school students
-
పిల్లలూ దేవుడూ.. చల్లనివారే
మామా మందుకు డబ్బుల్లేవా.. డోంట్ వర్రీ మామా.. నేనున్నాను కదా పదా పోదాం.. ఇదిగో సిగరెట్ తీసుకో బావా.. భయమెందుకు నేనున్నా.. కదా.. బే ఫికర్ బ్రదర్.. నేను చూస్కుంటానులే.. ఈ చొక్కా నచ్చిందా తీసుకో.. నేను బిల్లు పే చేస్తాను.. ఆగాగు.. టిక్కెట్ నువ్వెందుకు తీయడం.. నీకసలే జీతం తక్కువ.. ఇంకెప్పుడూ పక్కన నేను ఉండగా నువ్వు జేబులో చేయి పెట్టొద్దు.. పెట్రోల్ నేను పోయిస్తాను తమ్ము.. నువ్వెందుకు కంగారు పడతావ్... ఇలాంటి స్నేహాలు మనం చూస్తూనే ఉన్నాం..వద్దులే లక్ష్మి ఆటోచార్జీ పది రూపాయలు నువ్వు ఇవ్వకు.. నేను ఇస్తాలే.. ఒసేయ్ మంగా మేమంతా తలో రెండొందలతో ఆరుకు వెళ్తున్నాం.. నువ్వూ రావాలి.. డబ్బులెం ఇవ్వద్దులే.. మేం చూసుకుంటాం.. జస్ట్ నువ్వు ఆటో ఎక్కు చాలు.. ఇదీ హౌస్ వైవ్స్ స్నేహం.. హలొ.. బ్రదర్ రాజేష్.. మనవాళ్ళం ముగ్గురం బిజినెస్ పెడుతున్నాం తలో టూ క్రోర్స్ ఉండాలి.. నువ్వు అంత పెట్టలేవు.. ఎంత ఉంటే అంత పెట్టు.. చాలు.. మిగతాది మేం చూస్తాం.. నువ్వేం ఫీల్ కావద్దు.. హలో రెడ్డీ.. ఈ బిజినెస్ మనదే.. పెట్టుబడి నేను పెడతాను.నువ్వు జస్ట్ డబ్బుల్లేకున్నా వర్కింగ్ పార్ట్నర్ గా ఉండు.. పని మొత్తం నువ్వే చూసుకో.. ఇదో టైప్ స్నేహం.. అసలు స్నేహం.. ఇతరులకు సహాయం చేయడం ఇది ఒక జీవన విధానం అయింది.. చిన్నప్పుడు తెచ్చుకున్న బిస్కెట్ ముక్క.. కాకెంగిలి చేసి ఇచ్చిన ఉసిరికాయ లంచ్ టైములో తన డబ్బాలోంచి తీసిచ్చిన చిన్న ఆవకాయ ముక్క.. ఇవన్నీ మనలోని ఒక ఆత్మీయ భావనకు సూచికలు ...ఒక్కడే తిన్నది తిండీ కాదు.. ఒక్కడే బతికింది బతుకూ కాదు.. మనిషి సంఘ జీవి.. తాను బతుకుతూ ఇంకొందరిని బతికించాలి.. తానూ తింటూ ఇంకొకరి ఆకలి తీర్చాలి అప్పుడు కదా జీవితానికి సార్థకత. కాకి .. పిచ్చుక.. కుక్కలు కూడా తాము తింటూనే అక్కడ అక్కడ గింజలు.. మెతుకులు ఉన్నాయ్.. మీరూ రండి అని తోటివాళ్లను పీలుస్తాయి.. అంతా కలిసి ఆకలి తీర్చుకుంటాయి.. కానీ మనిషి ఒక్కడే తాను తింటే చాలనుకుంటాడు.చిన్న పిల్లలు.. పెద్ద మనసులు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ స్కూల్లో పిల్లలు తమ సహచరుడి ఫీజ్ కోసం ఎంత యాతన పడ్డారు.. వారంతా ఐక్యంగా ఆ సమస్య నుంచి తమ మిత్రుడిని ఎలాగట్టెక్కించారన్నది ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీనికి వేళల్లో షేర్లు.. వందల్లో కామెంట్లు వచ్చాయి. స్కూల్లో ఫీజు చెల్లించలేదని ఒక అబ్బాయిని స్కూలు మేనేజిమెంట్ ప్రశ్నిస్తుంది.. అయితే తన తండ్రి పేదరికం కారణంగా ఆ పిల్లడు ఫీజు సకాలంలో చెల్లించలేకపోతాడు.. దీంతో అతని సహచరులు.. అంతా పదేళ్లలోపు పిల్లలే అయినా పెద్దమనసు చేసుకుంటారు.. తలా కొంత వేసుకుని స్నేహితుడి ఫీజు చెల్లిస్తారు.వారు తమలోతాము చందాలు వేసుకుంటుండగా టీచర్ వచ్చి అబ్బాయిలు.. మీ ఫ్రెండ్ ఫీజు సంగతి నేను చూసుకుంటాను.. మీరు వెళ్ళండి.. మీకెందుకురా కష్టం అని చెబుతున్నా.. మీ సాయం మాకు అవసరం లేదు.. మా వాడికి మేమున్నాం.. మేం చూసుకుంటాం అని వారంతా ఏకమై తమ మిత్రుడి ఫీజు చెల్లించిన వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. తనకోసం వాళ్లంతా ఇలా డబ్బులు వేసుకోవడాన్ని చూసిన ఆ పిల్లడు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనకైనా మనసు కరుగుతుంది. ఇది కదా పిల్లలలో ఉండాల్సింది. ఇలాంటి లక్షణాలు కదా పిల్లల్లో మొలకెత్తాలి.. అలా పిల్లల్లో పురుడుపోసుకున్న ఆలోచనలకూ తల్లిదండ్రులు సైతం తోడ్పాటును ఇవ్వాలి-సిమ్మాదిరప్పన్న These young good hearts collected money to pay fees of his friend 🥺I hope these young angels continue their pure and innocent spirit and bless the world 🙌 pic.twitter.com/BGQ2uw9d5o— Vineeta Singh 🇮🇳 (@biharigurl) February 7, 2025 -
స్కూల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్‌లోని ఓ పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్.. స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఈ నేరప్రవృత్తికి కారణాలేమిటి?
క్రమశిక్షణే విద్యార్థికి సంస్కారవంతమైన విద్యను అంది స్తుంది. క్రమశిక్షణే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. అది లోపించడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు కొన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యా యులపై దారుణంగా భౌతిక దాడులకు దిగడం అందులో ఒకటి. రాయచోటి (Rayachoty) పట్టణంలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ‘ఏజాష్ అహ్మద్’ అనే ఉపాధ్యాయునిపై ఇద్దరు విద్యార్థులు పిడిగుద్దులతో భౌతికదాడి చేయడంతో టీచర్ ప్రాణాలు విడిచారు. తన తరగతిలో బోధన చేస్తుండగా, పక్క క్లాసులో అల్లరి చేస్తున్న వారిని టీచర్ మందలించారు. అంతే... కోపోద్రిక్తులై టీచర్‌పై దాడిచేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలు మరవక ముందే మరో రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చత్తర్‌పూర్ జిల్లాలోని ధామోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ‘సురేంద్రకుమార్ సక్సేనా’పై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది కూడా పాఠశాలకు విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని మందలించడం వలనే జరిగింది.దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా రకరకాల కారణాలతో జరిగాయి. కానీ మూడు – నాలుగు రోజుల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే కారణంతో పై సంఘటనలు సంభవించడం బాధా కరం. విద్యారంగంలో జరుగుతున్న ఈ దారుణ పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలు స్వతహాగా సున్నిత హృదయులు. వారి లేలేత మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇంటిలో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు మెలగాలి. పిల్లలు ఎక్కువ సమయం మిత్రులతో గడుపుతారు. ఈ క్రమంలో సహవాస దోషం వల్ల కొన్ని చెడ్డ అలవాట్లు సంక్రమిస్తాయి. దీన్ని ఎవరైనా వ్యతిరేకించి మందలిస్తే, వారిని శత్రువులుగా పరిగణిస్తారు. అందుకే వారిని అనునయిస్తూ పరిష్కారాలను కనుగొనాలి.చిన్నతనంలో కుల, లింగ వివక్ష, లైంగిక వేధింపులకు గురి కావొచ్చు. ఇవన్నీ పిల్లల విపరీత ధోరణికి కారణమౌతాయి. టీనేజ్ పిల్లలు రాత్రనక పగలనక స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలు చూస్తూ కాలం గడుపుతుంటారు. బెట్టింగ్, రమ్మీ, రేసింగ్ లాంటి ఆటల్లో పాల్గొని డబ్బు పోగొట్టుకుంటారు. దీంతో ప్రతీ విషయానికీ కోపం, అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. వీటన్నింటి వల్లనే నేడు విద్యార్థులలో వింత ప్రవర్తన చూస్తున్నాం. ఈ కారణాలతోనే పిల్లలు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, రీల్స్ చూసి నాయికా నాయకులను అనుకరిస్తున్నారు. ఈ రోజుల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులు సైతం ధూమపానం, మద్యం సేవించడం చూస్తున్నాం. ఇవన్నీ పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచేవే.ఒక విద్యార్థిని ‘నీకేమీ రాదు, నీవు దేనికీ పనికి రావు’ అని పది మందిలో తక్కువ చేసి టీచర్ మాట్లాడకూడదు. శారీరకంగా శిక్షించకూడదు. దాన్ని అవమానంగా భావించి కృంగిపోతాడు. గ్రామీణ విద్యార్థులను చులకనగా చూడకూడదు. వీరికి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించకూడదు. వీరికి అవసరమైన పక్షంలో ప్రాథమిక నైపుణ్యాలు నేర్పాలి. స్కూల్లో అందరు టీచర్లూ ఐక్యంగా ఉండాలి. పాఠశాలల్లో సహ పాఠ్యేతర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. వాటిలో విద్యార్థులను భాగస్వామ్యలుగా చేయాలి. అవసరమైతే పాఠశాలలో సైకియాట్రిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఇప్పించాలి.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నంబడి గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను, పత్రికలను పిల్లలు చదివేలా చూడాలి. సైన్స్, సోషల్, మోరల్ క్లబ్బులను నిర్వహించాలి. ప్రపంచీకరణ వల్ల సంక్రమించిన వస్తువుల వల్ల కలిగే నష్టాలను ఎరుక పరచాలి. ప్రభుత్వమైతే విద్యా ప్రణాళికలో మార్పులు చేయవచ్చు. ఆ మార్పులు సామాజిక అంతరాలను నిలువరిస్తూ, మానవత్వాన్ని చాటేలా ఉండాలి. స్ఫూర్తిదాయక, నీతి ప్రబోధక పాఠ్యాంశాలను తప్పనిసరిగా చేర్చాలి. అప్పుడే విద్యార్థికి విలువలతో కూడిన విద్య అందుతుంది. లేనిచో విద్యార్థుల్లో హింసాప్రవృత్తి పెచ్చు మీరిపోయి, రాబోవు యువతరం నిర్వీర్యయ్యే ప్రమాదం లేకపోలేదు.- పిల్లా తిరుపతిరావుతెలుగు ఉపాధ్యాయుడు -
మళ్లీ పురుగుల అన్నమే!
నారాయణపేట/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మధ్యాహ్న భోజనం విషతుల్యమై ఒకేసారి వంద మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైనా అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం కూడా అదే పురుగుల అన్నం వడ్డించారు. బుధవారం ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రుల్లో చేరిన విద్యార్థులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. ఆ మరుసటి రోజే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. గురువారం ఉదయం నారాయణపేట కలెక్టర్ సిక్తా పటా్నయక్ స్వయంగా పాఠశాలను సందర్శించి వంట గది, స్టాక్ రూమ్‌లను పరిశీలించి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో వేర్వేరుగా మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా వండించా లని డీఈఓ అబ్దుల్ ఘనీ, ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమను ఆదేశించారు. దీంతో మాగనూర్‌లోని ఎస్సీ విద్యార్థుల వసతి గృహం నుంచి వంట మనుషులను పిలిపించి.. అన్నం, సాంబార్, కూరలు వండించి విద్యార్థులకు వడ్డించారు. ఆ అన్నంలో కూడా పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్.. అదనపు కలెక్టర్ బేన్‌షాలం (రెవెన్యూ)ను పాఠశాలకు పంపారు. పురుగుల అన్నం వడ్డించింది వాస్తవమేనని అదనపు కలెక్టర్ నిర్ధారించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్.. డీఈఓ అబ్దుల్‌ఘనీపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతకు ముందే ఎంఈఓ హెచ్ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం బాబురెడ్డిని సస్పెండ్ చేశారు.ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీ నిర్వాహకులను విధుల నుంచి తొలగించారు. విద్యార్థులకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శ ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రిపాలైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ గురువారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి ఘటన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. విషాహారం తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఇక్కడ కూడా పురుగులు ఉన్న టిఫిన్ పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. -
ఏపీ సచివాలయంలో బడి పిల్లలు
-
ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ నచ్చడం లేదు!
‘మాకు హీరో ప్రభాస్‌లాగా హెయిర్ స్టైల్ కావాలి.. జుట్టు పొడుగ్గా పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.. గాజులు వేసుకొనేందుకు పర్మిషన్ ఇవ్వాలి. టీచర్ల మాదిరిగా చీరలు కట్టుకోవాలని ఉంది’.. వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకొనేందుకు అధికారులు ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థులు వేసిన వినతులు ఇవి. ఆహారం బాగా లేదనో, హోం వర్క్ ఎక్కువ ఇస్తున్నారో, పుస్తకాలు లేవనో ఫిర్యాదులు వస్తాయని అధికారులు ఆశించారు. కానీ, ఫిర్యాదు బాక్సుల్లో మాత్రం ఇలాంటి వినతులు కనిపించాయి.దీనిపై ఓ విద్యార్థిని ఒక సీనియర్ అధికారి ప్రశ్నించగా.. ‘స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ హెయిర్ కట్ ‘తాపేలి కట్’చేస్తున్నాడు. అది నచ్చడం లేదు. అందుకే హీరోల వంటి హెయిర్ కట్ కావాలని కోరాం’ అని తెలిపాడు. ఈ విషయంలో వారు సీరియస్‌గానే ఉన్నారని ఆ అధికారి చెప్పారు. ‘ఈ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడలేరు. అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించాం. వీళ్ల ఫిర్యాదులు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు’అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలలో పూజలు ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది విద్యార్థినులు సీనియర్లు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్రభావమే... ఇదంతా సోషల్ మీడియా ప్రభావమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ‘క్యాంపస్‌లలో ఫోన్లను అనుమతించనప్పటికీ, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదే. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో తెలియాలి’ అని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్మెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. కోవిడ్ –19కి ముందు ఎక్కువ ఫిర్యాదులు ఆహారం నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ గురించి ఉండేవని.. ఇప్పుడు ఇలా ఉంటున్నాయని చెప్పారు.చదవండి: ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది -
కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
-
కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్ షాక్
సాక్షి,కడపజిల్లా: కడప నగరంలో బుధవారం(ఆగస్టు21) మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. తెగిపడి రోడ్డుపై పడ్డ కరెంటు తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి గాయాలయ్యాయి.తన్వీర్(11), ఆదాం(10)లు సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తుండగా నగరంలోని అగాడీ వీధిలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్‌శాఖ అధికారుల నిర్లకక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. -
మా దారి గూండాగిరి!
కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ నేతలు ఏకంగా పాఠశాలకు విద్యార్థులు రాకుండా రోడ్డును తవ్వ .. ముళ్ల కంప అడ్డం వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి పంచాయతీలోని ముద్దలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ మద్దతుదారును గెలిపిస్తేనే ‘దారి’ ఇస్తామని ఆ పార్టీ నేతలు విజయ్‌కుమార్, రాయల్ మంజునాథ్ చౌదరి తెగేసి చెప్పడంతో మరో దారి లేక పిల్లల తల్లిదండ్రులు వారు చెప్పినట్లుగా ఓట్లేశారు. -
వయనాడ్ విలయం : ఆ చిన్నారి చెప్పిందే నిజమైంది! కానీ తండ్రి దక్కలేదు
కేరళలోని వయనాడ్ ప్రకృతి ప్రకోపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఆచూకీ తెలుసు కునేందుకు సహాయక బృందం, అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విపత్తు గురించి ఓ చిన్నారి ముందే ఊహించిందా? గత సంవత్సరం తన పాఠశాల మ్యాగజైన్లో, 8వ తరగతి విద్యార్థిని లయ, జలపాతంలో మునిగిపోయిన బాలిక గురించి ఒక కథ రాసింది. అచ్చం వయనాడ్ విధ్వంసాన్ని పోలిన ఈ కథ బెస్ట్ స్టోరీగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్‌గా మారింది.వయనాడ్ జిల్లాలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్న లయ అనే బాలిక రాసిన కథ ప్రస్తుత విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. జలపాతంలో మునిగి ఒక అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పక్షిగా మారి, తిరిగి అదే గ్రామానికి తిరిగి వచ్చి రానున్న పెను ముప్పు గురించి హెచ్చరిస్తుంది. "వర్షం కురిస్తే, కొండచరియలు జలపాతాన్ని తాకుతాయి, ఆ ధాటికి అపుడు మానవ జీవితాలతో సహా మార్గంలో ఉన్న ప్రతిదానిని ముంచెత్తుతాయి" ఇదీ ఆమె కథ సారాంశం. కథలో భాగంగా అనశ్వర, అలంకృత అనే ఇద్దరు స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పకుండా జలపాతం చూడటానికి వెళతారు. అపుడు "పిల్లలూ ఈ ఇక్కడి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది" అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఆ పిల్లలు పారిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి భారీగా వర్షపు నీరు, మట్టి, బురద వేగంగా ఆ గ్రామం వైపు దూసుకొస్తూ ఉంటుంది. అలా తనలాగా ఆ పిల్లలు జీవితాలు బలికాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత విచిత్రంగా ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. వయనాడ్ జిల్లాలోని చురల్మల ప్రాంతం ప్రస్తుతం కొండచరియలు సృష్టించిన విధ్వంసంలో లయ తండ్రి లెనిన్‌ను ప్రాణాలు కోల్పోవడం విషాదం. అంతేకాదు లయ చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. మొత్తం 497 మంది విద్యార్థుల్లో 32 మంది ప్రకృతి బీభత్సానికి బలయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, అక్కాచెల్లెళ్లను కోల్పోయారు. అయితే స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉన్నికృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ ప్రాంతంలోని రెండు పాఠశాలల నుండి నలభై నాలుగు మంది పిల్లలు తప్పిపోయారు. చాలామంది విద్యార్తులు తమ స్నేహితులను కోల్పోయిన షాక్‌లో ఉన్నారు. -
చదువుకుందాం అని వస్తే చంపేస్తారా..
-
రియల్ సర్
-
ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్–2 బోధన అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.ఈసారి పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోగత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది. జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. బైలింగ్యువల్‌లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్ బుక్స్ డైరెక్టర్ కొండా రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
-
జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు
-
Swiss: స్విట్జర్లాండ్‌లో ప్రబలుతున్న ‘తట్టు’
జ్యురిచ్: స్విట్జర్లాండ్‌లో తట్టు(మీజిల్స్) వ్యాధి ప్రబలుతోంది. లుసాన్నే ప్రాంతంలోని ఓ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు తట్టు సోకింది. దీంతో ఆ స్కూల్‌ను ఈ నెల 18 వరకు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎంతమంది విద్యార్థులకు తట్టు సోకిందో స్కూల్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్కూల్ మూసివేస్తున్నామని మాత్రమే స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్కూల్లో జనవరిలోనే ఆరుగురికి తట్టు సోకినట్లు నిర్ధారణ అయిందని, తాజాగా మరో 20 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. మీజిల్స్ అనే అంటు వ్యాధి వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారు దగ్గినపుడు పడే తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తిచెందుతుంది. వ్యాధి సోకిన వారికి జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ముక్కు, గొంతులో మంట, ర్యాషెస్ తదితర లక్షణాలు కనిపిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్లతో మీజిల్స్ రాకుండా నిరోధించవచ్చు. ఇదీ చదవండి.. ఐస్ లాండ్లో అగ్ని పూలు -
అవి గంజాయి చాక్లెట్లే
శంషాబాద్: ఊహించిందే నిజమైంది. అవి గంజాయి కలిపిన చాక్లెట్లేనని నిర్ధారణ అయింది. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో చాక్లెట్లు కొనుగోలు చేసి తిన్న తర్వాత మత్తులోకి జోగడం, వింతవింతగా ప్రవర్తిస్తుండటం తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారమిచ్చిన నేపథ్యంలో గంజాయి చాక్లెట్ల బాగోతం బయటపడింది. విద్యార్థుల వింత ప్రవర్తనతో పాటు మత్తులోకి జారుకునేలా చేస్తున్న చాక్లెట్లు గంజాయి కలిపినవేనని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల దాడులు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ డబ్బాతో పాటు మరో మూడు కిరాణ దుకాణాల్లో శంషాబాద్ ఎస్ఓటీ , కొత్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 కేజీల బరువు కలిగిన ‘చార్మి నార్ గోల్డ్ మునకా’అనే పేరుతో ఉన్న 42 చాక్లెట్ల డబ్బాలు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ 1.30 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యూపీ వయా ఒడిశా? ఒడిశా రాష్ట్రం జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బహేరా( 33) కొత్తూరులోని పరిశ్రమల్లో కార్మి కుడిగా పనిచేసేందుకు కొంత కాలం కిందట వ చ్చాడు. అధికంగా డబ్బులు సంపాదించాలనే దు రాశతో అదే రాష్ట్రానికి చెందిన సోమ్‌నాథ్ బెహ్రే (33) సూర్యమని సాహు (35)తో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించడం మొదలు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఓ పాన్ డబ్బాను ఏర్పాటు చేసి విద్యార్థులకు దానిని నెమ్మదిగా అలవాటుగా మార్చారు. అంతేకాకుండా సమీపంలోని మరికొన్ని కిరాణా దుకాణాల్లో కూడా వాటిని కార్మి కులు, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ. 20 లేదా 30కి విక్రయిస్తున్నారు. చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా మగర్ వారా నెహ్రూబాగ్‌లోని ఏఎం ఫార్మా పేరిట ఉంది. చాక్లెట్ల పై భాగంలో మాత్రం పూర్తి గా హిందీ అక్షరాలతో చార్మి నార్ గోల్డ్ మునకా అని ఉంది. అక్కడ నుంచి ఎలా తీసుకొస్తున్నారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు. చాక్లెట్ ఫ్లేవర్‌తో గంజాయి కలిపి కొంత చక్కెర, బెల్లం వంటి పదార్థాల్లో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి అందులో గంజాయిని కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరైనా ఇలాంటి చాక్లెట్లు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఎస్ఓటీ డీసీపీ రషీద్, శంషాబాద్ అదనపు డీసీపీ రామ్‌కుమార్, శంషాబాద్ ఏసీపీ రాంచందర్‌రావు, కొత్తూరు సీఐ వి.నర్సింహారావు శంషాబాద్ ఎస్ఓటీ సీఐ సత్యనారాయణ కేసును ఛేదించారంటూ డీసీపీ అభినందించారు. -
Video: పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన
బెంగళూరు: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిందిపోయి పని పిల్లలుగా మార్చుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థులతో టాయిలెట్స్ కడిగించారు.కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్ధులతోటి బలవంతంగా టాయిలెట్లను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన విద్యార్ధులు బ్రష్‌లు చేతబట్టి బాత్రూమ్లు శుభ్రం చేయడం కనిపిస్తుంది. కాగా శివమొగ్గ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సొంత జిల్లా. మంత్రి బుధశారం రాత్రి చిన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన జిల్లాలో జరిగిన ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి నివేదిక అందించారు. ఈ షాకింగ్ ఘటన గత వారం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ వివరణ ఇస్తూ.. విద్యార్థులను కేవలం టాయిలెట్లో నీళ్లు సరిగా పోయమని మాత్రమే చెప్పానని, క్లీన్ చేయమని ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో విద్యార్ధులు బాత్రూమ్లు కడగడం వంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇది మూడోసారి. గత వారం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కార్యకర్తలు నగరంలోని ఆండ్రహళ్లి ప్రాంతంలోని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతం విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులు టాయిలెట్లు క్లీన్ చేయడంపై సీరియస్ అయ్యారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. చదవండి: ‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్ Shocker from Karnataka | Students found cleaning toilet in a school in Shivamogga pic.twitter.com/iZhe66gNRC — NDTV (@ndtv) December 28, 2023 -
ఏపీ బాటలో కర్ణాటక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పిక్టోరియల్(»ొమ్మలతో కూడిన) డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఏపీ ఎస్సీఈఆర్టీ) సాయంతో కన్నడ–ఇంగ్లిష్ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది. పాఠాల్లోని పదాలతోనే డిక్షనరీ.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లిష్–తెలుగు పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. 2021–22లో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 23,72,560 మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది. అలాగే 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, ఈ ఏడాది కేవీకే–4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్ ఏ వర్డ్’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. పూర్తి శాస్త్రీయంగా తయారీ ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని ఇంగ్లిష్–తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించాం. ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక ఇచ్చాం. ఈ విధానం కర్ణాటక అధికారులకు నచ్చింది. తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. డిక్షనరీ రూపకల్పనకు తగిన సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ -
పని నుంచి బడికి..
రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకువస్తోంది. సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నాని.. ఏడో తరగతి తర్వాత చదువు మానేశాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనికి చేరాడు. రెండేళ్ల పాటు ఆ షాపులోనే సహాయకుడిగా పనిచేశాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ పేరిట అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సీఐడీ అధికారులు.. నానిని చూశారు. అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను వివరించారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నానిని అదే బడిలో 8వ తరగతిలో చేర్చించారు. ప్రస్తుతం నాని తోటి పిల్లలతో కలిసి చక్కగా చదువుకుంటున్నాడు. ఇక తాను పనికి వెళ్లనని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. బాల కార్మికుల నుంచి మళ్లీ విద్యార్థులుగా.. సామాజికబాధ్యత కింద బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం సీఐడీ చేపట్టిన ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ సాధించిన విజయమిది. ఇలా ఒక్క నాని మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికులుగా కష్టాల కడలిలో ఈదుతున్న వారిని సీఐడీ అధికారులు గుర్తించి సురక్షితంగా చదువుల తల్లి ఒడిలోకి చేర్చారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకొస్తోంది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఐడీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఐడీ అధికారులతో పాటు మహిళా–శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, వివిధ సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. ఈ ఏడాది మొత్తం నాలుగు దశల్లో 66 రోజుల పాటు ఆపరేషన్ స్వేచ్ఛ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించింది. ప్రధానంగా బాల కార్మికులను ఎక్కువుగా పనిలో పెట్టుకునే ఇటుక బట్టీల తయారీ, హోటళ్లు, వివిధ పారిశ్రామిక యూనిట్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మొత్తం 1,506 మంది బాల కార్మికులను గుర్తించింది. వారిలో బాలురు 1,299 మంది ఉండగా.. బాలికలు 207 మంది ఉన్నారు. మొత్తం బాల కార్మికుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 609 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మన రాష్ట్రానికి చెందిన 897 మంది బాల కార్మికుల తల్లిదండ్రులతో చర్చించి వారికి అవగాహన కల్పించి.. ఆ పిల్లలను మళ్లీ బడుల్లో చేర్పించింది. బాల కార్మికులుగా మారడానికి కారణాలు తల్లిదండ్రులు లేకపోవడం:36 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడం29 మంది పేదరికం: 984 మంది ఇతర కారణాలు:457 మంది మళ్లీ బడిలో చేరిన బాల కార్మికులు సామాజికవర్గాలవారీగా.. ఎస్సీ259 మంది ఎస్టీ131 మంది బీసీ719 మంది మైనార్టీ190 మంది ఓసీ 207 మంది మళ్లీ బడిలో చేర్పించే నాటికి బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు.. ఇటుక బట్టీల్లో 138 మంది హోటళ్లలో 117 మంది పారిశ్రామిక యూనిట్లలో 143 మంది ఇతర చోట్ల 1108 మంది బాల కార్మికులుగా చేరేనాటికి వారి చదువులు ఇలా.. నిరక్ష్యరాస్యులు264 మంది అయిదో తరగతిలోపు 270 మంది అయిదు నుంచి పదో తరగతి 792 మంది చెప్పలేనివారు 180 మంది సామాజిక, ఆర్థిక దృక్కోణంలో విశ్లేషణ.. బాల కార్మికులను గుర్తించి కేవలం మళ్లీ బడుల్లో చేర్చడమే కాదు.. ఈ సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా సీఐడీ కార్యాచరణ చేపట్టింది. అందుకోసం బాల కార్మికుల సామాజిక, ఆర్థిక అంశాలపైనా విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. తద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా పెకలించి వేసి బడి ఈడు పిల్లలు అందరూ కచ్చితంగా బడుల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించిన బాలల వివరాలిలా ఉన్నాయి.. సమన్వయంతో సత్ఫలితాలు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని విద్య, మహిళా–శిశు సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ఆయా రాష్ట్రాలకు సురక్షితంగా చేరుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన బాల కార్మికుల అవగాహనను పరీక్షించి తదనుగుణంగా తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. మళ్లీ వారు పనిలోకి వెళ్లకుండా.. శ్రద్ధగా చదువుకునే వ్యవస్థను కల్పిస్తున్నాం. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తున్న సీఐడీ సీఐడీ విభాగం అంటే కేవలం కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ మాత్రమే కాదు. సీఐడీకి అంతకుమించి విస్తృత పరిధి ఉంది. అందులో ప్రధానమైనది సామాజిక బాధ్యత. అందుకే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. సీఐడీలో ప్రత్యేకంగా సామాజిక విభాగం కింద ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం. – సంజయ్, సీఐడీ అదనపు డీజీ -
'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ
ఆటా ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగామని, ఇక్కడి విద్యార్థులు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు. చదువుకునే పిల్లలు ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అమెరికా, భారత్‌లోని పాఠశాలల మధ్య తేడాలను ఆయన వివరించారు. ఇతర CSIR కంపెనీ లతో ఆటా మాట్లాడి వారి సహకారంతో స్కూల్‌ను మరింత అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు. -
ఫోర్త్ క్లాస్ విద్యార్థుల హింస..
ఇండోర్: నాల్గవ తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై అతని క్లాస్‌మెట్స్ ముగ్గురు కలిసి పదునైన వృత్తలేఖినితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒకటి, రెండుసార్లు కాకుండా ఏకంగా 108 సార్లు అతన్ని పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సుమోటోగా తీసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ‘ఈ ఘటన షాకింగ్‌గా ఉంది. ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఒక విద్యార్థిని 108 సార్లు పొడిచి గాయపరిచారు. దీనిపై ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏయిరోడ్రోమ్ పోలీసులను కోరాం. ఇంత చిన్న వయసులో ఆ ముగ్గురు విద్యార్థులు ఎందుకంత హింసాత్మక ప్రవర్తించారనేది పోలీసులు తేల్చాలి’ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వ్యాఖ్యానించారు. నా కొడుకు స్కూల్ నుంచి వచ్చినపుడు అతని ఒంటిపై చాలా గాయాలున్నాయి. గాయాల గురించి అడిగితే జరిగిన ఘటనను అతడు వివరించాడు. అసలు వాళ్లెందుకంత హింసాత్మకంగా దాడి చేశారో అర్థం కావడం లేదు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగితే స్కూల్ మేనేజ్మెంట్ ఇవ్వడం లేదు’అని గాయపడిన విద్యార్థి తండ్రి చెప్పారు. ఇదీచదవండి..ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను -
విశాఖ: స్కూల్ ఆటో-లారీ ఢీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో-లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ కాగా.. క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్, లక్ష్య, చార్విక్, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘‘ఉదయం 7గం.30ని. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆటోలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. వీళ్లంతా బేతని స్కూల్‌కు చెందిన వాళ్లు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’’ అని ఏసీపీ రాజీవ్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని పదో తరగతి చదివే హాసినిగా తెలుస్తోంది. మరో ప్రమాదంలో.. కాగా, విశాఖలో ఈ ఉదయం మరో ప్రమాదం జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు, ఆటోడ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. చదవండి: ప్రేమా.. ఇదినీకు న్యాయమా? VIDEO | Eight school children were injured when the auto they were travelling in collided with a lorry in Visakhapatnam earlier today. The incident was captured on CCTV. (Disturbing visuals. Viewers discretion advised) pic.twitter.com/JE7BZiBQi1 — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
చిన్నారులతో లక్ష్మి మంచు దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
బడి బ్యాగు బరువు తగ్గించాలి!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో చదివే విద్యార్థులపై పుస్తకాల బరువు తగ్గించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పుస్తకాల బరువు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలపై కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 70శాతం మంది స్కూల్ విద్యార్థులపై పుస్తకాల భారం అధికంగా ఉంటోంది. దీనితో పిల్లల కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మంది విద్యార్థులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇంటికి రాగానే నీరసంగా, భుజాలు వంగిపోయి నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. దీర్ఘకాలం పాటు ఈ ప్రభావం ఉంటోందని.. ఈ ఆరోగ్య సమస్యలు విద్యార్థి చదువుపై శ్రద్ధ కోల్పోయేందుకు కారణం అవుతున్నాయని అధ్యయనం నివేదిక స్పష్టం చేసింది. మితిమీరిన పుస్తకాలు, చదువుతో విద్యార్థులు సరిగా నిద్రపోవడం లేదని.. దీనితో తరగతి గదిలో చురుకుగా ఉండటం లేదని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని వివరించింది. ప్రైవేటు స్కూళ్లు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం, శక్తికి మించిన బరువుతో పిల్లలు మెట్లు ఎక్కడం వల్ల సమస్య పెరుగుతోందని తెలిపింది. ఈ క్రమంలో బడి బ్యాగుల బరువు విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కచ్చితమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించింది. ఐదేళ్ల నుంచి అడుగుతున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో స్కూల్ విద్యార్థులపై పుస్తకాల బరువు సమస్య తీవ్రంగా ఉందని ఈ అంశంపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. చిన్నప్పట్నుంచే విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. ఈక్రమంలో పుస్తకాల బరువు తగ్గించే చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యా శాఖ ఐదేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. పిల్లలు మోసే పుస్తకాల బరువు వారి బరువులో పది శాతానికి మించి ఉండకూడదని పేర్కొంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కొంత కార్యాచరణ చేపట్టాయి. స్కూళ్లలో డిజిటల్ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, అవకాశాలు పెరిగాయి. విద్యా సంస్థలు దీనిని సది్వనియోగం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. హోంవర్క్ సహా కొన్ని రాత పనులను డిజిటల్ విధానంలోకి మార్చడం వల్ల బరువు తగ్గించే వీలుందని పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో స్పందించలేదని.. ఇకనైనా ఆ దిశగా అడుగువేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా అభిప్రాయపడింది. బ్యాగు బరువు ఇలా ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రెండో తరగతి విద్యార్థులకు 1.5 కిలోలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. 5 తరగతి వరకూ మూడు కేజీలు, 7వ తరగతి వరకు 4 కేజీలు, 9వ తరగతి వారికి 4.5 కేజీలు, పదో తరగతి వారికి 5 కేజీలకు మించి పుస్తకాల బరువు ఉండకూడదు. తెలంగాణ విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం.. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పుస్తకాల బరువు 12 కేజీల వరకు, ఉన్నత పాఠశాల విద్యార్థుల పుస్తకాల బరువు 17 కేజీల వరకు ఉంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏకంగా 40 పుస్తకాలను మోయాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్ïÙట్స్, నోట్‌బుక్స్ ఇలా అనేకం బ్యాగులో కుక్కేస్తున్నారు. వీటికితోడు లంచ్ బాక్స్, నీళ్ల బాటిల్ కూడా కలసి పిల్లలపై భారం పడుతోంది. ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల ముద్రణ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల కారణంగా ప్రతిదీ కొనాల్సిందేనని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. భారంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి పుస్తకాల బరువు తగ్గించే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్చించారు. ఈ అంశంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, కార్యాచరణను రూపొందించేందుకు అధికారులతో ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాల బరువు అధికంగా ఉంటోందని.. అలాంటి వాటిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని ఆలోచనకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
అమెరికా ప్రభుత్వంతో ఏపీ విద్యార్ధుల సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత, పేద విద్యార్ధులను పెద్ద చదవులు చదివించాలనే ఆయన సంకల్పం ఎంతో ప్రతిష్టాత్మమైన అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యేలా చేసింది. పదిరోజుల అమెరికా పర్యటనలో ఉన్న మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు మంగళవారం ముఖ్యమైన US డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు మన విద్యార్ధులు. ఐక్యరాజ్య సమితి సభ్యుడు ఉన్నవ షకిన్ కుమార్, SPD శ్రీనివాస్, KGBV సెక్రటరీ మధుసూధనరావు నేతృత్వంలోని బృందం ఈ సమావేశంలో పాల్గొంది. అమెరికాలో అమలవుతున్న విద్యావిధానం పై అమెరికా ప్రతినిధి రోసీ ఎడ్మండ్ మన విద్యార్ధులకు అర్ధమయ్యేలా వివరించారు. AP ప్రభుత్వం అందించే విద్యా ప్రయోజనాల ప్రాముఖ్యత వారి జీవితాలపై దాని ప్రభావం గురించి ఒక ప్రదర్శనను అందించారు. విద్యార్థులు గోరుముద్ద పథకం గురించి వారి ఖాతాల్లోకి రూ. 15000 అందుకోవడం వల్ల వారి తల్లులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన నూతన విద్యావిధానం అది ప్రతి ఒక్క విద్యార్ధికి ఎలా ఉపయోగపడుతుందో విద్యా ర్ధులు చెప్పారు. నాడు నేడు కింద క్లాస్ రూమ్ స్ట్రక్చర్ పూర్తిగా మార్చిన విధానం ఫోటోలను మన విద్యార్ధులు వారికి చూపించారు. క్లాస్ రూమ్స్ ప్రైవేటుకు ధీటుగా డిజిటల్ బోర్స్డ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఫర్నీచర్, ప్లేగ్రౌండ్స్, డిజిటల్ లైబ్రరీ, ఆడపిల్లలకు సానీటరీ నాప్కిన్స్, బాలికల కోసం ఏర్పాటు చేసిన నూతన టాయిలెట్స్ గురించి చక్కగా వివరించారు మన విద్యార్ధులు. స్కాలర్‌షిప్‌తో USA, కెనడా, ఆస్ట్రేలియా, UK లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు జగనన్న విదేశీ విద్యా కానుక పెట్టారని చెప్పారు. ఇది USAలోని 200 విశ్వవిద్యాలయాలతో ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు USAలో చదువుకోవాలనే వారి కలను సాధించేలా చేస్తోందని వారు చెప్పారు. ఇండియా డెస్క్ ఆఫీసర్, క్వాడ్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రజనీ ఘోష్ మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను సాధించాలని ప్రోత్సహించారు. తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి డిప్లొమాట్ కావడానికి చాలా కష్టపడ్డానని విద్యార్థులకు చెప్పింది. విద్యార్థులకు ఇంగ్లీష్ చాలా మంచిదని, వారు కష్టపడి పని చేసి మంచి విద్యా ఫలితాలను సాధిస్తే భవిష్యత్తులో భవిష్యత్ దౌత్యవేత్తలు కూడా అవుతారని ఆమె చెప్పారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌లో ఇండియా డెస్క్ ఆఫీసర్‌గా ఉన్న ఆమె, యుఎస్ఎలో ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి తమ విభాగం సిద్ధంగా ఉందని విద్యార్థులకు చెప్పారు. విద్యార్థు్లు చెప్పినవన్ని విన్న తరువాత, ఆమె విద్యార్థుల విశ్వాసాన్ని మెచ్చుకుంది. విద్యార్ధినులను USA కు డెలిగేషన్కు పంపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, ఇది AP రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు విద్యను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. సీనియర్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ USA, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రోజీ ఎడ్మండ్ మాట్లాడూతూ USAలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాల గురించి విద్యార్థులకు వివరించారు. కొలంబియా, ప్రిన్స్టన్, హార్వర్డ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ మొదలైన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కార్యక్రమం పేద మెరిట్ విద్యార్థులకు సహాయపడుతుందని ఆమె ప్రశంసించారు. USAలో ఇంటర్న్‌షిప్‌లు, ఇతర ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం బ్యూరోస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌ల గురించి ఆమె విద్యార్థులకు వివరించారు. వివిధ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల క్రింద USAలో చదువుకోవడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఆర్థిక సహాయం గురించి ఆమె వివరించారు. USAలోని 400 యూనివర్శిటీలు US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గుర్తింపు పొందాయని, విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, EDUCATION USA మెరిట్ విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్, విమాన ఛార్జీలు పొందడంలో సహాయపడుతుందని ఆమె విద్యార్థులకు వివరించారు.అమెరికా ప్రభుత్వ అధికారులతో మీటింగ్ అనంతరం అమరికాలో ఉన్నత విద్యా అవకాశాలపై విద్యార్ధులు తమకున్న ప్రశ్నలకు సమాధానాలడిగి నివృత్తి చేసుకున్నారు. బ్యూరోలు, భారత ప్రభుత్వం మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి విద్యార్థులకు ఎలాంటి అవకశాలుంటాయని అమెరికా ప్రభుత్వ ప్రతినిధులను అడిగి తమ ప్రశ్నలకు సమాధాలు రాబట్టుకున్నారు మన విద్యార్ధులు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సీనియర్ ఎక్స్టర్నల్ ఆఫీసర్ మోలీ స్టీఫెన్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లీష్‌లో చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు ప్రశంసించారు. ఈ వయస్సులో విద్యార్థులు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడాన్ని తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ విద్యార్ధుల ప్రతినిధి బృందంలో 8 మంది బాలికలకు అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్తానికి అభినందనలు తెలిపింది. భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. పాఠశాలల నిర్వహణ వ్యవస్థ, AP ప్రభుత్వం యొక్క విద్యా కార్యక్రమాల అమలును కూడా ఆమె ప్రశంసించారు. :యునైటెడ్ నేషన్స్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ సభ్యుడు ఉన్నవ షకిన్ కుమార్ మాట్లాడుతూ యూఎస్ డిపార్ట్ మెంట్ స్టేట్ అధికారులు ఏపీ విద్యార్ధుల బృందానికి ఇంత సమయం కేటాయించి విద్యార్ధులకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యార్ధులను అమెరికా పంపినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , విద్యాశాఖామంత్రి బొత్ససత్యనారాయణ, కమిషనర్ సురేష్ కుమార్, విద్యార్థులలో USA డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఎరిక్ క్రిస్టెన్సన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
HYD: 21 కిలోల గణేషుడి లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఈనెల 18న వినాయక చవితితో మొదలైన నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం గణేషుడిని 28న నిమజ్జనం చేయనున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఝాన్సీ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి కొంతమంది విద్యార్థులు లడ్డూను దొంగలించారు. గణనాథుడి చేతిలో పెట్టిన 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లారు. అనంతరం ఆ లడ్డూని పంచుకొని తినేశారు. విషయం తెలుసుకున్న నిర్వాహకుడు శ్యామ్ అగ్రర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సీసీ ఫుటేజీ దృశ్యాలు పరీక్షించగా.. మైనర్ విద్యార్థులు చోరికి పాల్పడినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ విద్యార్థులు చార్మినార్ పీఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసిన స్టూడెంట్స్ pic.twitter.com/0Q4jYIQ6Q1 — Telugu Scribe (@TeluguScribe) September 24, 2023 -
ఏపీ సంక్షేమ పథకాలపై ‘ఐరాస’లో చర్చ
సాక్షి, అమరావతి: అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సదస్సులో పాల్గొన్నారు. 27 దేశాలకు చెందిన గ్లోబల్ పార్టనర్లు, ప్రపంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, పౌర సమాజ సభ్యులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు న్యూయార్క్‌లో నిర్వహించిన హైబ్రిడ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్ఫరెన్స్–2023లో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ప్రసంగించారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజలకు, ఇటు విద్యార్థుల ప్రగతికి ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం గురించి తెలియజేశారు. కాగా, ప్రపంచ శాంతి, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధిపై జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 150 మంది ఉన్నత స్థాయి స్పీకర్లను ఒక్కచోటకు చేర్చి ఇంటర్ డిసిప్లినరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సదస్సులో జర్నలిస్ట్స్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ సభ్యులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దటీజ్ ఏపీ..కొలంబియా యూనివర్సిటీలో సత్తా చాటిన ఏపీ స్టూడెంట్స్
-
ఏపీ విద్యావ్యవస్థ దేశానికే రోల్ మోడల్: పండుగాయల రత్నాకర్
ఐక్యరాజ్య సమితిలో ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రసంగించనున్నారు. గత నాలుగేళ్లలో ఏపీ విద్యా వ్యవస్థ పటిష్టమైన తీరు, అమలవుతున్న వివిద విద్యా పథకాల పై యూఎన్ ఎస్డీజీ సదస్సులో మాట్లాడనున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పై యూఎన్ లో జరిగే సదస్సులో భాగంగా విద్య అంశం పై మాట్లాడాల్సిందిగా ఏపీ విద్యార్థులకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పంపింది. లారీ డ్రైవర్, రైతుకూలీ, ఆటో డ్రైవర్, మెకానిక్ ఇలా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, వైట్ హౌస్ వంటి ప్రఖ్యాత విశ్వవేదికల మెట్లెక్కబోతున్నారు. జులైలో జరిగిన ఐక్యరాజ్య సమితి హైలెవెల్ పొలిటికల్ ఫోరమ్‌లో ఏపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసింది. స్టాల్స్ సందర్శించిన యూఎన్ ప్రతినిధులను ఏపీ విద్యా పథకాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల పునరుద్ధరణ, విద్యాదీవెన, వసతిదీవెన, విద్యాకానుక, డిజిటలైజేషన్ తదితర విద్యా పథకాలకు సంబంధించిన వివరాలను యూఎన్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో "ఈక్విటబుల్ ఎడ్యుకేషన్- ఎడ్యుకేషన్ యాక్సెస్ ఫర్ ఆల్" అంశం, ఏపీలో అమలవుతున్న సంస్కరణల గురించి ప్రసంగించాలని వారు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఆహ్వానించారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశాన్ని ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. ఎనిమిది మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన 10 మంది విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు వచ్చిన 103 మందికి రాతపరీక్ష నిర్వహించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించి 10 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. సమగ్ర శిక్ష పీడీ బి. శ్రీనివాసరావు ఈ బృందానికి ప్రతినిధిగా ఉన్నారు, కేజీబీవీ కార్యదర్శి డి. మధుసూదన్ రావు నోడల్ ఆఫీసర్ గా, ఉపాధ్యాయులు డి. విజయదుర్గ, కేవీ హేమప్రసాద్ మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టెటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్ సమన్వయంతో ఏపీ అధికారులు ఈ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ భారత్ నుండి ఈ పర్యటనను పర్యవేక్షిస్తున్నారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనకు అయ్యే పూర్తి ఖర్చు ఏపీ ప్రభుత్వమే భరిస్తోంది. సదస్సులో పాల్గొనేందుకు నిన్న న్యూయార్క్ చేరుకున్న విద్యార్థి బృందానికి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ విద్యావ్యవస్థ సాధించిన విజయాలు దేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా మారతాయని పేర్కొన్నారు. విద్య పరంగా ప్రపంచం దేశాలు ఎదుర్కొనే సమస్యలకు ఏపీ విద్యావ్యవస్థ ఒక మోడల్ వ్యవస్థగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్తతరం నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నారని, ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఎంతో ప్రతిభగల ఈ విద్యార్థి బృందంతో మమేకమయ్యే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఐక్యరాజ్య సమితి ఎస్డీడీ సదస్సులో పాల్గొనే విద్యార్థులు వీరే.. ►మాల శివలింగమ్మ (తండ్రి రైతుకూలీ) ►మోతుకూరి చంద్రలేఖ (తండ్రి ఆటోడ్రైవర్) ►గుండుమూగల గణేష్ (తండ్రి కౌలురైతు) ►దడాల జ్యోత్స్న (తండ్రి సెక్యూరిటీ గార్డ్) ►సి. రాజేశ్వరి (తండ్రి లారీ డ్రైవర్) ►పసుపులేటి గాయత్రి (కూలీ) ►అల్లం రిషితా రెడ్డి (తండ్రి మెకానిక్) ►వంజివాకు యోగేశ్వర్ (తండ్రి కేబుల్ ఆపరేటర్) ►షేక్ అమ్మాజాన్ (తండ్రి వ్యవసాయ కూలీ) ►సాముల మనస్విని (తల్లి సాధారణ గృహిణి) Thanks to CM jagan anna @ysjagan 💐💐 proud of Andhra Pradesh government school childrens attend United nations. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల పిల్లలు యునైటెడ్ నేషన్స్‌కు హాజరవడం గర్వకారణం.💐💐#YSJaganMohanReddy #andhrapradeshgovernmentschools#UnitedNations pic.twitter.com/YnhPeLQH66 — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 16, 2023 -
ఏపీ ప్రభుత్వ విద్యార్థులకు వైట్‌హౌస్ ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి (యూఎన్వో)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన మన రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల ప్రతినిధి బృందానికి అమెరికా అధ్యక్ష భవనం సందర్శించాల్సిందిగా ఆహ్వానం అందింది. శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు అమెరికాలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు వైట్‌హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్ర మే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైట్‌హౌస్ లోపలి ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించడం విశేషం. యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ సమన్వయంతో సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో 10 మంది విద్యార్థుల బృందం గురువారం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. 26 వరకు సదస్సులు, సమావేశాలు మన రాష్ట్ర బృందంలోని విద్యార్థులు శనివారం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (యునెస్కో)లో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) సదస్సులో పాల్గొంటారు. 17న కొలంబియా యూనివర్సిటీలో జరిగే గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రసంగిస్తారు. 20న జర్నలిస్ట్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో జరిగే ఎస్డీఎస్ సర్వీస్ సదస్సులో పాల్గొంటారు. 22న యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌లో జరిగే ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. 25న ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉన్నత ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ప్రసంగిస్తారు. 26వ తేదీన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగే బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్‌లో పాల్గొంటారు. 27వ తేదీన అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించి 28న భారత్‌కు బయలుదేరతారు. -
‘స్కిల్’ కాదు డొల్లే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో మాజీ సీఎం చంద్రబాబు చేసిన మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2.50 లక్షల మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో డొల్లతనం బయటపడింది. ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు సైతం నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్లు కాగితాలపై చూపారు. పాఠశాల విద్యార్థులను విజ్ఞాన యాత్రల పేరిట సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ పేరిట ఏర్పాటు చేసిన సెంటర్లకు తరలించారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్–ఐటీ ఫండమెంటల్స్, ఎల్రక్టానిక్స్ ఆఫీస్, ఎలక్ట్రికల్ హోమ్ లాంటి కోర్సుల్లో వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. చంద్రబాబు ప్రభుత్వం వైదొలగేలోపు మొత్తం 1,21,654 మంది నైపుణ్య శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 70,000 మంది బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. విహారయాత్రకు వచ్చిన ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. వాటిని చూపిస్తూ వారందరికి అత్యున్నత నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారు చేశారు. ఇలా శిక్షణ పొందిన విద్యార్థులకు అధిక జీతాలు చెల్లించి తీసుకున్న కంపెనీలు ఏమిటో చంద్రబాబుకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియానే చెప్పాలి!! ల్యాబ్‌లూ లేవు.. సీమెన్స్ పేరును తెరపైకి తీసుకొచ్చి రూ.3,300 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఘనంగా చెప్పుకున్నా వాస్తవంగా రూ.70 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్న విషయం ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమయ్యింది. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, వాటికి అనుబంధంగా 34 టీఎస్‌డీఐలు (టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్) ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు కాగితాల్లో చూపించారు. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చూపించే ఫోటోలన్నీ ఉత్తిత్తి ల్యాబుల్లో తీసినవే. సీఎన్సీ మెకానిక్, టూ వీలర్, ఫోర్ వీలర్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సర్వీస్ సెక్టార్, క్యాడ్ రామ్, ఐసీటీ, అగ్రి ఫార్మ్ మెకనైజేషన్ లాంటి కోర్సుల గురించి విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్‌పై చూపించి శిక్షణ ముగించారు. ఒక్కో సీవోఈలో 15 ల్యాబ్‌లు, టీఎస్‌డీఐలో 10 ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు రికార్డులో చూపించారు. రాష్ట్రం వాటాగా తరలించిన రూ.371 కోట్లను కాజేసిన కేటుగాళ్లు ఒప్పందం ప్రకారం ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆగమేఘాలపై కొన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఐరాస సదస్సుకు ఏపీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఈ నెల 16 నుంచి నిర్వహించే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు ఎంపికయ్యారు. 8 మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ఈ బృందం గురువారం హైదరాబాద్ నుంచి విమానం ద్వారా అమెరికాలోని న్యూయార్క్ నగరానికి బయలుదేరనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి విజయవాడ నుంచి ఈ బృందం రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. అంతకుముందు విద్యార్థుల బృందంతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద, బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఇది నిదర్శమని పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పర్యటనను విజయవంతం చేసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థి ప్రతినిధుల బృందాన్ని పూర్తి ప్రభుత్వ వ్యయంతోనే అమెరికాకు తీసుకెళ్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. వారం రోజుల పర్యటనలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామన్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ విద్యా సంస్కరణలపై ఐరాసలో ప్రదర్శన రాష్ట్ర విద్యావ్యవస్థలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ట్యాబ్లెట్ల పంపిణీ, డిజిటల్ తరగతి గదులు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశాల సంస్కరణలు, సబ్జెక్టు ఉపాధ్యాయుల నియామకంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఏపీ విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించనుంది. సమగ్ర శిక్ష పీడీ బి.శ్రీనివాసరావు బృందం ప్రతినిధిగా, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు నోడల్ ఆఫీసర్‌గా, ఉపాధ్యాయులు వి.విజయదుర్గ, కేవీ హేమప్రసాద్ మార్గదర్శకులుగా వ్యవహరించనున్నారు. ఐక్యరాజ్య సమితిలోని ఎకనావిుక్, సోషల్ కౌన్సిల్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ వున్నవ షకిన్‌కుమార్ సమన్వయంతో ఏపీ ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2023 పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 103 మంది అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించి, అందులో ఎంపికైన 30 మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించి 10 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఒకరు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉండటం విశేషం. న్యూయార్క్ బయలుదేరిన విద్యార్థులు వీరే 1. మాల శివలింగమ్మ, కేజీబీవీ ఆదోని, కర్నూలు జిల్లా (తండ్రి మాల సోమనాథ్ రైతు కూలీ, తల్లి గంగమ్మ) 2. మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ ఎటపాక, ఏఎస్ఆర్ జిల్లా (తండ్రి మోతుకూరి రామారావు ఆటో డ్రైవర్, తల్లి మణి) 3. గుండుమోగుల గణేష్ అంజనాసాయి, ఏపీఆర్ఐఎస్, అప్పలరాజుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా (తండ్రి గోపీ, కౌలు రైతు, తల్లి లక్ష్మి) 4. దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ పాఠశాల, వెంకటాపురం, కాకినాడ జిల్లా (తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు) 5. సి.రాజేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్, నంద్యాల (తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్, తల్లి రామలక్ష్మి) 6. పసుపులేటి గాయత్రి, జెడ్పీహెచ్ఎస్ వట్లూరు, ఏలూరు జిల్లా (తండ్రి రమేష్ కూలీ, తల్లి జ్యోతి) 7. అల్లం రిషితారెడ్డి, మునిసిపల్ ఉన్నత పాఠశాల, కస్పా, విజయనగరం జిల్లా (తండ్రి ఎ.రామకృష్ణారెడ్డి మెకానిక్, తల్లి ఉదయలక్ష్మి) 8. వంజివాకు యోగేశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చంద్రగిరి, తిరుపతి జిల్లా (తండ్రి నాగరాజు కేబుల్ ఆపరేటర్, తల్లి విజయ) 9. షేక్ అమ్మాజన్, ఏపీఆర్ఎస్, వేంపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా (తల్లి షేక్ ఫాతిమా, వ్యవసాయ కూలీ) 10. సామల మనస్విని, కేజీబీవీ, జీఎల్ పురం, పార్వతీపురం మన్యం జిల్లా(తల్లి కృష్ణవేణి) -
100 శాతం జీఈఆర్ సాధించాలి
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలన్నారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేరికలపై చర్చించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలంతా ఏదో ఒక పాఠశాలలో చేరి ఉండాలన్నారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం జీఈఆర్ సాధన అంశాన్ని తాను సవాలుగా తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థుల విషయంలో స్థానికంగా నమోదైన అంశాల్లో తప్పులు ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని.. డేటా అంతా పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరారు. జూలై రెండో వారంలో గుడివాడలో ఒక వలంటీర్ 100 శాతం జీఈఆర్ సాధించారని, ఇప్పుడు 63,993 మంది వలంటీర్లు తమ పరిధిలో 100 శాతం జీఈఆర్ సాధించారని గుర్తు చేశారు. -
విద్యార్థుల్లో చంద్రయాన్ విజయోత్సాహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : అంతరిక్షంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరించి, ప్రపంచంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్న చంద్రయాన్–3 ప్రయాణాన్ని ఆద్యంతం వీక్షించిన వి ద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సాహంలో ము నిగితేలారు. ఈ ఘనతను పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో బుధవారం సాయంత్రం అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లోను అందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. ఇటీవల ఉన్నత పాఠశాలలకు ప్రభు త్వం అందించిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లపై చంద్రయాన్ మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యుల్ ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు పలుచోట్ల సాధారణ ప్రజలు సైతం సమీప పాఠశాలల్లో బిగ్ స్క్రీన్స్‌పై ఆద్యంతం వీక్షించారు. చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ మాడ్యూల్ దిగిన వెంటనే సంబరాలు జరుపుకున్నారు. జయహో భారత్ అంటూ నినాదా లు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రసార ఏర్పా ట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విద్యా ర్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపా రు. చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశం మనదైనందుకు గర్విస్తూ, ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు వారంతా అభినందనలు తెలిపారు. అలాగే.. ♦ చంద్రయాన్–3 విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఏలూరు జిల్లా గణపవరానికి చెందిన స్వర్ణకారుడు పేరూరి కృష్ణ కేవలం 700 మిల్లీగ్రాముల బంగారంతో చంద్రయాన్–3 విక్రమ్ రోవర్‌ను తయారుచేసి జాతికి అంకితమిచ్చారు. ♦ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు. దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరు గర్వించదగిన రోజని కీర్తించారు. ఈ అద్భుత ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ♦ తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై చంద్రయాన్–3 ల్యాండింగ్ ప్రక్రియను నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తితో తిలకించారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలోనూ ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించిన విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎస్వీ యూనివర్సిటీ, కేంద్రీయ సంస్కృత విద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, అగ్రికల్చరల్ కళాశాలల్లోనూ విద్యార్థులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సలామ్ అంటూ పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ♦ ఇస్రోకి శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘కంగ్రాట్యులేషన్స్ ఇస్రో’ ఆకారంలో చేసిన విద్యార్థుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చంద్రుడిపై చంద్రయాన్–3 దిగిన దృశ్యాలను 860 మందికి పైగా విద్యార్థులు వీక్షించారు. ♦మరోవైపు.. భారతదేశ ఖ్యాతిని విశ్వాంతరాలలో సుస్థిరం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభినందించారు. చంద్రయాన్–3 విజయవంతం అవ్వడంపట్ల బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకంతో ఆయన ఆనందం వ్యక్తంచేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుుమడింప చేసిందని కొనియాడారు. ఈ విజయానికి కృషిచేసిన శాస్త్రవేత్తలకు రాష్ట్ర ప్రజలు తరఫున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ♦ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. చంద్రయాన్–3 విజయవంతం కావడం ఖగోళ చరిత్రలో భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో లిఖించతగ్గ విషయమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు జాతిని తలెత్తుకునేలా చేశారని ఆయన కొనియాడారు. ♦ భారతదేశం అంతా ఈ రోజు గర్వించదగ్గ రోజని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభివర్ణించారు. యావత్ ప్రపంచం భారతదేశ వైపు చూస్తోందని ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ మంత్రి శుభాభినందనలు తెలిపారు. -
ముగ్గురు విద్యార్థినిలు మిస్సింగ్.. ఏమయ్యారు?
సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో శనివారం ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థినిల పేరెంట్స్ హెడ్మాస్టర్కు విషయం తెలిపారు. దీంతో, వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. స్టేషన్ రోడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆశ్విత(15), శివరాత్రి రక్షిత(14), దూదేకుల రుబిన(12) శనివారం అదృశ్యమయ్యారు. ఈరోజు భోజన సమయంలో వీరు ముగ్గురు కనిపించలేదు. ఈ విషయం వీరి పేరెంట్స్‌కు హెడ్మాస్టర్ వలబోజు కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ క్రమంలో వీరి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి -
ప్లీజ్ మాకు టీచర్ ను పంపించండి
-
Fact Check: పేద పిల్లల విద్యపైనా రామోజీ ఏడుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర బాలలు అత్యున్నతస్థాయి ప్రమాణాలను అందుకుంటున్నారు. సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. పలు రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు ఇక్కడి పాఠశాలల్ని పరిశీలించి, ఇవే చర్యలు వారి ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు నిర్ణయిస్తున్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఏ ఒక్క పాఠశాలా మూతపడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. వాస్తవానికి చంద్రబాబునాయుడు హయాంలో 1,785 స్కూళ్లు మూతపడగా, వాటన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి తెరిపించింది. విద్యా రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలతో ప్రజల్లో ముఖ్యమంత్రి పట్ల, ప్రభుత్వం పట్ల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఈనాడు రామోజీరావుకు నిద్ర పట్టడంలేదు. విద్యా రంగంపై రోజూ అసత్యాలతో ఈనాడులో వార్తలు వండివారుస్తున్నారు. అందులో భాగంగానే సోమవారమూ ఓ అసత్య కథనాన్ని ఈనాడు ప్రచురించింది. గత మూడేళ్లలో తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యారంగంలో ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి. పిల్లల్లో ఆరేళ్ల లోపు మెదడు ఎదుగుదల ఉంటుందని, ఆ సమయంలో వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించాలన్న సత్సంకల్పంతో కేంద్ర నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఫౌండేషన్ స్కూలు విధానాన్ని చేపట్టింది. పీపీ 1, పీపీ 2, 1, 2 తరగతుల పిల్లలకు ప్రత్యేకంగా ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. 3 వ తరగతి నుంచి పిల్లలకు సబ్జెక్టు టీచర్లతో బోధన సాగించేందుకు అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లకు అనుసంధానం చేసింది. దీనివల్ల 3వ తరగతి నుంచే సబ్జెక్టులపై పరిపూర్ణమైన పరిజ్ఞానం పెరుగుతుంది. పై తరగతుల్లోకి వెళ్లేకొద్దీ సబ్జెక్టుల్లో రాటుదేలుతారు. ఉన్నత విద్యలోనూ ఉన్నత ప్రమాణాలు అందుకుంటారు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పోటీనయినా ఎదుర్కొనగలుగుతారు. హైస్కూళ్లలోని ఆట స్థలాలు, లైబ్రరీ, లే»ొరేటరీ వంటివి కూడా వారికి అందుబాటులోకి వస్తాయి. గతంలోలా కాకుండా 3 వ తరగతి నుంచే పిల్లలు హైస్కూల్ వాతావరణానికి అలవాటు పడి, డ్రాపవుట్ల సంఖ్య కూడా పూర్తిగా తగ్గుతుంది. మన బడి నాడు – నేడు, ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, ఐఎఫ్‌పీ ప్యానెళ్ల ఏర్పాటు, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన సహా అనేక పథకాలు విద్యా రంగం రూపురేఖలనే మార్చివేశాయి. వీటికోసం ప్రభుత్వం నభూతో నభవిష్యతి అన్నట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పిల్లల చదువులపై మేనమామగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. జీర్ణించుకోలేకపోతున్న రామోజీరావు ప్రజల్లో ప్రభుత్వానికి పెరిగిపోతున్న మంచి పేరును చూసి రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో వేల స్కూళ్లు మూతపడ్డాయి. తన బినామీ సంస్థలుగా ఉన్న నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచి పోషించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సాధారణంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా స్కూళ్లను నిర్వీర్యం చేసినా ఈనాడు ఒక్క అక్షరమూ రాయలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతుంటే ఈనాడు కడుపు మంటతో తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. ఇలాంటి చర్యలు ఆపకపోతే ఈనాడు, రామోజీరావుపై న్యాయపరమైన చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది. ఎన్నో కార్యక్రమాలతో విద్యా రంగం ముందంజ ► గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పాఠశాల విద్యార్థులు తరగతులకు తగ్గ సామర్థ్యాలను అందుకోలేకపోయారు. దీన్ని సరిచేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఫౌండేషన్ విద్య, మ్యాపింగ్ వంటి చర్యలు చేపట్టింది. దీనివల్ల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరిగాయి. ప్రభుత్వ పరిధిలోని అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకొని పిల్లలను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దేందుకు కొత్త విధానం ఉపకరిస్తోంది ► గతంలో లేని ప్రీప్రైమరీ విద్యను పిల్లలకు అందుబాటులోకి తెచ్చి çపూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసింది. ► 3వ తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్టు టీచర్లతో బోధన వల్ల వారిలో ప్రమాణాలు పెరుగుతున్నాయి ► గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే 18 సబ్జెక్టులను ఒకరిద్దరు టీచర్లు పూర్తి చేయడం కష్టంగా ఉండేది. విద్యార్థులకు సరైన పరిజ్ఞానం కూడా అందేది కాదు. 5వ తరగతి నుంచి 6వ తరగతిలో చేరే విద్యార్థులు ఎలాంటి ప్రమాణాలు లేనందున పై తరగతుల్లో వారిని తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకు భారంగా ఉండేది. కొత్త విధానంతో విద్యార్థుల్లో ఆ లోపం కనుమరుగైంది. దీనిని టీచర్లు, హెడ్మాస్టర్లు కూడా స్వాగతించారు. ► 2022–23 విద్యా సంవత్సరంలో 1 కిలోమీటర్ పరిధిలో 8,643 స్కూళ్లు ఉండగా వాటిలో కేవలం 4,943 ప్రైమరీ, యూపీ స్కూళ్లను మాత్రమే 3,557 హైస్కూళ్లకు మ్యాపింగ్ చేసింది. 2,43,540 మంది విద్యార్థులు హైస్కూళ్లకు మ్యాపింగ్ అయ్యారు. ► మ్యాపింగ్ అయిన హైస్కూళ్లలో 66,245 మంది సబ్జెక్టు టీచర్లు అవసరం కాగా ఇప్పటికే 59,663 మంది పనిచేస్తున్నారు. 6,582 మంది సబ్జెక్టు టీచర్లను ప్రభుత్వం పదోన్నతుల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ► విద్యార్థుల సదుపాయం కోసం 13,868 అదనపు తరగతులను కూడా ప్రభుత్వం నాడు – నేడు ద్వారా నిర్మించింది. ► జననాల రేటు తగ్గడం వల్ల 2019 నుంచి ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో చేరికల్లో తగ్గుదల కనిపిస్తోంది. పత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలెం స్కూలు వాస్తవం ఇది ► ఈనాడులో అసత్యపు వార్తలో పేర్కొన్న పత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలెం ఎంపీపీఎస్ స్కూలు అసలు మ్యాపింగ్ చేయలేదు. గత ఏడాది 5 మంది విద్యార్థులలో ఇద్దరు రెండో తరగతి, ఇద్దరు నాలుగో తరగతి, ఒకరు ఐదో తరగతి చదివారు. 2023–24 విద్యా సంవత్సరంలో వీరిలో నలుగురు ప్రైవేటు స్కూల్లో చేరగా, మరో విద్యార్థి రేపల్లె ఎస్టీ హాస్టల్లో చేరాడు. ► ఈ స్కూలుకు అనుసంధానంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో మూడేళ్ల వయసు పిల్లలు 8 మంది ఉన్నారు. 2023–24లో ఐదుగురు చేరారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కొలుములపేట ఎంపీపీ స్కూలు వాస్తవాలు ఇవీ.. ► కొలుముల పేట గ్రామం చింతలచెరువు గ్రామానికి కిలోమీటర్ దూరంలో శివారు గ్రామంగా ఉంది. గత ఏడాది ఈ స్కూల్లో 2వ తరగతిలో ఐదుగురు, 3వ తరగతిలో ఐదుగురు, 4వ తరగతిలో నలుగురు, 5వ తరగతిలో ఐదుగురు ఉండేవారు. 3 నుంచి 5 తరగతులను కిలోమీటర్ లోపు దూరంలో ఉన్న చింతలచెరువు హైస్కూలుకు మ్యాపింగ్ చేశారు. విద్యార్థులందరూ హైస్కూలుకు వెళ్తున్నారు. గత ఏడాది కానీ, ఈ ఏడాది కానీ ఎలాంటి సమస్యా ఇక్కడ లేదు. ► మిగిలిన 1, 2 తరగతుల్లో ఇద్దరు ఒకటో తరగతి చదువుతుండగా, రెండో తరగతిలో ఎవరూ లేరు. ఒకటో తరగతిలో ఉన్న ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల అభీష్టం మేరకు చింతలచెరువు ఎంపీపీ స్కూలులో చేర్చారు. వారు రెగ్యులర్‌గా ఆ స్కూలుకు వెళ్తున్నారు. చింతలచెరువు స్కూల్లో 348 మంది విద్యార్థులున్నారు. వారికి సరిపడా టీచర్లను ప్రభుత్వం నియమించింది. అనకాపల్లి జిల్లా గొలుగొండపేట స్కూలు స్థితి ఇదీ ► ఈ స్కూలులో 31 మంది విద్యార్థులున్నారు. 3 నుంచి 5 తరగతులను చినగొలుగొండపేట యూపీ స్కూలుకు మ్యాపింగ్ చేశారు. కిలోమీటర్లోపు ఉన్న ఈ స్కూలుకు ఇక్కడి విద్యార్థులు రెగ్యులర్‌గా వెళ్తున్నారు. గొలుగొండపేట ప్రైమరీ స్కూలులోని 1, 2 తరగతుల్లో ఆరుగురు విద్యార్థులున్నారు. ఈ ఏడాది కొత్తగా ఎవరూ చేరలేదు. రెండో తరగతి విద్యార్థులు చినగొలుగొండపేట యూపీ స్కూల్లో చేరారు. తిరుపతి అర్బన్‌లోని మున్సిపల్ స్కూలు.. వాస్తవం ఇదీ ► ఈ స్కూలును మ్యాపింగ్ చేయలేదు. గత ఏడాది ఇక్కడ ఏడుగురు విద్యార్థులు ఉండేవారు. వారిలో ఐదుగురు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు. వారిని తిరుపతిలోని టీటీడీ డఫ్ అండ్ డమ్ స్కూలులో చేర్చారు. మిగతా ఇద్దరు పిల్లలు 5వ తరగతి పూర్తి చేయడంతో సమీపంలోని హైస్కూలులో చేరారు. ► ఈ స్కూళ్లకు సంబంధించి ప్రత్యేకంగా చేరికల డ్రైవ్ నిర్వహించి పిల్లలను చేర్చే ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ యుద్ధప్రాతిపదికన చేపట్టింది. త్వరలోనే ఈ స్కూళ్లలో పిల్లలను చేర్చి తరగతులను కొనసాగించేలా చర్యలు తీసుకుంటోంది. -
పాఠశాలలో పాము కాట్లు.. రెండు రోజుల్లో ఇద్దరు విద్యార్థినిలను..
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినిలు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చుని చదువుకుంటున్న నాలుగో తరగితి విద్యార్థిని నిఖితను పాము కాటేసింది. దీంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో నాలుగు పాములు చిన్నారిని కాటేసిన పామును స్కూల్ సిబ్బంది చంపేయగా.. గురుకుల ఆవరణలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వీటిలో రెండు అక్కడి నుంచి వెళ్లిపోగా మిగతా రెండింటినీ గ్రామస్తులు చంపేశారు. ఇదిలా ఉండగా రెండ్రోజుల కిందట కూడా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం మరో విద్యార్థినిని పోతంగల్ మండలం జల్లాపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే విద్యార్థినిని పాటు కాటేసింది. కిటికీలో నుంచి పుస్తకం బయట పడటంతో తీసుకోవడానికి వెనకవైపు వెళ్లిన విద్యార్థినిని పాము కాటేసింది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినిలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాముల ఘటనలతో పాఠశాల, గురుకల పాఠశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. స్కూల్ ఆవరణలో ఏ క్షణంలో ఎటువైపు నుంచి పాముల వచ్చి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన విద్యార్థిని పాము కాటుకు గురికావటంపై చిన్నారుల తల్లిందండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హుటాహుటిని ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.అయితే పాఠశాలలు, గురుకులాల ఆవరణలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రయడుతున్నారు.ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి -
జగనన్న వచ్చాక ‘అమ్మఒడి’ అనే పథకం రావడం వల్ల పిల్లలు స్కూల్‌కి వెళ్లి బాగా చదువుతున్నారు
-
మాకు ఏమి కావాలన్నా మా జగన్ మావయ్య చూసుకుంటాడు
-
ఎంతటి మార్పు.. ఏపీలా ‘చదువుదాం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేవలం నాలుగేళ్లలోనే ప్రభుత్వ బడి రూపురేఖలు మారాయి. బడికి వచ్చే విద్యార్థుల మోముల్లో వెలుగు నిండింది. ప్రపంచంతో పోటీ పడేలా పాఠ్యాంశాలు, బోధనలో మార్పులు, టెక్నాలజీ వినియోగం, చదువు పట్ల ఆసక్తి పెంచేలా పథకాలు.. వెరసి విద్యా రంగంలో రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలిచింది. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పాలకులకు ఉంటే ఎంతటి అద్భుతాలు చేయవచ్చో.. పేద పిల్లల జీవితాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దవచ్చో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి తెలుసుకోవాలని పలు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఆసక్తి చూపుతున్నారంటే ఎంతటి మార్పు వచ్చిందో ఇట్టే తెలుస్తోంది. జీ–20లో భాగంగా ఈ నెల 16 నుంచి 22 వరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జన్ భాగీదారీ’ కార్యక్రమాన్ని పూణెలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ చర్చకు వచ్చింది. నూతన విద్యా విధానాన్ని (ఎన్ఈపీ–2020) అనుసరించి ఫౌండేషనల్ స్కూల్ నిర్వహణపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేసే విధానాలను ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో అన్ని విభాగాల్లోను ఆంధ్రప్రదేశ్ ముందుండడం విశేషం. రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన స్టాల్.. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల విద్యా శాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. సాంకేతిక బోధన, విద్యా పథకాలపై ఆసక్తి భారతదేశంలో పునాది నుంచి గణిత శాస్త్ర నైపుణ్యాలు పెంపొందించడం, తరగతిలో సాంకేతిక బోధన ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా జన్ భాగీదారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ– సమగ్ర శిక్షా విభాగం ప్రదర్శించిన ‘ఎఫ్ఎల్ఎన్ నమూనా పాఠశాల’ ఇతర రాష్ట్రాల విద్యా శాఖల ఉన్నతాధికారులను, విద్యా ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. మన రాష్ట్రంలో పునాది అభ్యసన, గణిత శాస్త్ర నైపుణ్యాల అభివృద్ధి ద్వారా పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను ఎలా అందిస్తున్నారో అధికారులు హాజరైన ప్రతినిధులకు వివరించారు. ప్రాథమిక విద్యార్థులకు అందిస్తున్న పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ద్వారా డిజిటల్ బోధన అద్భుతమని ఉత్తరాఖండ్ విద్యా శాఖ ఉన్నతాధికారులు ప్రశంసించడమే కాకుండా ఏపీలో పర్యటించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన మాతృ భాషాధారిత బహుభాష (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి) బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందజేయడాన్ని రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అభినందించడంతో పాటు ఏపీలో చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’పై ఆసక్తి చూపించారు. ఏపీ భేష్ అంటూ ప్రశంసలు రాష్ట్రంలో ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, డిజిటల్ బోధన, ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులుకు ఉచితంగా ట్యాబులు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు వంటివి ఇతర దేశాల ప్రతినిధులను సైతం ఆకట్టుకున్నాయి. ‘విద్యాకానుక’ కింద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫారం, డిక్షనరీలు అందించడంపై ప్రశంసలు కురింపించారు. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పాఠశాలల్లో 75 శాతానికి పైగా హాజరు నమోదవుతుండడాన్ని తెలుసుకున్న ఇతర రాష్ట్రాల అధికారులు, తల్లిదండ్రులు.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తమైందని అభిప్రాయపడ్డారు. ‘ఫౌండేషనల్ స్కూల్’ విధానాన్ని, బైలింగ్వల్ టెక్టŠస్ పుస్తకాల ముద్రణలో ఏపీ ప్రభుత్వ కృషిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. మహరాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, చత్తీస్గడ్, మిజోరం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూ.. దాద్రా నాగర్ హవేలీ నుంచి ఎస్సీఈఆర్టీ, డైట్ ప్రతినిధులు, స్పార్క్, ప్రథమ్ తదితర స్వచ్ఛంద సంస్థలు, పూణె–ఆంధ్రా సంఘం సభ్యులు ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాల అమలుకు ముందుకు వచ్చాయి. దేశ వ్యాప్తంగా మన సంస్కరణలు నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసే ‘ఫౌండేషనల్ స్కూల్’ నిర్వహణలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉండడం ఆనందంగా ఉంది. స్టాల్లో ‘ఫౌండేషనల్ స్కూల్’ నమూనా కూడా ఏపీ మాత్రమే ప్రదర్శించింది. మన విద్యా విధానాలు, సంస్కరణలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని జన్ బాగీధారీ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు అభినందించడం, తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామనడం నిజంగా మన విజయమే. – ఎస్.సురేష్‌కుమార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ అంగన్వాడీ టీచర్లకు నైపుణ్య శిక్షణ విద్యా సంస్కరణల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి అంగన్వాడీ టీచర్‌ను.. గ్రేడ్ 1, 2 టీచర్లను పూర్వ ప్రాథమిక శిశు సంరక్షణ విద్య బోధించడంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని 2026 నాటికి పూర్తి చేస్తాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష సహకారంతో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఏపీ ఎస్పీడీ -
మెరిసిన మాణిక్యాలు
ఈరోజు నా కళ్ల ముందు మెరిసే నక్షత్రాలు, రాష్ట్ర భవిష్యత్తు కనిపిస్తున్నాయి. ప్రతి విద్యార్థి ముఖంలో కాంతి, ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. పాఠశాల స్థాయిలో విజయం వైపు పడిన ఈ అడుగులు అత్యున్నత శిఖరాన్ని చేరుకోవాలి. మట్టి నుంచి పెరిగిన ఈ మొక్కలు మహా వృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలను అందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మట్టిలోనే మాణిక్యాలు వికసిస్తాయని, మన పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. కార్పొరేట్ స్కూళ్లు సైతం ఈర్ష్య పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన మార్కులను చూస్తుంటే ముచ్చటేస్తోందని, ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్ కూడా తెస్తామని, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మన పరీక్ష పత్రాలను కూడా మారుస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య విద్యా సంస్థల్లో చదువుతూ ఆయా విద్యాసంస్థల్లో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచిన 42 మంది టెన్త్ విద్యార్థులు, ఇంటర్లో గ్రూపుల వారీగా టాపర్లు 26 మందిని ‘జగనన్న ఆణిముత్యాలు– స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్–2023’తో ఘనంగా సత్కరించారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఈ వేడుకకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను సత్కరించారు. ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 20 మంది విద్యార్థులను కూడా ‘స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డు’తో సత్కరించారు. అనంతరం సీఎం జగన్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నాలుగేళ్లలోనే సదుపాయాలన్నీ.. సర్కారు బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రం మొత్తమ్మీద నాలుగు స్థాయిల్లో టెన్త్, ఇంటర్లో టాప్ ర్యాంకుల్లో నిలిచిన 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నాం. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. టాప్ ర్యాంకులు సాధించిన మీరే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. మిమ్మల్నందరినీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక పెరుగుతోంది. సంకల్పం గట్టిదైతే ఫలితం అదే వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు మారిపోయాయి. రుచికరమైన మెనూ, పౌష్టికాహారంతో జగనన్న గోరుముద్ద అందిస్తున్నాం. పాఠశాలలు తెరవగానే జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్లు నాలుగేళ్లలోనే ఇంగ్లీష్ మీడియంకు మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. పాఠ్య పుస్తకాల సిలబస్ మారింది. బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ సమకూర్చాం. బైజూస్ కంటెంట్ అందుబాటులోకి తెచ్చాం. ఆరో తరగతి నుంచి ఐపీఎఫ్ ప్యానెళ్ల ద్వారా డిజిటల్ బోధన అందిస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు కంటెంట్ లోడెడ్ ట్యాబ్‌లను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. గతంలో క్లాస్ టీచర్లే సరిగా లేని దుస్థితి నుంచి సబ్జెక్ట్ టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలన్నీ సమకూరాయి. అవార్డు గ్రహీతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున సాధ్యమేనా? అనే పరిస్థితి నుంచి.. మన పేదింటి పిల్లలందరూ అంతర్జాతీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మూడో తరగతి నుంచి విద్యార్థులను టోఫెల్ పరీక్షకు సిద్ధం చేసి అంతర్జాతీయ సర్టిఫికెట్ అందచేసే గొప్ప అడుగు ఈ సంవత్సరం పడుతోంది. ప్రభుత్వ స్కూళ్ల పిల్లలను ఇంగ్లీష్ వినడం, మాట్లాడటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం. ఇలాంటి మార్పులు గవర్నమెంట్ బడుల్లో రాగలవా? సాధ్యమయ్యే పనేనా..? అనే పరిస్థితి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడక తప్పదనే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, తమ్ముడిగా పిల్లలందరికీ మంచి చదువులు అందాలని మనసారా కోరుకుంటున్నా. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది ప్రతి విద్యార్థీ కనీసం డిగ్రీతో బయటకు రావాలి. ఏ పిల్లాడి తల్లిదండ్రీ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులన్నింటికీ మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. విదేశాల్లో కూడా టాప్ 50 యూనివర్సిటీల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకోండి. మీకు మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఫీజు రూ.1.25 కోట్లైనా మీరు భయపడాల్సిన పనిలేదు. పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి మన పిల్లలందరూ ప్రతి రంగంలోనూ ఎదగాలి, మన కీర్తి ఎగరాలి. ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు, వినూత్న విధానాలను మన పిల్లలు అనుసరిస్తూ ప్రతి రంగంలోనూ ప్రపంచ లీడర్లుగా ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే నాణ్యమైన విద్య అందించాలి. ఈ నాలుగేళ్లల్లో విద్యపై మన ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ దేశంలో ఎవరూ తీసుకుని ఉండరు. రానున్న రోజుల్లో మన ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మన పరీక్ష పత్రాలు కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాలు ప్రపంచాన్ని ఏలే పరిస్థితి త్వరలోనే వస్తుంది. అది మనమంతా చూస్తాం. నాయకత్వ లక్షణాలను పెంచే విధంగా మన చదువులున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మెషీన్ లెర్నింగ్, చాట్ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ ఎదగాలి. ఆ స్థాయిలో మన విద్యారంగం మారబోతోంది. ఆ మేరకు మార్పులు చేస్తాం. విద్యార్థులతో కలసి ఉత్సాహంగా విద్యార్థుల సత్కార వేడుకలో ముఖ్యమంత్రి జగన్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పురస్కారాల ప్రదానం సందర్భంగా ప్రతి విద్యార్థి, టీచర్‌ను పేరు అడిగి మరీ అభినందించారు. పురస్కార గ్రహీతల్లో బాలికలు ఎక్కువ మంది ఉండడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. కష్టాలు చెప్పుకున్న విద్యార్థులకు అభయం అవార్డుల ప్రదానం సందర్భంగా కొందరు విద్యార్థులు తమ కష్టాలను తెలియచేయడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ► తిరుపతికి చెందిన కందాటి కుసుమ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బయోటెక్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. ‘బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న ఆమె తల్లి లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సీఎం జగన్ దృష్టికి తేవడంతో వైద్యం తీసుకుంటున్నారా? అని ఆరా తీశారు. వివరాలు సేకరించి అవసరమైన సాయం అందించాలని అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను సీఎం ఆదేశించారు. ► అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామానికి చెందిన చిన్ని పావని నక్కపల్లి కేజీబీవీలో బైపీసీ చదివి 976 మార్కులు సాధించింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె బాగోగులను విశాఖలోని ఓ ట్రస్ట్ చేపట్టింది. తనకు డాక్టర్ కావాలని ఉందని, స్తోమత లేదని పావని పేర్కొనడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్ నీట్ శిక్షణకు అవసరమైన సాయం అందించాలని విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను ఆదేశించారు. మరికొందరు విద్యార్థులు కూడా తమ సమస్యలను సీఎం దృష్టికి తేవడంతో వారందరికీ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. టాపర్లకు నగదు బహుమతులు మొదటి స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష నగదు రెండో బహుమతిగా రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50 వేలు ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో టెన్త్, ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో ఆయా విద్యాసంస్థల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సీఎం జగన్ చేతుల మీదుగా నగదు పుర స్కారాలను ప్రదానం చేశారు. పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో 42 మంది విద్యార్థులు టాపర్లుగా నిలవగా 11 మంది ప్రథమ స్థానం, 16 మంది ద్వితీయ స్థానం, 15 మంది తృతీయ స్థానం సాధించారు. ఇంటర్లో గ్రూప్‌నకు ఒక్క రు చొప్పున 26 మంది విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. తొలి స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష నగదు, రెండో స్థానం సాధించినవారికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.50 వేల నగదు చొప్పున బహుమతి అందజేశారు. ఉన్నత విద్యలో 20 మందికి పురస్కారం ఉన్నత విద్యలో వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు స్టేట్ ఎక్స్‌లెన్స్ అ వార్డులను ప్రదానం చేశారు. కమ్యూనిటీ స ర్వీసెస్, ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన వి ద్యార్థి, స్టూడెంట్ ఇన్నొవేషన్ విభాగాలతో పాటు క్విజ్ చాంపియన్‌షిప్‌లో గెలుపొందిన తొలి మూడు జట్లకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించారు. ప్రతి విభాగంలో మొదటి స్థానానికి రూ.లక్ష, రెండో స్థానానికి రూ.75 వేలు, మూడో స్థానానికి రూ.50 వేలు చొప్పున నగదు అందజేశారు. ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన విద్యార్థి కేటగిరీల్లో కన్సొలేషన్ బహుమతి కింద రూ.10 వేలు ప్రదానం చేశారు. టెన్త్ , ఇంటర్, ఉన్నత విద్యలో మొత్తం 88 మంది టాపర్లుగా నిలిచారు. విద్యార్థులందరినీ ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు. స్ఫూర్తిదాయకం.. ఆరోగ్యకరమైన పోటీ సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందించడం మరింత మంది విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతుంది. ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నాం. అలాంటి విద్యార్థులను తయారు చేసిన అధ్యాపకులకు అభినందనలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యా రంగానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అందరూ గర్వపడేలా అవకాశాలు కల్పిస్తున్నాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం జగన్ తోడుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్ విద్యలో మన విద్యార్థులు రాణించేలా చర్యలు చేపట్టారు. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి -
విద్యార్థులను భయపెడుతున్న సర్కారీ బడులు
-
బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు: సీఎం జగన్
Updates ►మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రం ►బాబు పెత్తందారీ భావజాలానికి.. పేదలకు మధ్య యుద్ధం. ►సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. ►ఎల్లో మీడియా విష ప్రచారానికి, మనం చేస్తున్న మంచికి యుద్ధం. ►టీడీపీ హయాంలో దోచుకో, పంచుకో, తినుకో విధానం. ►డీపీటీ కావాలా? నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలా? ►ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అండగా ఉండకపోవచ్చు.. ►జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు. ►మీ జగనన్న ప్రజలనే నమ్ముకున్నారు. ►ఇది కురుక్షేత్ర యుద్దం ►ఈ యుద్ధంలో నా ధైర్యం, బలం మీరే. ►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా నిలవండి. ►దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ►చంద్రబాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారు. ►మరోసారి మోసానికి తెరతీశారు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారు. ►14 ఏళ్లు సీఎంగా బాబు ఏం చేశారు? గాడిదలు కాశారా? ►బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు ► విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం: సీఎం జగన్ ► ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. ► టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం. ► అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ► ఇంగ్లీష్ మాట్లాడటంలో మన విద్యార్థులకు ప్రతిభ పెరుగుతుంది. ► రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ. ► విద్యాకానుక కిట్లలో మెరుగైన మార్పులు చేశాం. ► యూనిఫామ్ డిజైన్‌లో మార్పులు చేశాం. ► గతేడాది కంటే ఈ ఏడాది యూనిఫామ్ క్లాత్ శాతం పెరిగింది. ► రూ.1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్ల పంపిణీ. ► 43 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక ► ప్రతి విద్యార్థి రూ. 2,400 విలువైన కిట్ పంపిణీ. ► ఇప్పటి వరకు విద్యాకానుక పథకానికి రూ. 3,366 కోట్లు ఖర్చుచేశాం. ►ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స సత్యనారాయణ ►విద్యారంగంలో కీలక సంస్కరణలు చేశాం. ►ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలబడాలనేదే లక్ష్యం. ►ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో విద్యా బోధన. ►సీఎం జగన్ అంటే ప్రభంజనం: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ►పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ►నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరులో ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన సీఎం జగన్ డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో కూర్చొని ముచ్చటించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్‌పై ఆల్ ది బెస్ట్ అని రాశారు. జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు సీఎం వైఎస్జగన్ చేరుకున్నారు. కాసేపట్లో నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించనున్నారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండగా.. తొలిరోజే విద్యాకానుక అందిస్తోంది ప్రభుత్వం. వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేయనున్నారు. ►ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు. ►43.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక అందించనున్నారు. ►రూ. 1,042.53 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►నాలుగేళ్లలో విద్య కోసం రూ.60 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ► తొలి దశలో నాడునేడు పూర్తయిన 15,715 స్కూళ్లలో డిజిటల్ విద్య, హైస్కూళ్లలో 30 వేల తరగతి గదులకు బైజూస్ కంటెంట్‌తో డిజిటల్ విద్య అందిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. పాఠ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి: పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు! -
గోల్డెన్ చాన్స్! సర్కారు బడి పిల్లలకు 'గ్లోబల్ చదువులు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో ఇప్పటికే పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు తాజాగా మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేసింది. భవిష్యత్ టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దనుంది. వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలో ఉన్నతోద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది. పాఠ్య ప్రణాళిక, ఉండాల్సిన మానవ వరులు, సదుపాయాలపై ఈ వర్కింగ్ గ్రూప్ నివేదిక ఇవ్వనుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాలతోపాటు పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాల పరంగా ఎన్నో మార్పులు తీసుకు వచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 41 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతున్నాయి. తెలుగు– ఇంగ్లిష్‌లో టెక్స్ట్ బుక్స్ విప్లవాత్మక నిర్ణయాలకు అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స్ సబ్జెక్టుల్లో బైలింగ్వల్ (ఒక పేజీలో ఇంగ్లిష్, మరో పేజీలో తెలుగు) టెక్స్ట్ బుక్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందించింది. ఇంగ్లిష్‌లో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇంగ్లిష్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసింది. 2021–2౨లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆక్స్ఫర్డ్ డిక్షనరీని, మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. సబ్జెక్ట్ టీచర్.. డిజటల్ బోధన బోధనలో మరో కీలక మార్పు సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్. విద్యార్థులకు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జాతీయ.. ప్రపంచ స్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు వచ్చేలా 2022–23లో చర్యలు చేపట్టింది. విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్‌లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు అర్థమయ్యేందుకు ఆడియో, విజువల్ రూపంలో బైజూస్ కంటెంట్‌ను అందించింది. ఇందుకోసం 5,18,740 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. వీటితోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా, వేగవంతంగా చేపట్టింది. నాడు–నేడు పూర్తి చేసుకున్న 30,213 హైస్కూల్ తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం జూలై కల్లా వీటిని ఏర్పాటు చేయనున్నారు. మరో 10,038 ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో వచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టెక్నాలజీపై సూచనలు ఇచ్చేందుకు వర్కింగ్ గ్రూప్ ప్రపంచ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడాలంటే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అవసరం. ప్రపంచ స్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ చాట్ జీపీటీ, వెబ్ 3.0, అగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై చేపట్టాల్సిన చర్యలు, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. విద్యాభ్యాసం తొలినాళ్ల నుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబ్‌లు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు ఇలా.. పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ వర్కింగ్ గ్రూప్‌నకు చైర్మన్‌గా, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. మైక్రోసాఫ్ట్ ఇండియా నుంచి అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా నుంచి షాలినీ కపూర్, గూగుల్ సంస్థ ప్రతినిధి, ఇంటెల్ ఏసియా నుంచి శ్వేత ఖురానా, నాస్కాం ప్రతినిధి, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య, నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చన జి.గులాటి వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జూలై 15 నాటికల్లా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. -
ఇకపై శనివారం కూడా బడి?
సాక్షి, చెన్నై: ఇకపై ప్రతి శనివారం కూడా పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే తరగతుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవులే. ఈ పరిస్థితుల్లో తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కొంత ఆలస్యమైంది. భానుడి ప్రతాపం పుణ్యమా రెండు సార్లు పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేశారు. సోమవారం నుంచి 6–12 తరగతులకు, ఈనెల 14 వతేదీ నుంచి 1–5 తరగతులకు పాఠశాలలు తెరచుకోనున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావంతోవ ర్షాలు ఆశాజనకంగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణకేంద్రం ప్రకటించింది. ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకడంలో రాష్ట్రంలో అనేక జిల్లాలో తేలిక పాటి వర్షం మొదలైంది. శనివారం చెన్నై , శివారులలో అనేక చోట్ల వర్షం పడింది. ఈవర్షం ప్రభావం క్రమంగా పెరిగిన పక్షంలో పాఠశాలలకు తరచూ సెలవులు ఇవ్వక తప్పదు. దీంతో ఈ సెలవులతో విద్యా బోధనలు కుంటు పడే పరిస్థితి ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి శనివారం కూడా పాఠశాలలు పనిచేసే విధంగా చర్యలకు సిద్ధమైంది. ఈ విషయంగా విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరిశీలన జరుపుతున్నామన్నారు. సకాలంలో సిలబస్ ముగించాలంటే శనివారం కూడా తరగతుల నిర్వహణ అవశ్యమని, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వస్థలాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లిన జనం చెన్నై వైపుగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సులను శని, ఆదివారం కూడా నడిపేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకుంది. -
మరింత ఆకర్షణీయంగా యూనిఫామ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సర్కారు బడి పిల్లలు అన్ని అంశాల్లోను కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. ఇందులో భాగంగా.. బడికి వచ్చే పిల్లలకు నాణ్యమైన స్కూలు బ్యాగు, సాక్సులు, బూట్లు, బెల్టుతో పాటు ఆకట్టుకునే యూనిఫామ్‌ను సైతం అందిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ 2023–24 విద్యా సంవత్సరానికి మరింత మెరుగైన, ఆకర్షణీయమైన రంగుల్లో యూనిఫామ్ ఇవ్వనుంది. ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్పున 39,95,992 మంది విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్‌ను జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఇచ్చిన క్లాత్ సరిపోలేదని పలుచోట్ల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈసారి యూనిఫామ్ కొలతలను పెంచారు. బాలికలకు ముదురు లావెండర్ రంగులో గౌను, లావెండర్ రంగులో చెక్స్‌తో టాప్.. బాలురకు ముదురు నీలంపై నల్ల రంగు చెక్స్ చొక్కా, డార్క్ మిడ్నైట్ బ్లూ రంగులో ఫ్యాంటు/నిక్కర్ ఉండనున్నాయి. అలాగే.. ♦ చొక్కా–నిక్కర్, గౌను, ప్యాంటు, చుడిదార్.. ఇలా బాలురు, బాలికలకు రెండు రంగుల్లో యూనిఫామ్ ఇస్తున్నప్పటికీ తరగతులను బట్టి డిజైన్‌ను ఎంపికచేశారు. ♦ ఒకటి నుంచి 7వ తరగతి వరకు బాలురకు హాఫ్ చేతుల చొక్కా, నిక్కర్.. 8 నుంచి 10వ తరగతి వరకు హాఫ్ చేతుల చొక్కా ఫుల్ ప్యాంట్ ధరించాలి. ♦ బాలికల విషయంలో.. ఒకటి, రెండు తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, గౌను.. 3, 4, 5 తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, స్కర్టు.. ఆరు నుంచి 10వ తరగతి బాలికలు చున్నీతో చుడిదార్ యూనిఫామ్‌గా నిర్ణయించారు. ♦ ఆయా తరగతులను అనుసరించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 1.25 మీటర్ల నుంచి 3.30 మీటర్ల ప్యాంట్ క్లాత్.. 1.80 మీ. నుంచి 3.30 మీ. చొక్కా క్లాత్ అందిస్తున్నారు. ♦ బాలికలకు 3.60 మీ. నుంచి 3.80 మీ. గౌను/చుడిదార్ బాటమ్.. 2.10 మీ. నుంచి 4.20 మీ. చొక్కా/చుడిదార్ టాప్ క్లాత్ ఇస్తున్నారు. ♦ గత ఏడాది పంపిణీ చేసిన యూనిఫామ్ క్లాత్ సరిపోలేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసారి విద్యార్థులందరికీ ఇచ్చే క్లాత్‌ను 23–60 శాతం అదనంగా అందిస్తున్నారు. యూనిఫామ్ కుట్టించి.. పరిశీలించి.. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి బాల బాలికలకు వేర్వేరు కొలతల్లో క్లాత్ ఇస్తున్నారు. ఇచ్చిన క్లాత్‌లో మూడు జతలు వస్తాయా.. రావా? అని ఒకటికి రెండుసార్లు అధికారులు పరిశీలించారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలను ఎంపిక చేసి, వారి కొలతలను తీసుకున్నారు. తరగతుల వారీగా ఇచ్చిన క్లాత్‌తో మూడు జతల యూనిఫారాలు రావడంతో సంతృప్తి చెందిన అనంతరం క్లాత్‌ను విద్యా కానుక కిట్‌లో అందిస్తున్నారు. -
ఆఫ్గాన్‌లో దారుణం.. 80 మంది బాలికలపై విషప్రయోగం
అఫ్గానిస్థాన్‌లో దారుణం జరిగింది. దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. సర్ ఎ పుల్ ప్రావిన్సు, సంగ్చారక్ జిల్లాలోని రెండు ప్రాథమిక పాఠశాలల్లో ఈ దాడులు జరిగాయి. దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. వ్యక్తిగత కక్షతోనే ఈ దారుణం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. బాలికలను ఆస్పత్రికి తరలించినట్లు విద్యా శాఖ అధికారి మహమ్మద్ రహమానీ వెల్లడించారు. ఈ ఘటనలో దుండగులు ఉపయోగించిన విషపదార్థం ఎంటో తెలియలేదు. చికిత్స పొందుతున్న బాలికల గురించి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కాగా.. తాలిబన్లు 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌లో బాలికలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. స్కూళ్లు, కళాశాలల్లో బాలికలపై దాడులు జరుగుతున్నాయి. ఇదీ చదవండి:తీవ్రంగా చలించిపోయా: బైడెన్ -
జూన్ 12న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా కానుక
-
ఆవిష్కరణలు.. అద్భుతం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో గురువారం ఫ్యూచర్ ఇన్వెంటర్స్ (భవిష్యత్ ఆవిష్కర్తలు) ఫెయిర్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 24 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఈ ఫెయిర్‌లో ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్ డిష్ వాషర్‌కు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు అనేది తమ నినాదం మాత్రమే కాదని, తమ విద్యాసంస్థ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలున్నాయని, సరైన మార్గదర్శకత్వం, సరైన వేదికలు లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగాలు చేయడం కాదు, ఉన్నత ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఈ నూతన ఆవిష్కరణలతో లభిస్తుందని చెప్పారు. కాగా ఈ ఫెయిర్‌లో మొత్తం ఐదు ఆవిష్కరణలకు బహుమతులు లభించాయి. సోలార్ హ్యాండ్ డిష్ వాషర్ వంట పాత్రలను శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడే నూతన సోలార్ హ్యాండ్ డిష్ వాషర్‌ను కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించారు. అన్ని వైపులా తిరిగేందుకు వీలుండే ఓ మోటార్‌కు స్క్రబ్బర్‌తో కూడిన ప్రత్యేక పరికరం అమర్చారు. సౌర విద్యుత్‌తో పాటు, బ్యాటరీతో కూడా పనిచేసేలా దీనిని తయారు చేశారు. అందుబాటులో ఉన్న సామగ్రితో తయారైన ఈ హ్యాండ్ డిష్ వాషర్‌కు ఫెయిర్‌లో మొదటి బహుమతి లభించింది. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే పాత్రలను శుభ్రం చేయడానికి పడుతున్న ఇబ్బందులను చూసి ఈ హ్యాండ్ డిష్ వాషర్‌ను రూపొందించామని విద్యార్థులు సాకేత్, హర్ష, ప్రణయ్, నవీన్, రక్షితలు పేర్కొన్నారు. పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లు రసాయనాలతో కూడిన శానిటరీ న్యాప్కిన్ లను వాడటంతో మహిళలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి పర్యావరణానికి కూడా హాని చేస్తున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు సహజ సిద్ధంగా లభించే పత్తి, అరటి ఫైబర్ (కాండంలో ఉండే నార), మొక్కజొన్న పిండి, వేప రసాన్ని వంటి వాటిని ఉపయోగించి న్యాప్కిన్లు తయారు చేశారు. వీటివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రావు. లీక్ ప్రూఫ్‌తో పాటు పర్యావరణానికి కూడా అనుకూలమైనవి. ఈ న్యాప్కిన్లు అందుబాటు ధరలో లభించే అవకాశాలు న్నాయని విద్యారి్థనులు అక్షయ, హన్సి క, మానసలు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణకు రెండో బహుమతి లభించింది. అగ్ని ప్రమాదాలపై ‘డ్రయిడ్’ అలర్ట్ అగ్ని ప్రమాదాలపై అలర్ట్ చేయడంతో పాటు, ప్రమా దం జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం లేకుండా నివారించే ‘కెలామెటీ కంట్రోల్ డ్రయిడ్ ’ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్) విద్యార్థులు ఆవిష్కరించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ డ్రయిడ్ అగ్నిప్రమాదం జరిగితే వెంటనే గుర్తించి., మొబైల్ టెక్నాలజీతో ఫైర్ స్టేషన్‌కు సమాచారాన్ని పంపుతుంది. మంటలు విస్తరించకుండా నీటితో ఆర్పివేస్తుంది. సెన్సార్ల సాయంతో అగ్నిప్రమాదంలో ఎవరైనా మనుషులు చిక్కుకున్న విషయాన్ని కూడా పసిగట్టి ఫైర్ స్టేషన్‌కు సమాచారం పంపుతుంది. ఈ ఆవిష్కరణకు తృతీయ బహుమతి వచ్చింది. విద్యార్థులు సూరజ్ గుప్తా, రిషిక్, కార్తికేయలు ఈ డ్రయిడ్ను ఆవిష్కరించారు. ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్.. కల్వర్టుల వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొనడం గానీ, పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొనడం వంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఇలాంటి కల్వర్టుల వద్ద ప్రమాదాల నివారణకు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఎక్స్లెంట్ స్టార్ హైసూ్కల్ విద్యార్థి రయాన్ ‘ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్’అనే నూతన పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. కల్వర్టుల వద్ద ఆర్.ఎఫ్ ట్రాన్స్‌మీటర్, వాహనంలో ఆర్.ఎఫ్.రిసీవర్లను అమర్చ డం ద్వారా వాహనం లైట్ ఆటోమెటిక్‌గా లోయర్ డిప్పర్లోకి మారుతుంది. దీంతో ఎదు రుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి రోడ్డు ప్రమాదం తప్పుతుంది. దీనికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టర్.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించే బాధ్యతను మహిళా సంఘాలే చూస్తున్నాయి. ఎక్కువ బరువున్న వంట పాత్రలను పొయ్యి పైనుంచి దించడం, అన్నం వార్చడం వంటి పనులు చేయలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో భారీ వంట పాత్రలోని అన్నాన్ని సులభంగా వార్చడానికి ఉపయోగపడే ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టు పరికరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపకల్పన చేశారు. దీన్ని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంది. వినీల, నందు, శ్రీచైత్ర, సుప్రియ రూపొందించిన ఈ పరికరానికి కూడా కన్సొలేషన్ బహుమతి లభించింది. -
మీరెప్పుడైనా కబడ్డీ డ్యాన్స్ చూశారా? మీకోసమే ఈ వీడియో..
-
క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్‌షీట్‌లో బాలీవుడ్ పాటలు ..!
చండీగఢ్: పరీక్షలు రాయడానికి కూర్చున్న ఆ స్టూడెంట్‌కు క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలన్నీ కట్టకట్టుకుని కన్పించాయి. ఒక్కదానికీ ఆన్సర్ తెలియదు! ఏం చేయడమా అని తల పట్టుకున్నాడు. బాగా ఆలోచించి... బాలీవుడ్ పాటలన్నీ తీరుబడిగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ పోయాడు. అలా ఆన్సర్ షీటు నిండా జవాబులకు బదులుగా పాటలే రాసేసి ఇచ్చాడు. చండీగఢ్‌లో ఒక స్కూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆన్సర్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు విద్యార్థి ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలు త్రీ ఇడియట్స్లోని ‘గివ్ మి సమ్ సన్‌షైన్...’, పీకేలోని ‘భగవాన్ హే కహా రే తూ...’ అంటూ తన అవస్థకు అద్దం పట్టే పాటలే రాశాడు! దాంతో పేపర్‌ను దిద్దిన టీచర్ సున్నా మార్కులిచ్చింది. అయితే, ‘మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సింది’ అంటూ చివరి పేజీలో సరదా కామెంట్ రాయడంతో నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. -
Hyderabad: ఇద్దరు బాలికల అదృశ్యం
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వి.శిరీష (12) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. అయితే తమ కూతురిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారంటూ తండ్రి వి.కృష్ణ ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో నివసించే వి.శిరీష స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 12న ఉదయం తల్లిదండ్రులు జీహెచ్ఎంసీలో పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న సోదరి కనిపించడం లేదంటూ కొడుకు నరేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ, సుజాత దంపతులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. తనకు వరుసకు మేనల్లుడు వి.మల్లేష్ (22) కూడా కనిపించడం లేదని, అతడిపైనే తమకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణ పేర్కొన్నాడు. డబ్బుల కోసం తన కూతురిని కిడ్నాప్ చేశారని, సీసీ కెమెరా ఫుటేజీలో మల్లేష్ తల్లి సరోజమ్మ తన కూతురిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించిందన్నారు. మల్లేష్ ఇటీవల తనను రూ. 50 వేలు అడిగాడని, తాను లేవని చెప్పడంతో కక్ష పెంచుకొని తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శిరీష ఆచూకీ తెలిసిన వారు 8712660458 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. బంజారాహిల్స్‌లో 9వ తరగతి విద్యార్థిని బంజారాహిల్స్: అనుమానాస్పదస్థితిలో 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 10లోని నూర్‌నగర్‌లో నివసించే అమ్రీన్ బేగం(14) సెయింట్ నిజామియా హైస్కూల్లో చదువుతోంది. ఈ నెల 21న జహిరానగర్‌లోని షాహిన్ కన్వెన్షన్ హాల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి హాజరైంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో సోదరుడు హనీఫ్ ఫోన్ చేయగా కార్యక్రమం ఇంకా జరుగుతున్నదని, కొద్దిసేపట్లో వస్తానని తెలిపింది. అయితే సోదరుడు కొంత సమయం తర్వాత హాల్ వద్దకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షాహిన్ కన్వెన్షన్ హాల్ నుంచి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన చెల్లెలు అదృశ్యమైందని పోలీసులకు హనీఫ్ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్షరాలా కష్టాలే.. తెలంగాణలో ప్రభుత్వ బడి లేని ఊళ్లు 3,688
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 314 శివారు గ్రామాల్లో స్కూళ్లు లేని పరిస్థితి ఉంది. 284 శివారు గ్రామాల్లో పాఠశాలలు లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం జైత్రం తండా గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాల కోసం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి ఆటోలో వెళ్తున్నారు. కిక్కిరిసిన ఆటో ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. అందరికీ విద్య ప్రాథమిక హక్కు అని మన రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. కానీ ఇప్పటికీ, ఇన్నేళ్లు గడిచినా.. ఎన్నో గ్రామాలకు విద్య దూరంగానే ఉంది. ప్రాథమిక విద్యకు సైతం వ్యయప్రయాసలకోర్చి పక్క ఊరికో, ఆ పక్క ఊరికో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మాధ్యమిక, ఉన్నత పాఠశాల కోసం మరింత దూరం ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. మన రాష్ట్రాన్నే చూసుకుంటే.. 3,688 శివారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలే లేదు. 546 శివారు గ్రామాల్లో అక్షరాలు దిద్దించే ప్రాథమిక పాఠశాల లేదు. 2,018 గ్రామాలు మాధ్యమిక విద్యకు దూరంగా ఉన్నాయి. 2,508 శివారు గ్రామాల్లో ఉన్నత పాఠశాల లేదు. రాష్ట్రవ్యాప్తంగా 30,395 మంది చిన్నారులు చదువు కోసం 3 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తోంది. నడుచుకుంటూనో, కిక్కిరిసిన ఆటోల్లోనో, సైకిళ్ళ మీదో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొద్దిపాటి వర్షం వచ్చినా బురదగా మారే రోడ్ల మీద అష్టకష్టాలు పడుతూ విద్యనభ్యసిస్తున్నారు. ఉచిత, నిర్బంధ విద్య కింద 10 నెలల రవాణా భత్యం ప్రభుత్వం ఇస్తుంది. కానీ పెరిగిన డీజీల్ చార్జీల కారణంగా చుక్కలనంటే ఆటో చార్జీలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని మారుమూల గ్రామాల పేద ప్రజలు అంటున్నారు. ఈ పరిస్థితులు విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్కూల్ దశలోనే చదువు మానేసేవారి (డాపవుట్స్) సంఖ్య పెరుగుతోంది. విద్యకు దూరమవుతున్న వారిలో ఎక్కువ శాతం వెనుకబడిన ప్రాంతాల నిరుపేదలే ఉంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ‘యూ డైస్’ (యూనిఫైడ్ డిస్క్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నివేదిక ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తోంది. ఎంతెంత దూరం.. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుంపాడుకు సమీపంలోని గిరిజన గ్రామాల విద్యార్థులు కనీసం 4 కిలోమీటర్ల మేర ప్రయాణించి చదువుకోవాల్సి వస్తోంది. సంవత్సరంలో కనీసం 70 రోజులు బురదతో నరక యాతన పడుతున్నారు.– ► ఆదిలాబాద్ జిల్లాలో 162 శివారు గ్రామాల్లో అక్షరం చెప్పే దిక్కే లేదు. మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్, పెద్దపల్లి.. ఇలా పలు జిల్లాల్లో..ఒక్కో జిల్లాలో 150కి పైగా శివారు గ్రామాల్లో స్కూళ్ళు లేవు. ► మెదక్ జిల్లా తూప్రాన్ సమీకృత వసతి గృహంలో ఉండే విద్యార్థులు 2.5 కిలో మీటర్ల దూరంలోని స్కూలుకు వెళ్తున్నారు. మధ్యలోనే మానేస్తున్నారు చదువుపై పెద్దగా అవగాహన లేని శివారు గ్రామస్తులు, ముఖ్యంగా పేద కుటుంబాల వారు పిల్లలను దూర ప్రాంతాలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉన్న స్కూల్ విద్యకే పరిమితం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గత ఏడాది 13.7 శాతం మంది విద్యార్థులు టెన్త్ క్లాస్‌కు వచ్చేసరికే చదువు మానేశారు. ఇందులో 12.9 శాతం బాలికలే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో చదివే విద్యార్థులకు జూనియర్ కాలేజీ అందుబాటులో లేదు. దీంతో తల్లిదండ్రులు బాలికలను టెన్త్‌తోనే ఆపేస్తున్నారు. గడచిన రెండేళ్ళలో 18 మంది ఇలా విద్యకు దూరమయ్యారు. వీరిలో ఎక్కువ మందికి వివాహాలు కూడా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 8–10 తరగతుల బాలికలను పాఠశాలకు వెళ్లని కారణంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్టు గుర్తించారు. ఇలా గడచిన రెండేళ్ళలో 19 మందికి వివాహాలైనట్టు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. స్కూళ్ళు, కాలేజీలు అందుబాటులో లేకపోవడం వల్లే చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. శివారు తండాల వరకూ ప్రభుత్వ స్కూళ్ళను తీసుకెళ్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదని స్పష్టం చేస్తున్నారు. చదవాలంటే నడవాల్సిందే.. ఈ బడి పిల్లల కష్టాల గురించి ‘యూ డైస్’.. తమ నివేదికలో ప్రస్తావించింది. గిరిజన గ్రామమైన కొండతోగు.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది. ఇక్కడ దాదాపు 21 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా చదువుకోవడం కోసం 3 కిలోమీటర్ల దూరంలోని పండువారిగూడేనికి నడిచి వెళ్తున్నారు. ఇలా రోజూ రానూపోనూ ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే.. మామూలు రోజుల్లోనే ఈ మార్గంలో నడవడం కష్టం.. ఇక, వానొస్తే అంతే.. -
ఏపీలో డిజిటల్ విప్లవం
సాక్షి, అమరావతి: డిజిటల్ డివైడ్‌ను తొలగించాలన్నా... అంతరాలను తగ్గిస్తూ పోవాలన్నా కావాల్సింది అక్షరాస్యత. అది కూడా... డిజిటల్ అక్షరాస్యత. ఆ సూత్రాన్ని మనసావాచా ఆచరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఇక్కడ డిజిటల్ డివైడ్ తగ్గుతోంది. శ్రీమంతులకు మాత్రమేననుకున్న డిజిటల్ విద్య పేదలకూ అందుతోంది. డివైడ్‌ను తగ్గిస్తూ డివైజ్‌లూ అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ఏడాది 8వ తరగతికి వచ్చిన విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారు. మొత్తం 5.30 లక్షల నాణ్యమైన ట్యాబ్‌లు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థికీ అందుబాటులో ఉండేలా డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. 1వ తరగతి నుంచే స్మార్ట్ టీవీ స్క్రీన్ల ద్వారా డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అలవాటు చేయటంతో పాటు... ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి, ఆపైన ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లివ్వటంతో పాటు... 8, ఆ పై తరగతుల వారికి బైజూస్ డిజిటల్ కంటెంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనూ పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఉన్న పాఠాలను నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంటర్ విద్యార్థులకు కూడా డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ డిజిటల్ సదుపాయాలతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులూ ఉత్తమ విద్యా ప్రమాణాలను అందుకునే అవకాశముంది. ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేయటమే కాదు. వాటి ద్వారా నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించే చర్యలు చేపట్టారు. దీనికోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ‘నాడు–నేడు’ పూర్తయిన స్కూళ్లన్నింటిలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్‌పీలు అందుబాటులోకి రానున్నాయి. ఇక పుస్తకాల్లోని అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్ ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత సమర్థంగా అభ్యసనం కొనసాగించేందుకు ఆస్కారమేర్పడుతోంది. పాలనలోనూ డిజిటల్ సేవలు... విద్యారంగంలోనే కాకుండా ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ డిజిటల్ విధానంలోనే కొనసాగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా అన్ని సంక్షేమ పథకాలనూ అక్రమాలకు, అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా అందజేయగలుగుతున్నారు. గతంలో లక్షల కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల కింద ఖర్చు చేస్తున్నట్లు చూపించటమే తప్ప ప్రజలకు వాటి ఫలాలు అందలేదు. మధ్యవర్తులు, దళారులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారు. డిజిటలైజేషన్‌ను ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవటంతో ఆ పరిస్థితికి పూర్తిగా చెక్ పడింది. రాష్ట్రంలో గ్రామ, వార్డుల వారీగా 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. తద్వారా అర్హుౖలైన ప్రతి లబ్ధిదారుకూ ప్రభుత్వ పథకాలను నేరుగా అందిస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు, శిశువుల సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు వీలుగా అంగన్వాడీ కార్యకర్తలకూ ఫోన్లు అందించారు. 42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు... 15వేల మందికి పైగా ఏఎన్ఎంలకు ట్యాబులు పంపిణీ చేయటంతో వారి ద్వారా అందజేస్తున్న సేవల్లో పూర్తి పారదర్శకత సాధ్యమయింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయటమే కాక అక్కడ 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించి స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికీ శ్రీకారం చుట్టారు. -
బంపర్ ఆఫర్.. స్టూడెంట్స్‌కు ఉచితంగా సార్ మూవీ చూసే ఛాన్స్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన 15రోజులవుతున్నా ఇంకా సార్ జోష్ తగ్గలేదు. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. విద్యా వ్యవస్థపై, విద్యార్థుల హక్కులను ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలో థియేటర్ల వద్ద సార్ సందడి కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలో ఇటీవలె ఖమ్మంలోని స్కూల్ విద్యార్థులు ఈ సినిమా ఉచితంగా చూపించాలంటూ ధర్నాకు దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి ఏకంగా నిర్మాత నాగవంశీ దృష్టికి చేరింది. దీంతో పిల్లల కోసం ఫ్రీ షో కావాలనే వారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. విద్యా హక్కుపై అవగాహన కల్పించడమే సార్ ప్రధాన లక్ష్యం. మా సినిమాను స్కూలు పిల్లలకు ఉచితంగా చూపించాలనుకుంటున్నాం. మీరు చేయాల్సిందల్లా contact@sitharaents.com ఐడీకి మెయిల్ చేయడమే. మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి షో ఖరారు చేస్తుంది అంటూ నాగవంశీ పేర్కొన్నారు. The Major goal of #SIRMovie #Vaathi was to spread awareness about value of education. We are happy to show our movie free of cost to the School Kids. Please send a mail at contact@sitharaents.com & our team will reach out to you at the earliest with the show confirmation! — Naga Vamsi (@vamsi84) March 4, 2023 -
ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం
ఇరాన్లో వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండ మరువుక మునుపే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనెస్ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు వెల్లడించారు. అంతేగాదు విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ స్థానికి మీడియాలు పేర్కొన్నాయి కూడా. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది వస్త్రధారణ నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన 22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమిని డిసెబర్ 16న కస్టడీలో మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో అట్టుడుకుపోతోంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?
బెంగళూరు: పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు. చదవండి: మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్ కేసు విచారణకు కేంద్రం ఆమోదం.. -
పెట్రోల్ వాసన పీల్చేస్తున్నారు!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోవటం, తరచూ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఓ రిహాబిలిటేషన్ (పునరావాస) కేంద్రానికి తీసుకెళ్లారు. విద్యార్థిని పరిశీలించిన నిపుణులు.. ఆ అబ్బాయి పెట్రోల్ వాసనకు బానిసయ్యాడని చెప్పారు. దాంతో వారు విస్తుపోయారు. పెట్రోల్ వాసన పీల్చడమేంటని ప్రశ్నించగా.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఆ అబ్బాయి డ్రగ్స్‌కు ప్రత్యామ్నాయంగా పెట్రోల్ వాసన పీల్చుతున్నట్లు చెప్పారు. రోజూ ఖర్చీఫ్లో ఐదారు చుక్కల పెట్రోల్‌ను పోసుకొని అవసరమైనప్పుడల్లా పీల్చుతూ.. మత్తులో జోగుతున్నట్లు తేల్చేశారు. సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా 8, ఆపై తరగతి పిల్లల్లో ఈ దురలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు మాదకద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా పెట్రోల్‌తో పాటు నొప్పి తగ్గించే కొన్ని నూనెలు, మందులు (పెయిన్ కిల్లర్స్), జిగురు, వైట్నర్ వంటివి వాడుతున్నారు. కొందరు ఎడిబుల్ (తినదగిన) డ్రగ్స్ వినియోగిస్తున్నారు. ఈ విధంగా మాదక ద్రవ్యాలకు బానిసలైన వందకు పైగా విద్యార్థులు ప్రస్తుతం రిహాబిలిటేషన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురు బాలికలు కూడా ఉండటం గమనార్హం. తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వటం మాత్రమే కాదు దాన్ని ఎలా వినియోగిస్తున్నారో చూడటం కూడా తల్లిదండ్రుల బాధ్యత. కరోనా తర్వాతి నుంచి స్కూల్ విద్యార్థులలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. అయితే వీరు ఇంటర్నెట్లో ఎక్కువగా ఎలాంటి సైట్లను చూస్తున్నారు? ఏ సమాచారాన్ని తెలుసుకుంటున్నారో తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో ఏ వస్తువులు కొనుగోలు చేస్తున్నారో పర్యవేక్షించాలని అంటున్నారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడితే ఏ తరహా ఆటలాడుతున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే పిల్లలు చెడిపోయేందుకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చినట్టేనని స్పష్టం చేస్తున్నారు. సొంతంగా ఎడిబుల్ డ్రగ్స్ తయారీ, విక్రయం! గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన మాజీ విద్యార్థిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ మీద మంచి పట్టున్న ఈ విద్యార్థి.. సొంతంగా హాష్ ఆయిల్, గంజాయితో ఎడిబుల్ (తినదగిన) డ్రగ్స్‌ను తయారు చేయడం నేర్చుకున్నాడు. చాక్లెట్లు, వేఫర్ల వంటి బేకరీ ఉత్పత్తులను కరిగించి హాష్ ఆయిల్‌ను కలిపి ఎండబెట్టి తిరిగి చాక్లెట్ల లాగా తయారు చేసి, ప్యాకింగ్ చేస్తున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలలోని గ్రూపులు, వివిధ సామాజిక మాధ్యమాల గ్రూప్‌ల్లో చేరి, అందులోని స్కూల్ విద్యార్థులకు వీటి గురించి ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నాడు. ఇల్లు, పాఠశాల ఆవరణలో ఈ చాక్లెట్లను తింటే తల్లిదండ్రులు, టీచర్లు గమనిస్తారని.. బాస్కెట్‌బాల్, స్కేటింగ్ వంటి క్రీడల శిక్షణ సమయంలో పిల్లలు వీటిని వినియోగిస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ర్యాపిడో, డుంజో వంటి బైక్ సర్వీస్‌ల ద్వారా బుకింగ్ చేసి తెప్పించుకుంటున్నారని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులైతే పార్టీ మూడ్‌ను మరింత పెంచేందుకు, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ►ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అవుతారు. ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తుంటారు. ►రాత్రివేళ సరిగ్గా నిద్ర పోరు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ►శరీర బరువుగా క్రమంగా తగ్గుతుంటుంది. కళ్లు ఎర్రగా మారతాయి. తరచుగా కంటి చుక్కల మందులు వినియోగిస్తుంటారు. ►ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ►కోడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తుంటారు. చాక్లెట్లయితే హాని చేయవనుకుంటున్నారు.. ధూమపానం ద్వారా అయితే గాలి లోపలికి పీల్చుకోవాలి. అదే ఎడిబుల్ చాక్లెట్లయితే ఎలాంటి హాని ఉండదని విద్యార్థులు భావిస్తున్నారు. మత్తు పదార్థాలు ఏ రూపంలో అయినాసరే మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం మా దగ్గర 15 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకుంటున్నారు. వీరిలో పలువురు బాలికలు కూడా ఉన్నారు. – డాక్టర్ కె.దేవికారాణి, డైరెక్టర్, అమృత ఫౌండేషన్ -
TS: చలి తీవ్రత.. బడి ‘వణికిపోతోంది’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. హాజరయ్యే విద్యార్థులు కూడా ఏదో ఒక సీజనల్ వ్యాధితో బాధపడుతున్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. కొన్ని బడుల్లో కనీస హాజరు శాతం కూడా ఉండటం లేదని, దీంతో బోధన చేపట్టలేకపోతున్నారని చెప్పా యి. అనేకచోట్ల టీచర్లు కూడా చలి ప్రభావానికి లోనవుతున్నారు. మూడు రోజులుగా దాదాపు 3 వేల మంది టీచర్లు సీజనల్ వ్యాధితో సెలవు పెట్టినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, తరగతి గదిలో వెచ్చదనం లేకపోవడంతో విద్యార్థులు గజగజ వణికిపోతున్నట్టు విద్యాశాఖాధికారులు చెప్పారు. అంతటా అనారోగ్యం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో సోమవారం 45 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఇది 35 శాతానికి తగ్గింది. స్కూల్‌కు రాని ప్రతీ విద్యార్థి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. విద్యార్థుల్లో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ జిల్లా విద్యాశాఖాధికారి చెప్పారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, ములుగు, నల్లమలకు అనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎండ కూడా రావడం లేదు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి, విద్యార్థులు శ్వాస సమస్యలకు లోనవుతున్నట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లల్లోని విద్యార్థులు చాలా వరకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హాస్టళ్లకు కిటీకీలు లేకపోవడం, పడుకునే నేల మంచును తలపించేలా ఉండటంతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో చలికి స్నానం చేసే పరిస్థితి ఉండటం లేదని, దీంతో చర్మవ్యాధులూ సోకుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇది కీలక సమయమే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. దీనికి అనుగుణంగా పిల్లల శరీరం ఇప్పటికిప్పుడు అలవాటు పడే అవకాశం ఉండదు. ఇలాంటి సీజ న్లలో వారిలో వ్యాధి నిరోధక శక్తి అంత చురుకుగా పనిచేయదు. ఫలితంగా చలి తీవ్రతకు జలుబు, జ్వరం వంటి వ్యాధులతో నీరసపడే ప్రమాదం ఉంది. చల్లదనానికి నీళ్లు ఎక్కువగా తీసుకోనందున డీ హైడ్రేషన్ సమస్యలూ ఉంటాయి. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్న స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. దీనివల్ల ఇతర విద్యార్థులకు వైరస్ సోకకుండా నియంత్రించవచ్చు. విద్యార్థుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఆకు కూరలు, ఇంట్లో చేసిన వంటలు ఎక్కువగా ఇవ్వాలి. గోరు వెచ్చని నీరు తాగించాలి. – డాక్టర్ ఎస్.కవిత, పిల్లల వైద్య నిపుణురాలు, నిలోఫర్ ఆసుపత్రి ముందే సెలవులివ్వాలి.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గింది. చలికాలం ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే పాఠశాలల్లో ఈ తర హా ఆలోచన చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. ఈ దిశగా వైద్యరంగం తోడ్పా టు తీసుకోవాలి. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా సీజనల్ వ్యాధుల బారిన పడే పిల్లల వల్ల వైరస్ మరింత వ్యాప్తి జరగకుండా చూడాలి. – జి సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు -
ఇద్దరు బాలికలను బంధించిన యువకుడు.. మాయమాటలు చెప్పి!
సాక్షి, భువనగిరి: ఇద్దరు బాలికలను ఓ యువకుడు తన ఇంట్లో బంధించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బీఎన్ తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన మేడబోయిన యాకేష్ తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్నారు. పాఠశాలకు వెళ్లిన ఆ ఇద్దరు బాలికలు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వారికి మాయమాటలు చెప్పిన యాకేష్ తన ఇంటి ముందు నుంచి తాళం వేసి వెనుక వైపు నుంచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. కాగా సాయంత్రం వరకు బాలికలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. మధ్యాహ్నం బాలికలు యాకేష్ ఇంటికి వెళ్లినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాళం వేసి ఉన్న ఇంటి వెనుకకు వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గుర్తించారు. దీంతో ఇంటి కిటికి అద్దాలను ధ్వంసం చేయగా బాలికలు అందులో ఉండడం చూసి కోపోద్రిక్తులై ఇంటి ఆవరణలో ఉన్న రెండు బైక్‌లకు నిప్పు పెట్టారు. ఇది గమనించిన యాకేష్ ఇద్దరు బాలికలను బయటకు పంపి తాను లోపలే ఉన్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి గ్రామస్తులు యాకేష్ ఇంటి ఎదుట పెద్దఎత్తున గూమిగూడారు. ఈ క్రమంలో యాకేష్పై గ్రామస్తులు దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే క్రమంలో కొంతమంది రాళ్లు విసరడంతో పోలీసు వాహనం అద్దాలు పగిలాయి. ఒక పోలీస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్థినులను పోలీస్ స్టేషన్‌కు తరలించి మహిళా పోలీసులతో విచారణ నిర్వహిస్తామని భువనగిరి రూరల్ సీఐ వెంకటేశం పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి దగ్ధమవుతున్న బైక్‌లను ఆర్పేశారు. -
నిరంతర పరిశీలన: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబుల్లో ఎలాంటి సమస్య తలెత్తినా వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలని, లేదా కొత్త ట్యాబును అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ట్యాబుల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరుపై డేటా అనలిటిక్స్ ద్వారా నిరంతర పరిశీలన ఉండాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్యాబుల పంపిణీ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ట్యాబుల (నిర్వహణ) మెయింటెనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ట్యాబుల వాడకం.. దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరు, తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా ఐఎఫ్పి ప్యానెల్స్ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యల గురించి సీఎంకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని, 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఇవి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్ల వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని, వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన కలిగేలా శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పిల్లలందరికీ డిక్షనరీలు ఇవ్వాలి – పిల్లలు అందరి వద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలించండి. లేని పిల్లలు అందరికీ వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుకతో కలిపి ఇవ్వాలి. ఇందు కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యా కానుక అందాలి. – పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగు పడుతుంది. డీఎస్సీ–98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలి. – గోరుముద్ద నాణ్యతను నిరంతరం పరిశీలించాలి. ఫిబ్రవరి 1 నుంచి వారంలో మూడు రోజులు పిల్లలకు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్ ఇవ్వాలి. అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ఇప్పటికే సరఫరా.. – ప్రత్యేక లేబుల్‌తో సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకుల పాఠశాలలు హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. – 22 వేలకుపైగా స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ పనులు నడుస్తున్నాయని, ఇప్పటికే దాదాపు రూ.1,500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. – ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ జీ వీరపాండ్యన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, నాడు–నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ (పాఠశాల విద్యా శాఖ) ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్కూలు పిల్లలకు ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా పిబ్రవరి 1వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్ గ్లాసుడు చొప్పున ఇవ్వాలి. ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.50 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. నాడు– నేడు కింద బాగు చేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలి. ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ (స్కూల్, టాయ్‌లెట్ నిర్వహణ నిధి) నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. – సీఎం వైఎస్ జగన్ -
AP: బడి బయటి పిల్లలంతా బడుల్లోకి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలందరికీ చదువు చెప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. బడి బయట ఒక్క విద్యార్థి కూడా లేకుండా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. బడికి వెళ్లని బడి ఈడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా పిల్లలంతా పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపడుతున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా రాష్ట్రంలో మొత్తం 1,73,291 మంది పిల్లలను గుర్తించగా ఇందులో ఇప్పటికే 80 శాతానికి పైగా పిల్లలను బడుల్లో చేర్పించారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులతో పాటు వారు పనులు చేస్తున్న వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆ పిల్లలు చదువులు కొనసాగించేలా కూడా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఫలితంగా బడుల్లో చేరికలు గతంలో కన్నా పెరగడమే కాకుండా డ్రాపవుట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. డ్రాపవుట్లకు చెల్లుచీటీ రాష్ట్రంలోని బడిఈడు పిల్లలందరినీ స్కూళ్లలోకి తిరిగి చేర్పిస్తున్న నేపథ్యంలో పిల్లల డ్రాపవుట్లు తగ్గాయి. ప్రాథమిక స్థాయిలో సున్నా స్థాయికి ఈ డ్రాపవుట్లు తగ్గిపోవడం విశేషం. ప్రాథమికోన్నత తరగతుల్లో గతంలో కన్నా తగ్గి 2021–22 నాటికి 1.62 శాతానికి డ్రాపవుట్లు పడిపోయాయి. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో 2022–23లో మరింత తగ్గుతాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. సెకండరీ తరగతుల్లో ఒకప్పుడు 22 శాతంగా ఉన్న డ్రాపవుట్ రేటు 2022–23లో భారీగా దిగువకు తగ్గుతోందని వివరించాయి. ఇంటర్మీడియెట్‌లోనూ పెరిగిన చేరికలు.. ప్రభుత్వ చర్యలతో 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న స్కూళ్లలో చేరికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ స్థాయిలోనూ విద్యార్థుల చేరికల శాతం పెరుగుతోంది. గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఈ అంశాలు స్పష్టమవుతున్నాయి. 2018–19లో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల చేరికల సంఖ్య 78,61,899 వరకు ఉండగా 2019–20 నాటికి ఈ సంఖ్య 83,23,103కి చేరింది. ఒక్క ఏడాదిలోనే 4,61,204 మంది అదనంగా చేరడం విశేషం. వీరిలో ఇంటర్మీడియెట్‌లో పెరిగిన విద్యార్థుల సంఖ్య 1.5 లక్షల వరకు ఉండడం గమనార్హం. ఇక 2020–21లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య 84,10,924కు చేరింది. 2021–22లో ఆ సంఖ్య 82,44,647 గా ఉంది. కరోనా తదితర కారణాలతో చాలాకాలం స్కూళ్లు తెరవకపోవడంతో అనేక మంది స్కూళ్లకు రాలేదు. దాంతో 2021–22లో ప్రవేశాల సంఖ్య తగ్గింది. 2022–23కి నాటికి మళ్లీ ఆ సంఖ్య పెరిగినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తుది విడత గణాంకాల క్రోడీకరణ జరుగుతోందని, త్వరలోనే అవి విడుదలవుతాయని చెబుతున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ చైల్డ్ ఇన్ఫో కింద సేకరిస్తున్న గణాంకాల ప్రకారం.. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతుల నుంచి ఇంటర్మీడియెట్ వరకు 84 లక్షలకుపైగా చేరికలున్నట్లుగా తెలుస్తోంది. ఈ విద్యార్థుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే కావడం గమనార్హం. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం ఈ వర్గాల విద్యార్ధులే. -
ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నందుకు గర్వపడుతున్నా
నగరి(చిత్తూరు జిల్లా): ‘గతంలో ప్రైవేటు స్కూల్ విద్యార్థులను చూసినప్పుడల్లా బాధపడేవాడిని.. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. వారికంటే ఎక్కువ వసతులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని చదువుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ప్రైవేటు స్కూల్ విద్యార్థులు బాధపడుతున్నారు’ అంటూ ఓ విద్యార్థి తన అనుభవాన్ని వెల్లడించాడు. చిత్తూరు జిల్లా నగరి పీసీఎన్ హైస్కూల్లో మంగళవారం ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఆర్కే రోజా హాజరైన ఈ సభలో జ్యోతికృష్ణ అనే 8వ తరగతి విద్యార్థి చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధిని కళ్లకుగట్టింది. ‘నేను గతంలో ప్రైవేటు స్కూల్ విద్యార్థులను చూసినప్పుడల్లా బాధపడేవాడిని. కానీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఒక మేనమామలా మమ్మల్ని చదివిస్తున్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన.. ఇలా ఎన్నో పథకాలు పెట్టి మేము ఎంతో సంతోషంగా చదువుకునేలా చేశారు. నాడు–నేడు పథకం ద్వారా మా స్కూల్‌ను కార్పొరేట్ పాఠశాల కంటే గొప్పగా మార్చారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా లేనివిధంగా ఆధునిక వసతులు కల్పించారు. టేబుళ్లు, బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు, మినరల్ వాటర్, నిరంతర నీటి వసతితో బాత్రూమ్లు.. ఇలా అనేక సదుపాయాలు ఇప్పుడు మా పాఠశాలలో ఉన్నాయి. ఉచితంగా షూలు, బెల్టులు, టై, బ్యాగ్, పుస్తకాలిస్తున్నారు. రోజుకొక వెరైటీతో భోజనం పెడుతున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న మాకు వేలాది రూపాయల విలువైన బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినైనందుకు ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా. విద్యార్థులందరి తరఫున థాంక్యూ జగన్ మామయ్యా’ అంటూ జ్యోతికృష్ణ కృతజ్ఞతలు తెలిపాడు. విద్యార్థి ప్రసంగానికి ముగ్ధులైన మంత్రి ఆర్కే రోజాతో పాటు స్థానికులు జ్యోతికృష్ణను అభినందించారు. -
హైదరాబాద్ : విద్యార్థులతో కలసి రాష్ట్రపతి ముఖాముఖి
-
CM YS Jagan Birthday Celebrations: అంబరాన్నంటిన సంబరం
సాక్షి, నెట్వర్క్: సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజుని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, సీఎం వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు అన్నిచోట్లా పేదలకు, అనాథలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రోగులకు పండ్లు అందజేశారు. భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రజాప్రతినిధులను బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ముఖ్యంగా తమ వర్గాల్లో ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, మహిళా సాధికారత తీసుకొచ్చేందుకు మహత్తర కృషి చేస్తున్న సీఎం పుట్టిన రోజు వేడుకలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలూ నిర్వహించారు. తద్వారా సీఎం జగన్‌పై తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇందుకోసం పోటీలు పడి వేడుకలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యుడిగా సీఎం వైఎస్ జగన్‌ను భావించి.. ప్రతి ఇంటా పండుగలా నిర్వహించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తదితర దేశాల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 15 మంది వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, నంద్యాల, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మెగా రక్తదాన, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో పది వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని భారత్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఏపీ విద్యార్థులు కేక్ కట్ చేశారు. విశాఖలో హ్యాపీ బర్త్‌డే సీఎం జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న స్థానికులు సీఎం పుట్టిన రోజున 49 ఎకరాల భూ పంపిణీ సీతంపేట: సీఎం జగన్ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంకు చెందిన సుబ్రహ్మణ్యంరాజు కుమారుడు వెంకటపతిరాజు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో 49 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. బిల్లమడ, మోహన్ కాలనీకి చెందిన గిరిజనులకు గిఫ్డ్‌డీడ్ కింద జిరాయితీ సాగుభూమి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్‌కమర్ చేతుల మీదుగా అందజేశారు. బిల్లుమడలో 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఎకరా 33 సెంట్లు చొప్పున మొత్తం 40 ఎకరాలు, రెండు ఎకరాలు గ్రామకంఠానికి, మరో ఎకరా కమ్యూనిటీ హాల్‌కు ఇచ్చారు. మోహన్ కాలనీలో 6 కుటుంబాలకు ఎకరా చొప్పున 6 ఎకరాలు పంపిణీ చేశారు. డెహ్రాడూన్‌లో వేడుకలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో సీఎం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మూడో జాతీయస్థాయి మహిళా కమిషన్ల సదస్సులో పాల్గొనేందుకు డెహ్రాడూన్ వెళ్లిన ఏపీ మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీరెడ్డి, గజ్జల లక్ష్మిరెడ్డి, బూసి వినీత అక్కడ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక, అసోం, గుజరాత్ రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు. సంగమూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యాభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ‘‘హ్యాపీ బర్త్ డే జగన్ మామ’’ అంటూ అక్షర రూపంలో కూర్చుని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. – కృత్తివెన్ను 16 కిలోమీటర్ల వెంబడి రహదారి పక్కన మొక్కలు ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సుమారు మూడు వేల మొక్కలను ఎనిమిది కిలోమీటర్ల పొడవునా రహదారికి ఇరువైపులా మొత్తం 16 కిలోమీటర్ల మేర నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు కొట్టు విశాల్, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని కనకదుర్గ ఆలయం నుంచి వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వరకు నాలుగు లైన్లుగా విస్తరిస్తున్న రోడ్డుకు ఇరువైపులా వీటిని నాటారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వాహనాలలో తీసుకొచ్చిన రోజీ ట్రంపెట్ ట్రీ, సపాటేసి మొక్కలను పెట్టారు. దాదాపు రూ.26 లక్షల విలువ చేసే మొక్కలను నాటారు. -
విద్యార్థుల రక్షణ సామాజిక బాధ్యత
సాక్షి, హైదరాబాద్: స్కూల్ విద్యార్థుల భద్రత, రక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముందని పాఠశాల విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముందు పలువురు అభిప్రాయపడ్డారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాణీకుముదిని అధ్యక్షురాలిగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్ ఎంహెచ్ఆర్డీలో వివిధ వర్గాలతో భేటీ అయి, వారి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ స్వాతి లక్రా, ప్రభుత్వ కార్యదర్శి దివ్య దేవరాజన్, డీపీజీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన పాల్గొన్నారు. పిల్లలపై జరిగే ఘటనలను మార్గదర్శకాల రూపకల్పనపై కమిటీ సలహాలు తీసుకుంది. డీజీపీ మాట్లాడుతూ భద్రత, రక్షణవిషయంలో యాజమాన్యాలను భాగస్వాముల ను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవస్థీకృత చట్టంలో మార్గదర్శకాల రూపకల్పన చేయాలన్నారు. ఘటన జరగకముందే మేల్కొనే వ్యవస్థ ఏర్పాటు అవసర మని స్వాతి లక్రా సూచించారు. పిల్లలరక్షణ సామాజిక బాధ్యతగా అందరూ భావించాలని దేవసేన అన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. -
షాకింగ్.. క్లాస్‌లో తోటి విద్యార్థులతో గొడవ.. రెండో తరగతి బాలుడు మృతి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా కిషన్‌పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చనిపోయిన బాలుడి పేరు శివం(7). తరగతి గదిలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడు. దీంతో వారంతా ఒక్కసారిగా అతని ఛాతిపై దూకారు. ఫలితంగా అతనికి ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. జిల్లా అధికారులు పాఠశాల చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక ప్రిన్సిపల్‌తో పాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
బూట్లు వేసుకోలేదని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, వరంగల్: బూట్లు ఎందుకు వేసుకురాలేదు అంటూ విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపాన్ని చూపాడు. ఏకంగా కంక కట్టెతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్ మోడల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం...మోడల్ స్కూల్లో పదవ తరగతి వరకు మొత్తం 490 మంది విద్యార్థులున్నారు. బుధవారం పాఠశాలలో ప్రార్థన అనంతరం విద్యార్థులు తమ క్లాస్‌లోకి వెళ్తన్న క్రమంలో 10వ తరగతికి చెందిన హర్షిత్, చరణ్, శ్రావణ్, రాంచరణ్, అక్షయ్‌కుమార్, హనీఫ్, ఫరూక్ అబ్దుల్‌తోపాటు 12మంది విద్యార్థులు బూట్లు వేసుకురాలేదు. గమనించిన ప్రిన్సిపాల్ ప్రణయ్‌కుమార్ వారందరిని పక్కకు నిలబెట్టి బూట్లు ఎందుకు వేసుకురాలేదని అడుగుతూ కొట్టడం ప్రారంభించాడు. ‘రేపు వేసుకువస్తాం కొట్టకండి సార్’అంటూ కన్నీరు పెట్టుకున్నప్పటికి వినకుండా విచక్షణా రహితంగా చితకబాదాబడు. దీంతో విద్యార్థుల పిరుదల కిందబాగంలో కమిలిపోయి కొంతమంది విద్యార్థులు నడవలేని పరిస్థితికి చేరుకోవడంతో కొందరు ఉపాధ్యాయులు వారిని సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాలకు చేరుకొని తమ పిల్లల్ని ఈ విధంగా కొట్టడం తగదు అంటూ ప్రిన్సిపాల్‌ని నిలదీశారు. షూస్ వేసుకురాకుంటే క్రమశిక్షణలో భాగంగా కొట్టానని, కొట్టకుంటే వారు వినరు అని ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ వివరణ ఇచ్చాడు. -
షాకింగ్: కండోమ్స్, గర్భనిరోధకాలతో స్కూల్‌కు విద్యార్థులు..!
బెంగళూరు: హైస్కూల్ విద్యార్థుల బ్యాగులను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్ ఫోన్స్, కండోమ్స్, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్, సిగరెట్స్, వైట్నర్స్ వంటివి చూసి నివ్వెరపోయారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ బ్యాగులు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు చెందినవి కావటం గమనార్హం. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని పాఠశాలలను ఆదేశించింది కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(కేఏఎంఎస్). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్) లభించాయి. అలాగే వాటర్ బాటిల్లో లిక్కర్ దొరికింది.’ అని కేఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్ తెలిపారు. ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్‌కు గురయ్యారని నగరభావి స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పలువురు నెటిజన్లు తమ ఆలోచనలను ట్విటర్లో షేర్ చేశారు. తాము స్కూల్‌కి వెళ్లినప్పుడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లేవాళ్లం అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్ కాలంలో తల్లిదండ్రుల పాత్ర చాలా క్లిష్టమైనదని మరొకరు రాసుకొచ్చారు. ఇదీ చదవండి: Labour Union Protest: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
Warangal: బర్త్‌డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్‌డేకు హాస్టల్లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
స్టూడెంట్‌కి పీఆర్వో లైంగిక వేధింపులు.. ఓవెల్ 14 స్కూల్ గుర్తింపు రద్దు
సాక్షి, నెల్లూరు: అభం, శుభం తెలియని చిన్నారి విద్యార్థినిపై ఆ పాఠశాల పీఆర్వో లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... అల్లూరు మండలం గోగులపల్లికి చెందిన బ్రహ్మయ్య పొదలకూరురోడ్డు డైకస్‌రోడ్డు విజయలక్ష్మీనగర్‌లోని ఓవెల్ 14 స్కూల్లో పీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఆయన అదే పాఠశాలలో నాల్గోతరగతి చదువుతున్న బాలికతో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించసాగాడు. కొద్ది రోజులుగా బాలిక స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతోంది. పీఆర్వో వైఖరిపై పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో శనివారం పాఠశాలకు వెళ్లిన బాలిక అనారోగ్యంగా ఉందంటూ కొద్ది సేపటికే ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు అసలేం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పీఆర్వో ఏదో ఒక సాకుతో ల్యాబ్‌లోకి తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని పీఆర్వో వైఖరిపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. చదవండి: (మోసపోయానని భావించి.. డెత్‌నోట్‌రాసి ప్రైవేట్ లెక్చరర్ బలవన్మరణం) పీఆర్వో వికృత చర్యలపై పాఠశాల ఉపాధ్యాయురాలికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటంటూ మండి పడ్డారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం పీఆర్వోను వెనకేసుకు రావడంతో వారు ఆగ్రహానికి గురై పాఠశాల కిటికీ అద్దాలు పగులగొట్టారు. అక్కడే ఉన్న బ్రహ్మయ్యను చితకబాదారు. ఈ విషయమై స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె. నరసింహరావు, ఎస్ఐ శ్రీహరిబాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై ఎస్పీ సీహెచ్ విజయారావు ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ నరసింహరావు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. సీసీపుటేజ్‌లను సేకరించారు. ఇదిలా ఉంటే బ్రహ్మయ్యపై గతంలో పలు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అతనిపై పాఠశాల యాజమన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎంఈఓ విచారణ ఈ విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేకెత్తించడంతో డీఈఓ విచారణకు ఆదేశించారు. ఎంఈఓ తిరుపాల్ స్కూల్లో విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులను విచారించారు. ఈ విషయమై ఎంఈఓను సంప్రదించగా డిప్యూటీ డీఈఓ, తాను విచారణ నిర్వహిస్తున్నామని, విచారణ పూర్తయిన అనంతరం నివేదికను డీఈఓకు అందజేస్తామని తెలిపారు. ఓవెల్ 14 స్కూల్ గుర్తింపు రద్దు బాలికపై పీఆర్వో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడం, ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన నేపథ్యంలో ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్చార్జి డీఈఓ సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులను వారికిష్టమైన పాఠశాలలో చేర్చేందుకు విద్యాశాఖ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. -
బడిలోనే ఒకరు.. బడికెళ్లనంటూ మరొకరు.. నలుగురు ఒకేరోజు..
జిన్నారం (పటాన్చెరు)/ బాలానగర్/ వీపనగండ్ల/ గీసుకొండ: బడికి వెళ్లబోనంటూ ఒకరు.. హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదంటూ మరొ కరు.. నాతో ఇంకేం ఇబ్బంది ఉండదులే అంటూ ఇంకొకరు.. అంతా లోకం కూడా సరిగా తెలియని బడి పిల్లలు.. మరో కాలేజీ విద్యార్థిని.. చదువుల ఒత్తిడితోనో, కుటుంబానికి దూరంగా ఉండలేకనో క్షణికావేశంలో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కన్నవారికి కన్నీరు మిగిల్చి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఒకేరోజున ఇలా నలుగురు ఆత్మహత్యలకు పాల్పడటం విషాదాన్ని నింపింది. ఇందులో ముగ్గురు 14 ఏళ్లలోపువారే కావడం ఆందోళన కలిగిస్తోంది. చదువుకోవడం ఇష్టం లేదంటూ.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన అమీర్‌ఖాన్, హసీనా బేగంల కుమార్తె మజియా (13). అమీర్‌ఖాన్ నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హసీనా బేగం ఎనిమిదేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు. మజ్యా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన బాలిక.. తనకు చదువుకోవడం ఇష్టం లేదంటూ తిరిగి వెళ్లలేదు. బడికి వెళ్లాలంటూ నాయనమ్మ, పిన తల్లి ఇటీవల ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మనస్తాపం చెందిన మజియా మంగళవారం రాత్రి ఇంట్లో నాయనమ్మ వినియోగించే 20 బీపీ మాత్రలను ఒకే మింగేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. పినతల్లి రుక్సానాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మందులు కలుపుకొని తాగి.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి పంచాయతీ పరిధిలోని పెద్దబాయితండాకు చెందిన హనుమంతు, అల్లి దంపతుల కుమార్తె అలేఖ్య (12). గతేడాది ఆమెను ఆమన్‌గల్ గురుకుల పాఠశాలలో చేర్పించారు. హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత బాలానగర్‌లోని కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. ఇలాగైతే ఆత్మహత్య చేసుకుంటానని అలేఖ్య అనడంతో తల్లిదండ్రులు సముదాయించి చెప్పారు. అయితే దీపావళి సెలవులకు వచ్చిన ఆమె తర్వాత జ్వరం రావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. పరీక్షలు ఉండటంతో సోమవారం మందులు తీసుకుని హాస్టల్‌కు వచ్చింది. మంగళవారం పరీక్ష కూడా రాసింది. కానీ సాయంత్రం కూల్‌డ్రింక్ తెచ్చుకుని డాక్టర్ ఇచ్చిన మందులు కలుపుకొని తాగింది. కాసేపటికి అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. ఉపాధ్యాయులు వెంటనే ఆమెను బాలానగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి నుంచి షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు బాలికను తొలుత మహబూబ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి, అక్కడి నుంచి షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా కాసేపటికే మృతి చెందింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇక తనతో ఎవరికీ ఇబ్బంది ఉండదంటూ.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్ పరిధిలోని దుర్గ్య తండాకు చెందిన మెగావత్ శైలేందర్ (14).. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి భోజనం చేశాక స్నేహితులతో మాట్లాడాడు. అందరూ బాగా చదువుకుని జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటి నుంచి తనతో ఎవరికీ ఇబ్బంది ఉండదని చెíప్పి నవ్వుకుంటూ బయటికి వెళ్లాడు. తాను చదివే తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. తరగతి గదిలో లైట్ వెలుగుతుండటంతో ఆఫ్ చేసేందుకు వెళ్లిన వాచ్‌మన్ నర్సింలు.. అది చూసి ఉపాధ్యాయులకు చెప్పాడు. వారు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో ఇన్చార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కాసేపటికి తహసీల్దార్ దశరథ్‌సింగ్ రాథోడ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు, బంధువులను శాంతింపజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే శైలేందర్ ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది తెలియరాలేదు. కాలేజీకి వెళ్లడం ఇష్టంలేక.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి చెందిన జమాండ్ల రాజలింగం, సుజాతల కుమార్తె రుచిత (16) ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. సుజాత గత నెల 31న గీసుకొండ మండల కేంద్రంలోని తన తల్లిగారు(రుచిత అమ్మమ్మ) ఇంటికి రుచితను తీసుకుని వెళ్లింది. మరుసటిరోజు (ఈ నెల 1న) కాలేజీకి వెళ్లాలని రుచితను తల్లి మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన రుచిత అదే రోజురాత్రి పాలలో పురుగుల మందు కలుపుకొని తాగింది. కాసేపటికి ఆమె అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం రుచిత మృతిచెందింది. మృతురాలి తండ్రి రాజలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: పనిలోంచి తీసేశారని కక్ష.. యజమాని కుటుంబాన్ని దారుణంగా..! -
విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
కాట్రేనికోన/సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై యడ్ల నవీన్ (7) అనే మూడో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో చిట్టిమేను వివేక్ (3వ తరగతి), తిరుపతి ఘన సతీష్‌కుమార్ (4వ తరగతి)లను అత్యవసర వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరు 3వ తరగతి విద్యార్థులు మొల్లేటి నిఖిల్, బొంతు మహీధరరెడ్డిలకు దొంతుకుర్రులోనే ప్రాథమిక వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న సచివాలయ భవనం శ్లాబ్ కోసం ఇనుప ఊచలను కట్ చేసేందుకు కటింగ్ మెషీన్ తీసుకొచ్చారు. దాని తీగ ఊచలకు తగలడం.. అదే సమయంలో విద్యార్థులు తాగునీటి కోసం ఆ ఇనుప ఊచలపై నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక సతీష్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, జిల్లా ఏఎస్పీ కె.లతామాధురి పరామర్శించి, పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన విద్యార్థి నవీన్ కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బాధితులకు అండగా ఉండండి : సీఎం విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు. -
జస్ట్ మిస్.. క్షణం ఆలస్యం అయ్యుంటే ఎంత ఘోరం జరిగుండేదో
సాధారణంగా పాములను చూస్తే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటి పాములు ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి ఎగబడుతున్నాయి. రోడ్లు, ఇళ్లు, బస్సు.. ఇలా ఎక్కడ చూసినా అనుకోని అతిథుల్లా ప్రత్యక్షమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఎక్కువ శాతం పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇలా ప్రమాదకరమైన పాములు కంటపడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థి సెకన్ల వ్యవధిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొల్లా జిల్లాలోని కూన్నతుర్లో జరిగింది. స్కూల్ యూనిఫాం ధరించి ఉన్న ఓ విద్యార్తి ఇంటి ముందు ఉన్న గేట్ దగ్గర నిల్చొని ఉంటాడు. కొద్దిసేపటికి లోపలికి వచ్చి గేట్ మూసేస్తుండగా.. పక్కనే పాము ఉండటాన్ని గమనించాడు. పాముని చూసి భయంతో వెంటనే అడుగు ముందుకు వేయగా.. పాము ఒక్కసారిగా అతడిని కాటేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి లోపలికి పరుగెత్తుకెళ్లాడు. అనంతరం తన తల్లిని తీసుకొచ్చి పామును చూపిస్తుండగా అది మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. చదవండి: చాలా రిచ్.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా? ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. అబ్బాయి అదృష్టం బాగుంది. జస్ట్ మిస్.. క్షణం ఆలప్యం అయ్యుంటే పాము కాటుకు గురయ్యేవాడు. ఈ మధ్య పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి’ అంటూ సూచిస్తున్నారు. -
Viral: పెళ్లి అంటే ఏంటి?.. పిల్లాడి దిమ్మతిరిగే సమాధానం.. నవ్వాపుకోలేరు!
స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కామన్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఆధారంగా ఎగ్జామ్స్ పెడుతుంటారు. జనరల్ నాలెడ్జ్, సామాజిక అంశాలపై వ్యాస రచన పోటీలు కూడా ఉంటాయి. అయితే కొన్నిసార్లు పరీక్షల్లో పిల్లలు రాసే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. ప్రశ్నతో సంబంధం లేకుండా ఏదో ఏదో రాస్తుంటారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఓ విద్యార్థి 10 మార్కుల ప్రశ్నలో పెళ్లి అంటే ఏంటో వివరించమని అడిగారు. పెళ్లిపై బాలుడి చెప్పిన సమాధానం నెటిజన్లను నవ్విస్తోంది. సోషల్ స్టడీస్ పరీక్ష పత్రంలో పెళ్లి అంటే ఏంటని అడిగారు. విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్‌ను సోషల్ మీడియాలోషేర్ చేశారు. అందులో ‘యువతికి ఆమె తల్లిదండ్రులు నువ్వు ఇప్పుడు పెద్ద అమ్మాయివి అయ్యావు అని చెప్పినప్పుడు పెళ్లి జరుగుతుంది. మేము నీకు ఇక తిండి పెట్టి పోషించలేమని, వెళ్లి నీకు తిండి పెట్టే వ్యక్తిని వెతుక్కోవడం మంచిదని ఆమెకు తల్లిదండ్రులు చెప్తారు. మరోవైపు నువ్వు పెద్దవాడివి అయ్యావు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయికి కూడా వాళ్ల తల్లిదండ్రులు చెబుతుంటారు. అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని యువతి కలుసుకుంటుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని చివరికి ఇద్దరు కలిసి జీవించడానికి అంగీకరిస్తారు. ఇక పిల్లలను కనడానికి తప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తారు’ అని విద్యార్థి రాసుకొచ్చాడు. What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P — Velu (@srpdaa) October 11, 2022 అయితే బాలుడి సమాధానం చూసిన టీచర్ అతడు రాసిన మొత్తం జవాబును కొట్టివేసింది. పది మార్కులకు గాను సున్నా వేసింది. అంతేగాక నాన్సెన్స్ అంటూ రిమార్క్ రాసి పెట్టింది. కాగా పిల్లవాడు తెలిసి తెలియక రాసిన సమాధానం నెటిజన్లను ఆకర్షిస్తుంది. చాలా ఫన్నీగా ఉందంటూ బాలుడి నిజాయితీని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: Army Dog Zoom: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ‘జూమ్’ మృతి -
స్కూలుపై మయన్మార్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
స్కూలుపై మయన్మార్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి -
Video Viral: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్
లక్నో: ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ప్రిన్సిపల్ టాయిలెట్లు శుభ్రం చేయిస్తున వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్లోని విద్యార్థులను ప్రిన్సిపల్ వాష్‌రూమ్‌లు శుభ్రం చేయాలని ఆదేశించాడు. ప్రిన్సిపల్ పక్కన నిలబడి పిల్లలచేత టాయిలెట్లు కడిగించాడు. అంతేగాక విద్యార్థులకు మరుగుదొడ్డి సరిగ్గా శుభ్రం చేయాలని ఆదేశాలు ఇస్తున్నాడు. సరిగా క్లీన్ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ మల విసర్జన కోసం ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. Primary School Students Made To Clean Toilet by Principle in Ballia, Uttar Pradesh. The incident was reported from Pipra Kala Primary School of Sohav Block in Ballia. pic.twitter.com/oYaqqBhFJA — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 8, 2022 ఇందులో కొందరు విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారింది. అదికాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు విధ్యాశాఖ అధికారి అఖిలేష్ కుమార్ ఝా తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: పగ తీర్చుకున్నాడు.. కాటేసిన పామును కసితీరా కొరికి -
కాకినాడలో ఊపిరాడక 30 మంది విద్యార్థులకు అస్వస్థత..
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్‌లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలలోని ఓ ప్రైవేట ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గల కారణాలను టీచర్స్, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అస్వస్థతకు గురైన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు. విద్యార్ధుల అస్వస్ధతకు గల కారణాలు తెలుసుకునేందుకు రక్త నమూనాలను వైద్యులు సేకరించారు. మంత్రి ఆరా కాకినాడ వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్దులు అస్వస్థతకు గురైన ఉదంతంపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.