Firozabad district
-
షాకింగ్.. క్లాస్‌లో తోటి విద్యార్థులతో గొడవ.. రెండో తరగతి బాలుడు మృతి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా కిషన్‌పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చనిపోయిన బాలుడి పేరు శివం(7). తరగతి గదిలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడు. దీంతో వారంతా ఒక్కసారిగా అతని ఛాతిపై దూకారు. ఫలితంగా అతనికి ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. జిల్లా అధికారులు పాఠశాల చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక ప్రిన్సిపల్‌తో పాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
ఈ ఫుడ్ ఎవరైనా తింటారా? వెక్కి వెక్కి ఏడ్చేసిన కానిస్టేబుల్
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ రద్దీగా ఉండే రోడ్డు పైకి వచ్చి ఒకటే ఏడుపు. పోలీస్ మెస్‌లో భోజనం క్వాలిటీగా ఉంటుందనుకుంటారు. కానీ అదంతా అబద్ధం ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ భోజనం ప్లేట్ తీసుకువచ్చి మరీ చెప్పాడు. అంతేకాదు ఆ ప్లేట్లోని చపాతీలు, అన్నం, పప్పు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి అంటూ ఏడూస్తూ పెద్దగా అరుస్తూ అక్కడ ఉన్న వారికి తన మనసులోని బాధను చెప్పకొచ్చాడు. పైగా తాను ఈ విషయమై పై అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ ఎలాంటి చర్యలు తీసుకులేదని చెబుతున్నాడు. అంతేకాదు ఇలా ఫిర్యాదుల చేస్తున్నందుకు తన ఉద్యోగం తొలగిస్తానని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. అదీగాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసుకు మంచి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తామని చెప్పారని అన్నాడు. అయినప్పటికీ పోలీస్ మెస్‌లో ఇలాంటి ఆహారమే తమకు అందిస్తోందని, పైగా ఈ ఆహారం తిని ఎక్కువ సేపు విధుల నిర్వర్తించలేమని వాపోయాడు. ఈ ఆహారాన్ని జంతువుల కూడా తినవు అంటూ బోరు బోరున ఏడ్చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయమై ఫిరోజాబాద్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి....సదరు కానిస్టేబుల్ పై విధులకు హాజరుకాకపోవడం, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినందుకు గతంలో 15 సార్టు పనిష్మెంట్ పొందిన చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. అయిన ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు. A UP police constable posted in Firozabad district protests against the quality of food served at the mess in police lines. He was later whisked away. A probe has been ordered. pic.twitter.com/nxspEONdNN — Piyush Rai (@Benarasiyaa) August 10, 2022 Here is an example… words of UP Police constable Manoj Kumar in Firozabad pic.twitter.com/YkzzJSOyBJ — The Fact Finder (@TheFactFindr) August 10, 2022 मैस के खाने की गुणवत्ता से सम्बन्धित शिकायती ट्वीट प्रकरण में खाने की गुणवत्ता सम्बन्धी जांच सीओ सिटी कर रहे है। उल्लेखनीय है कि उक्त शिकायतकर्ता आरक्षी को आदतन अनुशासनहीनता, गैरहाजिरी व लापरवाही से सम्बन्धित 15 दण्ड विगत वर्षो में दिये गये है । @Uppolice @dgpup @adgzoneagra — Firozabad Police (@firozabadpolice) August 10, 2022 (చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు) -
యూపీ: వైరల్ ఫీవర్‌తో 50 మంది చిన్నారుల మృతి!
లక్నో: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఉత్తర ప్రదేశ్‌లో వైరల్ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది. వైరల్ జ్వరంతో ఫిరోజాబాద్‌లో ఇప్పటి వరకు 50 మంది చిన్నారులు మృతి చెందినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా, ఈ ఘటనను సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్లేట్లేట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం (ఆగస్టు 30)న సీఎం యోగి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ వైరస్ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. చదవండి: Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి -
వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం
లక్నో: కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే మహమ్మారిని అరికట్టేందుకు లాక్డౌన్ వంటి చర్యలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి వ్యాక్సినే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు చూచిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు కొంతమంది ఆసక్తి చూపించడం లేదు. అంతేగాక వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయోమేనని బయపడుతున్నారు. ఇలాంటి సమయంలో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు నెల జీతం పొందలేరని బుధవారం ఫిరోజాబాద్ అధికారులు తెలిపారు. మేరకు జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్..’నో వ్యాక్సిన్ నో శాలరీ’కి సంబంధించి ఆదేశాలు జారీ చేశారన్నారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల లిస్టును సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసకుంటుందని,జీతాన్ని నిలిపివేస్తుందని జిల్లా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ తెలిపారు. అయితే టీకా తీసుకోని ఉద్యోగులకు మే నెల జీతం ఆపేయనున్నట్లు ప్రకటించడంతో.. సాలరీ ఆగిపోతుందనే భయంతో ఉద్యోగులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. ఠాగూర్ సినిమా సీన్‌ను తలపించారు Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే శుభవార్తే! -
పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 10 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోట్ల రహదారిపై అధికవేగంతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి... పక్కనే వెళ్తున్న పెళ్లి బృందంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆగ్రాలో సరోజిని నాయుడు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ముగ్గురిని గుర్తించినట్లు తెలిపారు. మరికొంతమందిని గుర్తించవలసి ఉందన్నారు. మృతుల్లో పెళ్లి బృందంలోని వారితోపాటు బ్యాండ్ మేళం వారు కూడా ఉన్నారని చెప్పారు.