సాక్షి, హైదరాబాద్: పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను భారీగా పెంచి దానికి అదనంగా బోనస్ ఇచ్చేలా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. పంట సేకరణ సమయంలోనే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని ముసాయిదా మేనిఫెస్టోలో పేర్కొంది. ఇందుకోసం కోసం రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. అలాగే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీలు, ప్రజలు, రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా, విద్యార్థులకు సైకిళ్లు, 50 శాతం సబ్సిడీతో స్కూటీలు, ఉద్యోగుల కనీస వేతనం రూ. 26 వేలు చేయడం, నిరుద్యోగులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి వంటి అంశాలతో సిద్ధం చేసిన ముసాయిదా మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌కు మేనిఫెస్టో కమిటీ ఇటీవల అందజేసింది. వాటిపై త్వరలోనే మరోసారి చర్చించి ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది.
ముసాయిదా మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
- రైతులకు రూ . 2 లక్షల వరకు రుణమాఫీ. ప్రతి పొలంలో ఉచిత బోరుబావి.
- నాణ్యమైన విత్తనాలు ఉచితంగా పంపిణీ
- సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య, జీవిత బీమా
- ప్రత్యేక వ్యవసాయ వార్షిక బడ్జెట్, కూరగాయల ధరల స్థిరీకరణ నిధి.
- కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం
- పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన వనరులను కేటాయించి మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం.
- అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటన.
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్, పోటీ పరీక్షల శిక్షణ
- రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు.
- రాష్ట్రంలో కనీస వేతనం రూ. 26 వేలు చేయడం.
- సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగింపు. ్ఞ నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి. ్ఞ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానం ఎత్తివేత, పరీక్ష ఫీజుల రద్దు.
- 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు హామీ లేని రుణాలు
- ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం, అవి నిర్మించి వరకు నెలకు రూ 5 వేలు అద్దె చెల్లింపు.
- బీపీఎల్ కుటుంబాల్లో 58 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 2 వేల పెన్షన్, వితంతువులకు రూ. 3 వేల పెన్షన్.
- వెనుకబడిన కులాల కార్పొరేషన్‌కు ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయింపు.
- రజకులను ఎస్సీల్లో, గంగపుత్రులు, వడ్డెర కులస్తులను ఎస్టీల్లో చేర్చేందుకు చర్యలు.
- నేత, గీత, రజక, క్షార, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు తదితర కులవృత్తుల్లో 55 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 3 వేల పెన్షన్
- జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్ల పెంపు.
- క్రీడారంగం అభివృద్ధికి రూ. 1,000 కోట్లతో క్రీడా నిధి ఏర్పాటు. వెయ్యిమంది క్రీడాకారులకు ఏటా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్కాలర్‌షిప్ మంజూరు.
- జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెన్షన్.
- కల్యాణలక్ష్మి పథకంతోపాటు పేద మహిళలకు వివాహ సమయంలో ఒక తులం బంగారు మంగళసూత్రం.
- వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేటాయింపులు రూ. 2 వేల కోట్లకు పెంపు.
- ఖాయిలాపడిన సంస్థల పునరుద్ధరణకు రూ. 2 వేల కోట్ల నిధి ఏర్పాటు. ్ఞ జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఏటా రూ. 100 కోట్ల బడ్జెట్.
- రూ. 5 వేల కోట్లతో వెంచర్ కేపిటల్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం.
- వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మంలలో ఐటీæ ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు.
- జనగామ, భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మంచిర్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, నిర్మల్, జగిత్యాల పట్టణాల్లో బీపీవోల ఏర్పాటు.
- జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటన
- సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహణ.
- పెట్రోల్, డీజిల్‌పై ధరలు కనీసం రూ. 20 తగ్గింపు
- గ్రామ పంచాయతీలు, నగరాలు, పట్టణాల్లో నెలకు రూ. 6కే çనల్లాల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా.
రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి
Published Mon, Nov 19 2018 2:46 AM | Last Updated on Mon, Nov 19 2018 2:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment