పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 10 మంది మృతి | Speeding truck mows down ten in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 10 మంది మృతి

Published Sat, Mar 12 2016 10:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

Speeding truck mows down ten in Uttar Pradesh

లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోట్ల రహదారిపై అధికవేగంతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి... పక్కనే వెళ్తున్న పెళ్లి బృందంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు.

క్షతగాత్రులను ఆగ్రాలో సరోజిని నాయుడు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ముగ్గురిని గుర్తించినట్లు తెలిపారు. మరికొంతమందిని గుర్తించవలసి ఉందన్నారు. మృతుల్లో పెళ్లి బృందంలోని వారితోపాటు బ్యాండ్ మేళం వారు కూడా ఉన్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement