fighting
-
Israel Hezbollah War: పోరు ఆపం
బీరుట్: ఇజ్రాయెల్‌తో తమ పోరాటం కొన సాగుతుందని హెజ్ బొల్లా తాత్కాలిక చీఫ్ నయీం కస్సెమ్ స్పష్టం చేశారు. చీఫ్ హస్సన్ నస్రల్లాతో పాటు ఇతర టాప్ కమాండర్లను పోగొట్టుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. లెబనాన్‌లో భూతల దాడులు జరపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న పక్షంలో అందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోగొట్టుకున్న కమాండర్ల స్థానాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారమైంది. ‘మా పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయడం ఇజ్రాయెల్ వల్లకాదు. డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారు. కమాండర్ ఎవరైనా గాయపడితే వారితో భర్తీ చేస్తాం. 2006లో ఇజ్రాయెల్‌తో నెలపాటు పోరాడాం. ఈసారి అంతకంటే ఎక్కువ కాలమే పోరు సాగుతుందని అనుకుంటున్నాం’అని నయీం కస్సెమ్ పేర్కొన్నారు. -
పిఠాపురంలో కొత్త లొల్లి..
-
నడిరోడ్డుపై పడి పడి కొట్టుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు..
-
క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
పెన్షన్ల పంపిణీ కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
-
వీడియో: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట..
రోమ్: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్‌లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ITALIAN PARLIAMENT: A fight breaks when Five Star Movement deputy Leonardo Donno unfurls an Italian flag in protest against plans to grant more autonomy from Rome to regions that want it. Protestors argue that it undermines Italy's unity. pic.twitter.com/qf6bVFteC3— Mark Alan Pearce (@PearceAlan1962) June 13, 2024 కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మెట్రోలో కొట్టుకున్న మహిళలు
రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రోలో కూర్చునేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతుంటారు. సీటు కోసం వాదులాడుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం అనేది ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి.తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడటానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో.. మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయివుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది.అది కొట్టుకోవడం వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం మరింతగా పెరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట కూడా జరిగింది. కొద్దిసేపటి తరువాత మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో ఆ మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ సమయంలో ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Kalesh b/w Two Ladies Inside Delhi Metro over Push and Shove pic.twitter.com/yLgV3DgiWH— Ghar Ke Kalesh (@gharkekalesh) May 24, 2024 -
ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు
-
ఒక చోట అత్తా అల్లుడు.. మరో చోట అన్నాదమ్ములు!
దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోరు ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల పోరులో సోదరుల మధ్య పోటీ నెలకొంది. చికిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో సోదరులు ఢీ కొడుతున్నారు. వీరు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంత్రాయ్ కుమారులు. వారిలో తమ్ముడు మనోరంజన్ ద్యన్ సామంతరాయ్‌కు బీజేపీ టిక్కెట్టు ఇవ్వగా, అన్న రవీంద్నాథ్ ద్యన్ సామంతరాయ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. చింతామణి కాంగ్రెస్ సీనియర్ నేత. చికిటి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించారు. జూనియర్ సామంతరాయ్ కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన అన్నయ్య తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) చికిటి అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద్ శ్రీరూప్ దేబ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఉషాదేవి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఉషాదేవి ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటు బీజేడీకి దక్కింది. మే 13న జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో అత్త, మేనల్లుడి మధ్య ఎన్నికల పోరు నెలకొంది. నబరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కౌశల్య ప్రధాన్‌ను బీజేడీ తన అభ్యర్థిగా బరిలోకి దించగా, అదే నియోజకవర్గం నుంచి ఆమె మేనల్లుడు దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ పోరు అత్త, మేనల్లుడి మధ్య కాదని, రెండు పార్టీల మధ్య మాత్రమేనని, తమ కుటుంబంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని కౌసల్య మీడియాకు తెలిపారు. -
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
జాతరలో గజరాజుల కొట్లాట.. పలువురికి గాయాలు
కోలాహలంగా జాతర జరుగుతుందనుకున్న టైంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది. జనాలు ఉరుకులు పరుగులతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అందుకు కారణం.. రెండు గజరాజులు తలపడడమే!. కేరళ త్రిస్సూర్ జిల్లాలో తరక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు జాతరలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జాతర ముగింపు సమయంలో అమ్మవారిని ఉరేగిస్తున్న ఏనుగు.. ఒక్కసారిగా అలజడి సృష్టించింది. మావటి మీద మూడుసార్లు దాడికి యత్నించగా.. ఆయన స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ ఏనుగు అక్కడితో ఆగలేదు. అక్కడే ఉరేగింపు కోసం తీసు కొచ్చిన మరో ఏనుగుపై దాడికి దిగింది. ఈ క్రమంలో ఆ రెండు తలపడడంతో.. అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్లు కింద పడి గాయాలపాలయ్యారు. ఏనుగుల పోరాటంతో భయపడి.. ఉరుకులు పరుగులు పెట్టడంతో కిందపడి చాలా మందికి సైతం దెబ్బలు తగిలించుకున్నారు. అతికష్టం మీద మొదటి ఏనుగును మావటివాళ్లు నిలువరించగలిగారు. అయితే గాయపడ్డ ఏనుగు కిలోమీటర్ దూరం పరుగులు తీయగా.. అతికష్టం మీద మావటివాళ్లు దానిని పట్టుకోగలిగారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. An elephant which was brought for the arat ritual at #Mandarakadavu in connection with the #ArattupuzhaPooram in #Kerala's #Thrissur, attacked a fellow elephant. pic.twitter.com/6OXptgdjnl — Hate Detector 🔍 (@HateDetectors) March 23, 2024 -
ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..!
ధైర్యంగా ఉండమని చెప్పడం అందరూ చేసే పనే. ధైర్యాన్ని ప్రదర్శించడం కొందరు చేసేది. ప్రమాదంలోనూ ధైర్యాన్ని చూపడం అతి కొద్ది మందే చేస్తారు. ఆ అతి కొద్దిమందిలోనూ మేటిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లోని బేగంపేట వాసులైన ఈ తల్లీ కూతుళ్లు. ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులపైకి చిరుతపులుల్లా విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో బెదిరించినా ఆత్మస్థైర్యాన్ని బెదరనివ్వలేదు. ఇద్దరు దండుగులను తరిమి తరిమి కొట్టిన తల్లి అమిత మెహోత్. తల్లిని కాపాడుకునేందుకు దుండగులతో వీరోచితంగా పోరాడిన కూతురు బాబీ. దుండగులు ఎలా ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తారో, ఎలా దాడి చేస్తారో మనం ఊహించలేం. అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ధనాన్నే కాదు ప్రాణాలను సైతం కోల్పోయేవారెందరో. కానీ, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దుండగుల దుశ్చర్యను క్షణమాత్రంలోనే గుర్తించి, ఆ వెంటనే తమ స్థైర్యాన్ని చూపి నేడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు అమిత, బాబీ. స్త్రీలు సబలలు అని నిరూపించిన ఈ వనితలు నేడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ‘‘ఎప్పుడో ప్రాక్టీస్ చేసిన బాక్సింగ్‌తో పాటు 15 ఏళ్లుగా చేస్తున్న జిమ్ వ్యాయామాలు, వీటికి తోడు మార్షల్ ఆర్ట్స్‌పై అవగాహన.. ఇవన్నీ దుండగులు తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం బెదరక ధైర్యంగా నిలబడేలా చేశాయి. దోచుకోవడానికి వచ్చిన వారిని తరిమి కొట్టేలా చేశాయి’’ అని తెలిపింది నలభై ఆరేళ్ల అమిత. ఊహించని విధంగా ఆ తల్లీకూతుళ్ల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కొరియర్ బాయ్స్ వేషంలో.. ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక కొరియర్ బాయ్స్ మన ఇళ్ల ముందుకు వస్తుంటారు. వారి గురించి మనకేవిధంగానూ తెలియదు. అలాగని, కొరియర్ వారంతా ప్రమాదకారులే అని మనం చెప్పలేం. కానీ, ఒక్కోసారి సమస్య ఈ విధంగానూ మనల్ని పలకరించవచ్చు అని గ్రహించాలి అనడానికి గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ‘‘మా ఇంటి గుమ్మానికి, ప్రధాన గేటుకు 200 ఫీట్ల దూరం ఉంటుంది. కొరియర్బాయ్స్ ఎవరొచ్చినా గేటు బయటనే ఉండి పిలుస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాగ్‌తో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. నేను మొదటి అంతస్తులోనే ఉండి కొరియర్ వివరాలు అడిగాను. అమిత (నా పేరు), ఎన్‌కె జైన్ (నా భర్త) పేర్లు చెప్పి కొరియర్ వచ్చిందని చెప్పారు. అక్కడే ఉండాలని, వచ్చి తీసుకుంటామని చెప్పాను. నేను కిందికి వచ్చేసరికి గేటు లోపలి నుంచి గుమ్మం వద్దకు వచ్చేశారు. ఎదుర్కొని .. కనిపెట్టి.. బ్యాగ్‌లో నుంచి కొరియర్ పార్శిల్ తీస్తున్నట్లుగా తీసి ఒకరు తపంచా (నాటు తుపాకీ)తో నాపై ఎక్కుపెట్టాడు. మరొకరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి కిచెన్ లో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. నా అరుపులకు మొదటి అంతస్తులో ఉన్న కుమార్తె కూడా వచ్చింది. మాపై అటాక్ చేస్తుండగా మేం కూడా తిరిగి అటాక్చేశాం. ఇద్దరం కలిసి ఆ వ్యక్తి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి, తపంచాను లాగేసుకున్నాం. దీంతో అచేతనుడైన ఆ వ్యక్తి వెంట తెచ్చుకున్న తాళ్లతో మమ్మల్ని కట్టేసేందుకు ప్రయత్నించగా, ఎదురుతిరిగాం. దాదాపు 20 నిమిషాల సేపు ఘర్షణ జరిగింది. చివరకు ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని బలవంతంగా తోసుకుంటూ బయటకు వచ్చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మేము ఎంతగానో వెంబడించాం. ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకుని కిచెన్ లో ఉన్న మరో వ్యక్తి ఎక్కడ దొరికిపోతాడో అని ఆందోళనపడ్డాం. అతను కూడా పారిపోయేందుకు కత్తితో బెదిరిస్తూ బయటకు వచ్చాడు. మా అరుపులకు ఈ లోగా స్థానికులు రావడంతో అతన్ని పట్టుకోగలిగాం. తెలిసిన వారే అయ్యుంటారని మేం వారు ధరించిన హెల్మెట్, మాస్క్‌ను తీసేయడంతో వారెవరో కనిపెట్టగలిగాం. కిందటేడాది దీపావళి సమయంలో పది రోజులపాటు మా ఇంటి క్లీనింగ్ విషయంలో ఓ ఏజెన్సీని సంప్రదిస్తే, వారు పంపించిన వ్యక్తులే వీళ్లు. మా ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఏయే వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి, ఇంట్లో ఆడవాళ్లం మాత్రమే ఉండే సమయం చూసి, ఇలా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. మేం ఎదురు తిరగడంతో వచ్చిన పని గురించి కాకుండా మేము తమ ముఖాలను చూడకుండా కాపాడుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేశారు. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే.. గతంలో ఐదేళ్లు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను. రోజూ జిమ్‌కు వెళ్తుంటాను. మార్షల్ ఆర్ట్స్‌పై కూడా అవగాహన ఉంది. అవే నన్ను ధైర్యంగా ఉండేలా, సాహసం చూపేలా చేశాయి. ఎదురొచ్చిన విపత్తు నుంచి కాపాడేలా చేశాయి. ఒక తపంచా, రెండు కత్తులు, తాళ్ల సహాయంతో వారు మమ్ముల్ని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. వారి ప్రతి చర్యను తిప్పికొట్టగాలిగామంటే బాక్సింగ్, ఫిట్నెస్లే కారణమని కచ్చితంగా చెప్పగలను’’ అని తామ ఎదుర్కొన్న సంఘటనను వివరించారు అమిత. ఈ తల్లీకూతుళ్లు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత అమిత, ఆమె భర్త, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రశంసలు.. సన్మానం.. అమిత, ఆమె కుమార్తె బాబీ ఇద్దరూ చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయం అని నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బేగంపేట పైగా కాలనీలోని అమిత నివాసానికి నేరుగా వచ్చిన డీసీపీ అమితతో పాటు ఆమె కుమార్తెనూ ప్రశంసించి, శాలువాతో సత్కరించారు. మైనర్ బాలిక అయినా ఆమె చూపిన తెగువ ఎంతో అభినందనీయమన్నారు. ఆత్మరక్షణకై మెలకువలు అవసరం మహిళలు ఆత్మరక్షణ దిశగా మెలకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ఎదురైన అనుభవం లాగా ఎవరి జీవితాల్లోనూ రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వస్తే మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. – అమిత – కోట కృష్ణారావు, సాక్షి, హైదరాబాద్ -
కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు
కర్నూలు: కర్నూలులో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ‘బీసీ జయహో’ సభలో బీభత్సం సృష్టించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ కోసం మాచాని సోమనాథ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘బీసీ జయహో’ సభలో బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. -
జనసేన ఆఫీసు ముందే తనుకున్న జనసైనిక్స్..
-
డోన్.. టీడీపీ వికెట్ డౌన్
సాక్షి, నంద్యాల: డోన్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎవరికి వారు తాము సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అభ్యర్థిని ఓడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉన్న డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కొంత పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్ పోటీ చేసి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇన్చార్జిగా తప్పించి కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం నియమించింది. కొంతకాలం తర్వాత ప్రభాకర్‌ను కూడా తప్పించి కేఈ వర్గానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఆయన నియామకాన్ని కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అతడికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. బీసీ ప్రోద్బలంతోనే గ్రూపు రాజకీయాలు నంద్యాల జిల్లా టీడీపీకి బీసీ జనార్దన్‌రెడ్డి పెద్ద దిక్కుగా మారారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో మిగిలిన నాయకులు బీసీ నిర్ణయాలకు అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. తమకు చెప్పకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా సుబ్బారెడ్డిని ప్రకటించడం వెనక బీసీ జనార్దన్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు కేఈ, కోట్ల వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. బీసీ ప్రోద్బలంతోనే సుబ్బారెడ్డి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని మండిపడుతున్నాయి. నువ్వొస్తే మర్యాదగా ఉండదు గత ఆదివారం పత్తికొండలో జరిగిన ‘రా.. కదిలిరా’ సభకు బీసీ జనార్దన్‌రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డికి మినహా మిగిలిన నంద్యాల జిల్లా నాయకులకు ఆహ్వానం అందింది. ఒకవేళ ఆహ్వానం లేకున్నా సభకు వస్తే మర్యాద దక్కదని పత్తికొండ టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక ఇద్దరు నేతలు సభకు హాజరుకాలేదు. సభ ముగిశాక చంద్రబాబు అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంతృప్తితో ఉన్న నాయకులను పిలిచి మాట్లాడారు. కానీ, డోన్ పంచాయితీని మాత్రం ఆయన పట్టించుకోలేదు. ఇన్చార్జిగా ఉన్న సుబ్బారెడ్డికి సహకరించాలని అటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కానీ ఇటు కేఈ కుటుంబానికి కానీ చంద్రబాబు సూచించకపోవడంతో ఈ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే సహకరిస్తాం డోన్ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే తాము సహకరిస్తామని కేఈ కుటుంబం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో డోన్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. దాదాపు రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డోన్ బరిలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. ఎమ్మిగనూరు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినా చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ చేసేదేమీ లేక ఓడిపోయే డోన్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా భారీ ఖర్చు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లుగా టీడీపీ కార్యక్రమాలను ధర్మవరం సుబ్బారెడ్డి చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన తన అనుచరుల వద్దే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ తనకే టికెట్ ఇస్తామని చెప్పడంతోనే తాను ఖర్చు చేశానని, ఇప్పుడు టికెట్ విషయంలో మీన మీషాలు లెక్కిస్తుండడంతో ఏంచేయాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేయడం సుబ్బారెడ్డి వంతైంది. మరోవైపు చంద్రబాబు ఖాతాలో మరో వికెట్ పడిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం డిష్యుం! తన్నుకున్నారిలా..
తూర్పుగోదావరి: కొత్త సంవత్సరం ఆరంభం రోజునే తునిలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటలకు దిగారు. యనమల బ్రదర్స్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. డిష్యుం డిష్యుం అంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు.. తన కళ్ల ముందే తెలుగు ‘తమ్ముళ్లు’ అరుపులు, కేకలతో.. ముష్టిఘాతాలతో ఫైటింగ్‌కు దిగినా.. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు సైలెంటుగా ఉండిపోవడం చూపరులను విస్మయపరచింది. తన వరకూ వస్తేనే కానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. ప్రజాదరణ కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా పార్టీలో గ్రూపులను కట్టడి చేయలేని దుస్థితిని తెలుగుదేశం అగ్ర నేతలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ఆది గురువుగా విమర్శలు ఎదుర్కొనే శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు దాదాపు అటువంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఆధిపత్యం కోసం.. ఇటు కాకినాడ మెట్ట ప్రాంతం, అటు కోనసీమలో గ్రూపులను పెంచి పోషిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, దివంగత నేతలు మెట్ల సత్యనారాయణరావు, బొడ్డు భాస్కర రామారావులను గ్రూపులుగా చేసి, ఉమ్మడి జిల్లాపై పెత్తనాన్ని చెలాయించిన చరిత్ర రామకృష్ణుడు సొంతమనే వారు ఆ పార్టీలో కోకొల్లలు. ఇన్నేళ్ల పాటు తాను పెంచి పోషించిన గ్రూపు రాజకీయాలు.. తీరా సొంత నియోజకవర్గం తునిలో భగ్గుమనేసరికి రామకృష్ణుడికి దిక్కుతోచడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. రగులుతున్న కృష్ణుడి వర్గం సొంత కుమార్తె దివ్యను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు.. మూడు దశాబ్దాలుగా తన వెంట నడిచిన వరుసకు సోదరుడైన యనమల కృష్ణుడిని బలవంతంగా టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి రామకృష్ణుడు తప్పించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దివ్యకు అప్పగించారు. ఆమెకు పార్టీలో ఎదురుండకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని వ్యూహాత్మకంగానే తప్పించారని ఆయన వర్గం కొంత కాలంగా రగిలిపోతోంది. దివ్యకు పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై కినుక వహించిన కృష్ణుడు.. కొంత కాలం అలకబూనారు. రాజకీయంగా పక్క చూపులు చూశారు. ఆ సమయంలో నియోజకవర్గ బాధ్యతలను రామకృష్ణుడి సొంత సోదరుని కుమారుడు రాజేష్ తన భుజాన వేసుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో కృష్ణుడు టీడీపీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. పార్టీపై పెత్తనం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అప్పటికే దివ్య కనుసన్నల్లో నియోజకవర్గ బాధ్యతలను కృష్ణుడు చూస్తున్నా.. టీడీపీ తొండంగి మండల బాధ్యతలు మాత్రం రాజేష్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కృష్ణుడి వర్గానికి ఇది అవమానంగానే అనిపించింది. దీంతో ఆ వర్గం సమయం కోసం వేచి చూస్తోంది. ముందస్తు వ్యూహమేనా..! రాజేష్‌ను ఎంత మాత్రం భరించలేని కృష్ణుడు నయాన భయాన ఆయనను పార్టీకి దూరం చేసేందుకు కొంతకాలం నుంచి ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తొలి ప్రయత్నంగా సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. రామకృష్ణుడు కళ్లెదుటే రచ్చరచ్చ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కృష్ణుడు తన అనుచరులతో రాజేష్‌పై దాడి చేయించారని టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తన్నుకున్నారిలా.. తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద సాయి వేదికలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఇందులో యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు వచ్చారు. వారు వరుస క్రమంలో వెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడి సొంత అన్న కుమారుడు రాజేష్ అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణుడిని, దివ్యను కలిసేందుకు క్యూతో ప్రమేయం లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదను కోసం వేచి ఉన్న కృష్ణుడి వర్గీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు. అందరూ క్యూలోనే రావాలంటూ అక్కడున్న వారిని అప్పటికే వారు కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో రాజేష్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిని కృష్ణుడి వర్గం లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా దాడులకు దిగింది. రాజేష్‌పై ఆయన సొంత చిన్నాన్న రామకృష్ణుడు, దివ్య సమక్షంలోనే పిడిగుద్దులతో ఈ దాడి జరిగింది. అయినప్పటికీ రామకృష్ణుడి అనుచరులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇరు వర్గాలకూ సర్ది చెప్పలేక, వారిని కట్టడి చేయలేక నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయారు. ఆయన సైలెంటుగా ఉండిపోవడానికి కృష్ణుడు దూరమైతే రాజకీయంగా ఇబ్బంది పడతామనే భయం తప్ప మరొకటి కారణం కాదని పలువురు అంటున్నారు. కుమార్తె దివ్య ఇన్చార్జిగా ఉన్న సొంత నియోజకవర్గం తునిలోనే కళ్లెదుటే ఇంత జరిగినా.. చివరకు ఇరువర్గాలను సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినట్టయ్యిందని అంటున్నారు. ఇన్నేళ్లూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన యనమల.. రక్త సంబంధీకులు, దాయాదుల పోరు, గ్రూపు రాజకీయాలు భగ్గుమనడంతో.. వాటి ప్రభావాన్ని స్వయంగా రుచి చూశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇవి చదవండి: దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్‌కు బ్రేక్..! -
పొలం వద్ద ఉన్న పారతో అన్నను తమ్ముడు దారుణంగా..
మహబూబాబాద్: బోరుబావి వివాదంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సూర్యబండా తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన భూక్యా సదన్లాల్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా సదన్లాల్ తనకున్న వ్యవసాయ భూమిని, బోరు మోటరును కుమారులు రవీందర్, రమేశ్‌కు ఇవ్వడంతో దానిని ఉమ్మడిగా వాడుకుంటున్నారు. కాగా కొంతకాలంగా బోరుబావి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయితీ నెలకొంది. ఈక్రమంలో ఆదివారం అన్నదమ్ముల మధ్య సయోధ్యకు పెద్దమనుషులు ప్రయత్నిస్తుండగా తమ్ముడు రమేశ్ పొలం వద్ద ఉన్న పారతో అన్న రవీందర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేర రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు!
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండడంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మొదట ఓ మహిళ సీటు కోసం రుమాలు వేసింది. ఆమెకంటే ముందు ఎక్కిన మరో మహిళ ఆ సీటులో కూర్చుంది. బస్సు నర్సంపేట రూట్లో వెళ్తుండగానే ఆ తరువాత ఎక్కిన మొదటి మహిళ నా సీటులో ఎలా కూర్చుంటావంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తరువాత మరో మహిళ వచ్చి మా సీట్లో కూర్చున్నావంటూ అడిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇవి చదవండి: ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ! -
సలార్ కాటేరమ్మ కథ తెలుసా?
ఒక బల్లెంతో వెనుకనుంచి వచ్చే శత్రువుల్ని పొడిచి.. ముందున్న వాళ్లను కత్తులతో చీల్చేసి.. ఇంతలో ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అని డైలాగ్పడగానే.. అపరకాళిలా అవతారం కటౌట్లో ప్రభాస్ అబ్బో రోమాంఛితమైన ఆ సలార్ సీన్.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి తెలుసా? ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత. నమ్ముకున్నవాళ్లకు అండగా ఉంటూ.. దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారత దేశంలో.. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, కర్ణాటకలో కాటేరమ్మగా Kateramma ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటోంది. పార్వతిదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను.. కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్నిచోట్ల ఊరికి కాపలా దేవతగా.. మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు. జానపద కథ ప్రచారం.. కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి రోజూ రాత్రిళ్లు ఎటో వెళ్లిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళి రూపంలోకి మారిపోయి.. శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుందామె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. ఆమె అందులో పడిపోయి.. తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి, విధేయురాలైన భార్య.. పార్వతిదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే.. కాటేరీ దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. దళిత కమ్యూనిటీలో మరోలా.. అయితే తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని.. ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కుల దేవతగానూ కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటోంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు. ఇదీ చదవండి: సలార్ మూవీ రివ్యూ శక్తివంతమైన దేవతగా.. కాటేరమ్మ.. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఉగ్ర రూపంలోనే కాదు.. శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటోంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని.. ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా.. ఒక్కో చేతిలో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో రూపొందిస్తారు. మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు.. శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌతాఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటోంది. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా.. రక్త కాటేరమ్మగానూ కాటేరీ దేవి ఆరాధ్య దైవం. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడనాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ రిఫరెన్స్‌ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్‌తో Salaar Kateramma Scene ప్రేక్షకులకు రుచిచూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ -
దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం!
న్యూఢిల్లీ: భార్యాభర్తల గొడవలంటే ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ గొడవ దెబ్బకు బుధవారం ఏకంగా ఓ అంతర్జాతీయ విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది! మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం ఈ ఘటనకు వేదికైంది. విమానం మ్యూనిచ్ నుంచి బయల్దేరిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్‌లాండ్. భార్య ఫిర్యాదుతో విమానాన్ని పైలట్ ఢిల్లీ మళ్లించి భర్తను పోలీసులకు అప్పగించారు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అతన్ని మరో విమానంలో బ్యాంకాక్ పంపడం కొసమెరుపు! ఇదీ చదవండి: నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ.. -
చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు..
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా సాగిన ప్రచారపర్వం చివరిరోజు ఒక్క ఘటనతో ఉద్రిక్తంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని వైఎస్సార్‌కాలనీలో మంగళవారం ఉదయం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ నాయకులతో ప్రచారానికి వెళ్లాడు. అదే సమయానికి బీఆర్ఎస్ నాయకులు ప్రచార వాహనంతో వచ్చారు. పోటాపోటీగా పాటలు పెట్టవద్దన్న అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుల కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో వైఎస్సార్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. పలువురు స్థానికులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పురుషోత్తం వెంటనే అక్కడి చేరుకున్నారు. భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి తన ప్రచారం కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Video: సెల్ఫీల వివాదం.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు
సెల్ఫీల పిచ్చి ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరికి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ట్రెండ్‌గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫీ మోజుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ ఫోటోల పిచ్చి కొన్నిసార్లు శ్రుతిమించుతోంది. తాజాగా సెల్ఫీ కారణంగా వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా అమ్మాయిలు జుట్లుపట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులోని గాంధీ పార్క్‌లో కొంతమంది ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముందు తామే సెల్ఫీలు దిగాలని, తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని ఓ వర్గం అమ్మాయిలు చెప్పడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు ఫైటింగ్ చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? Gandhi Park, Guntur. Ladies Fighting...we are so developed. 😂😂😂 pic.twitter.com/fgqfWOef4k — Saran Bhuma (@telugodikeka) November 27, 2023 -
పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు!
యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని విన్నవారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక్కడి శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో కొట్టుకునేంత వరకూ వివాదం దారితీసింది. ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నయాబన్స్ రోడ్డు సమీపంలోని సంతోషి మాత దేవాలయం దగ్గర ఒక వివాహ వేడుకలో విందు జరిగింది. ఈ సందర్భంగా రసగుల్లా తినే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ శర్మ తెలిపారు. క్షతగాత్రులందరినీ వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. విందు ఏర్పాటు చేసిన గౌరీశంకర్ శర్మపై కేసు నమోదు చేశామని, ఈ వివాదంపై విచారణ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: హిమాచల్‌లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే.. -
ఆసక్తికరంగా ఛత్తీస్‌గఢ్ పోరు.. ఎవరి ధీమా వారిదే!
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్‌పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008 అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్‌సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది. ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది. 2013 ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం! 2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్‌గఢ్‌లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది. 2018 సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్‌సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్‌స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది.