Student
-
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్తత!
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రీచైతన్య కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని నందిని(16) ఆత్మహత్య చేసుకుంది. క్లాస్‌రూమ్‌లోనే నందిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్‌కు సమాచారం అందించారు. వెంటనే నందిని మృతదేహాన్ని ఆసుపత్రి యాజమాన్యం మార్చురీకి తరలించింది. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.కాగా, విద్యార్థిని మృతి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ(కేఐఐటీ)లో 20 ఏళ్ల నేపాలీ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాలేజీ హెచ్ఆర్ విభాగ డైరెక్టర్ జనరల్, పరిపాలనా విభాగ డైరెక్టర్, హాస్టల్స్ డైరెక్టర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.వివరాల ప్రకారం.. విద్యార్థి వేధింపుల కారణంగా కేఐఐటీ హాస్టల్లో ప్రకృతి లాంసాల్ అనే బీటెక్ మూడో ఏడాది విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 900 మంది నేపాలీ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు అణచివేసేందుకు వర్సిటీలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా కొట్టడం, తర్వాత 800 మంది విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి పంపేయడం చర్చనీయాంశమైంది. ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ముగ్గురితో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీచేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఈ కమిటీ ఆరాతీసి ప్రభుత్వానికి నివేదించనుంది.ఇక, ఘటనపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. తమ దేశ విద్యార్థులను కలిసి విషయం తెల్సుకుని తదుపరి కార్యచరణ కోసం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిశాకు పంపింది. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్లో చేర్పించడం లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు ఆ అధికారులు సలహాలు, సూచనలు చేస్తారు. విద్యార్థి మరణం వార్త తెల్సి నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సైతం విచారం వ్యక్తంచేశారు. The tragic death of Nepali student Prakriti Lamsal at KIIT has sparked protests,Alleged harassment led to her suicide, with the college’s mishandling and irresponsible comments from officials raising serious concerns. investigations are ongoing #JusticeForPrakriti#KIITUniversity pic.twitter.com/Bl2GS71Oic— R0ni (@R0ni9801025590) February 18, 2025 -
తెలంగాణలో గురితప్పిన గురుకులాలు
-
వరంగల్ ఏకశిలా కాలేజీలో కీచక లెక్చరర్!
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్‌ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వీడు ఏడడుగుల బుల్లెట్టూ..
-
ఒకే ఒక్క స్టూడెంట్!
-
Student Tribe: స్టూడెంట్ ట్రైబ్..
మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత. ఇటు చదువుకుంటూనే అటు భవిష్యత్ ప్రణాళికల గురించి మార్గ నిర్దేశం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్ ట్రైబ్‘. ఒక స్టార్టప్ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకుపైగా స్టూడెంట్ నెట్‌వర్క్‌తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది. స్టూడెంట్ ట్రైబ్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక దాదాపుగా 6 లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్ట్రాగామ్‌లో 4.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్‌కు అనుసంధానం చేస్తోంది. గిగ్ వర్క్ ఇంటరీ్నíÙప్, వలంటీర్, ఫుల్‌టైమ్‌గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్ మెరుగు పర్చుకోవడంతో పాటు సరి్టఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్ వృద్ధికి అంతులేని అవకాశాలను సృష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, డిజైన్ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. టైర్–2, టైర్–3 నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివృద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్స్ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.అవకాశాలకు పుష్పకవిమానం.. నేను 2024లో డిగ్రీ బీకాం పూర్తి చేశాను. డిగ్రీ చేస్తున్న సమయంలోనే స్టూడెంట్ ట్రైబ్‌ను ఫాలో అవుతున్నాను. దీనికి సంబంధించిన యాప్‌లో ఎప్పటికప్పుడు అవసరమైన అవకాశాలు, వర్క్‌షాప్స్ గురించి తెలుసుకున్నాను. ఇందులో భాగంగానే స్టూడెంట్ ట్రైబ్లో అకౌంట్ మేనేజర్‌గా ఫుల్‌టైమ్ జాబ్ పొందాను. నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ వేదిక పుష్పక విమానంగా సేవలందిస్తోంది. – కీర్తనకార్పొరేట్ స్థాయి నైపుణ్యం విద్యార్థులు చదువుకుంటూనే అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వేదికను ప్రారంభించాం. వారి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ యాకథాన్ నిర్వహించాం. ఇందులో ప్రముఖ సినీ తార సమంత వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ మధ్యనే అప్ స్కిల్లింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జావా మెకానికల్ ఇంజినీరింగ్ వంటి విభిన్న నైపుణ్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి నైపుణ్యాలను అందిస్తున్నాం. దీనికోసం వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు, సీఈవోలను ఆహ్వానించి విద్యార్థులకు అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఏఐ, బ్లాక్‌చెయిన్ వెబినార్, మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌షాప్ వంటివి నిర్వహించాం. – చరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకులు. -
విశాఖ: ‘సీజ్ ద నారాయణ కాలేజ్’
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.ఒడిశా రాయ్‌పూర్‌కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్‌లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
స్కూల్ ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాల్ మందలింపు..
కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల మానసిక స్థితి గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నాయి. కొంచెం కూడా మానవత్వాన్ని చూపడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురై చావు నోట్లో తలపెడుతున్నారు. స్కూల్ ఫీజు చెల్లించలేదని పాఠశాల ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందే మందలించడంతో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. కాగా.. ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ రూరల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో కమల, వెంకటేశ్వర్లు దంపతుల కవల పిల్లలు అఖిల, విక్రమ్‌లు 10వ తరగతి చదువుతున్నారు. వీరిరువురి ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.10 వేలు చెల్లించారు. మిగతా మొత్తం చెల్లించడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 8న అఖిల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సి పాల్ రమాదేవి తోటి విద్యార్థినుల ముందే అవమానకరంగా మాట్లాడింది. తెలిసిన వారితో ఫీజు కోసం తనను ప్రిన్సిపాల్ టార్చర్ చేస్తున్నారని చెప్పుకొని ఏడ్చింది. సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. మంగళవారం తల్లి ఇంట్లో ఉండగానే అఖిల వేరే గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆందోళన పాఠశాల యాజమాన్యం తీరుతో విద్యార్థిని అఖిల ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన దిగారు. పాఠశాల ముందు బైఠాయించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపులు నిజం కాదు.. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, నిర్వాహకులు వివరణ ఇస్తూ తాము అఖిలను వేధించలేదని తెలిపారు. అందరితో పాటు తనకు ఫీజు చెల్లించాలని గుర్తు చేశామన్నారు. కాగా ఘటనకు కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్‌పై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్మ నిజాంపేట్ : ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కృష్ణాపురంనకు చెందిన బైసు శ్రీనివాస్, దేవి దంపతులు నగరంలోని బోరబండ ఫేజ్– 3లో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు పూజిత (17) బాచుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఉదయం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కాలేజీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పూజిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. మొదట కాలేజీ సిబ్బంది పూజిత బాత్రూంలో జారిపడిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారిని హాస్పిటల్‌కు రావాలని సూచించారు. కొద్ది సేపటి తర్వాత చనిపోయింది గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు మృతి అనుమానాస్పదంగా ఉందని పూజిత తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని మృతి చెందిందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. డంబెల్స్ వేలాడదీసి
తిరువనంతపురం : ‘అరె తమ్ముళ్లు మందేయాలి. డబ్బులు ఇవ్వండ్రా అని సీనియర్ విద్యార్థులు.. తమ జూనియర్ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. దీంతో జూనియర్లు చేసేది లేక కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం సీనియర్లకు డబ్బులు ఇచ్చే వారు. ఈ తరుణంలో ఓ ఆదివారం ఎప్పటిలాగే జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సీనియర్లు ప్రయత్నించారు. దీంతో జూనియర్లు మీకు ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నా’అని సమాధానం ఇచ్చారు. అంతే కోపోద్రికులైన సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను అత్యంత కిరాతంగా ర్యాగింగ్ (Ragging) చేశారు. చివరికి..కేరళ పోలీసులు వివరాల మేరకు.. కేరళ (kerala) రాజధాని తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో (kottayam government narsing college) నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు.ఆ ర్యాగింగ్ ఎలా ఉందంటే? బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం. వాటిపై కారం పూయడం. మంటకు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందడం. గాయాల్ని కంపాస్‌తో కొలవడం. అంతర్గత అవయవాలకు డంబెల్స్‌ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు. తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. అలా నాలుగు నెలల పాటు సీనియర్ల వేధింపులను మౌనంగా భరించారు.ఈ నేపథ్యంలో ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో విద్యార్థుల్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.👉చదవండి : నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి! -
జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
-
JEE Main 2025 Results : 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
ఢిల్లీ : ఐఐటీ, జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో విద్యార్థులు సరికొత్త రికార్డ్‌లు సృష్టించారు. కొద్ది సేపటి క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2025 సెషన్ వన్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సంటేజ్ సాధించారు. వారిలో ఐదుగురు రాజస్థాన్ విద్యార్ధులు కాగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయి మనోఘ్న గుత్తికొండ విద్యార్థిని 100శాతం ఉత్తీర్ణతతో టాపర్‌గా నిలిచారు. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా ఎన్టీఏ ఏటా రెండుసార్లు జేఈఈ–మెయిన్ పరీక్షలు నిర్వహిస్తోంది. మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా.300 మార్కులకు పరీక్ష మూడు సబ్జెక్ట్‌లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది.ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్‌లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్‌గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది.ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్సŠ, వేవ్ లెంగ్త్, ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఫిజిక్స్, మ్యాథ్స్‌లో ఇలా.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు.మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్ బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు.అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనా ఇలా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్‌గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
చిన్న కారణానికే ఎంత దారుణం
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్: పాఠశాల నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకును మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సైదులుకు ముగ్గురు కూమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు చదువు ఆపి వేసి హయత్‌నగర్‌లో కారు మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రెండో కుమారుడు చౌటుప్పల్లోనే ఇంటర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు భానుప్రసాద్ చౌటుప్పల్‌లోని అన్నా మెమోరియల్ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న భానుప్రసాద్ రాత్రి ఇంటికి కాస్త ఆలస్యంగా వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో కోపంతో అతడిని చితకబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తాళలేక భానుప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అరగంట తర్వాత తండ్రి కోపం తగ్గిందని భావించి భానుప్రసాద్ ఇంటికి రాగా.. మరోసారి విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీపై తన్నడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి బాలుడు చనిపోయాడని నిర్ధారించారు. దీంతో శనివారం రాత్రి హుటాహుటిన స్వగ్రామం ఆరెగూడేనికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆదివారం ఉదయం దహనసంస్కారాలు చేస్తుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆరెగూడెం గ్రామానికి చేరుకున్నారు. చితిపై ఉంచిన మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్ మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసేలా ఒప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అశ్రునయనాలతో అంత్యక్రియలుపోస్టుమార్టం అనంతరం స్వగ్రామం ఆరెగూడెం గ్రామంలో భానుప్రసాద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచి్చన కొడుకును క్షణికావేశంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజలు మృతుడి ఇంటికి బారులుదీరారు. మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. కేసు నమోదుఈ ఘటనపై మృతుడి తల్లి కట్ట నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో సైదులు నివాసం ఉండే ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుని నమోదు చేశారు. -
భలే కుర్రాడు.. ఆన్సర్ షీట్లో ఆ ఒక్క ముక్క రాసి..
సోషల్ మీడియా ప్లాట్ఫారం ప్రతీరోజూ మనకు వింతలు, విచిత్రాలను చూపిస్తుంటుంది. వీటిలో కొన్ని వారేవా అనిపిస్తుంగా, మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. ఇదేవిధంగా సోషల్ మీడియాలో కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. మరికొందరు ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ తెగ నవ్విస్తుంటారు.సోషల్ మీడియాలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. హాల్ టిక్కెట్లలో ఒక విద్యార్థి పేరుకు బదులు మరొకరి పేరు రావడం, ఎగ్జామ్ సెంటర్లో తప్పులు రావడం లాంటివి మనం ఇంతవరకూ చూసివుంటాం. అలాగే సమాధాన పత్రంలో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాయడం, ఏవో విజ్ఞప్తులు, అభ్యర్థనలు చేయడం లాంటివాటి గురించి మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అయితే దీనికి భిన్నంగా ఒక తెలివైన విద్యార్థి ఆన్సర్ షీట్లో ఏమి రాశాడో తెలిస్తేఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు.వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నదాని ప్రకారం ఒక టీచర్ ఎవరో విద్యార్థి ఆన్సర్ షీట్ చెక్ చేస్తూ కనిపిస్తారు. ఆయన వీడియోను దగ్గరకు తీసుకురమ్మని సైగలు చేయడం కూడా కనిపిస్తుంది. తరువాత కెమెరాను ఆన్సర్ షీట్‌పై ఫోకస్ చేయమని ఆ టీచర్ చెప్పడాన్ని గమనించవచ్చు. తరువాత ఆయన మాట్లాడుతూ ‘ఈ కుర్రాడు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశాడు. Define Aura 🗿 pic.twitter.com/MHzKmXZKlX— Prof cheems ॐ (@Prof_Cheems) February 7, 2025పేపర్ చివరిలో రాసినది కూడా సరైన సమాధానమే’ అంటూ ఆ కుర్రాడు సమాధాన పత్రంలో చివర రాసిన వాక్యాన్ని చూపిస్తారు. ఆ కుర్రాడు ‘అందరూ నువ్వు ఫెయిల్ కావాలని ఎదురుచూస్తున్నప్పడు.. విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు’ అని రాశాడు. దీనిని చూపించిన తరువాత టీచర్ ఆ ఆన్సర్ షీట్‌పై 80కి 80 మార్కులు వేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను @Prof_Cheems పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫారంలో పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటిరకూ 2 లక్షల 92 వేల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్‌రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం! -
Telangana: బస్ పాస్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే ‘ఒక నెల స్టూడెంట్ పాస్’ విధానం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీజీఎస్ఆర్టీసీ) చెందిన సాంకేతిక విభాగం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బస్ పాస్ కౌంటర్లు–స్కూళ్లకు మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. దీనిపై యాజమాన్యం దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి బస్‌పాస్ కావాలన్నా ఆ సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే ఐదో తరగతి వరకు బస్ పాస్ ఉచితమే. ఆపై వయసు వాళ్లు మాత్రం సాధారణ లేదా రూట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇలా దరఖాస్తు చేసే సమయంలో కనిష్టంగా నెల రోజుల నుంచి గరిష్టంగా మూడు నెలల కాలం వరకు బస్‌పాస్ జారీ చేస్తుంటారు. విద్యా సంవత్సరం ముసిగిన తర్వాత పాస్ దుర్వినియోగం కాకుండా ఉండటానికి జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ఈ విధానాన్ని టీజీఎస్ఆర్టీసీ మారుస్తుంటుంది. అప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం నెల రోజుల కాల పరిమితితోనే పాస్ జారీ అవుతుంది. సాంకేతిక విభాగం నిర్లక్ష్యం కారణంగా ఇక్కడే సమస్య వస్తోంది. సాఫ్ట్‌వేర్‌లో మార్పుల కారణంగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం ఆ తేదీ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి కాలపమితి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. కేవలం నెల రోజులకు మాత్రమే పాస్ తీసుకునేలా దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ పాస్ తీసుకోవడానికి పది రోజుల సమయం ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ కాలపరిమితి ముగిసినట్లు అవుతుంది. అంటే.. జనవరి 31 లేదా ఆ ముందు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మూడు నెలల పాస్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసిన తర్వా త స్టూడెంట్స్ ఆ దరఖాస్తు ప్రింట్ఔట్ తీసుకోవాలి. దానిపై పాఠశాల, కాలేజీకి చెందిన అ«దీకృత వ్యక్తులతో సంతకం చేయించుకుని, స్టాంప్ వేయించుకోవడం తప్పనిసరి. దరఖాస్తు సైతం ఆన్లైన్లో నే ఆయా విద్యా సంస్థలకు చేరతాయి. వీటిని వారి తో ఫార్వర్డ్ చేయించుకుని వెళ్లి బస్‌పాస్ కౌంటర్లో అ«దీకృత అధికారి సంతకం చేసిన ప్రతి ఇస్తేనే పాస్ జారీ చేస్తాయి. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.సాంకేతికంగా మార్పులు చేస్తే సరి.. ఫిబ్రవరి 1కి ముందు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ఎవరైనా మూడు నెలల కాలపరిమితితో పాస్ కావాలంటూ కౌంటర్లకు వెళ్లితే వాళ్లు తిప్పి పంపుతున్నారు. నెల రోజుల కాల పరిమితితో మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సంతకం–ఫార్వర్డ్ చేయించుకుని రావాలని సూచిస్తున్నారు. అదేమని ప్రశ్నస్తే.. మూడు నెలల కాల పరిమితితో ఇచ్చే పాస్‌ల జారీ ఫిబ్రవరి 1 నుంచి ఆగిపోయిన నేపథ్యంలో అప్లికేషన్ ఆన్లైన్లో కనిపించట్లేదని చెబుతున్నారు. దరఖాస్తు మూడు నెలల పాస్ కోసమైనప్పటికీ అన్నీ సవ్యంగా ఉంటే నెల రోజులకు జారీ అయ్యేలా టీజీఎస్‌ఆరీ్టసీ వి«భాగం సాంకేతికంగా మార్పు చేస్తే సరిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలా చేయడానికి బదులు అసలు దరఖాస్తే చెల్లదంటూ మళ్లీ నెల రోజుల పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తిప్పి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశి్నస్తున్నారు. -
పాఠశాల భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
షాద్‌నగర్‌రూరల్: ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సీఎస్కే వెంచర్లో నివాసం ఉంటున్న హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతుల కుమారుడు నీరజ్(15) స్థానిక శాస్త్ర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లిన నీరజ్ స్నేహితుడితో కలిసి క్లాస్‌రూం నుంచి కారిడార్‌కు వచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ నరేందర్‌రాయ్ వారిని మందలించాడు. దీంతో సాయంత్రం 4గంటలకు సుమారు 20 ఫీట్ల ఎత్తులో ఉన్న స్కూల్ అంతస్తు పైనుంచి నీరజ్ కిందికి దూకాడు. రక్తపు మడుగులో.. పాఠశాల భవనం పైనుంచి దూకిన నీరజ్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. పాఠశాల సిబ్బంది వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విద్యార్థి నేతల ఆందోళన..విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ యువసత్తా యూత్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల ఫర్నిచర్, అద్దాలు, బోర్డులు ధ్వంసం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించారు. వార్షికోత్సవం మరుసటి రోజే విషాదం.. హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతులకు నీరజ్‌తో పాటు ఓ కూతురు ఉన్నారు. మంగళవారం హరిభూషణ్ దంపతుల పెళ్లి రోజు కావడంతో వారు కుటుంబ సభ్యులతో ఘనంగా వేడుక జరుపుకొన్నారు. మరుసటి రోజే కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆర్మీ జవాన్‌గా పని చేసిన హరిభూషణ్ రిటైర్మెంట్ తీసుకుని, ప్రస్తుతం ప్రస్తుతం బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
రక్తం మారింది... ప్రాణం పోయింది
జగ్గంపేట: ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మిడిమిడి జ్ఞానం ఓ విద్యార్థిని ఉసురు పోసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలికకు.. వేరే గ్రూపు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు పోవడానికి కారకులయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ బాలిక కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పోలీస్‌స్టేషన్ వెనుక ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఆమెను రెండు రోజుల క్రితం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయానికి ఆస్పత్రి వైద్యుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇచ్చిన సలహాలతో జగ్గంపేట ఆస్పత్రి సిబ్బంది రక్తం ఎక్కించారు. అయితే బాధిత బాలిక బ్లడ్ గ్రూపు ఒకటి అయితే, సిబ్బంది మరో గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆరోగ్యం వికటించింది. ఈ క్రమంలో మూత్రంలో నుంచి, నోటి నుంచి రక్తం రావడంతో సిబ్బంది కంగారు పడి, రాజమహేంద్రవరంలో ఉన్న డాక్టర్‌కు సమాచారమిచ్చారు. ఆ డాక్టర్ సూచన మేరకు ఆ బాలికను తక్షణం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం రాత్రి బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఒక టీడీపీ నేత ఎటువంటి కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
స్కూల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్‌లోని ఓ పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్.. స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నేను తప్పు చేశా.. ‘స్టూడెంట్‌తో పెళ్లి’పై మహిళా ప్రొఫెసర్!
కోల్‌కతా: స్టూడెంట్ను పెళ్లాడిన మహిళా ప్రొఫెసర్ ఘటనలో ట్విస్ట్. క్లాస్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ యాజమానికి మెయిల్ పంపారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై ప్రొఫెసర్ భవిష్యత్ ఆధారపడడం చర్చాంశనీయంగా మారిందిపశ్చిమ బెంగాల్ నదియాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి చెందిన హరిన్ఘటా టెక్నాలజీలో పాయల్ బెనర్జీ సైకాలజీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ క్లాస్ రూంలోనే తన క్లాస్ విద్యారిని వివాహం చేసుకున్నారు. వివాహ తంతు ఎలా జరిగిందో అచ్చం విద్యార్థి, ప్రొఫెసర్ల ఉత్తుత్తి పెళ్లి అలాగే జరిగింది. అయితే ఆ పెళ్లి తంతులో ప్రొఫెసర్ పెళ్లి ఘట్టాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ నోటా ఈ నోటా చేరింది. చివరికి సైకాలజీ ప్రొఫెసర్ పాయల్ బెనర్జీపై చర్యలు తీసుకునే దాకా వెళ్లింది. పెళ్లితంతుపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా సైకోడ్రామా ప్రాజెక్ట్‌లో భాగంగా తాము ఓ నాటకం ఆడామని, నాటకంలో భాగంగా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నామని, అది నిజమైన పెళ్లి కాదని వివరణ ఇచ్చారు. దీనిని విద్యార్థులు,యూనివర్సిటీ సమ్మతితో ప్రదర్శించినట్లు చెప్పారు. A lady Professor in MAKAUT is 'getting married' to her young student in the office. pic.twitter.com/coXaVGH7s7— Abir Ghoshal (@abirghoshal) January 29, 2025 తన కెరీర్‌ను దెబ్బతీయడానికి, కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఓ సహోద్యోగి నాటకంలోని ఒక భాగాన్ని లీక్ చేశారని ఆరోపించారు. అనంతరం బెనర్జీని సెలవుపై సాగనంపింది.ఉత్తుత్తి పెళ్లి ఘటన జరిగిన నాటి నుంచి సెలవులో ఉన్న ప్రొఫెసర్ బెనర్జీ తాజాగా యాజమాన్యానికి తన రాజీనామా లేఖ పంపారు. అందులో, ‘నేను చేసుకుంది ఉత్తుత్తి పెళ్లే. కానీ దీనిపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. సైకలాజికల్ డ్రామాలో భాగంగా క్లాస్ విద్యార్ధిని వివాహం చేసుకున్నాం. ఈ ఉత్తుత్తి పెళ్లి గురించి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకున్నా. అయినా సరే నేనంటే గిట్టని వాళ్లే ఆ పెళ్లి వీడియోల్ని అడ్డం పెట్టుకుని నా పరువు, ప్రతిష్టను మంటగలుపుతున్నారు. వారి వల్ల నేను మానసిక ప్రశాంతను కోల్పోయా. విద్యార్థి పెళ్లి చేసుకుని తప్పు చేశా. ఇక నేను ప్రొఫెసర్‌గా కొనసాగలేను. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహిరి తెలిపారు. ఆమె లేఖపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ప్రొఫెసర్ సెలవులో కొనసాగుతారని చెప్పారు.ఇక విద్యార్థిని ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటనపై యూనివర్సిటీ ఐదుగురు సభ్యుల విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. మహిళా ప్యాకల్టీ ప్యానెల్ తన విచారణలో ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ వాదనల్ని ఖండించినట్లు యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో ఫ్రెషర్స్‌కు స్వాగతం చెప్పేందుకు చేసిన స్కిట్ తప్ప మరొకటి కాదు. అందులో తప్పులు వెతకడం సరైంది కాదని వైస్ ఛాన్సలర్ తపష్ చక్రవర్తి అన్నారు. -
సముద్రంలో ఈతకు వెళ్లి ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతు
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్కో బ్రేక్ వాటర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది. మత్స్యకారుడు గల్లంతు కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్‌లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
నిజాలు బయటకు రావాలి.. వారిని కఠినంగా శిక్షించాలి: సమంత
ర్యాగింగ్ భూతానికి ఓ కేరళ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన మిహిర్(15)(Mihir) అనే బాలుడు..తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న ఈ ఘటన చోటు చేసుకోకగా.. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత(Samantha) కూడా ఈ ఘటనపై స్పందిచింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాకయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈమేరకు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది స్వార్థం, ద్వేషం కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. వేధింపులు, ర్యాగింగ్ వంటికి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. వీటి వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడు. మన దగ్గర ఎన్నో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. లోలోనే కుమిలి పోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా.నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి’అని సమంత కోరింది. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి.. తన కుమారుడితో తోటి విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారని మిహిర్ తల్లి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మిహిర్‌ను తోటి విద్యార్థులు కొట్టారని, దుర్భాషలాడారని, అతడి చివరి రోజున ఊహించలేని అవమానాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్‌ను ఫ్లష్ చేసి తలని అందులో పెట్టారని, అవన్నీ భరించలేకనే తన క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.మిహిర్ మరణం తర్వాత కూడా వేధింపులు ఆగలేదని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.మ కుమారుడి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి బాధిత తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మిహిర్ తల్లి ఆరోపణలను సదరు స్కూల్ యాజమాన్యం ఖండించింది. -
‘స్టూడెంట్‌తో పెళ్లి’.. వివాదంలో మహిళా ప్రొఫెసర్
పవిత్రమైన బంధాల్లో గురుశిష్యుల బంధం ఒకటి. అయితే అతిజుగుప్సాకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నవాళ్లను తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ను కుదిపేస్తోంది. తన స్టూడెంట్‌నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలో ఉంది హరిన్ఘటా టెక్నాలజీ కాలేజీ. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధికి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన స్టూడెంట్ను వివాహమాడింది. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గరి నుంచి.. దండలు మార్చుకోవడం, ఏడగుడులు వేయడం ఇలా అన్నీ సంప్రదాయ పద్ధతిలో క్లాస్‌రూంలోనే జరిగిపోయాయి. పైగా హల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో.. ఆమె పాపులర్ అయిపోయారు. సరదా కామెంట్లతో పాటు సీరియస్‌గా విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.VIDEO Credits: HornbillTV అది నిజం వివాహం కాదని, సరదా కోసం చేసిన ప్రయత్నమని చెబుతున్నారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాస్‌ను నిర్వహించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. తానంటే గిట్టని వాళ్లు ఆ వీడియోను బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు. మరోపక్క.. ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులెవరూ సుముఖత చూపించకపోవడం గమనార్హం. -
మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి వర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఉమెన్స్ క్యాంపస్‌లో ఆత్మహత్యకు యత్నించింది. కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు కిటికీ నుంచి దూకేందుకు యత్నించింది.గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సమాచారం. -
ప్రియుడి బ్లాక్‌మెయిలింగ్ భరించలేక..
మల్లాపూర్ (హైదరాబాద్): ప్రియుని వేధింపులు భరించలేక ఓ ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ ఎస్వీనగర్‌కు చెందిన గుండె సత్యనారాయణ కూతురు పూజిత (21) ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు ఇంద్ర చరణ్‌రెడ్డి (22) వీబీఐటీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెలరోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. కాగా ఇంద్రచరణ్‌రెడ్డి గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం, వేధించడంతో మనస్తాపానికి గురైన పూజిత సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్మకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఇంద్రచరణ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
కిడ్నాప్ చేశారని విద్యార్థుల డ్రామా
కర్నూలు జిల్లా: పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు ఒక డ్రామా ఆడారు. తమను కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు క్షేమంగా పాఠశాలకు చేరారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపిన వివరాలు ఇవీ.. సి.బెళగల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన నవీన్.. 7వ తరగతి బీ సెక్షన్లో చదువుతున్నాడు. అలాగే కర్నూలులోని బుధవారపేటకు చెందిన సూర్యతేజ 6వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాడు. వీరిద్దరూ అక్కాచెల్లి అయిన లక్ష్మి, సరస్వతిల పిల్లలు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక జంపాపురానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే ఇబ్బంది పడతామని.. తమను ముఖానికి ముసుగులు వేసుకున్న కొంతమంది వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి కిడ్నాప్ చేశారనే విషయం మిత్రుడు నితిన్‌కు తెలిపి పాఠశాల బయటి నుంచి పొలాల్లో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నితిన్.. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు సూర్యపతాప్సింగ్, అయ్యన్న కు తెలిపారు. దీంతో వారు వెంటనే పోలీస్‌లకు సమాచారం అందజేశారు. సోషల్ మీడియాలో ఎస్ఐ సెల్ నంబర్‌తో గురుకుల పాఠశాల ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ అంటూ కథనం హల్చల్ చేసింది. దీంతో కోడుమూరు సీఐ తబ్రేజ్ పాఠశాలకు చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ రాణెమ్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ పురుషోత్తం, సి.బెళగల్ సర్పంచ్ పాండురంగన్న, ఎంఈఓ – 2 ఆదామ్‌బాషా.. పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటపడిన విద్యార్థులు.. సి.బెళగల్ గురుకుల పాఠశాల విద్యార్థులు కిడ్నాప్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయ్యింది. మిన్నెల అనే వ్యక్తికి ఎమ్మిగనూరులో విద్యార్థులు కంటపడ్డారు. ఈ విషయాన్ని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌కు ఫోన్లో వీడియో కాల్ ద్వారా తెలియజేశారు. ఎమ్మిగనూరులో వ్యక్తిగత పనిపై వెళ్లిన సి.బెళగల్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసులు గౌడ్‌కు విషయం తెలియడంతో ఆయన ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌లకు విద్యార్థులను అప్పగించారు. అనంతరం పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థులను పోలీస్‌లు విచారించారు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక తాము పారిపోయ్యామని తెలిపారు. దీనితో సీఐ, ఎస్ఐ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పాఠశాలలో ఇవీ లోపాలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు– నేడులో భాగంగా సి.బెళగల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 20 నూతన మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే 20 పాత మరుగుదొడ్లను మరమ్మతు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం మరో 32 కొత్త మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణం దాటి బహిర్భూమికోసం సూదూరంగా వెళ్తున్నారు. మలవిసర్జనకు పాఠశాల బయటకు వచ్చి ఇలాంటి కథలకు చోటు చేసుకుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. -
విద్యార్థినిపై క్షుద్ర పూజ ప్రయోగం
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగర శివారులోని బి.తాండ్రపాడు ఎస్ఆర్ కాలేజీలో క్షుద్ర పూజ ప్రయోగం కలకలం సంచలనం సృష్టించింది. ఈ నెల 26వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో హాస్టల్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని చంపే ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె గాఢనిద్రలో ఉండగా జుట్టుకు కత్తిరించాడు. తరువాత చంపబోయే సమయంలో ఆ విద్యార్థిని నిద్రలేచి కేకలు వేయడంతో దుండగుడు పారిపోయినట్లు తెలుస్తోంది.అయితే ఆ అమ్మాయి బెడ్‌పై కిల్యూ అనే లెటర్, పదునైన కత్తి, రెండు భాగాలు చేసిన నిమ్మకాయ ఉండడంతో క్షుద్ర పూజ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ గదిలో మొత్తం ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తుండగా ఉండగా..అందులో బాగా చదివే విద్యార్థినినే టార్గెట్ చేయడం గమనార్హం. కాగా, గతంలో కూడా ఒక అమ్మాయిపై క్షుద్ర పూజలు జరిగాయని, అప్పట్లో ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయిందని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు చెప్పి సముదాయించినట్లు సమాచారం. ఇప్పుడు మళ్లీ కాలేజీలో క్షుద్ర పూజల ప్రయోగం జరగడంతో మిగతా విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని కళాశాల యాజమాన్యం... కాగా.. క్షుద్ర పూజల సంఘటనపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. అయితే తోటి విద్యార్థులు కొందరు విషయాన్నివారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు సోమవారం కాలేజీకి చేరుకొని ఆందోళన చెందారు. యాజమాన్యాన్ని సమాచారం అడిగిన సరైన సమాధానం ఇవ్వలేదు. ఈవిషయాన్నివిద్యార్థి, మహిళా సంఘాలు తెలుసుకొని కాలేజీ ఎదుట ఆందోనకు దిగాయి. అస్తవ్యస్తంగా హాస్టల్ నిర్వహణ... ఎస్ఆర్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీలో మహిళా సెక్యూరిటీ గార్డులు ఉండాల్సి ఉన్నా ఉండడంలేదు. కాలేజీలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. అంతేకాక మహిళా వార్డెన్లు కూడా లేరని చెబుతున్నారు. అయినా యాజమాన్యం మాత్రం విద్యారి్థనుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఐఓ విచారణ.. ఎస్ఆర్ కాలేజీలో అమ్మాయిపై క్షుద్రపూజల కలకలం నేపథ్యంలో ఆర్ఐఓ గురవయ్యశెట్టి విచారణచేపట్టారు. ఆయన కాలేజీకి చేరుకొని బాధిత విద్యారి్థని, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇంతవరకు కేసు నమోదుకాలేదు. -
మోడల్ స్కూల్ విద్యార్థినులకు అరుదైన అవకాశం
కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసే అరుదైన అవకాశాన్ని పొందారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాదికారి టి.తిరుమల చైతన్య నుంచి పాఠశాలకు శనివారం ఉత్తర్వులు అందాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రదర్శించేందుకు ఇక్కడి విద్యార్థినులకు అవకాశం లభించింది. పాఠశాల విద్యా శాఖ తరఫున జిల్లాలో మఠం సరియాపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ఐదుగురు, పొన్నాడ కేజీబీవీ విద్యార్థినులు ఐదుగురు ఎంపికైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయని ప్రిన్సిపాల్ శివప్రసాద్ వెల్లడించారు.వీరు ఈ నెల 26నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు బెంగళూరులో జరిగే ఇంటర్‌స్టేట్ హాకథాన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. పాఠశాలకు చెందిన ఆరాధ్య పాణిగ్రాహి (9వ తరగతి), శ్రద్ధాంజలి మహంతి (9వ తరగతి), యాస్మిన్ చౌదరి (7వ తరగతి), రితిక బడిత్య (9వ తరగతి), మహంతి శ్రద్ధాంజలి (9వ తరగతి), గైడ్ టీచర్ బడియా సత్యనారాయణ ఈ ప్రాజెక్టు ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఐదుగురు విద్యార్థినులు, గైడ్ టీచర్ బెంగళూరు వెళ్లి రావడానికి ఉచిత విమాన ప్రయాణం, ఫైవ్ స్టార్ వసతి కల్పించనున్నారు. -
శ్రీవల్లి అదృశ్యం
నాగోలు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోలు ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన గౌరు రోజు జయప్రద కుమార్తె శ్రీవల్లి (18) ఇంటర్లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం కొన్ని రోజుల క్రితం నాగోలు డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని లక్ష్మి బాలికల హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. సంక్రాంతి సెలవులకు ఈనెల 11న ఇంటికి వెళ్లి ఈనెల 17న హాస్టల్‌కు వచ్చింది. 23న కూతురు కోసం హాస్టల్ వారికి ఫోన్ చేసి శ్రీవల్లి 20న ఇంటికి పంపినట్లు సమాచారం తెలిపారు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బండ్లగూడ హాస్టల్‌కు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రిన్సిపాల్ కే స్టూడెంట్ వార్నింగ్
-
విద్యార్థిని ఆత్మహత్య
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్‌లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై మంగళవారం ఉదయం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. పెద్దకోడూరుకు చెందిన భార్గవిగా గుర్తించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు హుటాహుటినా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. -
కూటమి ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెరిగాయి
-
ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు
కంకిపాడు: ఫీజు కట్టలేదని విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్థరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మీడియాకు సమాచారం వెళ్లటంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న రూ 20 వేలు నగదును చెల్లించాడు. మిగిలిన రూ. 50 వేలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమలాడారు. అందుకు యాజమాన్యం ససేమిరా అని విద్యార్థిని కళాశాల నుంచి పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు.పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయటకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. -
బతకాలంటే భయమేస్తోందమ్మా.. నన్ను క్షమించు తమ్ముడు ...
నెల్లిమర్ల: తమ కుమారుడు వైద్య వృత్తిలో స్థిరపడతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుని, రోగులతో పాటు తమకు కూడా వైద్యసేవలు అందిస్తాడని ఆశ పడ్డారు. అయితే వారి ఆశలు ఆడియాసలయ్యాయి. చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం నుంచి బ్యాక్‌లాగ్స్ ఉండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహ విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అతుకూరి సాయి మణిదీప్(24) ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకుని, కూల్ డ్రింకులో కలుపుకుని తాగా డు. విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు విషయాన్ని మిమ్స్ యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్య ప్రతినిధులు నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయి మణిదీప్ బెడ్ కింద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. చదువు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సదరు నోట్లో మృతుడు ప్రస్తావించాడు. బ్యాక్ లాగ్స్ ఎక్కువగా ఉండటం, చదువుపై ఏకాగ్రత లేకపోవడంతో చనిపో తున్నట్లు రాసాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. -
HYD: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఖరతాబాద్: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.... ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్నగర్లో నివాసముండే తలారి ఎల్లయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తె తలారి రేణుకాదేవి (22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో రేణుకాదేవి తల్లి విజయలక్ష్మి ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తితో వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు -
సైబర్ మోసానికి యువకుడు బలి!
-
ఏంటో నా జీవితం... పిచ్చిలేస్తోంది
శామీర్‌పేట్: ‘నాకు ఏమీ రావు.. ఏంటో నా జీవితం.. పిచ్చిలేస్తుంది.. అసలు లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా.. నాకు చనిపోవాలనిపిస్తుంది’ అంటూ స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగ వెంకటరమణ–లక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం తుర్కపల్లికి వలస వచ్చి ఉమాశంకర్ రైస్‌మిల్‌లో కారి్మకులుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురు తేజస్విని సాయిదుర్గాలక్ష్మి (16) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 3న తలనొప్పిగా ఉందని తేజస్విని స్కూల్‌కు వెళ్లలేదు. రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేసి నిద్రించారు. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తల్లి లక్ష్మి బాత్ రూంకు వెళ్లగా తేజస్విని బాత్రూంలో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ గుర్తించారు. కాగా తేజస్విని అతిగా నిద్రించేదని, తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
విద్యార్థినితో లెక్చరర్ ప్రేమపెళ్లి
మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరి్ణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరి్ణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్లో తాను ప్రేమించిన యశోదకుమార్ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేరి్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు. -
ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు.. ఏం నేరం చేశాడంటే..?
తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు కేరళలోని స్పెషల్ ఫాస్ట్–ట్రాక్ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్ఫోన్లో షూట్ చేశాడు.ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. మనోజ్ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్‌లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్ ఫోన్లోని కాల్ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్.రేఖ తీర్పు వెలువరించారు. -
సైబర్ మోసం తాళలేక విద్యార్థి ఆత్మహత్య
వీణవంక (హుజూరాబాద్): సైబర్ మోసానికి ఓ విద్యార్థి బలైపోయాడు. రూ. 5 వేలు పెట్టుబడి పెడి తే రెండింతలు ఇస్తాం’ అంటూ ఫోన్‌కు వచ్చిన మె సేజ్‌కు ఆకర్షితుడై పలు దఫాలుగా కేటుగాళ్లకు రూ.90 వేల మేర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు. చివరకు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగ ల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా సంఘం నుంచి తల్లి తీసుకున్న చిట్టీ డబ్బులతో.. బేతిగల్ గ్రామంలో నివసిస్తున్న గుమ్మడి సృజన్–ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషివర్థన్ (18) ఇటీవల డిప్లొమా పూర్తి చేసి బీటెక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. వారం క్రితం అతని మొబైల్‌కు కేటుగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పంపిన సందేశం చూసి ఆకర్షితుడయ్యాడు. తన తల్లి ఇటీవల మహిళా సంఘం నుంచి రూ. 90 వేల చిట్టీ పాడుకోవడంతో వచ్చిన డబ్బును ఇందుకోసం వాడుకోవాలనుకున్నాడు. వెంటనే ఆమె ఖాతాలోంచి ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. తొలుత రూ. 5 వేలను సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. అయితే రెట్టింపు సొమ్ము పొందాలంటే రెండో టాస్‌్కగా రూ. 23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ సొమ్మునూ చెల్లించాడు. మూడో టాస్‌్కలో రూ. 68 వేలు పెట్టుబడి పెడితే రీఫండ్ వస్తుందని కేటుగాళ్లు నమ్మించడంతో ఆ మొత్తం కూడా బదిలీ చేశాడు. అయితే ఆ సొమ్ముకు రెట్టింపు పొందాలంటే రూ. 2 లక్షల 6 వేలను బదిలీ చేయాలని వారు పేర్కొనడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కుటుంబ సభ్యులకు లేఖ రాశాడు. ‘సారీ మమ్మీ.. నేను చనిపోతున్నా, రిన్నూ (తమ్ముడు) జాగ్రత్త.. డాడీ, మమ్మీ ఇన్నీ రోజులు నన్ను భరించినందుకు థ్యాంక్స్. నేను ట్రేడింగ్ (స్టాక్ మార్కెట్)లో డబ్బులు పెట్టి మోసపోయా. కంపెనీ వివరాలు నా మొబైల్లో ఉన్నాయి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. -
ఉద్యమంలా డ్రగ్స్ ను నిర్మూలిద్దాం
-
హైదరాబాద్ నాచారంలో యువతి ఆత్మహత్య
-
అశోక్‌నగర్‌లో గ్రూప్–2 అభ్యర్థి బలవన్మరణం
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని అవుసులకుంట తండాకు చెందిన గిరిజన యువతి గుగులోత్ సురేఖ(22) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తండావాసులు తెలిపారు. యువతి ఉన్నత చదువులు చదివి హైదరాబాద్‌లో ఉంటూ వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. వారం క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలకు సైతం హాజరైనట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. Hanumakonda: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హసన్‌పర్తి: హనుమకొండ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఆ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్ తండాకు చెందిన గుగులోతు శ్రీదేవి(16) నగరంలోని డబ్బాల్ జంక్షన్ వద్ద గల ఏకశిలా గర్ల్స్ క్యాంపస్‌లో ఇంటర్ (ఎంపీసీ) ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ నిర్వాహకులకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సదరు విద్యార్థి శ్రీదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే హాస్టల్ గదిలో ఉరివేసుకుందని చెప్పారు.విద్యార్థి సంఘాల ఆందోళన..శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు రాత్రి కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. మృతదేహంతో కాలేజీ ఎదుట బైఠాయించారు. శ్రీదేవి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతిఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000 / 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నీట్ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఆలస్యమైన నీట్–పీజీ ప్రవేశాల అంశం సుప్రీంకోర్టు ముందుకెళ్లడంతో తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ స్థానికత అంశంపై జీవోలు 148, 149ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్‌లో మొదలు కావాల్సిన పీజీ కౌన్సెలింగ్ ఆల స్యమైంది. ఇటీవల హైకోర్టు ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో సర్కా ర్ సుప్రీంకోర్టు తలుపుతట్టింది.తెలంగాణలోని పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది. ఇది సుప్రీంకోర్టులో జనవరి 7న విచారణకు రానుంది. సుప్రీం విచారణ ముగిస్తే గానీ తెలంగాణ విద్యార్థుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేలా లేదు. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద మొదటి రౌండ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తికాగా, రెండో రౌండ్ రిజిగ్నేషన్ పీరియడ్ ఈనెల 26తో ముగియనుంది. ఆ తరువాత మూడో రౌండ్ ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పీజీ ప్రవేశ పరీక్ష రాసిన సుమారు 8 వేల మంది విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఫిబ్రవరి 5లోగా పూర్తికావాల్సిన ప్రక్రియ నీట్–పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలనేది నిబంధన. సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన మార్గదర్శకాల మేరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే... అప్పటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించినా ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్ ఉంటాయి. కన్వినర్ కోటా, యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ (సీ కేటగిరి) కోటాతోపాటు స్ట్రే వెకెన్సీ ఉంటుంది. ఒక్కో విడతకు కనీసం వారం రోజుల సమయమివ్వాలి.ఎందుకంటే విద్యారి్థకి సీటు కేటాయించిన తర్వాత వారు జాయిన్ అయ్యేవరకు ఆగాలి. అనంతరం మరోవిడత కౌన్సెలింగ్ చేపట్టాలి. ఇలా తక్కువ సమయంలోనే అన్ని రకాల కౌన్సెలింగ్‌లను ఎలా చేపడతారని మెడికోలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులను గానీ, జాతీయస్థాయి మెరిట్ కార్డులను గానీ విడుదల చేయలేదు. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ సీటు కోసం ఎదురు చూస్తున్న మెడికల్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో సగం సీట్లు భర్తీ రాష్ట్రంలో 2,886 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వీటిలో 1,300 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. వీటిల్లోని 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు వెళ్తాయి. మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి 650 సీట్లే. వీటిలో రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌లో దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. మిగతా 650 సీట్ల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా వేచి చూడాలని అంటున్నారు. కాగా, ప్రైవేటులో 1,500కు పైగా సీట్లలో 50 శాతం కన్వినర్ కోటా కిందకు వస్తాయి. 35 శాతం మేనేజ్మెంట్ కోటా, 15 శాతం ఎన్నారై కోటాకు వెళ్తాయి. స్టేట్ రౌండ్ 1ను ప్రకటించాలి: టీ–జుడా అఖిలభారత కోటా మూడో రౌండ్ నిర్వహణ ప్రారంభమయ్యేలోగా తెలంగాణలో స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా రెండు రౌండ్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము రాహుల్, ఇసాక్ న్యూటన్, చైర్పర్సన్ డి. శ్రీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏఐక్యూ రెండో రౌండ్ రిజిగ్నేషన్ డెడ్‌లైన్ పూర్తయ్యేలోపు స్టేట్ మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేయాలన్నారు. మెడికో డి.వెంకటేష్ కుమార్ విద్యార్థుల తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరారు. -
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. మిస్సింగ్ అయిన వారిలో ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. స్థానిక ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట మండలం రాంనాథ్గుడపల్లికి చెందిన కొత్తగాడి బాల్‌రాజ్ కుమారుడు (17) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థల్లో బీటెక్ (సీఎస్సీ) ప్రథమ సంవత్సరం చదువుతూ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాడు.14న హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. తండ్రి బాల్‌రాజ్ విష్ణుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మరుసటి రోజు నేరుగా కాలేజ్‌కి వచ్చి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదిలా ఉండగా యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం, కాప్రాయిపల్లికి చెందిన మరో విద్యార్థిని(17) గురునానక్ కాలేజ్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఇదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. అలాగే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 19 సంవత్సరాల విద్యారి్థని ఈనెల 20న అదృశ్యమైంది. ఈమె కూడా కాలేజ్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ విద్యకు ప్రయాణ బీమా దన్ను
విద్య కోసం విదేశాల బాట పట్టినప్పుడు కొత్త సంస్కృతులు, సవాళ్లు, వ్యక్తిగత వృద్ధి అవకాశాలు ఇలాంటివి ఎన్నో ఉక్కిరిబిక్కిరి చేసే అనుభవాలు ఎదురవుతాయి. అయితే, ఈ ఉత్కంఠభరితమైన సాహసయాత్రలో రిసు్కలు, అనిశి్చతులూ ఉంటాయి. హెల్త్ ఎమర్జెన్సీల నుంచి.. ట్రిప్‌లు రద్దవడం వరకు పలు రకాల సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే విదేశాల్లో విద్యాభ్యాసాన్ని ఎంచుకున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు.. తప్పనిసరిగా తీసుకోతగిన రక్షణ కవచంలాంటిది. ఇందుకు గల అనేక కారణాల్లో కొన్ని... ఆరోగ్య సంరక్షణకు.. విదేశాల్లో హెల్త్‌కేర్ వ్యవస్థలు, వ్యయాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పలు దేశాల్లో వైద్య వ్యయాలు భారీగానే ఉంటాయి. దీన్ని అధిగమించడం శక్తికి మించిన భారంగా అనిపించవచ్చు. ఉదాహరణకు అమెరికాలో మామూలుగా ఆసుపత్రికి వెళ్లినా వందల కొద్దీ డాలర్ల వ్యయంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది. ఇక మిగతా దేశాల్లో ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అనేది వేల కొద్దీ డాలర్లతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఊహించని వ్యయాల భారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది ప్రయాణ బీమా. డాక్టర్ విజిట్స్, ఆసుపత్రిలో చేరడం, ఎమర్జెన్సీ మెడికల్ ఎవాక్యుయేషన్లు మొదలైన వాటన్నింటికీ కవరేజీని ఇస్తుంది. ఈ విషయంలో భరోసా లభించడం వల్ల విద్యార్థులు తమ చదువుపై నిశ్చింతగా ఫోకస్ చేసేందుకు వీలుంటుంది. ప్రయాణాలకు ఆటంకాలెదురైనా.. రాజకీయ అనిశి్చతి, ప్రకృతి వైపరీత్యాలు లేదా వ్యక్తిగతంగా అత్యవసర పరిస్థితులు తలెత్తడం మొదలైన ఊహించని అంశాల వల్ల ప్రయాణ ప్రణాళికలపై ప్రభావం పడొచ్చు. ఒకవేళ మీరు వెళ్లే దేశంలో ప్రకృతి వైపరీత్యం తలెత్తి, ట్రిప్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాల్సి వస్తే.. ఆయా వ్యయాలన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవరేజీని పొందే అవకాశం ఉంటుంది. అదనంగా ఆర్థిక భారం పడకుండా మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మీ ట్రిప్‌ను కుదించుకున్నా లేక అది రద్దయినా.. ప్రయాణ ఏర్పాట్ల కోసం మీరు వెచి్చంచిన మొత్తం డబ్బు వృధా కాకుండా చూసుకోవడానికి వీలవుతుంది. విలువైన వస్తువులకు భద్రత.. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్తున్నప్పుడు విలువైన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, ఇతరత్రా అవసరమైన ఎల్రక్టానిక్స్ వస్తువులను వెంట తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు. సరిగ్గా పాఠాలు ప్రారంభమయ్యే సమయానికి మీ ల్యాప్‌టాప్ పోయిందంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే ప్రయాణ బీమా ఉంటే ఈ గందరగోళం నుంచి బైటపడేందుకు ఆస్కారం ఉంటుంది. దీనితో ఆయా ఉత్పత్తుల రీప్లేస్మెంట్ ఖర్చులతో పాటు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సామాన్లకు కూడా కవరేజీని పొందవచ్చు. విదేశాల్లో 24 గంటల ఎమర్జెన్సీ సహాయం.. 24/7 ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సర్విస్ అనేది ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో అత్యంత కీలకమైన ఫీచర్లలో ఒకటి. లోకల్ డాక్టరును సంప్రదించడం మొదలుకుని అత్యవసరంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం వరకు వివిధ ఎమర్జెన్సీ సందర్భాల్లో తక్షణ సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటికి దూరంగా ఉండే సమయంలో విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు సహాయం అందుబాటులో ఉంటుందనే ఆలోచన ఎంతో నిశ్చింతనిస్తుంది. థర్డ్ పార్టీ లయబిలిటీ ప్రమాదాలనేవిఅనుకోకుండానే జరిగిపోతాయి. మనం ఎంత పరిశోధన చేసి, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా.. సరిగ్గా సమయం వచ్చేసరికి అన్నీ పక్కకు వెళ్లిపోవచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ప్రమాదవశాత్తూ థర్డ్ పార్టీలకు ఏదైనా నష్టం కలిగించడం వల్ల పరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అద్దెకు తీసుకున్న ఇల్లు ప్రమాదవశాత్తూ దెబ్బతిన్నా, ఏదైనా ప్రమాదంలో ఎవరైనా గాయపడినా .. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది లీగల్, ఆర్థిక వ్యయాలను కవర్ చేస్తుంది. దూరదృష్టి ముఖ్యం.. ప్రయాణ బీమా అనవసర ఖర్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టేసేద్దామని అనిపించినా.. విదేశాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు ఎదురయ్యే రిసు్కల గురించి ఒకసారి ఆలోచిస్తే.. ఇది ఎంతో వివేకవంతమైన పెట్టుబడి కాగలదు. హెల్త్ ఎమర్జెన్సీలు, ప్రయాణాలు రద్దు కావడం, వస్తువులు పోవడం, లీగల్ ఖర్చులు, కాలేజీ ఫీజులపరమైన నష్టాలు మొదలైన వాటన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ ఉంటుందనే ఆలోచన కొండంత భరోసానిస్తుంది. మిగతా వాటి గురించి ఆందోళన చెందకుండా నిశ్చింతగా చదువుపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. -
గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన
-
విద్యార్థినిని గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్..
అన్నానగర్: కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం (50). ఇతనికి పైళ్లె పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదువుతున్న ప్లస్–2 విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఈ విద్యార్థి ప్రస్తుతం చైన్నెలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ స్థితిలో 15వ తేదీన కడుపునొప్పి రావడంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకి అబ్బాయి పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది విద్యార్థిని రక్షించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని బంధువులు సెంఽబియం తోప్పు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు మలర్ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. -
ఐదు గంటల్లో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్ధి.. అసలేం జరిగిందంటే?
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.బీహార్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్‌పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదుఅనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది. -
పెద్దాపూర్ గురుకులంలో మరో విద్యార్థికి పాముకాటు
కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు మరోసారి కలకలం రేపింది. 3 నెలల క్రితం వారం వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు గురికాగా, అందులో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎనిమి దో తర గతి చదు వుతున్న మెట్పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ రవి–రుచిత దంపతుల కుమా రుడు అఖిల్ (14) పాము కాటుకు గుర య్యాడు. బుధవారం ఉదయం ఆరుగంటల సమయంలో అఖిల్ తన చేయి తిమ్మిరిగా ఉందని విధుల్లో ఉన్న నర్స్‌కు చూపించు కు న్నాడు. పరిశీలించిన నర్స్ ఏమీ కాలే దని సర్దిచెప్పింది. 9 గంటల సమయంలో అఖిల్ చేయి పూర్తిగా చతికిలపడటంతో వెంటనే ప్రిన్సిపాల్ మాధ వీలత దృష్టికి తీసు కెళ్లారు. చేతిపై పాముకాటు గాట్లు ఉండటంతో తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. అఖిల్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన మరో విద్యార్థి
-
ఖాళీ అవుతున్న కోచింగ్ సిటీ.. ఆత్మహత్యలే కారణమా?
కోటా: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన రాజస్థాన్‌లోని కోటాలోగల కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిపోతోంది. ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, హాస్టల్ యాజమాన్యాలు ఏంచేయాలో తెలియని స్థితిలో చిక్కుకున్నాయి.కోచింగ్‌పై తొలగిన బ్రమకోటాలోని కోచింగ్ సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది ఇక్కడి కోచింగ్ సెంటర్లపై ఇంతవరకూ ఉన్న బ్రమలు తొలగిపోవడమైతే, మరొకటి విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరగడమేనని చెబుతున్నారు. అలాగే లెక్కకుమించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వీరు అందించే విద్యానాణ్యత తగ్గిపోతున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.వేల కోట్ల టర్నోవర్‌కు గండికోచింగ్ సిటీగా పేరొందిన కోటాలో ప్రస్తుతం 1.10 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది మునుపటి కంటే 30-35 శాతం తక్కువ. రూ. 6.5 వేల కోట్ల విలువ కలిగిన పరిశ్రమ ఇప్పుడు రూ.3.5 వేల కోట్లకు దిగజారింది. ఇది కోటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. కోటాలో కోచింగ్ పరిశ్రమ 2000లో వేగంగా అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్ల ప్రగతి ఈ ఏడాదిలో ఊహించనంతగా దిగజారింది.కనీస హాస్టల్ అద్దె కూడా కరువు2018 నుంచి 2022 వరకు ఒకరికి నెలకు హాస్టల్ అద్దె రూ.15-16 వేలు వరకూ ఉండేది. ఇప్పుడు ఒకరి నుంచి రూ. 3000 కూడా దక్కడం లేదని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. నెలకు రూ.2500 అద్దె తీసుకున్నా 30 శాతం గదులు మాత్రమే నిండుతున్నాయంటున్నారు. స్థానికంగా చాలా మంది అప్పులు చేసి హాస్టళ్లు నిర్మించుకున్నారని, విద్యార్థుల కొరత కారణంగా ఆ రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని పలు హాస్టళ్ల యజమానులు అంటున్నారు.ఆత్మహత్యలే కారణమా?స్థానికంగా ఉన్న హాస్టళ్లు గతంలో విద్యార్థులను పీడించిమరీ డబ్బులు వసూలు చేశాయని, అందుకే వాటికి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కోటాలోని కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విరక్తి చెందడానికి ఇక్కడ చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2023లో కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువు ఒత్తిడే ఈ సంఘటనలకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా కోటాకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.ప్రముఖ కోచింగ్ సెంటర్లకు మరిన్ని బ్రాంచీలుమరోవైపు ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దేశంలోని వివిధ నగరాల్లో తమ కేంద్రాలను తెరిచాయి. 2020 వరకు 10 కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 80 నుండి 100 కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫలితంగా విద్యార్థులకు కోటా ఒక్కటే కాకుండా పలు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ పెద్ద బ్రాండ్ కోచింగ్ సెంట్లర్ల కారణంగా స్థానిక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.పరిష్కారం కోసం మల్లగుల్లాలుప్రస్తుతం కోటా కోచింగ్ పరిశ్రమకు కష్టకాలం నడుస్తోంది. దీనిని సవాలుగా తీసుకున్న హాస్టళ్ల యజమానులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరిష్కారం దిశగా యోచిస్తున్నారు. విద్యార్థుల భద్రత, వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే కోచింగ్ నాణ్యతను మెరుగుపరచడానికి, కొత్త కోర్సులను ప్రారంభించేందుకు కూడా కోచింగ్ సెంటర్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హయత్‌నగర్ (హైదరాబాద్)/గోపాల్పేట: ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లికి చెందిన పండగ మధుసూదన్‌రెడ్డి రైతు. ఆయన కొడుకు లోహితస్యరెడ్డి (12) హయత్‌నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి భోజనం అనంతరం 8 గంటలకు తోటి విద్యార్థులంతా స్టడీ అవర్‌లో చదువుకునేందుకు వెళ్లగా.. లోహితస్యరెడ్డి ఒక్కడే గదిలో ఉన్నాడు.స్టడీ అవర్ తర్వాత గదిలోకి వచి్చన విద్యార్థులకు.. ఫ్యాన్‌కు వేలాడుతూ లోహితస్యరెడ్డి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ సిబ్బందికి చెప్పగా.. హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఉపాధ్యాయుల ఒత్తిడి, నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు ఆత్యహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు. ఇక్కడ చదవనంటే.. ఈ ఏడాది పూర్తయ్యేవరకు చదవమని నచ్చజెప్పానని చెప్పారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కూడా ఫోన్ చేసి మాట్లాడాడని.. ఆ తర్వాతే ఉరివేసుకుని మరణించాడనే వార్త తెలిసిందని వాపోయారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల గేటు ముందు ఆందోళన చేశారు. -
హైదరాబాద్: నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం.. హయత్‌నగర్‌లో నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడో తరగతి విద్యార్థి లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ నారాయణ స్కూల్లో హాస్టల్ ఘటన జరిగింది.విద్యార్థి మృతిపై నారాయణ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోంది. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఉరి వేసుకున్నాడని.. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్‌తో మా కుమారుడిని కొట్టించాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.కాగా, సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. -
నీటి కుంటలో పడి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ మహిళ, శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ (11) ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు ప్రయత్నించాడు. ఇందుకోసం కుంటలో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించాడు. సాయం కోసం సుభాష్‌ను వెంట తీసుకెళ్లాడు. అయితే నీటి కుంటలో నుంచి నీటిని తోడేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారి నీటి కుంటలో జారి ఇద్దరూ పడిపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు, ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ మృతి చెందారు.మరో దుర్ఘటనలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో దుర్ఘటనలో బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ కారు ఢీకొంది. రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి తెలిపిన వివరాల మేరకు.. నగరి మండలం మాంగాడుకు చెందిన గోవిందమ్మ(48), తన కుమారుడు భానుప్రకాష్ సమీప బంధువు కిరణ్‌తో కలిసి చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లిలో బంధువుల ఇంట్లో పురుడు ఫంక్షన్‌కు స్కూటర్లో వెళ్తున్నారు.పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వకుళామాత ఆలయం సర్కిల్ వద్ద పేరూరు పంచాయతీలో నుంచి వేగంగా బైపాస్ పైకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు గోవిందమ్మ ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో గోవిందమ్మ స్కూటర్‌పై నుంచి కింద పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.స్కూటర్ నడుపుతున్న కిరణ్, మృతురాలి కుమారుడు భానుప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని తిరుపతి రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి పరిశీలించారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. -
విద్యార్థినులపై ప్రిన్సిపాల్ కర్కశత్వం
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఐనపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడి విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఔటింగ్‌కు వెళ్లి అరగంట ఆలస్యంగా వచ్చారన్న కారణంతో రెండు గంటలపాటు బయట చలిలోనే నిల్చోబెట్టారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు ఆదివారం తల్లిదండ్రులను కలిసేందుకు ఔటింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో వారు తమ తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లారు.సాయంత్రం 4 గంటలలోపు వారు తిరిగి పాఠశాలలోకి వెళ్లాల్సి ఉండగా, అరగంట ఆలస్యంగా రావటంతో ప్రిన్సిపాల్ వారిని లోనికి అనుమతివ్వలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదురుగానే చలిలో సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నారు. అటువైపుగా వెళ్లిన పోలీస్ సిబ్బంది గమనించి ఆరా తీసి పిల్లలను లోపలికి పంపాలని కోరినా ప్రిన్సిపాల్ వినిపించుకోలేదు. ఈ విషయాన్ని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వివరాలు తెలుసుకోవాలని డీటీడీఓకు కలెక్టర్ సూచించారు. దీంతో రంగంలోకి దిగిన డీటీడీఓ సదరు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విద్యార్థినులను హాస్టల్లోకి అనుమతివ్వాలని ఆదేశించడంతో ప్రిన్సిపాల్ దిగొచ్చారు. కాగా ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతోనూ నిత్యం అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ పిల్లలతో మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. -
గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గుండెపోటు తో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల మేరకు.. గ్యార స్వామి, యాదమ్మ దంపతుల కుమార్తె నవ్య (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన కావ్య జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా తగ్గింది. బుధవారం సాయంత్రం తిరిగి జ్వరం రావడంతో బీబీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్వరం, బీపీ ఎక్కువ ఉందని చెప్పడంతో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే నవ్య మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆడపిల్ల కావాలనే కోరికతో స్వామి, యాదమ్మ దంపతులు రెండు నెలల వయసున్న నవ్యను బంధువుల నుంచి దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది -
అమెరికాలో భారత విద్యార్థి కెరియర్ నాశనం.. ఆ ఫొటో కారణమా?
వాషింగ్టన్ : పాలస్తీనాకు మద్దతుగా రాసిన ఓ వ్యాసం అమెరికాలో భారత విద్యార్థి భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పీహెచ్డీ చేస్తున్న ప్లహాద్ అయ్యంగార్‌పై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది.ప్రహ్లాద్ ఎంఐటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎంఐటీ నిర్వహిస్తున్న మల్టీ డిసిప్లినరీ స్టూడెండ్ మ్యాగజైన్లో పాలస్తీనాకు మద్దతుగా ఓ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ‘వివాదాల్ని పరిష్కరించేందుకు యుద్ధం లేదంటే హింసకు పాల్పడాలి ’ అని అర్ధం వచ్చేలా రాసినట్లు తాము గుర్తించామని అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు తెలిపారు. ప్రహ్లాద్ వ్యాసం ఎంఐటీలో హింసకు, నిరసనలకు ప్రేరేపించేలా ఉందని స్టూడెంట్ లైఫ్ డీన్ డేవిడ్ వారెన్ రాండాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వివాదం సృష్టించేలా వ్యాసం రాసినందుకు ప్రహ్లాద్‌పై ఎంఐటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐదు సంవత్సరాల నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను రద్దు చేసింది. క్యాంపస్‌లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి రాసిన వ్యాసాన్ని సైతం స్టూడెండ్ మ్యాగజైన్ నుంచి తొలగించింది.🚨🚨 MIT is effectively expelling PhD student Prahlad Iyengar for Palestine activism on campus. 🚨🚨EMERGENCY RALLY: Cambridge City Hall, Monday, 12/9 at 5:30pm. Org sign-on to letter: https://t.co/tCOrOLTeNy pic.twitter.com/7cAYrvn5ad— MIT Coalition Against Apartheid (@mit_caa) December 8, 2024ఎంఐటీ ఫిర్యాదుతో అమెరికా ప్రభుత్వం సైతం విచారణ చేపట్టింది. భారత విద్యార్థి రాసిన వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అనే ఉగ్రవాద సంస్థ లోగో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. .కాగా, ఎంఐటీ తీసుకున్న నిర్ణయంపై ప్రహ్లాద్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం తాను అందించిన వ్యాసంలోని ఫొటోలే కారణమని చెప్పారు. ఎంఐటీ అడ్మినిస్ట్రేషన్ నన్ను 'ఉగ్రవాదానికి' మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించింది. ఎందుకంటే నా వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఫొటోలు ఉన్నాయి ’ అని అతని తరుఫు న్యాయవాది ఎరిక్ లీ తెలిపారు. గతంలోనూ సస్పెండ్ ప్రహ్లాద్‌పై ఎంఐటీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేయడంతో సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెండ్‌పై అమెరికా క్యాంపస్‌లలో మాట్లాడే స్వేచ్ఛలేదని ఆరోపణలు గుప్పించారు. అడ్మినిస్ట్రేషన్ విభాగం తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తున్నాయి. నేను రాసిన వ్యాసాన్ని మ్యాగజైన్ నుంచి తొలగించడం, బ్యాన్ విధించడం విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల హక్కుల్ని భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు. కాగా, ప్రహ్లాద్ ఎంఐటీ తీసుకున్న చర్యలు పలు అమెరికన్ కాలేజీల్లో విద్యార్థులు మద్దతు పలికారు. డిసెంబర్ 9న కేంబ్రిడ్జ్ సిటీ హాల్లో అయ్యంగార్‌కు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. -
ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!
ఇరవై సంవత్సరాల బ్రిటిష్–ఇండియా స్టూడెంట్ అనౌష్క కాలే కేంబ్రిడ్జిలోని చారిత్రాత్మకమైన ‘కేంబ్రిడ్జి యూనియన్ డిబేటింగ్ సొసైటీ’ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఇంగ్లీష్ సాహిత్యం చదువుతున్న కాలే ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టిన అతి కొద్దిమంది దక్షిణాసియా మహిళల్లో ఒకరిగా నిలిచింది.‘ఎంతో చరిత్ర కలిగిన కేంబ్రిడ్జి యూనియన్ సొసైటీకి అధ్యక్షురాలిగా ఎన్నిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అంటుంది అనౌష్క. వివిధ సాంస్కృతిక సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా యూనియన్‌లో మరింత వైవిధ్యాన్ని తీసుకువస్తాను అని చెబుతుంది. గ్లోబల్ డిబేట్స్పై తనకు ఉన్న ఆసక్తిని తెలియజేసింది. ఇంటర్నేషనల్ స్పీకర్స్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి సారించింది.(చదవండి: ఊరు ఉమెన్ అనుకున్నారా... నేషనల్!) -
నిల్వ ఆహారం తిని 8 మంది బాలికలకు అస్వస్థత
పెదబయలు: ప్రభుత్వం ఆదేశాల మేరకు అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం)లో వండిన ఆహారం మిగిలిపోవడంతో దాన్ని మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి 8 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదబయలు మండలం, గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 7వ తేదీన మెగా పీటీఎం నిర్వహించారు.ఆరోజు తల్లిదండ్రులకు పెట్టిన తరువాత మిగిలిన బంగాళదుంప, బఠానీ కూరను మరుసటి రోజైన ఆదివారం కొంతమంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో పెట్టారు. అదే రోజు సాయంత్రం వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 5వ తరగతి విద్యార్థులు జి.శ్రావణి, చాందిని, పి.స్వాతి, పి.బిందు (4వ తరగతి), కె.హర్షిత(3వ తరగతి), 2వ తరగతి విద్యార్థులు పి.హిందువదన, పి.సెల్లమ్మి, జి.రíÙ్మ అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లో గోమండి పీహెచ్‌సీకి తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ పి.వసంతను వివరణ కోరగా... తల్లిదండ్రుల సమావేశానికి వచి్చన 200మందికి ఆహారం వడ్డించామనీ, మిగిలిన అన్నం, కూరను పారేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.తనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం విజయనగరం వెళ్లానని, విద్యార్థుల అస్వస్థత విషయం ఏఎన్ఎం తనకు ఫోన్లో చెప్పడంతో తక్షణమే పీహెచ్‌సీకి సమాచారం అందించి, విద్యార్థులకు చికిత్స అందించినట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల నుంచి వచి్చన సమాచారం మేరకు సోమవారం స్కూల్‌కు వెళ్లి 11మంది విద్యార్థులకు వైద్యం చేశామనీ, వారిలో పరిస్థితి బాగోలేని 8మందిని పీహెచ్‌సీకి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి చైతన్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
విజయవాడ : సిద్ధార్థ ఫెట్ –2024.. ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)
-
గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన గ్రా మస్థాయి సీఎం క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థి వాలీబాల్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పామిరెడ్డిపల్లి ముందరితండాకు చెందిన సాయి పునీత్ (15) బలిజపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి ఉదయం నుంచి క్రీడాపోటీల్లో పాల్గొన్నాడు.పాఠశాల ఆవరణలో ఉదయం ఒకసారి కళ్లుతిరిగి పడిపోగా.. నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లి నీలమ్మ అక్కడికి చేరుకుంది. అయితే తనకు ఏమీ కాలేదని.. తల్లిని ఇంటికి వెళ్లమని పునీత్ చెప్పటంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ క్రీడల్లో పాల్గొన్న పునీత్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా.. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు జిల్లా కేంద్రంతో పాటు బలిజపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు. -
ఆరోగ్యం బాగాలేదని.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
దుండిగల్: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం మైలారం కొత్త తండాకు చెందిన బలరాం నాయక్, కవితలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు శ్రావణి (18) దుండిగల్‌లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాలలోని హాస్టల్లో ఉంటోంది. రెండు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హాస్టల్కివచ్చినన శ్రావణి.. శుక్రవారం తన ఆరోగ్యం బాలేదని కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హాస్టల్ గదిలోని తోటి మిత్రులు వచ్చి తలుపులు తట్టినా తీయలేదు. హాస్టల్ నిర్వాహకులకు సమాచారాన్ని ఇచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే శ్రావణిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావణి తనకు ఆరోగ్యం బాలేదని కడుపునొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. తమ కుమార్తె శ్రావణి ఎంతో ధైర్యవంతురాలు అని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హాస్టల్ నిర్వాహకులే ఏదో చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కళాశాల ఎదుట మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూలుకు ఆలస్యంగా వచ్చాడని కొట్టినందుకు.. హెడ్మాస్టర్ను కాల్చి చంపాడు!
ఛతర్పూర్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి(17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్‌ను వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్లో చోటుచేసుకుంది. ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా(55) నిందితుడిని, మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది. ‘అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతడొక్కడే నిందితుడనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూం వద్దకు వచ్చాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ ఆగమ్ జైన్ చెప్పారు. -
HYD: ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం.. దుండిగల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. శ్రావణి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, రెండు రోజుల క్రితం వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘటనలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు.అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్‌ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా.. తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. -
స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి దారుణ హత్య
ఇద్దరు స్నేహితుల మధ్య వంట గదిలో జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో 22ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.కెనడా పోలీసుల వివారాల మేరకు.. సుమారు నాలుగు నెలల క్రితం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం లుథియానాకు చెందిన 22 ఏళ్ల గురాసిస్ సింగ్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ సర్నియా నగరంలో లాంబ్టన్ కాలేజీలు చేరాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో తన 34 క్రాస్లీ హంటర్‌తో కలిసి ఉంటున్నాడు.అయితే, ఈ తరుణంలో నవంబర్ 30 రాత్రి తన రూమ్‌లో ఓ విషయంలో గురుసిస్‌కు,హంటర్ల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారి తీసింది. కిచెన్‌లో ఉన్న గురుసిస్ను హంటర్ కత్తి దాడి చేశారు. ఈ ఘటనలో గురుసిస్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ దుర్ఘటన అనంతరం, గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడు హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, ఈ హత్యపై విచారణ నిర్వహిస్తున్నామని సర్నియా పోలీస్ అధికారి డేవిస్ తెలిపారు. హత్యకు గల కారణాల్ని వెలుగులోకి తెస్తామన్నారు. కాగా, గురుసిస్ హత్యపై లాంబ్టన్ కాలేజీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. -
గన్నవరం విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద బుల్లెట్లు స్వాధీనం
-
పుష్ప రాజ్ మేనియా.. టీచర్‌కి షాక్!
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఎక్కడ చూసిన "పుష్ప" మేనియా ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఇక స్కూళ్లలోనూ కూడా ‘పుష్ప’ హవా నడుస్తోంది.. అందులో ఒక స్కూల్లో అయితే, ఒక విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్‌గా మారింది. ఎందుకో తెలుసా...?. ఆ స్టూడెంట్‌కి "పుష్ప: ది రూల్" సినిమా అంటే పిచ్చి! అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా! సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని "తపన" పట్టుకుంది. కానీ స్కూల్ కి వెళ్ళాలి! ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి, ఒక "ధైర్యమైన" నిర్ణయం తీసుకున్నాడు. మాష్టారు గారికి ఒక లెటర్ రాశాడు.అందులో ఏముందో తెలుసా..?.. "సార్, నేను పుష్ప సినిమాకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ హీరో నా ఫేవరెట్. దయచేసి నాకు లీవ్ ఇవ్వండి." అంతే! నిజాయితీగా లీవు అడిగేశాడు. లెటర్ చదివిన టీచర్ కి మొదట షాక్..! తర్వాత ఆనందం! "ఇంత నిజాయితీగా లీవు అడిగే విద్యార్థిని ఇంతవరకు చూడలేదు" అనుకున్నారు. తన శిష్యుడు నిజం చెప్పాడు అని గర్వంగా ఫీల్ అయి..,ఏం చేశారంటే, ఆ లెటర్ ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేశారు!. "పుష్ప" సినిమా కన్నా ఆ లెటర్ వైరల్ అయిపోయింది.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా? -
మెడిసిన్ సీటు దక్కలేదని...
రాయదుర్గం టౌన్: రాయదుర్గం టౌన్: వైద్య కళాశాలలో సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువతి వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా) జిల్లా సేడం పట్టణానికి చెందిన కిషోర్‌కుమార్ కుమార్తె తనూజ (20) మంగళవారం ఉదయం చిత్రదుర్గం చేరుకుని అక్కడి వైద్య కళాశాలలో సీటు కోసం ప్రయత్నించింది. అయితే ఆమెకు సీటు దక్కకపోవడంతో అదే రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి రాయదుర్గం మీదుగా హోస్పేట్‌కు వెళ్లే రైలులో తిరుగు ప్రయాణమైంది. ప్రయాణిస్తూనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు మెడికల్ సీటు దక్కలేదని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపింది. అప్పటికే మధ్యాహ్నం 1 గంట. రాయదుర్గం శివారులోని పైతోట సమీపంలో వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కుమార్తె ఫోన్ కాల్‌తో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పలుమార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో విషయాన్ని వెంటనే కర్ణాటక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తనూజ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు గాలింపు చేపట్టారు.ఈ క్రమంలో బుధవారం ఉదయం పైతోట వద్ద గ్యాంగ్‌మెన్ నగేష్... పట్టాలు పక్కనే పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో గుంతకల్లు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలను పరిశీలించి తనూజగా నిర్ధారించారు. అక్కడే పడి ఉన్న ఫోన్లోని నంబర్‌కు కాల్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు రాయదుర్గానికి ప్రయాణమైనట్లు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఒత్తిడే శత్రువై.. మృత్యువై..
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య.. అమ్మ తిట్టిందని.. సూసైడ్.. సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. టీచర్ మందలించారని బలవన్మరణం.. ఇలా ప్రతిదానికీ చనిపోవడమే శరణ్యమని భావిస్తున్నారు ప్రస్తుత విద్యార్థులు. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చాయని, ఎంత చదివినా గుర్తుండట్లేదని.. ఇలా పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నగరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒత్తిడిని భరించలేక.. సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. రోజంతా వేరే వాళ్లు చెప్పింది వినడమే తప్ప తమ సొంత ఆలోచనలు కూడా చేయలేని పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతుంటారు. మార్కుల గోల.. పోల్చడం సబబేనా? కాలేజీల్లో పెట్టే పరీక్షల వేళ.. మార్కుల విషయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అంతేకాకుండా వేరే వారితో పోల్చడంతో మరింత నిరాశకు లోనై.. తనకు చదువు రాదని, ఎంత చదివినా గుర్తుండదని ఆత్మ న్యూనతా భావంతో బాధపడుతుంటారు. ఆ సమయంలో ఒకవేళ మార్కులు తక్కువ వచ్చాయని ట్యూటర్ కానీ టీచర్ కానీ మందలిస్తే దారుణమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉండది. ఇతరులతో పోల్చడం సరికాదు.. తల్లిదండ్రులు, టీచర్లు, మెంటార్లు, బంధువులు కూడా మార్కులు ముఖ్యమని చెబుతుండటం.. అందుకోసం తీవ్రంగా కష్టపడ్డా కూడా మార్కులు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయితే మానసిక స్థైర్యం, మైండ్‌సెట్ అనేది మార్కుల కన్నా ముఖ్యమని ఎవరూ చెప్పరు. పాజిటివిటీ నింపాల్సిన వారు కూడా ఎప్పుడూ తెలియకుండానే ఒత్తిడి తీసుకొచ్చేలా మాట్లాడటం అస్సలు చేయకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. వేరే వారితో పోల్చడం, తక్కువ చేసి మాట్లాడటం, బ్లేమ్ చేస్తుండటం వల్ల వారిలోని శక్తిసామర్థ్యాలు మరింత తగ్గుతాయి. ప్రేమతో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయకుండా, కరుకుగా మాట్లాడుతుండటం వల్ల ఆత్మన్యూనత పెరుగుతుంది. గది వాతావరణం గుంపులు గుంపులుగా.. ఎప్పుడూ చదువుకుంటూ ఒకే గదిలో వెలుతురు లేని ప్రాంతాల్లో ఒకే దగ్గర ఉండటంతో మానసికంగా ఇబ్బంది. స్ట్రెస్ వచ్చేలా వాతావరణం.. ప్రశాంతత ఉండకపోవడంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. మెడిటేషన్‌తో ప్రశాంతత ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఉండేలా చూడాలి. ఉదయమే యోగా లేదంటే మెడిటేషన్ చేస్తుండాలి. కనీస శారీరక వ్యాయమం చేసినా కూడా శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక, సరైన ఆహారం తీసుకోకపోవడంతోనూ మానసిక దృఢత్వంతో ఉండరు. ప్రశాంత వాతావరణం కల్పించాలి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడాలి. చదువు మాత్రమే కాకుండా వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలి. వారానికోసారి మానసిక ఎదుగుదలకు సంబంధించి.. ఆత్మన్యూనతను తగ్గించేందుకు క్లాసులు పెట్టాలి. సృజనాత్మకత పెంపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి సారించేలా.. వాటిని సాధించే దిశగా కృషి చేసేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. – డాక్టర్ కృష్ణ ప్రసాద్ దేవరకొండ, సైకాలజిస్టు, న్యూరో మైండ్‌సెట్ కోచ్ -
అభిప్రాయం చెప్పాడని దండన!
అసభ్యకరంగా దూషించలేదు.. ఎవరినీ కించపరచలేదు.. ఒక్కరినీ పల్లెత్తు మాట అనలేదు. ఎలాంటి చాలెంజ్లూ చేయలేదు.. అయినా కూటమి ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం.. ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘కూటమి పార్టీలు ఇంకా సీఎం క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకోలేదు’ అని అభిప్రాయం చెప్పడమే ఆ విద్యార్థి పాలిట శాపమైపోయింది. అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ను పట్టుకోవడానికి వచ్చినట్లు.. క్రైమ్, సస్పెన్స్ సినిమాలను తలదన్నేలా గ్రామంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. కోడి కూయక ముందే సీఐడీ పోలీసుల బృందం గ్రామాన్ని చుట్టుముట్టి.. ఆ విద్యార్థిని పట్టి బంధించింది. ఆపై ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఇన్నోవాలో ఎక్కించుకుని వెళ్లిపోయింది. ఈ పరిణామాన్ని ఏమనాలి? బహుశా తాలిబన్లు కూడా ఇలా వ్యవహరించి ఉండరు!వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామం బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారుజామున సీఐడీ పోలీసులు గ్రామంలోకి వచ్చారు. గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి అలజంగి యఘ్నేష్ ఇంటిని చుట్టుముట్టారు. తీరా చూస్తే ఎప్పుడో రెండేళ్ల కిందట కూటమి పార్టీలపై తన అభిప్రాయం చెప్పాడని, గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ‘సీఎం క్యాండిడేట్ ఎవరో నిర్ణయించుకోలేదు’ అన్నందుకు ఇప్పుడు ఈ విద్యార్థిపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. అసలు ఎవరు ఫిర్యాదు చేశారు.. ఏమని ఫిర్యాదు చేశారు.. తమ కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక తల్లిదండ్రులు వెంకటనాయుడు, వెంకటరత్నంలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టారు. ఎవరని ప్రశ్నిస్తే యఘ్నేష్ స్నేహితులమని చెప్పారు. తలుపు తీసి చూస్తే పోలీసులు. మంచంపై నిద్రపోతున్న మా కుమారుడిని పట్టుకున్నారు. యఘ్నేష్తో చిన్న పని ఉంది.. అరగంటలో మళ్లీ వచ్చేస్తాం అన్నారు. పార్వతీపురంలోని భాస్కర్ డిగ్రీ కాలేజీలో బీకాం సెకండియర్ చదువుతున్నాడు. మంగళవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరో వారం రోజుల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పినా వినిపించుకోలేదు’ అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. యఘ్నేష్కు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పట్టుకుపోవడం తగదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా, యఘ్నేష్ను సీఐడీ పోలీసులు గుంటూరు తీసుకెళ్లారని సమాచారం. -
ఐదు నెలలుగా పులిహోరనే దిక్కు
కుల్కచర్ల: ‘విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పులిహోర ఒక్కటే టిఫిన్‌గా పెడుతున్నారు. ఏడాదిలో పది రోజులు మాత్రమే పాలు ఇచ్చారు. రెండుసార్లే గుడ్లు ఇచ్చారు. భోజనం నాసిరకంగా ఉండడంతో తినలేక పస్తులుంటున్నాం..’అని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ వసతి గృహంలో ఉంటున్న బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ హాస్టల్‌ను సందర్శించిన తహసీల్దార్ మురళీధర్‌కు తమ గోడు విని్పంచారు. వసతి గృహంలో గదులను తామే శుభ్రం చేసుకుంటున్నామని, మరుగుదొడ్లలోకి బకెట్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.చలిపెడుతున్నా నేలపైనే పడుకుంటున్నామని, బెడ్ïÙట్లు కూడా ఇళ్ల నుంచి తెచ్చుకున్నామని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయాలను ఎంఈఓ హబీబ్ అహ్మద్ వెంటనే డీఈఓకు తెలియజేయడంతో ఆమె వెంటనే వసతి గృహానికి చేరుకున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు:డీఈఓ డీఈఓ రేణుకాదేవి మోడల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నా రు. పాలు, కూరగాయలు, చికెన్, మటన్, గుడ్లు పంపిణీ చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. భోజనం కూడా నాణ్యతతో ఉండటం లేదని తెలిపా రు. దీనిపై డీఈఓ స్పందించారు. మెనూ ప్రకారం భోజన వస్తువులను సరఫరా చేయని టెండరు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆమె వెంట మిషన్ భగీరథ డీఈ సుబ్రమణ్యం, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి తదితరులు ఉన్నారు. -
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్‌లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
ఒక స్కూల్లో ఒకే స్టూడెంట్.. ఏడాది 13లక్షల ఖర్చు
-
ఉప్పెనలా ఊబకాయం
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్‌ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు.రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ⇒ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ⇒ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. ⇒అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. ⇒మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. ⇒టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. ⇒ప్రీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. ⇒ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది.ఊబకాయం ఇలా..⇒ జంక్‌ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ⇒జంక్‌ఫుడ్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. ⇒ కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. ⇒ టీవీ, సెల్‌ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ⇒ తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు.వ్యాయామం తప్పనిసరిఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్‌ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్‌కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురంజీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్‌కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ఇలా చేస్తే మేలు.... జంక్‌ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి టీవీ, సెల్‌ఫోన్ చూసే సమయం తగ్గించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తల్లిదండ్రులు శ్రద్ధతో పిల్లలతో వాయింగ్ చేయించాలి ఊబకాయం ఉన్న పిల్లలను రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించాలి -
గొప్పలు చెప్పుకోకుండా బాధ్యత వహించాలి
సాక్షి, హైదరాబాద్: ‘కల్తీ ఆహారంతో పేద విద్యార్థి మృతి చెందడం బాధాకరం. ఈ దుస్థితికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యులు కారా ? దేశంలో ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకోకుండా బాధ్యతగా వహించాలి. ఏదో ఒకరోజు కాకుండా.. అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలి. విద్యార్థులు వసతిగృహాల్లో ఉన్నారంటే వారు ఎంత పేదవారో అర్థం చేసుకోవాలి. శిథిలావస్థలో ఉన్న బాలుర, బాలికల వసతి గృహాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. వసతి గృహాలు పూర్తి శిథిలావస్థగా మారాయంటే దానికి అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యమే అందుకు నిదర్శనం’అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ స్పష్టం చేశారు.మంగళవారం రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాలలక్షి్మ, తిరుమలగిరి సురేందర్‌లతో కలిసి నిరంజన్ విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో ఒక హాస్టల్ పరిస్థితి చూద్దామని అక్కడకు వెళ్లాం. రెండేళ్ల నుంచి అద్దె చెల్లించడం లేదని చెప్పడంతో తలదించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబ్‌నగర్ హాస్టళ్లలో 200 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట దాదాపు 300 మందికిపైగా ఉన్నారు. ఇలాఉంటే విద్య ఎలా సాగుతుంది. ఇలాంటి వాటిపై రాజకీయ నేతలందరూ దృష్టి పెట్టాలి’అని ఆకాంక్షించారు. తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఎవరైన అపోహలు కల్పించినా, తప్పుడు సమాచారం ఇచ్చి నా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అలా చేసే వారిని తెలంగాణ సమాజం, బీసీలు క్షమించరన్నారు. బహిరంగ విచారణలో ‘తోలుబొమ్మలాట వృత్తిలో ఉన్న వారికి కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలని, కలెక్టర్, తహసీల్దార్‌కు ఆదేశాలివ్వాలని, దేవాలయాల్లో గానుగ నూనె వాడుతారని, దానికి గానుగ వృత్తి ఉన్నవారికి అవకాశం కలి్పంచాలని, గంగపుత్రులను బీసీ ‘బీ’నుంచి బీసీ డీకి మార్చాలని పలువురు కోరారని కమిషన్ చైర్మన్ తెలిపారు. పందిరి వేసే మేదర కులం వారికి డెకరేషన్, తయారీపై శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారన్నారు. 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. -
ఉద్రిక్తత మధ్య శైలజ అంత్యక్రియలు
వాంకిడి (ఆసిఫాబాద్): హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ అంత్యక్రియలను స్వగ్రామం ధాబాలో ఉద్రిక్తతల మధ్య మంగళవారం నిర్వహించారు. అక్టోబర్ 30వ తేదీన పాఠశాలలో భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజకు.. 21 రోజులపాటు నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం వేకువజామున 3 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ధాబా గ్రామానికి తీసుకువచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధాబా గ్రామానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. ధాబా గ్రామానికి వెళ్లేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసుల కన్నుగప్పి గ్రామానికి చేరుకున్న మాలి సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కచి్చతమైన హామీ ఇచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు శైలజ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఎక్స్‌గ్రేషియా విషయంపై మంత్రి సీతక్కతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.20 వేలు.. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష నగదును అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ముగిశాయి. అనంతరం శైలజ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, పాల్వాయి హరీశ్‌బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
బాలికను మభ్య పెట్టి.. ఫొటోలు తీయించి
మంథని: ఫొటోలు తీసి ఓ వ్యక్తికి పంపిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, కనకవర్షం కురుస్తుందని ఓ విద్యార్థినికి వంట మనిషి మాయమాటలు చెప్పింది. తన గదిలోకి తీసుకెళ్లి ఓ యువకుడితో ఫొటోలు తీయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో కలకలం సృష్టించింది. అధికారుల కథనం ప్రకారం.. మంథనిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఓ వసతి గృహంలో ఉంటున్న బాలికను ఈ నెల 18న ఆ హాస్టల్ వంట మనిషి తన గదికి తీసుకెళ్లింది. ఓ యువకుడిని పిలిపించి బాలిక ఫొటోలు తీయించిన తర్వాత బాలికను యధావిధిగా పాఠశాలకు పంపించింది. మరుసటిరోజు ఆ బాలిక తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. సోమవారం తల్లిదండ్రులతో కలిసి హాస్టల్‌కు తిరిగివచ్చిoది. అయితే హాస్టల్లో ఉండేందుకు బాలిక ఇష్టపడలేదు. తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం వివరించింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు వంట మనిషిని నిలదీశారు. భయపడిన ఆమె వారి నుంచి తప్పించుకుని పారిపోయింది. దీనిపై ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి నాగైలేశ్వర్ మంగళవారం హాస్టల్లో విచారణ జరిపారు. కలెక్టర్‌కు నివేదిక ఇస్తానని, వంట మనిషిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని, హాస్టల్ ఇన్చార్జి వార్డెన్, డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న వాచ్‌మెన్‌ను బదిలీ చేస్తామని చెప్పారు. ఈ సంఘటన సంచలనం సృష్టించడంతో మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు భారీగా తరలివచ్చి అ«ధికారులు, సిబ్బందిని నిలదీశారు. పోలీసుల అదుపులో యువకుడు? బాలికను ఫొటోలు తీసిన మంథనికి చెందిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫొటోలు తీసే సమయంలో సదరు యువకుడికి మరో వ్యక్తి వీడియో కాల్ చేశాడని, అప్పుడు బాలికను ఫొటోలు తీసిన యువకుడు ఆ వ్యక్తికి చూపించాడని తెలుస్తోంది. పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తుండగా, బాలికను వంట మనిషి అసలెందుకు తీసుకువచ్చిoది? ఫొటోలు ఎందుకు తీశారు? క్షుద్ర పూజల కోసమా? సెక్స్ రాకెట్ నడుస్తోందా? అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మియాపూర్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.