
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి, టీఆర్‌ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంగామా సృష్టించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. అయినా ఆ పార్టీలను రాష్ట్ర ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చాన్నాళ్ల తర్వాత బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తూ హోరాహోరీ ప్రచారం నిర్వహించిందని అన్నారు.
పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 4 రాష్ట్రాల సీఎంలు, 40 మంది కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా కూటమి ఓ విషకూటమి అని, దానికి సిద్ధాంతం అంటూ ఏమీ లేదన్నారు. పరస్పర విరుద్ధ్దమైన పార్టీలు టీఆర్‌ఎస్, మజ్లీస్ కలసి పనిచేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment