ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్‌ రిక్వెస్ట్‌.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్‌ | Allu Arjun Request For His Fans Over Sandhya Theatre Controversy, Tweet Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్‌ రిక్వెస్ట్‌.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్‌

Published Sun, Dec 22 2024 3:48 PM | Last Updated on Sun, Dec 22 2024 5:31 PM

Allu Arjun Request For His Fans

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పరోక్షంగా  అల్లు అర్జున్‌ ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే, కొందరు సోషల్‌మీడియా ముసుగులో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసుకుని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తాజాగా బన్నీ పేర్కొన్నారు. ఈమేరకు తన అభిమానులకు సూచనగా ఎక్స్‌ పేజీలో ఒక ట్వీట్‌ చేశారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నటి పూనమ్‌ కౌర్‌ ఆసక్తికర ట్వీట్‌)

'నా ఫ్యాన్స్‌ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా మాత్రమే వ్యక్తపరచండి. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా ఎలాంటి పోస్టులు షేర్‌ చేయవద్దని కోరుతున్నాను. కొందరు అభిమానుల ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్‌ ఐడీలు, ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకుని తప్పుడు పోస్టులు వేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్‌ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని అభిమానులను కోరుకుంటున్నాను.' అని బన్నీ తెలిపారు.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి చనపోవడంతో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. అయితే, వాటికి కౌంటర్‌గా బన్నీ కూడా సీఎం పేరు ప్రస్తావించకుండా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన సంఘటన గురించి తన వర్షన్‌ ఏంటో మీడియాతో పంచుకున్నారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో తప్పంతా అల్లు అర్జున్‌ది మాత్రమేనని కొందరూ అంటుంటే.. మరికొందరు మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. 

దీంతో నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. బన్నీ ఫ్యాన్స్‌ పేరుతో కొందరు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను తప్పపడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసి కొందరు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని బన్నీ గుర్తించారు. దీంతో తన అభిమానులకు రిక్వెస్ట్‌గా తాజాగా ఒక ట్వీట్‌ చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement