ఘటన వివరాలను కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌కు వివరిస్తున్న బాధితురాలు
భైంసా(నిర్మల్)/నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల ఘటనలో నష్టపోయిన బాధితులకు రాష్ట్రం తరఫున ఇప్పటివరకు ఏ సాయం అందలేదని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం భైంసాకు వచ్చిన ఆయన అల్లర్ల ప్రభావిత ప్రాంతమైన కోర్భగల్లిలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సోయం బాపూరావు, బండి సం జయ్, ధర్మపురి అర్వింద్‌తోపాటు ఆయన బాధితులను కలిశారు. వారి తో మాట్లాడి సంఘటన, నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనం తరం భైంసాలోని విశ్రాంతి భవనం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భైంసా ఘటనలో 101 మంది రూ.2 కోట్ల 33 లక్షల మేరకు నష్టపోయారన్నారు.
భైంసా బాధితుల కోసం తన మూడు నెలల వేతనం ఇస్తానని కిషన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ తరఫున రూ.10 లక్షలు, ఎంపీలు సంజయ్, అర్వింద్ ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కాగా, కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతు ల్లో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్ సమీపంలోని తల్వేద గ్రామశివారులో పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎంఐ ఎంకు వత్తాసు పలుకుతున్న టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ద్వేషం పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలకు సమాధి కడతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment