
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
బయ్యారం: కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక ఒక విద్యార్థి బల వన్మరణానికి పాల్ప డ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని కాకతీయనగర్‌లో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. కాకతీయనగర్‌లో నివసించే అజ్మీరా అనంతరాములు కుమారుడు సాయిమహేశ్(19) సిద్దిపేటలోని ఒక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ చదువుతున్నాడు.
హోలీ సందర్భంగా ఇంటికి వచ్చిన సాయిమహేశ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టం లేక.. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment