిటీ రైతులకు కూడా మద్దతును ప్రభుత్వం ప్రకటించాలి. పన్నులు తగ్గించి, ప్రభుత్వ సబ్సిడీలు పెంచి నేరుగా రైతుకే చేరే అవకాశం కల్పించాలి. రైతు గర్వపడే భూ హక్కును కాపాడాలి. చిన్న రైతులు, రైతుకుటుంబాలు, స్వదేశీ ప్రజలు భూమిని సాగుచేయడంలో చాలా జాగ్రత్తలతో మెలకువ వహిస్తారు. కేవలం పెట్టుబడి రాబట్టడానికేగాక రైతుగా గుర్తింపుకోసం, తమ సంస్కతిని భావితరాలు కొనసాగించటం కోసం వ్యవసాయాన్ని చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పర్యావరణాన్ని కాపాడుతూ, సగటు సెంటుభూమిలో ఎక్కువ ఉత్పాదకత చేస్తారు. ఈ విధానాన్ని కార్పొరేట్ వ్యవసాయం చేయలేదు. ప్రకృతిని, నేలను నమ్ముకున్న రైతాంగంలా కార్పొరేట్ వ్యవసాయం సాగు జరగదు. తన లాభాల కోసం కంపెనీలను మార్చినట్లుగా వ్యవసాయం నుండి కార్పొరేట్‌రంగం తప్పుకొంటుంది, భూమిని మాత్రం తన వద్దనే ఉంచుకొని పొలాలను బీళ్లుగా మార్చుతుంది. దీనితో ఆహారభద్రతకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రజానీకానికి పట్టెడన్నం పెట్టే రైతును దూరం చేసుకోవద్దు. నేడు ప్రపంచంలో 140 కోట్ల ప్రజలు ప్రత్యక్షంగా భూమిపై ఆధారపడి ఆహారం, వసతిని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు, వీరిని మనం రక్షించుకోవాలి. ఇటువంటి రైతాంగం అభద్రతకు గురవుతున్న కారణం చేతనే చలిని సైతం లెక్కచేయక, కార్పొరేట్ అనుకూలచట్టాలకు వ్యతిరేకంగా రాజధానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షులు మొబైల్ : 98494 91969 -
డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుల పక్షపాత ప్రభుత్వంగా చేస్తున్న మేళ్లను పక్కదోవ పట్టించేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నివర్ తుఫాన్ ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నెల తిరక్కుండానే డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటల నష్టపోయిన రైతులకు ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రంగు మారిన ధాన్యాంతోపాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఎత్తిచూపారు. కాబట్టి రైతుల తరపున చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదన్నారు. తుఫాన్ వచ్చినప్పుడు.. వరదలొచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అండగా నిలిచానంటూ సీఎం వైఎస్ జగన్ గుర్తు చేస్తూ.. అదే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చున్నారని దుయ్యబట్టారు. అందుకే బుగ్గన రాజేంద్రనాథ్ సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని పేరు పెట్టారని వ్యంగాస్త్రాలు విసిరారు. శాసనసభ ద్వారా రైతులకు ఏం చేయబోతున్నామో చెప్పబోతుంటే.. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా డైరెక్షన్లో చంద్రబాబు డ్రామాలాడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు. (చదవండి: 40 ఏళ్లు నేర్చుకున్న సంస్కారం ఇదేనా..?) మొలకెత్తిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మంచిదా? కాదా? అన్నది ఒక్కసారి ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అనంతరం.. గత 18 నెలలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలను సీఎం వైఎస్ జగన్ సవివరంగా వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే.. చంద్రబాబు డ్రామా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎల్లో మీడియా.. కాసేపటి క్రితం పెద్ద డ్రామా మన కళ్లతో మనం చూశాం. చంద్రబాబు యాక్టర్ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా కధ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి. ఎలాగూ దీనిపై ఇవాళ సభలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తోంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టం అవుతుంది అనే ఒక దుర్భుద్ధితో ఒక డ్రామా. చంద్రబాబు ఎందుకంత రెచ్చిపోయారో ఆయనకే తెలియదు. వారి పార్టీ మనిషే నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఆయన లేవనెత్తిన అంశాలపై క్లారిఫికేషన్ ఇచ్చాం. ఆ తర్వాత రామానాయుడే మాట్లాడాలి. కానీ వెంటనే చంద్రబాబు అందుకున్నారు. సడెన్‌గా లేచి నేను మాట్లాడతానని అన్నారు. ఒక టాపిక్ అనేది ఎప్పుడు కూడా ఒక పద్దతి ప్రకారం పోతుంది. అంతే కానీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్లీ అందుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. అది ఆయనకూ తెలుసు. తెలిసినా వెంటనే రెచ్చిపోవడం. అసలు ఆశ్చర్యకరం. ఐదేళ్లలో నేను ఎప్పుడూ అలా వ్యవహరించలేదు నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఎప్పుడూ పోడియమ్‌లోకి రాలేదు. దటీజ్ ది డీసెన్సీ ఎనీ బడీ ఫాలోస్. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఆయనే పోడియమ్‌లోకి రావడం, వచ్చిన వెంటనే అందరినీ నెట్టేసి కూర్చోవడం. ఆ తర్వాత పక్క నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 స్క్రీన్‌ప్లే ప్రకారం దాని ఎత్తుకోవడం, దాన్ని రేపు పొద్దున పేపర్లలో రాయడం. అవే హెడ్లైన్లు రైతుల కోసం ముఖ్యమంత్రి ఏం చెప్పారు? రైతులకు ఏ రకంగా దీని వల్ల మంచి జరుగుతుంది అన్నది రేపు పొద్దున హెడ్డింగ్స్ ఉండవు. చంద్రబాబు అనే వ్యక్తి ఫ్లోర్ మీద కూర్చోవడం. మార్షల్స్ ఎత్తుకోవడం, అవే హెడ్డింగ్‌లు. దీనికి సంబంధించిన డ్రామా. కధ. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. మా ఖర్మ, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థను ప్రతిపక్ష నాయకుడు నడుపుతా ఉన్నాడు అంటే, నిజంగా షేమ్. దురుద్దేశ రాజకీయాలు రైతులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఒక అనుకోని పరిస్థితి వచ్చింది. క్యాబినెట్లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ కూడా జరుగుతోంది. దీని మీద చర్చ జరుగుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెబుతారు? ఆ మాటల వల్ల తమకు ఏమైనా మంచి జరుగుతుందా? అన్న మాటలు వినడానికి చాలా మంది ఆరాటపడుతున్నారు. అటువంటివన్నీ కూడా కనిపించకూడదు. వినిపించకూడదు అని చెప్పి చంద్రబాబు చేస్తున్న దురుద్దేశ రాజకీయాలు చూస్తున్నాం. పదేళ్లలో లేని విధంగా అంతా సుభిక్షం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యింది. ఇది మాకు రెండో నవంబరు మాసం. ఈ నవంబరు చివరి నాటికి రాష్ట్రంలోని ఏ రిజర్వాయర్ తీసుకున్నా గతంలో చంద్రబాబు పాలన చూశాం. గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని రిజర్వాయర్లు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. గత పదేళ్లలో ఏనాడూ లేనంతగా భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యాయి. అయితే దురదష్టవశాత్తూ దీపం వెలుగు కింద చీకటి ఉన్నట్లు ఆగస్టు నుంచి నవంబరు వరకు అడపా దడపా కురిసిన వర్షాల వల్ల మన రైతులకు కొంత నష్టం కలిగింది. ఆ నష్టం జరిగినప్పుడు వెంటనే నిజాయితీగా సమీక్షించాను. వెంటనే ఆ సీజన్‌కు సంబంధించిన పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. అటువంటిది మనసున్న ప్రభుత్వంగా, రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా, రైతులకు తోడుగా ఉండేందుకు మన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగులు వేయడం జరిగింది. (చదవండి: సీబీఎన్ అంటే.. కరోనాకు భయపడే నాయుడు) రైతులకూ నాకూ మధ్య ఆత్మీయ బంధం ఇవన్నీ కూడా ఏదో ప్రతిపక్షం విమర్శిస్తుందనో చేయలేదు. పత్రికల్లో రాశారనో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. రైతులకూ నాకూ మధ్య ఉన్న బలమైన ఆత్మీయ అనుబంధంతోనే.. రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా తెలియజేస్తూ, ఈ విషయాలు చెబుతున్నాను. చరిత్రలో ఇదే ప్రథమం ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ఆ నష్టం వర్షాల వల్ల కావచ్చు, తుపాను వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు.. కారణం ఏదైనా ప్రకతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో నష్ట పరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే ప్రథమం. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాలా రూ.143 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత మొత్తంతో గత అక్టోబరు 27న ఇవ్వడం జరిగింది. అక్టోబరు నెలలో వచ్చిన అ«ధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నవంబరు 17న ఒక నెల కూడా తిరక్క ముందే రూ.132 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందించాం. మళ్లీ నవంబరులో నివర్ తుపాను వల్ల పంటలకు, ఇళ్లకు, రోడ్లకు, చెరువులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే చాలా వాటిని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరింత వివరంగా.. అన్ని విధాలా ఆదుకుంటాం.. భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. చిన్న వారు కావొచ్చు, పెద్ద వారు కావొచ్చు. అవ్వలు కావొచ్చు. తాతలు కావొచ్చు. చివరకు 3 ఏళ్ల పిల్లవాడు లేదా సంత్సరం పిల్లవాడు కూడా కావొచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి రూ.500 చొప్పున ఎంత మంది అయితే సహాయ శిబిరాల్లో ఉంటారో వారందరికీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక ఇంటిలో దాదాపు నలుగురు ఉంటారు. ఆ విధంగా ప్రతి ఇంటికి దాదాపు రూ.2 వేలు ఇచ్చినట్లు అవుతుంది. ఎవరైతే నీళ్లు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో. వారిని శిబిరాలకు తరలించడమే కాకుండా, అక్కడ వారిని అన్ని రకాలుగా చూసుకోవడమే కాకుండా, వారిని ఇంటికి పంపించేటప్పుడు, ఇళ్లకు వచ్చిన తర్వాత మళ్లీ ఇబ్బంది పడకుండా మనిషికి రూ.500 చొప్పున, ఒక ఇంట్లో ఉజ్జాయింపుగా నలుగురు ఉంటారనుకుంటే మొత్తం రూ.2 వేలు చేతిలో పెట్టి పంపడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు వచ్చే సరికే శిబిరాల నుంచి తిరిగి ఇళ్లలోకి వెళ్లిన వారందరి ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇస్తామని నెల్లూరు, కడప, చిత్తూరు తదితర జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. పంట ఇతర నష్టాలపై.. ఇదే కాకుండా పంట నష్టాలన్నింటినీ డిసెంబరు 15 నాటికి మదింపు చేసి, పరిహారాన్ని డిసెంబరు 31లోగా రైతులకు ఇవ్వబోతున్నాం. ఇది కూడా కరెక్టుగా చూస్తే నెలలోపే. ఇది చూసినప్పుడు నిజంగా ఇది ఎంత మంచి ప్రభుత్వం అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. అంతే కాకుండా ఆ డబ్బు కూడా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదొక్కటే కాకుండా, మళ్లీ పంట వేయడానికి కావాల్సిన విత్తనాలను రైతులకు 80 శాతం సబ్సిడీ మీద అందించడం జరుగుతోంది. ఆ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇళ్లకు జరిగిన నష్టానికి, పశువులు, కోళ్లు నష్టపోయిన వారికి, పడవలు, వలలు నష్టపోయిన వారి అంచనాలు కూడా డిసెంబరు 15 లోగా పూర్తి చేసి, డిసెంబరు 31లోగా పరిహారం కూడా ఇవ్వబోతున్నాం. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికే పరిహారం తుపాను వల్ల అనుకోకుండా 8 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని చెప్పి, వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, చెరువులకు జరిగిన నష్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అంచనా వేసి, వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్ సరఫరా నిల్చిపోయిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడంతో దాదాపు అన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. మిగిలిన చోట్ల కూడా రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. రంగు మారిన ధాన్యమే కాదు.. మొలకెత్తిన ధాన్యమూ కొనుగోలు ఇంకా ఈ వర్షాల వల్ల రాయలసీమ జిల్లాలే కాకుండా, ఈ పక్క కష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో కూడా పంటలు దెబ్బ తిన్నాయి. పంటలు నీట మునిగాయి. ధాన్యం రంగు మారింది. ఇంకా కొన్ని చోట్ల ధాన్యం మొలకలెత్తి కొందరు రైతులు అవస్థలు పడడం కూడా కనిపించింది. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఒక గొప్ప ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప, ఎప్పుడూ కూడా ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అటువంటిది రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో మొలకెత్తిన ధాన్యం కొనుగోలు ఎప్పుడూ జరగలేదు. ధాన్యం మొలకెత్తిన రైతులకు కూడా న్యాయం చేసేందుకు గ్రేడెడ్ ఎమ్మెస్పీతో ఒక బ్రాకెట్ కింద తీసుకువచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రైతులను కూడా ఆదుకోవాలి. వారికి కూడా మంచి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈక్రాపింగ్ డేటా ఆధారంగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రైతులకు బీమా ధీమా..! ఇన్సూరెన్సు కూడా ఇప్పుడు మన ప్రభుత్వమే బాధ్యతగా ఈ ఖరీఫ్ అంటే, 2020 ఖరీఫ్ నుంచి ఇన్సూరెన్సు బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే ఇన్సూరెన్సు కంపనీలు బాధ్యత తీసుకోవడం లేదు. అవి స్పందించే తీరు మానవత్వంతో ఉండడం లేదు. సమయానికి స్పందించడం లేదు. 2012కి సంబంధించిన క్లెయిమ్‌లు మన ప్రభుత్వం వచ్చాక కట్టి, క్లెయిమ్‌లకు వెళ్లడం. ప్రీమియమ్ ఎక్కువగా ఉండడంతో రైతులు పంటలకు ఇన్సూరెన్సు చేయకపోవడం చూశాం. దాని వల్ల పంట నష్టం పరిహారం రాకుండా పోయే పరిస్థితి రావడం గతంలో ఎక్కడా చూడడం జరగలేదు. అందుకే ఈ ఏడాది, 2020 ఖరీఫ్ సీజన్ నుంచి ఇన్సూరెన్సు బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడం జరుగుతోంది. అలా తీసుకుంటా ఉంది కాబట్టి, ఇప్పటి నుంచి జనవరి చివరి వరకు క్రాప్ కట్టింగ్ జరుగుతుంది కాబట్టి, దాన్ని బట్టి రైతులు ఎంత నష్టపోయారన్నది చూసి, ఫిబ్రవరిలో ప్రణాళిక శాక నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు మార్చి, ఏప్రిల్‌లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్ కూడా సెటిల్ చేస్తామని చెబుతున్నాను. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. క్రాప్ కటింగ్ పూర్తైన తర్వాత నెల, రెండు నెలల్లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్ అన్నది చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని చెబుతున్నాను. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కానీ, ప్రజలకు కానీ, అదే సీజన్లో (నివర్ తుపాను విషయంలో అయితే కేవలం నెల లోపల) పరిహారం, సబ్సిడీ వంటివి ఇవ్వడం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. రూ.2,194 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన టీడీపీ సర్కార్ గతంలో ఎలా జరిగింది అన్నది కూడా ఒక్కసారి టేబుళ్లలో చూడండి.. ఇన్పుట్ సబ్సిడీ అనేది గతంలో ఎలా జరిగేది అనేది చూస్తే, 2014 ఖరీఫ్‌లో నష్టం జరిగితే, ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వచ్చింది అని చూస్తే, జూలై 22, 2015న రూ.692 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరో విడత 2017లో ఇచ్చారు. అలా ఎంత ఆలస్యం చేశారని చూస్తే, 2014 ఖరీఫ్ నష్టానికి పరిహారం రెండున్నర ఏళ్ల తర్వాత ఇచ్చారు. 2015 ఖరీఫ్ నష్టం ఒక ఏడాది ఆలస్యంగా 2016 నవంబరులోనూ, అదే సీజన్ ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టానికి పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2017 మే నెలలో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌లో నష్టానికి తొలి విడత పరిహారం ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో ఇవ్వగా, మిగిలిన పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2018లో ఇచ్చారు. 2017 రబీ నష్టం పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. ఇవి కాక 2018 ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రైతులకు ఏమీ ఇవ్వలేదు. 2018 ఖరీఫ్‌లో రూ.1838 కోట్లు, అదే ఏడాది రబీలో రూ.356 కోట్లు.. మొత్తంగా రూ.2194 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఏ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఆ సీజన్లోనే.. కానీ ఈరోజు ఏదైనా సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. అలా రైతులకు తోడుగా, అండగా నిలబడుతున్న చారిత్రక నిర్ణయం తీసుకుని మనం అమలు చేస్తుంటే వీళ్ల కామెంట్లు మనకు ఇవాళ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. 58.77 లక్షల మందికి పంటల బీమా సౌకర్యం ఇదే మాదిరిగా ఇన్సూరెన్సు పరిస్థితి కూడా ఒక్కసారి చూస్తే, అందులో రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి.. ప్రభుత్వమే ఇన్సూరెన్సు కట్టడం మొదలు పెట్టిన తర్వాత, రైతులకు అండగా నిలబడడం మొదలుపెట్టిన తర్వాత, ఒక్కసారి గమనిస్తే, 2016లో కేవలం 17.79 లక్షల రైతులు నమోదు చేసుకుంటే, ఆ తర్వాత 2019 వరకు మూడేళ్లు వరసగా చూస్తే సగటున 20.28 లక్షల రైతులు కూడా ఇన్సూరెన్సు తీసుకునే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజున ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్సు సొమ్ము కడతా ఉంది కాబట్టి 58.77 లక్షల రైతులు నమోదు చేసుకున్నారు. అంటే ఒక్కసారిగా 190 శాతం పెరుగుదల. అదే విధంగా ఇన్సూరెన్సులో ఏరియా కవరేజ్ కూడా చూస్తే, 201617లో కేవలం 20 లక్షల హెక్టార్లు, 201718లో చూస్తే 24 లక్షల హెక్టార్లు. అలా 201819 వరకు మూడేళ్లు సగటు చూసుకుంటే కేవలం 23.57 లక్షల హెక్టార్లలో మాత్రమే ఇన్సూరెన్సు కవర్ అయితే, 201920లో అంటే మన ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చాక 56.82 లక్షల ఎకరాలకు ఇన్సూరెన్సు చెల్లిస్తున్నాం. ఇది 141 శాతం పెరుగుదల. అదే విధంగా గత మూడేళ్లలో రైతులు కట్టిన సగటు ప్రీమియమ్ రూ.290 కోట్లు మాత్రమే. మన హయాంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూస్తే, ప్రభుత్వమే మొత్తం ప్రీమియమ్ కట్టడం మొదలు పెట్టాక రైతులు ప్రీమియమ్గా కట్టింది కేవలం రూ.26 లక్షలు మాత్రమే. అదే సమయంలో ప్రభుత్వం కట్టిన ప్రీమియమ్ రూ.1030 కోట్లు. అది కట్టడమే కాకుండా డిసెంబరు 15న ఇన్సూరెన్సు సొమ్ము క్లెయిమ్ ఇస్తామని తేదీ కూడా ప్రకటించడం జరిగింది. అదే గతంలో ప్రభుత్వం తరపున 2016 నుంచి 2019 వరకు మూడేళ్లలో సగటున కేవలం రూ.393 కోట్లు మాత్రమే కడితే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కట్టిన ఇన్సూరెన్సు ప్రీమియమ్ మొత్తం ఏకంగా రూ.1030 కోట్లు. పంట కోత ప్రయోగాలు పూర్తయిన వెంటనే పరిహారం చెల్లింపు.. అదే విధంగా ఇన్సూరెన్సు క్లెయిమ్స్ గతంలో చూస్తే, 2014 ఖరీఫ్ పరిహారం ఏడాది ఆలస్యంగా 2015లో వచ్చింది. అలాగే రబీ పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. 2016 రబీలో అయితే ఏడాదిన్నర తర్వాత ఇచ్చారు. ఆ విధంగా కనీసం ఏడాది, ఏడాదిన్నర ఆలస్యంగా పరిహారం ఇచ్చారు. అదే 2020కి సంబంధించి చూస్తే, ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్ చెల్లిస్తుంది కాబట్టి, జనవరి నెలాఖరు నాటికి ఈ సీజన్‌కు సంబంధించి క్రాప్ కట్టింగ్ ఎక్స్పరిమెంట్ పూర్తి కాగానే, మార్చి ఏప్రిల్‌లో పంట నష్టపరిహారం రైతులకు అందజేస్తాం. ఇది ప్రజలు, రైతుల పట్ల మా చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనం. రైతుల పక్షపాత ప్రభుత్వం ఇది కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. రాజకీయాలు, పార్టీలు కూడా చూడం.. అని చెప్పిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టే దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా అర కోటి మందికి పైగా రైతులకు.. రైతు భరోసా సొమ్మును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ అవుతోంది. అది కూడా వారి పాత అప్పుల కింద బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా ఇస్తున్నాం. దాదాపుగా 50 లక్షల రైతులకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం రూ.67,500 నేరుగా వారి చేతుల్లో పెట్టబోతున్నాం. నవరత్నాలులో మొట్టమొదటి పథకం రైతు భరోసా. రైతన్నలకు ఎన్నికల వాగ్దానంగా మేనిఫెస్టోలో చెప్పింది.. నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని. కానీ ఇప్పుడు రైతుగా తోడుగా ఉండేందుకు మానవత్వంతో ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తంగా రూ.67,500 అందుతోంది. అంటే, మాట ఇచ్చిన దానికన్నా ఒక్కో రైతుకు రూ.17,500 అదనంగా అందుతోంది. కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నాం. కోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ 18 నెలల కాలంలోనే దాదాపు రూ.13 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చాం. వచ్చే జనవరిలో ఇచ్చే రూ.2 వేలు కూడా ఇందులో కలిపాం. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సేవలు విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతు అవస్థ తెలిసిన వ్యక్తిని కాబట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమం ఇది. రైతు చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం. రైతు ఇంటి వద్దనే సేవలందించే విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ వారికి వైయస్సార్ జల కళ ద్వారా బోర్లు వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఏటా 50 వేల బోర్లు వేసే దిశగా అడుగులు. ఈ కార్యక్రమానికి అక్షరాలా రూ.4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గత ప్రభుత్వం బకాయిలనూ చెల్లించాం..! గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా పెట్టిన రూ.8655 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు. అవి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే ఇవాళ స్పష్టంగా చెబుతున్నాం. ధాన్యం సేకరణ తర్వాత రెండు వారాల్లోనే చెల్లించాలని చెబుతున్నాం. ఇంకా గత ప్రభుత్వం పెట్టిన విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ.384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న రూ.1030 కోట్లు.. ఇవన్నీ మన రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది. పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ రైతులకు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన విద్యుత్తును రూ.1800 కోట్లు వెచ్చించి ఫీడర్ల మెరుగు ద్వారా అందిస్తున్న ప్రభుత్వం మనది. మేము అ«ధికారంలోకి వచ్చే సరికి ఫీడర్లలో కెపాసిటీ లేక ఆ అవకాశం లేకపోవడంతో, ఆ మొత్తం ఖర్చు చేసి ఫీడర్ల కెపాసిటీ పెంచాం. వైయస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం 2019 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే రూ.510 కోట్లు చెల్లించడం జరిగింది. డిసెంబర్ 15న రూ.1227 కోట్ల క్లెయిమ్‌లు చెల్లిస్తాం బీమా ప్రీమియమ్‌ను కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2019 ఖరీఫ్‌కు సంబంధించి రైతులు తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చొప్పున మాత్రమే చెల్లించగా, రాష్ట్రంలో రైతులందరి తరపున కట్టాల్సిన రూ.506 కోట్లు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన రూ.524 కోట్లు. అలా మొత్తం రూ.1030 కోట్లు బీమా ప్రీమియమ్ చెల్లించగా, ఈ డిసెంబరు 15న బీమా పరిహారం (క్లెయిమ్‌లు) రూ.1227 కోట్లు బీమా కంపెనీలు చెల్లించనున్నాయి. రైతులకు సాంకేతికంగా వెన్నుదన్ను 13 జిల్లాలలో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌లు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు (గ్రామీణ నియోజకవర్గాలలో) ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నాణ్యత పరీక్షలు నిర్వహించి ధవీకరించిన వాటినే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మనది.రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. 2019-20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొగాకు, ఉల్లి, పసుపు, టమోటా, అరటి, బత్తాయి తదితర ఉత్పత్తులు 8,84,882 టన్నులు కొనుగోలు చేసి రూ.3491 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఇంకా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం మరో రూ.666 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు మంచి ధరలు అందించాలన్న లక్ష్యంతో ఫలానా పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే ధరలు నిర్ణయించి రైతులకు తెలియజేస్తున్నాం. అవన్నీ ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్లో పోటీ వాతావరణం కల్పిస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంటలను నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇందు కోసం సీఎంయాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రై జ్ అండ్ ప్రొక్యూర్మెంట్), ఏ రైతుకైనా కనీస గిట్టుబాటు ధర రాకపోతే వెంటనే నోటిఫై చేస్తారు.వెంటనే జేసీ స్పందిస్తారు. ఆ పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. అలా అలా కొనుగోలు చేసిన పంటల ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ అడిషన్) జోడించి, తిరిగి మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. అందుకే సెకండరీ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ ప్రాససింగ్ యూనిట్లు పెట్టాలన్న దానిపై కార్యాచరణ. త్వరలోనే గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి. గోదాములు, ఆర్బీకేలు, జనతా బజార్లు కనిపిస్తాయి.రెండో దశ ప్రాససింగ్ యూనిట్లు కూడా రాబోతున్నాయి. మొత్తం ఈ కార్యక్రమం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలకూ పెద్దపీట.. కేవలం వ్యవసాయంతో మాత్రమే లాభసాటి కాదని చెప్పి, చేయూత కార్యక్రమం తీసుకువచ్చాం. అందులో భాగంగా డెయిరీకి ప్రోత్సాహం. అందు కోసం ఏకంగా 4.68 లక్షల ఆవులు, గేదెల యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. అమూల్ సంస్థతో అవగాహన కూడా కుదుర్చుకున్నాం. రాష్ట్రంలో సహకార రంగం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి, అమూల్‌ను తీసుకురావడం జరుగుతోంది. అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా డెయిరీల పునరుద్ధరణ. వీటన్నింటి వల్ల గ్రామాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. అమూల్ రావడం వల్ల కలిగే ప్రయోజనం. అమూల్‌తో పాల ధర అధికం.. కడప, ప్రకాశం జిల్లాలలో చూస్తే లీటరు గేదె పాలను(6శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ.34 కు, దొడ్ల డెయిరీ రూ.32 కు కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ.39 కి కొనుగోలు చేయబోతుంది. ఆ విధంగా రూ.5 నుంచి రూ.7 ఎక్కువ ఇవ్వబోతుంది. ఇక అవే గేదె పాలను ప్రకాశం జిల్లాలో లీటరుకు(10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) సంగం, హెరిటేజ్ సంస్ధలు రూ.58 లకు, జెర్సీ సంస్ధ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్ సంస్ధ రూ.64.97లకు కొనుగోలు చేయనుంది. ఆ విధంగా దాదాపు ఐదు నుంచి ఏడు రూపాయలు ఎక్కువగా చెల్లించబోతున్నది. ఇక ఆవు పాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో లీటరుకు హెరిటేజ్ సంస్ధ రూ.23.12లు , సంగం డెయిరీ రూ.25.20లు , జెర్సీ రూ.24.89 లు చెల్లిస్తుండగా.. అమూల్ రూ.28 చెల్లించనుంది. ఆ విధంగా దాదాపు రూ.3 నుంచి రూ.5 ఎక్కువ ధర రైతులకు రానుంది. గ్రామీణ వ్యవస్థలో రైతులకు ఎలా మేలు చేయాలనే ప్రభుత్వం ఉండాలి తప్ప, వారిని ఎలా పిండాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను మార్చబోతున్నది. ఆక్వా రైతులకు అండగా.. ఇంకా ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు చేప, రొయ్యలు గ్రామాల్లో జనతా బజార్లలో దొరుకుతాయి. ఆ విధంగా ఏర్పాట్లు. వాటకి కూడా ప్రాసెసింగ్ యూనిట్లు. కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటు. 35 చోట్ల ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆక్వా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. -
బ్యాంకర్లు సహకరించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక రంగానికి వ్యవసాయ రంగం వెన్నుముక. రాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఖరీఫ్ (జూన్)లో 7,500, రబీ (అక్టోబర్)లో రూ.4వేలు.. పంట చేతికొచ్చే సమయంలో మరో రూ.2వేలు సాయం చేస్తున్నాం. రాష్ట్రంలో 10,600కు పైగా ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశాం పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ-క్రాపింగ్ తప్పనిసరి. గతేడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలు కొన్నాం.. ఈ ఏడాది రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో గోడౌన్లు, మండల కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు... ప్రతి గ్రామంలో జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నాం. నాడు-నేడు కింద స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన చేపట్టాం. ఆస్పత్రుల్లో కూడా నాడు-నేడు కింద మార్పులు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. (చదవండి: పండుగ వేళ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు) ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు. వైఎస్సార్ చేయూత ద్వారా 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,100 కోట్ల రాయితీ ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు రుణాలు ఇచ్చాం’అని సీఎం జగన్ పేర్కొన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలలో బ్యాంకర్స్ సహకారంపై చర్చించారు. బ్యాంకర్లు కూడా సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, సీఎస్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
సాగు పండగై
వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చి వేసే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది 86.33 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంత కంటే 6.10 లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 92,46,006.30 ఎకరాలు సాగులోకి రావొచ్చని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడటంతో ఈ సీజన్లో ఇప్పటికే అంటే గురువారం నాటికి 3,29,085.06 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 1,08,590.46 ఎకరాలు ఎక్కువ. గత ఏడాది ఇదే కాలానికి అంటే జూన్ ఒకటి నుంచి 17వ తేదీ వరకు 2,20,494.60 ఎకరాల్లో మాత్రమే పంటల్ని వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, అన్నదాతల ముంగిటకే అందిస్తున్న సేవలు, కలిసి వచ్చిన వాతావరణం.. వెరసి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా గత ఏడాది పంట దిగుబడులతో ఆనందంగా ఉన్న రైతాంగం.. ఈ ఖరీఫ్‌లో రెట్టించిన ఉత్సాహంతో సాగులో నిమగ్నమైంది. (ఎ.అమరయ్య, జీపీ వెంకటేశ్వర్లు) ‘కల్లా కపటం కానని వాడా.. లోకం పోకడ తెలియని వాడా..ఏరువాక సాగారో రన్నో చిన్నన్న.. నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న..నవ ధాన్యాలను గంపకెత్తుకొని.. చద్ది అన్నము మూట గట్టుకొని ముల్లు గర్రను చేతబట్టుకొని.. ఇల్లాలునీ వెంటబెట్టుకొని..’ అన్న పాటలోని జీవన సౌందర్యం ఊరూరా కనిపిస్తోంది. ► నగరాలు నిద్రలేవడానికి మునుపే పల్లెలు పొలం పనుల్లో మునిగి తేలుతున్నాయి. ఓవైపు చిరు జల్లులు, మరోవైపు మసకేసిన మబ్బు.. ఉదయం 8 గంటలు కావొస్తోంది.. అప్పటికే పొలంలో ట్రాక్టర్లు రయ్రయ్యిమంటూ రొద చేస్తున్నాయి. హాయ్, హోయ్ మంటూ అన్నదాతలు ఎడ్లను అదిలిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు, పిల్లలు పొలంలో దంటు ఏరుతున్నారు. ► రాత్రి కురిసిన చిరు జల్లుల వల్లనో ఏమో ట్రాక్టర్లు దుమ్ము లేపడం లేదు. పైరగాలికి గెనాల మీద చెట్ల కొమ్మలు రెపరెపలాడుతున్నాయి. నాగటి చాళ్లంట బయటపడే పురుగుల కోసం కొంగలు, కోనంకి పిట్టలు దేవులాట మొదలు పెట్టాయి. అరేయ్.. బువ్వ తిందాం రా అంటూ అవతలి చేలో దుక్కిదున్నుతున్న దోస్త్‌ను ఓ రైతు పిలుస్తున్నాడు. రైతు షేక్ సత్తార్ది ప్రముఖ చిత్రకారుడు సంజీవ్‌దేవ్ స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం. 75 సెంట్ల తన సొంత భూమిని ఖరీఫ్‌లో సాగుకు సిద్ధం చేస్తున్నాడు. రైతు భరోసా కింద ఇచ్చిన సొమ్ముతో వరి సాగు పనులు ప్రారంభిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు సీహెచ్ వీర్రాజు. తన పిల్లలు కాయకష్టం చేసే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గోదావరి కాలువలు వదిలిన ఈనెల 10కి ముందే ఆయన నారు సిద్ధం చేసుకున్నారు. గురువారం నాటికి 12 ఎకరాల్లో నాట్లు సైతం పూర్తి చేశారు. వేరుశనగ విత్తనాన్ని వెదపెడుతున్న ఈ రైతుది వైఎస్సార్ జిల్లా ముద్దనూరు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు ముందుగా పదును కావడంతో ఈ రైతు విత్తనం వేశారు. 5 ఎకరాల వరకు వేరుశనగను సాగు చేసే ఈ రైతుకు రైతు భరోసా కింద అందిన పెట్టుబడి సాయం కలిసి వచ్చింది. సకాలంలో విత్తనాలు వచ్చాయి. దీంతో భూమిని నమ్ముకున్న ఈ రైతు రాయలసీమలో ప్రధాన వాణిజ్య పంటైన వేరుశనగ సాగుకు ఉపక్రమించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ► ఖరీఫ్‌లో క్షేత్ర స్థాయి వాస్తవ సాగు పరిస్థితులను తెలుసుకునేందుకు బయలుదేరిన ‘సాక్షి’ ప్రతినిధులకు కనిపించిన దృశ్యాలివి. మొత్తం మీద ఈ ఏడాది ఖరీఫ్ కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో శుభారంభమైందన్న భావన కలిగింది. ► సకాలంలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం, అల్పపీడనం బలపడడంతో ఒక్క చిత్తూరు జిల్లా తప్ప మిగతా 12 జిల్లాల్లోనూ వ్యవసాయ పనులు చేపట్టేలా వానలు పడ్డాయి. అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ వరకు ఎక్కడ చూసినా ఖరీప్ పనులు ముమ్మరం అయ్యాయి. ► దక్షిణాంధ్ర జిల్లాల్లో దుక్కులు సిద్ధం చేస్తుండగా రాయలసీమ జిల్లాలలో వేరుశనగ విత్తడం ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 24 శాతం మేర పూర్తయింది. ► గోదావరి డెల్టా కాలువలకు నీళ్లు వదలడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో నాట్లు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా నాట్లు పడ్డాయి. వరి సాగు చేసే ప్రాంతంలో వరి నారుమళ్లు పోయడం ముమ్మరమైంది. ► కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాలలో వేసిన అపరాలు మొలక దశ దాటాయి. మరొక్కసారి పెద్ద వర్షం పడితే పంటల్ని వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయం ఎందుకు పండగైందంటే.. ► రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి. ► దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షాలు పడితే వేరుశనగ విత్తడం మరింత ముమ్మరం అవుతుందని రైతులు చెప్పారు. ► విత్తనాలను ముందే పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన హన్మంతరెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఈసారి ఎక్కువ మంది ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి సారించారు. ఖరీఫ్‌లో వరి సాగుకు అధిక వ్యయం అవుతుందన్న భావనలో పలువురు ఉన్నారు. ► ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురవాల్సిన సగటు వర్షపాతం 556 మిల్లీమీటర్లు. ఇప్పటికే కురవాల్సింది 62 మిల్లీమీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 63 మిల్లీమీటర్లు కురిసింది. ఫలితంగా ఒక్క చిత్తూరు జిల్లా మినహా 12 జిల్లాలలో మామూలు వర్షపాతం నమోదైంది. ► వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ఉల్లి పంటల్ని ఇప్పటికే 20 నుంచి 24 శాతం లోపు విస్తీర్ణంలో విత్తారు. రికార్డు దిగుబడే లక్ష్యం ► ఖరీఫ్ సాగుపై అధికారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గత ఏడాది కంటే మించి ఉత్పత్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2019–20) ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క ఖరీఫ్ నుంచే 87.64 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఇంతకుమించి రావొచ్చునని అధికారులు అంచనా. ► సీజన్‌కు కావాల్సిన ఎరువులు, పురుగు మందులకు ఎటువంటి ఢోకా లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. మరో వైపు కరోనా నేపథ్యంలో వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► అగ్రి దుకాణాల ద్వారా యంత్రాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వరిని నాటడానికి బదులు వెదజల్లే పద్ధతిని పాటించాలని సూచిస్తున్నారు. ► కరోనా వైరస్ భయంతో పొరుగు ఊళ్ల నుంచి వ్యవసాయ కూలీలను అనుమతించనందున ఏ ఊరికి ఆ ఊరి వాళ్లే గ్రూపులుగా ఏర్పడి పనులు చేసుకోవాలని రైతు సంఘాలు సూచించాయి. మొత్తంగా ఖరీఫ్ పంటలకు అన్నీ సానుకూల అంశాలేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతుల సమస్యకు త్వరలో పరిష్కారం ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల రాయితీలను కౌలు రైతులకు కూడా అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. కౌలు రైతులకు రుణాలు, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. 11 నెలల కాలానికి సాగు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సాయం అందిస్తాం. అర్హులైన వారందరికీ సాయం ఇస్తాం. – మంత్రి కన్నబాబు -
రైతు సంక్షేమానికి ఏటా రూ.70 వేల కోట్లు
సాక్షి, సంగారెడ్డి: ‘మాది రైతు ప్రభుత్వం.. రైతుల శ్రేయస్సుకోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పలు పథకాలను ప్రవేశపెట్టాం. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలకు కలిపి ఏటా రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది’అని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి జెడ్పీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతోనే ‘ప్రాధాన్యత సాగు’(నియంత్రిత) విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధుకు రూ.14 వేల కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.10 వేల కోట్లు, రైతు బీమాకు రూ.1,200 కోట్లు, రైతులకు మద్దతు ధరకోసం ధాన్యం కొనుగోళ్లలో నష్టాలను భరించి రూ.4 వేల కోట్లు, సబ్సిడీ విత్తనాల సరఫరాకు రూ.600 కోట్లు, రుణమాఫీకి రూ.26 వేల కోట్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.15 నుంచి 20 వేల కోట్లు.. ఇలా పలు పథకాలకు ఏటా సుమారుగా రూ.70 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. వర్షాకాలం సీజన్ ఆరంభమైనందువల్ల ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. మహిళా స్వయం సంఘాలకు కూడా లైసెన్సులు ఇచ్చి ఎరువుల విక్రయానికి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. -
నెల రోజుల్లోనే 5 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: మొదట నుంచి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలోనూ వారికి అండగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా స్వయంగా వారి వద్దకే వెళ్లి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇందుకోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించింది. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన తక్కువ రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు సైతం జమ చేసింది. దీంతో రైతులు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ తమ పంట ఉత్పత్తులను మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకోగలిగారు. ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో గత నెల రోజుల్లో ఏకంగా 5 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి అమ్మకాలు చేయించింది. ► చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రైతుల నుంచి నేరుగా టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతుబజార్లలో విక్రయించింది. దీంతో రైతుల్ని ఆదుకోవడమే కాకుండా రైతు బజార్ల ద్వారా కొనుగోలుదారులకు తక్కువ రేటుకే అందించింది. ► లాక్‌డౌన్‌తో రైతులు నష్టపోకుండా ఆంక్షలు సడలించి ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రవాణా పర్మిట్లు మంజూరు చేసింది. ► మార్కెటింగ్, ఉద్యాన శాఖలు సమష్టి ప్రణాళిక ద్వారా రైతుల నుంచి పండ్లను నేరుగా కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్ల ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేశాయి. ► ప్రభుత్వం రాయలసీమలో అరటి రైతులను ఆదుకునేందుకు టన్ను రూ.3,500 చొప్పున కొనుగోలు చేసి రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లు, స్వయం సహాయక గ్రూపుల ద్వారా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి అమ్మకాలు చేపట్టింది. ఇదే తరహాలో బత్తాయి, కూరగాయలు, టమాటా, ఉల్లి రైతులనూ ఆదుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ► రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా లాక్డౌన్ సమయంలో నెల రోజుల వ్యవధిలోనే 3,30,494 మెట్రిక్ టన్నుల పండ్లను, 1,70,949 మెట్రిక్ టన్నుల కూరగాయలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ► వీటిని గ్రామస్థాయిలో అమ్మేందుకు స్వయం సహాయక గ్రూపులను వినియోగించింది. ఈ అమ్మకాల ద్వారా గ్రూపులకు మంచి ఆదాయం లభించేలా చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► కరోనా విపత్తు తర్వాత గ్రామ స్థాయిలో రైతుల పంటల క్రయవిక్రయాలను విస్తృతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోజూ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రైతులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. భవిష్యత్తుకు కొత్త బాటలు సీఎం జగన్ రైతులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యల ద్వారా భవిష్యత్తుకు కొత్త బాటలు పడుతున్నాయి. పంటల క్రయ విక్రయాలు గ్రామ స్థాయి వరకు వెళ్లిపోయాయి. ఇక ప్రాసెసింగ్ ప్లాంట్లు, గిడ్డంగుల ఏర్పాటుతో రైతులకు భరోసా లభిస్తుంది. మంచి ధర రాని సమయం లో గిడ్డంగుల్లో పంటను నిల్వ చేసుకుంటారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులు తయారుచేసి పంటలకు అధిక ధరలను రైతులు పొందుతారు. వీటి ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ -
జగన్ వందరోజుల్లో చేసిచూపారు
-
‘రైతు పక్షపాతిగా సీఎం జగన్ పాలన’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అప్పులమయంగా మారిస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను అమలు చేసేందుకు ఆయన కష్టపడుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై శుక్రవారం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలన రైతు పక్షపాతంగా సాగిందన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులను గట్టెక్కించేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతు బాగు కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా 70 లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కౌలు రైతులు కోసం సాగు హక్కు చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. కౌలు రైతులకు కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేశామన్నారు. పామాయిల్ రైతులకు రూ. 84 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. రూ. 119 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాయలసీమలో తీవ్ర కరువు నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ట్యాంకర్ రూ. 600 చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం దారుణమన్నారు. హుద్‌హుద్, తిత్లీ తుపాన్ బాధిత రైతులకు చంద్రబాబు కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐదేళ్ల చంద్రబాబు అరాచక పాలనను భరించలేకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేయ్యలేని పనులు సీఎం వైఎస్ జగన్ 100 రోజుల్లో చేసి చూపిస్తున్నారని చెప్పారు. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చిన ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఓటమిపై 100 రోజుల్లో సమీక్ష చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీలో అంతర్గత సంక్షభం నెలకొందని.. అందుకే చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్లిపోతారనే భయం పట్టుకుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఒక ఎస్సీ మహిళను వినాయకుడి వద్దకు వెళ్లకుండా టీడీపీ నేతలు అవమానించడం దారుణమన్నారు. సీఎం వైఎస్ జగన్ అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పటికే టీడీపీ ఖాళీ అయ్యేదని అన్నారు. 4 గురు టీడీపీ ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సూటిగా ప్రశ్నించారు.