హైదరాబాద్: బీజేపీ మేనిఫెస్టో కేవలం 5 ఏళ్ల కోసం రూపొందించినది కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ధారించే ప్రజా మేనిఫెస్టో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, డాక్టర్ మల్లారెడ్డి, సుహాసిని ముషీరాబాద్ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో లక్ష్మణ్‌ను కలసి మేనిఫెస్టో ప్రతిని అందజేశారు. లక్ష్మణ్ మాట్లాడుతూ రెండు నెలలుగా సుమారు 50 మంది మేనిఫెస్టో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి, ఆన్‌లైన్ లో వందలాది మంది అభిప్రాయాలను సేకరిం చారని, అనంతరం వివిధ వర్గాల ప్రజల సమస్యల్ని నిపుణులతో చర్చించి మేనిఫెస్టో రూపొం దించారని వెల్లడించారు.
రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోలోని అంశాల్ని ప్రజలకు వివరిస్తామన్నారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతుల సమస్యలు, విద్యా, వైద్య రంగం పట్ల దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ట్ర మేనిఫెస్టోతో పాటు అసెంబ్లీ స్థానాల వారీగా సమస్యలను తీసుకుని నియోజకవర్గ మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఈ మేని ఫెస్టో ఉపయోగపడుతుందని లక్ష్మణ్ అన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ సకల జనులు సాధిం చుకున్న తెలంగాణ ఆ నలుగురి కోసమే అన్నట్లు సాగిందని విమర్శించారు. బీజేపీ మేనిఫెస్టోలో సకల జనుల సంక్షేమం ఇమిడి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment