Laxman
-
‘ఎమ్మెల్సీలు గెలిస్తే సంచలనమే’
సాక్షి,నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం(ఫిబ్రవరి16) నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు.‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలి. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉంది.కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బీసీ హక్కులను,రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పనిలేదు. వాళ్ల దుకాణం బంద్ అయింది.ఎంపీ అర్వింద్ కామెంట్స్హిందూ రాష్ట్ర స్థాపనే నా లక్ష్యంఎన్నికలు ఏవైనా..ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారుప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటుదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలి -
‘కాంగ్రెస్ ఔట్.. ప్రజలు తిడుతున్నారని ఎమ్మెల్యేనే చెప్పారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లు కాబోతున్నాయి. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలని ఘాటు విమర్శలు చేశారు.రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ స్పీకర్ హామీలను అమలు చేయమని స్వయంగా చెప్పడంతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బహిర్గతం అయ్యింది. ఆర్ధిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని విస్మరించారు.ప్రజలు తిరగబడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చాలా మంది రైతులను విస్మరించారు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు ఆ ఊసే లేదు. హామీలు ఇచ్చి మొండి చెయ్యి చూపితే బీజేపీ ఊరుకోదు. హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.తెలంగాణలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఏడాది కింద ఎనిమిది వేల మంది పదవి విరమణ పొందితే.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కేసీఆర్ మూడేళ్లలో ఇస్తామని బాండ్స్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే తక్షణమే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ విస్మరించింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోకుండా పదవి విరమణ పొందిన ఉద్యోగులను గోస పుచ్చుకుంటున్నారు.ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలి. బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించండి.. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించినట్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రేవంత్.. నువ్వు రాహుల్ కాంగ్రెస్‌లో లేవా?: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ కొంగ జపం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ వెంటనే అశోక్ నగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అశోక్‌నగర్‌లో అభ్యర్థులను లాఠీలతో కొడుతున్నారు. వారి తలలు పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ సిటి లైబ్రరీకి వచ్చి అరచేతితో వైకుంఠం చూపించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ కొంగ జపం చేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. యువత చేస్తున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. రిజర్వేషన్లకు చెల్లు చీటీ చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లంఘించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు.అభ్యర్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.. తలలు పగుల కొడుతున్నారు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. రాహుల్ గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసాలో పట్ల జనం అప్రమత్తం అయ్యారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోచుకుంటే.. మూసీ పేరుతో కాంగ్రెస్ దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. లక్షా 50వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ కుట్ర చేసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులు.. రుణమాఫీ, హామీలపై ప్రశ్నిస్తుంటే.. వారిని పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. మంత్రులు ఒక మాట, ఎంపీలు ఒక మాట చెప్తున్నారు. రైతు భరోసా లేకుండా పోయింది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. రాహుల్ కాంగ్రెస్ వేరు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు వేరా?. ఉన్న అవకాశాలను కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జీవో-29 ద్వారా లక్షల మంది అవకాశాలను కొల్లగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు. ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ బాసటగా నిలుస్తోంది’ అంటూ హామీ ఇచ్చారు. -
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
భర్త అంత్యక్రియలకు సాయం చేయండి..
హుజూరాబాద్ రూరల్: మృత్యువు హఠాత్తుగా భర్తను కబళించింది. అంత్యక్రియలకు పేదరికం ఆటంకంగా నిలిచింది. కన్నీళ్లు దిగమింగుకున్న ఆ ఇల్లాలు సాయం కోసం వేడుకోగా.. స్పందించిన మానవత్వం చివరి మజిలీకి అవసరమైన సాయం చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంది. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్–ప్రేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. కూలినాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు. ఇక తమ బతుకు తాము బతుకుదామనుకునే సమయంలో లక్ష్మణ్ మంగళవారం ఇంటి వద్ద హఠాత్తుగా కిందపడిపోయాడు. ఆ సమయంలో అందుబాటులో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యమైంది. చివరకు కొందరు గ్రామస్తులు అక్కడకు రావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స అందిస్తుండగానే లక్ష్మణ్ మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు అద్దె ఇంటి యజమాని అడ్డు చెప్పాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం.. దుఃఖాన్ని దిగమింగుకుంది. ఊరు బయటనే ఓ డేరా వేయించి అక్కడే మృతదేహాన్ని ఉంచారు. అయితే, అంత్యక్రియలు పూర్తిచేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో మృతుడి భార్య కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని చూసేందుకు వచి్చన వారిని సాయం చేయాలని ప్రాధేయపడింది. తల్లీకూతుళ్లు చేతులు చాచి ఆర్థికసాయం కోసం విన్నవించడం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. స్పందించిన వారు తలాకొంత పోగుచేసి రూ.80 వేలను మృతుడి కుటుంబానికి అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సూచన మేరకు ఆ పార్టీ నాయకులు కూడా కొంత నగదు అందజేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం...
-
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన గాడితప్పి ప్రజారోగ్యం పడకేసి తెలంగాణ మొత్తం విషజ్వరాల బారిన పడినందున.. వెంటనే ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచి్చందని, కానీ దీనిద్వారా అసలైన సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో చెరువులను పరిరక్షించాల్సిందేనని, కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. కబ్జాల వివరాలు బయట పెట్టాలని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. దేవాదాయ భూములు, అసైన్డ్ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్నాక.. వాటిపై ప్రతాపం చూపొద్దన్నారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేయలేదు.. తులం బంగారం లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వ లేదని ఎద్దేవా చేశారు. ఉచితాలు, హామీలు, గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు హామీలిచ్చి.. గద్దెనెక్కాక ప్రజలను గోస పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారు.. ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణనుæ ఢిల్లీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కోర్టులకు రాజకీయ రంగు పులమడం కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామన్న.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అన్ని విషయాలకు కోర్టులు, న్యాయ వ్యవస్థ ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా లక్ష్మణ్ చెప్పారు. అధికారంలోకి రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలకు పిచ్చి ముదిరిందని, ఇప్పటికే ఆ పార్టీ ఖేల్‌ఖతం.. దుకాణం బంద్ అయ్యిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొత్తగా కలిసేది ఏముంది? వాళ్లు ఎప్పుడో కలిశారు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో బీజేపీ ఉద్యమ బాట పడుతుందని, త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తుందని లక్ష్మణ్ వెల్లడించారు. -
చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్ పై ఎంపీ లక్ష్మణ్ రియాక్షన్
-
కేసీఆర్ పై చర్యలేవి ?
-
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్.. రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకం..!
-
హామీలు మరిస్తే ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, పార్లమెంట్లో ‘చిన్నమ్మ’సుష్మా స్వరాజ్ చేసిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సుష్మా స్వరాజ్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచిæ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలంగాణ పోరాటం తరహాలోనే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి గ్యారంటీలను అమలు చేయకపోతే ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, వచ్చే ఐదేళ్లు ఆయనకు కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆమెకే భక్తుడు అయ్యాడు. మాజీ సీఎం కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఉచితాలు, గ్యారంటీలు ఓట్లు దండుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు. తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచు కోవడం కోసం రాజీపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు’అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అనుభవి స్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలని శ్రీకాంతాచారితో మొద లు పెడితే ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నా రు. 1,200 మంది అమరులయ్యారు. వారి బలిదానాల తోనే తెలంగాణ వచ్చింది’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ బీబీపాటిల్, పార్టీనేతలు కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి, శిల్పారెడ్డి, ప్రేంసింగ్‌రాథోడ్, ఎన్విసుభాష్, పీఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 1969 ఉద్యమకారులకు బీజేపీ సన్మానం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బీజేపీ నేత డా.కె.లక్ష్మణ్ శాలు వాలతో సన్మానించారు. మాజీ మంత్రులు మేచినేని కిషన్‌రావు, మర్రి శశిధర్ రెడ్డి, అలాగే యాదగిరి గౌడ్ తదితరులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించి గౌరవించాలని ఉద్యమ కారులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మోదీ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. మేచినేని కిషన్‌రావు మాట్లాడుతూ.. ‘బీజేపీ చొరవ వల్ల తెలంగాణ సిద్ధించింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఉద్యమకారులుగా తీర్మానం చేశాం. ఈ రోజు నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు. వంద ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలి’అని అన్నారు. -
ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్. కవాడిగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసులో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తోందని ఆరోపించింది. ఈ కుంభకోణంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ఇందుకోసం న్యాయ పోరాటానికి సైతం సిద్ధంగా ఉందని ప్రకటించింది.కేసులో సూత్రధారులు, పాత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్ ఇప్పుడెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం ఉందా?ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తామన్నారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి తన కుమార్తె కవితను తప్పించడంకోసమే బీజేపీ నేతలపై కేసీఆర్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.బీఆర్ఎస్ రద్దు కోరుతూ లేఖ రాస్తా: కొండా 2017కంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యవహారాలతో పాటు రక్షణ పరమైన ఒప్పందాల్లో నూ కేసీఆర్ వేలు పెట్టాడని తెలుస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో నయీం తరహా పాలన సాగిందని, సొంత కుటుంబం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.రేవంత్‌ను సోనియా బెదిరించారు: బూర‘బీఆర్ఎస్పై కేసులు పెడితే నీపని అవుతుంది అని సోనియా గాంధీ బెదిరించారు. అందుకే రేవంత్ రెడ్డి మొహం చిన్నగా చేసుకుని వచ్చాడు’ అని బూ ర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. ధర్నాలో ఎంపీ బీబీపాటిల్, మాజీ మంత్రులు జి.విజయ రామా రావు, ఇ.పెద్దిరెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్. రామ చంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మా రావు, ప్రేంసింగ్ రాథోడ్, భేతి సుభాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఢిల్లీ పెద్దల ఒత్తిడితో వల్లే రేవంత్ రాజీ: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఇది సామాన్య నేరం కాదు.. దేశద్రోహం లాంటిది అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఎంపీ లక్ష్మణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతిని వెలికితీస్తామన్న సీఎం రేవంత్ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్ వెనకడుగు వేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ ఈ కేసులో రాజీ పడ్డారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్‌లో బాధితుడు అయినప్పటికీ రేవంత్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు.కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనని ఈ వ్యవహారంతో తేలిపోయింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఢిల్లీ నేతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను కాపాడేందుకు ఈ కేసును వాడుకున్నారు. ఇక, తెలంగాణలో అందెశ్రీ పాటను అధికార గీతం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ రావడం ఖాయం. ఆగస్టు సంక్షోభం వస్తే మేము రక్షించే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చివరి నాలుగు రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారం, దీంతో ముడిపడిన అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో.. అప్పట్లోగా చేపట్టే ప్రచారం, ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార సరళి, ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలి, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రస్తావించాల్సిన అంశాలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని దు్రష్పచారం జరిగితే ఎలా ఖండించాలి అన్న వాటిపై కీలక నేతలు సమీక్షించారు. శనివారం లోగా పోలింగ్‌బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చి ఓటర్లను వారి ఇళ్లల్లో కలుసుకునేలా కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగు రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, మీడియా కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోశ్, ఎలక్షన్ కమిటీ చైర్మన్ డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మీడియా, సోషల్ మీడియా కమిటీల భేటీలో... వీరితో పాటు రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ప్రేంసింగ్ రాథోడ్, డా.ఎస్.ప్రకాష్ రెడ్డి, పోరెడ్డి కిశోర్ రెడ్డి, రచనా రెడ్డి, పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిలు పాల్గొన్నారు.అలాంటి దు్రష్పచారం మళ్లీ జరగొద్దు.. ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీల అమలు నెరవేర్చకపోవడం వంటి వాటిని ఎండగట్టడంతో పాటు... రిజర్వేషన్ల రద్దు, ఇతర అంశాలపై కొన్నిరోజులుగా బీజేపీపై చేస్తున్న దు్రష్పచారాన్ని మరింత సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ సూచించారు. తెలంగాణలోని కొన్ని మీడియా సంస్థలు (సాక్షి కాదు) బీజేపీ పట్ల ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయని, పారీ్టకి నష్టం కలిగించే దిశలో ఇతర పారీ్టల ప్రచారానికి ఊతమిస్తున్నాయని సంతోష్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక పత్రికలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దుష్యంత్ కుమార్ చౌహాన్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి, తప్పుడు ప్రచారానికి దోహదపడేలా వార్త ప్రచురించారని ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. చివరి నాలుగు రోజులూ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు పారీ్టవర్గాల సమాచారం. -
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలులో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తప్పకుండా రద్దు చేస్తామని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు తప్ప.. మరే రిజర్వేషన్లు రద్దు చేయబోమని, అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చేది లేదని ఆయన వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మినహా.. కుల, మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దన్నదే రాజీవ్‌గాంధీ అని గుర్తు చేశారు. రంగనాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయని కాంగ్రెస్.. మండల్ కమిషన్‌ను కూడా రాజీవ్‌గాంధీ వ్యతిరేకించారన్న విషయాన్ని రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ సూచించారు. ముస్లిం సంతుష్టీకరణ పేరిట హిందూ సమాజంపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో లక్ష్మణ్ పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, సుభాష్ రవి కిషోర్‌తో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లింలను సంతృప్తిపర్చేందుకు కాంగ్రెస్ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని, బీసీల రిజర్వేషన్లును తగ్గించి ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.బీజేపీ దేవుళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తోందంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడకు వెళ్తే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతూ.. అదే దేవుళ్లను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కులగణనకు మేం వ్యతిరేకం కాదు కానీ.. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అది శాస్త్రీయంగా, పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే.. ఈ కూటమి తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ తెస్తామంటున్నారని, సీఏఏపై కూడా దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీఏఏను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము వికసిత్ భారత్ అంటుంటే.. కాంగ్రెస్ విభజించు భారత్ అంటూ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అక్షింతలు, కాషాయంతో తిండి లభిస్తుందా అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చర్మాన్ని ప్రజలు వొలిచిన విషయం గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
ఆయన లక్షణాలే నా అక్షరాలకు స్ఫూర్తి
ఓ నాయకుడి గురించి రాసేటప్పుడు కలం కదలాలంటే ఆ నాయకుడి వ్యక్తిత్వంలో బలం ఉండాలి. అక్షరాలు పరుగులు తీయాలంటే లక్షణాలు ప్రేరణ కావాలి అంటున్నారు జానపద గేయ రచయిత లక్ష్మణ్.‘నీ బుల్లెట్టు బండెక్కి..’ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్ని ఊపేసిన ఈ యువ రచయిత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుణగణాల్ని వర్మిస్తూ రాసిన ‘జెండాలు జత గట్టడమేమీ అజెండా.. జనం గుండెలో గుడికట్టడమే జగన్ అజెండా’ అనే పాట తెలుగు నాట ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షితో తన అనుభూతిని పంచుకున్నారిలా... – సత్యార్థ్ పేదల ముంగిట్లో పథకాలు పాట రాయడానికి ముందు వలంటీర్లతో స్వయంగా మాట్లాడి ఆయన అమలు చేసిన పథకాల గురించి తెలుసుకున్నా. కడుపు నిండినోడ్ని కాదు ఆకలితో కడుపు మండేవాడ్ని మాత్రమే పట్టించుకోవాలనీ, చాచిన ప్రతీ చేయికీ సాయం అందాలి అనే ఆలోచనలతోనే ఆయన ఆ పథకాలన్నీ తీర్చిదిద్దారని అర్థమైంది. ఆ అవగాహనే ‘‘మా ఇంటికే తెచ్చిండు ప్రభు త్వం మా చేతికే ఇచ్చిండు రా పథకం’’ అంటూ కీర్తించేలా చేసింది. ప్రభుత్వ పథకాలు ఇంటికి రావడం దేశంలోనే జగన్ సార్ వల్ల వచ్చిన గొప్ప మార్పు. నిరుపేదలు ఆస్పత్రి ఖర్చులతో అన్యాయం అయిపోవద్దు. రోగంతో కోలుకున్నాక కూడా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు పూర్తిగా నయమైంది అని కచ్చితంగా తెలుసుకోవాలి... అని ఆయన మాట విన్నప్పుడు నిజంగా నాకు కళ్లలో నీళ్లొచ్చాయి. కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా.. జగన్ పుట్టుకలో వెనుకడుగేయని తత్వం ఉంది. ఆయన్ను నమ్ముకున్న కార్యకర్త ఆత్మగౌరవంతో ఉండాలి. ధైర్యంగా కొట్లాడాలి. ఏదోవిధంగా గెలవాలని, తాను పొత్తులకు దిగజారిపోకూడదు అని ఆయన అనుకుంటారు. తన కోసం వారు మనస్సాక్షిని చంపుకుని బతకొద్దు అనేది ఆయన ఆలోచన అని నాకు అర్థమైంది. పైన ఉన్న దేవుడ్ని కింద ఉన్న జనాన్నే నేను నమ్ముకున్నా అంటూ తరచుగా ఆయన చెప్పడం నాకెంత స్ఫూర్తినిచ్చిందో... పరిచయమైన కొద్దీ... పదునెక్కిన పదం జగన్ మీద అప్పటికే ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి. ఆయన కోసం పాట రాయాలంటే మామూలు విషయం కాదు.అందుకే ఈ పాట రాసే అవకాశం నాకు వచ్చినప్పుడు... కొంచెం సందేహించిన మాట నిజం.పైగా నాది తెలంగాణ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అంతగా తెలియదు. దాంతో పాటకు ముందు ఆయన ఇంటర్వ్యూ లు వరుసపెట్టి చూశా.. రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుంటుంటే....అర్ధమవుతూ వచ్చింది జగన్ ఏంటో... నిఖార్సైన గ్రేట్ లీడర్... ఆయన పాట రాసి అది అందరి మెప్పూ పొందడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో...ఆయన పాలన విశేషాలు, ప్రజాసేవ గురించి తెలుసుకోవడం వల్ల అంతకు మించిన ఆనందం పొందుతున్నాను. ఇలాంటి పేదల పక్షపాతి లాంటి నాయకుడ్ని నేనింత వరకూ చూడలేదు. ఇంత చేసినా.. రకరకాలుగా ఆయనకు చెడు చేయాలనే ఆలోచనలు కొంతమంది చేస్తున్నారని బాధ అనిపిస్తుంది. సారిచ్చిన పథకాలు పేదింటికి ఏ స్థాయిలో అందుతున్నాయి? పేదలు ఎంత తృప్తిగా ఉన్నారు? అనేది కనపడుతున్నా.. వ్యతిరేక మీడియా దు్రష్పచారం చేస్తోంది. అందుకే నా వంతుగా ఆయన వ్యక్తిత్వాన్ని పాట ద్వారా బలంగా చెప్పాలని అను కున్నా. నేను రైటర్‌గా గతంలోనూ కొందరు నేతల గుణగణాల్ని వర్మిస్తూ రాశాను. అయితే వ్యక్తిగతంగా ఇంతగా ప్రభావితం అయింది ఇదే తొలిసారి. జగన్ గారి గురించి రాసేటప్పుడు తెలియని శక్తి ఏదో ఆవహిస్తుందేమో అనిపించింది. -
సర్వేలు అదే చెబుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. సర్వేలు సైతం బీజేపీ గెలుపును ధృవీకరిస్తున్నాయని చెప్పారు. 247 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 235 స్థానాల్లో ఓడిపోబోతుందంటూ జోస్యం చెప్పారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నేలా విడిచి సాము చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు. రెండు అంకెల సీట్లు బీజేపీకి రావడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పస లేని విమర్శలు చేస్తున్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గత చరిత్రగానే మారిపోతోంది. ఆడలేక మద్దెల చెరువు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే అసెంబ్లీ సీటు బీజేపీ సాధించగా... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలిచింది. తెలంగాణలో నాలుగు సీట్లు గెలవడంతోనే బీజేపీ సీట్ల సంఖ్య 300 మార్క్ దాటింది’’ అని లక్ష్మణ్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్: రేవంత్‌కు కొత్త సవాల్ విసిరిన ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుతం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్‌లు జరగవచ్చని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్ వీరుడు కాదు.. గ్రీక్‌వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
BRS చచ్చిన పాము..ఆ పార్టీని బీజేపీ ఉపేక్షించదు: లక్ష్మణ్
-
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం..ఈ జన్మకు ఇది చాలు
-
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం ఈ జన్మకు ఇది చాలు
-
బీజేపీకి 10 సీట్లు ఫిక్స్
-
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత విధించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఎమ్మెల్యేగా ఆయనపై వేటు వేయాలని పిటిషన్లు వేశారు. ధర్మపురి ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కాంగ్రెస్‌నేత పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కరీంనగర్ జల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి కేవలం 441 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌పై గెలిచారు. దీంతో వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించకముందే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని, అధికారులు ఆయనకు మద్దతిచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజవకవర్గం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ ఈ ఇద్దరు నేతలే తలపడుతున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఈసారి గెలుపెవరిదో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. -
బీజేపీ గ్రాఫ్ పెరిగింది.. కారు షెడ్డుకు వెళ్ళడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ బూటకపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ మ్యానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టోనని పేర్కొన్నారు. ఆచరణకు అమలయ్యే హామీలను మాత్రమే బీజేపీ ఇచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణ అధోగతిపాలు కావొద్దన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చే ప్రకటనలు ఆపివేయడం హర్షించదగిన పరిణామమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదని తెలిసీ రైతుభరోసా ఇస్తామని చెప్పి ప్రజలను ఏమార్చుతోందని మండిపడ్డారు.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు లక్ష్మణ్. ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనతో తెలంగాణ క్యాడర్లో జోష్ నింపిందని తెలిపారు. బీసీలు, మాదిగలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో కారు షెడ్డుకు వెళ్ళడం... హస్తానికి మొండి చెయ్యి గ్యారంటీ అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు రాలేదని ప్రస్తావించారు. ఆంధ్ర, రాయలసీమలో వచ్చే మెజార్టీ సీట్లతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. -
చేసేదే చెబుతాం!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిపై (యూనిఫాం సివిల్ కోడ్) నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెబుతుందని స్పష్టం చేశారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, దీనికి అనేక చట్టపరమైన ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు. అందువల్ల వాటిని ఎలా అధిగమించాలనే అంశంపై దృష్టి పెట్టి, నిజమైన బీసీలకు న్యాయం చేసే దిశగా ఆలోచిస్తున్నామన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీసీ గణన నిర్వహించినా ఆ వివరాలు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పండిట్ నెహ్రూ మొదలుకొని రాహుల్‌గాంధీ వరకు అందరూ బీసీ వ్యతిరేకులేనని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ బీసీ సీఎంను చేస్తామంటే ఎద్దేవా చేసి.. ఓబీసీలను అవమానించిన రాహుల్‌గాంధీ ఇప్పుడు వారిపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఏడుగురు న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటు చేసినందున రాజకీయంగా, చట్టపరంగా ఎలా చేయాలన్న అంశంపై కేంద్ర ప్రభు త్వం దృష్టి పెట్టిందని వివరించారు. కాంగ్రెస్ నుంచి 2014లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏడుగురు, 2018 లో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని, ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా ఆ పార్టీ బీఆర్ఎస్తో కలవక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించేందుకు కాంగ్రెస్‌కు 11సార్లు అవకాశమిచ్చారని, గతంలో టీడీపీకి, ఇప్పుడు పదేళ్ల పాటు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినందున ఈసారి బీజేపీకి అవకాశమివ్వాలని ప్రజలకు లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. అధికారమిస్తే యోగి యూపీ మోడల్ బీజేపీ అధికారంలోకి వస్తే యోగి ఆదిత్యనాథ్ యూపీ నమూనాను ఇక్కడ అమలు చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరి గా బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనూ ఉచితాలు ఉంటాయా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు లక్ష్మణ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలన్నీ కూడా ఓట్ల కోసం వేస్తున్న గాలాలే తప్ప మరొకటి కాదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇది రుజువైందని గుర్తు చేశారు. ఉచితాలు, సరైన పద్ధతిలో సంక్షేమ పథకాల అమలుతో పేదలకు లబ్ధి చేకూర్చడం మధ్య వ్యత్యాసం ఉందన్నారు. హంతకుడే క్షమాపణలు చెప్పినట్టు.. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలున్నాయని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం
-
బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
-
బీసీలంటే రాహుల్‌కు ఎందుకంత చులకనా?: లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: బీసీ సీఎం చేస్తామన్న బీజేపీ ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీ వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెత్తందార్ల మనస్తత్వంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలున్నారు.. ఆ పార్టీలను తెలంగాణ బీసీలు ఓటుతో తిప్పికొట్టాలన్నారు. బీసీ సీఎం అయ్యేందుకు బీసీలంతా ఏకం కావాలి, తమ సత్తా చాటాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3కే పరిమితమైంది. తరతరాలుగా బీసీలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్’’ అంటూ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బీజేపీ బీసీల అభిమానాన్ని చూరగొంది. అధికార పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తోంది. బీసీల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఎన్నికలు ఇవి. కొండంత ఆశతో బీసీలు మోదీ వైపు చూస్తున్నారు. డిపాజిట్లు గల్లంతైన పార్టీ కాంగ్రెస్. నిన్నటి సభలో రాహుల్ బీసీలను అవమానిస్తారా?. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్. తక్షణమే రాహుల్ బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీసీలంటే రాహుల్‌కు ఎందుకంత చులకనా?. బీసీల పట్ల కాంగ్రెస్ విపరీత ధోరణి మారాలి. ఎక్కడ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ వైపు చూస్తున్నారు’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. చదవండి: కేసీఆర్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుంది: రాహుల్ గాంధీ -
ఢిల్లీలో కవిత ధర్నాల సంగతేంటి.. బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికార బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారు కానీ.. మహిళలకు సీట్లను మాత్రం కేటాయించలేదన్నారు. ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించాం. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన ప్రకటించవచ్చు. బీజేపీ నుంచి కొంతమంది ఎంపీలు అసెంబ్లీ బరిలోకి దిగుతారు. బీజేపీ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారు. నేను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. నా రాజ్యసభ పదవి కాలం అయిదేళ్లు ఉంది. అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తాను. కిషన్ రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. జనసేనకు కూడా కొన్ని టికెట్లు ఇస్తాం. రెండో జాబితా ఈ నెల 29 తర్వాత ఉంటుంది. రాజా సింగ్ సస్పెన్షన్, ఎన్నికల్లో పోటీ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తోంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. బీసీల ఓట్లు తీసుకొని అగ్రకులాలు గద్దె నెక్కుతున్నాయి. అభ్యర్థుల మొదటి విడతలో బీసీలకు 20పైగా సీట్లు కేటాయిస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీల సేవలు వాడుకుని వదిలేస్తున్నారు. బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోంది. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీసీలను బానిసలుగా చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు బీసీలకు బీజేపీ కేటాయిస్తుంది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు! -
ఫ్రస్ట్రేషన్లో స్థాయిని మించి మాట్లాడుతున్నాడు: కేటీఆర్‌పై లక్ష్మణ్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సీఎం కాలేదన్న ఫ్రస్టేషన్లో కేటీఆర్.. తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి సహకరించకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలు అంటే మద్యం, డబ్బు అయిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్వి అవకాశవాద రాజకీయాలని విమర్శలు గుప్పించారు. ఈనెల 16 తర్వాత బీజేపీ లిస్ట్ కూడా వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. అన్ని వర్గాల వారికి బీజేపీ మాత్రమే సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లోపే మేనిఫెస్టో, చార్జి షీట్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. ‘ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఎక్కడ.. కేటీఆర్ ఎక్కడ.. పెద్దవారిని తిడితే పెద్దవాన్ని అవుతానని అనుకుంటున్నావా. బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయి. ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు గుంజుతున్నారు. నదులకు నడక నేర్పడం ఏమో కానీ మద్యాన్ని ఏరులై పారించారు. గుజరాథ్‌కు వెళ్లి చూసి వస్తారు. అదే గుజరాత్ మోడల్‌నీ ఎగతాళి చేస్తారు. ’ అని లక్ష్మణ్ మండిపడ్డారు. -
అలాంటి పిచ్‌లపై ఫూల్స్ కూడా వికెట్లు తీస్తారు: అశ్విన్‌పై సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత గడ్డ మీద తన కోసమే ప్రత్యేకంగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేయిస్తారని పేర్కొన్నాడు. అందుకే ఇండియాలో తప్ప SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)లో అతడి పప్పులు ఉడకవని తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే కామెంటేటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామెంటరీ ప్యానెల్లో చోటు ఆశించి భంగపడిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. ‘‘కామెంటరీ ప్యానెల్లో సరైన స్పిన్నర్ ఒక్కరికీ చోటు దక్కలేదు. టోర్నీలో ఇండియాలో జరుగుతున్నా ఇదే పరిస్థితి. స్పిన్ బౌలింగ్ గురించి సాధారణ ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? వారిని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? కేవలం బ్యాటర్లు, శ్వేత జాతీయులకు మాత్రమే గేమ్ గురించి తెలుసా? విచారకరం’’ అని శివరామకృష్ణన్ ఎక్స్ ఖాతా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘టీమిండియా బ్యాటర్లు ముఖ్యంగా కింగ్(విరాట్ కోహ్లి) స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇంకానయం మనోళ్లు ఆఖర్లో అశ్విన్‌ను తీసుకున్నారు. ఒకవేళ వికెట్లు పడ్డా తను బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటేనే’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఇండియాలో టెస్టు మ్యాచ్‌లలో పిచ్‌లు అశ్విన్ కోసమే తయారు చేస్తారు కాబట్టి టీమిండియా బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోతున్నారు. మరి SENA దేశాల్లో అతడి రికార్డు ఎప్పుడైనా గమనించారా?’’ అని శివరామకృష్ణన్ పేర్కొన్నాడు. ఆ తర్వాత సంభాషణ కొనసాగగా.. ‘‘టాంపెరింగ్ చేసిన పిచ్‌లపై ఫూల్స్ కూడా వికెట్లు తీయగలరు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గ్రౌండ్‌కు వెళ్లి అక్కడి సిబ్బందిని కలిసి టాంపర్ చేయాల్సిన ఏరియాల గురించి చెప్పే వారిని నా కళ్లారా చూశాను. ఇండియాలోనే 378 వికెట్లు. ఇప్పటికీ అతడు ఆడుతున్నాడంటే మిగతా వాళ్లకు ఛాన్స్‌లు లేవని అర్థం. మోస్ట్ అన్‌ఫిట్ క్రికెటర్. ప్రతిదానికి ఓ సాకు వెదుక్కుంటాడు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో అశ్విన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన కొంతమంది నెటిజన్లు మీ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా అని ప్రశ్నించగా.. లేదు.. ఇది నేనే అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ సమాధానమిచ్చాడు. కాగా శివరామకృష్ణన్ 1983-87 మధ్య టీమిండియా తరఫున ఏడు టెస్టులు, పదహారు వన్డేలు ఆడాడు. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
రాజ్యాధికారంలో వాటా దక్కితేనే బీసీలకు న్యాయం..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాధి కారంలో బీసీలకు తమవంతు వాటా దక్కినప్పుడే వారికి న్యాయం జరిగినట్లు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాను న్న ఎన్నికల్లో బీసీలే ప్రధాన పాత్ర వహించాలని చెప్పారు. గత తొమ్మిళ్లలో బీసీలను ఆదుకునేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాలను ఆదరించి మద్దతుగా నిలవాలని కోరారు. దేశంలోని కుల, చేతివృత్తుల బలోపేతానికి మోదీ– పీఎం విశ్వకర్మ యోజన వంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చారని చెప్పా రు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను వంచించి దగా చేశాయి. బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సిన 33 శాతం వాటాకు కోతపెట్టి.. ఇప్పుడు ఓబీసీ ఎజెండా ఎత్తుకుని ఓట్ల కోసం పాకులాడుతు న్నాయి’ అని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాల యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రప టానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆధి పత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, కుల వృత్తులు, వ్యవసాయాధారిత పేద కుటుంబాలకు మద్దతుగా ఐలమ్మ పోరాటం చేశారని కొనియాడారు. -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
అట్టా.. ఎట్టాగా పుట్టేసినావు...
రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘‘అట్టా ఎట్టాగా పుట్టేసినావు..’ అంటూ సాగేపాటని మ్యూజిక్ డైరెక్టర్ రధన్ రిలీజ్ చేశారు. రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాసిన ఈపాటను యశ్వంత్ నాగ్, కమల మనోహరిపాడారు. ‘‘హీరో, హీరోయిన్ తొలి చూపులోనే ప్రేమలో పడే సీన్లో వచ్చేపాట ఇది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
TS: సంఘ్ పెద్దలతో బీజేపీ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సమన్వయంపై ఆ పార్టీ నేతలు సంఘ్ పెద్దలతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కే.లక్ష్మణ్, బండి సంజయ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో సంఘ్ పరివార్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా వెంటనే చేయాల్సిన పనులేంటో ఈ సందర్భంగా సంఘ్ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. -
ఆత్మగౌరవం నేపథ్యంలో...
లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నచ్చినవాడు’. ఈ సినిమాలోని ‘తోడై నువ్వుండక..’ పాట లిరికల్ వీడియోను అక్కినేని అమల విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలన్నారు. ‘‘మహిళల ఆత్మగౌరవం నేపథ్యంలో అల్లిన ప్రేమకథా చిత్రం ఇది. కామెడీ, నేటి యువతరానికి కావాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు లక్ష్మణ్. రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్ కీలక పాత్రలు ΄పోషించిన ఈ సినిమాకు మిజో జోసెఫ్ స్వరకర్త. -
కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ కూడా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా వారి బంధం ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఆప్‌తో కూడా అవినాభావం సంబంధం మరింతగా బలపడుతోందని ఆరోపించారు. తెలంగాణలో భారీ వర్షాలకు నగరాలు మునిగిపోయినా, జనజీవ నం స్తంభించిపోయినా సీఎం కేసీఆర్‌కు ఏమీ పట్టలేదనీ, రోమ్ చక్రవర్తిలా వ్యవహరిస్తూ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని నిందించారు. మును పెన్నడూ లేని విధంగా వరంగల్, ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్‌లు ఒ‘కే సారి జలమయం అయ్యాయని, తెలంగాణకు సముద్రం లేని లోటు తీర్చడం బీఆర్ఎస్కే దక్కిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నదులకు నడక నేర్పడం సంగతి ఏమోగానీ ఢిల్లీ వరకూ మద్యం ప్రవహించేలా ఘనత మాత్రం ఆయన కుటుంబానికే చెల్లిందని ఆరోపించారు. మద్యం ద్వారా పెరిగిన బంధంతోనే సంజయ్ సింగ్‌కు వత్తాసు పలుకుతున్నారని నిందించారు. కేంద్రబృందాల అంచనా రాగానే సాయం వర్షాల వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం హోంమంత్రి అమిత్‌షాను కలిసి వివరించిందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర బృందాల నష్ట అంచనా రాగానే కేంద్రం నుంచి సహాయం ఉంటుందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష మార్పు, బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. -
కథా బలమున్న సినిమాలు చేయాలనుంది: హీరో లక్ష్మణ్
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తీస్తున్న సినిమా 'సీతారాం సిత్రాలు'. లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో డి.నాగ శశిధర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు అశోక్ చేతుల మీదుగా జరిగాయి. టైటిల్ లోగోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.వి.గుహన్ విడుదల చేశారు. "నువ్వు గెలవనంత వరకు ఏమీ చెప్పిన అది చెత్తే.. ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త చెప్పిన అది చరిత్రే" అనే కథాంశం తో రాబోతున్న 'సీతారాం సిత్రాలు' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది, 'సీతారాం సిత్రాలు' అందరిని అలరించే ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!) -
స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
దర్శకుడిగా, హీరోగా లక్ష్మణ్ చిన్నా స్వీయ దర్శకత్వంలో తొలిసారిగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'నచ్చినవాడు'. ఈ చిత్రంలో కావ్య రమేశ్ అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. 'నా మనసు నిన్ను చేర' అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి మిజో జోసెఫ్ సంగీతమందించారు. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘రుద్రమాంబపురం’పై మంత్రి తలసాని ప్రశంసలు) లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ..' నచ్చినవాడు మూవీ మహిళల ఆత్మ గౌరవమే కథాంశంగా చేసుకుని తెరకెక్కించి ప్రేమ కథా చిత్రం. హాస్యానికి పెద్దపీట వేశాం. నేటి యూత్‌కు కావాల్సిన ప్రతి అంశాన్ని చూపించాం. త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. కర్ణాటక, పాండిచ్చేరిలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
జరుగుమల్లి (సింగరాయకొండ): అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ కిందికి దిగేశారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మోజో ట్రావెల్స్ బస్సు(స్లీపర్) 25 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతోంది. బస్సు వెనుక భాగంలో ఉన్న సిగ్నల్ లైట్స్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు, ఏసీ కేబుల్స్ కలిసి ఉండటంతో షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ లక్ష్మణ్.. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్లో ఆపివేశాడు. ప్రయాణికులను కిందకు దించి మంటలపై బకెట్‌తో నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశా డు. అయినప్పటికీ మంటలు తగ్గకపోగా, కాసేపట్లోనే బస్సు మొత్తం వ్యాí³ంచాయి. అప్పటికే ప్రయాణికులంతా కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌తో అక్కడకు చేరుకుని మంటలనార్పారు. అయితే బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికుల లగేజీ మొత్తం కాలిపోయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ రంగనాథ్ తెలిపారు. -
మౌనిక మృతి.. ‘బయటకెళ్తే ఇంటికొస్తారనే నమ్మకం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం చిన్నారి మౌనిక మ్యాన్‌హోల్‌లో పడిపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదే క్రమంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు.. కళాసిగూడ ఘటనలో జీహెచ్ఎంసీ చర్యలకు సిద్దమైంది. వర్క్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ విధించింది. ఇక, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, చిన్నారి మృతిపై బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మౌనిక మృతికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణం. కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సరిగా బిల్లులు ఇవ్వడం లేదు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రోడ్లు తవ్వినప్పుడు కనీసం జాగ్రత్తలు పాటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు’ అంటూ విమర్శలు గుప్పించారు మరోవైపు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ పైన మెరుగు.. లోపల మురుగు. బయటకు వెళ్లినవారు ఇంటికొస్తారనే నమ్మకం లేదు. చిన్నారి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: Hyderabad Rains: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి -
కర్నాటక: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత.. ఎన్నికలపై ఎఫెక్ట్?
బెంగళూరు: కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ సీనియర్ నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను టార్గెట్ చేస్తూ వారికే టికెట్స్ ఇస్తున్నాయి. ఇక, బీజేపీ ఇప్పటికే పలువురు సీనియర్లను కాదని కొత్తగా 52 మందిని బరిలోకి దింపింది. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. దీంతో, బీజేపీ సీనియర్లు.. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీ.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా సమక్షంలో సవాదీ.. హస్తం పార్టీలో చేరారు. ఇక, కాంగ్రెస్‌లో చేరిక అనంతరం.. కాంగ్రెస్ అతడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపనున్నట్టు తెలిపింది. దీంతో, ఆయన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ సవాదీ అథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. Former BJP leader & former Karnataka Deputy CM Laxman Savadi has joined Congress today, says State Congress president DK Shivakumar, in Bengaluru Laxman Savadi on April 12 resigned as Legislative Council member & from the primary membership of the BJP after losing the Athani… pic.twitter.com/B9feGbSFb9 — ANI (@ANI) April 14, 2023 మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రఘు అచర్.. జేడీఎస్‌లో చేరారు. జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆధర్యంలో ఆయన జేడీఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, కర్నాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. Karnataka | Former MLC and Congress leader Raghu Achar joins JD(S), in the presence of party leader HD Kumaraswamy. pic.twitter.com/rTgVTslJMf — ANI (@ANI) April 14, 2023 -
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే, ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ఉన్నారు. ఇక, లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా నియామకం అయ్యారు. -
కర్ణాటక బీజేపీలో ముసలం
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. పలువురు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదీ బుధవారం తన రాజీనామా ప్రకటించారు. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఆత్మగౌవరం ఉన్న రాజకీయ నేతను. టికెట్ కోసం గిన్నె పట్టుకుని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి అడుక్కోలేను. ఎవరి ప్రభావం నా మీద లేదు. నా నిర్ణయం నేనే తీసుకున్నా అంటూ లక్ష్మణ్ సవాదీ బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఇక ఆయన కాంగ్రెస్‌లోకి మారతారనే ప్రచారం ఊపందుకోగా.. కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ స్పందించారు. ఆయన(లక్ష్మణ్) మాతో టచ్‌లో లేడు. ఆయనతో మేం మాట్లాడనూ లేదు అని శివకుమార్ తెలిపారు. లక్ష్మణ్ సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. అయితే.. 2012లో అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడి.. వివాదంలో చిక్కుకున్నారాయన. మరోవైపు బీజేపీ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. టికెట్లు రావనే పార్టీ అధిష్టానం స్పష్టత నడుమ.. మంగళవారం ఆ పార్టీ సీనియర్ నేత ఈశ్వరప్ప ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించుకున్నారు. అలాగే.. మాజీ సీఎం జగదీస్ షెట్టర్‌కు ఊహించినట్లుగానే మొదటి లిస్ట్‌లో చోటు దక్కకపోగా.. ఆయన సైతం వ్యతిరేక గళం వినిపించారు. రెండో లిస్ట్‌లో చోటు దక్కకపోతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్తానంటూ ప్రకటించారాయన. ఇదే బాటలో మరో 30 మంది నేతలు ఉన్నట్లు సమాచారం. -
ఏం జరిగింది జీ.. సంజయ్ అరెస్ట్‌పై జేపీ నడ్డా ఆరా!
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. సంజయ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ అరెస్ట్‌పై వివరాలు అడిగి తెలుసుకుంటోంది. సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఎందుకు అరెస్ట్ చేశారో బీజేపీ నేత రామచందర్రావుకి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?. కుట్రపూరితంగానే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పూర్తిగా కొరవడింది. ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడుతున్నారు. పేపర్ లీకేజీల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకే అక్రమ అరెస్ట్‌లు. టెన్త్ పేపర్ లీకేజీలో తప్పు ఎక్కడుందో తేల్చాలి. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సంజయ్‌ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడుతాం. పోలీసులు చట్టపరంగా వ్యవహరించాలి. తాటాకు చప్పుళ్లకు మేం భయపడం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డికి మరో గౌరవం దక్కింది. రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే, రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండే ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో డాక్టర్ కె.లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. -
తెలంగాణలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
-
కోమటిరెడ్డికి అదిరిపోయే కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా స్పందించి పొలిటికల్ కౌంటర్ ఇస్తున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కాగా, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు. వారు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీని గెలిపించమని.. బీజేపీలో కాంగ్రెస్‌ను గెలిపించమని వ్యాఖ్యలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ కూడా స్పందించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్లు పొత్తుల కోసం చూస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయింది. ఎవరైనా గెలుస్తామని చెప్తారు. కానీ, కాంగ్రెస్ ఓడిపోతామని చెబుతున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా యాత్ర ఎందుకు చేస్తున్నారు?. ఎన్నికలకు ముందు ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందుకే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది. కేసీఆర్ ఇంకా.. ఈటల రాజేందర్ తన మనిషే అనుకుంటున్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తాయి. వీళ్లందరూ దండుపాళ్యం బ్యాచ్ అని సంచలన కామెంట్స్ చేశారు.’ అని అన్నారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు.. కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కలలు కనేది.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది. కుటుంబ పాలన, అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్ఎస్ ప్రభుత్వానిది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధిస్తుంది. -
‘కౌంటింగ్‌లో ఇంత గోప్యత ఎందుకు.. మునుగోడులో ఏం జరుగుతోంది?’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ ఆలస్యంపై టీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. కౌంటింగ్‌లో ఇంత గోప్యత ఎందుకు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఈవో వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు. ఒకేసారి 4 రౌండ్లు ఎందుకు అప్డేట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఈసీవో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్ బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమేనన్నారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే.. ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి?: రఘునందన్‌రావు ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. -
‘కేటీఆర్.. ఆర్ఎస్ఎస్ ముందు మీరెంత, మీ స్థాయి ఎంత?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రెండు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో, మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నువ్వు మోహన్ భగవత్ కాలిగోటికి కూడా సరిపోవు. భగవత్ సాహసాలకు కేసీఆర్, ఆయన కుటుంబం ఏమాత్రం సరితూగరు. ఆర్ఎస్ఎస్ ముందు మీరెంత.. మీ స్థాయి ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకు ముందు మంత్రి కేటీఆర్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ భగవత్ ఎవరూ అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. ఆయన ఎప్పుడైనా కౌన్సిలర్ గానైనా గెలిచారా అంటూ వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. ముస్లింలను వేరు చేసే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. -
తెలంగాణలో ఒంటరి పోరే అంటున్న కమలదళం
-
విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. ఈ మేరకు విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో మాట్లాడటానికి నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగండి. నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి. నేను ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా. లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు. నాకేం అర్థం కాలేదు. నా సేవలను ఏవిధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాలి. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని విజయశాంతి అన్నారు. చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్) -
ఈ గౌరవం ప్రతీ కార్యకర్తది
ముషీరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా తనను నియమించడం ప్రతి కార్యకర్తకూ దక్కిన గౌరవంగా భావిస్తానని, కార్యకర్తలను గౌరవించే సంస్కృతి బీజేపీలోనే ఉందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నామినేషన్ వేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు బయలుదేరి వెళ్లేముందు మంగళవారం తెల్లవారుజామున ఆశోక్‌నగర్‌లోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి లక్నో బయలుదేరి రావాలని, రాజ్యసభ సభ్యుడిగా పార్టీ మిమ్మల్ని నియమించిందని చెప్పడంతో తాను మొదట ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. తన మీద నమ్మకం ఉంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు జె.పి.నడ్డా, కార్యదర్శి సంతోష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం నుంచి ఒక తెలుగువాడికి అవకాశం దక్కడం ఇదే మొదటిసారని ఆనందం వ్యక్తం చేశారు. ఎటువంటి రాజకీయ నేపధ్యం లేని కుటుం బం నుంచి వచ్చిన తనకు ఇంతటి అవకాశాలు కల్పించడం కార్యకర్తలందరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తన పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచిన విధంగానే పార్టీ గౌరవాన్ని పెంచుతానన్నారు. తెలంగాణను, రాజకీయ భిక్ష పెట్టిన ముషీరాబాద్ ప్రజలను, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. లక్నోలో నామినేషన్ దాఖలు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మంగళవారం రాజ్యసభ అభ్యర్థిగా లక్నోలో నామినేషనల్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్, సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని 11 రాజ్యసభ సీట్లకు నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారమే గడువు. దీంతో లక్ష్మణ్‌సహా 8 మంది బీజేపీ అభ్యర్థులు లక్ష్మీకాంత్ వాజ్‌పేయి, మిథిలేశ్ కుమార్, రాధామోహన్ దాస్ అగర్వాల్, సురేంద్ర సింగ్ నాగర్, బాబూరామ్ నిషాద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎనిమిది మంది ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి. -
మోదీని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు: బీజేపీ లక్ష్మణ్
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్తో ఎన్నికల వ్యూహకర్త చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని మోదీని మూడో సారి అధికారంలోకి రానివ్వకూడదని పీకే(ప్రశాంత్ కిషోర్) లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ బి టీం. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలవి చీకటి ఒప్పందాలు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రధాని మోదీని ఏమీ చేయలేరు. మూడో సారి కూడా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నించారు. పీకేతో భేటీ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. పీకే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్‌తో కేసీఆర్ పనిచేయబోతున్నారు. పీకే, కేసీఆర్ వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. తెలంగాణ ప్రజలు నమ్మరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. టీఆర్ఎస్కు ఎవరు ప్రత్యర్థి అనే విషయం ప్రజలకు తేలియదా..? బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు.’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ -
5 రాష్ట్రాల ఫలితాలతో కేసీఆర్ కుంగుబాటు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ భయపడిపోయారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అందుకే అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారని విమర్శించారు. మోదీ సర్కార్‌పై విమర్శలకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకున్నారన్నారు. బుధవారం పార్టీ నాయకులు జయశ్రీ,, కొల్లి మాధవి, జె.సంగప్ప, ఎన్వీ సుభాష్‌లతో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సమావేశాలుగా సాగాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని అసెంబ్లీలో మరోసారి స్పష్టమైందన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బీజేపీపైనే విమర్శలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పూర్తిగా కబ్జా చేయడంతో రాష్ట్రం నుంచి ఆ పార్టీ కనుమరుగు కానుందన్నారు. -
చారిత్రక.. అభివృద్ధి కారక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ చారిత్రక.. అభివృద్ధి కారక.. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. తాయిలాలతో ఎన్నికల బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు చెబుతూ వచ్చారని, అందరి అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ పటాపంచలు చేసిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో హైప్ కోసమే బడ్జెట్ ప్రవేశ పెడతారని.. అంతా డొల్ల అని వ్యాఖ్యానించారు. ఎన్నికల విశ్లేషకుడు పీకే డైరెక్షన్లో బడ్జెట్ ప్రసంగం ముగియక ముందే స్క్రిప్ట్ తయారు చేసుకుని సీఎం కేసీఆర్ కూనిరాగాలు తీశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాదిరిగా ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించి బీజేపీ మోసం చేయదన్నారు. పన్నుల భారం పడకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారని, పన్నులను పెంచకుండా రూ.5 లక్షల కోట్లకు పైగా అదనపు బడ్జెట్ పెట్టడం విశేష మన్నారు. -
41–ఎ దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: నేర విచారణ చట్టం (సీఆర్పీసీ) సెక్షన్ 41–ఎను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టుల న్యాయవాదుల సంఘం సహాయ కార్యదర్శి జక్కుల లక్ష్మణ్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ (నల్సా)ను ఆదేశించారు. స్పందించిన నల్సా..లక్ష్మణ్ లేఖపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పి.నవీన్‌రావు నేతృత్వంలోని సంస్థ త్వరలోనే సమావేశమై తగిన నిర్ణయం తీసుకోనుంది. ‘కొన్నేళ్లుగా నేను కేంద్ర ప్రభుత్వంతోపాటు పలుమార్లు సుప్రీంకోర్టుకు లేఖ రాసినా స్పందన లేదు. 41–ఎను అడ్డుపెట్టుకొని పోలీసులు నిందితులను వేధిస్తున్నారు. లంచం ఇస్తే స్టేషన్లోనే బెయిల్ ఇస్తున్నారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను జతచేస్తూ గత ఆగస్టు 26న సీజేఐకి రాసిన లేఖకు ఇంత త్వరగా స్పందన వస్తుందని అనుకోలేదు. సీజేఐకి కృతజ్ఞతలు’అని లక్ష్మణ్ మీడియాతో పేర్కొన్నారు. -
హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైందని, మెజారిటీ ఎంత వస్తుందన్న దే ఇప్పుడు తేలాల్సి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయనతోపాటు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు ఖాయమని జోస్యం చెప్పారు. ఓబీసీల సంక్షే మం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఈ నెల 22న ఢిల్లీలో ఓబీసీ మేధావుల సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మణ్ వివరించారు. -
‘బుల్లెట్టు బండి’ పాట సరికొత్త రికార్డ్
వెబ్ ప్రత్యేకం: తెలంగాణ యాసలో ఓ అమ్మాయి పెళ్లిపై పెట్టుకున్న ఆశలను ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాట కళ్లకు కట్టేలా ఉంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట లేనిది ఏ వేడుక కూడా జరగడం లేదు. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్లో చేరిపోయింది. అత్యధిక వ్యూస్ పొందిన జానపద పాటగా నిలిచింది. చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో ఎస్కే బాజి సంగీతం అందించిన ఈ పాట ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లేందుకు ఎలాంటి ఆశలు.. ఊసులు పెంచుకుని ఉంటుందో ఈ పాటలో ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆడవారినే కాక పురుషులను కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో మరింత వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉండే ప్రతి చోటకు వెళ్లింది. తాజాగా ఆ పాట వంద మిలియన్ల క్లబ్లో చేరింది. పది కోట్ల మందికి పైగా ఆ పాటను విని ఎంజాయ్ చేశారు. ఇది ఒక్క యూట్యూబ్‌లోనే. మిగతా సోషల్ మీడియాలను పరిగణనలోకి తీసుకుంటే వ్యూస్ భారీగా ఉంటాయి. వంద మిలియన్లు దాటడంపై గాయని మోహన భోగరాజు స్పందిస్తూ.. ‘నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని పోస్టు చేసింది. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు -
‘సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణం’
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అమరుల ఆత్మకు శాంతి కలిగేలా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు. -
బీసీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలపై ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాదిరిగా రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్పించి బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ సంగమ్‌లాల్ గుప్తా నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కపిల్, ధోని, గవాస్కర్లతో వాళ్లను పోల్చకండి..
