లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి | CMO Responds Missing Of Nizamabad District Student In London | Sakshi
Sakshi News home page

లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి

Published Mon, Apr 28 2025 9:32 PM | Last Updated on Mon, Apr 28 2025 9:41 PM

CMO Responds Missing Of Nizamabad District Student In London

 స్పందించిన సీఎంఓ 

లండన్ లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు. 

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్ విద్యార్థి వీసాపై జనవరిలో లండన్ కు వెళ్ళాడు. యూకే లోని కార్డిఫ్ ప్రాంతంలో ఈనెల 25న సాయంత్రం నుంచి తన కుమారుడు జాడ తెలియకుండా పోయాడని హరిత తన వినతిపత్రం లో తెలిపారు. 

వెంటనే స్పందించిన ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), జిఎడి ఎన్నారై అధికారులతో మాట్లాడారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్ లోని ఇండియన్ హై కమీషన్ కు లేఖలు రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement