
షాద్ నగర్‌లోని ఓ పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్‌లోని ఓ పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్‌లో ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్.. స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
మరో ఘటనలో ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.