సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. సంజయ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ అరెస్ట్‌పై వివరాలు అడిగి తెలుసుకుంటోంది. సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఎందుకు అరెస్ట్ చేశారో బీజేపీ నేత రామచందర్‌రావుకి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?. కుట్రపూరితంగానే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పూర్తిగా కొరవడింది. ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడుతున్నారు. పేపర్ లీకేజీల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకే అక్రమ అరెస్ట్‌లు. టెన్త్ పేపర్ లీకేజీలో తప్పు ఎక్కడుందో తేల్చాలి. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సంజయ్‌ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడుతాం. పోలీసులు చట్టపరంగా వ్యవహరించాలి. తాటాకు చప్పుళ్లకు మేం భయపడం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment