
హైదరాబాద్: కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మరోసారి మండిపడ్డారు. అసలు తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఒక్క చాన్స్ అడుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏమి తెచ్చారో కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
‘11 ఏండ్లు తెలంగాణ కు ఏమి తెచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా.. మోదీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే ఎందుకు పట్టలేదు. 10 వేల ఎకరాల భూములను కేసీఆర్, కేటీఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తుండు.
ఇప్పడు కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతున్నాడు. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అడుగుతున్నారు. మూడుసార్లు మోదీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమీ ఎలగబెట్టారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏం చేశా. మీకు ప్రజలు చాన్స్ ఇవ్వరు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం కల. విభజన హామీలు కిషన్ రెడ్డికి,బండి సంజయ్ కి పట్టదు. వారిద్దరూ పగటి కలలు కంటున్నారు’ అని విమర్శించారు.