
నిజామాబాద్: చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడం తగదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పద్మాలయ, రామానాయుడు స్టూడియలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు.
తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, ప్రభుత్వానికి అంతా సమానమన్నారు మహేష్‌కుమార్‌గౌడ్.తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి, ఆమె కొడుకు చావుబతుకల మధ్య ఉంటే దానిపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు.ఫార్ములా ఈ-రేస్‌లో అడ్డంగా దొరికిన కేటీఆర్ మొన్నటివరకూ జైలకు వెళ్లేందుకు సిద్ధమన్నారని, ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ఎద్దేవా చేశారు.