
రైతుల బాధలు నాకు తెలుసు: మోదీ
రైతులతో కలిసి పెరిగిన తనకు వారి బాధలు తెలుసని, వ్యవసాయదారులకు భరోసా కల్పించడం తమ ప్రాధమ్యాలలో మొదటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తోన్న విపక్షాలకు రైతుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కొరవడిందని, కేవలం రాజకీయాల కోసమే ఆందోళనలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రైతులతో కలిసి పెరిగిన తనకు వారి బాధలు తెలుసని, వ్యవసాయదారులకు భరోసా కల్పించడం తమ ప్రాధమ్యాలలో మొదటిదని అన్నారు. శుక్రవాంర బెంగళూరు నేషనల్ కాలేజీ మైదానంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ప్రస్తుతం దేశంలో వారసులకు అటెండర్ స్థాయి ఉద్యోగాలకోసం రైతులు భూముల్ని అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. ఆ పరిస్థితులను సత్వరమే రూపుమాపాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యం చెడోపోయినప్పుడు మనం రక్త పరీక్షలు చేయిచుకున్నట్లే భూమి కూడా భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని, భూ సామర్థ్యంన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. అధిక శాతం భూమిని సాగులోకి తెవాల్సిన అవసరం ఉదన్న మోదీ.. చిన్న కమతాల ఏర్పాటువల్ల భూమి వృథా అవుతోందని అభిప్రాయపడ్డారు. కమతాలు లేకుండా ఒకే గాటున సాగే వ్యవసాయ విధానం రావాలన్నారు. మోదీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు..
- భూ సంస్కరణలు చేపట్టింది రైతుల మేలు కోసమే
- మీరు గ్యాస్ సబ్సిడీని వదులుకుంటే.. పేదలు, అవసరమైనవాళ్లకు దానిని చేరవేసే అవకాశం ఉంటుంది. ఆవిధంగా కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
- భారతీయ యువతను భాగ్యవిధాతలుగా మార్చడమే 'మేక్ ఇన్ ఇండియా' ప్రధాన ఉద్దేశం
- భూ సంస్కరణల చేపడితే రైతులకు మేలు జరుగుతుంది. ఒక్కసారి అది జరిగితే ఇక రైతుల జీవితాలు మారినట్లే
- గ్రామ స్వరాజ్యంతోనే భారత్ అభివృద్ధి సాధ్యం.