హైదరాబాద్: టీమిండియా యువ ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజాలతో పోల్చకండని విజ్ఞప్తి చేశాడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్. భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను కపిల్‌తో పోలుస్తూ.. విశ్లేషకులు చేసే రచ్చను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. చరిత్రలో ఒకే కపిల్, ఒకే ధోని, ఒకే గవాస్కర్ ఉంటారని, అలాంటి దిగ్గజాలను యువ ఆటగాళ్లను పోల్చడం వల్ల యువకులపై ఒత్తిడి పెరిగిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. కపిల్, తన జమానాలో వికెట్లు తీస్తూ... భారీగా పరుగుల చేస్తూ నిఖార్సైన ఆల్‌రౌండర్ పాత్రను పోషించాడని... ఈ జనరేషన్లో హార్ధిక్ కూడా అసలుసిసలైన ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయగల సమర్ధుడని అంటూనే ఇద్దరిని పోల్చడం సరికాదని పేర్కొన్నాడు. కపిల్ క్రికెట్ ఆడిన రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత పని భారం ఉండేది కాదని, ఆ పని భారం కారణంగానే నేటి తరంలో అసలుసిసలైన ఆల్‌రౌండర్లు తయారు కాలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కపిల్ మేటి ఆల్‌రౌండర్‌గా కొనసాగాడని, ప్రస్తుత తరంలో ఆల్‌రౌండర్‌గా కొనసాగడం చాలా కష్టమని ఆయన వెల్లడించాడు. భారత జట్టు మూడు ఫార్మాట్లలో నిర్విరామంగా క్రికెట్ ఆడటాన్ని ఆయన తప్పుపట్టాడు. అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగే శక్తి సామర్థ్యాలున్న ఓ ఆటగాడు గాయంబారిన పడటంతో అతడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చిందని హార్ధిక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేరాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్‌ను ఆడించాలని ఆయన సూచించాడు. సంజూ సామ్సన్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కీపింగ్ చేస్తూ ఎంత బాగా ఆడినా ప్రపంచకప్‌లో మాత్రం పంత్‌నే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: ఒక్క ఓవర్ పొదుపుగా బౌల్ చేయాల్సింది.. కేకేఆర్ ఓటమికి నేనే కారణం -
‘అసలు ప్రగతిని డిసెంబర్ 4న చూపిస్తారు’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ విడుదల చేసిన ప్రగతి నివేదికను ప్రచార నివేదికగా అభివర్ణించారు. ఆ నివేదికలో గతకుల రోడ్లు, డంపింగ్ యార్డులు లేవని ఎద్దేవా చేశారు.(చదవండి: జనం లేని సేన.. జనసేన: నిరంజన్‌రెడ్డి) ‘‘ కేసీఆర్, కేటీఆర్ పడవలు తిప్పిన బొమ్మలు. బోల్తాపడ్డ కార్లు, ఫుడ్ బోర్డు ప్రయాణం బొమ్మలు లేవు. 2600 బస్తీలు నీట మునిగాయి. హైదరాబాద్‌కే 2600 చెరువులు తీసుకుని వచ్చిన ఖ్యాతి హరీశ్‌రావుది. కల్వకుంట్ల కుటుంబ ప్రగతి తప్పితే ప్రజల ప్రగతి లేదు. అసలు ప్రగతిని డిసెంబర్ 4న ప్రజలు చూపిస్తారు. హైదరాబాద్ ప్రజలు పన్నులు కడితే మీరు గతుకుల రోడ్లు, పడవలు ఇస్తున్నారు. విశ్వనగరాన్ని భ్రష్టు పట్టించారని’’ లక్ష్మణ్ దుయ్యబట్టారు. (చదవండి:టీఆర్ఎస్ భయపడుతుంది: బండి సంజయ్) డ్రగ్ మాఫియాను కట్టడి లేదు. మద్యం అమ్మకాలకు అర్ధరాత్రి వరకు అనుమతులిచ్చారు డ్రగ్ కల్చర్‌తో అనేక మంది అమ్మాయిలు బలవుతున్నారు. ప్రజారవాణాను నిర్వీర్యం చేశారు. కార్మికులు ఆతహత్యలు చేసుకున్నా పట్టడం లేదు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి గా మార్చారు. నగరంలో యువత ఉపాధి ని నిర్వీర్యం చేశారు. చార్జిషీట్లో టీఆర్ఎస్ అవినీతి ని బట్టబయలు చేస్తామని’’ తెలిపారు. రానున్న రోజుల్లో అనేక మంది ప్రముఖులు, ఉద్యమకారులను బీజేపీ గొడుగు కిందకు తెస్తామని పేర్కొన్నారు. ‘టీఆర్ఎస్లో కేకే అధ్యక్షుడు అవుతాడా.. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతావా’ అంటూ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ
-
లక్ష్మణ్‌కు అమిత్‌షా శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె. లక్ష్మణ్‌కు హోంమంత్రి అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కనీసం ప్రగతి భవన్ కూడా దాటని సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బీసీలు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదిగినట్టు తెలిపారు. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది.. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ నుంచి ఇద్దరికి పార్టీలో కీలక పదవులు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, వారిని గద్దె దించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. -
మీ నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణసంకటం
రాజు నిరంకుశుడైతే ప్రజలు ఎంత దీన స్థితిలో జీవించాల్సి వస్తుందో కేసీఆర్‌ను చూసి తెలుసుకోవచ్చు. మహాభారతంలో శకునికి మంత్రి కణికుడు కొన్ని రాజధర్మాలు చెప్పాడు. వాటిని ‘కణిక రాజనీతి’ అంటారు. దుర్మార్గు డైన రాజు తన పరిపాలన కన్నా తనను వ్యతి రేకించేవారి ఆనుపానులు పసిగట్టి పాలించ డమే గొప్పగా భావిస్తాడని కణికుడు చెప్తాడు. ఇలాంటి ‘కణికరాజనీతి’ని అమలు చేస్తున్న కేసీఆర్ నిర్లక్ష్య పాలన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. మొదటి నుండి కరోనా టెస్టులు, కేసులు తక్కువగా చేస్తూ, చూపిస్తూ లాక్డౌన్ సమయం గడిపేసిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. లాక్డౌన్ తర్వాత ఎలాంటి వ్యూహం లేకుండా ప్రజలను గాలికి వదిలేశారు. హైదరా బాద్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యింది. ప్రజలే స్వచ్ఛందంగా తమకుతామే ‘లాక్డౌన్’ విధించు కునే స్థితి వచ్చింది. చేసిన కొద్ది మాత్రం టెస్టులకే రోజూ వస్తోన్న పాజిటివ్ కేసులు 2 వేల వరకు ఉంటున్నాయి. మరణాల సంఖ్య విప రీతంగా పెరుగుతున్నది. గాంధీలో వైద్యం సరిగ్గా అందక వీడియోలు పెట్టి మరీ చచ్చిపోతున్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల దారుణ మైన బిల్లులకు, నిర్లక్ష్య చికిత్సలకు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఓ దశలో గవర్నరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కొత్త సచి వాలయ నిర్మాణం కోసం ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా చేసేందుకు ఉన్న సచివాలయం కూలగొట్టే పనికి కేసీఆర్ పూనుకొన్నాడు. మరోవైపు చికిత్స కోసం లక్షల రూపాయలు చికిత్స కోసం చెల్లించలేక పేద, మధ్యతరగతి వర్గాలు తమ ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ మాత్రం ఇటు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చరు. అటు కరోనాకు ఉచిత చికిత్స అందిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను రాష్ట్రంలో అమలు చేయరు. కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్ధం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారి యర్స్‌కు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యా చేపట్టడం లేదు. ఎందరో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టులు కరోనా బారినపడి చస్తున్నా కేసీఆర్‌కు చీమకుట్టినట్టయినా లేదు. ఆరేళ్ల నుండి విద్య, వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ఈ ప్రభుత్వం పనితనంలోని ‘డొల్లతనం’ ఇప్పుడు బయటపడుతున్నది. ప్రైవేటు స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు, కాలేజీ లెక్చరర్లు గత నాలుగు నెలల నుండి జీతాల్లేక వ్యవసాయ పొలాల్లో, ఉపాధిహామీ పథకంలో కూలీలుగా, అడ్డా కూలీలుగా మారడం ఈ రాష్ట్ర దుస్థితి తెలియజేస్తున్నది. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు మాత్రం ఇలాంటి దుర్భర ఆర్థిక పరిస్థితిలో కూడా ఆన్లైన్ క్లాసుల పేరిట తల్లిదండ్రుల నుండి వేలకు వేలు గుంజుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షానికే హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా లోని పట్టణాలు, గ్రామాల్లో లింక్ రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ‘భూప్రక్షాళన’ పేరుతో రైతుల భూములు కిందామీద అయి పోయి అక్కడ పెద్ద అవినీతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రెవెన్యూ ఆఫీసుల ముందే రైతులు పురుగులమందు తాగడం, బైఠా యించడం రోజుకో జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలో ఓ ఎంపీ ప్రెస్‌మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా లేదు. ఇటీవల మా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడే ఉదాహరణ. రాష్ట్ర సాధనకు పోరాడిన ఉద్యో గుల పట్ల సీఎం కేసీఆర్ ఉదాసీన వైఖరి వాళ్లలో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతున్నది. రాష్ట్రంలో అప్పుల భారం పెంచేసి వైపరీత్యా లను ఎదుర్కొనే స్థితి కూడా లేకుండా చేయడం సీఎం అసమర్థ పాల నకు నిదర్శనం. ఈ పాపాలన్నీ మీ అధికారాన్ని దగ్ధం చేయడంతో పాటు అహంకారాన్ని ధ్వంసం చేస్తాయ్, జాగ్రత్త! వ్యాసకర్త డాక్టర్ కె. లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు -
'సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు.. అందుకే'
సాక్షి, హైదరాబాద్ : ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి వివరిద్దామంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదు.. అందుకే లేఖలు రాయాలని నిర్ణయించినట్లు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్యాం ప్రసాద్ ముఖర్జీ. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ క్లిష్టమైన ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్‌ను దేశంలో విలీనం చేశారు. అలాగే కరోనా మహమ్మారిని ప్రధాని మోదీ విజయవంతంగా ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. (‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’) తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నియంతలా పాలిస్తున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారింది. విపక్ష పార్టీలు చెప్పే సూచనలను పెడచెవిన పెడుతున్నారు. కరోనా గురించి మాట్లాడితే అధికార పక్షం ఎదురు దాడి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆఖరికి శవాల విషయం కూడా గందరగోళం నెలకొంది. ఈ విషయమై నేను సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తాను. దీన్ని ఒక విమర్శలా కాకుండా.. మంచి పద్దతిలో స్వీకరించాలి. ప్రభుత్వం చేస్తున్న కరోనా పరీక్షల్లో ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తోంది. లాక్డౌన్ సమయంలోనే ఎక్కువ టెస్టులు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది' అంటూ పేర్కొన్నారు. -
సీఎంను కలుస్తామంటే అరెస్టులా..?
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించిన బీజేపీ ప్రతినిధి బృందాన్ని శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితులను వివరించడానికి బీజేపీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. అయితే సీఎంను కలవడానికి అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో బీజేపీ నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కూడిన బృందం నేరుగా ప్రగతి భవన్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించి బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తుగా ప్రగతి భవన్‌కు వెళ్లే అన్ని దారుల్లోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హౌస్ అరెస్ట్‌లపై బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంను కలుస్తామంటే అనుమతివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణం. రాష్ట్రంలో పాలన ఉందా..? అంటూ ప్రశ్నించారు. కరోనా పరీక్షలు దేశంలోనే అత్యల్పంగా తెలంగాణలో జరగడం దారుణం. గాంధీలో కరోనా రోగులకు కనీస వసతులు కూడా లేవు. గాంధీ వెళ్లే కంటే స్మశానానికి వెళ్లడం మంచిదనే భావన కలుగుతోంది. చనిపోయిన శవాలను కూడా సరిగా ఇవ్వడం లేదంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం పరిపాటిగా మారింది. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా..? ఆర్టికల్ 370 లాంటిది తెలంగాణలో అమలు జరుగుతోందా..? అంటూ మండిపడ్డారు. చదవండి: వారిని స్వదేశానికి తీసుకురండి డెత్ రేట్ దేశ సగటుకంటే తెలంగాణలో అధికంగా ఉంది. గచ్చిబౌలి టిమ్స్ ఏమైంది. ప్రస్తుతం అందులో పిల్లలు క్రికెట ఆడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ చార్జీలను రద్దు చేసి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాశాము. ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపించాలని లేఖలో కోరాము. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ' బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. చదవండి: గాంధీలో మళ్లీ అదే సీన్ -
జేబుల్లోకి రావట్లేదన్న బాధతో కేసీఆర్ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలోని డబ్బులు నేరుగా తన జేబులోకి రావట్లేదన్న దుగ్దతోనే సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కనీసం సెక్రటేరియట్‌కు రాకుండా, మంత్రులు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకుండా, నియంతృత్వంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. -
‘ఆరేళ్లుగా వారి ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో వయసుతో సంబంధం లేకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి తలెత్తిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలని.. వారు తలుచుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని పిలుపునిచ్చారు. బుధవారం లక్ష్మణ్ మీడియా ముందు మాట్లాడుతూ.. కేసీఆర్ బాహుబలి అయితే.. కేసీఆర్‌కు మించిన బ్రహ్మస్త్రం మోదీని ప్రయోగిస్తామని.. తెలంగాణ ప్రభుత్వ పునాదులు కదిలిస్తామని సవాల్ విసిరారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ భజనతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో రాళ్లదాడులు చేసిన వారు ఇప్పుడు కేబినెట్లో ఉన్నారని, హాకి స్టిక్కులు పట్టుకుని పరిగెత్తించే ప్రయత్నం చేసిన వారు కూడా ప్రభుత్వంలో చేరిపోయారని దుయ్యబట్టారు. (ముస్లింలకు స్వేచ్ఛ భారత్‌లోనే..) తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసినా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్, హరీష్‌రావును తరిమేస్తుంటే ఉద్యోగులు అడ్డుపడ్డారని, ఆరేళ్లుగా ఉద్యోగులు ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా ఎదుగుతుందని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రశ్నించినా సస్పెండ్లు చేయడం.. ఏసీబీ దాడులు చేయించి జైళ్లకు పంపడం కామన్‌గా మారిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తే ఉద్యోగ సంఘాల నేతలను, ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ్యత ప్రభుత్వానిదేనని, అవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. (ఎంఐఎంను ఎందుకు కట్టడి చేయట్లేదు?) ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిందని, రాష్ట్రపతి నివేదిక కోరిన తర్వాత చేసిన తప్పులను దిద్దులకునే ప్రయత్నం చేసిందని అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ సాధించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఉద్యోగులు ముఖ్యమంత్రిని నమ్ముతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు డీఎస్సీ వేయలేదని, పరీక్షలు రాసిన వారికి నియామక పత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో 21 శాతం ఐఆర్ ఇచ్చిందని, ఉద్యోగ నిమామకాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని ప్రస్తవించారు. తెలంగాణలో మాత్రం ఒక్క నోటిషికేషన్ ఇవ్వలేదని, నేటికి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వందల కోట్ల తో సచివాలయం.. అసెంబ్లీ నిర్మాణం చేపట్టేందుకు చూస్తున్న కేసీఆర్.. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేక పోతున్నారని ప్రశ్నించారు.గడీల పాలన బద్దలు కొట్టి గరిబీ పాలన తెస్తామని లక్ష్మణ్ తెలిపారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం హాట్ టాపిక్‌గా మారింది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు రాబోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు అంటే ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌నే కొనసాగిస్తారా? లేదా అధ్యక్ష పదవి ఆశిస్తున్న బండి సంజయ్‌కి ఇస్తారా? అన్న చర్చ జోరందుకుంది. దీనిపై లక్ష్మణ్‌ను వివరణ కోరగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని జాతీయ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు పార్టీకి పూర్తి స్థాయి సమయం వెచ్చించే అవకాశం లక్ష్మణ్‌కే ఉన్నందున ఆయనకే ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సంజయ్‌కి ఇస్తే ఎంపీగా నియోజకవర్గంపై దృష్టి సారించడం కష్టమవుతుందని, కరీంనగర్లో టీఆర్ఎస్ను, మంత్రులను ఎదుర్కొనే సత్తా ఉన్న నేత జిల్లో లేకుండా పోతారని, పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి సారించే పరిస్థితి ఉండదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ కనుక హిందుత్వ ఎజెండాను మాత్రమే ప్రధానంగా తీసుకుంటే సంజయ్‌కే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇటు మాజీ మంత్రి డీకే అరుణ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఆమె తన ప్రయత్నాలు ముమ్మ రంచేశారు. ఈ ముగ్గురిలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారన్నది పది రోజుల్లోగా తేలనుంది. మరోవైపు వచ్చే వారం రోజుల్లో 25 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని, ఆ కసరత్తు సాగుతోందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు -
తెలంగాణ, ఏపీకి బీజేపీ కొత్త అధ్యక్షులు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లకు బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు చెప్పారు. ‘తెలంగాణ, ఏపీలో బీజేపీ ద్విగుణీకృతమైన ఉత్సా హంతో ముందుకు సాగే అవకాశం ఉంది. మొన్న జరిగిన తెలంగాణ మున్సి పల్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడమే కాకుండా.. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీనే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని స్పష్ట మైన సంకేతాలు వెలువడ్డాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా తొందరగా మార్పులు వచ్చే అవకాశం ఉంది..’అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన అనంతరం విద్యాసాగర్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఏఏతో నష్టం లేకున్నా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. ‘సీఏఏలో ఎలాంటి నష్టదాయక చర్యలు లేకున్నప్పటికీ దానిపై తుపాకీ పెట్టి నరేంద్రమోదీ, బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏపై మజ్లిస్, టీఆర్ఎస్ల ఆలోచన ప్రమాదకరమైనది. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయి. వీటిని అణచాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాం. ముస్లిం సోదరుల పౌరసత్వం తిరస్కరణకు గురవుతుందన్న ఆలోచన సరికాదు. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే హోంశాఖ ఇస్తుంది. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతికి పౌరసత్వం ఇచ్చాను. అందువల్ల మీ ఆలోచన సరికాదు. జాతి సమైక్యతకు ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అవసరం ఎంతో ఉంది. ముస్లిం యువత జాతీయ జెండాలతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమన ఆలపించి కార్యక్రమాన్ని ముగించగలరా..? తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తాం. సెప్టెంబర్ 17కు సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా అమలు చేయాలని నిరసనలు చేపడతాం..’అని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు అమలు చేస్తాను..’అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
పీఆర్సీ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను వంచించిన కేసీఆర్, ఇప్పుడు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదా మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే పీఆర్సీ అంటూ ఉద్యోగులను మభ్య పెడుతున్నారని మండి పడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల పాలనలో ఒక్క గ్రూప్–1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికలు వస్తే మాత్రం రైతులు, ఉద్యోగులు, పీఆర్సీ గుర్తుకు వస్తుందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల సమయంలో త్వరలోనే పీఆర్సీపై మాట్లాడదామని మభ్యపెట్టారన్నారు. ఉద్యోగ సంఘం నాయకులకు భోజనం పెట్టి, ఉద్యోగుల కడుపు కొట్టారన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని, ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను దగా చేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా ఉండి సాధారణ ఉద్యోగుల ప్రయోజనాలు పక్కనబెట్టి కొంతమంది ప్రజా ప్రతిని«ధులు, మంత్రులు అయ్యారన్నారు. ఆర్టీసీ విషయంలోనూ ఉద్యోగుల్లో విభేదాలు సృష్టించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు ఎప్పుడో ఐఆర్ ఇచ్చారని, తెలంగాణలో మాత్రం దిక్కు లేకుండాపోయిందన్నారు. పీఆర్సీ గడువును మూడుసార్లు పెంచి ఉద్యోగులను ఆవేదనకు గురి చేస్తున్నారన్నారు. పీఆర్సీ గడువు పొడగింపు జీవో 447ను వెంటనే రద్దు చేసి, పీఆర్సీ ప్రకటించాలన్నారు. లేదంటే ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలు బహిర్గతం చేసేందుకే.. టీఆర్ఎస్ మజ్లిస్‌తో కుమ్మక్కై మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఒవైసీ వద్ద కేసీఆర్ మోకరిల్లి ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారన్నారు. సీఏఏ భారతీయులెవరికీ వ్యతిరేకం కాదన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలను బహిర్గతం చేసేందుకు, సీఏఏకు అనుకూలంగా మార్చి 15న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, అందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొంటారన్నారు. అనంతరం నార్సింగి సహకార సంఘ ఎన్నికల్లో వైస్ చైర్మన్‌గా గెలిచిన కె.సత్యనారాయణను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, చింతా సాంబమూర్తి, శాంతికుమార్, మోహన్‌రెడ్డి, ఎన్వీ సుభాష్, సుధాకరశర్మ పాల్గొన్నారు. -
భైంసా బాధితులకు సాయమేదీ?
భైంసా(నిర్మల్)/నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల ఘటనలో నష్టపోయిన బాధితులకు రాష్ట్రం తరఫున ఇప్పటివరకు ఏ సాయం అందలేదని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం భైంసాకు వచ్చిన ఆయన అల్లర్ల ప్రభావిత ప్రాంతమైన కోర్భగల్లిలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సోయం బాపూరావు, బండి సం జయ్, ధర్మపురి అర్వింద్‌తోపాటు ఆయన బాధితులను కలిశారు. వారి తో మాట్లాడి సంఘటన, నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనం తరం భైంసాలోని విశ్రాంతి భవనం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భైంసా ఘటనలో 101 మంది రూ.2 కోట్ల 33 లక్షల మేరకు నష్టపోయారన్నారు. భైంసా బాధితుల కోసం తన మూడు నెలల వేతనం ఇస్తానని కిషన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ తరఫున రూ.10 లక్షలు, ఎంపీలు సంజయ్, అర్వింద్ ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కాగా, కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతు ల్లో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్ సమీపంలోని తల్వేద గ్రామశివారులో పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎంఐ ఎంకు వత్తాసు పలుకుతున్న టీఆర్ఎస్పై ప్రజల్లో ద్వేషం పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలకు సమాధి కడతారన్నారు. -
రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీనే అని, ఈ విషయంలో బహిరంగ చర్చకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు బీజేపీ చేరువ అవుతుంటే సహించలేక దివాళా కోరు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిన్నటి వరకు సీఏఏపై కుట్రలు కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మరో అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. మజ్లిస్‌ను తలపై పెట్టుకొని కాంగ్రెస్ పార్టీనే పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచిందన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఉత్తమ్ ధర్నా చేస్తారట.. దాని పూర్వా పరాలు ఆయనకు తెలుసా? అని ప్ర శ్నించారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు కాంగ్రెస్ మరో కుట్ర చేస్తోందనీ, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ల మొసలి కన్నీరు, కపట ప్రేమను ఎవరు విశ్వసించరన్నారు. -
ఆసక్తికరంగా కమల రాజకీయం
సాక్షి, ఆదిలాబాద్: ఇక లక్ష్మణ బాణమే మిగిలింది. జిల్లా బీజేపీలో అంతర్గత కలహాల నేపథ్యంలో సుహాసిని రెడ్డి వర్గం జిల్లా అధ్యక్షుడి వ్యవహారాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడి నేతలు చెప్పిన విషయాలను విన్న ఆయన అటువైపు నుంచి కూడా వివరణ తీసుకొని నిర్ణయం వెళ్లడిస్తామని చెప్పడంతో ఇక మీపైనే భారమంటూ జిల్లా నేతలు తిరుగుబాట పట్టారు. ఇదిలా ఉంటే ఒకవైపు ఓవర్గం నేతలు తనపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర రాజధానికి వెళ్లగా, మరోవైపు పాయల శంకర్ దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీ సోయం బాపురావు, ఇతర నేతలతో కలిసి బీజేపీ ముఖ్యనేతలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏదైన మంత్రాంగం నడిపారా? అనే ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ విషయాలు బయటకు తెలియరాలేదు. జిల్లా నుంచి సుమారు 140 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు కలిసి 25 వాహనాల్లో మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బీజేపీలో రచ్చ: ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా బయల్దేరివెళ్లారు. కాగా సాయంత్రం వీరిలో 73 మంది జిల్లా, మండల పదాధికారులు, గాదిగూడ జెడ్పీటీసీ, బజార్హత్నూర్ ఎంపీపీ, పది మంది ఎంపీటీసీలు, ఓ సర్పంచ్, ఉపసర్పంచ్, ఇతర కార్యకర్తలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. నాంపలి్లలోని బీజేపీ కార్యాలయంలో సాయంత్రం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మోత్కుపల్లి నర్సిములు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్లను జిల్లా నేతలు కలిశారు. ఆదిలాబాద్ జిల్లా పార్టీలో ఒక్కడి చేతిలో నిర్ణయాలు జరుగుతున్నాయని, కోర్ కమిటీ కూర్చోకుండానే బీ–ఫామ్‌ల కేటాయింపు జరుగుతోందని లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఏక వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ ఆఫీసును నామమాత్రం చేశారని వివరించారు. ఎన్నికల సమయంలో సమష్టి నిర్ణయాలు జరగడం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలతోపాటు అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఏక వ్యక్తి నిర్ణయాల కారణంగా పార్టీ అనేక చోట్ల ఓటమి పాలైందదని, లేదంటే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేవని వివరించారు. ఇకనైనా పార్టీని కాపాడాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మంగళవారం ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ఒకవైపు తనపై రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసేందుకు జిల్లానేతలు వెళ్లగా మరోవైపు ఆయన ఢిల్లీలో ఏదైన మంత్రాంగం నడిపారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నా అవి బయటకు రాలేదు. బీజేపీలో జరుగుతున్న ఈ రచ్చ ఆసక్తి కలిగిస్తోంది. ఆదిలాబాద్‌కు వివిధ రైళ్ల పొడిగింపు విషయంలో కేంద్ర మంత్రిని కలిసినా ఢిల్లీలో ఇతర నేతలను కూడా ఆయన కలిశారా.. లేనిపక్షంలో తనపై తిరుగుబాటు చేస్తున్న నేతలకు చెక్ పెట్టేందుకు ఏదైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. -
ఎగువ సభ ఎవరికోసం?
శాసనమండలి నిర్మాణాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని, ఆశయాలను, అధికారాలను పరిశీలిస్తే అది అసలు అవసరమా అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. గత ముప్పది సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక ఉద్యమాలు, కొత్త సామాజిక శక్తులను తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా దళిత ఉద్యమాలు స్త్రీవాద, రైతుకూలీ, వెనుకబడిన కులాల పోరాటాలు రాజకీయ ప్రాతినిధ్యం కోరుతున్నాయి. నిర్మాణపరంగా ప్రస్తుతమున్న శాసనమండలి వీరికి ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రస్తుతమున్న కౌన్సిల్ ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది. షెడ్యూల్డు కులాలు, తెగలవారికి శాసనసభ, లోక్‌సభలలో సముచిత ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించారు. శాసనమండలి విషయంలో అలాంటి రిజర్వేషన్లు ఏవీ లేకపోవడంతో వారికి ఎగువసభలో సముచిత ప్రాతినిధ్యం లభించుటలేదు. మొదటి నుండి ఎగువ సభ ఉన్నత వర్గాలవారికి మాత్రమే అందు బాటులో ఉంది తప్ప దళితులకు, బలహీనవర్గాలకు, మహిళలకు కాదన్నది చారిత్రక సత్యం. రాజ్యాంగం ప్రకారం ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. మరి ఈ ఆశయం ఏ మేరకు నెరవేరుతున్నట్లు అన్నది ప్రశ్న. ఈ ఆశయం నెరవేరా లంటే చరిత్రలో సుదీర్ఘకాలంపాటు అణచి వేతకు, దోపిడీకి గురైన ఎస్.సి, ఎస్.టి, వెనుకబడిన కులాలు మరియు మహిళలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించి వారికి మండలిలో స్థానం కల్పించాల్సివుంది. గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ దిశలో ఎప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టిన ఉదంతాలులేవు. అలాంటప్పుడు దాని కొనసాగింపు ఎవరికోసం, ఎందుకోసం? అన్నది ప్రశ్న. ఎగువసభల ఏర్పాటు విషయంలో ఉన్న చారిత్రక నేపథ్యాలలో ఒకటి అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఈ సభలను ఏర్పాటుచేసి అందులో సమాజంలో మేధావులుగా గుర్తింపబడ్డ పట్టభద్రులు, ఉపాధ్యాయులతోపాటు సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సాంఘికసేవ మొదలైన రాజకీయేతర రంగాలలో నిష్ణాతులైనవారికి ఇందులో ప్రాతినిధ్యం కలి్పస్తే జాతికి వారి సేవలు ఉపయోగపడతా యని. రాష్ట్ర గవర్నర్ ద్వారా నామనిర్దేశ పద్ధ తిలో భర్తీ అయ్యేవారిలో నిష్ణాతులైన అర్హులకు ఏనాడుకూడా అవకాశం లభించలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి పట్టభద్రుడే కానవసరం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి ఉపాధ్యాయుడే కానవసరంలేదు. పోటీకి అందరూ అర్హులే. పోటీకి అర్హులే కానీ వారికి ఓటు హక్కుమాత్రం ఉండదు. ఒక వ్యక్తికి ఓటు హక్కులేకుండా పోటీచేసే హక్కు ఎలా లభిస్తుందో అర్థంకాదు. శాసన నిర్మాణంలో మండలి పాత్ర కేవలం సలహాలివ్వడానికే పరిమితం. ఆ సలహాలను శాసనసభ గౌర వించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. శాసనమండలి తాను ఆమోదించని బిల్లులను చట్టం కాకుండా కేవలం నాలుగు నెలలే జాప్యం చేయగలదు. ఏ బిల్లుకైనా శాసనమండలి ప్రతిపా దించే సవరణలకు సలహాపూర్వకమైన విలువ మాత్రమే ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో ఈ మాత్రం స్వేచ్ఛ, అధికారం కూడా శాసన మండలికి లేదు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు కౌన్సిల్ సభ్యులకు కనీసం ఓటుహక్కు కూడా ఉండదు. అలాంటప్పుడు ఎగువ సభ కొనసాగింపు అవసరమా? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. గత 70 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో ఉనికిలోవున్న ఎగువసభల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అవి క్రమంగా ఏ విధంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా పరిణామం చెందినవో మనకు అర్థం అవుతుంది. ఏ అధికారాలు లేని ఈ ఎగువసభల నిర్వహణకు ప్రజాధనం పెద్దమొత్తంలో దురి్వనియోగం అవుతుంది. క్రమంగా దిగజారుతున్న కౌన్సిల్ ప్రమాణాలను మరియు అది పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాసనసభ ఆ రాష్ట్రంలోని ఎగువసభ రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయం సహేతుకమేకాదు. ముమ్మాటికీ హర్షణీయం.! ప్రొ.జి.లక్ష్మణ్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఓయూ మొబైల్ : 98491 36104 -
కేంద్ర నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్‌తో తాము చర్చకు సిద్ధమని, కేటీఆర్ అందుకు సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. బడ్జెట్ ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. టీమిండియా స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం అనేక ప థకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి ఇతోధికం గా నిధులు మంజూరు చేస్తున్నా కేటీఆర్ గజినీలా మారి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం తెచ్చారో చర్చకు రావాలని కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు మేలుచేసేందుకే: వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేసే పథకాలు ఆయా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకే అన్న స్పృహ కేటీఆర్‌కు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేటీఆర్ జేబులు నింపేందుకో, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు నొక్కేందుకో బడ్జెట్ ఉం డదని ఆయన గ్రహిస్తే మంచిదన్నారు. భారీ ప్రాజెక్టులు, వాటిపై వ చ్చే కమీషన్లు తప్పితే సంపద సృష్టి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి లేదన్నారు. కేసీఆర్ మంత్రిగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం 10 రెట్లు ఎక్కువగా కేంద్ర పన్నులను రాష్ట్రానికి ఇచ్చిందనీ, ప్రత్యేక సహాయం కింద 4 రెట్లు అధికంగా నిధులు అందించిందన్నారు. కాళేశ్వరంపై డీపీఆర్ సమర్పించలేదేం..: విభజన చట్టంలో కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రస్తావనే లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించా లని కేంద్ర ప్రభుత్వం కోరినా ఇంతవరకు ఇవ్వలే దని వెల్లడించారు. డీపీఆర్‌ను సమర్పిస్తే తమ అవి నీతి అక్రమాలన్నీ బయటపడిపోతాయనేది వారి భయమనీ, రూ.లక్ష కోట్ల పనులకు టెండర్లు పిలవకుండా నామినేషన్లపై నంజుకుని తినేశారని ఆరోపించారు. ఆ కమిషన్లతోనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నీతి తుక్కుగుడా, నేరేడు చెర్ల, నిజామాబాద్‌లలో ఎక్కడి పోయిందని లక్ష్మణ్ ప్రశ్నించారు. -
ఇష్టమున్నా.. లేకున్నా.. సీఏఏ అమలు
చార్మినార్/దూద్‌బౌలి: ఎవరికి ఇష్టమున్నా.. లేకున్నా.. దేశంలో సీఏఏ అమలు తప్పకుండా జరుగుతుందని పలువురు వక్తలు స్పష్టం చేశా రు. ఆర్టికల్ 11 ప్రకారం కేంద్రం చేసిన చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా పాటించాల్సిన అవసరముందన్నారు. సీఏఏ చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాలపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించా రు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కావాల ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ భారత్ సంఘర్ష్ సమితి భాగ్యనగర్ కన్వీనర్ ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం కుడా స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ, నగర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, సుప్రీంకోర్టు న్యాయవాది సుభూహీ ఖాన్ తదితరులు పాల్గొని సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. భారత్ మాతాకీ జై.. మోదీ, అమిత్‌షా జిందాబాద్ అంటూ.. తిరంగా జెండాలు పట్టుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కుడాలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలని.. తామే దారుస్సలాంకు వచ్చి డిబేట్ నిర్వహిస్తామని సవాలు విసిరారు. గతంలో బంగ్లాదేశ్‌కు చెందిన తస్లీమా నస్రీన్ నగరానికి వచ్చి ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహిస్తే మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆమెపై విచక్షణారహితంగా దాడులు నిర్వహించారన్నారు. దాడులు చేసిన మజ్లీస్ పార్టీ నాయకులపై ఇప్పటికైనా నగర పోలీసులు కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్ వేయాల్సిన అవసరముందన్నారు. అసదుద్దీన్‌తో చేతులు కలిపిన సీఎం కేసీఆర్.. సీఏఏను తెలంగాణలో అమలు చేయబోమంటూ ప్రకటిస్తున్నారని, అవసరమైతే అసెంబ్లీలో ప్రకటన చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్ల సందర్భంగా ఇంటికి వచ్చే అధికారులు ఎలాంటి పత్రాలు అడగబోరని.. కేవలం 14 ప్రశ్నలకు జవాబులను మాత్రమే సేకరిస్తారన్నారు. కార్యక్రమంలో హిందూ సంఘటన్ అధ్యక్షుడు కరుణసాగర్, కార్పొరేటర్లు ఆలే లలిత నరేంద్ర, రేణు సోనీల, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సభకు హాజరైన ప్రజలు -
సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..
ముషీరాబాద్: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్ డెవలప్మెంట్’సంస్థను లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు. మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు.