
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా కిషన్‌పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
చనిపోయిన బాలుడి పేరు శివం(7). తరగతి గదిలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడు. దీంతో వారంతా ఒక్కసారిగా అతని ఛాతిపై దూకారు. ఫలితంగా అతనికి ఊపిరాడక స్పృహ కోల్పోయాడు.
పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
జిల్లా అధికారులు పాఠశాల చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక ప్రిన్సిపల్‌తో పాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించి చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్..